Documentary film
-
నయనతార జీవితం పై నెట్ ప్లిక్స్ డాక్యుమెంటరీ ఫిలిం
-
ఓటీటీలో నయనతార రియల్ లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫ్యామిలీతో బిజీగా ఉంది. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్నను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది షారూఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించిన నయన్.. ఆ తర్వాత వచ్చిన అన్నపూరణి సినిమా వివాదానికి దారితీసింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా పిక్స్ షేర్ చేసి అభిమానులకు అప్డేట్స్ ఇస్తోంది. అయితే తాజా ఫోటోలు చూసి నయన్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్ చేయించుకుందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: నా బుగ్గల్లో ప్లాస్టిక్ ఏం లేదు!)అయితే గతంలో తన సినీ ప్రయాణంపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తన కెరీర్, పెళ్లితో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఇందులో చూపించనున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునన్న నయన్ జీవితంపై తెరకెక్కించిన డాక్యుమెంటరీని ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 18 నుంచి ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ బయోపిక్కు నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే టైటిల్ ఖరారు చేశారు. Thirai-layum natchathiram, vaazhkailayum natchathiram ✨Watch Nayanthara: Beyond The Fairy Tale on 18 November, only on Netflix!#NayantharaOnNetflix pic.twitter.com/5m9UbBNZ6M— Netflix India South (@Netflix_INSouth) October 30, 2024 -
దర్శకధీరుడిపై డాక్యుమెంటరీ చిత్రం.. రామ్ చరణ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కథ సిద్ధం కాగా.. షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తీయబోయే చిత్రం కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తి నెలకొంది.అయితే ఇటీవల రాజమౌళి గురించి ఓ డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన మోడరన్ మాస్టర్స్ పేరుతో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన డైరెక్షన్, ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల కోసం చేసిన హార్డ్ వర్క్‌ను చూపించారు. మొత్తంగా రాజమౌళి జీవిత విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులను ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఆయన కథ చెప్పేవిధానం, డెడికేషన్ అద్భుతమంటూ కొనియాడారు. ఇలాంటి డాక్యుమెంటరీ రూపొందించడం రాజమౌళికి దక్కిన సరైన గౌరవమని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పణలో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మీ కంపానియన్ సంయుక్తంగా నిర్మించారు. రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించగా.. తన్వీ అజింక్యా సహ దర్శకులుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుచోంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
పాపం టాలీవుడ్ స్టార్ హీరోలు.. కలలో కూడా ఊహించి ఉండరు
కొన్నింటి గురించి మనం కలలో కూడా ఊహించం. అలాంటివి రియాలిటీలో జరిగినప్పుడు ఇదెక్కడి దరిద్రం బాబోయే అని మనలో మనమే తిట్టుకుంటాం. ఇప్పుడేం జరిగిందని అనుకుంటున్నారా! ప్రముఖ దర్శకుడు రాజమౌళి జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరిట ఆగస్టు 2 న దీన్ని రిలీజ్ చేయనుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా?)ఇక్కడివరకు బాగానే ఉంది. సోమవారం ఉదయం రిలీజ్ చేసిన ట్రైలర్‌కి పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి జీవితంలోని ఎవరికీ తెలియని విషయాల్ని ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, జేమ్స్ కామెరూన్ లాంటి సెలబ్రిటీలు షేర్ చేసుకోవడం బాగానే ఉంది. అయితే మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేసిన కాసేపటి తర్వాత ప్రాంతీయ భాషల ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు.తెలుగు ట్రైలర్ విషయానికొచ్చేసరికి ప్రధాన పాత్రధారి రాజమౌళి సహా డాక్యుమెంటరీలో కనిపించిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు వేరే వాళ్లు ఎవరో డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇన్నికోట్లు ఖర్చు పెట్టి తీశారు. ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి, తెలుగు వరకైనా సరే హీరోలతో డబ్బింగ్ చెప్పించి ఉంటే సరిపోయేది! పైపెచ్చు ఈ ట్రైలర్ చూస్తుంటే డిస్కవరీ ఛానెల్లోని డబ్బింగ్‌లా అనిపించింది.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి') -
రాజమౌళి ఓ పిచ్చోడు.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. జీవిత విశేషాలతో డాక్యుమెంటరీ తీశారు. దీన్ని 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు డాక్యుమెంటరీ ఎలా ఉండబోతుందో చెప్పే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తోపాటు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలో భారతీయుడు 2.. అంచనాలు తప్పడంతో మార్పులు)ఇది డాక్యుమెంటరీ కాబట్టి సినిమా స్టైల్లో ఉండదు. రాజమౌళి కెరీర్ ఎలా ఎప్పుడు ప్రారంభమైందనేది విజువల్స్ రూపంలో చూపిస్తారు. అలానే జక్కన్నతో పనిచేసిన అనుభవాన్ని ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. అయితే ఇది డాక్యుమెంటరీ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. రాజమౌళి లైఫ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని చూడండి.(ఇదీ చదవండి: ఉపాసనపై టాలీవుడ్ కమెడియన్ ప్రశంసలు.. ఎందుకంటే?) -
డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్
రాజమౌళి.. పాన్ ఇండియా లెవల్లో ఓ సెన్సేషన్. తెలుగులో సాధారణ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి.. 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ సాధించే రేంజ్ వరకు ఎదిగిపోయాడు. 'బాహుబలి'తో వరల్డ్ వైడ్ గుర్తింపు సంపాదించిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. కాబట్టి రావడానికి ఎంత లేదన్న మరో 3-4 ఏళ్లయినా పడుతుంది. మరోవైపు రాజమౌళి బయోపిక్ లాంటి డాక్యుమెంటరీ ఒకటి ఓటీటీలోకి వచ్చేయబోతుంది.(ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్‌కి షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్.. పాపం అలా అనేసరికి!)తెలుగు దర్శకుల్లో రాజమౌళి రూటు సెపరేటు. చేసిన ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకోవడమే కాకుండా హిట్స్, బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. 'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ షేక్ చేసిన ఇతడు.. వేల కోట్లు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించాడు. 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మార్మోగిపోయేలా చేశాడు. ఈ క్రమంలోనే ఇతడి జీవితంలో కొన్ని విషయాలతో 'మోడ్రన్ మాస్టర్స్' అనే డాక్యుమెంటరీ తీశారు.ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా భారతీయ, అంతర్జాతీయ సినిమాపై రాజమౌళి ప్రభావం ఎలా ఉందనేది చూపించబోతున్నాడు. అలానే జక్కన్న గురించి హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, జో రూసో, ప్రభాస్, రానా, జూ.ఎన్టీఆర్ తమ పాయింట్ ఆఫ్ వ్యూని చెబుతారు. అయితే ఇది బయోపిక్‌లా ఉంటుందా? కేవలం రాజమౌళి గురించి ఎలివేషన్స్ ఉంటాయా? అనేది చూడాలి.(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!) -
Women of My Billion: కలిసి నడిచే గొంతులు
కన్యాకుమారి నుంచి శ్రీ నగర్ వరకూ 260 రోజుల పాటు 3,800 కిలోమీటర్లు దేశమంతా నడిచింది సృష్టి బక్షి. ఎందుకు? స్త్రీలపై జరిగే దురాగతాలపై చైతన్యం కలిగించడానికే కాదు స్త్రీల శక్తియుక్తులను వారికి గుర్తు చేయడానికి. ఆ సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోంది. నటి ప్రియాంకా చోప్రా నిర్మాత.తాను నడిచి చేరుకున్న ఊరిలో ఏదైనా స్కూల్లోగాని, పబ్లిక్ హాల్లో కాని మహిళలను పోగు చేస్తుంది సృష్టి బక్షి. ‘అందరూ కళ్లు మూసుకుని దీర్ఘంగా శ్వాస పీల్చి వదలండి’ అంటుంది. ‘ఇప్పుడు మీ కళ్ల ఎదురుగా మీ 11 ఏళ్ల వయసున్న మీ రూపాన్ని గుర్తు చేసుకోండి. ఆ 11 ఏళ్ల అమ్మాయిలో ఉండే విశ్వాసం, ఆనందం ఎన్ని విధాలుగా ధ్వంసమైందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ అమ్మాయికి సారీ చెప్పండి. ఎందుకంటే ఆ విధ్వంసమంతా మీ అనుమతితోనే జరిగింది’ అంటుంది. చాలామంది ఆ మాటలకు ఏడుస్తారు. గడిచివచ్చిన జీవితాన్ని తలుచుకుని బాధలో మునిగిపోతారు. అప్పుడు సృష్టి బక్షి ఒక బోర్డు మీద స్త్రీ శరీర నిర్మాణం గీచి ‘ఇదిగో ఈ అవయవాల రీత్యా మీరు మగవారి కంటే భిన్నంగా పుట్టారు. ప్రకృతి ఈ అవయవాలను మీకు ఇస్తే సమాజం అదుపు, ఆంక్షలు, వివక్ష, కుటుంబ హింస, ఆర్థిక బానిసత్వం, ఇంటి పని... ఇన్ని ఇచ్చింది. మనం ఎందుకు మగవారితో సమానం కాము?’ అని ప్రశ్నిస్తుంది.మార్పు కోసంసృష్టి బక్షిది ముంబై. ఆమె హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకుంది. హాంగ్‌కాంగ్‌లో మార్కెటింగ్‌లో పెద్ద సంస్థల్లో పని చేసింది. తండ్రి ఆర్మీలో పని చేయడం వల్ల ఆమెకు దేశం పట్ల ఒక ఉద్వేగం ఉండేది. అయితే తాను ప్రేమించే దేశంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను చూసి చలించి పోయేది. ‘2017లో హాంకాంగ్‌లో సిటీ బస్ ఎక్కి ఇంటికి వెళుతున్నప్పుడు నా ఫోన్లో ఇండియాలో తల్లీ కూతుళ్లపై తండ్రి ఎదుటే అత్యాచారం చేసి చంపేశారన్న వార్త చదివాను. చాలా నిస్పృహ కలిగింది. నాలాంటి వాళ్లు సౌకర్యంగా పడక్కుర్చీలో కూచుని చింతించడం సరికాదని రంగంలో దిగాలని అనుకున్నాను. అలా నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ఇండియా వచ్చి దేశంలోని స్త్రీలందరితో మాట్లాడాలని 2018 మే నెలలో పాదయాత్ర ప్రారంభించాను’ అని చెప్పింది సృష్టి.రోజూ వేలాది మంది‘ఉమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో సృష్టి బక్షి మే 2018లో కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభించింది. ఈ యాత్ర రికార్డు అయ్యేలా టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. 260 రోజుల పాటు దాదాపు 4 వేల కిలోమీటర్ల పాటు సాగే ఈ యాత్రకు కోటి రూపాయలు ఖర్చవుతాయి. 50 లక్షలను క్రౌడ్ ఫండింగ్ ద్వారా పోగు చేసింది. ‘ఈ యాత్రలో స్త్రీల కలలు, ఆకాంక్షలు, వారి హక్కులు, సంఘర్షణలు. విజయాలు వినదలుచుకున్నాను. వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. నా సుదీర్ఘ యాత్రలో మన దేశంలో వరకట్నం ఇంకా పెద్ద సమస్యగా ఉందని అర్థమైంది. వరకట్నం స్త్రీలను మానసికంగా పురుషులతో సమానం అనుకోనివ్వడం లేదు. స్త్రీలను అసభ్యంగా తాకడం, హింసించడం, అణిచి పెట్టడం కొనసాగుతూనే ఉంది. ఒక దశలో నేను యాత్ర చేయలేననుకున్నాను. కాని ఆ మరుసటి రోజు నా మీటింగ్‌కు హాజరైన ఒక ఆశా వర్కర్– ‘‘రాత్రి నన్ను నా భర్త కొట్టాడు. నీ మాటలు విన్నాక ఇక ఇలాంటిది జరగనివ్వకూడదని నిశ్చయించుకున్నాను. నేను నా భర్తను నిలువరించడానికి నలుగురి సాయం తీసుకుంటాను’’ అని చెప్పింది. నా యాత్ర వల్ల జరుగుతున్న మేలు అర్థమయ్యాక కొనసాగాను’ అని తెలిపింది సృష్టి.డాక్యుమెంటరీ విడుదలసృష్టి చేసిన యాత్ర అంతా ‘విమెన్ ఆఫ్ మై బిలియన్’ పేరుతో డాక్యుమెంటరీగా రూపొందింది. మే 3 నుంచి అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీ మీద మంచి రివ్యూలు వస్తున్నాయి. ‘ఎందరో స్త్రీలు. వారి జీవితానుభవాలను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు. వారు సమస్యలు వారి తెచ్చుకున్నవి కాదు. వారికి తెచ్చిపెట్టినవి. అందుకే నటి ప్రియాంకా చోప్రా నా డాక్యుమెంటరీని చూసి తాను నిర్మాతగా మారి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఒక స్త్రీగా, ఆడపిల్ల తల్లిగా ఆమెకు స్త్రీల సాధికారత, ఆత్మగౌరవం గురించి అక్కర ఉంది. జెండర్ ఈక్వాలిటీ గురించి స్త్రీ, పురుషుల్లో చైతన్యం రావడానికి ఈ డాక్యుమెంటరీ ఉపయోగపడుతుందని ఆమె విశ్వసిస్తున్నారు’ అని తెలిపింది సృష్టి బక్షి. -
ఓటీటీకి రియల్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఓటీటీ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను సినీ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్‌తోనే చూసేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రోజు రోజుకు కొత్త కొత్త కంటెంట్‌ను ఓటీటీలు అందిస్తున్నాయి. అదే సమయంలో క్రైమ్ థ్రిల్లర్ లాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా కంటెంట్‌తోనే యధార్థ సంఘటనల ఆధారంగా సరికొత్త క్రైమ్ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్ లైఫ్ కిల్లర్ అనే పేరుతో బెర్లిన్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ రహస్యమైన, విచిత్రమైన హత్యల కేసుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ రియల్ క్రైమ్ కథకు జాన్ జాబీల్, కరోలిన్ షాపర్ దర్శకత్వం వహించారు. ఈ ఆసక్తికర డాక్యుమెంటరీ సిరీస్ త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే 2012లో జరిగిన చీకటి సంఘటనల గురించి అవగాహన కల్పించడానికి ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మేకర్స్. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్‌లైఫ్ కిల్లర్‌లో కేవలం మూడు సీజన్లు మాత్రమే ఉన్నాయి. ఈ సిరీస్‌లో రిక్ హబ్నర్, ట్రిస్టన్ బమ్, కార్నెలియా వెర్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. -
Oscars 2024: ప్చ్.. ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది..
గతేడాది ఆర్ఆర్ఆర్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు), ద ఎలిఫెంట్ విస్పరర్స్ ( బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా) సినిమాలకు ఆస్కార్ రావడంతో భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. కానీ ఈసారి ఇండియా నుంచి ఏ సినిమా కూడా అకాడమీ అవార్డుల బరిలో లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. కొన్ని సినిమాలను నామినేట్ చేసినప్పటికీ ఫైనల్ లిస్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే భారత సంతతికి చెందిన విదేశీవాసి సినిమా ఆస్కార్ బరిలో ఉండటంతో అందరూ కాస్త ఆసక్తి చూపించారు. టు కిల్ ఎ టైగర్.. ఢిల్లీకి చెందిన కెనడావాసి నిషా పహుజా.. టు కిల్ ఎ టైగర్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. గతేడాది అక్టోబర్‌లో ఏ డిస్ట్రిబ్యూటర్ సాయం లేకుండా అమెరికాలోని కొన్ని థియేటర్లో విడుదల చేసింది. ఆస్కార్‌కు ఎప్పుడైతే నామినేట్ అయిందో అందరూ ఈ చిత్రంపై ఆసక్తి చూపించారు. దీంతో ఫిబ్రవరిలో రీరిలీజ్ చేయడం, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను కొనుక్కోవడం చకచకా జరిగిపోయాయి. ఇండియాలో మాత్రం థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే వచ్చేసింది. ఆదివారం (మార్చి 10) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌కు చెందిన ప్రియాంక చోప్రా, దేవ్ పటేల్, మిండీ కలింగ్, రూపీ కౌర్ ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఏ సినిమాకు వచ్చిందంటే? తాజాగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఈ మూవీని వెనక్కు నెట్టి '20 డేస్ ఇన్ మరియుపోల్' ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అకాడమీ అవార్డు ఎగరేసుకుపోయింది. ఈ సినిమాలో స్పెషల్ ఏముందంటారా? ఉక్రెయిన్- రష్యా మధ్య భీకర వార్ జరుగుతుంది. మారియుపోల్ నగరంలో చిక్కుకున్న ఉక్రెయిన్ జర్నలిస్టులు రష్యా దురాగతాలను ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రయత్నిస్తారు. వారి పోరాటమే సినిమా కథ! చదవండి: 'ఓపెన్ హైమర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు -
ఆస్కార్‌కు ఒకరోజు ముందు ఓటీటీలోకి వచ్చేసిన మూవీ..
ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 96వ అకాడమీ అవార్డు సెలబ్రేషన్స్ జరగనున్నాయి. భారత్‌కు చెందిన అమ్మాయి నిషా పహుజా తెరకెక్కించిన టు కిల్ ఎ టైగర్ అనే చిత్రం డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఆస్కార్ పురస్కారాల ప్రకటనకు ఒకరోజు ముందు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే.. 13 ఏళ్ల వయసు చిన్నారి నిషాకు చదువు, ఆటలు తప్ప మరొకటి తెలియదు. అన్యం పుణ్యం తెలియని ఆ పల్లెటూరి అమాయకురాలిపై కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. ఈ ఘటనతో పాప భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. కానీ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చోలేదు. న్యాయం కోసం పోరాటం మొదలుపెడతారు. ఇది సినిమానే కాదు రియల్‌గానూ జరిగింది. 2017లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. భారత సంతతికి చెందిన కెనడావాసి నిషా పహుజా అద్భుతంగా తెరకెక్కించింది. ఓటీటీలో.. ఈ సినిమా ఇప్పటికే టోర్నటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ సత్తా చాటింది. అమెరికాలో ఈ సినిమా థియేటర్లలో రిలీజవగా ఇండియాలో మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. నేషనల్ ఫిలిం బోర్డ్ ఆఫ్ కెనడా వెబ్సైట్లోనూ దీన్ని ఫ్రీగా చూసేయొచ్చు. మరింకెందుకు ఆలస్యం.. హృదయాన్ని మెలిపెట్టే ఈ సినిమానూ మీరూ చూసేయండి.. A real tale of courage, resilience and grit in the face of adversity- now an Academy Award nominee for Best Documentary Feature 🔥🙌 To Kill A Tiger, now streaming, only on Netflix!#ToKillATigerOnNetflix @ToKillATigerDoc #StandWithHer @NishaPahuja pic.twitter.com/eL4YBTRwLM — Netflix India (@NetflixIndia) March 10, 2024 చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ.. కాకపోతే.. -
Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి
‘అపర్ణ మేడం పాఠం ఒక్కసారి వింటే ప్రతి చెట్టు, ప్రతి పువ్వుతో స్నేహం చేయాలనిపిస్తుంది’ ‘అపర్ణ స్వరపరిచిన పాటలు వింటే అద్భుతం అనిపిస్తుంది’ ‘అపర్ణ వినిపించే వీణ స్వరాలు అపురూపం’ ‘అపర్ణ రాసిన పుస్తకాలు శాస్త్రీయ విషయాలను సైతం చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతాయి’... ఇలాంటి కామెంట్స్ అపర్ణ గురించి తరచుగా వినిపిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే డా. అపర్ణ బుజర్ బారువా బహుముఖ ప్రజ్ఞాశాలి. విశ్రాంత జీవితానికి కొత్త అర్థం ఇచ్చిన ప్రతిభావంతురాలు. కోల్‌కతాలో జరిగిన ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె తీసిన ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్రూప్’ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్‌ను అందుకుంది... సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే అస్సాంలోని తేజ్‌పూర్‌లో పుట్టిపెరిగింది అపర్ణ. గువహటిలోని కాటన్ కాలేజీలో బాటనీ లెక్చరర్‌గా తన ఉద్యోగప్రస్థానాన్ని 1969లో ప్రారంభించిన అపర్ణ ఒకవైపు విద్యార్థులకు బాటనీ పాఠాలు బోధిస్తూనే మరోవైపు విద్యార్థిగా మ్యూజిక్ కాలేజీలో చేరి సంగీత పాఠాలు నేర్చుకునేది. సంగీత విద్యాపీuŠ‡ నుంచి సితార్లో విశారద్ డిగ్రీ పొందింది. ఎంతోమంది కవుల పాటలకు స్వరాలు సమకూర్చింది. ఆ పాటలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమై ఆదరణ పొందాయి. వందపాటలకు పైగా స్వరాలు అందించిన అపర్ణ ఏఐఆర్ గువహటి ఫస్ట్ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అరుదైన ఘనతను దక్కించుకుంది. 2003లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హోదాలో పదవీ విరమణ చేసిన అపర్ణ ‘ఇది విశ్రాంతి సమయం’ అనుకోలేదు. ‘ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి చాలా సమయం దొరికింది’ అనుకుంది. తన సాంస్కృతిక మూలాలను వెదుక్కుంటూ వెళ్లింది. కొత్త సంగీత ధోరణులను అధ్యయనం చేసింది. సంస్కృతి, సాహిత్యం, శాస్త్రీయ రంగాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు రాసింది. గువహటిలోని గీతానగర్‌లో తన భర్త నాగేంద్రనాథ్ బుజర్ బారువా పేరు మీద చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసింది. కాలంతో పాటు నడుస్తూ షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు తీయడం నేర్చుకుంది. 26 నిమిషాల నిడివి ఉన్న ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్రూప్’ డాక్యుమెంటరీ అపర్ణకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది. ‘దూలియ సంస్కృతి గత, వర్తమానాలకు అద్దం పట్టేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించాను. దూలియా లాంటి ప్రత్యేక సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అంటుంది అపర్ణ. దూలియ అనేది పురాతన కళారూపం. దూలియ సంస్కృతి వైభవం గాయకుల పాటల్లో, ఆటల్లో, తోలుబొమ్మలాటలో కనిపిస్తుంది. గానం, నటన, హాస్యప్రదర్శన, డప్పులు వాయించడం... ఎన్నో కళల సమాహారంగా దూలియ సంస్కృతి ఉండేది. ఈ పురాతన కళారూపం గురించి ఊరూవాడా తిరిగి లోతైన పరిశోధన చేసింది అపర్ణ. తాను తెలుసుకున్న విషయాలకు డాక్యుమెంటరీ రూపాన్ని ఇచ్చింది. దూలియ సంస్కృతికి తన జీవితాన్ని అంకితం చేసిన డ్రమ్మర్, నటుడు మోహన్ చంద్ బర్మన్ కృషిని ఈ డాక్యుమెంటరీ హైలెట్ చేస్తుంది. దూలియ సంస్కృతిపై అపర్ణకు ఆసక్తి, అనురక్తి ఎలా పెరిగింది అనే విషయానికి వస్తే.... కొన్ని సంవత్సరాల క్రితం గువహటిలోని గీతానగర్ రాస్ ఫెస్టివల్లో కామ్రూపియా ప్రదర్శనను ప్రారంభించడానికి అపర్ణను ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ ప్రదర్శను చూసి అపర్ణ మంత్రముగ్ధురాలైంది. ఈ ఆనందం ఒక కోణం అయితే కళాకారుల ఆర్థిక కష్టాలు తెలుసుకొని బాధ పడడం మరో కోణం. ఇక ఆరోజు నుంచి కామ్రూప్ కళాకారుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని తపించి పోయింది. ఈ గొప్ప కళారూపాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తే, సహాయం చేసే ద్వారాలు తెరుచుకుంటాయని నిర్ణయించుకొని తన నిర్మాణ, దర్శకత్వంలో డాక్యుమెంటరీ ప్రారంభించింది. ఏ లక్ష్యంతో అయితే ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి అపర్ణ పూనుకుందో అది నెరవేరే సమయం వేగవంతం అయింది. దూలియ సంస్కృతి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ పురాతన కళారూపాన్ని తమ భుజాల మీద మోస్తున్న అరుదైన కళాకారులకు సహాయం అందడమే ఇక తరువాయి. ఏ పని మొదలుపెట్టినా ‘అంతా మంచే జరుగుతుంది’ అనుకోవడం అపర్ణ సెంటిమెంట్. కళాకారులకు సహాయం అందే విషయంలో కూడా ఆమె సెంటిమెంట్ నెరవేరాలని ఆశిద్దాం. నా వయసు జస్ట్ 78 ప్లస్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్‌ను అందుకోవడానికి వేదికపైకి వచ్చినప్పుడు యాంకర్ నన్ను ఆశ్చర్యంగా చూసి ‘మీ వయసు ఎంత?’ అని అడిగారు. 78 ప్లస్ అని చెప్పగానే ‘మీరు నిజంగా ఈ తరానికి స్ఫూర్తి’ అన్నారు. ఇది విని ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ఈ చప్పట్లను కూడా నాకు వచ్చిన అపురూపమైన అవార్డ్‌గానే భావిస్తున్నాను. మొదటి డాక్యుమెంటరీకే నాకు పెద్ద పేరు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. – డా.అపర్ణ బుజర్ బారువా -
ఆస్కార్ బరిలో మన డాక్యుమెంటరీ
జార్ఖండ్‌లో తన పదమూడేళ్ల కుమార్తెపై ముగ్గురు కుర్రాళ్లు దారుణంగా లైంగిక దాడి చేశారు. ఆమెను చంపడానికి చూశారు. ఆ అమ్మాయి కుంగిపోయింది. కాని తనకు జరిగిన అన్యాయంపై పోరాడాలనుకుంది. నిరుపేద గ్రామీణ తండ్రి అందుకు సిద్ధమయ్యాడు. ఊరు ఊరంతా వారికి వ్యతిరేకమైనా ఆ తండ్రీ కూతుళ్లు న్యాయం కోసం పోరాడారు. ‘బాధితులు పోరాడాల్సిందే’ననే పిలుపునిస్తూ ఈ ఉదంతాన్ని ‘టు కిల్ ఏ టైగర్’ పేరుతో డాక్యుమెంటరీగా తీసింది నిషా పహూజా. 2024 సంవత్సరానికి ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది ‘టు కిల్ ఏ టైగర్’. ‘ఈసారి ఇటువైపు వస్తే నిన్ను చంపినా చంపుతాం’ అని నిషా పహూజాతో జార్ఖండ్‌లోని ఆ గ్రామస్తులు అన్నారు. ఆరేళ్ల క్రితం జార్ఖండ్‌లోని ఒక గ్రామంలో 13 ఏళ్ల అమ్మాయిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఆ ఘటన తర్వాత అమ్మాయి, అమ్మాయి తండ్రి న్యాయ పోరాటానికి సంకల్పించారు. అక్కడి నుంచి ఆ గ్రామవాసులు తండ్రీ కూతుళ్లపై ఎలాంటి వొత్తిడి తెచ్చారు, అయినా సరే న్యాయం కోసం ఆ తండ్రీకూతుళ్లు ఎలా నిలబడ్డారు అని తెలిపే సంక్షిప్త చిత్రమే నిషా పహూజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ. గత సంవత్సరం మన దేశం నుంచి ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది. రేపు మార్చి 10, 2024న జరగనున్న ఆస్కార్ వేడుకలో ‘టు కిల్ ఏ టైగర్’ కూడా గెలిస్తే అది చాలా పెద్ద విశేషమే అవుతుంది. బాధితులు పోరాడాల్సిందే ‘భారతదేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ నమోదు అవుతోంది. నమోదు కానివి ఎన్ని ఉన్నాయో లెక్క తెలియదు. నేరం నమోదు అయ్యాక కూడా కేవలం 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. లైంగిక దాడులను ఎదుర్కొన్నవారు న్యాయం కోసం పోరాడినప్పుడే పెత్తందారీ స్వభావ ప్రతిఫలాలైన లైంగికదాడులు తగ్గుతాయి’ అంటుంది నిషా పహూజా. చత్తీస్‌గఢ్‌లోని 13 ఏళ్ల అమ్మాయి (ఇప్పుడు 19 సంవత్సరాలు) న్యాయ పోరాటాన్ని నిషా 2022లో డాక్యుమెంటరీగా తీసింది. అత్యాచార ఘటన జరిగిందని గ్రామస్తులు అంగీకరించినా తమ ఊరి కుర్రాళ్లపై కేసు నడవడం ఇష్టపడటం లేదు. అంతేకాదు ఇలా తమ ఊరు పరువు బజారున పడటం కూడా ఇష్టపడటం లేదు. దాంతో డాక్యుమెంటరీ యూనిట్‌ని బెదిరించారు. బాలికపై జరిగిన అత్యాచారాన్ని ‘అదో ఆకతాయి చర్య’ అని కొందరు అంటే ‘ఆ ముగ్గురిలో ఎవరో ఒక కుర్రాణ్ణి అమ్మాయి పెళ్లి చేసుకుంటే సరి’ అని మరికొందరు భావిస్తున్నారు. కాని బాధితురాలు మాత్రం ‘చితికిపోయిన నా కలలను ఎవరు తిరిగి తెచ్చిస్తారు’ అని ప్రశ్నిస్తోంది. స్త్రీ సమస్యలే ఆమె ఇతివృత్తాలు 55 ఏళ్ల నిషా పహూజా తన నాలుగేళ్ల వయసులో ఢిల్లీ నుంచి కెనడా వలస వెళ్లింది. అక్కడే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఆంగ్ల సాహిత్యం చదివింది. సీబీసీ (కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్)లో రీసెర్చర్‌గా పని చేసి జాన్ వాకర్, అలీ కజిమి వంటి కెనడియన్ ఫిల్మ్ మేకర్స్ వద్ద డాక్యుమెంటరీ నిర్మాణ మెళకువలు గ్రహించింది. ఆపై తనే సొంతంగా డాక్యుమెంటరీలు తీయడం మొదలు పెట్టింది. భారతదేశంతో సంబంధాలు తెంచుకోకుండా తరచూ వచ్చి వెళ్లే నిషా ఇక్కడి స్త్రీల సమస్యలకే ఎక్కువ డాక్యుమెంటరీ రూపం ఇచ్చింది. 2002లో ‘బాలీవుడ్ బౌండ్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. నలుగురు భారతీయ కెనడియన్ వ్యక్తులు ముంబై మహానగరానికి వచ్చి బాలీవుడ్లో తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకున్నారనేది అందులో మూలాంశం. 2012లో నిషా తీసిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. మిస్ ఇండియా కావాలని కలలు కనే భారతీయ యువతుల సంఘర్షణాయుతమైన తతంగాన్ని చూపుతూ ఈ చిత్రం తెరకెక్కింది. ప్రతిష్ఠాత్మక ఎమ్మీ పురస్కారాల్లో ‘ఔట్‌స్టాండింగ్ కవరేజ్ ఆఫ్ ఎ కరెంట్ న్యూస్ స్టోరీ’ విభాగంలో పురస్కారం అందుకుంది. 2022లో నిషా తీసిన డాక్యుమెంటరీయే ‘టు కిల్ ఎ టైగర్’. 90 నిమిషాల ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కెనడా టాప్–10 చిత్రంగా నిలిచింది. అనంతరం వివిధ వేదికలపై 19 పురస్కారాలు కైవసం చేసుకుంది. ఆస్కార్ గెలుచుకుంటే అదో విశిష్ట పురస్కారం అవుతుంది. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న రియల్ క్రైమ్ థ్రిల్లర్.. ఆ టాలీవుడ్ మూవీని దాటేసి!
ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూసేస్తున్నారు. ముఖ్యంగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సాధారణ సినిమాలతో పోలిస్తే.. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు. తెలుగులో ఇటీవల రిలీజైన దూత, ది విలేజ్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఇటీవలే ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం 'కర్రీ అండ్ సైనైడ్' ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హత్యల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. డిసెంబర్ 22న స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా టాప్-3లో నిలిచింది. టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ, షారుక్ ఖాన్ జవాన్‌ను, ఆక్వామన్ చిత్రాలను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 30 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. 'కర్రీ అండ్ సైనైడ్: ద జూలీ జోసెఫ్ కేసు' డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు విజేత క్రిస్టో టామీ దర్శకత్వం వహించారు. -
Tanuja Chandra: చీకటి వెలుగుల దారుల్లో...
కథలు ఆకాశం నుంచి నేలకు దిగి రావు. ఈ నేలలో అనేక కథలు దాగున్నాయి. వాటి జాడలు వెదుక్కుంటూ వెళ్లడమే సృజనకారుల పని. బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలకు వెళ్లిన రైటర్, డైరెక్టర్ తనూజ చంద్ర తనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలపై డాక్యుమెంటరీలు తీయాలని నిర్ణయించుకుంది... తనూజ చంద్ర తల్లి కామ్నా చంద్ర రైటర్, సోదరుడు విక్రమ్ చంద్ర రైటర్, సోదరి అనుపమ చోప్రా ఫిల్మ్ క్రిటిక్. రెండు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఇంటి నిండా సృజనాత్మక వాతావరణం కొలువై ఉండేది. టీవీ సిరీస్ జమీన్ ఆస్మాన్(1996)తో డైరెక్టర్‌గా వినోదరంగంలోకి అడుగుపెట్టింది తనూజ. మహేష్‌భట్ ‘జఖ్మ్’ సినిమాకు స్క్రీన్‌ప్లే రాసి మంచి పేరు తెచ్చుకుంది. సంజయ్ దత్, కాజోల్ జంటగా నటించిన ‘దుష్మన్’ సినిమాతో బాలీవుడ్లో డైరెక్టర్‌గా తొలి అడుగు వేసింది. ‘నేను కమర్షియల్ డైరెక్టర్ని మాత్రమే’ అనే ధోరణిలో కాకుండా మహిళల జీవితానికి సంబంధించిన సమస్త కోణాలను సినిమా, ఓటీటీ మాధ్యమాలపై ఆవిష్కరిస్తోంది తనూజ. ‘ఊహాల్లో నుంచి మహిళలకు సంబంధించిన కథలను అల్లడం కంటే వారి దగ్గరకు వెళ్లి మాట్లాడితే నిజమైన కథలు వస్తాయి’ అంటున్న తనూజ స్క్రిప్ట్ మేకింగ్ కోసం రైటింగ్ రూమ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎంతోమంది మహిళలతో మాట్లాడింది. ఆ క్రమంలో తనకు ఏదైనా ఆలోచన వస్తే అది స్క్రిప్ట్‌గా రూపొందుతుంది. వెండితెరపై రాణిస్తున్న వారు షార్ట్ ఫిల్మ్స్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. తనూజకు మాత్రం ఎలాంటి పట్టింపులు లేవు. పెద్ద డైరెక్టర్‌గా పేరు వచ్చిన తరువాత కూడా రొమాంటిక్ డ్రామా షార్ట్ ఫిల్మ్ ‘సిల్వత్’ తీసింది. ‘ఏ మాన్సూన్ డేట్’ అనే షార్ట్ ఫిల్మ్‌కు కూడా విశ్లేషకుల నుంచి ప్రశంసలు లభించాయి. అయిదు సంవత్సరాల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లహ్ర అనే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది తనూజ. అక్కడ తనకు ఇద్దరు మేనత్తలు ఉన్నారు. ఇద్దరూ భర్తను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆంటీ రాధ సరదా మనిషి. శాంతస్వభావి. ఎంత పెద్ద కష్టానికైనా అడ్జస్టైపోతుంది. సుధా ఆంటీ మాత్రం రాధ ఆంటీకి పూర్తి భిన్నం. ఒకరకంగా చెప్పాలంటే ఫైర్‌బ్రాండ్. చాలా స్క్రిక్ట్. పర్ఫెక్షన్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా గొడవకు దిగుతుంది. ఒకరి వయసు 93. మరొకరి వయసు 83. వేరు వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరికీ తమ మనస్తత్వాల మూలంగా ఎప్పుడూ గొడవలు రాలేదు. వీరి జీవితాన్ని గురించి లోతుగా తెలుసుకున్న తరువాత ‘ఆంటీ సుధా ఆంటీ రాధ’కు శ్రీకారం చుట్టింది తనూజ. నలభై ఎనిమిది నిమిషాల ఈ డాక్యుమెంటరీలో హాయిగా నవ్వుకునే సన్నివేశాలే కాదు కంట తడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ‘సాధారణ ప్రజలు అనే మాట వింటుంటాం. అయితే వారి జీవితాలలోకి తొంగి చూస్తే అసాధారణ సన్నివేశాలు, సాహసాలు కనిపిస్తాయి’ అంటున్న తనూజకు ఇది తొలి డాక్యుమెంటరీ ఫిల్మ్. కట్ చేస్తే... ‘వెడ్డింగ్.కాన్’ అనే సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తనూజ. పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది మహిళలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు కాజేశాడు ప్రజిత్. రకరకాల మారుపేర్లతో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మోసాలకు పాల్పడేవాడు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్...మొదలైన రాష్ట్రాల్లో ఎంతోమంది మహిళలను మోసం చేశాడు. థానేలోని ధోకాలీ ప్రాంతానికి చెందిన ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ప్రజిత్ మోసం వెలుగులోకి వచ్చింది. థానే పోలీసులు ప్రజిత్‌ను అరెస్ట్ చేశారు. ‘వెడ్డింగ్.కాన్’ డాక్యుమెంటరీ ప్రజిత్లాంటి ఎంతోమంది మోసగాళ్ల మోసాలకు అద్దం పడుతుంది. ‘మ్యాట్రిమోనియల్ మోసాల ద్వారా నష్టపోయిన మహిళలు ఎందరో ఉన్నారు. అయితే చాలామంది పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడడం లేదు. దీనికి కారణం తాము తప్పు చేశాం అనే భావన. నలుగురు నవ్వుతారేమో అనుకోవడం. ఇది నన్ను చాలా బాధ పెట్టింది’ అంటుంది తనూజ చంద్ర. అయితే ‘వెడ్డింగ్.కాన్’ బాధిత మహిళలకు ధైర్యాన్ని ఇస్తుంది, న్యాయం కోసం పోరాటం చేసే స్ఫూర్తిని అందిస్తుంది అనడంలో సందేహం లేదు. గమనాన్ని మార్చింది బంధువులను వెదుక్కుంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలకు వెళ్లినప్పుడు సాధారణ జీవితాల్లోని అసాధారణ దృశ్యాలు కనిపించాయి. ఎంతో మంది మహిళలతో మాట్లాడిన తరువాత...మహిళల గురించి ఓటీటీ మాధ్యమం ద్వారా సీరియస్‌గా చెప్పాల్సిన కథలు ఎన్నో ఉన్నాయి అనిపించింది. ఆంటీ సుధా ఆంటి రాధ నా గమనాన్ని మార్చింది అని చెప్పవచ్చు. – తనూజ చంద్ర, రైటర్, డైరెక్టర్ -
తాగే నీళ్లలో, తినే అన్నంలో సైనైడ్.. సీరియల్ కిల్లర్ రియల్ స్టోరీ!
సినిమాల్లో కొన్ని భయంకరమైన హత్యలను చూపిస్తుంటారు. అవి చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా.. బాబూ అనిపించకమానదు. కానీ కొన్ని రియల్ సంఘటనలు అంతకన్నా దారుణంగా ఉంటాయి. నవ్వుతూనే ఒంట్లో కత్తి దింపుతారు. నమ్మిస్తూనే గొంతు కోస్తారు. ప్రేమిస్తూనే సైనైడ్ పెట్టి చంపేస్తారు. అలాంటి ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం 'కర్రీ అండ్ సైనైడ్'. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి (డిసెంబర్ 22) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు ఆధారమైన నిజ సంఘటనలపై ఈ ప్రత్యేక కథనం.. ఇంటి పెద్దతో హత్యలు మొదలు జూలీ జోసెఫ్‌ది కేరళ కోజికోడ్‌లోని కూడతాయి గ్రామం. ఈమె పద్నాలుగేళ్లలో ఆరు హత్యలు చేసింది. వాళ్లంతా తన సొంత ఇంటిసభ్యులే కావడం గమనార్హం! 2002లో జూలీ అత్తయ్య అన్నమ్మ థామస్ గ్లాసు నీళ్లు తాగి చనిపోయింది. దీన్ని వైద్యులు గుండెపోటు అని తేల్చారు. ఆరేళ్ల తర్వాత 2008లో జూలీ మామయ్య టామ్ థామస్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మూడేళ్ల తర్వాత.. 2011లో జూలీ భర్త రాయ్ థామస్ కడుపు నిండా భోజనం చేశాక బాత్రూమ్లో విగతజీవిగా కనిపించాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించింది. అనుమానించినందుకు అతడ్నీ చంపేసింది కానీ అన్నమ్మ సోదరుడు మాథ్యూ మాత్రం ఏదో జరుగుతోందని అనుమానించాడు. అది కనిపెట్టేలోపే అతడిని కూడా మట్టుపెట్టింది జూలీ. 2014లో విస్కీలో విషం కలిపి చంపింది. రెండేళ్ల తర్వాత.. 2016లో తన భర్త దగ్గరి బంధువైన షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర బిడ్డను సైతం చంపేసింది. ఆ తర్వాత షాజు జచారయ్యను రెండో పెళ్లి చేసుకుంది జూలీ. అయితే అన్నయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఏదో జరుగుతోందని అమెరికాలో ఉన్న రాయ్ థామస్ సోదరుడు రోజో అనుమానించాడు. అటు ఆస్తి బదలాయింపు విషయంలో జూలీ అక్రమాలకు పాల్పడటం.. తర్వాత మరిన్ని మరణాలు సంభవించడంతో రోజో అనుమానం బలపడింది. నమ్మలేని నిజాలు వెలుగులోకి.. అతడి ఫిర్యాదు మేరకు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. జూలీ తన భర్త తినే అన్నంలో సైనైడ్ పెట్టి చంపిందని తేలింది. అంతేకాదు మిగతా ఐదుగురినీ సైనైడ్ సాయంతోనే హత్య చేసిందని తేలింది. ఆస్తి తనకు దక్కాలన్న అత్యాశతోనే అందరి ప్రాణాలు పొట్టనపెట్టుకుంది. ఎట్టకేలకు ఆమెను దోషిగా తేల్చిన పోలీసులు 2019 అక్టోబర్‌లో అరెస్ట్ చేశారు. ఆమెకు సైనైడ్ సరఫరా చేసిన ఎమ్ఎస్. మాథ్యూ, ప్రాజీ కుమార్‌లపైనా చర్యలు తీసుకున్నారు. ఈ కేసు ఆధారంగా సీరియల్.. అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసు ఆధారంగా 'కూడతయి' అనే మలయాళ సీరియల్ వచ్చింది. అలాగే 'డెత్, లైస్ అండ్ సైనైడ్' పేరిట ఓ పాడ్‌క్యాస్ట్ కూడా రిలీజైంది. 'క్రైమ్ పెట్రోల్ సతర్క్' రెండో సీజన్లో 100-102 ఎపిసోడ్ల మధ్యలో ఈ కేసును కళ్లకు కట్టినట్లు చూపించారు. 'దహాద్' వెబ్ సిరీస్ కూడా ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని తీసినట్లు కనిపిస్తుంది. జూలీని అమ్మ అని పిలవడానికి ఇష్టపడని కుమారుడు ఇకపోతే 'కర్రీ అండ్ సైనైడ్: ద జూలీ జోసెఫ్ కేసు' డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు విజేత క్రిస్టో టామీ దర్శకత్వం వహించాడు. షాలిని ఉషాదేవి రచయితగా పని చేసింది. ఈ సిరీస్‌లో హత్యలు జరిగిన ప్రదేశాన్ని సరిగా చూపించకపోవడంతో సహజత్వాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. రాయ్ థామస్ సోదరుడు రోజో, సోదరి రెంజీ థామస్ డాక్యుమెంటరీలో భాగమై తమ అనుభవాలు చెప్పారు. అలాగే జూలీ పెద్ద కుమారుడు సైతం ఈ సినిమాలో ఉన్నాడు. అతడు జూలీని తన తల్లిగా సంభోదించడానికి ఇష్టపడలేదు. ఆమెను ఆ మహిళ లేదా జూలీ అనే ప్రస్తావిస్తూ మాట్లాడాడు. చదవండి: త్రిష, చిరంజీవిపై కేసు.. పబ్లిసిటీ స్టంట్ అంటూ కోర్టు ఫైర్! -
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' వివాదం.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బొమ్మన్ !
ఆర్ఆర్ఆర్తో పాటు ఆస్కార్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఏనుగులను సంరక్షించే గిరిజన దంపతుల జీవనం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఆ దంపతులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే దీన్ని తెరకెక్కించిన కార్తికి గోంజాల్వెస్ తీరు పట్ల ఇటీవలే ఈ దంపతులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటిస్తే ఇల్లు, వాహనం, బెల్లీ మనవరాలు చదువుకు కావాల్సిన సాయంతోపాటు కలెక్షన్స్‌లోనూ వాటా ఇస్తామని కార్తికి చెప్పిందని బొమ్మన్, బెల్లీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన దంపతులు తమకు డబ్బులు ఇవ్వకుండా దర్శకురాలు మోసం చేసిందని వాపోయారు. అంతే కాకుండా తాము ఖర్చు పెట్టిన కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. (ఇది చదవండి: ఉద్యోగులకు బంపరాఫర్..సెలవుతో పాటు ఏకంగా టికెట్స్ కూడా!) ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అయితే ఇప్పటికే గిరిజన దంపతులు దర్శకురాలికి రూ.2 కోట్ల చెల్లించాలంటూ లీగల్ నోటీస్ పంపినట్లు తెలిసింది. ఆస్కార్ వచ్చిన తర్వాత దేశ ప్రధాని, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి ఆమె పురస్కారాలు అందుకున్నారని.. తమకు మాత్రం మొండిచేయి చూపించారంటూ లీగల్ నోటీసులో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో బొమ్మన్, బెల్లీ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.2 కోట్ల లీగల్ నోటీసు గురించి తమకు తెలియదని బొమ్మన్ చెప్పినట్లు వెల్లడిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. బొమ్మన్ దంపతులు చేసిన ఆరోపణలపై పూర్తిగా యూ టర్న్ తీసుకున్నట్లు సమాచారం. ఓ మీడియా ప్రతినిధితో బొమ్మన్ మాట్లాడుతూ..' మా డిమాండ్లు నెరవేరితే కేసును వెనక్కి తీసుకుంటానని నేను చెప్పలేదు. అక్కడ ఏమి జరిగిందో నాకు ఏమి తెలియదు. లీగల్ నోటీసులు పంపినట్లు నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కార్తీకి నాతో బాగా మాట్లాడారు. అంతే కాకుండా సహాయం చేస్తానని కూడా చెప్పారు. కేసు విషయంలో నేనేం చేస్తా. ఆమె మాకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాకు ఉద్యోగం ఇప్పిస్తే చాలు." అని అన్నారు. ఇప్పటికే దీనిపై వివాదం తలెత్తగా.. బొమ్మన్ కామెంట్స్‌తో సీన్ కాస్తా రివర్స్ అయింది. (ఇది చదవండి: మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.. దర్శకురాలిపై తీవ్ర ఆరోపణలు!) అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. -
మమ్మల్ని నమ్మించి మోసం చేసింది.. దర్శకురాలిపై తీవ్ర ఆరోపణలు!
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' పేరు వినగానే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై ఈ పేరు మార్మోగిపోయింది. డాక్యుమెంటరీ చిత్రం అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన 95 ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్లో భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నాటునాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్తో పాటు బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. దిక్కులేని ఏనుగులను ఆదరించి.. వాటిని చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్. (ఇది చదవండి: తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే? ) డాక్యుమెంటరీలో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న గిరిజన జంట బొమ్మన్, బెల్లీ. అయితే తాజాగా ఈ జంట దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్, చిత్ర నిర్మాణ సంస్థ సిఖ్యా ఎంటర్టైన్మెంట్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆగస్ట్ 4న ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొమ్మన్, బెల్లీ దంపతులు నిర్మాతలు వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రీకరణ సమయంలో ఈ జంట.. దర్శకురాలు కార్తికి గోన్సాల్వ్స్‌తో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించారు. దీంతో బొమ్మన్, బెల్లీ సినిమా కోసం వివాహ సన్నివేశం కోసం లక్ష రూపాయలు తాము భరించామని తెలిపారు. ఆ డబ్బులను ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. తన మనవరాలి చదువు కోసం దాచుకున్న రూ. 1 లక్ష ఖర్చు చేసినట్లు బెల్లీ వెల్లడించారు. డబ్బు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చిన కార్తికి గోంజాల్వెస్ ఆ తర్వాత స్పందించలేదని వాపోయారు. ఆమెను కలిసేందుకు ప్రయత్నించగా ఎలాంటి స్పందన లేదన్నారు. తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదన్నారు. ఆస్కార్‌ను తాకడానికి ఒప్పుకోలేదు 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత సన్మాన కార్యక్రమంలో బొమ్మన్, బెల్లీ దంపతులు కనీసం అవార్డ్ తాకేందుకు అనుమతించలేదని అన్నారు. ముంబై తిరిగి నీలగిరి రావడానికి కనీసం డబ్బులు కుడా ఇవ్వలేదని వాపోయారు. ఆర్థిక సహాయం కోసం ఆమెను సంప్రదించగా నిరాకరించిందని తెలిపారు. తమకు రెమ్యునరేషన్ కేవలం రూ. 60 మాత్రమే చెల్లించారని తెలిపారు. స్పందించని మేకర్స్ గిరిజన దంపతుల ఆరోపణలపై సిఖ్యా ఎంటర్టైన్మెంట్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఉద్దేశంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఏనుగుల సంరక్షణపై అవగాహన పెంచడం, బొమ్మన్, బెల్లీతో సహా అటవీ శాఖల కృషిని గుర్తించడం తమ ప్రాథమిక లక్ష్యమని తెలిపింది. అంతే ఈ దంపతులు లేవనెత్తిన ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. (ఇది చదవండి: ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి) అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: బెల్లీ గతంలో ఆస్కార్ రావడం పట్ల బెల్లీ మాట్లాడుతూ.. 'ఏనుగులు అంటే మాకు పిల్లలతో సమానం. తల్లిని కోల్పోయిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తాం. అలాంటి చాలా గున్న ఏనుగులను చేరదీశాం. వాటిని మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారు. కానీ నాకు ఆస్కార్ అంటే ఏంటో తెలియదు. అయినా అభినందనలు రావడం చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు. -
ధోనీని కలిసిన ఎలిఫెంట్ విస్పర్స్ చిత్రబృందం
-
ఆస్కార్ గెలిచిన వీరులతో ఎంఎస్ ధోని
ఐపీఎల్ 2023 సీజన్లో ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదోసారి టైటిల్ కొల్లగొట్టేందుకు ఉవ్విళ్లూరుతుంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 13 పాయింట్లతో ఉన్న ధోని సేన రెండో స్థానంలో కొనసాగుతుంది. కాగా ఇవాళ(బుధవారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్కే తలపడనుంది. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారతీయ చిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్(Elephant Whisperers)' ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో కనిపించిన బొమన్, బెల్లీలను, దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్ను ఎంఎస్ ధోని బుధవారం ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ఈ సందర్భంగా సీఎస్కే జెర్సీలను వారికి గిఫ్ట్‌గా బహుకరించాడు. ఇక్కడ విశేషమేంటంటే ధోని జెర్సీ నెంబర్ అయిన '7'తో వారి పేర్లను ముద్రించి కానుకగా అందించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Tudumm 🎬 Special occasion with very special people 💛🐘#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/AippVaY6IO — Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023 Roars of appreciation to the team that won our hearts! 👏 So good to host Bomman, Bellie and filmmaker Kartiki Gonsalves! 🐘#WhistlePodu #Yellove 🦁💛 — Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023 చదవండి: ODI WC 2023: హైదరాబాద్‌లో టీమిండియా-పాక్ మ్యాచ్! -
ఓటీటీలో రిలీజవుతున్న ఆహా 'గోదారి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుత సినీరంగంలో ఓటీటీ హవా నడుస్తోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా మరో కొత్త కంటెంట్‌తో మీ ముందుకు వస్తోంది. గోదారి పేరుతో తెరకెక్కిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు వివరించేలా స్వాతి దివాకర్ దర్శకత్వంలో డాక్యుమెంటరీని రూపొందించారు. దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ.. 'ఆహా ఓటీటీ ద్వారా ఈ గోదారి డాక్యుమెంటరీని ప్రేక్షకులకు చూపించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందెన్నడూ చూడని గోదారి అందాలను ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించాం. గోదావరి నదీ విశిష్ణత, దాని చుట్టూ కోట్ల మంది ప్రజలు అవలంబించే సంస్కృతీ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నాం.' అని అన్నారు. ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీ ఆహా ఓటీటీలో మైలురాయిగా నిలవనుంది. ఇలాంటి డాక్యుమెంటరీలతో మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన కట్టడాల గురించి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉంటుందని ఆహా యాజమాన్యం తెలిపింది. త్రింబకేశ్వర్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ చివరికి అంతర్వేది దగ్గర సాగరంలో కలుస్తుంది మన గోదారి. తన ప్రవాహ ప్రయాణంలో వివిధ రకాల ప్రాంతాలు, మనుషులు, యాసలు, భాషలు, పుణ్యక్షేత్రాలను పలకరిస్తూ, పరవశిస్తూ వారి జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తోందని -
మావటీల జీవితాల్లో వెలుగు తెచ్చారు
‘నాకు అడివింటే చాలా భయం’ అంటుంది బెల్లి. ఆస్కార్ వచ్చిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ లో మావటి బొమ్మన్ భార్య ఆమె. భర్తతో కలిసి రఘు అనే పిల్ల ఏనుగును ఆమె సాకుతుంది. దాంతోపాటు ‘అమ్ము’ అనే ఇంకో పిల్ల ఏనుగు బాగోగులను బెల్లి చూస్తుంది. బొమ్మన్ ప్రభుత్వ ఉద్యోగి. బెల్లి కాదు. అయినా సరే భర్త డ్యూటీలో ఆమె భాగం పంచుకుంది. భర్తతో పాటే పసి ఏనుగులను చూసుకుంది. ‘నా భర్తను పులి చంపింది. అప్పటి నుంచి అడివంటే భయం. బొమ్మన్‌ను చేసుకున్నాక కొంచెం భయం పోయింది. పిల్ల ఏనుగుల బాగోగుల్లో పడ్డాక, వాటి వెంట తిరుగుతుంటే అడివంటే భయం పోయింది’ అంటుంది బెల్లి. నీలగిరి (ఊటీ) అడవుల్లో ఉండే ఎలిఫెంట్ క్యాంపుల్లో ఏనుగుల సంరక్షణ మావటీలు చూస్తారు. వీళ్లంతా దాదాపు ఆ ప్రాంత గిరిజనులే. ఏనుగులను చూసుకోవడం మగవారి పనే. అయితే బొమ్మన్ చూసేది పిల్ల ఏనుగులను కనుక వాటి అమాయకత్వానికి ముగ్ధురాలై అమ్ము కూడా వాటితో అనుబంధం పెంచుకుంటుంది. ఆమెకు రఘు, అమ్ము ఎంత మాలిమి అంటే డాక్యుమెంటరీలో అమ్మును పిలిచి ‘ఏయ్... నా ఒడిలో కాదు. పక్కన పడుకో. లేకుంటే దెబ్బలు పడతాయి’ అనంటే ఆ ఏనుగు ఆమె పక్కన మెల్లగా ఒత్తిగిలి పడుకోవడం ముచ్చట గొలుపుతుంది. అమ్ముకు బెల్లి రెండు జడలు వేసి నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ ముగుస్తుంది. అయితే బొమ్మన్ వల్ల, అమ్ము వల్ల, ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి వల్ల దేశంలో ఇప్పుడు ఏనుగుల సంరక్షణ గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్ వెంటనే స్పందించి బొమ్మన్, బెల్లిలను పిలిచి చెరొక లక్ష డబ్బు ఇచ్చి సన్మానం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 91 మంది మావటీలకు కూడా మనిషికో లక్ష ఇవ్వనున్నారు. వీరి నివాసాల కోసం 9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఏనుగుల క్యాంపుల కోసం 13 కోట్లు మంజూరయ్యాయి. ప్రేమ, ఆదరణల వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. బొమ్మన్, బెల్లిలతో అది మరోసారి రుజువయ్యింది. -
ఆస్కార్ గెలిచిన రోజే ఏనుగులు మిస్సింగ్.. షాక్‌లో చిత్రబృందం
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ అవార్డు గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. పూర్తిగా ఇండియాలో నిర్మించిన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ దక్కడం విశేషం. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు, అమ్ము అనే అనాథ ఏనుగు పిల్లలు. ఆ ఏనుగు పిల్లను చేరదీసిన ఆదివాసి దంపతులు బొమ్మన్, బెల్లి. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా చూపించారు. అయితే అవార్డ్ ప్రదానోత్సవం రోజునే విచిత్ర సంఘటన జరిగింది. ఒకవైపు అవార్డ్ వచ్చిందన్న ఆనందంలో ఉంటే.. మరోవైపు ఆ డాక్యుమెంటరీలో నటించిన ఏనుగులు అదృశ్యమయ్యాయనే వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డాక్యుమెంటరీలో రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు అదృశ్యమైనట్లు బొమ్మన్ వెల్లడించారు. కొంతమంది తాగుబోతులు ఏనుగులను తరమడంతో ఆదివారం రెండు ఏనుగులు కృష్ణగిరి అరణ్యంలోకి వెళ్లిపోయాయని ఆయన చెప్పారు. ఆ ఏనుగుల కోసం బొమ్మన్ ప్రస్తుతం వెతుకడం ప్రారంభించారు. బొమ్మన్ మాట్లాడుతూ..'మద్యం మత్తులో ఉన్న కొంత మంది వ్యక్తులను తరమడంతో ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం నేను కృష్ణగిరి ఫారెస్ట్‌లో వెతుకుతున్నా. అవి రెండూ కలిసే ఉన్నాయా.. విడిపోయాయా అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటి ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నిస్తా. ఒకవేళ అవి నాకు కనిపించకపోతే ఫారెస్ట్ రేంజర్‌కు ఫిర్యాదు చేసి నేను నా సొంతూరికి వెళ్తా.' అని అన్నారు. -
అంబారీ ఎక్కి ఆస్కార్ వచ్చింది.. తొలిసారి భారత డాక్యుమెంటరీకి..
‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ నిడివి 39 నిమిషాలు. రెండు ఏనుగు పిల్లలు, నీలగరి అడవుల్లో ఉండే ‘కట్టు నాయకర్’ అనే తెగకు చెందిన ఆదివాసీ భార్యాభర్తలు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తారు. ఆ భార్యాభర్తల పేర్లు బొమ్మన్, బెల్లి. ఏనుగు పిల్లల్లో ఒకదాని పేరు రఘు, మరోదాని పేరు అమ్ము. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. అయితే డాక్యుమెంటరీలో ఎక్కువ భాగం రఘతో బొమ్మన్, బెల్లిలకు ఉండే అనుబంధం చూపుతుంది. అయితే నేపథ్యంలో అందమైన అడవులు, వాగులు, ఆదివాసీల క్రతువులు ఇవన్నీ దర్శకురాలు కార్తికి చూపడంతో డాక్యుమెంటరీకి ఒక సంపూర్ణత్వం వచ్చింది. బొమ్మన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఇప్పుడు రఘు, అమ్ములను అటవీ శాఖ వారు ‘ముడుమలై టైగర్ రిజర్వ్’కు మార్చారు. దాంతో రఘుతో ఆ దంపతుల బంధం తెగింది. విఘ్నాలు తొలగిపోయాయి. పూర్తిగా ఇండియాలో నిర్మితమైన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ అందింది. ఇది స్త్రీల ద్వారా జరిగింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది కార్తికి గోంజాల్వేజ్. నిర్మించింది గునీత్ మోంగా. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు అనే అనాథ ఏనుగు పిల్ల. ఆ ఏనుగు పిల్లను సాకిన ఆదివాసి దంపతులు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధం ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా వ్యక్తమైంది. అందుకే అంబారీ ఎక్కి వచ్చినట్టుగా మనకు ఆస్కార్ ఘనంగా దక్కింది. ఏనుగులు– మావటీలు మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నారు. కాని వారి మధ్య ఉన్నది ఒక రకమైన ప్రొఫెషనల్ స్నేహం. కాని కొన్ని సందర్భాలలో అనాథలైన ఏనుగు పిల్లలను కాపాడే పని ఆదివాసీలు తీసుకుంటారు. వారిది పెంచిన మమకారం. ఆ మమకారమే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కథాంశం. దర్శకురాలు కార్తికీది ఊటి. అక్కడే పుట్టి పెరిగింది. ఊటీకి అరగంట ప్రయాణ దూరంలో ‘తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్’ ఉంది. అక్కడ ఏనుగులను సంరక్షిస్తుంటారు. కార్తికి గోంజాల్వేజ్ చిన్నప్పటి నుంచి ఆ క్యాంప్‌కు వెళ్లి ఏనుగులను చూసేది. ఆ తర్వాత ఆమె పెరిగి పెద్దదయ్యి ఫొటోగ్రాఫర్‌గా మారినా, కెమెరా ఉమన్‌గా తనకున్న వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఇష్టం వల్ల యానిమల్ ప్లానెట్, డిస్కవరీ చానల్స్‌లో పని చేసినా ఎప్పుడూ తన ప్రాంత ఏనుగుల మీద ఏదైనా ఫిల్మ్ చేయాలని అనిపించలేదు. కాని 2017లో అందుకు బీజం పడింది. అతడు – ఆ ఏనుగు పిల్ల కార్తికి గోంజాల్వేజ్ 2017లో బెంగళూరు నుంచి కారులో ఊటీకి వెళుతోంది. ఊటీ చేరుకుంటూ ఉండగా ఒక మనిషి చిన్న ఏనుగు పిల్లను నడిపించుకుంటూ వెళుతూ ఆమె కంట పడ్డాడు. కార్తికి వెంటనే కారు ఆపి ఈ మనిషి ఈ ఏనుగు పిల్లను ఎక్కడకు తీసుకువెళుతున్నాడు అని వెంబడించింది. వారిద్దరూ దగ్గరిలోని ఏటికి వెళ్లారు. ఆ మనిషి ఆ ఏనుగు పిల్లకు చంటిపిల్లలకు మల్లే స్నానం చేయించాడు. దానితో ఎన్నో కబుర్లు చెప్పాడు. ‘అరె.. ఈ బంధం భలే ఉందే’ అనిపించింది కార్తికికి. అతణ్ణి పలకరించింది. పేరు బొమ్మన్. ఆ ఏనుగు పిల్ల పేరు రఘు. ఆ ఏనుగు పిల్ల ఇటీవలే అనాథ అయ్యింది. పంటలను కాపాడుకోవడానికి పెట్టిన కరెంటు తీగల బారిన పడి రఘు తల్లి మరణించింది. అనాథ అయిన రఘు తల్లి వియోగంతో కృశించి చావుకు దగ్గరగా ఉండగా బొమ్మన్‌కు కనిపించాడు. దానిని ఇంటికి తీసుకెళ్లాడు. బొమ్మన్ భార్య బెల్లి రఘుకు తల్లిలా మారింది. ఆ ముగ్గురు ఒక కుటుంబం అయ్యారు. ఇలాంటి అనుబంధాలు చూపితే మనిషి, జంతువు కలిసి మెలిసి మనుగడ సాగించాల్సిన అవసరాన్ని చూపినట్టు అవుతుందని కార్తికి అనుకుంది. వెంటనే డాక్యుమెంటరీ నిర్మించడానికి నెట్‌ఫ్లిక్స్‌ను సంప్రదించింది. నెట్‌ఫ్లిక్స్ తన కో ప్రొడ్యూసర్‌గా నిర్మాత మోంగాను సంప్రదించింది. అలా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ నిర్మాణం మొదలైంది. ఢిల్లీకి చెందిన గునీత్ దాదాపు పదేళ్లుగా అంతర్జాతీయ దృష్టి పడే సినిమాల నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. ఆమె నిర్మాణ భాగస్వామి అయిన ‘కవి’ (2010) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్‌లో ఆస్కార్ నామినేషన్ పొందగా, ‘పిరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ (2018) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌గా ఆస్కార్ అవార్డ్ పొందింది. అయితే ‘పిరియడ్’కు పని చేసిన సాంకేతిక నిపుణులు భారతీయులు కారు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ను తీయాలనుకుంటున్న కార్తికితో పని చేయడం వల్ల ఈసారి పూర్తి భారతీయ నిర్మాణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని గునీత్ భావించింది. అలా వీరిద్దరు కలిసి పూర్తి చేసిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 8, 2022న విడుదలైంది. ఇది డాక్యుమెంటరీ వేవ్ ‘ఇప్పుడు ఇండియాలో నడుస్తున్నది డాక్యుమెంటరీ వేవ్. ఫీచర్ ఫిల్మ్స్‌లో కన్నా డాక్యుమెంటరీలో భారతీయ దర్శక నిర్మాతలు వినూత్నమైన కథాంశాలను చెబుతున్నారు’ అంటుంది గునీత్. కార్తికి మాట్లాడుతూ– ‘ఏనుగులు ఎంత తెలివైనవో ఎంత భావోద్వేగంతో బంధంతో ఉంటాయో నా డాక్యుమెంటరీలో చూపించాను. ఇక మీదటైనా అవి వేరు మనం వేరు అనుకోకపోతే చాలు’ అంది. ‘నేను తీసే ఫిల్మ్స్ ఇకపై కూడా ఇలాంటి కథాంశాలతో ఉంటాయి’ అన్నారు. చదవండి: ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ -
Oscars 2023: ప్చ్.. ఆస్కార్ మిస్ చేసుకున్న భారతీయ చిత్రం ఇదే!
లాస్ ఏంజెల్స్: ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన భారత డాక్యుమెంటరీ చిత్రానికి నిరాశ ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ (All That Breathes) అస్కార్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో అమెరికాకి చెందిన ‘నావాల్నీ’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను అవార్డ్ వరించింది. ఆల్ దట్ బ్రీత్స్ని షానక్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ కేటగిరిలో ఇతర నామినీల విషయానికొస్తే.. ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్ చిత్రాలు ఉన్నాయి. ‘ఆల్ దట్ బ్రీత్’స్ ఈ విభాగంలో నామినేట్ చేసిన రెండవ భారతీయ చిత్రం. గత సంవత్సరం రింటు థామస్, సుష్మిత్ ఘోష్ రాసిన రైటింగ్ విత్ ఫైర్, ఆస్కార్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఆల్ దట్ బ్రీత్స్.. ఢిల్లీలో బర్డ్ క్లినిక్ నడుపుతున్న సౌద్, నదీమ్ అనే ఇద్దరు సోదరుల కథ ఇది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ సర్క్యూట్లో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. -
తెలిసిన వ్యక్తే అని వెెళ్తే.. లైంగిక దాడి చేశాడు: నటి
హాలీవుడ్ నటి బ్రూక్ షీల్డ్స్ అమెరికన్ మోడల్. ఆమె పలు డాక్యుమెంటరీ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో తన కెరీర్లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల విడుదలైన కొత్త డాక్యుమెంటరీ 'ప్రెట్టీ బేబీ'లో ఆమెపై జరిగిన లైంగిక దాడి సంఘటనను వివరించారు. అయితే నటిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. కానీ ఆమె ఆ వ్యక్తిని అంతకుముందే కలిసినట్లు చెప్పింది. గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు తెలిసిన వ్యక్తేనని వివరించింది. చిన్న వయసులోనే మోడల్‌గా ఫేమస్ అయిన బ్రూక్ షీల్డ్స్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చదివారు. బ్రూక్ షీల్డ్స్‌కు తెలిసిన వ్యక్తి టాక్సీ పిలుస్తానని చెప్పి హోటల్‌కు తీసుకెళ్లాడని పేర్కొంది. ఆ తర్వాత తనపై లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఆ తర్వాత బాత్రూమ్కు వెళ్లి అదృశ్యమయ్యాడని ఆమె చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటన గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదని వెల్లడించింది. బ్రూక్ షీల్డ్ మాట్లాడుతూ.. ' ఆ సమయంలో నేను అతనిపై ఫైట్ చేయలేకపోయా. పూర్తిగా స్తంభించిపోయా. కేవలం 'నో' అని మాత్రమే అరిచా. ఆ సమయంలో కేవలం ప్రాణాలతో బయటపడితే చాలు అనుకున్నా.' అని వివరించింది. ఈ సంఘటన తర్వాత తన స్నేహితుడు, సెక్యూరిటీ హెడ్ గావిన్ డి బెకర్‌కు ఫోన్ చేసినట్లు గుర్తుచేసుకుంది. కాగా.. సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ప్రదర్శించబడిన కొత్త డాక్యుమెంటరీ "ప్రెట్టీ బేబీ'ని ప్రదర్శించారు. .