ఆమె ఆత్మహత్యకు అసలు కారణం ఇదే | Delhi Air Hostess Suicide Husband 1st Marriage | Sakshi
Sakshi News home page

ఆమె ఆత్మహత్యకు అసలు కారణం ఇదే

Published Wed, Jul 18 2018 10:58 AM | Last Updated on Wed, Jul 18 2018 11:01 AM

Delhi Air Hostess Suicide Husband 1st Marriage - Sakshi

భర్త మయాంక్‌తో అనిస్సియా బత్రా(ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : భర్త పెడుతున్న చిత్రహింసలకు తాళలేక బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఎయిర్‌హోస్టెస్‌ అనిస్సియా బత్రా(32) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలు అనిస్సియా బత్రా భర్త మయాంక్‌కు గతంలోనే వివాహం అయినట్లు విచారణలో తెలిసింది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వివాదాలు ముదిరి చివరకు అనిస్సియా ఆత్మహత్యకు దారి తీశాయంటున్నారు పోలీసులు.

ఈ విషయం గురించి ఢిల్లీ పోలీసాధికారి ఒకరు ‘విచారణలో భాగంగా మయాంక్‌కు అనిస్సియా కంటే ముందే మరో మహిళతో వివాహం జరిగినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని మయాంక్‌ అనిస్సియాకు చెప్పకుండా రెండేళ్ల క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు. అనిస్సియా ఆత్మహత్య చేసుకోవడానికి ఒక నెల రోజుల ముందు మయాంక్‌ మొదటి వివాహం గురించి ఆమెకు తెలిసింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సున్నిత మనస్కురాలైన అనిస్సియా ఈ విషయాన్ని తట్టుకోలేక పోయింది. ఈ కారణం వల్లే ఆమె బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది’ అని తెలిపారు.

కట్నంగా బీఎమ్‌డబ్య్లూ కార్‌...
వివాహ సందర్భంగా అనిస్సియా తల్లిదండ్రులు దంపతులకు బీఎమ్‌డబ్య్లూ కార్‌ బహుకరించారు. అడిగినంతా కట్నం కూడా ఇచ్చారు. కానీ మయాంక్‌ మాత్రం వివాహం అయిన రెండో రోజు నుంచే తమ కూమార్తేను వేధించడం ప్రారంభించాడని అనిస్సియా తల్లిదండ్రులు వాపోయారు. హనీమూన్‌కు వెళ్లిన రెండో రోజునుంచే తమ కుమార్తేను కొట్టడం ప్రారంభించాడని, అదనపు కట్నం కోసం వేధించాడని పోలీసులకు తెలిపారు. మయాంక్‌తో పాటు అతని తల్లిదండ్రులను కూడా అరెస్ట్‌ చేయాలని అనిస్సియా తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement