
కోలీవుడ్ హీరో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్ (యుగానికి ఒక్కడు). ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్‌లోకి రానుంది. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా సినిమా ఉండటంతో తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదుచేసింది. హీరో కార్తీకి ఈ సినిమాతో పాపులారటీ వచ్చింది.

యుగానికి ఒక్కడు(Yuganiki Okkadu) సినిమా రీరిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత చోలాస్ మళ్లీ తిరిగి వస్తున్నారని వారు ఒక పోస్టర్ విడుదల చేశారు. ఎపిక్ ఫాంటసీ మాస్టర్ పీస్ చూసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో మార్చి 14న ఈ చిత్రం రీరిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ వర్షన్ సన్‌నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది.

యుగానికి ఒక్కడు సీక్వెల్ ప్లాన్
‘యుగానికి ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు సెల్వ రాఘవన్ అధికారికంగా గతంలోనే ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ధనుష్ హీరోగా నటించనున్నాడని కూడా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌పై ధనుష్ కూడా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన అన్నారు. యుగానికి ఒక్కడు కోసం రూ. 18 కోట్లు బడ్జెట్ అయింది. సీక్వెల్ కోసం సుమారు రూ. 150 కోట్లు దాటొచ్చని అంచనా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment