airhostess
-
నాన్న ముద్ద
పిల్లలు స్కూలుకెళ్లే హడావుడిలో ఉంటే అమ్మలు అన్నం ముద్ద కలిపి పెడతారు. ఇక్కడ కూతురు ఎయిర్‌హోస్టెస్‌గా డ్యూటీకి వెళ్లే హడావుడిలో ఉంటే నాన్న బతిమాలి అన్నం తినిపిస్తున్నాడు. ఇండిగో ఎయిర్‌హోస్టెస్ పూజా బిహాని పెట్టిన ఈ ΄ోస్టు క్షణాల్లో వైరల్‌గా మారి అందరి చేతా తల్లినో, తండ్రినో గుర్తుకు తెప్పిస్తోంది. ‘తల్లి బిడ్డ కడుపు చూస్తుంది’ అంటారు. తండ్రికి మాత్రం బిడ్డ ఆకలి పట్టదా? తల్లి కష్టపడ్డా, తండ్రి కష్టపడ్డా బిడ్డల కోసమే. జీవులకు లోకంలో అన్నింటి కంటే తృప్తినిచ్చేది తమ సంతానానికి ఆహారం అందించడమేనట. పిల్లలు తింటూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందం. వారు ఖాళీ కడుపులతో ఉంటే బాధ. ముద్దుకోసమో మురిపెం కోసమో పిల్లలకు ఎన్నేళ్లొచ్చినా గోరుముద్దలు తినిపించే తల్లులు ఉంటారు. అయితే ఇక్కడ తండ్రి మార్కులు కొట్టేశాడు. ఇండిగోలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తున్న పూజా బిహాని డ్యూటీకి టైమయ్యి మేకప్ వేసుకుంటూ ఉంటే ఎక్కడ ఖాళీ కడుపుతో క్యాబ్ ఎక్కి తుర్రుమంటుందోనని ఆమె తండ్రి అన్నం తినిపించాడు. ఆ వీడియోను పూజా ఇన్‌స్టాలో ΄ోస్ట్ చేస్తే క్షణాల్లో 8.6 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి’ అని ఒకరంటే ‘తల్లిదండ్రులు మాత్రమే పిల్లల బాగోగుల గురించి పట్టించుకుంటారు’ అని మరొకరు అన్నారు. ‘నాన్న గుర్తొస్తున్నారు’ అని ఒకరంటే ‘ఆ రోజులు మళ్లీ రావు’ అని మరొకరు బాధ పడ్డారు. చిన్న చిన్న ఆనందాల జీవితం అంటే ఇదేనని అందరూ అన్నారు. -
విమానంలో మరో అనుచిత ఘటన: 62 ఏళ్ల ప్రయాణికుడి వీరంగం
గత కొన్ని రొజులుగా విమానంలో చోటు చేసుకున్న ప్రయాణికుల అనుచిత ప్రవర్తనల గురించి వింటున్నాం. వారిపై ఎయిర్‌లైన్స్ అధికారలు చర్యలు తీసుకున్నప్పటికీ అలాంటి ఘటనలే చోటు చేసుకోవడం బాధకరం. అలాంటి అనుచిత ఘటనే మరోకటి జరిగింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో 62 ఏళ్ల ప్రయాణికుడు ఎయిర్ హోస్టస్, తోసహా ఇతర ప్రయాణికుల పట్ల చాలా అనుచితంగా ప్రరవ్తించాడు. తాగిన మత్తులో సదరు వ్యక్తి విమానంలో వీరంగం సృష్టించినట్లు సమాచారం. అతను భోజనం వడ్డిస్తున్న సమయంలో వెస్టబర్గ్ ఎయిర్‌హోస్టస్‌తో అనుచితంగా ప్రవర్తించడమే గాక ఆమె చేయి పట్టుకునే యత్నం చేశాడు. ఇతర ప్రయాణికుల ముందు ఆమెనే వేధింపులకు గురి చేశాడు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులను దుర్భాషలాడంటి వంటివి చేసినట్లు ఎయిర్ హోస్టస్ ఆరోపించింది. దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోగానే సదరు నిందితుడిని స్వీడిష్‌కి చెందిన క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్‌గా గుర్తించి, అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణికులు వరుస అనుచితత ఘటనల్లో ఇది ఎనిమిదోది. ఇటీవల వార్తల్లో నిలిచిన న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలోని వృద్ధురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువుకే మునుపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకోవడం బాధకరం. (చదవండి: అరుదైన ఘటన: మొక్కల్లో వచ్చే శిలింద్ర వ్యాధి సోకిన వ్యక్తి) -
భవనంపై నుంచి పడి ఎయిర్‌హోస్ట్ మృతి.. బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్
