ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహ ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్‌ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక వ్యక్తి మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆరిపోవడంతో.. అక్కడ ఏం జరుగుతోందో కొందరి ప్రయాణికులకే అర్థమైంది. పైగా మూత్ర విసర్జన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లకుండా అలానే నుంచొని ఉన్నాడు. అతడి వికృత చర్య కారణంగా.. సదరు ప్రయాణికురాలి బట్టలు, బూట్లు, మూత్రంతో తడిచిపోయాయి. దీంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత విమాన సిబ్బంది ఆమెకు బట్టలు, చెప్పులు ఇచ్చి మళ్లీ తన సీటుకే రావలని చెప్పారు. ఐతే ఆమె అందుకు గట్టిగా నిరాకరించడంతో మరో సీటు పురమాయించారు.ఐతే సిబ్బంది ఆ సీటు కవర్లు మార్చి, వాసన రాకుండా స్ప్రె చల్లారు గానీ ఆ సీటుపై కూర్చోవాలంటేనే చిరాకనిపించదని ఆ మహిళ వాపోయింది. ఆ ఘటన తర్వాత ఆమె మరొక సిబ్బంది సీటులో కూర్చొని విమానంలో మిగతా ప్రయాణాన్ని కొనసాగించారు.
ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా సదరు ఎయిర్‌లైన్ అధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సదరు మహిళకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్‌కి ఈ విషయమై లేఖ రాశారు. అంతేగాదు ఆమె లేఖలో.. బిజినెస్ క్లాస్‌లో సీట్లన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ మరో క్యాబిన్ సీటు కూడా తనకి ఇవ్వలేదని ఎయిర్ ఇండియా సిబ్బందిపై కూడా ఆరోపణలు చేసింది. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విషయమై సదరు ఎయిర్‌లైన్ నుంచి వివరణ కోరింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే గాక సదరు వ్యక్తిని నోఫ్లై లిస్ట్‌లో చేర్చనున్నట్లు పేర్కొంది.
(చదవండి: బీజేపీ నాయకుడి అక్రమ హోటల్‌ని..ఏకంగా 60 డైనమైట్‌లతో ధ్వంసం)
Comments
Please login to add a commentAdd a comment