ప్రస్తుత సినీరంగంలో ఓటీటీ హవా నడుస్తోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా మరో కొత్త కంటెంట్‌తో మీ ముందుకు వస్తోంది. గోదారి పేరుతో తెరకెక్కిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు వివరించేలా స్వాతి దివాకర్ దర్శకత్వంలో డాక్యుమెంటరీని రూపొందించారు.
దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ.. 'ఆహా ఓటీటీ ద్వారా ఈ గోదారి డాక్యుమెంటరీని ప్రేక్షకులకు చూపించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందెన్నడూ చూడని గోదారి అందాలను ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించాం. గోదావరి నదీ విశిష్ణత, దాని చుట్టూ కోట్ల మంది ప్రజలు అవలంబించే సంస్కృతీ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నాం.' అని అన్నారు.
ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీ ఆహా ఓటీటీలో మైలురాయిగా నిలవనుంది. ఇలాంటి డాక్యుమెంటరీలతో మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన కట్టడాల గురించి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉంటుందని ఆహా యాజమాన్యం తెలిపింది. త్రింబకేశ్వర్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ చివరికి అంతర్వేది దగ్గర సాగరంలో కలుస్తుంది మన గోదారి. తన ప్రవాహ ప్రయాణంలో వివిధ రకాల ప్రాంతాలు, మనుషులు, యాసలు, భాషలు, పుణ్యక్షేత్రాలను పలకరిస్తూ, పరవశిస్తూ వారి జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తోందని
Comments
Please login to add a commentAdd a comment