Hitler
-
‘హిట్లర్’ చేతే శెభాష్ అనిపించుకుని..
అత్యంత స్వల్పకాలంలో రాజకీయ పదవీ నిచ్చెనను చకచకా ఎక్కేసి ఉపాధ్యక్షుడిగా అవతరించిన జేడీ వాన్స్ ప్రస్థానం ఆసక్తికరం. ఒకప్పుడు ట్రంప్‌ను హిట్లర్ అంటూ బహిరంగంగా విమర్శించిన వాన్స్‌ను ఇప్పుడు అదే ట్రంప్ పిలిచి మరీ తనకు సహసారథిగా ఎంపికచేయడం విశేషం. ఓహియో నుంచి సెనేటర్‌గా ఉన్న వాన్స్ ఉపాధ్యక్ష పీఠంపై కూర్చుంటున్న అతిపిన్నవయసు్కల్లో ఒకరిగా, అత్యల్ప పాలనాఅనుభవం ఉన్న నేతగా రికార్డ్ సృష్టించారు. గతంలో తన జీవితంలో చూసిన సంఘటనల సమాహారంగా 2016లో రాసిన ‘హిల్బెల్లీ ఎలిగే’పుస్తకం విశేష ఆదరణ పొందటంతో వాన్స్ పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ రచనను తర్వాత సినిమాగా తీశారు. ⇒ జేడీ వాన్స్ పూర్తిపేరు జేమ్స్ డొనాల్డ్ బౌమాన్ ⇒ స్కాచ్–ఐరిష్ మూలాలున్న వాన్స్ 1984 ఆగస్ట్ రెండో తేదీన ఓహియోలోని మిడిల్‌టౌన్‌లో జన్మించారు. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అమ్మమ్మ, తాతయ్య పెంచి పెద్దచేశారు. అందుకే తండ్రి వారసత్వంగా వచి్చన బౌమాన్ పేరును తీసేసుకుని అమ్మమ్మ వాన్స్ పేరును తగిలించుకున్నారు. ⇒ పేదరికం కారణంగా 17 ఏళ్ల వయసులో ఒక సరకుల దుకాణంలో క్యాషియర్‌గా పనిచేశాడు. 2003లో అమెరికా మెరైన్ కార్ప్స్లో చేరి మిలటరీ జర్నలిస్ట్‌గా పనిచేశాడు. 2005లో ఇరాక్‌లో అమెరికా సైన్యం సహాయక విభాగంలో పనిచేశారు. ⇒ ఓహియో వర్సిటీలో చదువుకున్నారు. యేల్ వర్సిటీలో లా పూర్తిచేసి కొంతకాలం న్యాయవాదిగా న్యాయసేవల సంస్థలో పనిచేశారు. తర్వాత ఒక జడ్జి వద్ద లా క్లర్క్‌గా కొనసాగారు. తర్వాత టెక్నాలజీ రంగంలో వెంచర్ క్యాపిటలిస్ట్ అవతారమెత్తారు. తర్వాత న్యాయసేవల సంస్థనూ స్థాపించారు. ⇒ తొలిసారిగా షెరాడ్ బ్రౌన్పై సెనేట్ ఎన్నికల్లో పోటీకి ప్రయతి్నంచినా కుదర్లేదు. 2016లో ట్రంప్‌ను ‘అమెరికా హిట్లర్’అని సంబోధించి పలు విమర్శలు చేశారు. తర్వాత ట్రంప్‌కు సారీ కూడా చెప్పారు. తర్వాత 2021లో రాజకీయాల్లోకి వచ్చారు. ⇒ 2022లో సెనేట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి టిమ్ రేయాన్‌ను ఓడించి తొలిసారిగా ఓహియో సెనేటర్ అయ్యారు. తర్వాత ట్రంప్‌కు విధేయునిగా మారారు. దీంతో తన రన్నింగ్మేట్గా వాన్స్‌ను ట్రంప్ ఎన్నుకున్నారు. ⇒ మొదట్లో ట్రంప్ కంటే ముందు వాన్స్‌కే అధ్యక్ష అభ్యరి్థత్వం విషయంలో మద్దతు పలకాలని వ్యాపారవేత్తలు ఎలాన్ మస్‌్క, డేవిడ్ ఓ సాక్స్‌లు భావించారని గతంలో వార్తలొచ్చాయి. యేల్ వర్సిటీలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన ఉషను పెళ్లాడారు. ⇒ శ్వేతజాతి కార్మికుల సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడే వాన్స్ విదేశాంగ విధానంలో చైనాకు బద్ద వ్యతిరేకిగా పేరుంది. ట్రంప్ పేరులోనూ వాన్స్ పేరులోనూ డొనాల్డ్ అనే పేరు ఉండటం గమనార్హం. – వాషింగ్టన్ -
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు
దీపావళిని దేశవ్యాప్తంగా అందరూ గ్రాండ్‌గా జరుపుకొన్నారు. పండగ రోజే తెలుగు, డబ్బింగ్ మూవీస్ కలిపి నాలుగు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. అన్నింటికీ పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు వీకెండ్ వచ్చేసింది. ఇందుకు తగ్గట్లే ఓటీటీల్లోకి కూడా క్రేజీ మూవీస్ వచ్చేశాయి. శుక్రవారం ఒక్కరోజే 15 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఆగస్టులో పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే విశ్వం, కలి అనే తెలుగు చిత్రాలతో పాటు హిట్లర్, లబ్బర్ పందు అనే డబ్బింగ్ మూవీస్.. యుధ్రా అనే హిందీ చిత్రం ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు 'తంగలాన్' కూడా నెట్‌ఫ్లిక్స్‌లో దీపావళికి రిలీజ్ అవుతుందని నిర్మాత చెప్పారు. కానీ ఇందులో కాకుండా ఆస్ట్రో మూవీస్ అనే మరో ఓటీటీలో కేవలం తమిళ వెర్షన్ మాత్రమే వచ్చింది. అది కూడా భారత్‌లో స్ట్రీమింగ్ కావట్లేదు.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (నవంబర్ 1st)అమెజాన్ ప్రైమ్విశ్వం - తెలుగు సినిమాసూరజ్ సూదేశ్ మూవీ - మలయాళ మూవీసత్తం ఎన్ కయిల్ - తమిళ సినిమాఇబ్బని తబ్బిడ ఇలయాలీ - కన్నడ మూవీబ్లాక్ - తమిళ సినిమాఫ్రీడమ్ - ఫ్రెంచ్ చిత్రంయుధ్రా - హిందీ సినిమా (రెంట్ విధానం)హిట్లర్ - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)నెట్ఫ్లిక్స్లెట్ గో - స్వీడిష్ సినిమాఇట్స్ ఆల్ ఓవర్ - స్పానిష్ సినిమాబార్బీ మిస్టరీస్ - ఇంగ్లీష్ సిరీస్హాట్స్టార్మ్యూజిక్ బై జాన్ విలియమ్స్ - ఇంగ్లీష్ సినిమాలబ్బర్ పందు - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)ఎక్స్‌ప్లోరర్: ఎండ్యురెన్స్ - ఇంగ్లీష్ మూవీ (నవంబర్ 3)ఆహాఅర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 - తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)కలి - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)జియో సినిమాదస్ జూన్ కి రాత్: చాప్టర్ 2 - హిందీ సిరీస్జీ5మిథ్య: ద డార్క్ చాప్టర్ - హిందీ సిరీస్ఆస్ట్రో మూవీస్తంగలాన్ - తమిళ మూవీఅంధగన్ - తమిళ సినిమా(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్
తెలుగు సినిమాల్లో నటులు లెక్కలేనంత మంది. ఎప్పటికప్పుడు కొత్తోళ్లు వస్తూనే ఉంటారు. పాత వాళ్లు కనుమరుగైపోతూనే ఉంటారు. కానీ కొందరు మాత్రం హిట్ సినిమాలు చేసినా సరే కొన్ని కారణాలతో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఈమె కూడా సేమ్ అలాంటి వ్యక్తే. అప్పట్లో ఎన్టీఆర్, చిరంజీవి పక్కన నటించింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? ఎవరో మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రేష్ఠ. అరె ఈ పేరు ఎప్పుడు వినలేదే ఎవరబ్బా అనుకుంటున్నారా? 80-90ల్లో తెలుగులో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టు బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. దాదాపు 100కి పైగా తెలుగు సినిమాల్లో బాలనటిగా చేసింది.(ఇదీ చదవండి: పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది?)'సమరసింహారెడ్డి' సినిమాలో హీరోకి నడవలేక ఇబ్బంది పడే చెల్లి ఉంటుంది. ఆ పాత్ర పోషించింది శ్రేష్ఠనే. ఇదే ఈమెకి చివరి మూవీ కూడా. దీని తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. బీటెక్, ఎమ్ టెక్, ఎమ్ఎస్ చేసి అమెరికాలో జాబ్ చేసింది. తర్వాత తిరిగి స్వదేశానికి తిరిగొచ్చేసింది. ప్రస్తుతం తండ్రికి చెందిన కన్స్ట్రక్షన్ వ్యవహారాలు చూసుకుంటోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈమెని చూసి చాలామంది షాకయ్యారు. ఎందుకంటే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది.ఇక ఈమె నటించిన సినిమాల విషయానికొస్తే.. సమర సింహారెడ్డి, రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, హిట్లర్ తదితర చిత్రాలున్నాయి. ఈమెకు మంచు మనోజ్‌తో కూడా పెళ్లి చేయాలని అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ప్రస్తుతానికైతే ఈమె సింగిల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఓ బాలనటి ఇలా చాన్నాళ్ల తర్వాత కనిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.(ఇదీ చదవండి: 'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?) -
మేఘాలయలో హిట్లర్‌ను అరెస్టు చేసిన కెన్నెడీ?
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి. మన దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా కొన్ని వింతలు కనిపిస్తూ ఉంటాయి. 2008 మేఘాలయ ఎన్నికల్లో ఇలాంటి ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది. నాడు కెన్నెడీతో పాటు హిట్లర్ పేరు వార్తాపత్రికల ముఖ్యాంశాల్లో కనిపించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ ఘటనను ‘ఎన్నికల కథనాలు’లో పంచుకుంది.2008లో మేఘాలయలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పత్రికల్లో ఒక షాకింగ్ న్యూస్ ప్రచురితమైంది. ‘జాన్ ఎఫ్ కెన్నెడీ స్వయంగా అడాల్ఫ్ హిట్లర్‌ను అరెస్టు చేశారు’ అనేది దాని హెడ్డింగ్. ఆ రెండు పేర్లకు చారిత్రక ప్రాధాన్యత ఉండటంతో ఈ వార్త దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నఅప్పటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి అడాల్ఫ్ లూ హిట్లర్ మారక్‌ను ఏదో కేసులో అక్కడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ ఎఫ్ కెన్నెడీ అరెస్టు చేశారు. మరుసటి రోజు వార్తాపత్రికల్లో ‘జాన్ ఎఫ్ కెన్నెడీ చేతుల మీదుగా అడాల్ఫ్ లూ హిట్లర్ అరెస్ట్’ అనే శీర్షికతో ఈ వార్తను ప్రచురించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. నాటి ఎన్నికల ఫలితాల్లో హిట్లర్ విజయం సాధించారు.లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఈ కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లొ పోస్ట్ చేసింది. గత ఏడాది అడాల్ఫ్ హిట్లర్ మారక్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కాగా జాన్ ఎఫ్ కెన్నెడీ అమెరికా 35వ అధ్యక్షుడు. అతను 1961 నుండి నవంబర్ 1963లో హత్యకు గురయ్యే వరకు ఈ పదవిలో కొనసాగారు. అదేవిధంగా అడాల్ఫ్ హిట్లర్ ఒకప్పటి జర్మనీ నియంత. ఆయన 1945లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. #Chunaviकिस्सेभारतीय चुनावों से जुड़े रोचक किस्से 🙌#ECI #ChunavKaParv #DeshKaGarv #Elections2024 pic.twitter.com/1o88yQB3B2— Election Commission of India (@ECISVEEP) March 18, 2024 -
హిట్లర్ అధికారం పదేళ్లకే ముగిసింది
లక్నో: 2014లో అధికారంలోకి వచ్చిన నాయకుడు 2024లో పదవి నుంచి దిగిపోతాడని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జర్మనీ నియంత హిట్లర్ కేవలం 10 సంత్సరాలే అధికారంలో ఉన్నాడని గుర్తుచేశారు. మన దేశంలోని నాయకుడు పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడని, ఇక ఆయన ఇంటికి వెళ్లే సమయం వచ్చేసిందని తేల్చిచెప్పారు. ఆ నాయకుడికి ఉత్తరప్రదేశ్ ప్రజలు ఘన స్వాగతం పలికారని, రెండు సార్లు గెలిపించారని, ఇప్పుడు అంతే ఘనంగా వీడ్కోలు చెబుతారని అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లను, మన ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడారు. -
‘కేజ్రీవాల్ ఒక అడాల్ఫ్ హిట్లర్’
చంఢీఘర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. ఇప్పటికే.. హర్యాణలోని చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని ఇటు ఆప్ నేత రాఘవ్ చద్దా.. అటు కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నేడు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేజ్రీవాల్ భేటీ కూడా అయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరమే పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. కేజ్రీవాల్ పాలన హిట్లర్ నియంత పాలన వలే ఉంటుందని మండిపడ్డారు. మొదట ఆప్ పార్టీ కార్యాలయాల్లో డా.బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్‌ల వంటి మహనీయుల ఫొటోలను తొలగించాలని.. వాటి స్థానంలో నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫొటోలు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. ఆప్ నేతలంగా అడాల్ఫ్ హిట్లర్ వలే ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంఢీఘర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆప్‌కు మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి అని కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవటం గమనార్హం. ఇక.. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రావొచ్చని ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. చదవండి: Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్ -
ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం!
‘ద గ్రేట్ డిక్టేటర్’ సినిమాలో చాప్లిన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి – హిట్లర్ పాత్ర (డిక్టేటర్) రెండు – హిట్లర్ పోలికలతో ఉన్న క్షురకుడి పాత్ర. వేల సంఖ్యలో సైనికులు బారులు తీరి ఉన్న సన్నివేశమది. వందల సంఖ్యలో మిలిట్రీ అధికారులు హిట్లర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మహాసభలో హిట్లర్ సైనికుల్ని ఉద్దేశించి మాట్లాడవలసి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి హిట్లర్ బదులు, అతని పోలికలతో ఉన్న క్షురకుడు చేరుకుంటాడు. అతనే హిట్లరనుకుని అధికారులు గౌరవ వందనం సమర్పించి అతణ్ణి వేదిక మీదికి తీసుకు వెళతారు. ఒక నిమిషం తడబడి ఆ తర్వాత – ఒక సామాన్యుడిగా తను కోరుకుంటున్నదేమిటో మాట్లాడతాడు. హిట్లర్‌ను ఎద్దేవా చేసే చార్లీ చాప్లిన్ తన అంత రంగాన్ని అతి సామాన్యుడైన క్షురకుడి పాత్ర ద్వారా ఈ విధంగా వ్యక్తం చేశాడు. ‘ద గ్రేట్ డిక్టేటర్’లోని ఉపన్యాసంముఖ్యాంశాలు ఇక్కడ మీకందిస్తున్నాను. ‘‘క్షమించాలి! నాకు చక్రవర్తిని కావాలని లేదు. అలాంటి ఉద్దేశమే లేదు. ఎవరినో జయించాలని కాని, ఎవరి మీదనో పెత్తనం చలాయించాలని కానీ నాకు లేదు. తెలుపు, నలుపు అన్న తేడా లేదు. ప్రతివారికీ చేయగలిగినంత సహాయం చేయాలనే ఉంది. మనం ఒకరికొకరం సహాయపడుకుంటూ ఉండాలి. ఎదుటివారి సంతోషమే మనకు స్ఫూర్తిని, సంతృప్తిని ఇస్తుంది. వారి దుఃఖం కాదు – ఒకరిని అసహ్యించుకోవడం, అవహేళన చేయడం మనం కోరుకోం. ఈ విశాల ప్రపంచం అందరిదీ. మన జీవితం స్వేచ్ఛకూ, ఆనందానికీ ప్రతిరూప మవ్వాలి! కానీ, మనం దారి తప్పుతున్నాం. స్వార్థం మనుషుల అంతరాత్మల్ని విషపూరితం చేస్తోంది. కుత్సితాలతో ప్రపంచాన్ని కుంచింపజేస్తోంది. వేగాన్ని అభివృద్ధి పరిచాం. నిజమే! కానీ, మనలో మనమే ముడుచుకుంటున్నాం. కావాల్సినవన్నీ యంత్రాలు తయారు చేస్తున్నాయి. కానీ, మన కోర్కెల దాహం తీరడం లేదు. మన విజ్ఞానం మనల్ని మానవ ద్వేషులుగా చేస్తూ ఉంది. మన తెలివి తేటలు మనల్ని నిర్దయులుగా, కఠినాత్ములుగా తీర్చి దిద్దుతున్నాయి. యంత్రాల యంత్రాంగం కన్నా, మనకు మాన వత్వపు మనుగడ ముఖ్యం కావాలి. మితిమీరిన తెలివితేటల కన్నా మర్యాద, మన్నన, దయార్ద్ర హృదయం కావాలి. ఈ లక్ష ణాలు లేని జీవితం భయానకమై నశిస్తుంది. రేడియో, విమా నాలు మానవుల్ని దగ్గరి పరిధిలోకి చేరుస్తున్నాయి. మానవుని లోని మంచితనమే వీటిని కనుక్కోగలిగింది. విశ్వమానవ సౌభ్రా తృత్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఈర్షా్య ద్వేషాలు నశిస్తాయి. నియంతలు నశిస్తారు. ప్రజల నుండి లాక్కున్న అధికారం మళ్ళీ, తిరిగి ప్రజలకే దక్కుతుంది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు నశించవు. తాత్కాలికంగా అణచబడ్డా, అవి సంకెళ్ళు తెంపుకొని ధైర్యంగా బతుకుతాయి. సైనికులారా ఆలోచించండి! మీకు తిండి పెట్టి, కసరత్తులు చేయించి, మిమ్మల్ని పూర్తిగా వాడుకునేవాడు ఎలాంటివాడో ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి. మీరు పశువులు కాదు. గడ్డి పోచలు కాదు. మానవత్వం పట్ల మీకు అచంచల విశ్వాసం ఉంది. వీర సైనికులారా! స్వేచ్ఛ కోసం పోరాడండి. బానిసత్వం కోసం కాదు. యంత్రాల్ని సృష్టించుకోగల నేర్పరులు మీరే. యంత్రాలై పోకుండా మనుషులుగా నిలదొక్కుకునే ఆత్మశక్తి మీలోనే ఉంది. రండి! ప్రజాస్వామ్యం పేరిట ఏకమై, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం! దురాశ, దుఃఖం, అసూయ, క్రూరత్వాలకు నిలువ నీడ లేకుండా చేద్దాం! శాస్త్ర సాంకేతికాభివృద్ధి సాధించే ప్రగతివైపు పయనిద్దాం.. రండి! అందరం ఏకమౌదాం!!’’ ఇది చాప్లిన్ ఉపన్యాసం. ఇక్కడ మరొక విశేషముంది. హిట్లర్‌ను చార్లీ చాప్లిన్ ఆటపట్టించాడు. కానీ, చాప్లిన్ అభిమానుల్లో హిట్లర్ ఒకడు! ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ‘వరల్డ్ గ్రేటెస్ట్ ఎంటర్టెయినర్’గా, ప్రపంచాన్ని నవ్వుతో శాసించిన సర్ చార్లీ చాప్లిన్ (16 ఏప్రిల్ 1889 – 25 డిసెంబర్ 1977) తన విజయ రహస్యాన్ని తానే అనేకసార్లు బేరీజు వేసుకున్నాడు. ‘ఈ ప్రజలు దేన్ని చూసి నవ్వుతారు?’ అనే శీర్షికతో చాప్లిన్ 1918లో ఒక అమెరికా పత్రికకు వ్యాసం రాశాడు. అందులో ‘‘హాస్యం టోపీ ఎగిరిపోవడంలో లేదు. దాన్ని పట్టుకోవడానికి ఒక పెద్ద మనిషి పడే అవస్థలో ఉంది. ప్యాంటు – పిగిలిపోవడంలో లేదు. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి పడే తికమకలో ఉంది. అలాగే జారి పోయే ప్యాంట్ వదిలేస్తే ఎవరికీ నవ్వు రాదు. కానీ, జారిపోకుండా పైకి అనుకుంటూ హడావిడి పడిపోవడంలో హాస్యం ఉంది. అమ్మాయి నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్న పోస్టర్‌ను, ఒక పెద్ద మనిషి నిలబడి తనివితీరా చూస్తుంటే ఎవరికీ నవ్వు రాదు. సమాజంలో తానొక పెద్ద మనిషినని గుర్తుంచుకుని అలా చూస్తూ ఉంటే తన వ్యక్తిత్వానికి దెబ్బ తగులుతుందని బాధ పడుతూ, ఉండలేకపోతూ, చూడనట్టు నటిస్తూ... చూస్తూ ఉండ టంలో హాస్యం ఉంది... బలహీనుడై ఉండి, పహిల్వాన్‌తో ఛాలెంజ్ చేయడం, తెలివిగా తన్నులు తప్పించుకుంటూ ఉండ టంలో హాస్యం ఉంది. హాస్యం కత్తి మీద సాములాంటిది. ఎక్కడ ఏ కొద్దిగా బెడిసి కొట్టినా హాస్యానికి బదులు జుగుప్స, ఏవగింపు, అసహ్యం కలుగుతాయి. ప్రపంచాన్ని తరతరాలుగా కదిలిస్తూ వస్తున్న చార్లీ చాప్లిన్ సునిశిత హాస్యం ఎక్కడి నుంచో రాలేదు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న చాప్లిన్ మేధలోంచి వచ్చింది. ‘‘నూటికి పదిమంది బాగా ఉన్నవాళ్ళూ, తొంభయిమంది లేనివాళ్ళూ ఉన్న ఈ సమాజంలో... 90 శాతం ప్రజల్ని నవ్వించడానికి, 10 శాతం మందిని గేలి చేయడంలో– తప్పేమిటి?’’ అన్నది ఆయన ప్రశ్న! వర్గ దృక్పథాన్ని ఇంత సులభంగా, సరళంగా చెప్పిన వాళ్ళు బహుశా ఎవరూ లేరేమో! హాస్యంతో మానవ వాదానికి ఊపునిచ్చిన మహనీయుడు కూడా మరొకరు లేరేమో!! డా. దేవరాజు మహారాజు, వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త -
హిట్లర్ యాక్షన్
విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జంటగా నటించిన చిత్రం ‘హిట్లర్’. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ ΄పౌరుడి కథే ‘హిట్లర్’. ఈ మూవీలో లవ్ ట్రాక్‌కి కూడా ్రపాధాన్యత ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ ‘హిట్లర్’లో కిల్లర్‌గా విజయ్ ఆంటోని కొత్త లుక్‌లో, క్యారెక్టరైజేషన్లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
US Elections: అవి హిట్లర్ వ్యాఖ్యలా?... నాకు తెలియదు: ట్రంప్
వాషింగ్టన్: అక్రమ వలసలపై తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికాలోకి భారీగా వస్తున్న అక్రమ వలసలపై ‘పాయింజనింగ్ ద బ్లడ్’(విష తుల్యమవుతున్న రక్తం) అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలను ఒకప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన పుస్తకం ‘మెయిన్ కంఫ్’లో వాడిన సంగతి తనకు తెలియదని ట్రంప్ వివరణ ఇచ్చారు. పాయిజనింగ్ ద బ్లడ్ వ్యాఖ్యలతో నాజీల భావజాలన్ని తాను ధృవీకరించడం లేదని తెలిపారు. పాయిజనింగ్ ద బ్లడ్ వ్యాఖ్యల వెనుక హిట్లర్ ఉద్దేశాలు మీ ఉద్దేశాలు ఒకటేనా అని ఒక రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్‌ను ప్రశ్నించగా ‘లేదు..అసలు నాకు హిట్లర్ గురించి ఏమీ తెలియదు. హిట్లర్ ఆ పదాలు వాడాడని కూడా తెలియదు. నేను ఆయన రాసిన పుస్తకం చదవలేదు. ఇదంతా కొంత మంది చేస్తున్న తప్పుడు ప్రచారం’అని ట్రంప్ కొట్టిపారేశారు. నేషనల్ పల్స్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా ట్రంప్ పాయిజనింగ్ ద బ్లడ్ అనే వ్యాఖ్యలు చేశారు. గత వీకెండ్లో న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ మళ్లీ ఇవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. ఆ తర్వాత ఇవి హిట్లర్ వాడిన పదాలు వివాదస్పదమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. అవే వ్యాఖ్యలను రిపీట్ చేస్తూ వస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీకి ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా మారారు. ఇదీచదవండి..ఇరాన్‌పై అమెరికా సంచలన ఆరోపణలు -
యూదుడైన ఐన్‌స్టీన్.. హిట్లర్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ప్రస్తుతానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఈ ఉగ్రవాద సంస్థను తుడిచిపెట్టితీరుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపధ్యంలో జరుగుతున్న పోరులో ఇప్పటికే వేలాది మంది మరణించారు. నిజానికి ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం. ఇక్కడ యూదులు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. అంటే ఇది యూదుల దేశం. ఈ యుద్ధం నేపధ్యంలో యూదులకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా గుర్తింపు పొందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ యూదు అనే విషయం చాలామందికి తెలియదు. హిట్లర్ పాలనకాలంలో ఐన్‌స్టీన్ తన ప్రాణాలను కాపాడుకునేందుకు జర్మనీ నుంచి పారిపోవాల్సి వచ్చింది. పూర్వం రోజుల్లో యూరప్‌లో యూదులు జనాభా అత్యధికంగా ఉండేది. జర్మనీలో లక్షలాది మంది యూదులు ఉండేవారు. వారిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ఒకరు. అడాల్ఫ్ హిట్లర్ ఎన్నికైన తరువాత జర్మనీలో జాతీయవాద భావన తీవ్రతరం అయ్యింది. ఈ నేపధ్యంలో ఐరోపాయేతర ప్రజలపై నిరసనలు మొదలయ్యాయి. జర్మనీలో యూదులపై ద్వేషం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రధానకారణం క్రైస్తవులకు, యూదులకు మధ్య వీపరీతమైన ఘర్షణలు జరిగాయి. యూరప్ లో ఉన్న క్రైస్తవులు బలంగా నమ్మేదేంటంటే.. క్రీస్తును శిలువ వేయడంలో యూదుల పాత్ర ఉందని నమ్మేవారట. దాంతో పాటు యూదులు వ్యాపారంలో బలంగా ఉండడం, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండడంతో.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యూరోపియన్లు ఎక్కువగా యూదులను ద్వేషించేవారట. చరిత్రలో రకరకాల కారణాలు పేర్కొన్నప్పటికీ.. యూదులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నదానికి మతపరమైన బేధమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. జర్మనీలో హిట్లర్ మారణహోమం సృష్టించడంతో చాలా మంది యూదులు తమ ప్రాణాలను అరచేతపట్టుకుని ఇతర దేశాలకు పారిపోయారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్లో కూడా ఇదే భయం నెలకొంది. తాను జర్మనీలో ఉంటే ముప్పు తప్పదని భావించి, అమెరికా వెళ్లి, అక్కడ ఆశ్రయం పొందారు. అయితే అప్పటికే ఐన్స్టీన్పేరు విజ్ఞాన ప్రపంచంలో మారుమోగితోంది. ఇతనే కాకుండా జర్మనీకి చెందిన ఎందరో మేథావులు, శాస్త్రవేత్తలు కూడా అమెరికాలో తలదాచుకున్నారు. 1941 నుంచి 1945 వరకు జరిగిన మారణహోమంలో హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులను హత్య చేయించాని, వీరిలో ఎక్కువ మంది యూదులని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం యూదుల జనాభా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు తక్కువగానే ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. అలాగే యూదులు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్లలో కూడా ఉంటున్నారు. ఇజ్రాయెల్ ప్రస్తుత జనాభా 93 లక్షల 60 వేలు. అంటే మన హైదరాబాద్ కంటే తక్కువ జనాభా ఉంది. ఇందులో యూదుల సంఖ్య 72 లక్షల 48వేల మంది. ఇతరులు వేర్వేరు మతాలకు సంబంధించిన వారు ఇజ్రాయెల్ లో స్థిరపడి ఉన్నారు. 2020 జనగణన ప్రకారం అమెరికాలో దాదాపు 80 లక్షల మంది యూదులున్నారు. పైగా అమెరికాలో అత్యున్నత వర్గంలో ఒకరిగా యూదులు ఉన్నారు. రాజకీయాలు, వర్తక, వాణిజ్యంలలో అత్యంత ప్రభావశీలురుగా యూదులున్నారు. ఇది కూడా చదవండి: భారత్ చర్యతో వారి జీవితాలు దుర్భరం: ట్రూడో -
అమెరికా అంతరిక్ష ప్రయోగాలలో హిట్లర్ సన్నిహితుడు? 1969లో ఏం జరిగింది?
అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే సూపర్ పవర్ హోదాతో వెలుగొందుతోంది. దీని వెనుక పలువురి సహకారం ఉంది. వీరిలో కొందరు అమెరికన్లు, మరికొందరు ఇతర దేశాల పౌరులు ఉన్నారు. ఈ సహకారం నేపధ్యంలో ఇతర దేశాల వారు అమెరికన్లుగా మారడం విశేషం. అంతరిక్షంలో అమెరికా సాధించిన విజయం వెనుక మరో దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నరని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు అమెరికాకు బద్ధ శత్రువుగా ఉన్న జర్మనీకి చెందిన శాస్త్రవేత్త అమెరికా అంతరిక్ష విజయానికి సహకరించారని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. చంద్రుడి ఉపరితలంపైకి మనుషులను తీసుకువెళ్లడంలో అమెరికాకు హిట్లర్‌కు అత్యంత సన్నిహితుడైన శాస్త్రవేత్త సహకరించారు. ఈ ప్రయోగం నేపధ్యంలో నాసా ఖ్యాతిని సదరు శాస్త్రవేత్త ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. ఈ నేపధ్యంలో ఆ శాస్త్రవేత్తకు అమెరికా.. స్థానిక పౌరసత్వం ఇవ్వడంతోపాటు, భారీగా నగదు బహమానం కూడా అందించింది. ఆ శాస్త్రవేత్త పేరు వెర్నెర్ వాన్ బ్రాన్. ఇతను జర్మనీలోని ధనిక కుటుంబంలో జన్మించాడు. అంతరిక్షంపై అతనికున్న అభిరుచి ఈ రంగంలో అతను మరింత ఎదిగేలా చేసింది. వెర్నెర్ వాన్ బ్రాన్‌కు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతనికి అంతరిక్షంపై అభిరుచి ఏర్పడింది. బ్రాన్ పుట్టినరోజున అతని తల్లి టెలిస్కోప్ కానుకగా ఇచ్చింది. అది మొదలు బ్రాన్‌కు ఆకాశంలో ఏముందో చూడాలనే కోరిక మొదలయ్యింది. బ్రాన్ తన 17 ఏళ్ల వయస్సులో బెర్లిన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. తరువాత తన 18 ఏళ్ల వయసులో జర్మన్ రాకెట్ సొసైటీలో ప్రవేశం పొందాడు. ఈ నేపధ్యంలోనే ద్రవ-ఇంధన రాకెట్ నిర్మాణాన్ని తన లక్ష్యంగా చేసుకున్నాడు. అదే సమయంలో అతనికి హిట్లర్‌తో అతని సాన్నిహిత్యం ఏర్పడింది. హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన వ్యక్తులలో ఒకనిగా మారాడు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో జర్మనీ అన్ని రంగాలలో ఓటమిని ఎదుర్కొంది. ఈ తరుణంలో హిట్లర్ సన్నిహితులకు ఆశ్రయం కల్పించాలని అమెరికా భావించింది. ఈ నేపధ్యంలోనే అమెరికా ‘ఆపరేషన్ పేపర్క్లిప్’ అనే ఆపరేషన్ చేపట్టింది. అప్పుడే బ్రాన్‌తో పాటు ఇతర జర్మన్ శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో అమెరికా చేరుకున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందం 1946 ఏప్రిల్ 16న అమెరికాలో తొలి క్షిపణి పరీక్ష వీ-2ను చేపట్టింది. ఇది అమెరికా అంతరిక్ష యాత్రను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లింది. దీని తర్వాత 1955లో అమెరికా ‘నాసా’ను స్థాపించినప్పుడు, బ్రాన్ను అమెరికా అక్కడకు పంపింది. 1969, జూలై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్నాడు. ఈ ప్రయోగంలో వెర్నెర్ వాన్ బ్రాన్ సేవలు మరువలేనివి. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి? -
హిట్లర్ విషాహార భయాన్ని ఎలా దాటాడు? చివరికి ఎలా మరణించాడు?
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంతగా అడాల్ఫ్ హిట్లర్ పేరుగాంచాడు. హిట్లర్ అనేక దేశాలలో విధ్వంసం సృష్టించాడు. లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్నాడు. హిట్లర్ నియంతృత్వం ఎంతగా పెరిగిందంటే అతని కారణంగా ఒక దేశంతో మరో దేశం పోరాడేందుకు సిద్ధం అయ్యింది. అలాంటి హిట్లర్ చొరవతోనే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు మనం హిట్లర్ జీవితంలోని ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. ప్రపంచమంతా హిట్లర్ నియంతృత్వానికి ఆందోళన చెందింది. ఈ నేపధ్యంలోనే అతన్ని చంపడానికి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. ఎవరికీ ఇది అంత సులభం కాలేదు. హిట్లర్‌ను వెన్నంటి ఉండే నాజీ సైన్యం అతనిని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడేది. ఆహారంలో విషం కలిపి, తనను ఎవరైనా చంపేస్తారేమోనని హిట్లర్ నిత్యం భయపడేవాడు. దీనిని తప్పించుకునేందుకు ఒక మార్గాన్ని కూడా అనుసరించాడు. హిట్లర్‌కు సన్నిహితులైన 15 మంది మహిళలు ఆయనకు వడ్డించే ఆహారాన్ని మొదట రుచి చూసేవారు. ఎప్పుడైనా ఆహారంలో విషం కలిపితే, దానిని రుచి చూసే మహిళ చనిపోతుంది. అప్పుడు హిట్లర్ ప్రాణాలకు రక్షణ ఏర్పడుతుంది. హిట్లర్ ఆహారం తీసుకునే ప్రతిసారీ ఈ మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు. హిట్లర్ తినే ఆహార పదార్థాలు అధికంగా ఉండటం వలన వాటిని పలువురు మహిళలు రుచి చూసేవారు. హిట్లర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పలు పద్ధతులను ఉపయోగించేవాడు. ఎటువంటి దాడికి గురికాని సైనిక బంకర్లలో తల దాచుకునేవాడు. భారీ స్థాయిలో ఉన్న నాజీ సైన్యం అతనిని నిరంతరం కాపాడుతుండేది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇంతలా తాపత్రయపడిన హిట్లర్ చివరికి విషాహారం కారణంగానే మృతి చెందాడు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
ఆమె నియంత హిట్లర్‌కు గూఢచారి.. తన నృత్యాలతో కవ్విస్తూ..
‘మాతా హారీ’.. ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన గూఢచారి. తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్ దగ్గర గూఢచారిగా పనిచేసిన మాతా హారీ యూరప్‌ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్‌కు గూఢచారిగా పనిచేసిందన్న ఆరోపణలతో ఆమెను హత్య చేశారు. ఆమె గూఢచార విద్యలో ఆరితేరినదే కాకుండా అందగత్తె, డ్యాన్సర్. నెదర్లాండ్‌లో 1876లో జన్మించిన మాతాహారి అసలు పేరు గెర్ట్రూడ్ మార్గరెట్ జెలె. గూఢచర్యం ఆమె వృత్తి. మాతాహారీకి పలు దేశాల సైన్యాధికారులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తన అపరిమితమైన కోరికలను తీర్చుకునేందుకు ఆమె 1905లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకుంది. ఆమె తన అందచందాలతో కొద్దికాలంలోనే అధికారులకు సన్నిహితురాలిగా మారిపోయింది. ఆమె నృత్యం వారిని కట్టిపడేసేది. తన నృత్య కార్యక్రమాల కోసం ఆమె యూరప్ అంతా పర్యటించేది. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యేవరకూ ఆమె ఒక డాన్సర్, స్ట్రిప్పర్గానే ఉంది. ఆమె నృత్యాన్ని చూసేందుకు దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథమహారథులు వచ్చేవారు. వారితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ఇతరుల రహస్యాలను మరొకరికి చేరవేసే పని మొదలుపెట్టింది. హిట్లర్ కోసం, ఫ్రాన్స్ కోసం ఆమె గూఢచర్యం చేసేదని చెబుతుంటారు. మాతాహారీ హత్య అనంతరం 70వ దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు బయటపడ్డాయి. మాతాహారీ జర్మనీకి గూఢచర్యం చేసినట్లు వాటి ద్వారా వెల్లడయ్యింది. గూఢచర్యం చేస్తున్నదన్న ఆరోపపణల మేరకు ఆమెను 1917లో అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె గూఢచారి అని నిరూపణ కాలేదు. ఆమె డాన్సర్ మాత్రమేనని కోర్టు తీర్పుచెప్పింది. అయితే ఆ తరువాత ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపారు. ఇది కూడా చదవండి: బర్త్‌డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టుజుట్టూ పట్టుకున్న యువతులు! -
వేలంలో రూ.కోట్లు పలికిన ‘హిట్లర్’ వాచ్.. ఎంతంటే?
వాషింగ్టన్: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు సంబంధించిన చేతి గడియారం వేలం వేయగా దానిని దక్కించుకునేందుకు ఎగబడ్డారు. అమెరికాలోని అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో ఈ గడియారం 1.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.8.6 కోట్లు) పలికింది. బంగారు ఆండ్రియాస్ హుబెర్ రివర్సిబుల్ వాచ్ నాజీ పార్టీ గుర్తును కలిగి ఉంటుంది. అలాగే.. గద్ద, స్వస్తిక్ గుర్తులు సహా ఏహెచ్ అని అడాల్ఫ్ హిట్లర్ పేరును సూచిస్తూ అక్షరాలు ఉంటాయి. నాజీ స్మారక వస్తువులను వేలం వేస్తున్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటోంది వేలం సంస్థ. తాజాగా..గడియారం వేలానికి ముందు జెవిష్ నేతలు తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ వేలం కొనసాగించింది. ఈ వాచ్‌ను ఓ గుర్తు తెలియని వ్యక్తి సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. జన్మదిన కానుక.. అడాల్ఫ్ హిట్లర్ 44వ జన్మదినం సందర్భంగా 1933, ఏప్రిల్ 20న నేషనలిస్ట్ సోషియలిస్ట్ వర్కర్స్ పార్టీ ఆఫ్ జర్మనీ సభ్యులు ఈ వాచ్‌ను కానుకగా ఇచ్చారు. 1945 మే నెలలో సుమారు 30 మంది ఫ్రెంచ్ సైనికులు.. బవారియాలోని హిట్లర్‌కు చెందిన ఆల్పైన్ నివాసంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఫ్రెంచ్ సైనికుడికి ఈ చేతి గడియారం దొరికినట్లు సమాచారం. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న నాలుగు రోజులకు ఈ గడియారం దొరికనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా? -
బీజేపీ పాలన హిట్లర్, స్టాలిన్ కంటే అధ్వానం: మమతా ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.. కేంద్ర ఏజెన్సీలను అడ్డుపెట్టుకొని రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. మోదీ పాలన హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, బెనిటో ముస్సోలినీ కంటే దారుణంగా ఉందని మమతా ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశంలో సీఎం మమతా మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు. ఏజెన్సీలను ఉపయోగించి కేంద్రం రాష్ట్రాల పనితీరులో తలదూర్చుతూ సమాఖ్య వ్యవస్ధను ధ్వంసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై దీదీ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ చర్చను ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. ఉజ్వల యోజన కింద బీపీఎల్ దిగువన ఉండే కుటుంబాలకు మాత్రమే గ్యాస్ ధరను తగ్గించారని, ఇది ప్రతి ఎన్నికలకు ముందు చేపట్టే కంటితుడుపు చర్యేనని అన్నారు. పేద ప్రజలు రూ. 800 పెట్టి వంట గ్యాస్ సిలిండర్‌ను ఎలా కొనుగోలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. చదవండి: ఆసుపత్రికి పంజాబ్ కాంగ్రెస్ నేత సిద్ధూ.. స్పెషల్ డైట్‌కు అనుమతిస్తారా? -
మంచి మాట: అభిప్రాయం కాదు... అవగాహన
వ్యక్తి తన వ్యక్తిత్వానికి అతీతంగా వస్తుతత్త్వానికి, ఉన్న విషయానికి మాలిమి అవాలి. అనుకోవడం నుంచి తెలుసుకోవడానికి పయనించాలి. అభిప్రాయం నుండి అవగాహనలోకీ చేరాలి. అనుకోవడం అంటేనే తెలివిడిలేనితనం. ‘ఇది నా అభిప్రాయం‘ అనడం ఒక మనిషి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తూంటుంది. విషయం, వాస్తవం, సత్యం ఇవి మనిషి మనిషికీ మారవు. అభిప్రాయాలే వేర్వేరుగానూ, రకరకాలుగానూ ఉంటాయి. ఒక విషయం గురించి ఏదో అనుకోవడం ఏమిటి? విషయాల్ని తెలుసుకోవడం లేదా తటస్థంగా ఉండడం అన్నదే సరైనది. లోకంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడడం గొప్ప అనుకుంటూంటారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న 67% మధ్యతరగతి వ్యక్తులు అభిప్రాయపడుతూ బతుకుతూంటారు. అభిప్రాయాలు మనిషి అశక్తతకు, తెలివిడిలేనితనానికి వ్యక్తీకరణలు. అభిప్రాయపడడం అన్నది మధ్యతరగతి మాంద్యంగానూ, జాడ్యంగానూ ఉంది. అందువల్ల గందరగోళం తప్పితే మరొకటి ఉండదు. ఉపిరి పీల్చుకోవడం తరువాత ఒక వ్యక్తి తప్పకుండా చేసే పని అభిప్రాయపడడమే. మనుషులకు తప్పితే ఏ జంతువుకూ అభిప్రాయాలుండవు. అందుకే జంతువుల్లో లేని అశాంతి మనుషుల్లో మాత్రమే ఉంది. ‘ఇది నా అభిప్రాయం’, ‘నేను ఏమనుకుంటున్నానంటే‘, ‘నేను చెప్పేదేమిటంటే’... అనే స్థితి నుండీ, స్థాయి నుండీ మధ్య తరగతి మనిషి ఇంకా ఎదగలేదు. మనిషి అవగాహనకూ అతీతంగా తన అభిప్రాయాల వల్లా, ఏదో అనుకోవడం వల్లా తన ఎదుగుదలకు తానే అడ్డుపడుతున్నాడు. ఒక కుటుంబంలోని వ్యక్తుల అభిప్రాయాల వల్లా, ఏదేదో అనుకోవడం వల్లా ఆ కుటుంబాలు ఛిద్రమైన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అభిప్రాయపడడం, అనుకోవడం ఒక మానసిక బలహీనత. హిట్లర్ అభిప్రాయాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం మానవాళికి పెనుహాని జరిగింది. అభిప్రాయపడడం కూడా మూర్ఖత్వంలాగే అపాయకరమైనదే! కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకంలాగా కీడు చేసేదే! నా అభిప్రాయం మేరకు అనేది ప్రపంచానికి మేలు చేసినది కాకపోగా అనర్థాల్ని కలిగించింది, మనుషుల మధ్య అంతరాల్ని పెంచింది. మనస్పర్థలను సృష్టించింది. ఈ చింతనతో ఎన్నో దశాబ్దుల క్రితం నుండీ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచానికీ, మానవాళికీ అత్యవసరమయ్యే ఎన్నో ఉత్పాదనల్ని ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చాయి, సగటు మనిషికి హితాన్ని చేకూర్చాయి. చూడడం, వినడం, అవగతం చేసుకోవడం, చెప్పడం ఇవి మనిషికి సరిగ్గా అలవడలేదు. వ్యక్తిగత అభిప్రాయాలూ, ఉద్దేశాల వల్ల సాటి మనిషికీ, సమాజానికీ ప్రయోజనం ఉండదు. అభిప్రాయాలు, ఉద్దేశాలు, అనుకోవడం ఇవి కాదు ఎరుక, అవగాహన, విజ్ఞతలే కావాలి. ఒకరి ఎరుక, అవగాహన మరొకరికీ, సమాజానికీ ఉపయోగపడతాయి. ఈ ప్రపంచానికి మేలు చేసినవన్నీ అవగాహనలే, వాస్తవాలే, సత్యాలే. ఒక వైద్యుడి చదువు లేదా ఎరుక మాత్రమే రోగికి అవసరమవుతుంది. ఒక అధ్యాపకుడికి ఎరుక ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి సరైన విద్య వస్తుంది. ’రెండు రెళ్లు నాలుగు’ అన్న ఎఱుకను మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థికి అందజెయ్యాలి. అదే విద్యార్థికి కావాల్సింది. ఆ రెండురెళ్లు నాలుగు అన్నది అవగాహన. ఆ అవగాహనే ఒక వ్యక్తి జీవనానికి తోడ్పడేది. ఇలా ఏ విషయంలోనైనా ఎరుకవల్ల వచ్చే లేదా వచ్చిన అవగాహన మాత్రమే మేలు చేస్తుంది. అభిప్రాయం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అభిప్రాయాలు సార్వత్రికమైనవి కావు అపై సార్వజనీనమైనవీ కావు. మనం సరిగ్గా ఉండాలంటే మనకు ఉండాల్సింది అభిప్రాయాలు కాదు అవగాహనలు. బతకడం అంటే అభిప్రాయాల్ని మోసుకుంటూ ఉండిపోవడమా? కాదు. బతకడం అంటే తెలుసుకుని అవగాహనతో సాగడం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం ఉంటే ఆ గాయకుడి సామర్థ్యాన్ని, గాయకుడి వ్యాప్తిని, తరువాతి తరం వాళ్లపై ఆ గాయకుడి ప్రభావాన్ని, పరిశీలించగలిగితే ఆ గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం సరైనదా కాదా అనేది తెలిసిపోతుంది. విజ్ఞానశాస్త్రవేత్తల ఆవిష్కరణలను పరిశీలిస్తే మనకు అవగాహన అన్నది ఏమిటో అర్థమై పోతుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయంతోనో, ఏదో ఒకటనుకునో మొదలుపెడతారు. ప్రయోగాలు, ఆలోచనలు, పరిశీలనలు చేస్తూ, చేస్తూ తమను తాము మార్చుకుంటూ, సరిచేసుకుంటూ ఒక దశలో వాళ్లు సరైన ఆవిష్కరణలు చెయ్యగలుతారు. ఆ ఆవిష్కరణ జరిగాక అది అవగాహన అవుతుంది. ఆ అవగాహనే లోకానికి ఉపయోగ పడేదవుతుంది. అవగాహన మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. సాటి మనిషికి, సమాజానికి మేలు చేస్తుంది. శాంతిని ఇస్తుంది. ఈ సత్యాన్ని బుద్ధిలోకి తీసుకుందాం. అభిప్రాయాలకు అతీతంగా ‘బతకడం’ నేర్చుకుందాం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. – రోచిష్మాన్ -
అలా జరిగి ఉండకపోతే..
ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండకపోతే... అసలు కథ మరోలా ఉండేదిరా అంటూ ఉంటాం. నిజ జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా ఓ చిన్న ఘటనే అనుకోని మలుపైపోతుంది. అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంది. యథార్థ జీవితంలోని ఘటనలను మనం çసృష్టించలేం. అదే సాహిత్యంలో అయితే... ఇటువంటి మలుపులను రచయితలు చాలా తెలివిగా çసృష్టిస్తారు. ఇక అక్కడి నుండి కథను ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. ఆ ట్విస్టే అద్భుత రచనలకు ప్రత్యేక ఆకర్షణ అయిపోతుంది. అదే రచయితలోని చమత్కారాన్ని చాటి చెబుతుంది. మహాభారతాన్నే తీసుకోండి. పాండురాజు కుమారులు ప్రశాంతంగా తమ రాజ్యాన్ని తాము ఏలుకుంటూ సుఖంగా జీవిస్తోన్న తరుణంలో రచయిత వ్యాసుడి మెదడులో ఓ మెరుపులాంటి మలుపు తట్టింది. తాను సృష్టించిన పాత్రలతో ఓ కొత్త ఆట ఆడుకోవాలనిపించింది. అంతే ధర్మ రాజును జూదానికి ప్రేరేపించాడు. అది మామూలు ద్యూతం అయితే అనుకున్న ట్విస్ట్ రాదు కాబట్టి అధర్మ, మాయా ద్యూతాన్ని సృష్టించాడు. అందుకోసం శకునికి ఓ పెద్ద నేపథ్యం సృష్టించి, పాచికలు శకుని ఎలా చెబితే అలా ఆడేలా ప్లాన్ చేశాడు. ఆ రోజున శకుని మాయోపాయంతో కౌరవులు ధర్మరాజుని జూదానికి పిలవగానే జూదం అంటే మితిమీరిన ప్రేమ కలిగిన ధర్మరాజు మరో ఆలోచనే లేకుండా సై అన్నాడు. జూదం ఆడి శకుని మాయలో పడి రాజ్యాన్నీ, ధర్మపత్నినీ కూడా జూదంలో పోగొట్టుకున్నాడు. ఆ రోజు జూదం ఆడి ఉండకపోతే... పాండవులు అరణ్య వాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు... కౌరవులపై పాండవులకు కక్ష పుట్టేది కాదు... ఇద్దరి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగాల్సిన అవసరమూ ఉండేది కాదు! కేవలం జూదం కారణంగా లక్షలాది సైనికుల ప్రాణాలు తీసే యుద్ధం అనివార్యమైంది. ఆ తర్వాత పాండవులు, కౌరవుల్లో ఎవరూ మిగలకుండా అందరూ చనిపోవలసి వచ్చింది. ఇంత పెద్ద కథ రాసుకోవడం కోసం... వ్యాసుడు çసృష్టించిన అద్భుతమైన ట్విస్టే– మాయా ద్యూతం. ఇదే లేకపోతే అసలు మహాభారతంలో మసాలాయే లేదు. ‘తింటే గారెలు తినాలి... వింటే భారతం వినాలి’ అని మనవాళ్ళు అని ఉండేవారు కారు. ఇటువంటి ట్విస్టే రామాయణంలో రచయిత వాల్మీకీ ప్రయోగించారు. అయితే వాల్మీకి రెండు మలుపులు పెట్టారు. కైకేయికి దశరథుడు ఏం కావాలంటే అది ఇస్తానని వరం ఇవ్వకుండా ఉంటే... రాముడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు. సరే... అరణ్యానికి వెళ్లాడే అనుకుందాం. అక్కడైనా పధ్నాలుగేళ్ల పాటు అడవిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా గడిపేసి, తిరిగి అయోధ్య వచ్చేయ వచ్చు. అందుకే వాల్మీకి అడవిలో పెద్ద ట్విస్ట్ పెట్టాడు. బంగారు లేడి కోసం రాముడు వెళ్లగానే, రాముడు ప్రమాదంలో ఉన్నాడనుకుని సీతమ్మ చెప్పిన వెంటనే లక్ష్మణుడూ వెళ్లాడు. వెళ్లే ముందు ఓ గీత గీసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీత దాటద్దని షరతు విధించాడు. సీతమ్మ దానికి కట్టుబడి ఉంటే బాగుండేది. కానీ.. రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను గీత దాటేలా ప్రేరేపించడంతో లక్ష్మణుడి మాట పెడచెవిన పెట్టిన సీతమ్మ గీత దాటింది. అంతే... రావణుడు ఆమెను లంకకు ఎత్తుకుపోయాడు. సీతను రక్షించుకోవడం కోసమే రాముడు వానర సైన్యం సాయంతో సముద్రాన్ని దాటి, లంకలో రావణుడితో యుద్ధానికి దిగాల్సి వచ్చింది. సీతే కనక గీత దాటి ఉండకపోతే – ఇంత కథ ఉండేది కాదు. వాల్మీకి సృష్టించిన ఈ ట్విస్టుతో రామాయణం నిత్య పారాయణమైంది. వ్యాసుడు, వాల్మీకే కాదు... యుగాల తరబడి గొప్ప గొప్ప రచయితలంతా కూడా తమ ఉద్గ్రంథాల్లో ఏదో ఓ చిన్న ట్విస్ట్ తో మొత్తం కథను నడుపుతారు. కథలోని ఆ కీలకమైన మలుపులే ఆ రచయితనూ, రచననూ కలకాలం గుర్తుండేలా చేస్తాయి. శకుంతలా దుష్యంతుల కథ అయిన ‘అభిజ్ఞాన శాకుంతలం’లో మొత్తం మెలోడ్రామాకి ఉంగరమే పెద్ద ట్విస్ట్. దుష్యంతుడికి మతి మరుపు శాపం అనేది కథకు కొక్కెం. అందుకే ఆ కథ, ఆ నాటకం ఏ రూపంలో వచ్చినా అంత పెద్ద హిట్ అయ్యింది. ఇక యథార్థ జీవితంలోనూ ఇటువంటి మలుపులు లేకపోలేదు. ప్రపంచ చరిత్రలో జర్మనీ నియంత హిట్లర్ సోవియట్ రష్యా పైకి యుద్ధానికి కాలు దువ్వి ఉండకపోతే... జర్మనీ కథ మరోలా ఉండేది. సోవియట్ రష్యాకు సవాల్ విసరడం వల్లనే జర్మనీపై ప్రతీకారం తీర్చుకోవడానికి స్టాలిన్ యుద్ధానికి వెళ్లాడు. సోవియట్ ఆర్మీ చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గం లేక చివరకు హిట్లర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సి వచ్చింది. సోవియట్ జోలికి వెళ్లకుండా ఉండి ఉంటే జర్మనీని మరికొన్నేళ్ల పాటు హిట్లర్ ప్రశాంతంగా ఏలుకుని ఉండేవాడేమో? ఈ స్క్రిప్ట్‌ను ఎవరూ రాయలేదు. దానంతట అది ఆవిర్భవించడంతో చరిత్రకారులు దాన్ని రాసుకున్నారు. బ్రిటిష్ వాడిని మొదట్లోనే అడ్డుకొని, ‘ఎవర్రా నువ్వు? మా దేశంలోకి ఎందుకొచ్చావ్?’ అని కాలర్ పట్టుకొని ఉంటే, భారతదేశం తెల్లవాడి పాలనలో బానిస బతుకు బతకాల్సి వచ్చేది కాదు. స్వాతంత్య్ర సంగ్రామం అవసరమయ్యేదీ కాదు. ఇది కూడా చరిత్ర సృష్టించిన ట్విస్ట్. ఇందులోని అసలు గొప్పతనం ఏమిటంటే... రచయితలు çసృష్టించే మలుపులు చాలా సహజంగా ఉంటాయి. అవి నిజమే కాబోలు అనిపించేలా ఉంటాయి. అలా రాయడంలోనే వారి నైపుణ్యం కనపడుతుంది. మహారచయితలంతా కథాంశంలోని కీలకమైన మలుపులను ఆసరాగా చేసుకొన్నవారే! తమ రచనలను చిరస్మరణీయ గ్రంథాలుగా మలుచుకున్నవారే! కథల్లోని మలుపులతో ప్రపంచ సాహిత్యాన్నే మలుపు తిప్పిన రచయితలకు వందనాలు. -
హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ను చూసి ఏడ్చేవాడు: కోమటిరెడ్డి
హైదరాబాద్: మూసీ నదిని తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. మూసి ప్రక్షాళన కోసం పార్లమెంట్లో మాట్లాడుతానని ఆయన అన్నారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ను చూసి ఏడ్చేవాడని కోమటిరెడ్డి విమర్షించారు. సీఎం కేసీఆర్ వాసలమర్రికి రెండు సార్లు వస్తే.. ఎంపీగా నాకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రోటోకాల్ ఇవ్వరని దుయ్య బట్టారు. దళిత బంధు పెట్టిన రోజే కేసీఆర్ ఓడినట్లన్నారు. దళితులకు కేబినెట్లో స్థానం లేదు గాని.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు తెలుసని విమర్షించారు. -
3,518 మంది హత్య.. 75 ఏళ్ల తర్వాత విచారణ
-
గూగుల్‌లో కనిపిస్తున్న ఆ పెద్దాయన ఎవరో తెలుసా?
గొప్ప వ్యక్తులకు, మేధావులకు, సెలబ్రిటీలకు గూగుల్ డూడుల్‌తో గౌరవం ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఇవాళ(జులై 3న) ఓ జర్మన్ డాక్టర్‌కి గూగుడ్ డూడుల్ దర్శనమిచ్చింది. ఆయన పేరు సర్ లుడ్విగ్ గట్ట్‌మన్. న్యూరోసర్జన్. పారాఒలింపిక్స్‌కు ఆద్యుడు ఈయనే. అంతేకాదు జర్మనీలో నాజీల చేతిలో అవమానాలు అనుభవిస్తూనే.. వందల మంది పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాడు. ఒకానొక టైంలో హిట్లర్‌కు ఆయన మస్కా కొట్టిన తీరు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది కూడా. వెబ్‌డెస్క్: జర్మనీలోని టాస్ట్(ఇప్పుడది టోస్‌జెక్ పేరుతో పోలాండ్‌లో ఉంది)లో 1899 జులై 3న జన్మించాడు లుడ్విగ్. యూదుల పట్ల నాజీలు కర్కశంగా వ్యవహరించే సమయం అది. 18 ఏళ్ల వయసులో కోల్‌మైన్ యాక్సిడెంట్లో గాయపడ్డ ఓ వ్యక్తి తన కళ్ల ముందే మరణించడం లుడ్విగ్ మనసును కలిచివేసింది. అలా ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాడు. బ్రెస్లావు యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా, ఫ్రెయిబర్గ్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత న్యూరోసర్జన్‌గా ఒట్ఫ్రిడ్ ఫోరెస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. అయితే పేదలకు ఉచితంగా సేవలు చేయాలన్న ఆయన సంకల్పం.. ఫోరెస్టర్కు నచ్చలేదు. దీంతో ఆయన్ని వెలేశాడు. ఆ తర్వాత నాజీలు అధికారంలోకి వచ్చాక యూదులను మెడిసిన్ ప్రాక్టీస్‌కు అనుమతించలేదు. దీంతో బ్రెస్లావు జూయిష్ ఆస్పత్రిలో సేవలందించాడు లుడ్విగ్. ఆ టైంలో నాజీల చేతిలో యూదులు బలికాకుండా ఉండేందుకు.. వాళ్లను తన ఆస్పత్రుల్లో పేషెంట్లుగా చేర్పించుకుని నాటకంతో వాళ్ల ప్రాణాలను నిలబెట్టాడు. క్రిస్టాలెనెచ్ట్ మారణ హోమం టైంలో గాయపడ్డ వాళ్లెవరనేది చూడకుండా ఉచిత చికిత్స అందించి మనుసున్న మంచి డాక్టర్‌గా పేరు దక్కించుకున్నాడు. హిట్లర్‌కు మస్కా కొట్టి.. యూదుల సానుభూతిపరుడు అయినప్పటికీ.. వైద్యమేధావి అనే ఉద్దేశంతో హిట్లర్, లుడ్విగ్ గట్ట్‌మన్ జోలికి పోలేదు. ఆ టైంలో హిట్లర్ తన మిత్ర రాజ్యం పోర్చుగల్ నియంత అయిన అంటోనియో డె సాలాజార్కు చికిత్స కోసం గట్ట్మన్ను ఏరికోరి మరీ పంపించాడు. అయితే తిరుగు ప్రయాణంలో లుడ్విగ్ నాజీ సైన్యానికి మస్కా కొట్టాడు. లండన్‌లోనే తన కుటుంబంతో సహా విమానం దిగిపోయి.. యూకే శరణు వేడాడు. దీంతో యూకే ప్రభుత్వం ఆయనకు ఆశ్రయం కల్పించింది. అక్కడే ఆయనకు 250 పౌండ్ల సాయంతో శరణార్థిగా ఉండిపోయాడు. హిట్లర్‌కు లుడ్విగ్ మస్కా కొట్టిన తీరును దాదాపు అన్ని మీడియా ఛానెళ్లన్నీ అప్పట్లో ప్రముఖంగా ప్రచురించాయి కూడా. యుద్ధవీరుల కోసం ఆటలు ఇక యూకే వ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో సేవలందించిన లుడ్విగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో లార్డ్ లిండ్సేకి మకాం మార్చాడు. 1943లో ప్రభుత్వ ప్రోత్సాహంతో బకింగ్హాంషైర్లో స్టోక్ మండ్‌విల్లే ఆస్పత్రిని నెలకొల్పాడు. ఇది వెన్నెముకలు దెబ్బతిన్న పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. ఈ సెంటర్‌కు లుడ్విగ్నే మొదటి డైరెక్టర్‌గా నియమించింది యూకేప్రభుత్వం. 