Lufthansa Airlines
-
లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ వజ్రోత్సవం
న్యూఢిల్లీ: లుఫ్తాన్సా జర్మన్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీకి ఎయిర్‌లైన్స్ సేవలు ప్రారంభించి 60 ఏళ్లు పూర్తయింది. ఈ వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. లుఫ్తాన్సా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ నేవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీకి ఏ380 ఫస్ట్‌క్లాస్ సరీ్వసును తిరిగి అందిస్తున్నట్టు ప్రకటించారు. 1963 సెపె్టంబర్ 1న బోయింగ్ 720 సరీ్వస్‌ను ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి ఈ సంస్థ ప్రారంభించడం గమనార్హం. భారత వృద్ధి పథాన్ని ముందే నమ్మిన వారిలో తామూ కూడా ఒకరమంటూ, మరో 60 ఏళ్లపాటు భారత్‌తో బలమైన అనుబంధానికి కట్టుబడి ఉన్నామని లుఫ్తాన్సా గ్రూప్ పేర్కొంది. -
ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ మధ్య లుఫ్తాన్సా విమానాలు
న్యూఢిల్లీ: భారత ఏవియేషన్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఏడాది మరిన్ని కొత్త రూట్లలో ఫ్లయిట్ సర్వీసులను ప్రారంభించ నున్నట్లు యూరప్‌కి చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా వెల్లడించింది. ఫ్రాంక్ఫర్ట్ -హైదరాబాద్, మ్యూనిక్-బెంగళూరు రూట్లు వీటిలో ఉంటాయని పేర్కొంది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) ఫ్రాంక్ఫర్ట్- హైదరాబాద్ మధ్య ఫ్లయిట్లు రాబోయే శీతాకాలంలో ప్రారంభం కాగలవని, నవంబర్ 3న మ్యూనిక్-బెంగళూరు ఫ్లయిట్స్ మొదలవుతాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు హ్యారీ హోమీస్టర్ తెలిపారు. మ్యూనిక్ - బెంగళూరు మధ్య వారానికి మూడు సర్వీసులు ఉంటాయని పేర్కొన్నారు. దాదాపు 90 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న లుఫ్తాన్సా గ్రూప్ .. ప్రస్తుతం వారానికి 50 పైగా ఫ్లయిట్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి ఫ్రాంక్ఫర్ట్, జ్యూరిక్ వంటి సిటీలకు విమానాలను నడుపుతోంది. (షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!) -
విమాన ప్రయాణికులకు అలర్ట్.. వాటిని నిషేదిస్తూ కీలక నిర్ణయం!
విమాన ప్రయాణానికి యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ ప్రమాదం అంటూ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్ తెలిపింది. అందుకే తమ సంస్థకు చెందిన విమాన ప్రయాణాల్లో యాపిల్ ఎయిర్ ట్యాగులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. విమాన ప్రయాణంలో తమ వెంట తెచ్చుకున్న లగేజీ సేఫ్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు అదే ఎయిర్ ట్యాగ్స్‌పై జర్మనీ ఎయిర్‌లైన్ ఆంక్షలు విధించింది. అయితే లుఫ్తాన్సా ఇటీవల ‘ఎయిర్ ట్యాగ్లు ప్రమాదమని.. కాబట్టే యాక్టివేటెడ్ ఎయిర్‌ట్యాగ్‌లను ప్రయాణికుల వినియోగంచుకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. ఐసీఏఓ (ఇంటర్నేషనల్ సివిలియన్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) మార్గదర్శకాల కారణంగా లుఫ్తాన్సా ఎయిర్‌ట్యాగ్‌ని నిషేధించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీలు, 15 అంగుళాల యాపిల్ మాక్ ప్రో (సెప్టెంబర్ 2015 ఫిబ్రవరి 2017 మధ్య కొనుగోలు చేసిన)లపై మాత్రమే ఆంక్షలు ఉన్నాయి. యాపిల్ సంస్థ లిథియం- అయాన్ బ్యాటరీలు వినియోగించదు. ఎయిర్ ట్యాగ్స్ కోసం యాపిల్ సంస్థ సీఆర్2032 సెల్స్‌ను ఉపయోగిస్తుంది. ఒకవేళ ఆ సెల్స్ ప్రమాదకరమని భావిస్తే స్మార్ట్‌వాచ్‌లను విమానాల్లో అనుమతించకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి. యాపిల్ ఎయిర్ట్యాగ్పై లుఫ్తాన్సా ఎయిర్‌లైన్ ఎందుకు నిషేధం విధించిందో స్పష్టమైన నిషేధాన్ని కారణాలు వివరించనప్పటికీ, అనేక నివేదికలు మాత్రం ప్రయాణికుల లగేజీని ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
పైలట్ల సమ్మె... లుఫ్తాన్సా విమానాలు రద్దు
న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం పైలట్లు ఒకరోజు సమ్మెకు దిగడంతో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సంస్థ విమానాలు ప్రపంచమంతటా నిలిచిపోయాయి. వందలాది విమానాల రాకపోకలను లుఫ్తాన్సా యాజమాన్యం రద్దు చేసింది. వేతనాలు పెంచాలని, మెరుగైన సౌకర్యాలు కల్పిచాలన్న డిమాండ్లతో పైలట్లు తమ విధులను బహిష్కరించారు. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు రద్దయ్యాయి. టర్మినల్–3 వద్ద దాదాపు 700 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఎయిర్‌పోర్టు బయట ఆందోళన చేపట్టారు. ప్రయాణికులు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేదంటే రుసుము తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు. ప్రయాణికుల్లో చాలామంది విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చాలాసేపు వేచి చూసి, చేసేది లేక ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. అతిత్వరలో విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని లుఫ్తాన్సా ప్రతినిధులు వెల్లడించారు. -
ప్రపంచ వ్యాప్తంగా 5వేల మందికిపైగా పైలట్ల నిరసన!
జర్మనీకి చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ లుప్థాన్సాకు ఉద్యోగుల సమ్మె మరింత ఉధృతం కానుంది. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం కంటే అధికంగా వేతన చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ జర్మనీకి చెందిన జర్మన్ ఎయిర్ లైన్ పైలట్స్ అసోసియేషన్ వెరీనిగుంగ్ కాక్‌పిట్ (వీసీ)గురువారం రాత్రి నుంచి సమ్మెకు పిలుపు నిచ్చింది.ప్రస్తుతం సమ్మె కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 5వేల మంది పైలట్లు విధులకు గైర్హాజరైటన్లు తెలుస్తోంది. పైలట్ల సమ్మె పిలుపుతో ప్రపంచ వ్యాప్తంగా లుప్థాన్సాకు చెందిన 800 విమానాల రాకపోకపోకలు స్తంభించిపోయాయి. మరికొన్ని రోజుల్లో జర్మనీకి చెందిన పలు రాష్ట్రాల్లో సమ్మర్ సెలవులు ముగియనున్నాయి. దీంతో విదేశాల్లో ఉన్న జర్మన్ దేశస్తులకు ఉద్యోగుల సమ్మె మరింత ఆందోళన కలిగిస్తుండగా...ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా లక్షా 30వేల మంది ప్రయాణికులపై పడింది. లుప్థాన్సా విమానాల సర్వీసులు రద్దుకావడంతో జర్మనీ ముఖ్య నగరాలైన ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిచ్‌లలో సైతం విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో ప్రయాణికుల్లో గందరగోళం మొదలైంది. ప్రయాణాన్ని రీహెడ్యూల్ చేయడం, లేదంటే ట్రైన్ జర్నీ చేసేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పైలట్ల డిమాండ్ ఇదే గత ఆగస్ట్ నెల నుంచి జీత భత్యాల పెంపు విషయంలో జర్మన్ పైలట్ల యూనియన్ వెరీనిగుంగ్ కాక్‌పిట్ (వీసీ) లుప్థాన్సాతో చర్చలు జరుపుతుంది. 2023లో ముంచుకొస్తున్న ద్రవ్యోల్బణం నుంచి పైలెట్లు గట్టెక్కాలంటే 5వేల కంటే ఎక్కువ మందికి 5.5శాతం వేతన పెంపును వీసీ డిమాండ్ చేసింది. అయితే సీనియర్ పైలట్లకు 5శాతం, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 18శాతం పెంచుతామని లుప్థాన్సా యాజమాన్యం ముందుకొచ్చింది. దీనిపై సంతృప్తి చెందని పైలట్లు సమ్ముకు దిగిన విషయం తెలిసిందే. చదవండి👉 800 లుఫ్తాన్సా ఫ్లైట్స్ రద్దు: ప్రయాణీకులు గగ్గోలు -
800 లుఫ్తాన్సా ఫ్లైట్స్ రద్దు: ప్రయాణీకులు గగ్గోలు
న్యూఢిల్లీ: జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు పైలట్ల మెరుపు సమ్మె సెగ తగిలింది. లుఫ్తాన్సా పైలట్ల యూనియన్ సమ్మెకు పిలుపునివ్వడంతో దాదాపు అన్ని ప్రయాణీకుల, కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందుల్లో పడిపోయారు. దాదాపు 800 విమానాలు రద్దు కానున్నాయని లుఫ్తాన్సా వెల్లడించింది. వేసవి సెలవుల ముగింపు తరువాత తిరిగొచ్చే అనేక మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతోంది. అయితే తన బడ్జెట్ క్యారియర్ యూరోవింగ్స్ ప్రభావితం కాదని లుఫ్తాన్సా పేర్కొంది. పైలట్ల సమ్మె ప్రభావాలను తగ్గించడానికి సాధ్యమైనదంతా చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించినా ప్రయాణీకులకు ఇబ్బందులుత ప్పలేదు. ముఖ్యంగా న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 డిపార్చర్ గేట్ 1 వద్ద దాదాపు 150 మంది ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. ఫ్రాంక్ఫర్ట్ , మ్యూనిచ్ నుండి రెండు లుఫ్తాన్స విమానాలు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల బంధువులు ఆందోళనలో పడిపోయారు. డబ్బు వాపసు ఇవ్వండి లేదా తమ వారికి ప్రత్యామ్నాయ విమాన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర విమానయాన సంస్థల ద్వారా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు చెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది. కాగా వేతనాల పెంపును కోరుతూ లుఫ్తాన్సా పైలట్లు అకస్మాత్తుగా భారీ సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను యాజమాన్యం తిరస్కరించినక కారణంగా సమ్మె తప్ప లేదని పైలట్ల సంఘం వెల్లడించింది. అయితే కంపెనీ ఇప్పటికే ఉద్యోగుల జీతాలను 900 యూరోల (900 అమెరికా డాలర్లు) ఒక్కసారిగా పెంచింది. సీనియర్ పైలట్లకు 5 శాతం, కొత్తవారికి వారికి 18 శాతం పెంపును ప్రకటించింది. కనీ 2023లో అధిక ద్రవ్యోల్బణం అంచనాల నేపథ్యంలో ఈ సంవత్సరం 5.5 శాతం పెంచాలని పైలట్లు యూనియన్ డిమాండ్ చేస్తోంది. Delhi | Crowd of approx 150 people gathered on main road in front of departure gate no.1, Terminal 3, IGI Airport, around 12 am, demanding refund of money or alternate flights for their relatives as 2 Lufthansa flights bound to Frankfurt & Munich were cancelled: DCP, IGI Airport https://t.co/V2PQBWBErD — ANI (@ANI) September 2, 2022 Students' Strike at IGI Airport Delhi, as Lufthansa cancels two flights to Germany and they ain't finding a solution, Students are in panic as most are colleges are starting from 6th and they ain't rebooking before 10th sept. @PMOIndia@JM_Scindia @lufthansa #shameonlufthansa pic.twitter.com/dkAW8LwAPL — Kuntal parmar (@Kunnntal) September 1, 2022 -
22 వేల మందిని తొలగించనున్న లుఫ్తాన్సా
బెర్లిన్ : జర్మన్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత అవసరాలకు మించి తమ వద్ద 22 వేల అదనపు ఉద్యోగాలున్నాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సుమారు 22 వేల మందిని తొలగించే అవకాశం ఉందని బుధవారం వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర నష్టాలనుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని, దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు తప్పడం లేదని పేర్కొంది. కార్మిక సంఘాలతో సమావేశం తరువాత లుఫ్తాన్సా ప్రతినిధి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకుముందు అంచనా వేసిన 10,000 కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ అని తెలిపారు. జూన్ 25 న అసాధారణ సర్వసభ్య సమావేశానికి ముందే సిబ్బందితో పార్ట్‌టైమ్ పని చేయించుకోవడం లాంటి అంశాలపై కార్మిక సంఘాలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని వివరించారు. మరోవైపు ఉద్యోగుల బలవంతపు తొలగింపులను విరమించుకోవాలని ఫ్లైట్ అటెండెంట్స్ యూనియన్ (యుఎఫ్ఓ) డిమాండ్ చేసింది. ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. అటు పైలట్ల యూనియన్ సభ్యులు కూడా 45 శాతం వరకు వేతన తగ్గింపునకు ప్రతిపాదించారు. తద్వారా 350 మిలియన్ యూరోలు కంపెనీకి ఆదా అవుతుందని ప్రతిఫలంగా కంపెనీ వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలను కాపాడాలని యూనియన్ కోరుతోంది. కాగా 9 బిలియన్ యూరోల (10.26 బిలియన్ డాలర్ల) బెయిల్ అవుట్ ప్యాకేజీ తిరిగి చెల్లింపుతోపాటు, కోవిడ్-19 సంక్షోభంతో వేలాది ఉద్యోగాల కోత, ఆస్తి అమ్మకాలు వంటి భారీ పునర్నిర్మాణ వ్యూహాన్ని లుప్తాన్సా అమలు చేస్తోంది. రానున్న ఏజీఎంలో బెయిల్ అవుట్ ప్యాకేజీ చెల్లింపుపై వాటాదారులు ఓటు వేయాల్సి ఉంది. -
లుఫ్తాన్సాకు కొత్త రెక్కలు!!
బెర్లిన్: కరోనా వైరస్ పరిణామాలతో విమాన సేవలు నిల్చిపోయి, సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు కొంత ఊరట లభించింది. కష్టకాలంలో నిలదొక్కుకునేందుకు కంపెనీకి 9.8 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ ప్రతిపాదనకు జర్మనీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వేల కొద్దీ ఉద్యోగాలను కాపాడేందుకు, బలవంతపు టేకోవర్ ముప్పు తప్పించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ డీల్‌తో లుఫ్తాన్సాలో ప్రభుత్వానికి 20% వాటాలు దక్కుతాయి. దీన్ని 25% దాకా పెంచుకోవచ్చు. లుఫ్తాన్సా సాధారణంగా లాభాల్లోనే ఉందని, కరోనా మహమ్మారి పరిణామాల కారణంగా సమస్యల్లో చిక్కుకుందని జర్మనీ ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ తోడ్పాటు పరిమిత కాలానికి మాత్రమేనని, లుఫ్తాన్సాలో వాటాలను 2023 ఆఖరు నాటికి విక్రయించాలని భావిస్తున్నట్లు వివరించింది. ‘కంపెనీ మళ్లీ నిలదొక్కుకున్నాక ప్రభుత్వం వాటాలను విక్రయించేస్తుంది. ఆ నిధులతో సమస్యల్లో ఉన్న ఇతర కంపెనీలకు తోడ్పాటు అందించేందుకు వీలవుతుంది‘ అని ఆర్థిక మంత్రి ఒలాఫ్ షోల్జ్ తెలిపారు. షరతులు వర్తిస్తాయి..: బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చేందుకు జర్మనీ ప్రభుత్వం పలు షరతులు విధించింది. భవిష్యత్‌లో డివిడెండ్ చెల్లింపులను తొలగించడం, మేనేజ్మెంట్ జీతభత్యాలపై పరిమితులు వంటివి వీటిలో ఉన్నాయి. అలాగే సంస్థ పర్యవేక్షణ బోర్డులో ప్రభుత్వం తరఫు నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. సాధారణ షేర్‌హోల్డర్ల సమావేశంలో ఓటింగ్ హక్కులేవీ ప్రభుత్వం వినియోగించుకోబోదు. కరోనా వైరస్ కష్టాల బారిన పడిన కంపెనీలను గట్టెక్కించేందుకు జర్మనీ ప్రభుత్వం 100 బిలియన్ యూరోలతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి జర్మనీ కేంద్ర ప్రభుత్వం క్రమంగా వాటాలు విక్రయించేస్తూ వస్తోంది. ప్రస్తుతం డాయిష్ పోస్ట్, డాయిష్ టెలికం వంటి కొన్ని దిగ్గజ సంస్థల్లో మాత్రమే ప్రభుత్వానికి భారీ వాటా ఉంది. మాకూ ప్యాకేజీ ఇవ్వరూ.. కొలంబియాకు చెందిన ఏవియాంకా హోల్డింగ్స్, ఆస్ట్రేలియన్ సంస్థ వర్జిన్ ఆస్ట్రేలియా హోల్డింగ్స్ మొదలైనవి దివాలా చట్టాల కింద రక్షణ కోరుతూ దరఖాస్తులు చేసుకున్నాయి. మరికొన్ని సంస్థలు ప్రస్తుతం తమ తమ దేశాల ప్రభుత్వాల నుంచి బెయిలవుట్ ప్యాకేజీలు కోరుతున్నాయి. ఫ్రాన్స్–నెదర్లాండ్స్ విమానయాన సంస్థ ఎయిర్ ఫ్రాన్స్–కేఎల్ఎం, అమెరికాకు చెందిన అమెరికన్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. లాటామ్ దివాలా.. అమెరికాలో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌లో ఒకటైన లాటామ్ తాజాగా కరోనా దెబ్బతో దివాలా తీసింది. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాల్లో ఉన్న లాటామ్.. దివాలా చట్టం కింద రక్షణ కోరుతూ కోర్టులో దరఖాస్తు చేసుకుంది. అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వేలోని అనుబంధ సంస్థలను మాత్రం ఇందులో చేర్చలేదు. దివాలా చట్టం కింద పిటీషన్ వేసినప్పటికీ యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగుతాయని, త్వరలో రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి కాగలదని సంస్థ సీఈవో రాబర్టో అల్వో ఆశాభావం వ్యక్తం చేశారు. చిలీకి చెందిన ఎల్ఏఎన్, బ్రెజిల్‌కి చెందిన టీఏఎం సంస్థల విలీనంతో 2012లో లాటామ్ ఏర్పడింది. ఇందులో అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ అతి పెద్ద వాటాదారుగా ఉంది. ప్రస్తుతం లాటామ్ ఆస్తులు 10 బిలియన్ డాలర్లుగా, బాకీలు 50 బిలియన్ డాలర్ల దాకా ఉన్నాయి. -
విమాన ప్రయాణికునికి 20 లక్షల పరిహారం
చెన్నై: ఓ విమాన ప్రయాణికునికి రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని తమిళనాడు రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్ జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. 70 ఏళ్ల శివ్‌ప్రకాశ్ గోయెంకా 2010లో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానంలో ఫ్రాంక్ఫర్ట్ నుంచి మాడ్రిడ్ వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ టికెట్‌ను కొనుగోలు చేశానని, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన టికెట్‌ను ఎకానమీ క్లాస్‌కు ఎయిర్‌లైన్స్ సంస్థ మార్చిందని, 1,500 యూరోల వోచర్ ఇచ్చిందన్నారు. తాను అనుభవించిన మానసిక క్షోభకు రూ. 95 లక్షలు పరిహా రం చెల్లించాలంటూ గోయెంకా కమిషన్‌ను ఆశ్రయించారు. గోయెంకాకు తాము రెండు సీట్లను ఇచ్చామని, అలాగే తాము ఇచ్చిన వోచర్‌ను కూడా ఆయన తీసుకున్నారని ఎయిర్‌లైన్స్ వాదించింది. విమాన సిబ్బందితో వాదించే ఓపిక లేకపోవడంతో తాను వాటిని తీసుకున్నట్టు గోయెంకా తెలిపారు. గోయెంకా వాదనను పరిగణనలోకి తీసుకున్న కమిషన్.. ఆయనకు టికెట్ ధరతో పాటు, రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. -
ఎయిర్ లైన్స్ కు షాక్.. ప్రయాణీకుడికి 20 లక్షల పరిహారం!
చెన్నై: ఓ ప్రయాణికుడికి 20 లక్షల పరిహారం చెల్లించాలని జర్మనీ దేశపు లుఫ్తాన్సా ఎయిర్స్ లైన్స్ ను తమిళనాడు రాష్ట్ర కన్స్యూమర్ రీడ్రసల్ కమిషన్ ఆదేశించింది. నాలుగేళ క్రితం ఫ్రాంక్ ఫర్ట్ నుంచి మాడ్రిడ్ కు ప్రయాణించిన సమయంలో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ లో బిజినెస్ క్లాస్ బుకింగ్ చేసుకున్నానని, అయితే తనకు చెప్పకుండా ఎకానమీ క్లాస్ కు మార్చారని 70 సంవత్సరాల ప్రయాణీకుడు శివ ప్రకాశ్ గోయెంకా ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదు చేస్తూ కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించారు. ఆతర్వాత పరిహారంగా తనకు 1500 యూరోల వోచర్ ఇచ్చారని, కాని తనకు 2.5 లక్షల టికెట్ రుసుం రీఫండ్ చేయాలని, తనకు కలిగిన అసౌకర్యారనికి 65 లక్షలు పరిహారం చెల్లించాలని కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే తాము రెండు ఎకానమీ క్లాస్ టికెట్లను ఇచ్చామని.. వోచర్ ను స్వీకరించారని జర్మన్ ఎయిర్ లైన్స్ తన వాదనను వినిపించింది. ఆ సమయంలో తాను అధికారులతో గొడవకు దిగితే ఫ్లైట్ మిస్ అవుతుందనే కారణంతో వెళ్లిపోయానని కన్స్యూమర్ కోర్టుకు బాధితుడు తెలిపారు. దాంతో గోయెంకాకు 20 లక్షల పరిహారం చెల్లించాలని ఎయిర్ లైన్స్ ను కోర్టు ఆదేశించింది.