బెంగళూరు: ఎయర్హోస్ట్ భవనంపై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని కోరుమంగళలో రేణుకా రెసిడెన్సీలోని అపార్ట్మెంట్లో ఎయిర్ హోస్ట్ అర్చన ధీమాన్, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆదేశ్‌తో కలిసి నివసిస్తోంది. ఆదేశ్ నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు. వీరిద్దరికి డేటింగ్ సైట్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. గత ఆరు నెలలుగా రిలేషన్షిప్లో ఉంటున్నారు. కాగా ఎయిర్‌హోస్ట్ అర్చన మృతిలో ఆదేశ్ పాత్ర ఉందనే అనుమానంతో పోలీసులు అతడిపై హత్య నేరం మోపి అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరగుతున్నాయని ఆదేశ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఈ ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు తెలిపాడు. ఆరోజు అర్చన నాల్గో అంతస్థు బాల్కనీ నుంచి జారిపడిందని, తాను ఆస్పత్రికి తరలించగా మృతి చెందిందని పేర్కొన్నాడు. అయితే దర్యాప్తులో ఈ ప్రమాదానికి నాలుగు రోజుల ముందే అర్చన దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చినట్లు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పోలీసులు. (చదవండి: స్వలింగ వివాహలకు చట్టబద్ధత అంశం.. రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు) -
Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్ హోస్టెస్
కేరళలో కేవలం పదిహేను వేల మంది ఉండే గిరిజనులు ‘కరింపలనులు’. పోడు వ్యవసాయం, కట్టెబొగ్గు చేసి అమ్మడం వీరి వృత్తి. అలాంటి సమూహం నుంచి ఒకమ్మాయి ‘ఎయిర్‌హోస్టెస్’ కావాలనే కల కంది. కేరళలో అప్పటి వరకూ గిరిజనులు ఎవరూ ఇలాంటి కలను కనలేదు. 12 ఏళ్ల వయసులో కలకంటే 24 ఏళ్ల వయసులో నిజమైంది. పరిచయం చేసుకోండి కేరళ తొలి గిరిజన ఎయిర్‌హోస్టెస్‌ని. కేరళలోని కన్నూరు, కోజికోడ్ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ‘కరింపలనులు’. వీళ్లు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాషను మాట్లాడతారు. అటవీ భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు. లేదంటే అడవిలోని పుల్లల్ని కాల్చి బొగ్గు చేసి అమ్ముతారు. గోపికా గోవింద్ ఇలాంటి సమూహంలో పుట్టింది. అయితే ఈ గిరిజనులకు ఇప్పుడు వ్యవసాయం కోసం అటవీభూమి దొరకడం లేదు. కట్టెలు కాల్చడాన్ని ఫారెస్టు వాళ్లు అడ్డుకుంటూ ఉండటంతో బొగ్గు అమ్మకం కూడా పోయింది. చిన్నప్పుడు అమ్మా నాన్న చేసే ఈ పని చూస్తూ పెరిగిన గోపికా ఇక్కడతో ఆగడమా... అంబరాన్ని తాకడమా అంటే అంబరాన్ని తాకడమే తన లక్ష్యం అని అనుకుంది. డిగ్రీ తర్వాత బిఎస్సీ చదివిన గోపిక ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ కావాలంటే అవసరమైన కోర్సు గురించి వాకబు చేసింది. ప్రయివేటు కాలేజీలలో దాని విలువ లక్షల్లో ఉంది. కూలి పని చేసే తల్లిదండ్రులు ఆ డబ్బు కట్టలేరు. అందుకని ఎం.ఎస్సీ కెమిస్ట్రీ చేరింది. చదువుతున్నదన్న మాటేకాని ఎయిర్ హోస్టెస్ కావడం ఎలా... అని ఆలోచిస్తూనే ఉంది. సరిగ్గా అప్పుడే ఐ.ఏ.టి.ఏ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) వాళ్ల కస్టమర్ సర్వీస్ కోర్సును గవర్నమెంట్ స్కాలర్షిప్ ద్వారా చదవొచ్చని తెలుసుకుంది. ఎస్.టి విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అప్లై చేసింది. స్కాలర్షిప్ మంజూరు అయ్యింది. గోపిక రెక్కలు ఇక ముడుచుకు ఉండిపోలేదు. లక్ష రూపాయల కోర్సు వాయనాడ్‌లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్సును స్కాలర్షిప్ ద్వారా చేరింది గోపిక. చదువు, బస, భోజనం మొత్తం కలిపి లక్ష రూపాయలను ప్రభుత్వమే కట్టింది. మలయాళ మీడియం లో చదువుకున్న గోపిక ఎయిర్ హోస్టెస్‌కు అవసరమైన హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా తర్ఫీదు అయ్యింది. కోర్సు పూర్తి చేసింది. ఒకసారి ఇంటర్వ్యూకు వెళితే సెలెక్ట్ కాలేదు. రెండోసారి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా ఎంపికయ్యింది. విమానం ఎప్పుడూ ఎక్కని గోపిక విమానంలోనే ఇక పై రోజూ చేసే ఉద్యోగం కోసం తిరువనంతపురం నుంచి ముంబైకి ట్రైనింగ్ కోసం వెళ్లింది. అక్టోబర్‌లో ఆమె కూడా యూనిఫామ్ వేసుకుని విమానంలో మనకు తారస పడొచ్చు. ఆమె కలను ఆమె నెరవేర్చుకుంది. ఇక మీ వంతు. 8వ క్లాసు కల గిరిజనులు విమానాన్ని గాల్లో ఎగురుతుంటే చూస్తారు తప్ప ఎక్కలేరు. గోపికా గోవింద్ కూడా చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని ఉత్సాహంగా, వింతగా చూసేది. అందులో ఎక్కడం గురించి ఆలోచించేది. 8వ క్లాసుకు వచ్చినప్పుడు ఒక పేపర్లో ఎర్రటి స్కర్టు, తెల్లటి షర్టు వేసుకున్న ఒక చక్కటి అమ్మాయి గోపికా కంట పడింది. ఎవరా అమ్మాయి అని చూస్తే ‘ఎయిర్ హోస్టస్’ అని తెలిసింది. విమానంలో ఎగురుతూ విధి నిర్వహణ. ఇదేకదా తనకు కావాల్సింది అనుకుంది. కాని ఎవరికైనా చెప్తే నవ్వుతారు. బొగ్గులమ్ముకునే వాళ్ల అమ్మాయికి ఎంత పెద్ద కల అనుకుంటారు. అందుకని సిగ్గుపడింది. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. కాని కల నెరవేర్చుకోవాలన్న కలను మాత్రం రోజురోజుకు ఆశ పోసి పెంచి పెద్ద చేసుకుంది. -
రండి రండి.. దయచేయండి!
సాక్షి, హైదరాబాద్: ఏ అంతర్జాతీయ విమానం ఎక్కినా ఎయిర్‌హోస్టెస్ ఆంగ్లంలో ‘వెల్కం’ అని పలకరిస్తూ ఆహ్వానిస్తుంది. కానీ చక్కటి తెలుగులో ‘స్వాగతం.. రండి కూర్చోండి. ప్రయాణ సమయం లో మీకు ఎలాంటి సహాయం కావలసినా మమ్మల్ని సంప్రదించండి’...అంటూ ఆత్మీయంగా పలకరిస్తే ఎలా ఉంటుంది. విమానాల్లో తెలుగుదనం ఉట్టిపడితే ఎంత బావుంటుందో కదా. అలాంటి అద్భుతమైన తెలుగు క్యాబిన్ క్రూ సేవలను అందుబాటులోకి తెచ్చింది బ్రిటిష్ ఎయిర్వేస్. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇకనుంచి తెలుగులో మాట్లాడే క్యాబిన్ క్రూ అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ మాట్లాడవచ్చు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చేందుకు గతంలోనే ప్రతిపాదనలను సిద్ధంచేసిన బ్రిటిష్ ఎయిర్వేస్ తాజాగా హైదరాబాద్ ప్రయాణికులకు తెలుగు క్యాబిన్ క్రూను పరిచయం చేసింది. ఇందుకోసం 25 మంది సిబ్బందికి 6 వారాలు శిక్షణనిచ్చి వారి సేవలను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే బీఏ 276, బీఏ 277 విమానాలలో ప్రయాణికులు ఇక నుంచి మాతృభాషలో పలకరింపులను ఆస్వాదించవచ్చు. 95 ఏళ్లు గా బ్రిటిష్ ఎయిర్వేస్ దేశంలోని వివిధ నగరాల నుంచి విమానాలను నడుపుతోంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైల నుంచి ప్రస్తుతం 28 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. -
ఎయిర్‌హోస్టెస్ మృతి.. బాయ్ ఫ్రెండ్‌పై ఫిర్యాదు
న్యూఢిల్లీ : గురుగ్రామ్‌లో ఓ యువతి ఐదో ఫ్లోర్ నుంచి పడి మరణించడం కలకలం రేపింది. అయితే ఆమె ఓ గెట్ టూగెదర్ పార్టీకి హాజరైన సమయంలో ఇలా జరగడం పలు అనుమానాలు తావిస్తోంది. ఆదివారం రాత్రి 10 గంటలకు సెక్టార్ 65 లో బెస్టెక్ పార్క్ వ్యూ స్పాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరణించిన బాధితురాలిని ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల పెగ్గిలా భూటియాగా గుర్తించారు. బాధితురాలి సోదరి బాబిలా భూటియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెగ్గిలా బిల్డింగ్ పై నుంచి దూకిన సమయంలో అక్కడే ఉన్న ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరును కూడా ఆ కేసులో చేర్చారు. (యువతిని వేధిస్తున్న అధ్యాపకుడి అరెస్టు) ‘పెగ్గిలా తన బాయ్‌ఫ్రెండ్‌తో మూడేళ్ల నుంచి రిలేషన్లో ఉన్నారు. అయితే గత నాలుగు వారాల నుంచి అతడు పెగిలాకు దూరంగా ఉంటున్నాడు. అలాగే ఆమెను సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేశారు. అయినప్పటికీ బాయ్‌ఫ్రెండ్‌తో కలవడానికి పెగ్గిలా చాలా ప్రయత్నించారు. ఎందుకంటే అతన్ని ఆమె అమితంగా ప్రేమించారు. అయితే ఉన్నట్టు ఉండి అతడు.. సెక్టార్ 65లోని తన ఫ్రెండ్ నివాసంలో గెట్ టూగెదర్కు హాజరు కావాల్సిందిగా పెగ్గిలాకు మెయిల్ పంపాడు. దీంతో ఆమె అక్కడికి వెళ్లారు. అక్కడి వెళ్లాక ఈ ప్రమాదం జరిగింది’ అని బాబిలా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెగ్గిలా అక్కడి వెళ్లిన సమయంలో ప్రమాదం ఎలా జరిగిందన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు. (కరోనాను క్యాష్ చేసుకుంటున్న మెడికల్ మాఫియా!) బిల్డింగ్ పైనుంచి పడిపోయి తీవ్రగాయాలతో ఉన్న పెగ్గిలా ఆస్పత్రికి తరలించారని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని.. సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యప్తు జరుపుతున్నామని తెలిపారు.(అత్తింటి వేధింపులకు వివాహిత బలి) -
బాయ్‌ఫ్రెండ్ నిర్వాకంతో చిక్కుల్లో ఎయిర్‌హోస్టెస్
లండన్ : బాయ్‌ఫ్రెండ్ నిర్వాకానికి మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయిన పరిస్థితి ఎదురైంది. పీకల్లోతు మద్యం సేవించి తన బాయ్‌ఫ్రెండ్ పైలట్‌తో ఘర్షణకు దిగడంతో ఎయిర్‌హోస్టెస్‌ను బ్రిటిష్ ఎయిర్వేస్ సస్పెండ్ చేసింది. ప్రయాణంలో భాగంగా సింగపూర్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హోటల్లోని రిసెప్షన్ ప్రాంతంలో బ్రిటిష్ ఎయిర్వేస్ పైలట్‌తో ఎయిర్‌హోస్టెస్ నటాలీ ఫ్లిండాల్ బాయ్‌ఫ్రెండ్ ఘర్షణకు దిగాడని బ్రిటిష్ పత్రిక సన్ పేర్కొంది. నటాలీ తన బాయ్‌ఫ్రెండ్‌ను వెనుకసీటులో విమాన ప్రయాణాన్ని ఆస్వాదించాలని సూచించగా అతను సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బ్రిటిష్ ఎయిర్వేస్ ఎయిర్‌హోస్టెస్ నటాషాను సస్పెండ్ చేసింది. తమ సిబ్బంది నుంచి సరైన ప్రవర్తనను ఆశిస్తామని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు చేపడతామని ఎయిర్వేస్ ప్రతినిధి స్పష్టం చేశారు. -
క్రైమ్ బ్రాంచ్‌కు ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసు
సాక్షి, న్యూఢిల్లీ : భర్త వేధింపులకు విసిగి ఆత్మహత్యకు పాల్పడిన ఢిల్లీ ఎయిర్ హోస్టెస్ అనీసియా బాత్రా కేసును ఢిల్లీ పోలీస్ క్రెమ్ బ్రాంచ్‌కు తరలించారు. జులై 13న దక్షిణ ఢిల్లీలోని పంచ్శీల పార్క్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు మయాంక్ సింగ్వీ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. ఢిల్లీలోని తమ నివాసం టెర్రస్ పైనుంచి దూకి అనీసియా విగతజీవిగా మారిన సంగతి తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె మరణించేందుకు రెండేళ్ల ముందు నుంచి అనీసియాకు తన భర్తతో విభేదాలు ఉన్నట్టు సమాచారం. అయితే బాధిత మహిళ కుటుంబం మాత్రం తమ బిడ్డ చనిపోయేందుకు భర్త ఆగడాలే కారణమని ఆరోపిస్తోంది. అనీసియాను భర్త మయాంక్ అనునిత్యం వేధింపులకు గురిచేసేవాడని, 2016లో వారి రెండో హనీమూన్‌లోనే అనీసియాను భర్త దారుణంగా హింసించాడని బాధితురాలి తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. అనీసియా ఆత్మహత్య కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు బాధితురాలి భర్త మయాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ఆమె ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
సాక్షి, న్యూఢిల్లీ : భర్త పెడుతున్న చిత్రహింసలకు తాళలేక బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఎయిర్‌హోస్టెస్ అనిస్సియా బత్రా(32) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు అనిస్సియా బత్రా భర్త మయాంక్‌కు గతంలోనే వివాహం అయినట్లు విచారణలో తెలిసింది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వివాదాలు ముదిరి చివరకు అనిస్సియా ఆత్మహత్యకు దారి తీశాయంటున్నారు పోలీసులు. ఈ విషయం గురించి ఢిల్లీ పోలీసాధికారి ఒకరు ‘విచారణలో భాగంగా మయాంక్‌కు అనిస్సియా కంటే ముందే మరో మహిళతో వివాహం జరిగినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని మయాంక్ అనిస్సియాకు చెప్పకుండా రెండేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు. అనిస్సియా ఆత్మహత్య చేసుకోవడానికి ఒక నెల రోజుల ముందు మయాంక్ మొదటి వివాహం గురించి ఆమెకు తెలిసింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సున్నిత మనస్కురాలైన అనిస్సియా ఈ విషయాన్ని తట్టుకోలేక పోయింది. ఈ కారణం వల్లే ఆమె బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది’ అని తెలిపారు. కట్నంగా బీఎమ్‌డబ్య్లూ కార్... వివాహ సందర్భంగా అనిస్సియా తల్లిదండ్రులు దంపతులకు బీఎమ్‌డబ్య్లూ కార్ బహుకరించారు. అడిగినంతా కట్నం కూడా ఇచ్చారు. కానీ మయాంక్ మాత్రం వివాహం అయిన రెండో రోజు నుంచే తమ కూమార్తేను వేధించడం ప్రారంభించాడని అనిస్సియా తల్లిదండ్రులు వాపోయారు. హనీమూన్‌కు వెళ్లిన రెండో రోజునుంచే తమ కుమార్తేను కొట్టడం ప్రారంభించాడని, అదనపు కట్నం కోసం వేధించాడని పోలీసులకు తెలిపారు. మయాంక్‌తో పాటు అతని తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయాలని అనిస్సియా తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేశారు. -
ఎయిర్‌హోస్టెస్ మృతి కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: భర్త చేతిలో చిత్రహింసలకు గురైన ఎయిర్‌హోస్టెస్ మృతి దేశరాజధానిలో కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్ వద్ద ఓ అపార్ట్మెంట్ పైనుంచి దూకి అనిస్సియా బత్రా(32) అనే ఎయిర్‌హోస్టెస్ ప్రాణాలు విడిచింది. అయితే ఆమె భర్త మయాంక్ సింఘ్వీ, అతని కుటుంబ సభ్యులే ఆమెను చంపేసి ఉంటారని అన్నిసా బంధువులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం అనిస్సియాకు మయాంక్‌తో వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా మయాంక్ తప్పతాగి వచ్చి అదనపు కట్నం కోసం ఆమెను హింసిస్తున్నాడు. ఈ వ్యవహారంలో అతని తమ్ముళ్లు కూడా సహకరిస్తున్నారు. దీంతో అనిస్సియా తండ్రి ఆర్ఎస్ బత్రా(రిటైర్డ్ ఆర్మీ అధికారి) కొన్నిరోజుల క్రితం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త, మరదులు కొన్నిరోజులుగా ఆమెను టార్చర్ పెడుతున్నారని, ఆమెకేమైనా అయితే వారిదే బాధ్యత అని బత్రా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుకాగా, పోలీసులు ఆమె అత్తమామల్ని, మరుదులను ప్రశ్నించారు కూడా. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఆమె బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు... చనిపోయేముందు తన సోదరి తనకు ఫోన్ చేసిందని కరన్ బత్రా చెబుతున్నాడు. ‘నాకు ఫోన్ చేసింది. నన్ను గదిలో పెట్టి హింసిస్తున్నారు, పోలీసులకు సమాచారం అందించండని, రక్షించండని ఏడ్చింది. కాసేపటికే బిల్డింగ్ నుంచి దూకేసిందని, ఆస్పత్రిలో చేర్పించామని మయాంక్ ఫోన్ చేశాడు. తీరా ఆస్పత్రికి వెళ్లేసరికి ఆమె శవమై కనిపించింది. ఖచ్ఛితంగా వాళ్లే చంపేసి ఉంటారు’ అని కరణ్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు పోలీసులు సీజ్ చేసిన గదిని స్పేర్ కీ తో మయాంక్ తెరిచి సాక్ష్యాలను తారుమారు చేశాడని కరణ్ తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు. -
ఎయిరిండియాలో కీచకపర్వం
న్యూఢిల్లీ: ఎయిర్ఇండియాలో ఓ ఉన్నతాధికారి గత ఆరేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ ఎయిర్‌హోస్టెస్ ఏకంగా ప్రధాని మోదీకి, విమానయానమంత్రి సురేశ్‌కు ఫిర్యాదుచేశారు. ‘ఎయిర్ఇండియాలో ఉన్న ఆ సీనియర్ అధికారి నన్ను లైంగికంగా లోబర్చుకునేందుకు చాలాసార్లు యత్నించాడు. ఇతర మహిళా సిబ్బంది గురించి నాతో అసభ్యంగా మాట్లాడేవాడు. అతనికి లొంగకపోవడంతో నా ప్రమోషన్లు, ప్రయోజనాలను నిలిపివేసి ఆరేళ్లుగా హింసిస్తున్నాడు’ అని మే 25న రాసిన లేఖలో బాధితురాలు పేర్కొంది. మంత్రి ప్రభును కలుసుకునే అవకాశం ఇస్తే సదరు అధికారి పేరును వెల్లడిస్తానని తెలిపింది. గతేడాది ఆగస్టులో ఆ మానవమృగంపై ఎయిరిండియా సీఎండీకి ఫిర్యాదుచేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ప్రభు ఎయిరిండియా సీఎండీని ఆదేశించారు. విచారణ కమిటీకి ఆదేశించారు. -
ఎమ్మెల్సీ కుమారులపై రేప్ కేసు
పట్నా: బిహార్ శాసనమండలి మాజీ చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్ కుమారులు శుశాంత్ రాజన్, ప్రశాంత్ రాజన్‌లపై పట్నా మహిళా పోలీస్ స్టేషన్లో వేధింపులు, అత్యాచార యత్నం కింద కేసు నమోదైంది. ఎఫ్ఐర్లో నమోదు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ఓ యువతి ఓ విమాన సర్వీసులో ఎయిర్హోస్ట్గా పనిచేస్తోంది. నెల కిందట పట్నాలో నివాసం ఉంటున్న తన తల్లిని చూడటానికి వచ్చిన యువతితో శుశాంత్‌కు పరిచయం ఏర్పడింది. మే16న యువతిని తన నివాసానికి డిన్నర్‌కి రావాల్సిందిగా శుశాంత్ రాజన్ ఆహ్వానించాడు. శుశాంత్ నివాసానికి యువతి చేరిన కొద్ది సేపటికి తన సోదరుడు ప్రశాంత్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు అక్కడికి చేరుకున్న తరువాత వారిద్దరి మధ్య స్పల్ప ఘర్షణ చోటుచేసుకుందని యువతి ఫిర్యాదులో తెలిపింది. ఆ తరువాత ఇద్దరు సోదరులు కలిసి తనను ఒక గదిలో బంధించి అత్యాచార యత్నానికి ప్రయత్నించారని బాధితురాలి ఫిర్యాదు చేసింది. తనను రక్షించాలంటూ గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న సిబ్బంది గది తలుపులు తెరిచారిని ఆమె తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిపారు. -
