గత కొన్ని రొజులుగా విమానంలో చోటు చేసుకున్న ప్రయాణికుల అనుచిత ప్రవర్తనల గురించి వింటున్నాం. వారిపై ఎయిర్‌లైన్స్ అధికారలు చర్యలు తీసుకున్నప్పటికీ అలాంటి ఘటనలే చోటు చేసుకోవడం బాధకరం. అలాంటి అనుచిత ఘటనే మరోకటి జరిగింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో 62 ఏళ్ల ప్రయాణికుడు ఎయిర్ హోస్టస్, తోసహా ఇతర ప్రయాణికుల పట్ల చాలా అనుచితంగా ప్రరవ్తించాడు.
తాగిన మత్తులో సదరు వ్యక్తి విమానంలో వీరంగం సృష్టించినట్లు సమాచారం. అతను భోజనం వడ్డిస్తున్న సమయంలో వెస్టబర్గ్ ఎయిర్‌హోస్టస్‌తో అనుచితంగా ప్రవర్తించడమే గాక ఆమె చేయి పట్టుకునే యత్నం చేశాడు. ఇతర ప్రయాణికుల ముందు ఆమెనే వేధింపులకు గురి చేశాడు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులను దుర్భాషలాడంటి వంటివి చేసినట్లు ఎయిర్ హోస్టస్ ఆరోపించింది.
దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోగానే సదరు నిందితుడిని స్వీడిష్‌కి చెందిన క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్‌గా గుర్తించి, అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణికులు వరుస అనుచితత ఘటనల్లో ఇది ఎనిమిదోది. ఇటీవల వార్తల్లో నిలిచిన న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలోని వృద్ధురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువుకే మునుపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకోవడం బాధకరం.
(చదవండి: అరుదైన ఘటన: మొక్కల్లో వచ్చే శిలింద్ర వ్యాధి సోకిన వ్యక్తి)
Comments
Please login to add a commentAdd a comment