Co Passenger
-
తృటిలో తప్పించుకున్నాం!
చావు నుంచి తృటిలో తప్పించుకున్నామని చెబుతున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. అసలు విషయం ఏంటంటే... ఇటీవల ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు రష్మికా మందన్నా ఓ విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ విమానంలోనే మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా ఉన్నారు. అయితే విమానం టేకాఫ్ అయిన అరగంటలోపే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి ముంబైలోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఆందోళనకరమైన ఘటనను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు రష్మికా మందన్నా. ‘చావు నుంచి మేం తృటిలో తప్పించుకున్నాం’ అనే క్యాప్షన్‌తో శ్రద్ధాదాస్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు రష్మికా మందన్నా. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. కాగా ఇదే ఘటనపై హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా స్పందించారు. ‘‘విమానంలో వందమందికిపైగా ప్రయాణికులున్నారు. మేం దాదాపు చనిపోతామనే భావన కలిగింది. కానీ, పైలెట్ సరైన నిర్ణయం తీసుకుని అత్యవసర ల్యాండింగ్ చేశారు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు శ్రద్ధాదాస్. -
ఎగతాళి చేద్దామనుకున్నాడు.. చివరికి నవ్వులపాలై..
వైరల్: భారీ కాయం వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలు మరీ ఎక్కువ. కూర్చోవడంలో అసౌకర్యం సంగతి అటుంచితే ఎదుటివారు ఏమనుకుంటారోనన్న ఆత్మన్యూనతా భావం సగం కుంగదీస్తుంది. అలాంటి సందర్భాల్లో వారు చాలా అవమానంగా కూడా ఫీలవుతూ ఉంటారు. అచ్చంగా అలాంటి పరిస్థితినే విమానం ప్రయాణంలో ఎదుర్కొంది భారీ కాయమున్న ఓ ప్రయాణికురాలు. ఆమె పక్క సీటులో కూర్చొని ప్రయాణించాల్సిన వ్యక్తి ఆమెను ఎగతాళి చేయడమే కాకుండా ఆమె ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పైగా దానికి ఒక క్యాప్షన్ కూడా జతచేశాడు... ఇలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు నాకు కేటాయించిన మధ్య సీటులో కూర్చోవడమెలా? మీరేమంటారు? అని ప్రశ్నించాడు. అతడికి మద్దతుగా కామెంట్లు వస్తాయనుకుంటే అది కాస్తా రివర్స్ లో ఫైర్ అయ్యింది. అందరూ ఆ మహిళకు మద్దతుగా కామెంట్లు చేసి సదరు ప్రయాణికుడికి చురకలు అంటించారు. అతడి ఉద్దేశ్యాన్ని గ్రహించిన నెటిజన్లు అతడి పోస్ట్ పై అంతే సున్నితంగా స్పందించారు. అదసలు సమస్యే కాదు.. నేనైతే నోరు మూసుకుని వెళ్లి నా సీటులో కూర్చుని అడ్జస్ట్ అవుతాను అని ఒకరు రాయగా.. మరొకరు, గతంలో నాక్కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.. అప్పుడైతే ఆ వ్యక్తి ఏం అనుకోకండి నన్ను పిల్లోలా వాడుకోమని చెప్పిన సరదా సన్నివేశాన్ని షేర్ చేశారు.. ఇంకొకరైతే, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను.. ఈ విషయాన్ని రచ్చ చేయడం కంటే వేరే ఫ్లైట్ చూసుకోవచ్చు కదా భయ్యా అంటూ వెటకారం చేశాడు. ఆ విధంగా ఆ ప్యాసింజరు తోటి ప్రయాణికురాలిని నవ్వులపాలు చేద్దాం అనుకుని తానే నవ్వులపాలయ్యాడు. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
విమానంలో మరో అనుచిత ఘటన: 62 ఏళ్ల ప్రయాణికుడి వీరంగం
గత కొన్ని రొజులుగా విమానంలో చోటు చేసుకున్న ప్రయాణికుల అనుచిత ప్రవర్తనల గురించి వింటున్నాం. వారిపై ఎయిర్‌లైన్స్ అధికారలు చర్యలు తీసుకున్నప్పటికీ అలాంటి ఘటనలే చోటు చేసుకోవడం బాధకరం. అలాంటి అనుచిత ఘటనే మరోకటి జరిగింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో 62 ఏళ్ల ప్రయాణికుడు ఎయిర్ హోస్టస్, తోసహా ఇతర ప్రయాణికుల పట్ల చాలా అనుచితంగా ప్రరవ్తించాడు. తాగిన మత్తులో సదరు వ్యక్తి విమానంలో వీరంగం సృష్టించినట్లు సమాచారం. అతను భోజనం వడ్డిస్తున్న సమయంలో వెస్టబర్గ్ ఎయిర్‌హోస్టస్‌తో అనుచితంగా ప్రవర్తించడమే గాక ఆమె చేయి పట్టుకునే యత్నం చేశాడు. ఇతర ప్రయాణికుల ముందు ఆమెనే వేధింపులకు గురి చేశాడు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులను దుర్భాషలాడంటి వంటివి చేసినట్లు ఎయిర్ హోస్టస్ ఆరోపించింది. దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోగానే సదరు నిందితుడిని స్వీడిష్‌కి చెందిన క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్‌గా గుర్తించి, అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణికులు వరుస అనుచితత ఘటనల్లో ఇది ఎనిమిదోది. ఇటీవల వార్తల్లో నిలిచిన న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలోని వృద్ధురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువుకే మునుపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకోవడం బాధకరం. (చదవండి: అరుదైన ఘటన: మొక్కల్లో వచ్చే శిలింద్ర వ్యాధి సోకిన వ్యక్తి) -
Delhi: తాగిన మైకంలో మూత్రం పోసి క్షమాపణలు.. అరెస్ట్
న్యూఢిల్లీ: మరో పీ గేట్ ఘటన వెలుగు చూసింది. న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. తప్పతాగిన స్థితిలో ఓ భారతీయ విద్యార్థి మూత్రవిసర్జన చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికుడు ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా.. విమానయాన సంస్థ రంగంలోకి దిగి ఆ విద్యార్థిని అరెస్ట్ చేయించింది. శుక్రవారం రాత్రి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఏఏ292 న్యూయార్క్ నుంచి బయలుదేరింది. శనివారం రాత్రి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే.. ఈ మధ్యలో ఓ ప్రయాణికుడు తప్పతాగిన మైకంలో మూత్ర విసర్జన చేశాడు. అది కాస్త పక్కనే ఉన్న ప్యాసింజర్‌కు తాకింది. దీంతో విమాన సిబ్బందికి విషయం తెలియజేశాడు సదరు ప్రయాణికుడు. అయితే.. మూత్ర విసర్జన చేసింది విద్యార్థి కావడం, ఫిర్యాదు చేస్తే అతని కెరీర్ దెబ్బ తింటుందనే ఉద్దేశం, పైగా క్షమాపణలు చెప్పడంతో.. ఈ ఘటనపై బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ, విమానయాన సంస్థ మాత్రం ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సిబ్బంది వెంటనే విషయాన్ని పైలట్‌కు తెలియజేశారు. పైలట్, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో.. ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. విమానం ల్యాండ్ కాగానే సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. ప్రయాణికుడు విమానంలో అనుచితంగా ప్రవర్తించినట్లు రుజువైతే.. క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షలతో పాటు కొంతకాలం అతనిపై విమానయాన వేటు విధించే అవకాశం ఉంటుంది. గత నవంబర్‌లో ఇదే తరహాలో ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శంకర్ మిశ్రా అనే వ్యక్తి తాగిన మైకంలో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసి జైలుకు వెళ్లి.. బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ఇండియా స్పందన సరైన రీతిలో లేదన్న అభియోగాలతో.. విమానయాన సంస్థకు 30 లక్షల రూ. జరిమానా కూడా విధించింది డీసీసీఏ. -
‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో సిబ్బంది సరిగా స్పందించలేదని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఆ ఘటన వ్యక్తిగతంగా నాకు, ఎయిరిండియా సిబ్బందికి మనస్తాపం కలిగించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించాల్సిన, స్పందించాల్సిన తీరును సమీక్షించి, సరిచేస్తాం’’ అన్నారు. నిందితుడి అరెస్ట్.. ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రాకు ఢిల్లీ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే పోలీసు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోందని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనామిక పేర్కొన్నారు. ఇదీ చదవండి: Shocking: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్‌కు లేఖ -
అలా చేసి ఉండాల్సింది కాదు: మిశ్రా పక్క సీటు వైద్యుడు షాకింగ్ వ్యాఖ్యలు
ఎయిర్ ఇండియాలో జరిగిన మూత్ర విసర్జన ఘటనపై నిందితుడు శంకర్ మిశ్రా పక్కసీటు ప్రయాణికుడు చాలా షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు మిశ్రా పక్కసీటు వ్యక్తి ఆమెరికాకు చెందిన ఆడియాలజీ వైద్యుడు సుగతా భట్టాచార్జీ నాటి దురదృష్టకర ఘటనను గుర్తు చేసుకుంటూ...ఆ రోజు ఆ వృద్ధ మహిళ పట్ల పైలెట్ అలా వ్యవహరించి ఉండకూడదన్నారు. ఆయన ఆ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేసి బాధితురాలికి ఉపశమనం కలిగించేలా ఏదైనా చేసి ఉంటే ఇంతలా చర్చనీయాంశంగా మారేది కాదన్నారు. ఐతే నిందితుడి తండ్రి ఆ రోజు ఎలాంటి అనుచిత ఘటన జరగలేదంటూ.. వాదించిన నేపథ్యంలోనే సుగతా భట్టాచార్జీ నాటి ఘటన గురించి వివరించారు. ఆ రోజు బాధిత మహిళ చాలా మర్యాదగా వ్యవహరించిందన్నారు. తాను బిజినెస్ క్లాస్‌లో 8A సీటులో కూర్చొన్నాని, మిశ్రా 8Cలో కూర్చొన్నారని చెప్పారు. ఆ రోజు భోజనం చేసిన కొద్దిసేపటికి లైట్లు ఆరిపోయాయని చెప్పారు. ఆ తర్వాత నిందితుడు శంకర్ మిశ్రా వృద్ధురాలి సీటు9A వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేశాడు. వాస్తవానికి వాష్ రూమ్ అతని సీటుకి నాలుగు సీట్ల వెనకాల ఉంది. ఈ హఠాత్పరిణామానికి 9A, 9Cలలో కూర్చొన్న ఇద్దరు ప్రయాణికులు ఇబ్బంది పడటం చూశానని అన్నారు. భట్టాచార్జీ తాను ఆ సమయంలో వాష్‌రూమ్‌కి వెళ్తుండగా.. మిశ్రా తనపై తూలితే.. ఫ్లైట్ వేగంగా వెళ్లడంతో అలా పడ్డాడనుకున్నాం, గానీ ఆ తర్వాత అతను చాలా మత్తులో ఉన్నట్లు గమనించి షాక్ అయ్యాం అన్నారు. పాపం ఆ బాధిత మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా..వారు వచ్చి కేవలం సీటును క్లీన్ చేసి, షీట్లు మార్చి.. మళ్లీ అక్కడే కూర్చొమన్నారని చెప్పుకొచ్చారు. దీంతో తనకు తన నైతిక బాధ్యత గుర్తుకొచ్చి..మరోక సీటు ఇవ్వాల్సిందిగా సీనియర్ హోస్ట్‌కి చెప్పినట్లు పేర్కొన్నారు. ఐతే ఆమె పైలెట్ అనుమతి తీసుకోవాలని, తాను అలా చేయాలనని చెప్పినట్లు తెలిపారు. ఆ రోజు ఆ సీటు క్లీన్ చేసేంత వరకు రెండు గంటల పాటు ఆ మహిళ అలా నిలబడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. తాను వెళ్లి సిబ్బందితో చెప్పడంతో ఆమెకు ఒక సిబ్బంది సీటును కేటాయించారు. ఆ రోజు బిజినెస్ క్లాస్‌లో సీటులు ఖాళీగా ఉన్నా కూడా పైలెట్ ఆమెకు మరో సీటు కేటాయించకపోగా..కాసేపటి తర్వాత అదే సీటుకి రావాల్సిందిగా కోరారు. ఐతే ఆమె అందుకు నిరాకరించి..సిబ్బందికి కేటాయించే.. చిన్న సీటులోనే ఉండిపోయిందని చెప్పారు. ఆ సమయంలో పైలెట్ సరైన రీతిలో నిర్ణయం తీసుకుని స్పందించి ఉంటే... ఇదంతా జరిగి ఉండేది కాదన్నారు. విమాన సిబ్బంది ఒక స్త్రీ పరువుతో ఆడుకుని, ఎయిర్ ఇండియా పరువు దిగజార్చరన్నారు. ఇదిలా ఉండగా, ముంబై సమీపంలోని బొయిన్‌సర్‌లో ఉంటున్న నిందితుడు మిశ్రా తండ్రి మాత్రం తన కొడుకు అమాయకుడని, తన తల్లి వయసు ఉన్న ఆమెతో అలా వ్యవహరించడంటూ వాదించడం గమనార్హం. కాగా నిందితుడు శంకర్ మిశ్రాను శనివారం ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. అంతేగాదు అతని కస్టడీ కోసం పోలీసుల చేసిన విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. పైగా బెయిల్ దరఖాస్తును జనవరి 11న పరిశీలిస్తామని ఢిల్లీ కోర్టు పేర్కొంది. (చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ) -
షాకింగ్ ఘటన: విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..
ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహ ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక వ్యక్తి మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆరిపోవడంతో.. అక్కడ ఏం జరుగుతోందో కొందరి ప్రయాణికులకే అర్థమైంది. పైగా మూత్ర విసర్జన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లకుండా అలానే నుంచొని ఉన్నాడు. అతడి వికృత చర్య కారణంగా.. సదరు ప్రయాణికురాలి బట్టలు, బూట్లు, మూత్రంతో తడిచిపోయాయి. దీంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విమాన సిబ్బంది ఆమెకు బట్టలు, చెప్పులు ఇచ్చి మళ్లీ తన సీటుకే రావలని చెప్పారు. ఐతే ఆమె అందుకు గట్టిగా నిరాకరించడంతో మరో సీటు పురమాయించారు.ఐతే సిబ్బంది ఆ సీటు కవర్లు మార్చి, వాసన రాకుండా స్ప్రె చల్లారు గానీ ఆ సీటుపై కూర్చోవాలంటేనే చిరాకనిపించదని ఆ మహిళ వాపోయింది. ఆ ఘటన తర్వాత ఆమె మరొక సిబ్బంది సీటులో కూర్చొని విమానంలో మిగతా ప్రయాణాన్ని కొనసాగించారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా సదరు ఎయిర్‌లైన్ అధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సదరు మహిళకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్‌కి ఈ విషయమై లేఖ రాశారు. అంతేగాదు ఆమె లేఖలో.. బిజినెస్ క్లాస్‌లో సీట్లన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ మరో క్యాబిన్ సీటు కూడా తనకి ఇవ్వలేదని ఎయిర్ ఇండియా సిబ్బందిపై కూడా ఆరోపణలు చేసింది. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విషయమై సదరు ఎయిర్‌లైన్ నుంచి వివరణ కోరింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే గాక సదరు వ్యక్తిని నోఫ్లై లిస్ట్‌లో చేర్చనున్నట్లు పేర్కొంది. (చదవండి: బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం) -
బూతులు తిడుతూ.. జుట్టు లాగి...
సాక్షి, ముంబై: క్యాబ్ ప్రయాణంలో ఓ జర్నలిస్ట్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. తోటి ప్రయాణికురాలు బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడింది. ఈ ఘటన పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు క్యాబ్ సంస్థ దర్యాప్తునకు సహకరించకపోవటంపై బాధితురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు దాడి చేసిన ఘటనను వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్టులు ఉంచారు. ముంబైకి చెందిన ఉష్నోటా జూన్ పౌల్ అనే జర్నలిస్ట్ ఉబెర్ పూల్ ప్రయాణం బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో క్యాబ్ ఉరిమి ఎస్టేట్ వద్దకు చేరుకోగానే క్యాబ్‌లో ఉన్న ఓ ప్రయాణికురాలు డ్రైవర్‌తో గొడవ పడింది. ‘తాను ఎక్కువ చెల్లించినప్పటికీ.. చివర్లో దించటమేంటని?’ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. ఇంతలో ఉష్నోటా జోక్యం చేసుకుని డ్రైవర్‌కు మద్ధతుగా నిలిచారు. దీంతో సదరు మహిళకు చిర్రెత్తుకొచ్చింది. ఉష్నోటాపై పిడి గుద్దులు గుప్పిస్తూ.. పిచ్చి బూతులు తిడుతూ దాడికి పాల్పడింది. వెంటనే ఉష్నోటా ఫోటోలు తీసేందుకు యత్నించగా, సదరు మహిళ ఫోన్ లాక్కుని పగలగొడతానని బెదిరించింది. ఈ వ్యవహారాన్నంతా డ్రైవర్ మౌనంగా ఊస్తూ ఉండిపోయాడే తప్ప, అడ్డుకోడానికి యత్నించలేదని ఆరోపణ. అంతలో స్థానికులు పెద్ద ఎత్తున్న గుమిగూడగా, అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ఉష్నోటాను రక్షించాడు. ఈ ఘటన తర్వాత దాడికి పాల్పడ్డ మహిళ అక్కడి నుంచి జారుకుంది. స్థానికుల సాయంతో ఉష్నోటా దగ్గర్లోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో స్పందించేందుకు ఉబెర్ సంస్థ నిరాకరించటంతో అసంతృప్తి వెల్లగక్కుతూ ఉష్నోటా ఫేస్బుక్, ట్విటర్లో వరుస పోస్టులు చేశారు. గాయాలు, క్యాబ్‌లోపల ఆమె జట్టు పడి ఉన్న చిత్రాలను కూడా పోస్ట్ చేశారు. ఆమెకు మద్ధతుగా వందలాది రీ-పోస్టులు వెలియటంతో ఎట్టకేలకు ఉబెర్ యాజమాన్యం స్పందించింది. ‘ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ వ్యవహారంలో బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని, దర్యాప్తునకు తప్పకుండా సహకరిస్తామని’ ఉబెర్ సంస్థ ప్రతినిధి ఒకరు ఆమె పోస్టుపై స్పందించారు. -
సమాధానాలు చెప్పలేదని ముస్లిం యువకుడిపై..
కోల్‌కతా : అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదని రైలులో ప్రయాణిస్తున్న ముస్లిం యువకుడిపై తోటి ప్రయాణికులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో చోటుచేసుకుంది. మాల్దా జిల్లాకు చెందిన ఓ ముస్లిం యువకుడు హౌరాలో వలస కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడు మే14వ తేదిన హౌరా నుంచి ఇంటికి వెళ్లడానికి రైలు ఎక్కాడు. కొద్ది సేపటి తర్వాత అతని సీటు పక్కన కూర్చున్న నలుగురు వ్యక్తులు అతన్ని ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోది, జాతీయగీతం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల గురించిన ప్రశ్నలు అతన్ని అడిగారు. ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదన్న కోపంతో అతనిపై చేయి చేసుకున్నారు. అనంతరం ఆ నలుగురు బండేల్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఎన్జీవో ‘‘బంగ్ల సంసృ్కతి మంచ’’ నిందితులపై కాలియాచక్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
'నేనెలాగో చావాలి..'
సాక్షి, భోపాల్ : అకారణంగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని చంపేశాడు. నడుస్తున్న రైలులో నుంచి ముక్కు ముఖం తెలియని వ్యక్తి మరో వ్యక్తిని కిందికి తోసి హత్య చేశాడు. అతడిని చంపడానికి ముందు 'నేను ఎలాగో చనిపోతున్నాను.. నిన్ను కూడా చంపేస్తా' అని కేకలు పెడుతూ వచ్చి అసలు తనకు పరిచయం లేని వ్యక్తిని కిందపడేసి చంపేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం .. ఆదివారం మధ్యప్రదేశ్‌లో కామాయని ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కోచ్‌లో రితేజ్ అనే వ్యక్తి డోర్‌పక్కనే కూర్చున్నాడు. ఆ సమయంలో రితేష్ పక్కనే అతడి సోదరుడు సుమిత్ సింగ్, రైల్వే పోలీసులు కూడా ఉన్నారు. ఆ సమయంలో రజ్మల్ పాల్ అకా రజ్జు అనే వ్యక్తి నేరుగా రితేష్ వద్దకు వచ్చి తాను ఎలాగో చస్తున్నానని, అందుకు నిన్ను కూడా చంపేస్తానంటూ రితేష్‌ను అమాంతం రైలులో పడేశాడు. ఈ సంఘటన భోపాల్ శివారులో ఉన్న సుఖి సెవానియా రైల్వేస్టేషన్‌కు సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడు, నిందితుడు ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు తెలియదు. పైగా వారిద్దరి మధ్య రైలులో ఎలాంటి గొడవ జరగలేదు. టాయిలెట్లో నుంచి బయటకు వచ్చిన నిందితుడు రజ్మల్ నేరుగా రితేశ్ వద్దకు వచ్చి ఇలా చేశాడు. దీంతో ప్రస్తుతం అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదా కావాలనే ఇలా చేశాడా అని ఆరా తీస్తున్నారు. -
అతనేం జైరాను వేధించలేదు : ప్రత్యక్ష సాక్షి
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటి జైరా వసీమ్ లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తీసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ఆమెపై ముంబైకి చెందని ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తోటి ప్రయాణికుడు ఒకరు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో నిందితుడు జైరాను వేధించలేదని పేర్కొనటం విశేషం. ఈ మేరకు నిందితుడు వికాస్ సచ్దేవ్ తరపు న్యాయవాది హెచ్ ఎస్ ఆనంద్ బుధవారం కోర్టులో వాదనలు వినిపించారు. ‘‘నేను అదే విమానంలో ప్రయాణించా. వారికి సమీపానే నేను కూర్చుని ఉన్నా. అతను సీటుపై కాలుపెట్టిన మాట వాస్తవం. అయితే ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్నాక కూడా అతను కాలును అలాగే ఉంచాడు. అతనేం లైంగిక వేధింపులకు పాల్పడలేదు. ముంబైలో విమానం ల్యాండ్ అయ్యాక ఆమె అతనిపై గట్టిగా అరిచింది. వెంటనే కాలు పెట్టినందుకు అతను క్షమాపణలు కూడా తెలియజేశాడు. వివాదం అంతటితో సర్దుమణిగింది కూడా’’ అని చతుర్వేది అనే ప్రయాణికుడు ముంబై పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిని ఆధారంగా చేసుకుని అతనికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది ఆనంద్ జడ్జిని కోరారు. అయితే మరికొందరు ప్రయాణికులతోపాటు, బాధితురాలి స్టేట్మెంట్ను(సీఆర్పీసీ 164 సెక్షన్ ప్రకారం) ఇంకా రికార్డు చేయని పక్షంలో అతన్ని కస్టడీకి అనుమతించాలని పోలీసులు న్యాయమూర్తిని అభ్యర్థించారు. కానీ, నిందితుడు జమ్ము కశ్మీర్‌కు చెందిన వ్యక్తని.. అతనికి సీఆర్పీసీ వర్తించని అతని తరపున న్యాయవాది వాదన వినిపించగా.. దానిని కోర్టు తోసిపుచ్చింది. చివరకు అతనిని డిసెంబర్ 22వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. అయితే సచ్దేవ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. దానిపై విచారణను 15వ తేదీకి వాయిదా వేశారు. బాలీవుడ్లో పెరిగిపోతున్న మద్దతు.. కాగా, నటి జైరా వసీమ్‌కు మద్దతు పెరిగిపోతూ వస్తోంది. పలువురు బాలీవుడ్ నటులు ఇప్పటికే ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేయగా.. తాజాగా అమీర్‌ఖాన్ భార్య కిరణ్, నటి కంగనా రనౌత్ స్పందించారు. జైరా స్థానంలో తాను ఉండి ఉంటే అతని కాళ్లు విరగొట్టి ఉండేదానినని కంగనా వ్యాఖ్యానించారు. మరోవైపు క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు. -
విమానంలో బయటకు చెప్పలేని విధంగా..
న్యూఢిల్లీ: తన వయసును కూడా మరిచిపోయి ఓ 56 ఏళ్ల వ్యక్తి అసభ్యతకు దిగాడు. ఇండిగో విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో శనివారం చోటు చేసుకుంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరే ఇండిగో విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఆమెను తాకేందుకు ప్రయత్నించడంతోపాటు బయటకు చెప్పలేని విధంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే ఎయిర్హోస్టేస్ను పిలిచి తన సీటును మార్పించుకుంది. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే సిబ్బందికి ఫిర్యాదుచేయగా అతడిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని రోహిణీ ప్రాంత నివాసి అయిన రమేశ్ చంద్గా గుర్తించారు.