business class
-
మహిళలు ఇలా మారాలి: రాధికా గుప్తా సూచనలు
ఎన్నో సవాళ్ళను అధిగమించి ఎడిల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ & సీఈఓ స్థాయికి ఎదిగిన 'రాధికా గుప్తా' పెట్టుబడికి సంబంధించిన విషయాలను గురించి చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న ఈమె, మహిళల ఆర్ధిక సామర్థ్యాన్ని వివరిస్తూ.. వారు మారాల్సిన సమయం వచ్చిందని అన్నారు.మహిళలు చాలా కాలంగా తమ కుటుంబాలకు ఆర్థిక సారథులుగా ఉన్నారు. కానీ చాలా మంది ఇప్పటికీ సొంత పెట్టుబడులకు సంబంధించిన బాధ్యత తీసుకోవడానికి మాత్రమే వెనుకాడుతున్నారని రాధికా గుప్తా పేర్కొన్నారు. పొదుపు విషయంలో ఆరితేరిన మహిళలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని గురించి వివరించారు.అమ్మలు, అమ్మమ్మలు.. ఇలా తరాలుగా ఇళ్లకు సీఎఫ్ఓలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధానం మారాలి. డబ్బు నిర్వహణకు పురుషులకు అవుట్సోర్సింగ్ చేయడం ఆపేయండి. పొదుపుచేసే వారి నుంచి పెట్టుబడిదారులుగా మారండి. ఇది కష్టమైన పని కాదు. సవాళ్లు ఎదుర్కుంటేనే.. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుతారని చెబుతూ.. సవాళ్లు బయట నుంచి రావు. మనం అంతర్గతంగా ఎదుర్కొనేదే అతి పెద్ద సవాలు అని రాధికా గుప్తా అన్నారు.ఇదీ చదవండి: రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి, మీ ఆలోచనలకు కార్యరూపం దాల్చండి అని.. ఆమె మహిళలకు సూచనలు చేశారు. మహిళలు సహజంగా మల్టీటాస్కింగ్ చేయగల సమర్థులు. ఇంట్లోనే భార్యగా, తల్లిగా, కోడలిగా ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వరించే మహిళ.. అన్ని రంగాల్లోనూ సులభంగా రాణించగలదని రాధికా గుప్తా వెల్లడించారు. ఇకపోతే రాధికా గుప్తా సారథ్యంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2017 మార్చిలో రూ. 6,500 కోట్లుగా ఉన్న కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ జూలై 2024 నాటికి రూ. 1.40 లక్షల కోట్లకు పెరిగింది. -
బిజినెస్ క్లాస్ ప్యాసింజర్‌కి షాక్, ట్వీట్ వైరల్: ఎయిరిండియా స్పందన
సాక్షి,ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ షెఫ్ విమానంలో భోజనంపై మండిపడిన మరునాడే విమానంలో అందించిన భోజనంలో పురుగు కనిపించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎయిరిండియా బిజినెస్ క్లాస్ విమానంలో తనకెదురైన అనుభవంపై ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న బిజినెస్ క్లాస్ ప్యాసింజర్ మహావీర్ జైన్ ఎయిరిండియా బిజినెస్ క్లాస్ విమానంలో వడ్డించిన భోజనంలో పురుగు అంటూ ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ఇంత అపరిశుభ్రమా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టాటా యాజమాన్యంలోని క్యారియర్ స్పందిస్తూ, కఠినమైన చర్యల తీసుకుంటామని పేర్కొంది. (ఇదీ చదవండి: ఎయిరిండియా మెగా డీల్: భారీ ఉద్యోగాలు, సీఈవో కీలక ప్రకటన) కాగా మరొక సంఘటనలో నాగ్‌పూర్-ముంబై 0740 విమానంలో ప్రయాణించిన చెఫ్ సంజీవ్ కపూర్ కూడా విమానంలో వడ్డించే ఆహారంపై సంస్థపై మండిపడ్డారు. తనకు పుచ్చకాయ దోసకాయతో కూడిన కోల్డ్ చికెన్ టిక్కా,మినిస్క్యూల్ ఫిల్లింగ్‌తో కూడిన శాండ్విచ్, డెజర్ట్, షుగర్ సిరప్ అందించారని ఆరోపించారు. భారతీయులు అల్పాహారం ఇదా? 'వేక్ అప్ ఎయిరిండియా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అభిప్రాయం చాలా ముఖ్యమైంది అంటూ సంజీవ్ కపూర్ ట్వీట్‌పై స్పందించిన ఎయిరిండియా ఇకపై ఆన్‌బోర్డ్ ఫుడ్ మంచిగా ఉంటుందనే హామీని కూడా ఇచ్చింది. (టెస్లా జోష్: మస్త్..మస్...దూసుకొచ్చిన ఎలాన్ మస్క్) @airindiain insect in the meal served in businessclass pic.twitter.com/vgUKvYZy89 — Mahavir jain (@mbj114) February 27, 2023 -
షాకింగ్ ఘటన: విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..
ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహ ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక వ్యక్తి మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆరిపోవడంతో.. అక్కడ ఏం జరుగుతోందో కొందరి ప్రయాణికులకే అర్థమైంది. పైగా మూత్ర విసర్జన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లకుండా అలానే నుంచొని ఉన్నాడు. అతడి వికృత చర్య కారణంగా.. సదరు ప్రయాణికురాలి బట్టలు, బూట్లు, మూత్రంతో తడిచిపోయాయి. దీంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విమాన సిబ్బంది ఆమెకు బట్టలు, చెప్పులు ఇచ్చి మళ్లీ తన సీటుకే రావలని చెప్పారు. ఐతే ఆమె అందుకు గట్టిగా నిరాకరించడంతో మరో సీటు పురమాయించారు.ఐతే సిబ్బంది ఆ సీటు కవర్లు మార్చి, వాసన రాకుండా స్ప్రె చల్లారు గానీ ఆ సీటుపై కూర్చోవాలంటేనే చిరాకనిపించదని ఆ మహిళ వాపోయింది. ఆ ఘటన తర్వాత ఆమె మరొక సిబ్బంది సీటులో కూర్చొని విమానంలో మిగతా ప్రయాణాన్ని కొనసాగించారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా సదరు ఎయిర్‌లైన్ అధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సదరు మహిళకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్‌కి ఈ విషయమై లేఖ రాశారు. అంతేగాదు ఆమె లేఖలో.. బిజినెస్ క్లాస్‌లో సీట్లన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ మరో క్యాబిన్ సీటు కూడా తనకి ఇవ్వలేదని ఎయిర్ ఇండియా సిబ్బందిపై కూడా ఆరోపణలు చేసింది. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విషయమై సదరు ఎయిర్‌లైన్ నుంచి వివరణ కోరింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే గాక సదరు వ్యక్తిని నోఫ్లై లిస్ట్‌లో చేర్చనున్నట్లు పేర్కొంది. (చదవండి: బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం) -
ఆకాశంలో లివింగ్ రూమ్
విమానాల్లో బిజినెస్ క్లాస్ అంటేనే కాస్త పర్సనల్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ప్రయాణించేలా సీట్లు, ఇతర సౌకర్యాలుంటాయి. కానీ అచ్చం ఇంట్లో లివింగ్ రూమ్‌లోనే ఉన్నామా అనిపించేలా క్యాబిన్ డిజైన్ చేస్తే! టీవీ, కర్టెన్లు, కార్పెట్లు, ఇతరత్రా ప్రత్యేక సౌకర్యాలుంటే! ఇలాంటి అద్భుతమైన క్యాబిన్లను సియాటెల్‌కు చెందిన డిజైన్ కంపెనీ టియాగ్యు, టెస్లా, ఒక్లహోమాకు చెందిన ఎయిరోస్పేస్ కంపెనీ నోర్డామ్ కలిసి రూపొందించాయి. ఈ డిజైన్‌కు‘ఎలివేట్’ అని పేరు పెట్టాయి. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేశాయి. జర్మనీలోని హాంబర్గ్‌లో ఈ ఏడాది జూన్‌లో జరిగే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్‌పోలో ఈ డిజైన్లను ప్రదర్శించనున్నాయి. తక్కువలో ఎక్కువగా.. అద్భుతమైన వాల్ అటాచ్మెంట్స్, పెద్ద బెడ్ సైజు, లివింగ్ స్పేస్, వస్తువులు పెట్టుకునేందుకు స్థలం లాంటివి ప్రతి ప్రయాణికుడికి ఉండేలా డిజైన్ చేయడం ఇదే తొలిసారని ‘ఎలివేట్’ డిజైనర్లు తెలిపారు. ఈ ఇంటీరియర్‌కు విమానంలో ఎక్కువ స్థలం అవసరం ఏమీ ఉండదని, సీట్లు తగ్గించుకోవాల్సిన అవసరమూ రాదని చెప్పారు. పైగా డిజైన్‌లో వాడినవన్నీ తక్కువ బరువున్నవేనని వివరించారు. దీని వల్ల విమానంపై భారంపడదని, ఎక్కువ ఇంధనం ఖర్చవదని తెలిపారు. చిన్న విమానాల్లో కూడా ఎలివేట్ క్యాబిన్లను సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అందమైన క్యాబిన్లతో ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని అందించడానికి.. ఎక్కువ స్థలం ఉండేలా, సౌకర్యవంతంగా అనిపించేలా, ప్రైవసీ ఉండేలా ఎలివేట్‌ను డిజైన్ చేశామని చెప్పారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్’.. ఎలాగంటే!
న్యూఢిల్లీ: ‘బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె’... అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా! ఆధునిక యుగంలో దీన్ని కాస్త మార్చి ‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్’ అని చదువుకునే చిత్రమైన సంఘటన జరిగింది. అలాంటి చిత్రమైన ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. లండన్ వెళ్లే ఎయిర్ఇండియా విమానం చీమల కారణంగా కొన్ని గంటలు ఆగింది. బిజినెస్ క్లాసులో చీమల గుంపు కనిపించడంతో టేకాఫ్ ఆపేశారు. (చదవండి: తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!) ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి పంపించారు. ఈ విమానంలోనే భూటాన్ యువరాజు జిగ్మే నాంగ్యేల్ వాంగ్‌చుక్ ఉన్నారు. ఎయిర్ఇండియా విమానాలు ఇటీవల కాలంలో చిత్రమైన కారణాలతో ఆలస్యం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలోనూ సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సరకు రవాణా విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం విండ్ షీల్డ్‌లో పగుళ్లు గుర్తించడమే ఇందుకు కారణం. అంతకుముందు మేలో దిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో గబ్బిలం ఉన్నట్లు గుర్తించారు. (చదవండి: Karnataka Toddler Swallowed Coin: ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కొని) -
వైరల్ వీడియో : అదృష్టం అంటే ఈ పక్షిదే..!
ఈ వార్త చదివాక ‘అరే ఈ పక్షికున్న పాటి అదృష్టం మనకు లేకుండా పోయిందే’ అనుకుంటారు. ఎందుకంటే మనలో చాలా మందికి విమానంలో ప్రయాణించడం ఓ కల. అది బిజినేస్ క్లాస్ ప్రయాణం అంటే అబ్బో ఇంకేముంది. ఎందుకంటే బిజినేస్ క్లాస్ టూర్ అంటే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి. కానీ ఈ పక్షి మాత్రం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బిజినేస్ క్లాస్‌లో దర్జాగా సింగపూర్ నుంచి లండన్ ప్రయాణించింది. ప్రస్తుతం ఈ పక్షి బిజినెస్ క్లాస్ టూర్ నెట్టింట్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. సామాన్య వ్యక్తికి దక్కని అదృష్టం పక్షికి దక్కిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. వివరాలు.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సింగపూర్ నుంచి లండన్ బయలుదేరింది. అయితే ఎలా జరిగిందో తెలీదు కానీ విమానంలోని బిజినెస్ క్లాస్‌లోని ఓ సీటుపై పక్షి ప్రత్యక్షమైంది. అలా అది దాదాపు 12 గంటలపాటు విమానంలో ప్రయాణించి లండన్ చేరుకుంది. పక్షి ప్రయాణాన్ని కొందరు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దాంతో సిబ్బంది ఈ సంఘటన గురించి వివరణ ఇచ్చింది. జనవరి 7న విమానంలో ఈ పక్షి కనిపించిందని పేర్కొంది. ‘ప్రయాణీకులు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది పక్షిని పట్టుకున్నారు’ అని తెలిపింది. పాపం పక్షిని పట్టుకోవడానికి సిబ్బంది చాలా కష్టపడ్డట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎలా అయితేనేం చివరకూ ఆ పక్షిని పట్టుకున్న సిబ్బంది తర్వాత దాన్ని లండన్‌లోని జంతు సంరక్షణ అధికారులకు అప్పంగిచారు. ‘వావ్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను ఎంచుకోవాలని పక్షికి కూడా తెలుసు’, ‘ఈ పక్షికి ఏ క్లాస్‌లో ప్రయాణించాలో బాగా తెలిసినట్లు ఉంది’, ‘ఈ పక్షి ఇమిగ్రేషన్‌ను ఎలా క్లియర్ చేసుకుందో?.. ఆశ్చర్యంగా ఉంది’, ‘పక్షుల్ని ఎలా పట్టుకోవాలి అనే విషయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
విమానంలో వాచిపోయేలా కుట్టిన నల్లులు, అయినా..
ముంబై : ఎయిరిండియా విమానమెక్కాలంటే.. ఇప్పుడందరూ వామ్మో అంటున్నారు. నల్లుల బెడదతో ప్రయాణికులు హడలిపోతున్నారు. అది కూడా బిజినెస్ క్లాస్‌లో అయ్యే సరికి ఎయిరిండియా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. వారం క్రితం న్యూజెర్సీ నుంచి ముంబై వస్తున్న సౌమ్య శెట్టీ అనే మహిళా ప్రయాణికురాలికి నల్లులు చుక్కులు చూపించాయి. చేయి, కాలు, మెడ వాచిపోయేలా కుట్టాయి. ఆమెను మాత్రమే కాక, తన ముగ్గురు పిల్లలు నల్లుల నుంచి పడ్డ బాధ అంతా ఇంతా కాదు. ఆ మహిళా ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా ఇంటర్నెట్లో షేర్ చేసింది. నల్లులు కుట్టడం వల్ల దద్దుర్లు ఎక్కిన చేతితో కూడిన ఓ ఫోటోను, ఆమె ఎదుర్కొన్న తిప్పలను, ఎయిరిండియా నిర్లక్ష్యాన్ని ట్విటర్లో కడిగిపారేసింది. ల్యాండింగ్‌కు 30 నిమిషాల ముందు కూడా తనకు కనీసం సీట్లు మార్చుకునే అవకాశం ఇవ్వలేదని ట్విటర్ ద్వారా తన బాధను వెల్లబుచ్చుకుంది. ‘ముగ్గురు పిల్లలతో కలిసి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం నాకు సాయపడుతుంది అనుకున్నా. కానీ మమల్ని నల్లులు చేతిలు వాచిపోయేలా కుట్టాయి. అది చాలా బాధకరమైన రోజు. అయినప్పటికీ నేను అదే సీట్లో పడుకోవాల్సి వచ్చింది. తర్వాత రోజు ల్యాండింగ్ అయ్యే సమయంలో మా సీట్లను మార్చారు. ఇది చాలా ఘోరం! ముగ్గురు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న విషయం మీకు అర్థమవుతుందా?’ అంటూ ఎయిరిండియాను ఉద్దేశించి వరుస ట్వీట్లు చేసింది. అంతేకాక బిజినెస్ క్లాస్ టిక్కెట్లకు వెచ్చించిన తన మొత్తం మనీని రీఫండ్ చేయాలని ఎయిరిండియాను డిమాండ్ చేసింది. ఇదే విషయంపై మంగళవారం ఎయిరిండియా హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేసి, ఈ-మెయిల్ కూడా పంపింది. కానీ ఎయిరిండియా నుంచి ఆమెకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో దగ్గర్లో ఉన్న ఎయిరిండియా ఆఫీసుకు వెళ్లి అడిగితే, తప్పుడు ఈ-మెయిల్ ఐడీకి ఫిర్యాదు పంపించినట్టు ఆమెపైనే నెట్టేశారు. అయితే టిక్కెట్ ఛార్జీ మొత్తాన్ని తాము రీఫండ్ చేయలేమంటూ ఎయిరిండియా తేల్చిచెప్పింది. కేవలం టిక్కెట్లను రద్దు చేసుకునే పెనాల్టీ ఫీజు నుంచి మాత్రమే మినహాయింపు ఇస్తామంటూ చెప్పింది. తనకు టిక్కెట్ల మొత్తం రీఫండ్ కావాలని కోరితే, ఇలా నిర్లక్ష్యపూర్వకంగా వ్యవహరించడంపై సౌమ్య మండిపడింది. తర్వాత సౌమ్య శెట్టీ మెయిల్‌కు సమాధానమిచ్చిన ఎయిరిండియా యాజమాన్యం తాము పరిహారం కానీ, రీఫండ్ గురించి కానీ ఎక్కడ తెలుపలేదని, ఎయిర్‌క్రాఫ్ట్‌లో నల్లుల ప్రవేశంపై విచారణ చేపట్టామని తెలిపింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటామని పేర్కొంది. సౌమ్యకు, తన పిల్లలకు ఈ నల్లులు కుట్టడం వల్ల 10వేల డాలర్ల మేర ఖర్చు అయిందని సౌమ్య భర్త కూడా ట్విటర్ ద్వారా ఈ విమానయాన సంస్థకు తెలిపాడు. దానికి బాధ్యత ఎవరంటూ కడిగిపారేశాడు. సౌమ్యకు మాత్రమే కాక, ఇదే రకమైన పరిస్థితి ఇటుఎయిరిండియా విమానంలో న్యూయార్క్ నుంచి ప్రయాణించిన మరో ప్రయాణికుడికి కూడా ఎదురవడం, ఈ విమానయాన సంస్థను మరింత ఇరకాటంలో పడేసింది. -
బిజినెస్ క్లాస్‌లో నల్లుల దర్జా..
ముంబై : ఒకప్పుడు రైళ్లు, సినిమా హాళ్లకే పరిమితమైన నల్లులు ఇప్పుడు విమనాలోనూ దర్జా వెలగబెడుతున్నాయి. అది కూడా ఏకంగా బిజినెస్ క్లాస్‌లో. నల్లులు ఇంత రాజభోగం అనుభవిస్తున్నది ఎయిర్ ఇండియా విదేశీ విమానాల్లో. పాస్‌పోర్ట్, వీసా, టికెట్లతో పనిలేకుండా దేశ విదేశాలను చుట్టేస్తూ మధ్యలో బోర్ కొట్టినప్పుడు తమ ఉనికిని తెలియజేయడానికి ప్రయాణికులను కుడుతూ జల్సా చేస్తున్నాయి. సరిగ్గా గతేడాది ఇదే సమయంలో ఎయిర్ ఇండియాలో చిట్టెలుకలు కనిపించి కంగారు పుట్టిస్తే ఇప్పుడు వాటి స్థానాన్ని నల్లులు ఆక్రమించాయి. న్యూయార్క్ - ముంబై ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో నల్లులు ఒక చిన్నారిని కుట్టడంతో వీటి ఉనికి బయటపడింది. తర్వాత మరో ఇద్దరు, ముగ్గురిని కూడా కుట్టడంతో ప్రయాణికులు ఆందోళన చేశారు. నల్లులతో కలిసి మేం ప్రయాణించం అని తెల్చి చెప్పడంతో, వాటిని తొలగించి తిరుగు ప్రయాణం ప్రారంభించే సరికి ఢిల్లీకి చేరాల్సిన విమానం కాస్తా ఆలస్యం అయ్యింది. ఈ విషయాన్ని ప్రవీణ్ తొన్సేకర్ అనే ఒక ప్రయాణికుడు తన ట్విట్టర్లో పోస్టు చేశారు. విమానంలో సీట్ల మీద ఉన్న నల్లులను ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. @airindiain @sureshpprabhu @narendramodi_in Suresh Prabhuji - just arrived from New York on Air India 144 business class with family . All our seats infested with bed bugs . Sir , have heard of bed bugs on trains but shocked to experience on our maharaja and that too business pic.twitter.com/m2GnfOpTO3 — Pravin Tonsekar (@pat_tons) July 17, 2018 ఫోటోతో పాటు ‘ఎయిర్ ఇండియా సంస్థ, విమానయాన మంత్రి సురేష్ ప్రభు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు.. నేను నా కుటుంబంతో కలిసి 144 సీట్లు ఉన్న ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం చేస్తున్నాను. మాకు కేటాయించిన సీట్లను మాకంటే ముందుగానే నల్లులు ఆక్రమించుకున్నాయి. ఇన్నాళ్లు రైళ్లలోనే నల్లులు ఉంటాయని విన్నాను. కానీ తొలిసారి విమానంలో, అది కూడా బిజినెస్ క్లాస్‌లో వీటిని చూసి షాక్ అయ్యాను’ అంటూ మెసేజ్‌ను కూడా పోస్టు చేశారు. ఎకానమీ క్లాస్‌లో అతనికి ఎదురైన అనుభావాల గురించి మరొక ట్వీట్లో పోస్టు చేశారు. అక్కడ విరిగిపోయి ఉన్న టేబుల్స్ గురించి, సరిగా లేని టీవీల గురించి తెలిపి, దాని వల్ల తన కూతురు, భార్య ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపారు. ప్రవీణ్ చేసిన ట్వీట్‌కు బదులుగా ఎయిర్ ఇండియా ప్రతినిధులు రీట్వీట్ చేశారు. ‘మీకు కలిగిన అసౌకార్యానికి చింతిస్తున్నాం. మీరు ఇచ్చిన ఫిర్యాదును మేము మా నిర్వహణ విభాగానికి తెలియజేశాం. వీలైనంత త్వరగా ఈ అసౌకర్యాన్ని సరిచేస్తాం’ అని తెలిపారు. గతేడాది ఢిల్లీ - శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణిస్తున్న విమానంలో ఎలుక కనిపించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రయాణం 9 గంటలు ఆలస్యం అయ్యింది. -
విమానంలో కొలీగ్ చెంప చెళ్లుమనిపించాడు
ముంబై : వరుస వివాదాలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఎయిరిండియా క్యాబిన్‌కు చెందిన ఓ క్రూ సభ్యుడు, తన జూనియర్ కొలిగ్ చెంప చెల్లుమనిపించాడు. దీనికి గల కారణం ఆన్‌బోర్డులో ఉన్న శాకాహార ప్రయాణికుడికి, మాంసాహార భోజనం అందజేయడమే. ఈ సంఘటన న్యూడిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళే విమానంలో చోటు చేసుకుంది. మార్చి 17న ఈ సంఘటన చోటు చేసుకుందని, దీనిపై అంతర్గత విచారణ ప్రారంభించినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. కేబిన్ అటెండెంట్ అయిన అమ్మాయి పొరపాటున న్యూఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్ విమానంలోని బిజినెస్ క్లాస్ ప్రయాణికుడికి శాకాహార భోజనం బదులు మాంసాహార భోజనం అందించింది. ఈ పొరపాటును గుర్తించిన ప్రయాణికుడు, క్యాబిన్ సూపర్వైజర్కు సమాచారం అందించాడు. కానీ ఎలాంటి ఫిర్యాదును దాఖలు చేయలేదు. తర్వాత ఆ అమ్మాయి, ప్రయాణికుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కూడా కోరింది. ఆ భోజనాన్ని మార్చి వేరే భోజనాన్ని అందించింది. కానీ మరోసారి క్రూ సూపర్వైజర్ ఈ పొరపాటును రచ్చరచ్చ చేసి, ఆ అమ్మాయి చెంప చెల్లుమనిపించాడు. కానీ దీనిపై ఏ మాత్రం ప్రతీకారం తీర్చుకోకుండా.. ఆ అమ్మాయి మొత్తం ఘటనపై ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసు డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసింది. తమకు న్యూఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్లే విమానం ఏఐ 121 కేబిన్ క్రూ నుంచి ఫిర్యాదు అందిందని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. -
ప్రీమియం ప్రయాణికులకు ల్యాప్‌టాప్‌లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రూట్లలో బిజినెస్ తరగతి ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రీమియం ప్రయాణికులకు ల్యాప్‌టాప్‌లు కూడా అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంస్థ సీఎండీ ప్రదీప్ సింగ్ ఖరోలా తెలియజేశారు. దీనివల్ల బిజినెస్ తరగతిలో ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉందన్నారు. సాధారణంగా ఈ తరగతిలో సగానికి సగం సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ‘దూర ప్రాంతాలకు వెళ్లే ఫ్లయిట్స్‌లో బిజినెస్ తరగతి సీట్లు.. కంపెనీకి మంచి ఆదాయం తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో సుమారు యాభై శాతం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. మెరుగైన సేవలు అందించడం ద్వారా దీన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఆన్–ఫ్లయిట్ ఎంటర్టైన్మెంట్ అంశం సరిగ్గా లేని పక్షంలో... దానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాం. ఇందులో భాగంగా బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ల్యాప్‌టాప్‌లు అందించే అవకాశాలు కూడా ఉన్నాయి‘ అని ఖరోలా తెలిపారు. అయితే, ఇన్–బిల్ట్ వీడియో స్క్రీన్లు పనిచేయనప్పుడు మాత్రమే ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలా? లేక ప్రీమియం ప్రయాణికులందరికీ అదనపు సౌకర్యం కింద వీటిని అందించాలా? అన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారాయన. ఫిబ్రవరిలో మూడు కొత్త విమానాలు.. అమెరికాలోని లాస్ ఏంజెలిస్కి నేరుగా ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించడంపై ప్రయత్నాలు జరుగుతున్నాయని, అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలోని దూరప్రాంతాలకు మరిన్ని సర్వీసులు నడిపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. అటు ఫిబ్రవరి నాటికి మూడు కొత్త బోయింగ్ 777 విమానాలు అందుకుంటామన్నారు. -
భారత క్రికెటర్లకు శుభవార్త!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లకు తీయటి కబురును అందించింది బీసీసీఐ. ఇప్పటివరకూ స్వదేశంలో జరిగే సిరీస్ ల్లో భాగంగా సాధారణ ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తూ వస్తున్న భారత్ క్రికెటర్లకు ఇక నుంచి బిజినెస్ క్లాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆమోద ముద్ర వేసినట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షడు సీకే నేతృత్వంలోని క్రికెట్ పరిపాలన కమిటీ(సీఓఏ) స్పష్టం చేసింది. స్వదేశంలో మ్యాచ్ లు జరిగే సమయంలో విమానంలో ప్రయాణించేటప్పుడు తాము అసౌకర్యానికి గురువుతున్నట్లు క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. ఎకానమీ క్లాస్ లో ప్రయాణించడం వల్ల చాలా మంది తోటి ప్రయాణికులు సెల్పీల కోసం ఇబ్బంది పెడుతున్నారని క్రికెటర్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కాళ్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ కూడా తక్కువగా ఉంటుందని బీసీసీఐకి నివేదించిన ఫిర్యాదులో తెలిపారు. ఈ క్రమంలోనే విదేశాల్లో పర్యటించేటప్పుడు సమకూర్చే బిజినెస్ క్లాస్ ప్రయాణాన్ని ఇక్కడ కూడా కల్పించాలని కోరారు. దీనికి ఇటీవల జరిగిన సీఓఏ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు సీకే ఖన్నా తెలిపారు. వాస్తవానికి విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రమే టీమిండియా సభ్యులకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. స్వదేశంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాల్సి ఉంది. అయితే కెప్టెన్, కోచ్ మాత్రం స్వదేశంలోనూ బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించొచ్చు. దీంతో మిగిలిన క్రికెట్ల అసౌకర్యాన్ని పరిగణనలోనికి తీసుకున్న బీసీసీఐ..జట్టులో సభ్యులైన క్రికెటర్లందరికీ బిజినెస్ క్లాస్ ను సమకూర్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. -
విమానంలో ఆమె ఎంత పనిచేసింది!
-
విమానంలో ఆమె ఎంత పనిచేసింది!
మాస్కో: అనూహ్య దృశ్యం మొబైల్ కెమెరా కంటపడింది. ఓ బోయింగ్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి సరదాగా తన ఫోన్‌తో చుట్టూ వీడియో తీస్తుండగా షాకింగ్ ఘటన దానికి చిక్కింది. ఎవరో తాగి మిగిల్చిన మద్యాన్ని విమాన సిబ్బందికి చెందిన మహిళా సహాయకురాలు ఒకరు తిరిగి బాటిల్లో నింపుతున్న దృశ్యం అందులో రికార్డయింది. ఆ దృశ్యాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పెద్ద మొత్తంలో వైరల్ అయింది. చూసేందుకే చాలా ఏవగింపు కలిగిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యెజెనీ కేయుమోవ్ అనే వ్యక్తి రష్యా నుంచి దుబాయ్‌కి ఎమిరేట్స్ ఏ 380 అనే విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో తన మొబైల్ కెమెరాతో విమానంలో కూర్చొని చుట్టూ వీడియో తీశాడు. అదే సమయంలో ఆయన వెనుకాలే ఉన్న చాంబర్లో తాగి వదిలేసిన మద్యాన్ని తిరిగి బాటిల్ నింపుతున్న దృశ్యం రికార్డయింది. దీనిని సదరు వ్యక్తి ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హవ్వా ఎమిరేట్స్ సంస్థ ఇలా ఎప్పటి నుంచి చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పనిచేస్తున్న సిబ్బందిని కచ్చితంగా హెచ్చరించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఊరిస్తున్న విమాన చార్జీలు!
♦ ఏడాదిలో సగటున 20 శాతం తగ్గిన టికెట్ చార్జీలు ♦ తొలిసారిగా బిజినెస్ క్లాస్‌కూ డిస్కౌంట్ ఆఫర్లు ♦ లాభాల బాట పట్టిన ఏవియేషన్ కంపెనీలు ♦ ఇంధన ధరలు ఏడాదిలో 45% తగ్గడమే కారణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానం ఎంత పెకైగురుతుందో... చార్జీలు అంతలా దిగి వస్తున్నాయి. ఈ వేసవిలో గతేడాదికంటే 20 శాతం తక్కువ ధరకే టికెట్లు విక్రయించడానికి విమానయాన కంపెనీలు సిద్ధమయ్యాయి. గతంలో ఇవి డిమాండ్ లేని సమయంలో డిస్కౌంట్ ఆఫర్లిచ్చేవి. కానీ ప్రయాణికుల్ని ఆకట్టుకోవటానికిపుడు ఏడాది పొడవునా ఏదో ఒక పేరుతో ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయి. రూ.500 నుంచి రూ.1,000కే విమానం ఎక్కే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నిజానికి వేసవిలో డిమాండ్ ఎక్కువ.ఈ వేసవిలో డిమాండ్ 20% దాకా పెరుగుతుందని కూడా కంపెనీలు అంచనా వేస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఎయిర్కోస్టా, స్పైస్ జెట్ వంటి సంస్థలు మరిన్ని నగరాలకు ఎక్కువ సర్వీసులను నడపడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాయి. ‘‘ఈ సారి డిమాండ్ పెరిగినా టికెట్ ధరలైతే పెరిగే అవకాశం లేదు. గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20% తక్కువ ధరకే టికెట్లు లభిస్తున్నాయి’’ అని ఎయిర్కోస్టా ప్రతినిధి చెప్పారు. గతేడాదితో పోలిస్తే డిసెంబర్ నాటికి దేశీ విమాన టికెట్ ధరలు సగటున 18.3 శాతం తగ్గినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు ఇటీవల చెప్పారు. 2014 డిసెంబర్లో సగటు టికెట్ ధర 7,492గా ఉంటే అది డిసెంబర్, 2015 నాటికి రూ.5,734కి తగ్గినట్లు బోయింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేశ్కర్ తెలియజేశారు. అన్నింటికీ డిస్కౌంట్లే: ఇప్పటిదాకా ఎకానమీ క్లాస్‌కే పరిమితమైన డిస్కౌంట్ల యుద్ధం ఇప్పుడు బిజినెస్ క్లాస్‌లకూ పాకింది. తొలిసారిగా బిజినెస్ క్లాస్‌లో 30 నుంచి 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు జెట్, విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించాయి. నిత్యం డిమాండుండే ముంబై-ఢిల్లీ మార్గంలో రూ.21,000 ఉండే బిజినెస్ క్లాస్ టికెట్‌ను విస్తారా రూ. 15,000కే అందిస్తోంది. ఈ తగ్గింపు ధరలు అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు ఏకంగా 50 శాతంవరకూ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఎంత చౌకగా అంటే... చేతిలో మూడు నాలుగు వేలుంటే మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లేలా. ఈ తగ్గింపుతో ప్రయాణికుల సంఖ్యలో భారీ వృద్ధి నమోదవుతున్నట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తెలియజేసింది. గతేడాదితో పోలిస్తే దేశీ విమాన ప్రయాణికుల సంఖ్యలో 23% వృద్ధి నమోదయిందని ఐఏటీఏ పేర్కొంది. దేశీ మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతున్న వినిమయ శక్తి ఈ వృద్ధికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. 2024 నాటికి దేశీయ మధ్యతరగతి ప్రజల సంఖ్య 50% వృద్ధితో 60 కోట్లు దాటుతుందని ఎయిర్ బస్ అంచనా వేస్తోంది. వచ్చే ఇరవై ఏళ్లలో ప్రపంచ విమాన ప్రయాణికుల సంఖ్యలో 4.6% వృద్ధి ఉంటే ఇండియాలో ఈ వృద్ధి 8.4% ఉంటుందని అంచనా. చార్జీలు తగ్గుతున్నా, లాభాలు పెరుగుతున్నాయ్... ఒకపక్క విమాన టికెట్ ధరలు తగ్గుతున్నా విమానయాన కంపెనీల లాభాలు మాత్రం పెరుగుతుండటం విశేషం. మొన్నటి వరకు నష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలిపుడు భారీ లాభాలను ప్రకటిస్తున్నాయి. స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్, ఇండిగో వంటి సంస్థలు మూడో త్రైమాసికంలో ప్రకటించిన లాభాలే దీనికి నిదర్శనం. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సైతం డిసెంబర్ నెల నుంచి నిర్వహణా లాభాల్లోకి అడుగుపెట్టింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2019 నాటికి ఎయిర్ ఇండియా లాభాల్లోకి వస్తుందని కేంద్ర పౌర విమానయాన కార్యదర్శి ఆర్.ఎన్ చౌబే చెప్పారు. గతంలో సగటున టికెట్‌కు రూ.256 నష్టం వస్తే ధరలు 20 శాతం పైగా తగ్గినా ఇప్పుడు సగటున రూ.632 లాభం వస్తోంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు తగ్గడమే. గడిచిన ఏడాది కాలంలో విమాన ఇంధన ధరలు 45 శాతం తగ్గాయి. ఎయిర్‌లైన్స్ వ్యయంలో సింహ భాగం ఇంధనానిదే. గతంలో నిర్వహణ వ్యయంలో 49 శాతంగా ఉన్న ఇంధనం వాటా ఇప్పుడు 23 శాతానికి పడిపోవడంతో కంపెనీలు లాభాల బాట పట్టాయి. -
యాత్రాజినీ బిజినెస్ క్లాస్ క్యాబ్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాత్రాజినీ సర్వీసెస్ వైజీ ఎలైట్ పేరుతో బిజినెస్ క్లాస్ క్యాబ్ సర్వీసులను దక్షిణాదిన 60 నగరాల్లో ప్రారంభించింది. ఖరీదైన ప్రయాణ అనుభూతి కోరుకునే వినియోగదార్ల కోసం ఈ సేవలను పరిచయం చేసినట్టు కంపెనీ సీఈవో రెనిల్ కోమిట్ల ఈ సందర్భంగా తెలిపారు. డిసెంబరు చివరినాటికి మొత్తం 100 నగరాల్లో అడుగు పెట్టాలన్నది లక్ష్యమని చెప్పారు. కస్టమర్లు యాత్రాజినీ యాప్‌లో వైజీ ఎలైట్‌ను ఎంచుకోవడం ద్వారా ఇన్నోవాను బుక్ చేయవచ్చు. మొదటి 8 కిలోమీటర్లకుగాను రూ.200 చార్జీ చేస్తారు. ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.20 చెల్లించాలి. బస్సు, హోటల్ గదుల బుకింగ్ సేవలను సైతం అందిస్తున్న ఈ కంపెనీ ఇటీవలే ఆటోరిక్షా సర్వీసులను ప్రారంభించింది. -
బీసీలంటే బిజినెస్ క్లాస్ అనుకున్నట్టుంది!
చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ నేత కృష్ణదాస్ విమర్శ బీసీలను కాదని సుజనాకి పదవా? ఆరోపణలున్న వ్యక్తిని కేంద్ర మంత్రిని చేస్తారా? సాక్షి, హైదరాబాద్: బీసీలంటే ‘బిజినెస్ క్లాస్’ (వ్యాపార తరగతి) అని సీఎం చంద్రబాబు భావించినట్లుగా ఉందని.. అందుకే వెనుకబడిన తరగతుల వారిని కాదని తన వ్యాపారవర్గానికి చెందిన సుజనా చౌదరికి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించారని వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. ఎన్నికలకు ముందు బీసీ జపం చేసిన బాబు అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించి ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పి వారి మద్దతు పొందే ప్రయత్నం చేసిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక.. మంత్రివర్గ విస్తరణల్లో ఆ వర్గాల వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎన్డీయే తొలి విడత మంత్రివర్గంలో అశోక్‌గజపతిరాజుకు, ఆదివారం జరిగిన విస్తరణలో వ్యాపారవేత్త సుజనా చౌదరికి టీడీపీ తరఫున అవకాశం కల్పించి బీసీలను నిర్లక్ష్యం చేశారన్నారు. ‘‘సుజనా చౌదరిపై అనేక ఆరోపణలున్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉండే ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలోనే చౌదరి పాల్పడిన అక్రమాలపై ఎన్నో వార్తలు వచ్చాయి. 12.03.2009న ‘సుజనా’త్మక మాయాబజార్’, 13.03.2009న ‘పన్ను ఎగవేత కుదిరింది’, 15.03.2009న ‘ఛత్రం కోసం చక్రం-రాజకీయ బేహారి సుజనా చౌదరి’, 01.09.2009న ‘సుజనాత్మక మాయాబజార్ నిజమే’ ...అనే శీర్షికలతో ఆ పత్రికలో వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి ఆరోపణలున్న వ్యక్తిని కేంద్రంలో మంత్రిని చేస్తారా?’’ అని కృష్ణదాస్ ప్రశ్నించారు. (ఆయా వార్తల క్లిప్పింగ్‌లను ప్రదర్శిస్తూ..) దీనిని బట్టి బీసీలను పావులుగా వాడుకుంటున్న సీఎంకు వారిపై ఉన్నది కపట ప్రేమే నని స్పష్టం అవుతోందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు గెలిచే స్థానాల్లో సీట్లు ఇవ్వకుండా ఆ వర్గానికి అన్యాయం చేశారని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం బాబు ఏ మాత్రం కృషి చేయడం లేదని దుయ్యబట్టారు. బీసీలకు మేలు జరిగింది దివంగత నేత వైఎస్ హయాంలోనేనని, ఆయన పాలనలో ప్రవేశపెట్టిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ పథకాల వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది బీసీలేనని కృష్ణదాస్ గుర్తు చేశారు. ఎప్పటికైనా బీసీలకు మేలు చేసేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. బాబు ఇప్పటికైనా బీసీలకు ప్రాధాన్యమివ్వాలని తమ పార్టీ తరఫున కోరుతున్నామని, లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. -
ఎయిర్ లైన్స్ కు షాక్.. ప్రయాణీకుడికి 20 లక్షల పరిహారం!
చెన్నై: ఓ ప్రయాణికుడికి 20 లక్షల పరిహారం చెల్లించాలని జర్మనీ దేశపు లుఫ్తాన్సా ఎయిర్స్ లైన్స్ ను తమిళనాడు రాష్ట్ర కన్స్యూమర్ రీడ్రసల్ కమిషన్ ఆదేశించింది. నాలుగేళ క్రితం ఫ్రాంక్ ఫర్ట్ నుంచి మాడ్రిడ్ కు ప్రయాణించిన సమయంలో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ లో బిజినెస్ క్లాస్ బుకింగ్ చేసుకున్నానని, అయితే తనకు చెప్పకుండా ఎకానమీ క్లాస్ కు మార్చారని 70 సంవత్సరాల ప్రయాణీకుడు శివ ప్రకాశ్ గోయెంకా ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదు చేస్తూ కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించారు. ఆతర్వాత పరిహారంగా తనకు 1500 యూరోల వోచర్ ఇచ్చారని, కాని తనకు 2.5 లక్షల టికెట్ రుసుం రీఫండ్ చేయాలని, తనకు కలిగిన అసౌకర్యారనికి 65 లక్షలు పరిహారం చెల్లించాలని కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే తాము రెండు ఎకానమీ క్లాస్ టికెట్లను ఇచ్చామని.. వోచర్ ను స్వీకరించారని జర్మన్ ఎయిర్ లైన్స్ తన వాదనను వినిపించింది. ఆ సమయంలో తాను అధికారులతో గొడవకు దిగితే ఫ్లైట్ మిస్ అవుతుందనే కారణంతో వెళ్లిపోయానని కన్స్యూమర్ కోర్టుకు బాధితుడు తెలిపారు. దాంతో గోయెంకాకు 20 లక్షల పరిహారం చెల్లించాలని ఎయిర్ లైన్స్ ను కోర్టు ఆదేశించింది. -
ఎకానమీ ప్రయాణికులకు ఎయిరిండియా ఆఫర్
న్యూఢిల్లీ: కొంత మొత్తం అదనంగా చెల్లిస్తే దేశీ రూట్లలో ఎకానమీ తరగతి ప్రయాణికులు బిజినెస్ క్లాస్‌కి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఇందుకోసం వారు తీసుకున్న ఎకానమీ టికెట్ రేటు కన్నా రూ. 5,000 నుంచి రూ. 7,000 దాకా అదనంగా చెల్లించాల్సి వస్తుందని వివరించింది. ప్రయాణాలకు సంబంధించి ముందస్తుగా కొనుక్కున్న చౌక టికెట్లకు కూడా .. ‘గెట్ అప్ ఫ్రంట్’ అనే ఈ అప్‌గ్రేడ్ స్కీము వర్తిస్తుందని పేర్కొంది. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా తదితర 43 నగరాల్లో అక్టోబర్ 31 దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తూ.. బిజినెస్ తరగతిలో అందుబాటులో ఉన్న సీట్లను బట్టి .. ఎయిర్‌పోర్టులో చెక్ ఇన్‌కి ముందు మాత్రమే సీట్ల కేటాయింపు జరుగుతుంది. స్కీము కింద 750 కిలోమీటర్ల దాకా దూరం ప్రయాణాలు చేసే వారు అప్‌గ్రేడ్ కోసం రూ. 5,000, 750 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే వారు రూ. 7,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీ-ముంబై రూట్లో బిజినెస్ క్లాస్ టికెట్ రేటు సుమారు రూ. 25,000గా ఉంది. అయితే, చాలా ముందస్తుగా ఎకానమీ తరగతిలో చౌకగా రూ.5,000కి టికెట్ కొనుక్కున్న వారు.. అదనంగా రూ. 7,000 కట్టి బిజినెస్ క్లాస్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫలితంగా మొత్తం చార్జీ రూ. 12,000 మాత్రమే అవుతుంది. అయినప్పటికీ సాధారణంగా బిజినెస్ తరగతి టికెట్‌కి ఉండే రేటు కన్నా ఇది సగం స్థాయిలోనే ఉంటుందని ఎయిరిండియా పేర్కొంది. పూర్తి ఎకానమీ సర్వీసులే నడుపుతున్న కొన్ని రూట్లలో తొలి 3 వరుసలను అప్‌గ్రేడ్ చేసుకున్న ప్రయాణికులకు కేటాయించి, ప్రీమియం సర్వీసులు అందిస్తామని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.