ఎయిర్‌హోస్టెస్ కోసం హైజాక్ ప్లాన్
అహ్మదాబాద్: జెట్ ఎయిర్వేస్ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఓ ఎయిర్‌హోస్టెస్‌కు దగ్గరయ్యేందుకు ఏకంగా హైజాక్ కుట్రపన్నాడో ప్రబుద్ధుడు. జెట్ ఎయిర్వేస్ ప్రతిష్టను దెబ్బతీసి ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం పోగొడితే ఆమె కొలువు కోసం తన వద్దకు వస్తుందని వింత వ్యూహం పన్నాడు. అందుకోసం విమానంలో బాంబులు, హైజాకర్లు ఉన్నారంటూ వాష్‌రూమ్‌లో ఓ కాగితం ముక్క ఉంచి అందరినీ హడలెత్తించాడు. గుజరాతీ సంపన్న కుటుంబానికి చెందిన బిర్జూ కిశోర్ సల్లా ముంబైలో నివసిస్తూ వజ్రాభరణాల వ్యాపారం చేస్తుంటాడు. జెట్ ఎయిర్వేస్ విమానాల్లో తరచుగా ప్రయాణించే అతను ఓ ఎయిర్‌హోస్టెస్‌ను చూసి ఇష్టపడ్డాడు. ఆమెను ఎలాగైనా తన వద్దకు రప్పించుకోవాలనీ, అందుకోసం ఆమె ఉద్యోగం పోగొట్టాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం గతంలో విమానంలోకి బొద్దింకను తీసుకొచ్చి, తనకు వడ్డించిన భోజనంలో అతనే బొద్దింకను వేసుకుని జెట్ ఎయిర్వేస్ సిబ్బందితో తీవ్రంగా గొడవపడ్డాడు. తాజాగా సోమవారం ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న 9డబ్ల్యూ 339 నంబరుగల విమానమెక్కాడు. విమానం 115 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో తెల్లవారుజామున 2.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అనంతరం వాష్‌రూమ్‌కు వెళ్లిన సల్లా ‘ప్లేన్‌లో 12 మంది హైజాకర్లు, బాంబులు ఉన్నాయి. ఢిల్లీకి కాకుండా నేరుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు విమానాన్ని తీసుకెళ్లాలి. ఇంకెక్కడైనా ల్యాండింగ్‌కు యత్నిస్తే విమానం పేలిపోతుంది’ అని ఉర్దూలో, ఇంగ్లిష్‌లో రాసిన ఓ బెదిరింపు కాగితం ముక్కను అక్కడ ఉంచాడు. దానిని చూసిన సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం అందించడంతో హైజాక్ అలర్ట్ బటన్ నొక్కి అత్యవసరంగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో 3.45 గంటలకు దించివేశారు. అనంతరం పోలీసులు ప్రయాణికులను కిందకు దింపి, విమానం మొత్తాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసి ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు విమానం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. కిశోర్ సల్లాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతను ఇకపై విమానాల్లో ఎక్కేందుకు అనుమతించకుండా నిషేధం విధించాలని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఆదేశించారు. ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గుజరాత్ పోలీసులు హైజాక్ వ్యతిరేక చట్టం కింద కేసును నమోదు చేస్తే తాము విచారణ చేపడతామని ఎన్ఐఏ చీఫ్ వైసీ మోదీ చెప్పారు. -
ఎయిర్ హోస్టెస్‌కు వేధింపులు
ఢిల్లీ: విమానంలో ప్రయాణిస్తున్నవారు ఎయిర్‌హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. విమానం సిడ్నీ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో ఐదుగురు విదేశీయులు ఎయిర్ హోస్టెస్‌ను వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు మేరకు వేధింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదైంది. విమానయాన చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం ఐదుగురు నిందితులపై చర్యలుంటాయని అధికారులు వెల్లడించారు.