రొమాంటిక్‌ హిట్లర్‌.. | Hitler romance with Raubal | Sakshi
Sakshi News home page

నియంతలో మరో కోణం

Published Fri, Oct 6 2017 11:55 AM | Last Updated on Fri, Oct 6 2017 2:27 PM

Hitler romance with Raubal

అడాల్ఫ్‌ హిట్లర్‌.. చరిత్ర మరువని నరహంతకుడు. రెండో ప్రపంచముద్ధం మొదలు.. యూదులు అత్యంత పాశవికంగా హింసించి చంపిన నియంత. రెండో ప్రపంచయుద్ధంలో ఓటమి తప్పదని తెలిసి.. ఆత్మహత్య చేసుకున్న జర్మన్‌ అధినేత. హిట్లర్‌ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ.. అందులోనూ అత్యంత కౄరుడు, నిర్దయుడు, రాక్షసుడు అనే తెలుసు.. ఆయనలోనూ ఒక ప్రేమికుడున్నాడు.. ఒక శృంగార పురుషుడు ఉన్నాడనే విషయం బయటి ప్రపంచానికి దాదాపు తెలియదనే చెప్పాలి.

హిట్లర్‌లోని ఈ కోణం చాలా ఏళ్ల తరువాత ఈ మధ్యే బయటపడింది. అది కూడా హిట్లర్‌కు మేనకోడలు వరుస అయ్యే ఏంజెలా గెలి రబెల్‌తో ఆయనకున్న అత్యంత సన్నిహిత సంబంధం కూడా ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ ఏకాంతంగా గడిపిన క్షణాలు.. హిట్లర్‌లోని మరో కోణాన్నితెలిపే కొన్ని ఫొటోలు బయటపడ్డాయి.

ఇంతకూ రబెల్‌ ఎవరం‍టే?
ఆస్ట్రియాలో 1908లో పుట్టిన రబెల్‌ హిట్లర్‌కు మేనకోడలు వరుస అవుతుంది. హిట్లర్‌ మీద ప్రేమతో ఆమె జర్మనీకి వచ్చింది. ఆకట్టుకునే అందం.. ఆమె సొంతం. హిట్లర్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో ఆమె ఒకరు. కేవలం 23 ఏళ్ల వయసులో అంటే 1931 సెప్టెంబర్‌ 18.. ఆమె మ్యూనిచ్‌లోని అపార్ట్‌మెంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఎరుపురంగు నైట్‌డ్రెస్‌లో.. ఆమె ఉన్నారు. ఆమె ఆత్మహత్యపై అప్పట్లో భిన్న కథనాలు వచ్చాయి.

హిట్లర్‌ అధికారంలోకి వచ్చాక..!
సాధారణ అమ్మాయిగా జర్మనీ వచ్చిన రూబెల్‌.. హిట్లర్‌కు దగ్గర కావడంతో ఒక సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె అందం.. ప్రవర్తన.. హిట్లర్‌తో బంధం.. ఆమెకు నాజీ పార్టీలోని ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. హిట్లర్‌ అధికారంలోకి వచ్చాక.. తన అందం.. ప్రేమతో హిట్లర్‌ను రూబెల్‌ కట్టడి చేసే ప్రయత్నం చేసింది. అంతేకాక హిట్లర్‌తో కలిసి ఆస్ట్రియాకు వెళ్లాలని ఒక దశలో తీవ్ర ప్రయత్నం చేసింది.

రబెల్‌ ఇంట్లోనే బందీ
రబెల్‌ అందం.. పార్టీలోన ఆమెకున్న ప్రత్యేక గుర్తింపుతో హిట్లర్‌.. ఆమెను ఇంటికే పరిమితం చేశాడు.. ఆమె మీద అనుమానాలు పెరగడంతో పనివాళ్లను కూడా మార్చేసి.. అందరినీ అడవాళ్లనే పెట్టాడు. అయితే కారు డ్రైవర్‌ ఎమిల్‌ మౌర్సీతో రబెల్‌కు శారీరక సంబంధం ఉందన్న అనుమానం హిట్లర్‌కు వచ్చింది. వెంటనే మౌర్సీని కాల్చి చంపి.. రబెల్‌ను మరోచోటకు మార్చాడు. అక్కడ నుంచి ఆమె తప్పించుకుని ఆస్ట్రియా పారిపోయేందుకు పలుసార్లు ప్రయత్నించి విఫలమైంది.

ఆత్మ ‘హత్య’
కొత్త ప్రాంతంలో నివాసముంటున్న రూబెల్‌ ఒక రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున సమయంలో ఒక ససైడ్‌ నోట్‌ రాసింది. అందులో.. నేను త్వరలోనే వియాన్నకు వస్తానన్న నమ్మకం ఉంది.. ఒక వేళ రాలేకపోతే.. ఈ జీవితం ఇంతే అని రాసింది. తరువాత ఆమె హ్యాండ్‌గన్‌తో తనను తాను కాల్చుకుని చనిపోయింది. అయితే ఈ అత్మహత్యపై పలు అనుమానాలున్నాయి. హిట్లరే హత్య చేసుంటాడు.. అని వారిద్దరి బంధం ఎరిగినవారు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement