
న్యూఢిల్లీ: ఎయిర్‌ఇండియాలో ఓ ఉన్నతాధికారి గత ఆరేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ ఎయిర్‌హోస్టెస్ ఏకంగా ప్రధాని మోదీకి, విమానయానమంత్రి సురేశ్‌కు ఫిర్యాదుచేశారు. ‘ఎయిర్‌ఇండియాలో ఉన్న ఆ సీనియర్ అధికారి నన్ను లైంగికంగా లోబర్చుకునేందుకు చాలాసార్లు యత్నించాడు. ఇతర మహిళా సిబ్బంది గురించి నాతో అసభ్యంగా మాట్లాడేవాడు. అతనికి లొంగకపోవడంతో నా ప్రమోషన్లు, ప్రయోజనాలను నిలిపివేసి ఆరేళ్లుగా హింసిస్తున్నాడు’ అని మే 25న రాసిన లేఖలో బాధితురాలు పేర్కొంది. మంత్రి ప్రభును కలుసుకునే అవకాశం ఇస్తే సదరు అధికారి పేరును వెల్లడిస్తానని తెలిపింది. గతేడాది ఆగస్టులో ఆ మానవమృగంపై ఎయిరిండియా సీఎండీకి ఫిర్యాదుచేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ప్రభు ఎయిరిండియా సీఎండీని ఆదేశించారు. విచారణ కమిటీకి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment