న్యూఢిల్లీ: భారత ఏవియేషన్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఏడాది మరిన్ని కొత్త రూట్లలో ఫ్లయిట్ సర్వీసులను ప్రారంభించ నున్నట్లు యూరప్‌కి చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా వెల్లడించింది. ఫ్రాంక్‌ఫర్ట్ -హైదరాబాద్, మ్యూనిక్-బెంగళూరు రూట్లు వీటిలో ఉంటాయని పేర్కొంది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు)
ఫ్రాంక్‌ఫర్ట్- హైదరాబాద్ మధ్య ఫ్లయిట్లు రాబోయే శీతాకాలంలో ప్రారంభం కాగలవని, నవంబర్ 3న మ్యూనిక్-బెంగళూరు ఫ్లయిట్స్ మొదలవుతాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు హ్యారీ హోమీస్టర్ తెలిపారు. మ్యూనిక్ - బెంగళూరు మధ్య వారానికి మూడు సర్వీసులు ఉంటాయని పేర్కొన్నారు.
దాదాపు 90 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న లుఫ్తాన్సా గ్రూప్ .. ప్రస్తుతం వారానికి 50 పైగా ఫ్లయిట్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి ఫ్రాంక్‌ఫర్ట్, జ్యూరిక్ వంటి సిటీలకు విమానాలను నడుపుతోంది. (షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!)
Comments
Please login to add a commentAdd a comment