హిట్లర్‌ను చంపాలనుకున్న జర్మన్ అధికారి
జూలై 20, 1944న 36 సంవత్సరాల జర్మనీ ఆఫీసర్ అయిన కో క్లాస్ షెంక్ గ్రాఫ్ వాన్ స్టాఫెన్‌బర్గ్, అత్యంత భద్రతా వలయంలో ఉన్న తూర్పు ప్రష్యాలోని అరణ్యంలోకి ప్రవేశించాడు. అతని లక్ష్యం హిట్లర్‌ని హతమార్చడం.
ఉల్ఫ్స్ లెయిర్... హిట్లర్ రహస్య స్థావరం. స్టాఫెన్‌బర్గ్ ఎప్పటిలాగే ఆ రోజు కూడా రోజువారీ కార్యక్రమాల గురించి చెప్పడానికి వచ్చాడు. అయితే ఆ రోజు అతని చేతిలో ఉన్న బ్రీఫ్‌కేస్‌లో బాంబ్‌ను తీసుకువచ్చాడు.
‘‘హిట్లర్ రాగానే మేమందరం లేచి నిలబడ్డాం. అప్పుడు మా సభ ప్రారంభమైంది’’ అంటూ 1967లో జర్మన్ ఆఫీసర్ జెన్‌వాల్టేర్ వార్లిమాంట్ గుర్తుకు తె చ్చుకున్నారు.
‘‘హఠాత్తుగా తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. నేను వెంటనే అటుఇటు చూశాను. కలనల్ రావడం గమనించాను... అతడు నా వైపే తీక్షణంగా చూస్తున్నాడు. ఎందుకంటే అతడి కుడి కంటి మీద ఏదో నల్లటి చారిక ఉంది. ఒక చేతిని ఆ కంటి మీద ఉంచాడు. ఆయన వచ్చి నిశ్చలంగా నిలబడ్డాడు. ఆ సమయంలో అతడు నాకు ఒక ఉన్నతమైన సైనికుడిలా కనిపించాడు’’ అంటారు బెర్థోల్డ్.
‘‘హిట్లర్ అతడి వైపు ఎటువంటి సానుభూతీ ప్రదర్శించలేదు. అయితే అక్కడే ఉన్న జనరల్ కీటెల్ అతడిని పరిచయం చేశాడు’’
స్టాఫెన్‌బర్గ్ గర్విష్టి. క్యాథలిక్, ఆర్మీ ఆఫీసర్. ‘‘మా నాన్నగారు చాలా బాగుంటారని అందరూ అనేవారు. నల్లటిజుట్టు, నీలిరంగు కళ్లు, గాలికి సన్నగా ఎగిరే పొడవాటి జుట్టు. ఆయన చాలా ఉల్లాసంగా ఉంటారు. ఆయన చాలా సేపు నవ్వుతూనే ఉంటారు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం’’ అంటారు ఆయన కుమారుడైన ఎనభై సంవత్సరాలబెర్థోల్డ్ షెంక్ గ్రాఫ్ వాన్ స్టాఫెన్‌బర్గ్.
1943లో, స్టాఫెన్‌బర్గ్, ట్యునీషియాకి సేవలు అందిస్తూ బాగా గాయపడ్డాడు. అందులో ఒక కన్ను, కుడిచేయి, ఎడమచే యిలోని రెండు వేళ్లు పోగొట్టుకున్నాడు.
‘‘గాయాలు కావడం సాధారణం. అలాగే ఆ సమయంలో చెయ్యి పోగొట్టుకోవడం, కళ్లు పోగొట్టుకోవడం కూడా సర్వసాధారణం. అతడు బతకడమే ఒక పెద్ద ఉపశమనం’’ అంటారు బెర్థోల్డ్.
స్టాఫెన్‌బర్గ్ బహిరంగంగా రాజకీయవేత్త కాకపోయినా జాతీయవాది, సంప్రదాయవాది. అప్పుడప్పుడు నాజీ సిద్ధాంతాలను బలపరచేవాడు. అయితే యుద్ధం జరుగుతుండటంతో, రానురాను అతడి ఆలోచనాధోరణి మారింది. తూర్పుభాగం మీద జర్మన్ చేస్తున్న దురాగతాలు అతడి మనసును కలచివేశాయి. ఆ కారణంగా జర్మనీ యుద్ధంలో ఓడిపోతోందని తెలుసుకున్నాడు.
‘‘ఆయనకు హిట్లర్ విధానాల మీద, ఆయన శక్తిసామర్థ్యాల మీద నమ్మకం పోయింది. అంతవరకు మేము చూసిన హిట్లర్ వేరు’’ అంటారు స్టాఫెన్‌బర్గ్.
‘‘అప్పుడు నాకు పది సంవత్సరాలు. ప్రపంచంలో జరుగుతున్న అంశాలు చాలా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. మిగతా అందరిలాగే నాకు కూడా నాజీ అవ్వాలనే కోరిక ఉండేది. అయితే ఎన్నడూ మా తల్లిదండ్రులతో ఈ విషయం గురించి సంప్రతించలేదు. ఒకవేళ మా నాన్నగారు మాతో చ ర్చించి ఉంటే, ఆయన తన అసలు భావాలను మా దగ్గర వ్యక్తపరచలేకపోయేవారు. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనవి. అవి వింటే పిల్లలు భయపడ కమానరు’’ అంటారు బెర్థోల్డ్.
ఆయన దెబ్బలు తగ్గుముఖం పట్టాక, స్టాఫెన్‌బర్గ్‌ని ఒక గూఢచారి సంస్థ సంప్రతించింది. దానికి నాయకుడు జెన్ హెన్నింగ్ వాన్ ట్రెస్కో. హిట్లర్‌ని చంపి, నాజీ వ్యవస్థను రూపుమాపాలన్నది ఆయన కోరిక. ఈ ఎత్తుగడకి స్టాఫెన్‌బర్గ్ ప్రధాన పాత్రధారి.
వారు అనుకున్నదే తడవుగా ఎన్నోసార్లు హిట్లర్‌ని హతమార్చడానికి చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలం అయ్యాయి. జర్మన్ సైనిక దళం జెస్టా పో ఈ రహస్యాన్ని ఛేదించి హత్యాయత్నానికి పాల్పడిన వారిని చంపేస్తుందనే భయం వారిలో మొదలైంది.
కాని 1944లో స్టాఫెన్‌బర్గ్ జర్మన్ రిప్లేస్‌మెంట్ ఆర్మీకి కమాండెర్ స్టాఫ్‌లో సభ్యుడయ్యాడు. ఈ ఉద్యోగ విధులలో స్టాఫెన్‌బర్గ్ నేరుగా హిట్లర్‌ని కలిసే అవకాశం కలగడమే కాకుండా, హిట్లర్‌ను హతమార్చడానికీ వీలు ఏర్పడింది.
హిట్లర్, జర్మన్, అధికారి,
వీరు పన్నిన కుట్ర ప్రమాదభరితమైనది. స్టాఫెన్‌బర్గ్ తన బ్రీఫ్‌కేస్‌లో పేలుడు పదార్థాలు తీసుకువెడతాడు, నేరుగా హిట్లర్ దగ్గరకు వెళ్లిన తరవాత ఆయనకు ఆ రోజు కార్యక్రమాల గురించి వివరించేటప్పుడు ఆ బ్రీఫ్‌కేస్‌ను హిట్లర్ దగ్గర ఉంచుతాడు. మాటలు పూర్తయిన తర్వాత ఆ గది నుంచి బయటకు వస్తాడు. గదిలో పేలుడు పదార్థాలు పేలగానే, బెర్లిన్‌కి స్టాఫెన్‌బర్గ్ వచ్చి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆర్మీని మార్పుచేస్తారు. ఇదీ వారి పన్నాగం...
‘‘అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందన్న నమ్మకం వారికి లేదు. కాని గ్రెస్కో మాత్రం ‘హిట్లర్ మరణించి తీరాలి’ అన్నాడు. అప్పుడే అర్థం అవుతుంది ... జర్మన్లంద రూ ఆయన అనుచరులు కాదని’’ అన్నారు స్టాఫెన్‌బర్గ్.
ఒకవేళ వీరి కుట్ర ఫలించకపోతే, కుట్రదారులు కష్టాలలో చిక్కుకున్నట్లే. ‘‘మా అమ్మ ఎప్పుడూ అంటుండేది, నాన్న పన్నిన పన్నాగం ఆమెకు తెలుసని. ఆమె ఈ విషయంలో మా నాన్నగారిని ప్రశ్నించింది. దానితో ఆయన విషయమంతా వివరించారు. అయితే ఆమెకు తెలియని విషయం ఒకటుంది... అది మా నాన్నగారే బాంబ్ పెడతారని’’
‘‘పరిణామాలేంటో వారికి తెలుసు. అయితే యుద్ధ సమయంలో, జీవితానికి ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం శాంతిస్థాపన కోసమే ఎదురుచూస్తారు. మనుషులు ఎప్పటికైనా మరణించేవారే, కనుక యుద్ధంలో మరణిస్తే అది దేశం కోసం చేసిన ప్రాణత్యాగం’’
జూలై 20, గురువారం నాడు స్టాఫెన్‌బర్గ్... ఉల్ఫ్స్ లేయిర్ చేరుకున్నారు. ఆరోజు కార్యక్రమాల వివరాలు12.30 నిమిషాలకు చెప్పాలి. అయితే ఆయన బాంబు పెడుతుండగా ఆయనకు ఎవరో అంతరాయం కలిగించారు. అందువల్ల మీటింగ్‌కి వెళ్లే లోపుగా ఆయన తాను తెచ్చిన రెండు బాంబులలో కేవలం ఒక దానిని మాత్రమే పెట్టగలిగారు.
‘‘నల్లరంగులో ఉన్న పెద్ద బ్రీఫ్ కేస్‌ను స్టాఫెన్‌బర్గ్ తన చేతుల కింద ఉంచుకోవడం నాకు బాగా గుర్తు’’ అన్నారు 1967లో వార్లిమాంట్.
‘‘అతడిని నేను పెద్ద తీక్షణంగా చూడలేదు. అందువల్ల అతడు టేబుల్ కింద బాంబ్ పెట్టి, కొద్ది క్షణాలకే అతడు గది విడిచి వెళ్లడాన్ని నేను గమనించలేదు. సుమారు పది నిమిషాలయ్యాక, బాంబ్ విస్ఫోటనం జరగడంతో నేను అతడి గురించి మర్చిపోయాను’’
బాంబు విస్ఫోటనం జరగ్గానే స్టాఫెన్‌బర్గ్ వెనక్కి తిరిగి చూడకుండా బెర్లిన్ వెళ్లిపోయాడు. హిట్లర్ తప్పనిసరిగా చనిపోయి ఉంటాడని అతడు భావించాడు.
అయితే విస్ఫోటనం జరగడానికి ముందే, ఆ బ్రీఫ్‌కేస్ హిట్లర్ కాలికి తగిలి, టేబుల్ కింద కొద్దిగా పక్కకి జరిగింది. అంతేకాకుండా స్టాఫెన్‌బర్గ్ వాళ్లు అనుకున్నట్లుగా ఆ బాంబ్ మరీ ప్రమాదకరమైనది కాదు, అయితే బాంబు పేలడానికి ముందే హిట్లర్ మ్యాపుల్ని చూడటం కోసం దట్టంగా ఉన్న ఓక్ కలపతో తయారైన టేబుల్ మీదికి వంగాడు. బాంబు దుర్ఘటనలో నలుగురు మరణించారు, అనేకమంది గాయాలపాలయ్యారు. హిట్లర్ మాత్రం బతికి బయటపడ్డాడు.
‘‘బాంబు పేలిన శబ్దం విని, ఏదో పెద్ద షాండ్లీర్ నా నెత్తి మీద పడిందనుకున్నాను. నేను కిందికి వెళ్లాను. హిట్లర్‌ని అప్పటికే బయటకు తీసుకువెళ్లిపోయారు. అయితే ఆయనకు పెద్దగా గాయాలు తగిలి ఉండవనుకున్నాను’’ అని గుర్తు తెచ్చుకున్నారు వార్లీమాంట్.
కొద్దిసేపటికే ఏం జరిగిందో తెలిసిపోయింది. స్టాఫెన్‌బర్గ్, ఇంకా ఇతర కుట్రదారుల్ని బెర్లిన్‌లోని వార్ ఆఫీస్‌లో అరెస్ట్ చేసి, కాల్చి చంపారు.
ఆ సమయంలో స్టాఫెన్‌బర్గ్ భార్య నీనా గర్భవతి. అప్పుడు ఆమెతో పాటు నలుగురు పిల్లలూ ఉన్నారు. బెర్థోల్డ్‌కి ఏం జరుగుతోందో అర్థం కాలేదు.
‘‘రేడియోలో సమాచారమంతా విన్నాను. నాకు అప్పటికి పది సంవత్సరాలు. నేను ప్రతిరోజూ వార్తాపత్రిక చదివేవాడిని. ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకున్నాను. మా ఇంట్లోని పెద్దవాళ్లంతా నన్ను రేడియోకి దూరంగా ఉంచేవారు. నేను, మా అన్నయ్య .. మా మేనమామతో చాలా దూరం వాకింగ్‌కి వెళ్లినప్పుడు ఆయన ఆఫ్రికాలోని పెద్ద లేడిని ఏవిధంగా వేటాడిందీ వివరించారు’’
‘‘ఆ మరుసటి రోజు మా అమ్మ నాతో ఒక విషయం చెప్పింది, ఆ బాంబుని ఉంచింది మా నాన్నగారేనని. నేను ఆశ్చర్యంతో ‘ఇలా ఎలా చేశారు’ అన్నాను. ‘ఆయన జర్మనీ కోసం చేస్తున్నానని నమ్మారు’ అని చెప్పింది.’’
‘‘నేను ఒక్కసారిగా షాకయ్యాను. నాకు నమ్మకం కుదరలేదు. అది కూడా హిట్లర్ మీద! అంతవరకు స్కూల్‌లో పాఠాల్లో హిట్లర్ గొప్పదనం గురించి చదువుకున్నాను’’
ఆ రాత్రి జెస్టా పో వారు వచ్చారు. బెర్థోల్డ్ తల్లిని, అమ్మమ్మని, పెద్ద మామయ్యని అరెస్ట్ చేశారు. బెర్థోల్డ్‌ని, అక్కయ్యను మాత్రం బాలల గృహానికి పంపారు.
‘‘ఇలా ఎందుకు చేశారని మేమెప్పుడూ చర్చించుకోలేదు. ఇంటిపేరుతో ఎక్కడ గుర్తిస్తారోననే భయంతో మా పేర్లు కూడా మార్చేశారు’’
ఈ గొడవ జరిగిన తర్వాత వేలాదిమందిని అరెస్ట్ చేశారు. బెర్థోల్డ్ తల్లిని జెస్టా పో సైనికులు అరెస్ట్ చేశారు. ఆ తరవాత కొంత కాలానికి ఆమెను ఆమె పిల్లల వద్దకు చేర్చారు. ఆమె పునర్వివాహం చేసుకోలేదు. ‘‘మా అమ్మకి నాన్నంటే ప్రాణం. ఆమెకు ప్రాణం పోసింది ఆయనేనని ఆమె నమ్ముతుంది’’ అంటారు బె ర్థోల్డ్.
చాలా కాలం తర్వాత -
వెస్ట్ జర్మనీ ఆర్మీలో బెర్థోల్డ్ జనరల్ అయ్యాడు. ఆయన తన కుటుంబంతో తన స్వస్థలంలోనే నివసిస్తున్నాడు.
కర్టెసీ: బిబిసి న్యూస్
- డా. పురాణపండ వైజయంతి