1945లో గట్ట్మన్కు బ్రిటన్ పౌరసత్వం దక్కింది. ఆ టైంలో స్టోక్ మండ్‌విల్లే గేమ్స్‌ను నిర్వహించాడు లుడ్విగ్. ఈ ఈవెంట్లో సైన్యంలో సేవలందిస్తూ కాళ్లు, చేతులుకోల్పోయిన వాళ్లు, నడుం చచ్చుపడిపోయి వీల్ చైర్‌కు పరిమితమైనవాళ్లతో ఆటలు నిర్వహించాడు. విశేషం ఏంటంటే.. సరిగ్గా అదే రోజున జులై 29, 1948 లండన్ ఒలింపిక్స్ మొదలయ్యాయి. దీంతో ఈ ఆటలకు పారా ఒలింపిక్ గేమ్స్ అనే పేరు దక్కింది. అలా డిజేబిలీటీ ఉన్నవాళ్లతో ఒలింపిక్స్ నిర్వహించడం తర్వాతి కాలంలో క్రమం తప్పకుండా నడుస్తోంది. అందుకే లుడ్విగ్ గట్ట్మన్ను ‘ఫాదర్ ఆఫ్ పారా ఒలింపిక్స్’ అని పిలుస్తారు. గుండెపోటుతో ఐదు నెలలు.. ఆ తర్వాత ‘ఇంటర్నేషనల్ స్పైనల్ కార్డ్ సొసైటీ’ని నెలకొల్పాడు గట్ట్‌మన్. 1966లో క్లినికల్ వర్క్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కొన్నాళ్లపాటు ఆటగాళ్ల కోసం పని చేశాడాయన. ఆ తర్వాత హార్టికల్చర్‌తో ‘పొప్పా జీ’ అనే బిరుదు దక్కించుకున్నాడు. భారీ క్యాలిప్లవర్లు పండించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1979 అక్టోబర్‌లో ఆయనకు గుండెపోటు రాగా.. ఐదు నెలలపాటు ఆస్పతత్రిలో పొందుతూ.. చివరికి 1980, మార్చి18న కన్నుమూశాడు. ఆయన గౌరవార్థం.. 2012లో స్టోక్ మండ్‌విల్లే స్టేడియం బయట కాంస్య విగ్రహాన్ని ఉంచారు. అదే ఏడాది జరిగిన లండన్ పారా ఒలింపిక్స్ కమిటీకి ఆయనకూతురు ఎవా లోయిఫ్లెర్ను మేయర్‌గా నియమించారు. జర్మనీ ప్రభుత్వం ఆయనకు మెడికల్ సొసైటీ ప్రైజ్‌తో సత్కరించింది. రష్యా ప్రభుత్వం 2013లో స్టాంప్ రిలీజ్ చేసింది. ఇప్పుడు గూగుల్ 122వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌తో స్మరించుకుంది. చదవండి: అంతరిక్షంలోకి తెలుగు ధీర.. శిరీష బండ్ల -
ఈ సినిమాకు కథ–కర్మ–క్రియా ‘హిట్లర్’
మహా నియంత హిట్లర్‌పై ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే ఒక సినిమాకు హిట్లర్ అనధికారికంగా అన్నీ తానై వ్యవహరించాడు. ఆ సినిమా పేరు ట్రయంప్ ఆఫ్ ది విల్ (మార్చి 28, 1935లో విడుదలైంది) ఈ నాజీ భావజాల చిత్రానికి లెని రిఫెన్స్టాల్ రచన, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హోదా(అనధికారికంగా)తో పాటు, ఫ్రేమ్ టు ఫ్రేమ్‌లో హిట్లర్ హస్తం ఉందట. ఈ సినిమా నటబృందంలో హిట్లర్ పేరు కూడా కనిపిస్తుంది. అదేంటి హిట్లర్ నటించాడా? అదేం కాదుగానీ గంభీరంగా ఉపన్యాసం ఇస్తున్న హిట్లర్ ఇందులో కనిపిస్తాడు. ‘హిట్లర్ ట్రయంప్ ఆఫ్ ది విల్ స్పీచ్’గా ఇది బాగా పాప్లర్ అయింది. 111 నిమిషాల నిడివిగల ఈ చిత్రం భావజాల ప్రచారచిత్రమే అయినప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలలో ఉపయోగించే మూవింగ్ కెమెరాలు, ఏరియల్ ఫొటోగ్రఫీ, లాంగ్–ఫోకస్ లెన్స్.. మొదలైన వాటిని ఈ చిత్రంలో ఉపయోగించారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా జర్మనీలోనే కాదు యూఎస్, ఫ్రాన్స్, స్వీడన్... మొదలైన దేశాల్లో అవార్డ్లు గెలుచుకుంది. l -
హిట్లర్ టోపీ ధర ఎంతో తెలుసా!
మ్యూనిచ్ : అడాల్ఫ్ హిట్లర్.. ప్రపంచంలో ఈ పేరు తెలియనివారు ఉండరు. రెండో ప్రపంచ యుద్దం జరగడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో హిట్లర్ కూడా ఒకరు. నాజీ వ్యవస్ధాపకుడైన హిట్లర్ జర్మనీకి ఒక నియంతలా వ్యవహరిస్తూ అందరి మాటను పెడచెవిన పెడుతూ తన చావును తానే కొనితెచ్చుకున్నాడు. హిట్లర్ ప్రవర్తనతో పాటు అతని ఆహార్యం కూడా వింతగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా ! ఏం లేదండి.. హిట్లర్ చనిపోయి 74 సంవత్సరాలు అయినా ఆయన ధరించిన కొన్ని వస్తువులు మాత్రం మ్యూనిచ్ ప్రాంతంలోని ఒక మ్యూజియంలో భద్రపరచారు. తాజాగా హిట్లర్‌కు సంబంధించి ఆయన తరచూ ధరించే టోపీతో పాటు నాజీకి సంబంధించిన వస్తువులను బుధవారం ఆన్లైన్లో వేలం వేశారు. అయితే వీటిని చేజెక్కించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పోటీ పడ్డారు. కాని, స్విట్జర్లాండ్‌కు చెందిన అబ్దుల్లా చతీలా అనే వ్యాపారవేత్త హిట్లర్ ధరించిన టోపీని వేలంలో 50 వేల యూరోలకు (సుమారు రూ. 40లక్షలు) దక్కించుకున్నారు. అయితే దీనిని ఇజ్రాయెల్ నిధుల సేకరణ సంస్థ అయిన కెరెన్ హేసోడ్కుకు విరాళంగా ఇచ్చాడు. అయితే ఆఫర్లో ఉన్న మిగతా నాజీ వస్తువులను మాత్రం పొందలేకపోయాడు. కాగా, నాజీ వస్తువులను పొందడానికి ఇతరులు బారీ మొత్తంలోనే సమర్పించుకున్నట్లు తెలుస్తుంది. -
హిట్లర్ మెచ్చిన భారత క్రీడాకారుడు ఎవరో తెలుసా?
క్రికెట్‌ను ఓ మతంలా అభిమానించే మనదేశంలో ఒకప్పుడు ఆ క్రీడాకారుడి కోసం ఆటపై మక్కువ పెంచుకున్నారు. అతి సామాన్యుల నుంచి హిట్లర్ వంటి నియంత కూడా అతని ఆటకు ఫిదా అయ్యారంటే అతని స్పెషాలిటీ ఏంటో వేరే చెప్పక్కర్లేదు. ఇంతకీ ఆ క్రీడాకారుడు ఎవరు? ఆయన సృష్టించిన అద్భుతాలు ఏంటి? తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
హిట్లర్ మెచ్చిన భారత క్రీడాకారుడు!
-
రేపే ‘హిట్లర్’బాబు పతనమయ్యేది!
సాక్షి, హైదరాబాద్ : వంద మందిని తిన్న రాబందు ఒక్క గాలి వానకు నేల కూలుతుందన్నది ఎంత నిజమో.. ఎంతటి వారైనా సమయం వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోతారన్నది కూడా అంతే నిజమని చరిత్ర చెబుతోంది. ప్రపంచాన్నే శాసించాలనుకున్న హిట్లర్.. చివరకు నియంతగా చరిత్రలో మిగిలిపోయాడు. కాకతాళీయమో.. యాదృశ్చికమో కానీ నియంత హిట్లర్ జన్మదినం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఒకే రోజు (ఏప్రిల్ 20). ఇక జర్మనీలో హిట్లర్ పాలన అంతమైన రోజు 1945 మే 23 కాగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మే 23( రేపే) వెలువడటం విశేషం. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు పతనం కూడా మే 23నే కాబోతుందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. హిట్లర్ బాబు పాలన రేపటితో ముగియనుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సైతం విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. చక్రం తిప్పడం అంటే ఢిల్లీ చుట్టూ తిరగడం కాదనీ, ఢిల్లీ నేతలను మన చుట్టూ తిప్పుకోవడమనే సైరా పంచ్‌తో చురకలటించారు. ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారని, కానీ చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయని మండిపడ్డారు. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని విమర్శించారు. 23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త పని కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడని, ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో వారెవరూ లేరన్నారు. వాళ్లే అసలు ఉద్యోగం లేక, సగం పనితో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.