ఎయిర్ లైన్స్ కు షాక్.. ప్రయాణీకుడికి 20 లక్షల పరిహారం! | Airlines ordered to pay Rs 20 lakh compensation to passenger | Sakshi
Sakshi News home page

ఎయిర్ లైన్స్ కు షాక్.. ప్రయాణీకుడికి 20 లక్షల పరిహారం!

Published Wed, Nov 5 2014 2:07 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

ఎయిర్ లైన్స్ కు షాక్.. ప్రయాణీకుడికి 20 లక్షల పరిహారం!

చెన్నై: ఓ ప్రయాణికుడికి 20 లక్షల పరిహారం చెల్లించాలని జర్మనీ దేశపు లుఫ్తాన్సా ఎయిర్స్ లైన్స్ ను తమిళనాడు రాష్ట్ర కన్స్యూమర్ రీడ్రసల్ కమిషన్ ఆదేశించింది. నాలుగేళ క్రితం ఫ్రాంక్ ఫర్ట్ నుంచి మాడ్రిడ్ కు ప్రయాణించిన సమయంలో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ లో బిజినెస్ క్లాస్ బుకింగ్ చేసుకున్నానని, అయితే తనకు చెప్పకుండా ఎకానమీ క్లాస్ కు మార్చారని  70 సంవత్సరాల ప్రయాణీకుడు శివ ప్రకాశ్ గోయెంకా ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదు చేస్తూ కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించారు. 
 
ఆతర్వాత పరిహారంగా తనకు 1500 యూరోల వోచర్ ఇచ్చారని, కాని తనకు 2.5 లక్షల టికెట్ రుసుం రీఫండ్ చేయాలని, తనకు కలిగిన అసౌకర్యారనికి 65 లక్షలు పరిహారం చెల్లించాలని కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే తాము రెండు ఎకానమీ క్లాస్ టికెట్లను ఇచ్చామని.. వోచర్ ను స్వీకరించారని జర్మన్ ఎయిర్ లైన్స్ తన వాదనను వినిపించింది. ఆ సమయంలో తాను అధికారులతో గొడవకు దిగితే ఫ్లైట్ మిస్ అవుతుందనే కారణంతో వెళ్లిపోయానని కన్స్యూమర్ కోర్టుకు బాధితుడు తెలిపారు. దాంతో గోయెంకాకు 20 లక్షల పరిహారం చెల్లించాలని ఎయిర్ లైన్స్ ను కోర్టు ఆదేశించింది. 

Related News By Category

Related News By Tags

Advertisement