Munich
-
రష్యా పైకి ‘ఆర్మీ ఆఫ్ యూరప్’
మ్యూనిక్: యూరప్ ఖండానికి అవసరమైన సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా లేదని అర్థమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో యూరప్ దేశాలు రష్యా దురాక్రమణ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘ఆర్మీ ఆఫ్ యూరప్’ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో జెలెన్స్కీ మాట్లాడారు. తమ ప్రమేయం లేకుండా, తమకు తెలియకుండా చేసుకునే ఒప్పందాలను ఉక్రెయిన్ అంగీకరించబోదని ఆయన తేల్చి చెప్పారు. అదేవిధంగా, యూరప్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు యూరప్ దేశాలకు కూడా ఆ చర్చల్లో స్థానం కల్పించాలన్నారు. శాంతి చర్చలు ప్రారంభించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధమయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయనీ విధంగా వ్యాఖ్యానించారు. యూరప్, అమెరికాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం ఇక ముగిసినట్లేనంటూ అమెరికా ఉపాధ్యక్షుడు శుక్రవారం సదస్సులో పేర్కొన్న విషయాన్ని జెలెన్స్కీ గుర్తు చేస్తూ..‘ఇప్పటి నుంచి కొత్త పరిణామాలు సంభవించనున్నాయి. వీటికి యూరప్ సమాయత్తం కావాల్సి ఉంది’అని అన్నారు. ‘ఇతర దేశాల నుంచి మనకు బెదిరింపులు ఎదురైతే తమకు సంబంధం లేదని అమెరికా తెగేసి చెప్పేందుకు అవకాశముందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అమెరికాపై ఆధారపడకుండా యూరప్ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలంటూ గతంలో ఎందరో నేతలు చెప్పారు. అవును, మనకిప్పుడు సైన్యం కావాలి. అదే ఆర్మీ ఆఫ్ యూరప్’అని ఆయన స్పష్టం చేశారు.ముఖాముఖి చర్చలకు అంగీకరించడం ద్వారా పుతిన్ అమెరికాను ఏకాకిగా మార్చారన్నారు. -
Munich: జనంపైకి దూసుకెళ్లిన కారు.. పలువురికి తీవ్ర గాయాలు
బెర్లిన్: జర్మనీ ప్రముఖ నగరం మ్యూనిచ్‌లో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారుతో జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి.. భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. గురువారం సిటీ సెంట్రల్ ట్రైన్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ ఆపరేషన్ జరుగుతోందని అక్కడి అధికారులు ప్రకటించారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? ఉద్దేశపూర్వకంగా జరిపిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జర్మనీలో అత్యధిక రద్దీ ఉండే నగరాల్లో మ్యూనిచ్ ఒకటి. బేవరియా స్టేట్ రాజధాని ఇది. శుక్రవారం ఈ నగరంలో భద్రతా సదస్సు జరగాల్సి ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ కాన్సరెన్స్ను హజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవాళ ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఘటనలో గాయపడ్డవాళ్లంతా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్లేనని సమాచారం. -
ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ మధ్య లుఫ్తాన్సా విమానాలు
న్యూఢిల్లీ: భారత ఏవియేషన్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఏడాది మరిన్ని కొత్త రూట్లలో ఫ్లయిట్ సర్వీసులను ప్రారంభించ నున్నట్లు యూరప్‌కి చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా వెల్లడించింది. ఫ్రాంక్ఫర్ట్ -హైదరాబాద్, మ్యూనిక్-బెంగళూరు రూట్లు వీటిలో ఉంటాయని పేర్కొంది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) ఫ్రాంక్ఫర్ట్- హైదరాబాద్ మధ్య ఫ్లయిట్లు రాబోయే శీతాకాలంలో ప్రారంభం కాగలవని, నవంబర్ 3న మ్యూనిక్-బెంగళూరు ఫ్లయిట్స్ మొదలవుతాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు హ్యారీ హోమీస్టర్ తెలిపారు. మ్యూనిక్ - బెంగళూరు మధ్య వారానికి మూడు సర్వీసులు ఉంటాయని పేర్కొన్నారు. దాదాపు 90 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న లుఫ్తాన్సా గ్రూప్ .. ప్రస్తుతం వారానికి 50 పైగా ఫ్లయిట్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి ఫ్రాంక్ఫర్ట్, జ్యూరిక్ వంటి సిటీలకు విమానాలను నడుపుతోంది. (షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!) -
చైనాతో అత్యంత క్లిష్టంగా సంబంధాలు
మ్యూనిక్: చైనాతో భారత సంబంధాలు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించవద్దన్న ఒప్పందాలను చైనా ఉల్లంఘించడంతో పరిస్థితి మరింత విషమించిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి సరిహద్దుల్లోని పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (ఎంఎస్సీ)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు 45 ఏళ్ల పాటు శాంతియుతంగానే ఉన్నాయని గుర్తు చేశారు. చైనా వంటి ఒక పెద్ద దేశం ఒప్పందాలను ఉల్లంఘిస్తే అది అంతర్జాతీయ సమాజమంతా ఆందోళన చెందాల్సిన విషయమేనన్నారు. సుదూరాల్లోని చిన్న దేశాలకు భారీగా అప్పులిచ్చి అక్కడి వ్యూహాత్మక ప్రాంతాలను చైనా తన అదుపులోకి తెచ్చుకుంటున్న తీరు ఆందోళనకరమని జై శంకర్ అన్నారు. అనుసంధానం ముసుగులో చేస్తున్న ఇలాంటి పనులు ఇతర దేశాల సార్వభౌమత్వానికి ముప్పని అభిప్రాయపడ్డారు. క్వాడ్‌ను ఆసియా నాటో అనడం సరికాదని స్పష్టం చేశారు. -
ఫిబ్రవరి 6, 1958.. ఫుట్‌బాల్ చరిత్రలో అతి పెద్ద విషాదం
చరిత్రలో కొన్ని ఘటనలు విషాదాలుగా మిగిలిపోయాయి. సమయం వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావించుకోవడం తప్ప వాటిని మార్చలేం. అలాంటి కోవకు చెందినది 1958 మునిచ్ ఎయిర్ డిజాస్టర్. మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన ఫుట్‌బాల్ టీమ్‌తో వెళ్తున్న ఎయిర్‌క్రాప్ట్ క్రాష్ అవడంతో అందులో ఉన్న 23 మంది ఆనవాళ్లు లేకుండా పోయారు. ఫుట్‌బాల్ చరిత్రలోనే అతి పెద్ద విషాదంగా మిగిలిపోయిన ఆ ఘోర దుర్ఘటనకు నేటితో(ఫిబ్రవరి 6) 64 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరోజు ఏం జరిగింది.. 1958 ఫిబ్రవరి 6.. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ మంచి ఉత్సాహంతో ఉంది. ఏ మ్యాచ్‌లో పాల్గొన్న విజయం వారిదే అవుతుంది. ఎందుకంటే జట్టు మొత్తం యువ ఆటగాళ్ల రక్తంతో నిండిపోయింది. ఉరకలేసే ఉత్సాహానికి తోడు మంచి మేనేజర్ కలిగి ఉన్నాడు. అందుకే ఆ జట్టుకు బస్బే బేబ్స్ అని నిక్‌నేమ్ వచ్చింది. జర్మనీలోని మ్యునిచ్‌లో మ్యాచ్ ఆడడానికి ఫుట్‌బాల్ ప్లేయర్లు సహా ఇతర సిబ్బంది ఎయిర్‌బేస్‌లో బయలుదేరారు. విజయంతో తిరిగి రావాలని మాంచెస్టర్ ప్రజలు దీవించి పంపారు. కానీ వారి దీవెనలు పనిచేయలేదు. ఆకాశంలో ఎగిరిన కాసేపటికే ఎయిర్‌బేస్‌కు ట్రాఫిక్ సంబంధాలు తెగిపోయాయి. 𝑭𝒐𝒓𝒆𝒗𝒆𝒓 𝒂𝒏𝒅 𝒆𝒗𝒆𝒓, 𝒘𝒆'𝒍𝒍 𝒇𝒐𝒍𝒍𝒐𝒘 𝒕𝒉𝒆 𝒃𝒐𝒚𝒔. In 2018, our participants joined @ManUtd players to record this moving poem to mark the 60th anniversary of the Munich Air Disaster. Today, we share it again, as we remember the #FlowersOfManchester 🔴❤️ pic.twitter.com/rOk3tsdIDQ — Manchester United Foundation (@MU_Foundation) February 6, 2022 దీంతో ఎయిర్‌బేస్ కుప్పకూలిందేమోనన్న అనుమానం కలిగింది. వారి అనుమానమే నిజమయింది. సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిన ఎయిర్ బేస్‌లో ఉన్న 8 మంది ఫుట్‌బాల్ ప్లేయర్స్ సహా, మాంచెస్టర్ యునైటెడ్ సిబ్బంది, జర్నలిస్టులు, ఎయిర్‌బేస్ సిబ్బంది సహా మరో ఇద్దరి ప్రయాణికులు మొత్తం 23 మందిలో ఏ ఒక్కరు బతికి బట్టకట్టలేదు. మ్యునిచ్ ఎయిర్‌బేస్ విమాన శకలాలు ఇప్పటికి అక్కడే ఉన్నాయి. చనిపోయిన వారి జ్ఞాపకార్థం అక్కడే మ్యూజియం ఏర్పాటు చేసి విమాన శకలాలను భద్రపరిచారు. మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్ళు జియోఫ్ బెంట్ రోజర్ బైర్న్ ఎడ్డీ కోల్మన్ డంకన్ ఎడ్వర్డ్స్ మార్క్ జోన్స్ డేవిడ్ పెగ్ టామీ టేలర్ లియామ్ "బిల్లీ" వీలన్ మాంచెస్టర్ యునైటెడ్ సిబ్బంది వాల్టర్ క్రిక్మెర్ - క్లబ్ కార్యదర్శి టామ్ కర్రీ - శిక్షకుడు బెర్ట్ వాలీ - చీఫ్ కోచ్ ఎయిర్‌బేస్ సిబ్బంది కెప్టెన్ కెన్నెత్ రేమెంట్ టామ్ కేబుల్ జర్నలిస్టులు ఆల్ఫ్ క్లార్క్ డానీ డేవిస్ జార్జ్ అనుసరిస్తాడు టామ్ జాక్సన్ ఆర్చీ లెడ్బ్రూక్ హెన్రీ రోజ్ ఫ్రాంక్ స్విఫ్ట్ ఎరిక్ థాంప్సన్ -
BMW Circular EV: కారుని ఇలా కూడా తయారు చేస్తారా!
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు.. పేరు ఐవిజన్ సర్క్యులర్.. ఎలక్ట్రిక్ కారు అంటే.. పర్యావరణ అనుకూలమైనదన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటన్నింటిని తలదన్నెలా బీఎండబ్ల్యూ సంస్థ సర్కులర్ పేరుతో కొత్త కారుని మార్కెట్లోకి తేబోతుంది. ఈ మేరకు ఈ కారు నమూనాను జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న మొబిలిటీ షోలో ప్రదర్శించారు. త్వరలో రాబోయే ఈ కారు ఆటో మొబైల్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తుందని చెబుతున్నారు. రీసైకిల్డ్ మెటీరియల్‌తో బీఎండబ్ల్యూ సంస్థ సర్కులర్ కారుని పూర్తిగా రీసైకిల్డ్ మెటీరియల్‌తో తయారుచేశారు. అంతేకాదు.. ఈ కారు జీవిత కాలం ముగిసిన తర్వాత కారులోని భాగాలన్నిటినీ మళ్లీ రీసైకిల్ చేసి.. కొత్త కార్ల తయారీలో ఉపయోగించవచ్చని ఆ సంస్థ చెబుతోంది. కారు బాడీ మొత్తాన్ని ఐనోడైజ్డ్ అల్యుమీనియంతో తయారు చేశారు. ఇక ఇంటీరియర్‌లో క్యాబిన్ భాగం మొత్తాన్ని రీసైకిల్డ్ చేసిన ప్లాస్టిక్‌తో రూపొందించారు. ఇందులో ఉపయోగించిన బ్యాటరీ సైతం రీసైకిల్డ్ చేసినదే కావడం గమనార్హం. డిజైన్‌లోను అదే తీరు ఇక కారు డిజైన్ విషయానికి వస్తే అవుట్ లుక్ స్పోర్ట్స్ యుటిలిటీ, ఇన్నర్ డిజైన్ మల్టీ పర్పస్ యుటిలిటీ తరహాలో ఉంది. ప్రస్తుతం బీఎండబ్ల్యూ తయారుచేస్తున్న వాహనాల్లో 30 శాతం మేర పునర్వినియోగ సామగ్రిని వాడుతున్నారు. అయితే, 2040 సరికి తమ వాహనాలన్నింటినీ 100 శాతం రీసైకిల్డ్ మెటీరియల్‌తోనే తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సదరు సంస్థ తెలిపింది. ధరపై ఆసక్తి బీఎండబ్ల్యూ అంటేనే లగ్జరీ కార్లకు పేరు. ఆ సంస్థ నుంచి పూర్తిగా రిసైకిల్డ్ మెటీరియల్‌తో రూపొందిన ఐవిజన్ సర్క్యులర్ కారు ధర ఎలా ఉంటుందనే అసక్తి నెలకొంది. అయితే ఈ కారుని మార్కెట్లోకి ఎప్పుడు తెస్తారన్న వివరాలను బీఎండబ్ల్యూ ప్రకటించలేదు. చదవండి: BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..! -
BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..!
మ్యునీచ్: జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మోటార్ షోలో బీఎమ్‌డబ్ల్యూ తన కంపెనీ నుంచి వచ్చే రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రదర్శనకు ఉంచింది. హైస్పీడ్ ఎలక్ట్రిక్ సైకిల్, లో స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌లను బీఎమ్‌డబ్ల్యూ ఐఏఏ-2021 మొబిలిటీ షోలో టీజ్ చేసింది. ఈ షోలో భాగంగా బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ సీఈ-02 ఎలక్ట్రిక్ బైక్‌ను, బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ ఏఎమ్బీవై ఎలక్ట్రిక్ సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచింది చదవండి: బీఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్..! చూస్తే వావ్ అనాల్సిందే..! రేంజ్లో రారాజు..! బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYఎలక్ట్రిక్ సైకిల్ ఫీచర్స్ తెలిస్తే ఔరా అనాల్సిందే..! ఎలక్ట్రిక్ వాహన రంగంలో బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYసైకిల్ సంచలానాన్ని నమోదు చేయనుంది. బీఎమ్‌డబ్ల్యూ ఐ విజన్ AMBYసైకిల్లో అధిక శక్తి గల మోటార్, అత్యధిక సామర్థ్యం ఉన్న 2000Wh బ్యాటరీని ఏర్పాటుచేసింది. బ్యాటరీ ఏర్పాటుచేయడంతో ఒక్క సారి చార్జ్ చేస్తే నార్మల్ పవర్ మోడ్‌లో ఈ సైకిల్ సుమారు 300 కిమీ దూరం మేర ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ-సైకిల్‌ను స్మార్ట్‌ఫోన్ యాప్నుపయోగించి కూడా ఆపరేట్ చేయవచ్చును. ఈ సైకిల్ కనిష్టంగా గంటకు 25 వేగంతో, గరిష్టంగా 60 కిమీ వేగంతో ప్రయాణించనుంది. ఈ బైక్‌లో సరికొత్త జియోఫెన్సింగ్ మోడ్‌ను ఏర్పాటుచేశారు. ఈ మోడ్‌తో బైక్ ఆటోమోటిక్గా స్పీడ్‌ను నియంత్రిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ఈ సైకిళ్లను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు బీఎమ్‌డబ్ల్యూ పేర్కొంది. చదవండి: Mercedes EQE Electric Sedan: టెస్లాకు పోటీగా మెర్సిడిజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..! -
బీఎమ్‌డబ్ల్యూ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్..! చూస్తే వావ్ అనాల్సిందే..!
మ్యునీచ్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ తన కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మోటార్ షో (ఐఏఏ మొబిలిటీ-2021)లో ఆవిష్కరించింది. బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ తన కంపెనీ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్ సీఈ 02 కాన్సెప్ట్‌ను టీజ్ చేసింది. బీఎమ్‌డబ్ల్యూ ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని రానున్న రోజుల్లో మార్కెట్లోకి ఈ బైక్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణుల వెల్లడించారు. జర్మనీలో జరుగుతున్న ఐఏఏ మొబిలిటీ-2021 షోలో ఈ బైక్ ఆకర్షణగా నిలిచింది. పట్టణ నాగరికతకు ఈ బైక్ సూట్ అవుతోందని బీఎమ్‌డబ్ల్యూ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎమ్‌డబ్ల్యూ సీఈ 02 బరువు 120 కిలోలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌కు 11కిలోవాట్ మోటార్‌ను కలిగి ఉంది. సింగిల్ ఛార్జ్‌లో 90 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఈ బైక్ గరిష్టంగా 90కి.మీ వేగంతో ప్రయాణించనుంది. బీఎమ్‌డబ్ల్యూ సీఈ 02 బైక్ కాన్సెప్ట్ చూడడానికి రెండు చక్రాలపై స్కేట్‌బోర్డ్ కలిగిన బైక్‌గా పోల్చవచ్చునని బీఎమ్‌డబ్ల్యూ వెల్లడించింది. సీటింగ్ పోజిషన్‌ను ఫ్లెక్సిబుల్‌గా ఏర్పాటుచేసింది. దీంతో సీటింగ్ సౌకర్యవంతంగా ఉండనుంది. బీఎమ్‌డబ్ల్యూ సీఈ 02 బైక్ స్క్వేర్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌తో ఈ బైక్ ఆకర్షణీయమైన లుక్‌ను అందించనుంది. హ్యాండిల్‌కు చిన్న కలర్ డిస్ప్లే స్క్రీన్‌ను ఏర్పాటుచేసింది. ఈ బైక్‌లో సింగిల్ సైడెడ్ స్వింగార్మ్‌ను, డిస్క్ బ్రేక్‌తో 15 అంగుళాల టైర్లను కలిగి ఉంది. -
Corona Vaccine: సూది గుచ్చడంలో తేడాతో రక్తంలో గడ్డలు!
మ్యూనిచ్: సూది మందు గుచ్చేతీరులో తేడాల వల్ల రక్తంలో గడ్డలు కట్టే ప్రమాదం ఉందని, అందువల్లే కోవిడ్ టీకా తీసుకున్న కొంతమందిలో బ్లడ్ క్లాట్స్ కనిపించాయని నూతన అధ్యయనం వెల్లడించింది. తప్పుగా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కండరంలోకి ఎక్కించాల్సిన మందు పొరపాటున రక్తనాళాల్లోకి ఇంజెక్ట్ అవుతుందని, అందువల్ల తేడా చేస్తుందని మ్యూనిచ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్ సహా పలు టీకాల విషయంలో ఈ రక్తంలో గడ్డల(పోస్ట్ వ్యాక్సినేషన్ థ్రోంబాటిక్ థ్రోంబోసైటోపెనిక్ సిండ్రోమ్– టీటీఎస్ లేదా వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రోంబాటిక్ థ్రోంబోసైటోపీనియా– వీఐటీటీ) ఫిర్యాదులు వినిపించాయి. అయితే ఇది టీకాలో సమస్య కాదని, టీకా ఎక్కించడంలో సమస్యని తాజా నివేదిక తెలిపింది. ‘‘ఇంజక్షన్ నీడిల్‌ను కండరంలోకి చేరేంత లోతుగా పంపించకుండా పైపైన గుచ్చినప్పుడు టీకామందు కండరంలోకి బదులు రక్తంలోకి నేరుగా వెళ్తుంది. సూది మందు ఇచ్చే సమయంలో చేతిపై చర్మాన్ని వత్తి పట్టుకోకూడదు. ఇంట్రామస్కులార్ ఇంజెక్షన్లు(కండరాల్లోకి పంపే సూదిమందు) ఇచ్చేటప్పుడు ఏమాత్రం చర్మాన్ని పించప్(వత్తి పట్టుకోవడం) చేయకుండా సాఫీగా ఉన్న చర్మంపై టీకానివ్వాలి. లేదంటే సూది మొన కేవలం చర్మాంతర్గత కణజాలం వరకే చేరుతుంది. దీంతో టీకా మందు కణజాలంలోకి పీల్చుకోవడం జరగదు. పైగా కొన్నిమార్లు ఇలా చేయడం వల్ల సూదిమొన రక్తనాళాల్లోకి వెళ్తుంది. అప్పుడు టీకా మందు రక్తంలోకి ప్రవేశించి క్లాట్స్ కలిగించే ప్రమాదం ఉంది’’అని కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు రాజీవ్ జయదేవన్ వివరించారు. టీకా ఇచ్చేముందు సూది గుచ్చిన అనంతరం పిస్టన్ను వెనక్కు లాగి చెక్ చేసుకోవడం ద్వారా సూది మొన రక్తనాళంలోకి చేరలేదని నిర్ధారించుకోవాలన్నారు. -
హిట్లర్ టోపీ ధర ఎంతో తెలుసా!
మ్యూనిచ్ : అడాల్ఫ్ హిట్లర్.. ప్రపంచంలో ఈ పేరు తెలియనివారు ఉండరు. రెండో ప్రపంచ యుద్దం జరగడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో హిట్లర్ కూడా ఒకరు. నాజీ వ్యవస్ధాపకుడైన హిట్లర్ జర్మనీకి ఒక నియంతలా వ్యవహరిస్తూ అందరి మాటను పెడచెవిన పెడుతూ తన చావును తానే కొనితెచ్చుకున్నాడు. హిట్లర్ ప్రవర్తనతో పాటు అతని ఆహార్యం కూడా వింతగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా ! ఏం లేదండి.. హిట్లర్ చనిపోయి 74 సంవత్సరాలు అయినా ఆయన ధరించిన కొన్ని వస్తువులు మాత్రం మ్యూనిచ్ ప్రాంతంలోని ఒక మ్యూజియంలో భద్రపరచారు. తాజాగా హిట్లర్‌కు సంబంధించి ఆయన తరచూ ధరించే టోపీతో పాటు నాజీకి సంబంధించిన వస్తువులను బుధవారం ఆన్లైన్లో వేలం వేశారు. అయితే వీటిని చేజెక్కించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పోటీ పడ్డారు. కాని, స్విట్జర్లాండ్‌కు చెందిన అబ్దుల్లా చతీలా అనే వ్యాపారవేత్త హిట్లర్ ధరించిన టోపీని వేలంలో 50 వేల యూరోలకు (సుమారు రూ. 40లక్షలు) దక్కించుకున్నారు. అయితే దీనిని ఇజ్రాయెల్ నిధుల సేకరణ సంస్థ అయిన కెరెన్ హేసోడ్కుకు విరాళంగా ఇచ్చాడు. అయితే ఆఫర్లో ఉన్న మిగతా నాజీ వస్తువులను మాత్రం పొందలేకపోయాడు. కాగా, నాజీ వస్తువులను పొందడానికి ఇతరులు బారీ మొత్తంలోనే సమర్పించుకున్నట్లు తెలుస్తుంది. -
జర్మనీలో భారతీయ జంటపై దాడి
న్యూఢిల్లీ: జర్మనీలోని మ్యూనిక్ నగరంలో భారతీయ దంపతులపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్‌లపై మ్యూనిక్ సిటీలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దురదృష్టవశాత్తూ తీవ్ర గాయాల పాలైన ప్రశాంత్ మృతి చెందారు. స్మితా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన న్యూగినీకి చెందిన వలసదారుడి(33)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణాలు వెల్లడి కాలేదు’ అని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ప్రశాంత్ సోదరుడు జర్మనీ వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. బాధితుల ఇద్దరు పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలని అక్కడి మన దౌత్యాధికారులను కోరాం’ అని ఆమె వివరించారు. దీనిపై ట్విట్టర్ ఫాలోయెర్ ఒకరు.. సహృదయులైన మీరు, పేరుకు ముందుగా చౌకీదార్ అని ఎందుకు ఉంచుకున్నారు? అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ..‘విదేశాల్లో ఉంటున్న భారతీయుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా చౌకీదారీ(కాపలా) పని చేస్తున్నందునే అలా చేశాను’ అని పేర్కొన్నారు. -
రొమాంటిక్ హిట్లర్..
అడాల్ఫ్ హిట్లర్.. చరిత్ర మరువని నరహంతకుడు. రెండో ప్రపంచముద్ధం మొదలు.. యూదులు అత్యంత పాశవికంగా హింసించి చంపిన నియంత. రెండో ప్రపంచయుద్ధంలో ఓటమి తప్పదని తెలిసి.. ఆత్మహత్య చేసుకున్న జర్మన్ అధినేత. హిట్లర్ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ.. అందులోనూ అత్యంత కౄరుడు, నిర్దయుడు, రాక్షసుడు అనే తెలుసు.. ఆయనలోనూ ఒక ప్రేమికుడున్నాడు.. ఒక శృంగార పురుషుడు ఉన్నాడనే విషయం బయటి ప్రపంచానికి దాదాపు తెలియదనే చెప్పాలి. హిట్లర్‌లోని ఈ కోణం చాలా ఏళ్ల తరువాత ఈ మధ్యే బయటపడింది. అది కూడా హిట్లర్‌కు మేనకోడలు వరుస అయ్యే ఏంజెలా గెలి రబెల్తో ఆయనకున్న అత్యంత సన్నిహిత సంబంధం కూడా ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ ఏకాంతంగా గడిపిన క్షణాలు.. హిట్లర్‌లోని మరో కోణాన్నితెలిపే కొన్ని ఫొటోలు బయటపడ్డాయి. ఇంతకూ రబెల్ ఎవరంటే? ఆస్ట్రియాలో 1908లో పుట్టిన రబెల్ హిట్లర్‌కు మేనకోడలు వరుస అవుతుంది. హిట్లర్ మీద ప్రేమతో ఆమె జర్మనీకి వచ్చింది. ఆకట్టుకునే అందం.. ఆమె సొంతం. హిట్లర్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో ఆమె ఒకరు. కేవలం 23 ఏళ్ల వయసులో అంటే 1931 సెప్టెంబర్ 18.. ఆమె మ్యూనిచ్‌లోని అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఎరుపురంగు నైట్డ్రెస్లో.. ఆమె ఉన్నారు. ఆమె ఆత్మహత్యపై అప్పట్లో భిన్న కథనాలు వచ్చాయి. హిట్లర్ అధికారంలోకి వచ్చాక..! సాధారణ అమ్మాయిగా జర్మనీ వచ్చిన రూబెల్.. హిట్లర్‌కు దగ్గర కావడంతో ఒక సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె అందం.. ప్రవర్తన.. హిట్లర్‌తో బంధం.. ఆమెకు నాజీ పార్టీలోని ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. హిట్లర్ అధికారంలోకి వచ్చాక.. తన అందం.. ప్రేమతో హిట్లర్‌ను రూబెల్ కట్టడి చేసే ప్రయత్నం చేసింది. అంతేకాక హిట్లర్‌తో కలిసి ఆస్ట్రియాకు వెళ్లాలని ఒక దశలో తీవ్ర ప్రయత్నం చేసింది. రబెల్ ఇంట్లోనే బందీ రబెల్ అందం.. పార్టీలోన ఆమెకున్న ప్రత్యేక గుర్తింపుతో హిట్లర్.. ఆమెను ఇంటికే పరిమితం చేశాడు.. ఆమె మీద అనుమానాలు పెరగడంతో పనివాళ్లను కూడా మార్చేసి.. అందరినీ అడవాళ్లనే పెట్టాడు. అయితే కారు డ్రైవర్ ఎమిల్ మౌర్సీతో రబెల్కు శారీరక సంబంధం ఉందన్న అనుమానం హిట్లర్‌కు వచ్చింది. వెంటనే మౌర్సీని కాల్చి చంపి.. రబెల్ను మరోచోటకు మార్చాడు. అక్కడ నుంచి ఆమె తప్పించుకుని ఆస్ట్రియా పారిపోయేందుకు పలుసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆత్మ ‘హత్య’ కొత్త ప్రాంతంలో నివాసముంటున్న రూబెల్ ఒక రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున సమయంలో ఒక ససైడ్ నోట్ రాసింది. అందులో.. నేను త్వరలోనే వియాన్నకు వస్తానన్న నమ్మకం ఉంది.. ఒక వేళ రాలేకపోతే.. ఈ జీవితం ఇంతే అని రాసింది. తరువాత ఆమె హ్యాండ్‌గన్‌తో తనను తాను కాల్చుకుని చనిపోయింది. అయితే ఈ అత్మహత్యపై పలు అనుమానాలున్నాయి. హిట్లరే హత్య చేసుంటాడు.. అని వారిద్దరి బంధం ఎరిగినవారు చెబుతున్నారు. -
వామ్మో! ఇలా కూడా ఆఫీస్‌కు వెళుతారా?
