శంకర్‌ దాదా వస్తున్నాడు | Chiranjeevi Shankar Dada MBBS Rereleasing In Theatres | Sakshi
Sakshi News home page

శంకర్‌ దాదా వస్తున్నాడు

Published Fri, Aug 16 2024 3:32 AM | Last Updated on Fri, Aug 16 2024 6:44 AM

Chiranjeevi Shankar Dada MBBS Rereleasing In Theatres

శంకర్‌ దాదాగా చిరంజీవి మరోసారి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి వస్తున్నారు. ఆయన హీరోగా జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ (2004). ఈ సినిమాలో సోనాలీ బింద్రే హీరోయిన్‌గా నటించగా, శ్రీకాంత్‌ ఏటీఎం పాత్రలో సందడి చేశారు. కామెడీ అండ్‌ ఎమోషనల్‌ మూవీగా రూపొందిన ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జేఆర్‌కే పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తోంది. ‘‘సంజయ్‌ దత్‌ హీరోగా నటించిన హిందీ మూవీ ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’కి తెలుగు రీమేక్‌గా రూపొందిన చిత్రం ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు చిరంజీవి. అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో కూడా అందరి మనసుని హత్తుకునేలా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఈ నెల 22న ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని జేఆర్‌కే పిక్చర్స్‌ ప్రతినిధులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement