Rerelease
-
నా ఛాతీలో దమ్ముంది
‘నా కలర్ నలుపు... కానీ, నా క్యారెక్టర్ ఎరుపు’ అంటూ నటుడు అశోక్ కుమార్ చెప్పే డైలాగ్‌తో ‘ఈశ్వర్’ సినిమా ట్రైలర్ ఆరంభమైంది. ప్రభాస్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ఈశ్వర్’. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్‌కుమార్ హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, శివ కృష్ణ, రేవతి ఇతర పాత్రలు పోషించారు. కొల్ల అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న రిలీజై హిట్‌గా నిలిచింది.కాగా ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఈశ్వర్’ సినిమాని అదే రోజు 4కే క్వాలిటీలో రీ రిలీజ్ చేస్తోంది లక్ష్మీ నరసింహా మూవీస్. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే... ‘నీ చేతిలో డబ్బుంటే... నా ఛాతీలో దమ్ముంది రా, ఈ రోజు ఆ పోరి సంగతి అటో ఇటో తేల్చేస్తాను, ప్రేమించింది మర్చిపోవడానికి కాదు’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగులు ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్. -
ఖడ్గంలో నన్ను తీసుకోవద్దన్నారు: శ్రీకాంత్
‘‘ఖడ్గం’ సినిమాలో నన్ను తీసుకోవద్దని నిర్మాత మధు మురళిగారు అన్నారు. కానీ కృష్ణవంశీ ధైర్యం చేసి, ఆయన్ని ఒప్పించి నన్ను తీసుకున్నారు. నా జీవితంలో ఈ సినిమాని మర్చిపోలేను. తరాలు మారినా దేశభక్తి చిత్రాలన్నింటిలో ‘ఖడ్గం’ గొప్ప చిత్రం. ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, శివాజీ రాజా, షఫీ, సోనాలీ బింద్రే, సంగీత తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’. కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ సినిమా 2002 నవంబర్ 29న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.కాగా ఈ నెల18న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాను’’ అని చెప్పారు. ‘‘ఖడ్గం’లో నేను చేయనని చెప్పాను. కానీ, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నిటిలో నాకు మంచి పేరు వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే’’ అన్నారు శివాజీ రాజా. ‘‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివి ఏడేళ్లుగా అవకాశం కోసం వేచి చూస్తున్న సమయంలో నాకు దొరికిన అవకాశం ‘ఖడ్గం’. ఈ సినిమాలో చాన్స్ ఇచ్చి నా వనవాసం ముగింపునకు కారణమైన కృష్ణవంశీగారికి కృతజ్ఞతలు’’ అని నటుడు షఫీ తెలిపారు. -
ఊహించలేని ట్విస్ట్‌లతో 'తుంబాడ్'.. రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా..?
రీ రిలీజ్ ట్రెండ్ అన్ని చిత్రపరిశ్రమలలో కొనసాగుతుంది. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ప్రతిచోటా ఒకప్పటి హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు మీరు లవ్ స్టోరీస్, యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సినిమాలను రీ-రిలీజ్లో చూసి ఉంటారు. ఇప్పుడు హారర్ సినిమా చూసేందుకు సిద్ధంగా ఉండండి.హారర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ అంటే చాలామంది చెప్పే పేరు 'తుంబాడ్'. ఈ సినిమా సెప్టెంబర్ 13న దేశవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. 2018లో విడుదలైన ఈ సినిమా ఆ సమయంలో పెద్దగా మెప్పించలేదు. అయితే, కరోనా సమయంలో అమెజాన్ ప్రైమ్‌లో తుంబాడ్ విడుదలైంది. అప్పుడు మాత్రం ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడా సినిమాను బిగ్ స్క్రీన్ మీదే చూడాలనుకునే అభిమానులు సెప్టెంబర్ 13న చూడొచ్చు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రీ-రిలీజ చేయనున్నారు. మహారాష్ట్రలోని 'తుంబాడ్' అనే గ్రామంలో దాగి ఉన్న నిధి గురించి సాగే అన్వేషణతో ఈ చిత్ర కథ ఉంటుంది. అత్యాశ మనిషికి ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో తండ్రీకొడుకుల పాత్రలతో తుంబాడ్‌లో చక్కగా చూపించారు. అనేక సన్నివేశాలను రీషూట్ చేయాల్సి రావడంతో.. ఈ చిత్రం ఆరేళ్ల పాటు షూటింగ్ జరుపుకుందట.! -
మా జీవితాలను మార్చింది: హరీష్ శంకర్
‘‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్లీ క్రియేట్ చేసి ఇస్తున్న మా అన్న గణేశ్‌కి, సత్యనారాయణకి థ్యాంక్స్. ‘గబ్బర్ సింగ్’ మా జీవితాలను మార్చేసిన సినిమా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం 2012 మే 11న విడుదలైంది. ఈ నెల 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘గబ్బర్ సింగ్’ డబ్బింగ్ సమయంలోనే ఈ మూవీ పక్కా బ్లాక్‌బస్టర్ అన్నారు పవన్ కల్యాణ్‌గారు. నా అభిమానులు కోరుకునేది ఇవ్వబోతున్నావ్’’ అన్నారు. ‘‘నన్ను నేను నమ్మలేని పరిస్థితిలో పవన్ కల్యాణ్‌గారు నమ్మి, నన్ను నిర్మాతగా నిలబెట్టారు. నేను, హరీష్, దేవిశ్రీ ప్రసాద్... అందరూ ప్రేమించి ఈ సినిమా చేశాం. ఏడేళ్లుగా నేను సినిమా తీయకపోవడం బాధగా ఉంది... మళ్లీ సినిమాలు తీస్తా’’ అన్నారు బండ్ల గణేశ్. డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రమేశ్‌రెడ్డి మాట్లాడారు. -
ఆరేళ్లు తీసిన క్రేజీ హారర్ సినిమా.. థియేటర్లలో రీ రిలీజ్
రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం చాలా ఫేమస్. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ప్రతిచోటా ఒకప్పటి హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇప్పటికే చూశాం కదా అని అనుకోకుండా బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో మురారి, ఇంద్ర, మాస్.. ఇలా ఓ రేంజులో అలరించాయి. ఇప్పటివరకు అన్నీ మాస్ మూవీస్ వచ్చాయి కానీ ఈ ట్రెండ్‌లోనే తొలిసారి ఓ హారర్ మూవీ రిలీజ్ కాబోతుంది.(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)హారర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ అంటే చాలామంది చెప్పే పేరు 'తుంబాడ్'. రెగ్యులర్ హారర్ టైపు స్టోరీ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అయితే నిర్మాతలకు డబ్బుల్లేక 2012 నుంచి దాదాపు ఆరేళ్ల పాటు విడతల వారీగా షూటింగ్ చేశారు. ఫైనల్‌గా 2018లో థియేటర్లలో రిలీజ్ చేస్తే ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఓటీటీలో అది కూడా లాక్ డౌన్లో ఈ సినిమాని తెగ చూశారు. ఇప్పుడు దీన్నే సెప్టెంబరు 13న మళ్లీ దేశంలో పలుచోట్ల రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.'తుంబాడ్' విషయానికి వస్తే.. 1918లో మహారాష్ట్రలోని కలమేడ్ గ్రామం. వినాయక్ రావు (సోహం షా) తన తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తుంటాడు. ఊరి గుడిలో నిధి దాగి ఉందన్న వార్త విని, దాని కోసం వెతుకుతుంటాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అత్యాశ అనే స్టోరీ లైన్‌తో తీసిన ఈ మూవీలో ఊహించని హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందిస్తాయి. థియేటర్లలో మంచి ఎక్స్‌పీరియెన్స్ కావాలనుకుంటే ఈ మూవీ మాత్రం అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు) -
‘వన్స్ మోర్’ అంటున్న ఫ్యాన్స్.. పాత సినిమాలే సరికొత్తగా!
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా భాష ఏదైనా ప్రస్తుతం ‘వన్స్ మోర్’ అంటూ రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజు కావచ్చు లేదా ఆ సినిమాకి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు... సందర్భం ఏదైనా రీ రిలీజ్‌కి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే కలెక్షన్స్ కొల్లగొడుతుండటం కూడా ఓ కారణం. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా ‘వన్స్ మోర్’ అంటూ ఆ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత చిత్రాలను 4కె క్వాలిటీతో అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. చిరంజీవి ‘ఇంద్ర’ ఈ నెల 22న విడుదల కాగా, నాగార్జున ‘శివ’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ప్రభాస్ ‘ఈశ్వర్, డార్లింగ్’, ధనుష్ ‘త్రీ’ వంటి సినిమాలు రీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఆ విశేషాల్లోకి...మొక్కే కదా అని... ‘వీరశంకర్ రెడ్డి... మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’, ‘షౌకత్ అలీఖాన్... తప్పు నావైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నా... లేకుంటే తలలు తీసుకెళ్లేవాణ్ణి’, ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది... ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’.. వంటి డైలాగులు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చెబుతుంటే అభిమానుల, ప్రేక్షకుల ఈలలు, కేకలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘ఇంద్ర’. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా చిరంజీవి బర్త్ డే కానుకగా 2002 జూలై 22న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి మణిశర్మ సంగీతం, పాటలకు తగ్గట్టు చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఇంద్ర’ విడుదలైన 22 ఏళ్లకు సరిగ్గా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని మళ్లీ విడుదల చేశారు మేకర్స్. రీ రిలీజ్లోనూ థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ప్రత్యేకించి పాటల సమయంలో స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్సులు వేస్తున్నారు. 22 ఏళ్లకు రీ రిలీజైన ‘ఇంద్ర’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతుండటం విశేషం. సైకిల్ చైన్‌తో... నాగార్జున నటించిన చిత్రాల్లో రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ వెండితెర పైకి రానున్నాయి. ఒకటి ‘శివ’, మరోటి ‘మాస్’. సైకిల్ చైన్ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ద్వారా రామ్‌గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 35 ఏళ్లకి ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘శివ’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే.. మరోసారి సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించేందుకు రానున్నాడు శివ. మమ్మమ్మాస్ ‘వచ్చే నెల ఒకటో తారీఖుకి నువ్వు ఉండవ్.. పదిహేనో తారీఖుకి నీకు భయమంటే ఏంటో తెలుస్తుంది.. ఇరవయ్యో తారీఖుకి నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది.. ఇరవైఅయిదో తారీఖుకి పబ్లిక్‌కి నువ్వంటే భయం పోతుంది.. ఒకటో తారీఖు నువ్వు ఫినిష్’ అంటూ తనదైన స్టైల్లో నాగార్జున చెప్పిన డైలాగ్స్ ‘మాస్’ చిత్రంలోనివి. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మాస్’. ఈ మూవీలో జ్యోతిక, ఛార్మీ కౌర్ హీరోయిన్లు. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా 2004 డిసెంబరు 23న విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా దాదాపు 20 ఏళ్లకు మమ్మమ్మాస్ అంటూ ‘మాస్’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 28న ‘మాస్’ సినిమాని రీ రిలీజ్ చేస్తోంది యూనిట్. తిక్క చూపిస్తా... ‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది... నా తిక్కేంటో చూపిస్తా... అందరి లెక్కలు తేలుస్తా’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘దబాంగ్’కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ సినిమా 2012 మే 11న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. కాగా 12 ఏళ్ల తర్వాత ‘గబ్బర్ సింగ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.ధూల్‌పేట్ ఈశ్వర్ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఒకటి... ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’. మరోటి ‘డార్లింగ్’. నటుడు కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి చిత్రం ‘ఈశ్వర్’. ఈ మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్గా నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ తన మాస్ హీరోయిజమ్‌ను చూపించారు. కె. అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న విడుదలై, ఘన విజయం సాధించింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ చిత్ర విజయానికి ప్లస్ అయింది. దాదాపు 22 ఏళ్లకు మరోసారి ‘ఈశ్వర్’ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఈశ్వర్’ని రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. లవర్ బాయ్ డార్లింగ్ ప్రభాస్ లోని లవర్ బాయ్‌ని చక్కగా తెరపై చూపించిన చిత్రం ‘డార్లింగ్’. ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ 23న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రత్యేకించి ప్రభాస్–కాజల్ ఒకరినొకరు ఆట పట్టించుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పద్నాలుగేళ్ల తర్వాత ‘డార్లింగ్’ మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డేని పురస్కరించుకుని ‘డార్లింగ్’ని రిలీజ్ చేస్తున్నారు. సో.. తన బర్త్‌డే సందర్భంగా ‘ఈశ్వర్, డార్లింగ్’ సినిమాలతో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు ప్రభాస్. మళ్లీ కొలవెరి ధనుష్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘3’. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. కస్తూరి రాజా విజయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2012 మార్చి 30న రిలీజై హిట్‌గా నిలిచింది. రామ్‌గా ధనుష్, జననిగా శ్రుతీహాసన్‌ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రత్యేకించి టీనేజ్ ప్రేమికుడిగా, మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ధనుష్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి’ పాట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా పన్నెండేళ్ల తర్వాత ‘త్రీ’ని మరోసారి పాన్ ఇండియా స్థాయిలో రీ రిలీజ్ చేయనుంది యూనిట్. సెప్టెంబర్ 14న రిలీజ్ చేయనున్నారని టాక్. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్ కానున్నా యని టాక్. -
శంకర్ దాదా వస్తున్నాడు
శంకర్ దాదాగా చిరంజీవి మరోసారి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. ఆయన హీరోగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ (2004). ఈ సినిమాలో సోనాలీ బింద్రే హీరోయిన్గా నటించగా, శ్రీకాంత్ ఏటీఎం పాత్రలో సందడి చేశారు. కామెడీ అండ్ ఎమోషనల్ మూవీగా రూపొందిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జేఆర్కే పిక్చర్స్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తోంది. ‘‘సంజయ్ దత్ హీరోగా నటించిన హిందీ మూవీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’కి తెలుగు రీమేక్‌గా రూపొందిన చిత్రం ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు చిరంజీవి. అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో కూడా అందరి మనసుని హత్తుకునేలా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఈ నెల 22న ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని జేఆర్కే పిక్చర్స్ ప్రతినిధులు తెలిపారు. -
అమెరికాలో మురారి రీ-రిలీజ్
-
ఆ పిచ్చి మన వాళ్లకే ఉంది: రవితేజ
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అన్ని వారి వారి బర్త్‌డే సందర్భంగా మళ్లీ థీయేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఆ సినిమాలు విడుదలైనప్పుడు రానన్ని కలెక్షన్స్ రీరిలీజ్ టైమ్‌లో వస్తున్నాయంటే.. పాత సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో తెలుసుకోవచ్చు. తాజాగా మహేశ్ బాబు మురారి సినిమా ఆయన బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 9న రీరిలీజై దాదాపు 7.32 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టి చరిత్ర సృష్టించింది. అయితే పాత సినిమాలు మళ్లీ థియేటర్స్‌లోకి వచ్చి భారీగా కలెక్షన్స్ రాబట్టడం ఆశ్యర్యానికి గురి చేస్తుందని అంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రీరిలీజ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రీరిలీజ్ ట్రెండ్ మన(టాలీవుడ్) దగ్గరే ఉంది. నిజంగా మన ప్రేక్షకులను దేవుళ్లు అనొచ్చు. వాళ్లు సినిమాను ఎంతలా ప్రేమిస్తారో ఈ రీరిలీజ్ కలెక్షన్స్‌ని చూస్తే అర్థమవుతుంది. ఒక పాత సినిమాను మార్నింగ్ 6.30 థియేటర్స్‌కి వెళ్లి చూడడం ఆశ్యర్యంగా అనిపిస్తుంది. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయితే ఉదయం 7 గంటలకు వెళ్లి చూసేవాళ్లం. అవి కొత్త సినిమాలు కాబట్టి అంత మార్నింగ్ వెళ్లేవాళం. కానీ ఇప్పటి ప్రేక్షకులు ఉదయం 5 గంటలకే వెళ్లి చూస్తున్నారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్. ఇలాంటి పిచ్చి మనవాళ్లకు తప్ప ఎక్కడా లేదు’ అని రవితేజ అన్నారు. ఇక నీకు ఏ సినిమా రీరిలీజ్ కావాలని ఉంది అని యాంకర్ అడగ్గా.. అమితాబ్ బచ్చన్ ‘షోలే’ అని రవితేజ బదులిచ్చాడు. కాగా, గతంలో రవితేజ ‘విక్రమార్కుడు’, ‘వెంకీ’ సినిమాలు కూడా రీరిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి. -
మురారి రిరిలీజ్.. దద్దరిల్లిన థియేటర్స్..
-
థియేటర్లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్!
తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ గత ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. మహేశ్, పవన్ పాత సినిమాల్ని థియేటర్లో మళ్లీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా దాదాపు అందరి హీరోల పాత మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా మహేశ్ 'మురారి'కి ఎక్కడలేనంత హైప్ వచ్చింది.(ఇదీ చదవండి: యాంకర్ అనసూయ 'సింబా' సినిమా రివ్యూ)హైదరాబాద్‌లోని కూకట్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఓ థియేటర్లో అయితే ఓ అభిమాని నిజంగానే తాళిబొట్టు కట్టి పెళ్లి చేసుకున్నాడు. మరో అభిమాని ఏకంగా అక్షతలు పంచుతూ వైరల్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: దైవం మహేష్ రూపేణ.. వారి కోసం 'మహేశ్' ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా..?)Nijam ga pelli cheskunaru🤣🔥 #Murari4K pic.twitter.com/kRABlUVBWM— VardhanDHFM (@_VardhanDHFM_) August 9, 2024Brahmaramba lo akshinthalu panchuthunnaru 😭#Murari4K @urstrulyMahesh pic.twitter.com/UcG6WE2QAS— 28 (@898SAG) August 9, 2024Theaters ❎ Marriage Functions ✅#Murari4K #MaheshBabu𓃵 pic.twitter.com/kcquN8Njxr— Addicted To Memes (@Addictedtomemez) August 9, 2024Kukatpally Mass 🔥 #Murari4K pic.twitter.com/VlOMbTNvGQ— ʌınɐʎ (@CoolestVinaay) August 9, 2024 -
మళ్లీ ఎటో వెళ్లిపోయింది మనసు...
ప్రేమకథలను ఇష్టపడే వారి జాబితాలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ (2012) సినిమా కూడా ఉంటుంది. నాని, సమంత లీడ్ రోల్స్‌లో నటించగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రేష్మా, ఎస్. వెంకట్, సి. కల్యాణ్, సీవీ రావు నిర్మించిన ఈ సినిమాకు ఇళయరాజా అందించిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కాగా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా రీ రిలీజ్ కానుంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ ఆగస్టు 2న ఈ సినిమాను మళ్లీ విడుదల చేయనున్నారు. ‘‘ప్రస్తుతం తెలుగులో రీ–రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ సినిమా మళ్లీ ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు నిర్మాతలు. -
రీరిలీజ్.. టాలీవుడ్లో ఇప్పుడిదే ట్రెండ్!
రీరిలీజ్ అనేది ఇప్పుడు టాలీవుడ్లో ట్రెండింగ్‌గా మారింది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ మూవీస్ వరుసగా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. అభిమానుల డిమాండ్ మేరకు నచ్చిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. టెక్నాలజీ వాడుకొని అత్యంత నాణ్యమైన 4కేలో సినిమాను రిలీజ్ చేస్తుండడంతో అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆయా చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో చూసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్లో స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు కొన్ని రీరిలీజ్ అయి మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఇప్పుడు వరుసగా నాలుగు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. అవేంటో చూసేయండి.దర్శకధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘విక్రమార్కుడు’. 2006లో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మూవీ థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. జులై 27న ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.మహేశ్‌బాబు హీరోగా, కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘మురారి’. 2001లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. మహేశ్‌ని ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరకు చేసిన చిత్రమిది. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం రిలీజ్ కానుంది. మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని 4కే వెర్షన్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘శివ’ కూడా రీరిలీజ్‌కు రెడీ అవుతోంది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ... అక్టోబర్ 5, 1989లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ గతినే మార్చేసింది. ఈ తరం అక్కినేని అభిమానుల కోసం ఈ చిత్రం మరోసారి థియేటర్లో సందడి చేయనుంది. నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమల, శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్లభరణి తదితరులు నటించారు.ప్రేమ కథలకు పెట్టింది పేరు గౌతమ్ మీనన్. ఆయన తెరకెక్కించిన క్యూట్ లవ్ స్టోరీ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. నాని-సమంత జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2012 డిసెంబర్ 14 విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. -
రీరిలీజ్‌కి రెడీ అయిన సమంత సినిమా!
టాలీవుడ్లో ఇప్పుడు రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోహీరోయిన్ల హిట్ సినిమాలను మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీరిలీజ్ అయి..మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక ఇప్పుడు సమంత నటించిన ఓ సినిమా కూడా రీరిలీజ్ కాబోతుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత, నాని జంటగా నటించిన చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ఇళయరాజా అందించిన మెలోడీ గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాయి. మళ్లీ ఈ చిత్రాన్ని వీక్షించి నాటి రోజుల్లోకి వెళ్లేందుకు ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. -
జీవితంలో ఏ సినిమాను మర్చిపోలేను: ఉపేంద్ర
ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఉపేంద్ర సరసన చాందిని నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ కానుంది.ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో నేను మర్చిపోలేని సినిమా ‘ఏ’. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి, ఈ తరం ప్రేక్షకులు షాక్ అవుతారు’’ అన్నారు. ‘‘ఛత్రపతి, యోగి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రీ రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘ఏ’ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు చందు ఎంటర్టైన్మెంట్ స్థాపకుడు లింగం యాదవ్. ‘‘ఏ’ రిలీజ్ ప్రమోషన్స్ కోసం ఓ చిన్న వీడియో కావాలని ఉపేంద్రగారిని అడిగితే, స్వయంగా హైదరాబాద్ వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తానని చెప్పి ఆశ్చర్యపరిచారు’’ అన్నారు నిర్మాత సైదులు. -
స్క్రీన్‌పై సమంతతో రొమాంటిక్ సీన్స్.. చైతూ రియాక్షన్ ఏంటంటే?
నాగచైతన్య-సమంత.. టాలీవుడ్లో ఈ జోడీకి స్పెషల్ క్రేజ్ ఉంది. కలిసి కెరీర్ మొదలుపెట్టిన వీళ్లిద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ ఏమైందో ఏమో గానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి కెరీర్ పరంగా వాళ్లు బిజీ అయిపోయారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరి గురించి మాట్లాడుకునేలా చేశారు. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ-సమంత.. జంటగా నాలుగు సినిమాలు చేశారు. వీటిలో అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన 'మనం'లో భార్యభర్తలుగా నటించారు. తాజాగా ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని దేవి థియేటర్లో గురువారం సాయంత్రం షో వేయగా.. అక్కినేని ఫ్యామిలీకి చెందిన చైతూ, సుప్రిత తదితరులు హాజరయ్యారు.ఇక ఈ సినిమాలో తాతతో ఉన్న సీన్స్ చూస్తూ ఎమోషనల్ అయిన చైతూ.. సమంతతో రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు. కానీ థియేటర్లో ఉన్న ఫ్యాన్స్ మాత్రం అరిచి గోల గోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: చరణ్-తారక్‌పై మనసు పారేసుకున్న హాలీవుడ్ భామ.. ఏం చెప్పిందంటే?)#NagaChaitanya reaction for #ChaySam Pelli Scene at #Manam Re Release 💖🔥🔥@Samanthaprabhu2 @chay_akkineni #ManamReRelease#NagaChaitanya#Samantha pic.twitter.com/KYRzcMdbyt— Ungamma (@ShittyWriters) May 23, 2024 -
‘మనం’ రీరిలీజ్.. అనూప్ రూబెన్స్ మ్యూజికల్ వీడియో వైరల్
అక్కినేని హీరోల సీనీ కెరీర్లో ‘మనం’ చాలా ప్రత్యేకమైన మూవీ. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన ఈ చిత్రం 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో అనుప్ రూబెన్స్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచాయి. ఎక్కడ చూసిన ‘మనం’ పాటలే వినిపించేవి. ఆ మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంటాయి. ‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. నేడు(మే 23)సాయంత్రం హైద్రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవీ థియేటర్లో మనం రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మనం’ మ్యూజికల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మనం వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా అనూప్ ఈ వీడియోను రిలీజ్ చేశాడు. అనూప్ కీ బోర్డు మీద వాయించిన ట్యూన్స్ మళ్లీ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాయి.అనూప్ ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తీస్తోన్న పాన్ ఇండియా మూవీకి, గౌరీ రోనంకి తీస్తోన్న చిత్రానికి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. అంతే కాక సుమంత్ హీరోగా సంతోష్ తెరకెక్కిస్తున్న సినిమాకు, సక్సెస్ ఫుల్ కాంబో అయిన ఆది సాయి కుమార్‌తో కృష్ణ ఫ్రమ్ బృందావనం సినిమాకు, విజయ్ కొండ, ఆకాష్ పూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న హిట్ సినిమా.. అదేంటంటే?
గత కొన్నాళ్ల నుంచి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాలు సరిగా ఆడకపోయేసరికి హిట్ చిత్రాల్ని మళ్లీ థియేటర్లకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో 'అపరిచితుడు' చేరింది. విక్రమ్, సదా జంటగా నటించిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. విక్రమ్‌ను మూడు ఢిఫరెంట్ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్ చూపించారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా తెరకెక్కించారు.(ఇదీ చదవండి: అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్)2005లో తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా స్ట్రెయిట్ మూవీలానే విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్ దర్శకత్వం, నటుడు విక్రమ్ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. మల్టీపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ కారణంగా మామూలు మనిషి సూపర్ హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా చాలదు.ఇకపోతే ఫ్రెంచ్ భాషలోకి డబ్ అయిన తొలి ఇండియన్ చిత్రం అపరిచితుడు కావడం విశేషం. అలాంటి ఈ సినిమాని ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులు కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్) -
రీరిలీజ్‌కు రెడీ అయిన అపరిచితుడు.. ఏకంగా 700 థియేటర్స్‌లో!
తమిళసినిమా: ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో రీ రిలీజ్‌ల కాలం నడుస్తోందనే చెప్పాలి. కొత్త చిత్రాలు ఆశించిన ప్రేక్షకాదరణ పొందకపోవడంతో రీ రిలీజ్ చిత్రాలే థియేటర్లను కాపాడుతున్నాయి. ఆ జాబితా లో అపరిచితుడు చిత్రం చేరుతోంది. నటుడు విక్రమ్, సదా జంటగా నటించిన తమిళ చిత్రం అన్నియన్ చిత్రానికి తెలుగు అనువాదం అపరిచితుడు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ సృష్టి ఈ చిత్రం. నటుడు విక్రమ్‌ను మూడు ఢిఫరెంట్ షేడ్స్‌లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్ చూపించారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా తెరకెక్కించిన అపరిచితుడు చిత్రం 2005లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా ఒక భారీ నేరు చిత్రంలా విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్ దర్శకత్వం, నటుడు విక్రమ్ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్లో రూపొందిన అపరిచితుడు చిత్ర క్లైమ్యాక్స్ సన్నివేశాల కోసమే 120 కెమెరాలతో 270 డిగ్రీల రొటేషన్ ఫొటోగ్రఫీ టెక్నిక్‌తో చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఇదే టెక్నాలజీతో రూపొందిన హాలీవుడ్ చిత్రం మ్యాట్రిక్స్ కంటే అపరిచితుడు చిత్రాన్ని శంకర్ బ్రహ్మండంగా తెరకెక్కించారు. దాదాపు 200 మంది స్టంట్ కళాకారులతో చిత్రీకరించిన ఫైట్ దృశ్యాలను చూస్తుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తోంది. నెదర్లాండ్‌లోని పుష్పాల ఎగ్జిబిషన్లో చిత్రీకరించిన ఇందులోని పాట మరో హైలెట్. మల్టీపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ కారణంగా మామూలు మనిషి సూపర్‌హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా చాలదు. అదేవిధంగా ఫ్రెంచ్ భాషలోకి అనువాదం అయిన తొలి ఇండియన్ చిత్రం అపరిచితుడు. కాగా అలాంటి అపరిచితుడు చిత్రం ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. -
ప్రభుదేవా హిట్ సినిమా 'ప్రేమికుడు' రీ-రిలీజ్
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ- రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా సాంగ్స్ ఉన్నాయి. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నిర్మాత మురళీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్‌కు అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు. -
మమ్మీ తిరిగొస్తోంది
హాలీవుడ్ హారర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది మమ్మీ’ రీ రిలీజ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. స్టీఫెన్ సోమర్స్ దర్శకత్వంలో 1999లో విడుదలైన ‘ది మమ్మీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ యాక్షన్ అడ్వెంచరస్ హారర్ ఫిల్మ్‌లో బ్రెండెన్ ఫ్రేజర్, రాచెల్ వీజ్, జాన్ హాన్యా, ఆర్నాల్డ్ వోస్లూ, జోనాథన్ హైడ్ లీడ్ రోల్స్‌లో నటించారు. జేమ్స్ జాక్స్, సీన్ డేనియల్ నిర్మించిన ‘ది మమ్మీ’ సినిమాను 1999 మే 7న యూనివర్సల్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఈ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంగా ఏప్రిల్ 26న థియేటర్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నట్లుగా యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. -
మళ్లీ హ్యాపీ డేస్
కాలేజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల్లో ‘హ్యాపీ డేస్’ (2007) ఓ ట్రెండ్ సెట్టర్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్‌ఫుల్ చిత్రం విడుదలై పదిహేడేళ్లయింది. వరుణ్ సందేశ్, తమన్నా భాటియా, నిఖిల్ సిద్ధార్థ్ తదితరుల కాంబినేషన్లో అమిగోస్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో మంచి వసూళ్లతో సంచలన విజయం సాధించింది. శేఖర్ కమ్ముల టేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్, మిక్కీ జే మేయర్ సంగీతం, విజయ్ సి. కుమార్ కెమెరా పనితనం అన్నీ అద్భుతంగా కుదిరిన ఈ చిత్రం ఇప్పుడు మళ్లీ విడుదల కానుంది. ఏప్రిల్ 12న ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ సినిమాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రీరిలీజ్‌కు రెడీ అవుతోన్న సూపర్ హిట్ లవ్ స్టోరీ
ప్రేక్షక్షుల ముందుకు మరోసారి వచ్చేందుకు ప్రేమికుడు సిద్ధం అవుతున్నాడు. ప్రభుదేవా హీరోగా, నగ్మా హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘ప్రేమికుడు’(తమిళంలో ‘కాదలన్’). శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘ముక్కాలా ముక్కాబులా’, ‘ఊర్వశి ఊర్వశి’, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’, ‘అందమైన ప్రేమరాణి’.. వంటి పాటలన్నీ యువతను ఉర్రూతలూగించాయి. క్లాసిక్ హిట్‌గా రూపొందిన ‘ప్రేమికుడు’ తెలుగులో రీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తెలుగు రీ రిలీజ్ హక్కులను నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ దక్కించుకున్నారు. సీఎల్ఎన్ మీడియా ద్వారా త్వరలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. -
మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్లో హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకడు. లవ్ స్టోరీలతో చాలా తక్కువ టైమ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన ఇతడు.. ఆ తర్వాత సరైన ఛాన్సుల్లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతడి పుట్టినరోజు లేదా వర్థంతి సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి జనరేషన్ కోసం ఉదయ్ కిరణ్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఇతడి కల్ట్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా?) ఉదయ్ కిరణ్, అనిత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'నువ్వు నేను'. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సునీల్ కామెడీ టైమింగ్, ఆర్పీ పట్నాయక్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రచ్చ లేపాయని చెప్పొచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా 2001 ఆగస్టు 10న రిలీజైంది. తొలి ఆట నుంచే సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పట్లో అద్భతమైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాని తిరిగి థియేటర్లలో ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. ఈ మార్చి 21న బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఒకవేళ ఉదయ్ కిరణ్ స్క్రీన్ మ్యాజిక్ చూడాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కాకండి. (ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు) -
ఉపేంద్ర కల్ట్ సినిమా రీరిలీజ్.. కోటి బడ్జెట్‌తో విడుదల చేస్తే..
కన్నడ చరిత్రలో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మూవీ 'A'.. ఇప్పుడు ఈ కల్ట్ సినిమా రీరిలీజ్ చేసేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉపేంద్ర, చాందినీ జోడిగా నటించిన ఈ సినిమా 1998లో విడుదలైంది. మొదట కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. కేవలం కోటిన్నర రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్లు రాబట్టి అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఉపేంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చింది కూడా 'A' మూవీతోనే.. దీనికి కథ, డైరెక్షన్ కూడా ఆయనే అందించడం విశేషం. ఇండియన్ సినిమా చరిత్రలో రివర్స్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఏకైక సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అందుకే ఈ కథను చూసి అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులను అనేకసార్లు చూసేలా చేసింది. చిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ వంటి చీకటి నిజాల గురించి ఓపెన్‌గానే 25 ఏళ్ల క్రితమే ఉపేంద్ర ఈ చిత్రం ద్వారా చెప్పాడు. చలనచిత్ర దర్శకుడు, హీరోయిన్ పాత్రల మధ్య జరిగే ప్రేమకథ చుట్టూ కథ తిరుగుతుంది. త్వరలో ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వీదుల్లో ఉపేంద్ర నడుచుకుంటూ దురభిమానంతో హీరోయిన్ వెంటపడిన సీన్ ఇప్పటికీ అనేకసార్లు యూట్యూబ్‌లలో చూసే ఉంటారు. రియల్ సంఘటనను ఆధారం చేసుకుని ఆ సీన్ తీసినట్లు ఉపేంద్ర చెప్పాడు. ఈ సినిమాలో మితిమీరిన అడల్ట్ సీన్స్,డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ దెబ్బ గట్టిగానే పడింది. అన్నీ కట్స్ పోను కేవలం 20 నిమిషాల నిడివి మాత్రమే మిగిలింది. దీంతో మళ్లీ కొన్ని సీన్స్‌లలో మార్పులు చేసి సినిమాను విడుదల చేశారు.. సీన్స్‌లలో మార్పులు చేసి విడుదల చేస్తేనే అంత వైలెంట్‌గా ఉన్నాయి.. అదే ఎలాంటి కట్స్ లేకుండా విడుదల చేసి ఉంటే ... ఎలా ఉండేదో సినిమా చూసిన వారి ఊహలకే వదిలేయాలి. క్లైమాక్స్‌ను కాస్త తికమకగా ఉన్నా సినిమా కాన్సెప్ట్ మాత్రం అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 25 ఏళ్లు దాటింది. ఇప్పుడు 'A' మూవీని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర తర్వాత శివరాజ్‌కుమార్‌తో ఓం సినిమాను తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా కూడా ఇప్పటి వరకు 550 సార్లు రీరిలీజ్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపేంద్ర డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఆయన డైరెక్షన్‌కు పెద్ద ఫ్యాన్‌ను అంటూ ఆయన చెప్పడం విశేషం.