ఆఫీస్‌కు రావడం, మళ్లీ ఇంటికి వెళ్లడం.. మధ్యలో ఆఫీస్‌లో పనిచేయడం.. ఇవి చాలు ఒక సగటు ఉద్యోగి అలిసిపోవడానికి.. దీనికితోడు నగరాల్లో నరకం చూపించే ట్రాఫిక్ గురించి చెప్పకపోవడమే మేలు.. ఆఫీస్‌లో చేసిన వర్క్ కంటే.. ఆఫీస్‌కు రావడానికి, మళ్లీ ఇంటికి వెళ్లడానికి ట్రాఫిక్‌లో ఎదుర్కొనే చిక్కులే ఎక్కువ. దారి పొడగుతా పాములా మెలికలు తిరిగి.. నత్తలా నిదానంగా ముందుకుసాగే ట్రాఫికే చాలామందికి చెప్పలేనంత విసుగు తెప్పిస్తుంది. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. కొందరు వినూత్నంగా ట్రాఫిక్ సమస్య తమ దారికి అడ్డురాకుండా కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ఇదేవిధంగా ఆలోచించి ఓ చెక్ రిపబ్లిక్ వ్యక్తి ఏకంగా చిన్న హెలికాప్టర్ రూపొందించుకొని.. ఆఫీస్ వెళుతుండగా.. జర్మన్లో ఓ వ్యక్తి మరింత వినూత్నంగా ఆఫీస్ బాటపట్టాడు. మ్యూనిచ్‌లో ఉండే బెంజమిన్ డేవిడ్ ట్రాఫిక్ బెదడతో విసిగిపోయాడు. నిత్యం చుక్కలు చూపించే ట్రాఫిక్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాడు. రోడ్డుమార్గంలో వెళితే.. ట్రాఫిక్ ఎదురవుతుంది. అదే నీటిమార్గంలో వెళ్లితే.. వాహనాలు ఉండవు. సిగ్నళ్లు ఉండవు. ట్రాఫిక్ బెడద ఉండదు. అందుకే నగరంలోని ఇసార్ నదిని ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆ నది మార్గంలో రవాణసౌలభ్యం లేదు. అయినా, బెంజిమిన్ వెనుకకు తగ్గలేదు. రోజూ 1.6 కిలోమీటర్లు (ఒక మైలు) ఎంచక్కా ఈదుకుంటూ వెళుతున్నాడు. ఇంటి నుంచి నేరుగా బెంజమిన్ నదికి వస్తాడు. అక్కడ తన దుస్తులు, బూట్లు, మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్ వాటర్ ప్రూఫ్ బ్యాగులో పెట్టి.. ఎంచక్కా నదిలో దూకేసి ఈదుకుంటూ ఆఫీస్‌కు వెళుతాడు. ఇలా రోజు ఆఫీస్‌కు వెళ్లడం, ఇంటికి రావడం ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఉందని బెంజమిన్ చెప్తున్నాడు. గత రెండేళ్ల నుంచి అతను ఆఫీస్‌కు ఇలాగే వెళుతున్నాడు. -
మ్యూనిక్‌లో కాల్పులు; కలకలం
మ్యూనిక్: జర్మన్‌లోని ప్రఖ్యాత మ్యూనిక్ నగరం మంగళవారం కాల్పులతో దద్దరిల్లింది. సబర్బన్ రైల్వే స్టేషన్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో దుండగుడు.. ఓ మహిళా పోలీసు నుంచి తుపాకి లాక్కుని కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల్లో మహిళా పోలీసుల సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు చెప్పారు. అరగంట ఉత్కంఠ అనంతరం నిందితుడిని బంధించగలిగామని, ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి అపాయం లేదని పోలీసులు ప్రకటించారు. కాల్పులు జరిగిన సబర్బన్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మ్యూనిక్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వీలుండటంతో ఇది ఉగ్రచర్యేమోనని అధికారులు హడలిపోయారు. సరిగ్గా ఏడాది కిందట మ్యూనిక్‌లోని షాపింగ్ మాల్లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 10 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
పొంగి పొర్లే పండుగ
అక్టోబర్ ఫెస్ట్ ఒక నగరాన్ని కోటి మంది అతిథులు ముంచెత్తేస్తారు. కేవలం పదహారు రోజుల్లో... కోటి లీటర్ల బీరు ఖాళీ చేసేస్తారు. టన్నుల కొద్దీ మాంసం, ఇతర ఆహారం ఖర్చయిపోతుంది. నిజం!! ఇదో పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఒకటీ రెండూ కాదు... ఏకంగా రెండు వందల ఏళ్లకు పైబడి నడుస్తోంది. అదే... అక్టోబర్ ఫెస్ట్. జర్మనీలోని మ్యూనిక్ నగర స్పెషాలిటీ. వీధుల్లోంచి వెళ్లే బ్యాండు వాయిద్యాలు వింటూ... బీరు ఖాళీ చేసేయ్యెటమే ఈ పండగ ప్రత్యేకత. చారిత్రక సంప్రదాయాల మేరకు జరిగే ఈ పండగలో... అతిథులూ యూనిఫామ్స్ ధరిస్తారు. కొందరు అభిమానుల డైరీల్లో ఏటా ఈ పండగ ఉండాల్సిందే. మిగిలిన వారు కూడా... జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకోకుండా ఉంటారా?. మ్యూనిక్‌కు వెళ్లేదెలా? హైదరాబాద్‌తో పాటు ముంబయి, ఢిల్లీ నుంచి మ్యూనిక్‌కు నేరుగా విమానాలున్నాయి. అక్టోబర్ ఫెస్ట్‌లో యాత్రికుల తాకిడి ఎక్కువ కనక టిక్కెట్లు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా బుక్ చేస్తే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.40 వేల లోపే ఉంటాయి. ఏ సీజన్ మంచిది? సెప్టెంబరు నెలాఖర్లోనే వెళ్లాల్సి ఉంటుంది. సెప్టెంబరు మూడో వారం నుంచి అక్టోబర్ ఫెస్ట్ ఆరంభమవుతుంది. -
బీర్ ఫెస్టివల్లో యువత చిందులు
-
మ్యూనిక్ దాడి ఒక్కడి పనే!
- కాల్పుల తర్వాత ఆత్మహత్య - జర్మనీ కాల్పుల్లో మృతులు 9 మ్యూనిక్ : జర్మనీలోని మ్యూనిక్ నగరంలో కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. ఒక ఉన్మాది షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత ముగ్గురు ఉగ్రవాదులు బీభత్సం సృష్టించినట్లు వార్తలొచ్చినప్పటికీ.. ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. అతడిని జర్మనీ-ఇరాన్ సంతతికి చెందిన 18 ఏళ్ల అలీ డేవిడ్ సోన్బొలీగా గుర్తించారు. డిప్రెషన్‌కు లోనైన అతడు ఐదేళ్ల క్రితం నార్వేలో ఆండ్రీస్ బెహ్రింగ్ బ్రీవిక్ అనే ఉన్మాది దాడి ఘటన నుంచి ప్రేరణ పొందినట్లు భావిస్తున్నారు. మ్యూనిక్‌లో ఒలింపియా షాపింగ్ మాల్లోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లో శుక్రవారం కాల్పులు జరగడం తెలిసిందే. నల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపిన అనంతరం అక్కడి నుంచి పారిపోయిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో కనిపించింది. పోలీసులు విస్తృత గాలింపు జరిపిన అనంతరం షాపింగ్ మాల్‌కు కిలోమీటర్ దూరంలో నిందితుడి మృతదేహాన్ని గుర్తించారు. ద్వంద్వ పౌరసత్వమున్న అతడికి ఐసిస్ ఉగ్రసంస్థతో ఎలాంటి సంబంధాల్లేవని, నేరచరిత్రా లేదని చెప్పారు.పుస్తకాలు, కథనాల్లోని ఊచకోత ఘటనల నుంచి అతడు ప్రేరణ పొంది ఉంటాడన్నారు. నిందితుడి ఇంట్లో సోదాలు జరిపారు. మోదీ సంతాపం .. మ్యూనిక్ కాల్పులను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఈఘటనతో ఎంతగానో కలతచెందామని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నానన్నారు. -
జర్మనీలో కాల్పుల కలకలం