చిరంజీవి హిట్‌ సినిమా.. 28 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌ | Chiranjeevi Hitler Movie To Re-Release After 28 Years | Sakshi
Sakshi News home page

చిరంజీవి హిట్‌ సినిమా.. 28 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌

Published Wed, Dec 25 2024 5:44 PM | Last Updated on Wed, Dec 25 2024 5:58 PM

Chiranjeevi Hitler Movie To Re-Release After 28 Years

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో సూపర్‌ హిట్‌ సినిమా హిట్లర్‌ రీరిలీజ్‌ కానుంది.  1997లో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలైంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రంభ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో  రాజేంద్ర ప్రసాద్, దాసరి నారాయణ రావు, రామిరెడ్డి కీలకపాత్రలు పోషించారు. సుమారు 28 ఏళ్ల తర్వాత హిట్లర్‌ సినిమా రీరిలీజ్‌ కానున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు నటన హిట్లర్‌ చిత్రంలో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి కోటీ అందించిన సంగీతం చాలా హిట్‌ అయింది. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ ఈ చిత్రానికి డైలాగ్స్‌ అందించడం విశేషం. 42 సెంటర్స్‌లలో హిట్లర్‌ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. చిరు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ సినిమా జనవరి 1న రీరిలీజ్‌ కానుంది. 

'అంతొద్దు - ఇది చాలు' అన్న డైలాగు ఈ చిత్రం నుంచే ట్రెండ్‌ అయింది. ఇన్నేళ్లు అయినా ఈ డైలాగ్‌ మీమ్స్‌ రూపంలో ఇప్పటికీ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. 'నడక కలిసిన నవరాత్రి' అనే పాటకు చాలామంది అభిమానులు ఉన్నారు. అప్పట్లో ఆ సాంగ్‌ సూపర్‌ హిట్‌. ఇందులో 'అబీబీ.. అబీబీ.. అంటూ సాగే  పాటకు చిరు ఎవర్‌గ్రీన్‌ స్టెప్‌ వేశారు. దీనికి లారెన్స్‌ నృత్యాలు సమకూర్చారు.

చిరు సినిమాను రెండుసార్లు రిజెక్ట్ చేసిన ఇంద్రజ
'యమలీల' సినిమా హిట్‌తో మంచి క్రేజ్‌లో ఉన్న నటి ఇంద్రజకు చిరుతో నటించే ఛాన్స్‌ వచ్చింది. అయితే, దానిని ఆమె కాదనుకుంది. మొదట అల్లుడా మజాకా సినిమాలో మెగాస్టార్‌కు చెల్లిగా ఇంద్రజను అనుకున్నారు. కానీ, ఆమె నటించకపోవడంతో ఆ ఛాన్స్‌ నటి ఊహ దక్కించుకుంది. అలాగే హిట్లర్‌ సినిమాలో కూడా  చిరు పక్కన మళ్లీ సోదరిగా నటించే అవకాశం దక్కింది. అప్పుడు కూడా తనకు డేట్స్‌ వీలు కాకపోవడంతో నో చెప్పింది. అలా రెంసార్లు చిరంజీవి ప్రాజెక్ట్‌లను ఆమె‌ తిరస్కరించింది. అయితే,  ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అసలు విషయం చెప్పింది. చిరు చెల్లిగా నటిస్తే ఆయనతో డ్యాన్స్‌ చేసే అవకాశం ఉండదని భావించి ఆ చిత్రాలను తిరస్కరించానని ఆమె పేర్కొంది. తాను చిరుకు అభిమానినని ఆయనతో కలిసి ఒక పాటకు అయినా డ్యాన్స్‌ చేయాలనేది తన కోరిక అని ఆమె పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement