Gender Issues
-
International women's day 2025: 115 ఏళ్లు గడిచాయి? ఎక్కడుందీ సమానత్వం?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించి 115 సంవత్సరాలైంది. అమానవీయమైన అణచివేతను, వివక్షను ఎదుర్కొన్న మహిళా కార్మికులు నెత్తురు ధారబోసి హక్కులకోసం తెగించి పోరాడారు. ఫలితంగా 8 గంటల పని దినాన్ని, వేతన పెంపుదలను, మరికొన్ని హక్కులను సాధించుకున్నారు. అయినప్పటికీ మహిళలు నేటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కనిపిస్తున్నారు. మన సమాజంలో, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో మహిళా లోకం పురుషుల కంటే తక్కువగానే ఉంటూ వస్తోంది. ఇంట్లోనూ, బయట ఉద్యోగాల్లోనూ – మహిళలు పూర్తి బాధ్యతను మోస్తున్నప్పటికీ – ఈ అసమానత కొనసాగుతుంది. మహిళలు బలమైన పోరాటాలు చేస్తున్నప్పటికీ, వారి మీద లైంగిక హింస పెరుగుతూనే వుంది. దళిత, మైనారిటీ మహిళలు ఎక్కువగా దాడులకు గురి అవుతున్నారు. ప్రొఫెసర్లు, సైంటిస్టులు, డాక్టర్ల దగ్గర నుండి పారిశుధ్య కార్మికుల వరకు – అందరికీ కాంట్రాక్టు, తాత్కాలిక పనులే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఈ పనుల్లో కూడా మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు రావడం లేదు. ఉద్యోగ బీమా పథకాన్ని కోల్పోవడం అంటే మహిళలను ప్రసూతి ప్రయోజనాలకుదూరంగా పెట్టినట్లే. చదవండి! International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!1970లో పురుడు పోసుకున్న ‘ప్రగతిశీల మహిళా సంఘం’ ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించింది. నిర్బంధానికి అణచివేతకు గురయ్యింది. అనేక మంది వీరవనితలు అమరులయ్యారు. 12 రాష్ట్రాల్లో గుర్తింపు కలిగిన మహిళా పోరాటాలు నిర్వహించింది. భూమికోసం, ఇళ్ళస్థలాలకోసం, స్త్రీ పురుష సమానత్వంకోసం లైంగిక హింసకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నిర్మించాం. ఈ క్రమంలో 2013లో సంస్థ చీలికకు గురయ్యింది. ఫలితంగా మహిళా ఉద్యమాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూసాయి. వీటిని సమీక్షించుకొన్న తర్వాతరెండు సంస్థలు కలిసి భవిష్యత్‌లో ఒకే సంస్థగా పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. మార్చి 8వ తేదిన అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా విలీనం కావాలని రెండు సంస్థలు భావించాయి. ఈ విలీనానికి ఒంగోలు వేదిక కాబోతుంది. – బి.పద్మ, ప్రధాన కార్యదర్శి,ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ), ఏపీ -
International Women's Day 2025: మహిళా విముక్తిలో ఓ అంకం
‘కన్యాశుల్కం’ నాటకం గుర జాడను అత్యుత్తమ నాటక రచ యి తగా తెలుగు సాహిత్యంలో నిలిపింది. ఈ నాటకాన్ని ‘జగన్నాథ విలాసినీ సభ’ 1892 ఆగస్టులో మొదట ప్రదర్శించింది. కన్యాశు ల్కంలో ప్రధానమైన సమస్య సుబ్బి పెళ్లి తప్పించటం! ఆడవాళ్లకి ఏ ఆలోచనాశక్తి లేదని, చులకనగా వారిని చూసే నాటి సమాజంలో మహిళలను ధైర్యవంతులుగా చిత్రించి మహిళల చరిత్రను పునర్లిఖించారు గురజాడ. సుబ్బమ్మ లేక సుబ్బి ఈ కథకి మూలం. నాటకంలో ఎక్కడా కనిపించదు. వెంకమ్మ – కృష్ణరాయపురం అగ్రహారీ కుడు అగ్నిహోత్రావధాన్ల భార్య. బుచ్చమ్మ-అగ్ని హోత్రావ ధాన్ల పెద్ద కూతురు, వితంతువు. మీనాక్షి - రామచంద్రా పురం అగ్రహారీకుడు లుబ్ధావధాన్ల కుమార్తె, వితంతువు. మధురవాణి–విజయనగరానికి చెందిన వేశ్య. పూట కూళ్ళమ్మ విజయనగరంలో పూట కూళ్ళిల్లు నడిపే వితంతువు. వెంకమ్మ అన్నగారు కరటక శాస్త్రి. ఇతడు కృష్ణరాయ పురం అగ్రహారంలో ఉన్న చెల్లెలి ఇంటికి వచ్చినపుడు సుబ్బి పెళ్ళి విషయం తెలుస్తుంది. ఈ సంబంధం ఇష్టంలేనివెంకమ్మ అన్న కరటకశాస్త్రిని ఈ సంబంధం తప్పించమని వేడుకుంటుంది. ఎలాగైనా మేనకోడలు పెళ్లి తప్పించాలని పథకాన్ని రూపొందిస్తాడు అతడు.మధురవాణిది నాటకంలో కీలకమైన పాత్ర. ఆమె వేశ్య. విజయనగరంలో ఉండే మధురవాణి కారణాంతరాల చేత రామచంద్రపురం అగ్రహార నివాసి, ఊరి కరణం రామప్ప పంతులి ఇంటికి చేరుతుంది. సుబ్బితో పెళ్లి ఖాయం చేసు కున్న లుబ్ధావధాన్లు రామచంద్రపుర వాసి. రామప్పపంతులు నయవంచకుడని ఆమె తొంద ర్లోనే కనిపెట్టేసింది. స్వతహాగా ఎదుటివారికి సాయం చెయ్యాలనే సద్బుద్ధి కలి గిన మధురవాణి... లుబ్ధావధాన్ల పెళ్లి రామప్ప పంతులు కుదిర్చాడని తెలిసిన వెంటనే ‘ఈ పెళ్లి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను’ అంటుంది. ఆ తరువాత అసలు కథ మొదలైంది.కరటకశాస్త్రి తన ప్రణాళిక అమలు చెయ్యటానికి రామప్ప పంతులు ఇంటికి వస్తాడు. అక్కడ మధుర వాణిని చూసి తన మేనకోడలి పెళ్లి తప్పించమని కోరతాడు. ఆమె అంగీకరించి కొన్ని సలహాలు ఇస్తుంది. తన ‘కంటె’ని పెళ్లిలో పెళ్లికూతురికి పెట్టటానికి కూడా ఒప్పుకుంటుంది. ఆడవేషంలో ఉన్న కరటకశాస్త్రుల శిష్యుడు మహేష్‌ని ఇచ్చి పెళ్ళి జరిపించి, తద్వారా సుబ్బి పెళ్లి ఆపటంలో మధురవాణి చాకచక్యాన్ని ప్రదర్శించింది. తర్వాత లుబ్ధావధా న్లను పెళ్లి చేసుకున్న మహేష్...మధురవాణి దగ్గరకు వచ్చి ఆమె ‘కంటె’ ఆమెకి ఇచ్చేస్తాడు. మధురవాణి ఆడపిల్ల వేషంలో ఉన్న మహేష్‌కు దాసరి వేషం వేసి ఊరు దాటిస్తుంది.‘కంటె’ కోసం రామప్ప పంతుల్ని ఇబ్బంది పెట్టడంతో అతడే హెడ్ కానిస్టేబుల్‌తో లుబ్ధావధాన్ల మీద ఖూనీ కేసు పెట్టిస్తాడు. ఈ వ్యవహారంలో లుబ్ధావధాన్లను కేసునుంచి బయట పడెయ్యడానికి మధురవాణి, సౌజన్యా రావు పంతులు ఇంటికి వెళుతుంది. అదే సమయంలో గిరీశం కూడా ఆ ఇంటికి వస్తాడు. బుచ్చమ్మని లేవదీసుకు పోయిన గిరీశం అంతటితో తృప్తిపడక లుబ్ధావధాన్ల ఆస్తి చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ అక్కడికి వచ్చాడు. గిరీశం నిజస్వరూపం తెలుసుకున్న సౌజన్యా రావు పంతులు బుచ్చమ్మను పూనాలో విడోస్ హోవ్ుకు పంపే ఏర్పాట్లు చేస్తాడు. నాటకంలో మీనాక్షి పాత్ర కూడా ముఖ్యమైనదే. ముసలి తండ్రి పెళ్లి కరటకశాస్త్రి శిష్యుడు మహేశంతో జరి పించటంలో సిద్ధాంతికి సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఒక రాత్రివేళ రామప్ప పంతులితో తమ ఇంట్లో తండ్రికి దొరికిపోతుంది. తండ్రి బయటికి గెంటేస్తాడు. ఈ చర్యకి మీనాక్షి ఏమీ జంకకుండా ‘‘... ఈ జన్మలో ఈ ఇంట్లో అడు గుపెట్టను’’ అంటూ రామప్ప పంతు లుతో వెళ్లిపోతుంది.ఇక గంపెడు చాకిరీ చేస్తూ నెత్తిన ముసుగేసుకుని జీవి తాన్ని గడుపుతున్న బుచ్చమ్మ ఆలోచనాశక్తి, తెంపరితనం ఉన్న మహిళ. బుచ్చమ్మకి గిరీశం తన కళ్లముందు నిలిపిన రంగుల లోకం... అందరి ముత్తయిదువలలాగ జీవించాలనే ఆశని కల్గించింది. ఇంకో పక్క గిరీశం తన ఈ నిర్ణయం వల్ల ముసలాడితో చెల్లెలి పెళ్లి ఆగిపోతుందని నచ్చ చెప్పాడు. ధైర్యంగా ఆమె గిరీశంతో అగ్ని హోత్రావధాన్ల కళ్లుగప్పి వెళ్లి పోయింది. విజయనగరంలో పూటకూళ్ల ఇల్లు నడుపుకునే పూటకూళ్లమ్మ ఇంట్లో పనీపాటూ చేసు కుంటూ, ఆకతాయిగా తిరిగే మాయలాడు గిరీశం... ఆమెని మోసగించినందుకు అతడిని చీపురు తీసుకుని వెంటబడు తుంది. దానితో కృష్ణరాయ పురం అగ్రహారం వెంకటేశంతో చేరతాడు గిరీశం. లుబ్ధా వధాన్లకి వరసకి తమ్ముడైన గిరీశం: సుబ్బిని పెళ్లి చేసు కోవద్దంటూ లుబ్ధావధాన్లకి అర్థం అయ్యేటట్లు, భయ పెడుతూ ఉత్తరం రాస్తాడు. కాబట్టి సుబ్బి పెళ్లి ఆపటంలో పూటకూళ్లమ్మ కూడా తెలీకుండానే పెద్దసాయం చేసింది. గిరీశం కృష్ణరాయపురం చేరేటట్టు చేసింది.కన్యాశుల్కం నాటకం సుబ్బి కొరకే, సుబ్బికోసమే నడి చింది. చెప్పాలంటే అదృశ్యంగా కథ నడిపింది సుబ్బే. తలా ఒక చెయ్యివేసి దుర్మార్గాన్ని అడ్డుకున్నది మహిళా శక్తి! అదే గురజాడ మహిళలకు చూపిన వెలుగుదారి. డా. తుర్లపాటి రాజేశ్వరి వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార విజేత -
నా దారి రహదారి
అవని నుంచి అంతరిక్షం వరకు మహిళలు అసాధారణ విజయాలు సాధించి తమ సత్తా చాటుతున్నా.... ఇంకా లింగవివక్షతతో కూడిన బోలెడు ఆశ్చర్యాలు మిగిలే ఉన్నాయి. ఫిలింనగర్ బస్తీలో మక్కల మాధవి బస్ డ్రైవర్‌గా స్టీరింగ్ పట్టినప్పుడు... ‘ఇదేందీ!’ అని ఆశ్చర్యపోయిన వాళ్లే ఎక్కువ. ‘పెద్ద బస్పు నడపడం నీ వల్ల ఏమవుతుందమ్మా!’ అని నిరాశ పరిచిన వారే ఎక్కువ. అయినా సరే...‘నా దారి రహదారి’ అంటూ మాధవి దూసుకువెళుతూ తన డ్రైవింగ్ స్కిల్స్‌తో శభాష్ అనిపించుకుంటోంది...హైదరాబాద్ ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్ బస్తీలో నివసించే మక్కల మాధవి భర్త రాజేష్ ‘జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్’ బస్సు డ్రైవర్‌గా గత పది సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఇదే బస్సులో మాధవి అటెండర్‌గా పని చేసేది. భర్త బస్సు నడుపుతున్న తీరు చూసి డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. స్కూల్ మైదానంలో భర్త ద్వారా డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకొని ఏడాది క్రితం నుంచే బస్సు నడపడం మొదలుపెట్టింది. స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్‌తోపాటు టీచర్లు కూడా ఆమె పట్టుదలకు ఫిదా అయ్యారు. ప్రోత్సహించారు. పూర్తి అనుభవం వచ్చాకే స్కూల్ బస్సు నడుపుతానని జేహెచ్‌పీఎస్ యాజమాన్యానికి తెలియజేసింది.డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన మాధవిని చూసి ‘బక్కపల్చగా ఉన్న ఈమె బస్సు ఏం నడుపుతుంది!’ అని అధికారులు వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా బస్సు నడపడానికి తిరస్కరించారు. అయితే మాధవి ఏమాత్రం నిరాశ పడలేదు. మూడోసారి వెళ్ళి ఒకసారి తాను బస్సు నడపడం చూడాలని, నచ్చకపోతే లైసెన్స్ ఇవ్వొద్దని వేడుకుంది. ఎత్తు, ఒంపుల్లో బస్సును నడిపించి ఎలాగైనా అనర్హురాలిగా చేసి పంపాలనుకున్న అధికారులు మాధవి బస్సు నడిపించే తీరు చూసి ఆశ్చర్యపోయారు. అభినందించారు. పరీక్షలో పాస్ కావడంతో మాధవికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేశారు. స్కూల్ యాజమాన్యం కూడా ఆమెను మరింత ప్రోత్సహిస్తూ పిల్లలను తీసుకురావడం, ఇంటి దగ్గర దింపేందుకు బస్సు నడిపే బాధ్యతను అప్పగించింది. గో ఎ హెడ్డ్రైవింగ్ చేస్తానని చెప్పినప్పుడు నా భర్త కాస్త భయపడ్డాడు. అయితే నాకు నేర్పించే క్రమంలో గ్రౌండ్లో నా డ్రైవింగ్ చూసి ఆయనకు భయం పోయింది. దీంతో మెల్లమెల్లగా ప్రతిరోజూ అదే గ్రౌండ్లో రెండు గంటలపాటు డ్రైవింగ్ప్రాక్టిస్ చేసేదాన్ని. బస్సు డ్రైవింగ్ పూర్తిగా వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్కూల్ యాజమాన్యం, టీచర్లు వెన్ను తట్టి ప్రోత్సహించడం, బస్సు నడుపుతున్నప్పుడు గో ఏ హెడ్ అని పిల్లలు అరవడం నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది.– మక్కల మాధవి – పురుమాండ్ల నరసింహారెడ్డి,సాక్షి, హైదరాబాద్ -
జమ... ఖర్చుల్లో... ఆమె ఎక్కడ?
ఎక్కడైనా జమ, ఖర్చులదే లెక్క! దాన్ని బట్టే ఇంటికైనా.. దేశానికైనా జరుగుబాటు!అప్పు, ఆదా సమంగానే పంచినా బలహీనుల పట్ల ఆపేక్ష సహజం!అయితే ఆ బలహీనత అర్థమే మారిపోతోంది ఇంటి బడ్జెట్లో అయినా.. దేశ బడ్జెట్లో అయినా!చిత్రంగా ఆ వర్గంలో ఎక్కడా స్త్రీ కనిపించదు! అమ్మాయి నుంచి ఆంట్రప్రెన్యూర్ వరకు ఎవరికీ కేటాయింపులు ఉండవు! ఇల్లాలి సేవలకైతే గుర్తింపే కరవు!మహిళలకు బడ్జెట్లో స్థానం కల్పించాలని ‘జెండర్ బడ్జెటింగ్’ పేరుతో ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ప్రపంచానికి వినిపించేలా గళమెత్తింది. ఆప్రాధాన్యాన్ని గ్రహించిన దేశాలు భారత్ సహా జెండర్ బడ్జెట్ మీద దృష్టిపెట్టాయి!కానీ కొన్నేళ్లుగా మన దగ్గర ఆ పదం వినిపించకుండా పోవడమే కాదు... బడ్జెట్లో మహిళలు కనిపించడమూ తగ్గుతోంది. ఫిబ్రవరి 1న కేంద్రబడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ‘జెండర్ బడ్జెటింగ్’ మీద పలు రంగాల్లోని మహిళా నిపుణుల అభిప్రాయాలు ...సంక్షేమపథకాలు జెండర్ బడ్జెట్ కిందికి రావుపదిహేనేళ్లుగా జెండర్ బడ్జెటింగ్‌ను మరచిపోయారు. మహిళలకు ఇస్తున్న పెన్షన్లు, గృహలక్ష్మి, ఉచిత రవాణా సౌకర్యాలు వంటివన్నిటినీ విమెన్ బడ్జెట్ కింద చూపిస్తున్నారు. అధికార పార్టీల సంక్షేమపథకాలు జెండర్ బడ్జెట్ కిందికెలా వస్తాయి? మహిళలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, శాఖలన్నిటి కేటాయింపుల్లో మహిళలకుఇస్తున్న వాటా, స్త్రీ చదువు, జీవనోపాధి, ఆంట్రప్రెన్యూర్షిప్ గురించి, మొత్తం స్ట్రక్చర్‌ను విమెన్ ఫ్రెండ్లీ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు, స్త్రీ, పురుష అసమానతలను రూపుమాపడానికి తీసుకుంటున్న చర్యలు విమెన్ బడ్జెట్ కిందికి వస్తాయి. కేరళలో గ్రామ పంచాయతీ బడ్జెట్లో కూడా 30 శాతం మహిళలకు కేటాయిస్తారు. సాధారణ బడ్జెట్లోనూప్రాధాన్యం ఇస్తారు. దాన్ని కేంద్రప్రభుత్వమూ అనుసరించాలి. కిందటేడు కేంద్ర బడ్జెట్లో నరేగా(మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎం΄్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్)కు రూ.35 వేల కోట్లు తగ్గించారు. సవరించిన బడ్జెట్లో 120కోట్లకు గాను 95వేల కోట్లను కేటాయించి, కేవలం రూ. 60 వేల కోట్లతో సరిపెట్టారు. ఈ కోతలు గ్రామీణ ఉపాధిరంగంలోని స్త్రీల మీద తీవ్రప్రభావం చూపిస్తున్నాయి. వ్యవసాయరంగంలో 58 శాతం మహిళలున్నారు. వాళ్లు ఎక్కువగా కౌలు చేస్తారు. వాళ్ల పేరుమీద పొలాలుండవు. భర్త పేరుమీదో.. ఉమ్మడి కుటుంబ ఆస్తిగానో ఉంటాయి. లేదంటే పిల్లల పేరుమీద ఉంటాయి. ఈ లెక్కన వాళ్లకు ఆర్థిక భద్రత ఏది? పట్టణ ఉపాధి రంగంలో 23 శాతమున్న మహిళల పరిస్థితీ అంతే! నరేగా లాంటివి అక్కడ అప్లయ్ చేయరు. ఇక భద్రత, రక్షణ విషయాలకు వస్తే.. నిర్భయ ఫండ్‌కి గత మూడేళ్లుగా కేటాయింపుల్లేవు. మొదట్లో వెయ్యి కోట్లేమో కేటాయించారు. తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు. ఎవరూ దరఖాస్తు చేసుకోవట్లేదని ఇప్పుడు దానికి బడ్జెట్టే లేకుండా చేశారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో అప్లయ్ చేసుకోవచ్చో రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతనివ్వలేదు. స్త్రీ విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత రంగాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు బడ్జెట్లో కేటాయింపులు ఉంటేనే అది జెండర్ బడ్జెట్. అది అత్యంత అవసరం! – దేవి, యాక్టివిస్ట్‘అవగాహన’కు ఖర్చు చేయాలి ఎమ్మెస్సెమ్మీలో 20 వేల కోట్ల రూపాయల మిగులు నిధులున్నట్లుగా డేటా చూపిస్తోంది. దాని అర్థం ఆ స్కీమ్స్ ప్రజలకు చేరట్లేదని! ఆ మిగులును చూసి కేటాయింపులు తగ్గిస్తారు లేదంటే రివర్స్ చేస్తారు తప్ప.. దాన్ని మహిళా సాధికారత మీద అవగాహన కలిగించే కార్యక్రమాలకో, ఆడపిల్లల చదువుకో మళ్లించరు! ఎమ్మెస్సెమ్మీ స్కీమ్స్ గురించి కాలేజీల్లో అవేర్నెస్ క్యాంప్‌లు పెట్టండని ప్రభుత్వాన్ని పోరుతున్నాం. కాలేజీస్థాయిలోనే అవగాహన వస్తే చదువైపోయాక ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా తక్కువ పెట్టుబడితోనే ఏదో ఒక వ్యాపారం మొదలుపెట్టుకుంటారు. దీనివల్ల ప్రభుత్వాల మీదా ఒత్తిడి తగ్గుతుంది. యువతలో ఆంట్రప్రెన్యూర్షిప్ పెరుగుతుంది. ఓరియంటల్ మహిళా వికాసం, ముద్ర లోన్స్, స్త్రీ శక్తి యోజన.. సిం«ద్ మహిళాశక్తి యోజనలాంటి వాటితో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎమ్‌బీ) లాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. బీఎమ్బీలో రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్స్ «తీసుకోవచ్చు. ధరావత్తు అవసరం లేదు. అయితే వీటి గురించి ఎవరికీ అంతగా తెలీదు. ఈ కోవలోనిదే స్టార్టప్ ఇండియా స్కీమ్. దీన్ని ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం డిజైన్ చేశారు. ఇంకా గ్రూప్ లోన్స్ ఉన్నాయి. అయిదుగురు మహిళలు కలిసి ఓ సంస్థను పెట్టుకోవచ్చు. ఈరోజున ఒక ఆంట్రప్రెన్యూర్ మహిళ నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తోంది. గ్రామీణ, పట్టణ, దళిత మహిళలందరినీ ఆంట్రప్రెన్యూర్షిప్ వైపు నడిపించాలంటే.. వారికోసం ప్రభుత్వాలు కల్పిస్తున్న పథకాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలకు బడ్జెట్లో కేటాయింపులు సమృద్ధిగా ఉండాలి. ఆ కార్యక్రమాలతో ఇల్లిల్లూ తిరిగి చైతన్యం కలిగించాలి. కేక్ తయారీ నుంచి చేపల పెంపకం దాకా అన్నిటికీ ఎమ్మెస్సెమ్మీలో శిక్షణ ఉంది. అవగాహన కల్పించాలంతే! – బి.ఎన్. రత్న, ప్రెసిడెంట్, దలీప్ (దళిత్ ఆదివాసీ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్)ప్రత్యేక కేటాయింపులు కావాలిఆంట్రప్రెన్యూర్షిప్ స్కిల్స్‌ని డెవలప్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌కి సరిపోయేంత బడ్జెట్ ఉండట్లేదు. దానికోసం ప్రత్యేక కేటాయింపులు కావాలి. పెట్టుబడి కోసం కూడా మహిళల దగ్గర డబ్బు ఉండదు. అందుకే పది, పదిహేను శాతం సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ కూడా ఉంటే బాగుంటుంది. – అరుణ దాసరి, ప్రెసిడెంట్ డిక్కీ, తెలంగాణవాళ్లూ జాతీయోత్పత్తిలో భాగస్వాములే!వ్యవసాయం లాంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు క్షేత్రస్థాయిలో ఈ రోజుకీ ఎలాంటి వసతులు లేవు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్, బేబీ కేర్ సెంటర్స్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడినప్పుడల్లా అది మహిళల మీద అదనపు భారాన్నే మోపుతోంది. వీరి ఈ శ్రమను ఇంటిపనిగానే చూస్తున్నారు తప్ప ఉత్పత్తిలో భాగంగా చూడట్లేదు. ఎలాంటి కూలీ చెల్లించట్లేదు. మహిళా రైతుల ఆత్మహత్యలను లెక్కలోకి తీసుకోవట్లేదు. వాళ్లను అసలు రైతులుగానే గుర్తించట్లేదు. ఒంటరి మహిళలకు అందాల్సిన పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియా విషయంలోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. నిర్వాసిత ప్రాజెక్ట్ నిర్మాణాల వల్ల) మహిళలైతే అనేకరకాల అభద్రతలకు లోనవుతున్నారు. వీళ్లంతా జాతీయోత్పత్తిలో భాగస్వాములే! వీళ్లందరి అభివృద్ధి, భద్రత, రక్షణలకు బడ్జెట్లో స్థానం ఉంటోందా? నిజాయితీగా సమీక్షించుకోవాలి. నిష్పక్షపాతంగా ఒప్పుకోవాలి. అప్పుడే బడ్జెట్లో స్త్రీకి సముచితస్థానం లభిస్తుంది. – పద్మ వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్కేర్ ఎకానమీకీ స్థానం ఉండాలిస్త్రీ, పురుష ఆర్థిక సమానత్వ సాధనలో జెండర్ బడ్జెటింగ్ అనేది కీలకం. ఆర్థిక వనరులను నేరుగా ప్రభావితం చేసే రంగాల్లో స్త్రీలకు ఎంతమేర కేటాయింపులుంటున్నాయి, వాటినెలా ఉపయోగిస్తున్నారు, మహిళల భద్రత కోసం ఎంత కేటాయిస్తున్నారు లాంటివన్నీ పరిగణనలోకి వస్తాయి. కేర్ ఎకానమీ అంటే ఇంట్లో స్త్రీల సేవలు.. ఇంటి పని, వంటపని దగ్గర్నుంచి భర్తకు ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్, పిల్లలు.. పెద్దవాళ్ల బాగోగుల దాకా మహిళలు చేసేదంతా జీతం లేని శ్రమ. మరుగునపడిన వీరి సేవలను, శ్రమను ఆదాయ పట్టీలోకి చేర్చాలి. భార్య అన్నిరకాలుగా సహకరిస్తేనే భర్త బయటకు వెళ్లి పనిచేయగలుగుతున్నాడు. అలా ఆమె కూడా ఉత్పత్తిలో భాగమవుతూ, జాతీయ ఆదాయానికి ఊతమవుతోందని గ్రహించాలి. ఈ కేర్ ఎకానమీకీ బడ్జెట్లో స్థానం ఉండాలి. స్థూల విధానాలు జెండర్ ఈక్వాలిటీ, సామాజిక న్యాయం, మిలీనియల్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు దగ్గరగా ఉండాలి. మహిళలు, జెండర్ మైనారిటీల చదువు, ఆరోగ్యం, భద్రత, ఉపాధి, జీవన నైపుణ్యాలు పెంపొందించడం వంటివన్నీ బడ్జెట్లో భాగం కావాలి. ఆ కేటాయింపులన్నీ సక్రమంగా ఖర్చవ్వాలి. కానీ అవన్నీ వేరేచోటికి మళ్లుతున్నాయి. జెండర్ ఈక్వాలిటీ మీద ఒకరకమైన ఉపేక్ష కనబడుతోంది. – అపర్ణ తోట, జెండర్ కన్సల్టెంట్ ట్రైనర్, ద పర్పుల్ వరండా– సరస్వతి రమ -
ట్రంప్ దూకుడు.. ఇక స్వేచ్ఛ స్టాచ్యూ అయిపోనుందా..!
అమెరికా అన్నిట్లో ముందుంటుంది! అభివృద్ధికి ప్రామాణికమని చెప్పుకుంటారు! ఏ మార్పైనా అక్కడే మొదలవుతుందని, దాన్ని ఏ దేశమైనా అనుసరించొచ్చనే నమ్మకం ఆ దేశానిది.. ప్రపంచానిది కూడా! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దేశం ప్రపంచానికేమని సెలవిస్తోంది.. కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే? ముఖ్యంగా జెండర్ విషయంలో! సాధారణంగా థర్డ్ జెండర్ హక్కుల విషయంలో అమెరికా ప్రపంచానికి మార్గదర్శిగా ఉంది. భద్రమైన, గౌరవప్రదమైన గమ్యంగా ప్రపంచంలోని ఎందరో ట్రాన్స్‌జెండర్స్‌కి ఆశ్రయం ఇచ్చింది. ఆ స్పృహ మనతో సహా ఎన్నో దేశాలకు స్ఫూర్తినిచ్చింది. వాళ్ల హక్కుల కోసం మన దగ్గరా ఉద్యమాలు సాగాయి. ప్రభుత్వాలు వాళ్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వమైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌గా నియమించింది. ట్రాన్స్‌మన్ ఐఆర్సెస్ ఆఫీసర్ అయ్యాడు. గవర్నమెంట్ డాక్టర్ కొలువొచ్చింది. ఇది కొంత మనం అగ్రరాజ్యం నుంచి నేర్చుకున్నదే! అలాంటిది ఆ దేశాధ్యక్షుడు ఇప్పుడు తాము ‘థర్డ్ జెండర్‌ను గుర్తించం’ అంటూ పాలనా ఉత్తర్వుల మీద సంతకం చేశాడు. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ట్రంప్ చేసిన ముఖ్య సంతకాల్లో అదొకటి. ఇప్పుడిప్పుడే సమాన హక్కుల వైపు అడుగులు వేస్తున్న దేశాలకిది విస్మయమే! ఇప్పటికే మన ఐపీసీలోని 377 సెక్షన్‌కు కొత్త చట్టం బీఎన్నెస్( భారతీయ న్యాయ సంహిత) ప్రత్యామ్నాయం చూపక చాలా ఆందోళనలు తలెత్తాయి. దానికిప్పుడు అమెరికా నిర్ణయాన్ని వత్తాసుగా తీసుకునే ప్రమాదమూ ఉంది. ఈ నేపథ్యం, సందర్భంలో ట్రాన్స్ జెండర్స్, వాళ్ల హక్కుల కార్యకర్తలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం ..స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఎక్కువవుతాయిఅంతకుముందు అమెరికాలో మొదలైన మీ టూ, బ్లాక్ లైవ్స్ మ్యాటర్లాంటి మూవ్మెంట్స్ ప్రభావం మన దగ్గరా (దళిత్ లైవ్స్ మ్యాటర్) ఉండింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ డెసిషన్ వల్ల ఎల్జీబీటీక్యూని వెస్టర్న్ కాన్సెప్ట్ అని అభిప్రాయపడుతున్న వాళ్లంతా ఇక్కడ దాని రిలవెన్స్నే జీరో చేసే చాన్స్ ఉంది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి సంబంధించిన పాలసీలన్నీ కార్పొరేట్ కంపెనీల్లోనే కనిపిస్తాయి. వాళ్లకు ఉద్యోగాలుండేవీ వాటిల్లోనే! ఇవన్నీ చాలావరకు అమెరికా బేస్డ్‌గానే ఉంటాయి. మిగతా ఎక్కడైనా ఎల్జీబీటీక్యూ వాళ్ల ఐడెంటిటీని దాచుకునే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ కోసం ఇండియన్ బిజినెసెస్ కూడా వాళ్ల పాలసీలు కొన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్లే తీసేస్తే వీళ్లూ అనవసరమనుకుంటారు. ఉద్యోగాలుండవు. దానివల్ల వాళ్ల ఏజెన్సీలు కూడా పోతాయి. మళ్లీ మునుపటి స్థితికి వచ్చేస్తారు. స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఎక్కువవుతాయి. మన దగ్గర థర్డ్ జెండర్‌కి సంబంధించిన చట్టాలు కొంచెం భిన్నంగా, బలంగా ఉన్నాయి. వాటిని మార్చక΄ోతే పర్వాలేదు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మారిస్తే మాత్రం ఇబ్బందే! ఇంకో విషయం.. రెండే జెండర్లని గుర్తించడం వల్ల ఆ రోల్స్ కూడా రిజిడైపోయి స్త్రీని ఇంటికే పరిమితం చేసే ప్రమాదం, స్త్రీ మీద హింస మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు.– దీప్తి సిర్లా, జెండర్ యాక్టివిస్ట్హింస పెట్రేగే ప్రమాదంజెండర్ విషయంలో ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల ఎల్జీబీటీక్యూ, లైంగికత విషయంలో సందిగ్ధంలో ఉన్న పిల్లలు హింసకు లోనయ్యే ప్రమాదం ఉంది. పితృస్వామ్య వ్యవస్థ మరింత బలపడి స్త్రీల మీదా హింస పెట్రేగొచ్చు. ఇప్పుడిప్పుడే జెండర్ రైట్స్ మీద అవగాహన, చైతన్యం పెరుగుతున్న క్రమంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలపై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ట్రాన్స్ జెండర్ల జీవితాలకు రిస్క్ నుంచి ఉంది. ట్రంప్ నిర్ణయాన్ని నిలువరించడానికి అమెరికా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. అయితే అదొక్కటే సరి΄ోదు. ట్రంప్ నిర్ణయ పర్యవసానాలను తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీలవాదులందరూ సామాజిక పోరాటంతో మద్దతు తెలపాలి. – రచన ముద్రబోయిన, ట్రాన్స్ రైట్స్, హ్యుమన్ రైట్స్ యాక్టివిస్ట్ఫండ్స్, ఉద్యోగాలు ప్రశ్నార్థకమే!చాలా విషయాల్లో మాదిరి జెండర్ విషయంలోనూ ట్రంప్ ఆ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు. ఎన్నో అమెరికన్ కంపెనీలు మన దగ్గర, ఇతర దేశాల్లో ‘డైవర్సిటీ ఈక్విటీ ఇన్‌క్లుజన్’ కింద ఎల్జీబీటీక్యూ వాళ్లకు ఫండ్స్, ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఈ ΄ాలసీల వల్ల అవి ప్రశ్నార్థకమవచ్చు! అంతేకాదు తమకు భద్రమైన ప్లేస్‌గా భావించి అమెరికా వెళ్లిన ఎల్జీబీటీక్యుల పరిస్థితేంటి? ΄ాస్΄ోర్ట్‌లో కూడా ట్రాన్స్‌జెండర్ అనే పదం వాడకూడదని చె΄్పాడు. ఆ నేపథ్యంలో వేరే దేశాల నుంచి చదువు కోసం, టూరిజం కోసం వెళ్లే ట్రాన్స్జెండర్ల సంగతేంటి? భయాందోళనలను కలిగించే విషయమే! ఇంకా చె΄్పాలంటే హింసను ప్రేరేపించే నిర్ణయమిది!– తాషి చోడుప్, బౌద్ధ సన్యాసిని, క్వీర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ ఫౌండర్, సోషల్ యాక్టివిస్ట్ -
అక్షరాలై వెలిగారు
కాలక్షేప సాహిత్యానికి కాలం చెల్లిన కాలం ఇది. ఈ ఉరుకు పరుగుల కాలంలో పుస్తకం నిలబడాలంటే సత్తా ఉండాలి. సామాజిక అంశాలు ఉండాలి. అలాంటి సత్తా ఉన్న పుస్తకాలతో ఈ సంవత్సరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు మన మహిళా రచయిత్రులు. లింగవివక్ష నుంచి స్త్రీ సాధికారత వరకు... అట్టడుగు శ్రామిక జీవితాలను నుంచి లౌకికవాదం వరకు... ఎన్నో అంశాలపై ప్రామాణికమైన పుస్తకాలు రాశారు...రెజ్లర్ టు రైటర్సాక్షి మాలిక్ (Sakshi Malik) పేరు వినబడగానే ‘స్టార్ రెజ్లర్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. రెజ్లర్ సాక్షి కాస్తా ‘విట్నెస్’తో (Witness) రైటర్‌గా మారింది. సాక్షి మాలిక్‌ది నల్లేరు మీద నడక కాదు. ఘర్షణ లేకుండా ఆమె నడక లేదు. ఆ ఘర్షణలో పితృస్వామ్య వ్యవస్థను సవాలు చేయడం కూడా ఒకటి. పేదరికాన్ని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉన్నతస్థాయికి చేరడానికి తాను పడిన కష్టాలకు జోనాథన్ సెల్వరాజ్‌తో (Jonathan Selvaraj) కలిసి ఈ పుస్తకం ద్వారా అక్షర రూపం ఇచ్చింది సాక్షి మాలిక్. ఆటలో పడి లేవడం సాధారణం. అయితే పడిన ప్రతిసారీ మరింత బలంగా పైకి లేవడం సాక్షి శైలి. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ‘నేను తల్లి అయిన తరువాత భవిష్యత్తులో ఏదో ఒకరోజు గోడకు వేలాడుతున్న ఒలింపిక్ మెడల్‌ను చూస్తూ అది ఏమిటి? అని నా బిడ్డ నన్ను అడగవచ్చు. నేను ఆ మెడల్‌ను బిడ్డ చేతిలో పెట్టి అది ఏమిటో, అది గెలవడానికి ఎంతదూరం ప్రయాణించాల్సి వచ్చిందో వివరంగా చెబుతాను’ అంటుంది సాక్షి మాలిక్.విట్నెస్ – సాక్షి మాలిక్జ్ఞాపకాల జ్ఞాన సముద్రంఇది పుస్తకం అనడం కంటే నాలుగు తరాల జ్ఞాపకాల సంపుటి అనడం సబబుగా ఉంటుంది. ఎంతో పరిశోధిస్తే కాని ఇలాంటి పుస్తకం రాయలేము. పరిశోధనకు తోడు నుస్రత్ ఎఫ్ జాఫ్రీలోని (Nusrat Fatima Jafri) అద్భుత సృజనాత్మకత పుస్తకానికి మంచి పేరు వచ్చేలా చేసింది. తన పూర్వీకుల మతమార్పిడి అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో ఈ పుస్తకంలో వివరిస్తుంది జాఫ్రీ. ‘నా బంధువులు వారి జీవితంలో వివిధ సందర్భాలలో కొత్త మతాలను స్వీకరించాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ కారణాలలో రాజకీయం(Politics) నుంచి సామాజికం వరకు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి మత మార్పిడి ప్రయాణం ప్రత్యేకమైనది’ అంటుంది జాఫ్రీ. అయితే వారి కుటుంబ చరిత్ర అంతా దేశ విస్తృత చరిత్రతో లోతుగా ముడిపడినందు వల్లే పుస్తకం ప్రత్యేకంగా నిలిచింది, వలస పాలన, స్వాతంత్య్రపోరాటం, వలసానంతర రాజకీయాలు... మొదలైనవి ‘దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్’లో కనిపిస్తాయి.దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్: ది స్టోరీ ఆఫ్ ఏ ఫ్యామిలి, క్యాస్ట్, కన్వర్జేషన్స్ అండ్ మోడర్న్ ఇండియా – నుస్రత్ ఎఫ్.జాఫ్రీఇదేం భాష?!న్యూయార్క్‌లోని హంటర్ కాలేజిలో ‘ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్’లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రూపాల్ ఓజా రాసిన పుస్తకం ఎమియోటిక్స్ ఆఫ్ రేప్. బాధితురాలు, సర్వైవర్లాంటి పదాలకు అతీతంగా లైంగిక హింస కేసులకు సంబంధించిన భాషలో మూసధోరణులు, పితృస్వామిక భావజాలాన్ని ఈ పుస్తకంలో విశ్లేషిస్తుంది రూపా ఓజా. ప్రభుత్వ అధికారుల నుంచి గ్రామ వార్డు మెంబర్లు, కుల సంఘాల వరకు అత్యాచార కేసులను లైంగిక విషయాలపై చర్చించే వేదికలుగా ఎలా చూస్తారో ఈ పుస్తకంలో వివరిస్తుంది రుపాల్ ఓజా.ఎమియోటిక్స్ ఆఫ్ రేప్: సెక్సువల్ సబ్జెక్టివిటీ అండ్ వయొలేషన్ ఇన్ రూరల్ ఇండియా– రూపాల్ ఓజాఉద్యమమే జీవితమై..ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అరుణ దిల్లీ సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీకి సెక్రటరీగా ఉన్నతోద్యోగాలు చేసినా ‘ఉద్యమ నాయకురాలు’గానే ఆమె సుపరిచితురాలు. సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్ (బేర్‌ఫుట్ కాలేజీ)తో మొదలైన ఆమె ప్రయాణం ఎంతోదూరం వెళ్లింది. ఎన్నో మలుపులు తిరిగింది. తన ఉద్యమజీవితాన్ని, ఉద్యమాల బాటలో తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’లో రాసింది అరుణా రాయ్. ఉద్యమం అనే మహా పాఠశాలలో తాను నేర్చుకున్న పాఠాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ది పర్సనల్ ఈజ్ పొలిటికల్: యాన్ యాక్టివిస్ట్ మెమోయిర్ – అరుణా రాయ్అట్టడుగు కోణం నుంచి...దేశంలోని అత్యంత మారుమూల, అణగారిన వర్గాల గురించి బేలా భాటియా రాసిన పుస్తకం ఇది. మన దేశంలోని నిరుపేద ప్రజలపై జరిగే హింసాకాండపై వెలుగును ప్రసరిస్తుంది. వర్గ, లింగ, భౌగోళిక అంశాలను మేళవించి రాసిన పుస్తకం ఇది.ఇండియాస్ ఫర్గాటెన్ కంట్రీ: ఏ వ్యూ ఫ్రమ్ ది మార్జిన్స్– బేలా భాటియాహింస ధ్వనిమన దేశంలోని తాజా రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. భీమా– కోరేగావ్ ఘటనలో కొందరిని కేసులో ఎలా ఇరికించారో, సాక్ష్యాధారాలు ఎలా సృష్టించారో, కేసు లేకపోయినా రాజకీయ కారణాలతో ఎలా హింసించారో ఈ పుస్తకంలో అల్పా షా రాసింది.భీమా–కోరేగావ్ అండ్ ది సెర్చ్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇండియా: అల్పా షాఎర్రజెండ నీడలో... 1920 దశకంలో భారత రాజకీయాల్లో కమ్యూనిజం స్పష్టమైన అస్తిత్వంగా మారడం నుంచి కమ్యూనిస్ట్ మహిళల జీవితాలను సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంలో విశ్లేషించడం వరకు ఎంతో సమాచారం ‘రెవల్యూషనరీ డిజైర్స్’లో కనిపిస్తుంది.ఎన్నో జీవితాల గురించిరెవల్యూషనరీ డిజైర్స్: ఉమెన్ కమ్యూనిజం అండ్ ఫెమినిజం ఇన్ ఇండియా – అనియా లూంబాశ్రామిక జనజీవన చిత్రంసాధారణ శ్రామిక వర్గ భారతీయురాలి జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపే ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్ నేహా దీక్షిత్ రాసింది. బాబ్రీ మసీదు కూల్చివేతతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి సైదా ఎక్స్ బెనారస్ నుంచి దిల్లీకి వెళుతుంది. దిల్లీలో బతకడానికి రోజుకు ఎన్నో ఉద్యోగాలు చేస్తుంది. ఒక రోజు సెలవు తీసుకుంటే కూడా ‘రేపు బతకడం ఎలా’ అనే భయం నుంచి రాత్రి, పగలు కష్టపడిన సైదా కథ ఈ పుస్తకంలో కనిపిస్తుంది, దిల్లీలోని చాందిని చౌక్‌లో రిక్షా తొక్కే కార్మికుడు ఉగ్రవాదుల బాంబు పేళుళ్లలో మరణిస్తాడు. ‘ది మెనీ లివ్స్ ఆఫ్...’లో సయిదా, బాంబు పేలుళ్లలో చనిపోయిన అమాయక రిక్షాకార్మికుడిలాంటి ఎంతోమంది సామాన్యుల, శ్రామికుల జీవితాలు కనిపిస్తాయి.ది మెనీ లైవ్స్ ఆఫ్ సైదా ఎక్స్ – నేహా దీక్షిత్స్వతంత్రభారత స్వరంఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పుస్తకం స్వతంత్ర భారత దేశ సంక్షిప్త చరిత్ర. జాతీయవాదంలోని అనేక అంశాల గురించి తన భావాలను వెల్లడి చేస్తుంది నందిత హక్సర్. మన దేశం ఎలా ముందుకు సాగాలనే దాని గురించి కౌమార దశలో తన అమాయక ఆలోచనలు ఈ పుస్తకంలో గుర్తు తెచ్చుకుంది నందిత. అమాయక ఆలోచనల నుంచి వాస్తవికదృష్టితో ఆలోచించడం వరకు తన ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పును గురించి కూడా ‘ది కలర్స్ ఆఫ్ నేషనలిజం’లో రాసింది నందితా హక్సర్‌ది కలర్స్ ఆఫ్ నేషనలిజం– నందితా హక్సర్‘తమాషా’ వెనుకఎంత విషాదమో!మహారాష్ట్రలోని తమాషా డ్యాన్సర్ల గురించి రాసిన పుస్తకం ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే తమాషా కళాకారుల సామాజిక, మేధోచరిత్రను రికార్డ్ చేసిన మొదటి పుసక్తంగా చెప్పుకోవచ్చు. హిస్టరీప్రొఫెసర్ అయిన డా. శైలజ పైక్ తొలి పుస్తకం... దళిత్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడ్రన్ ఇండియా: డబుల్ డిస్క్రిమినేషన్. నలుగురు ఆడపిల్లల్లో ఒకరిగా యెరవాడ మురికి వాడలోని ఒకేగది ఇంట్లో పెరిగిన శైలజకు పేదల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆ అనుభవ జ్ఞానంతోనే మహారాష్ట్రలోని తమాషా కళాకారుల జీవితానికి అద్దం పట్టేలా ‘ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్’ పుస్తకం రాసింది.ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్ – శైలజ పైక్ -
పుట్టింది కెనడాలో. అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!
బాధితురాలిగా సానుభూతి తప్ప సరిౖయెన సలహాలు, సహాయం అందుకోలేకపోయింది రసిక సుందరం.తన చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇమార’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. జెండర్ బేస్డ్ వయొలెన్స్‌ను నివారించడానికి, బాధితులకు అనేక రకాలుగా అండగా నిలవడానికి ‘ఇమార’ ద్వారా కృషి చేస్తోంది రసిక సుందరం.రెండు సంవత్సరాల క్రితం రసిక సుందరపై క్లోజ్‌ఫ్రెండ్ దాడి చేశాడు. ఊహించని ఈ సంఘటనకు భీతిల్లిన రసిక డిప్రెషన్లోకి వెళ్లింది. ఆ చీకటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలనుకుంది. అయితే వారితో వరుసగా చేదు అనుభవాలు ఆమెను నిరాశకు గురి చేశాయి.‘చాలామంది నన్ను అవమానించారు. చికిత్స ఫీజులు కూడా ఎక్కువే’ గతాన్ని గుర్తు చేసుకుంది రసిక.మంచి లాయర్ దొరకక పోవడం ఆమెకు మరో అడ్డంకిగా మారింది. దీంతో తనను వేధించిన వ్యక్తిపై కేసు పెట్టలేదు.తన అనుభవాల నేపథ్యంలో ‘ఇమార సర్వైవర్ సపోర్ట్’ ఫౌండేషన్ ప్రారంభించింది. ఇది సెక్సువల్ అండ్ జెండర్–బేస్డ్ (ఎస్జీబీవి) నివారించడానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ‘హింస నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి మేము అండగా ఉంటాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి జెండర్–బేస్డ్ వయొలెన్స్ అంటే ఏమిటి అనేదాని గురించి అవగాహన కలిగించడం, ప్రాణాలతో బయటపడిన వారికి ఎలా సహాయపడవచ్చో చెప్పడం, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండవచ్చో చెబుతాం’ అంటున్న రసిక విద్యాలయాల నుంచి కాలనీ వరకు ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. (పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ)న్యాయ, వైద్యసహాయం, పోలీసు సహాయం కోసం వన్–స్టాప్ సెంటర్లకు రూపకల్పన చేయనుంది. ‘ఇమార’ ఫౌండేషన్ కోసం ఫెమినిస్ట్ రిసెర్చర్ కృతి జయకుమార్ మార్గదర్శకంలో ఎంతోమంది వాలెంటీర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రసిక. ఆర్థిక వేధింపులు, బలవంతపు గర్భస్రావం....ఇలా ఎంతో మంది బాధితులు ‘ఇమార’ను సంప్రదిస్తున్నారు.‘వరల్డ్ పల్స్ ప్లాట్‌ఫామ్’ ద్వారా ఆఫ్రికాలోని మానవ అక్రమ రవాణా బాధితురాలు ఒకరు రసికను సంప్రదించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు తనను లక్ష్యంగా చేసుకొని ఎలా కష్టపెడుతున్నారో చెప్పింది. కొన్నేళ్ళుగా వారి చెరలో ఉన్న బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి రావడానికి భద్రతను కోరింది. ‘ఇం పాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు పల్లవి ఘోష్ సహాయ సహకారాలతో బాధితురాలిని, ఆమె పిల్లలను చెర నుంచి విముక్తి కలిగించగలిగింది రసిక. అయితే బాధితురాలి కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. కొత్త దేశంలో ఆహారం, ఆశ్రయం, ఆర్థిక సమస్యలలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇది తెలుసుకొని యాంటీ ట్రాఫికింగ్ న్యాయవాదుల సహకారంతో గ్లోబల్ నెట్వర్కింగ్ ద్వారా ఆమెకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది రసిక. ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా బాధితులకు ‘ఇమార’ సహాయ సహకారాలు అందించింది. ధైర్యాన్ని ఇచ్చింది. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)కెనడాలో పుట్టిన రసిక ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి భారతదేశానికి తిరిగివచ్చింది. తమ కుమార్తెలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మధ్య పెరగాలనే తల్లిదండ్రుల కోరికే వారు భారత్‌కు తిరిగిరావడానికి కారణం. చెన్నైలో డిగ్రీ చేసిన రసిక టొరంటోలోని యార్క్ యూనివర్శిటీలో పై చదువులు చదివింది. శరణార్థుల హక్కులు, వలస హక్కులు, లింగ–ఆధారిత హింస(జెండర్ బేస్డ్ వయొలెన్స్) చుట్టూ కేంద్రీకృతమైన మానవ హక్కులకు సంబంధించి ఇంటర్న్‌షిప్ చేసింది. జెండర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్‌లలో పనిచేసింది.‘ఏ స్వచ్ఛంద సంస్థకు అయినా నిధుల సమీకరణకు సంబంధించి మొదటి మూడేళ్లు కష్టకాలం’ అంటున్న రసిక సుందరం తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో ‘ఇమార’ను నడుపుతోంది. ‘ఒక్క క్లిక్‌తో డేటాబేస్‌ను బాధితులు యాక్సెస్ చేసే యాప్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టింది .లింగ ఆధారిత హింసను అంతం చేయడం కోసం పని చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటుంది రసిక సుందరం. -
ట్రాన్స్జెండర్లూ మహిళలేనా?
మహిళ అంటే ఎవరు? ఒక వ్యక్తి స్త్రీ అని నిర్ధారించేందుకు ప్రాతిపదిక ఏమిటి? జన్మతః సంక్రమించిన లైంగికత మాత్రమేనా? లింగ మార్పిడితో మహిళగా మారిన వాళ్లు కూడా ‘స్త్రీ’అనే నిర్వచనం కిందకు వస్తారా? తద్వారా మహిళలకు వర్తించే హక్కులన్నీ వారికీ వర్తిస్తాయా? అత్యంత సంక్లిష్టమైన ఈ అంశాలను తేల్చాల్సిన బాధ్యత బ్రిటన్ సుప్రీంకోర్టుపై పడింది. అతి వివాదాస్పదమైన ఈ అంశంపై జోరుగా కోర్టులో వాద వివాదాలు జరుగుతున్నాయి. ఒకరకంగా ‘మహిళ వర్సెస్ మహిళ’అని చెప్పదగ్గ న్యాయపోరాటం జరుగుతోంది. స్త్రీగా గుర్తింపు సర్టిఫికెట్ ఉన్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని సమానత్వ చట్టాల ప్రకారం మహిళగా పరిగణించవచ్చా, లేదా అన్నది ఈ కేసు. బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు దీనిపై మంగళవారం లోతైన వాదనలు సాగాయి. అవి బుధవారమూ కొనసాగాయి. ఇక న్యాయమూర్తులు తీర్పు వెలువరించడమే మిగిలింది. అందుకు రెండు వారాలు పట్టవచ్చు. రాబోయే తీర్పు బ్రిటన్‌తో పాటు ప్రపంచమంతటా లింగమార్పిడి ద్వారా మహిళలుగా మారిన వారి గుర్తింపును, హక్కులు తదితరాలపై ఎంతగానో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఏమిటీ కేసు? నిజానికి మహిళా హక్కుల ఉద్యమకారులకు, స్కాట్రండ్ ప్రభుత్వానికి దీర్ఘకాలంగా సాగుతున్న వివాదమిది. స్కాట్లాండ్ ప్రభుత్వ రంగ సంస్థళ బోర్డుల్లో 50 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేలా 2018లో అక్కడి ట్లాండ్ పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది. లింగమారి్పడి ద్వారా మహిళలుగా మారిన వారిని కూడా ఈ చట్టం ప్రకారం ‘స్త్రీ’నిర్వచన పరిధిలో చేర్చారు. దీన్ని స్కాటిష్ మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలా ‘మహిళ’ను పునరి్నర్వచించే అధికారం పార్లమెంటుకు లేదన్నది వారి వాదన. ‘‘ఈ చట్టం అమలైతే బోర్డుల్లో 50 శాతం మంది పురుషులతో పాటు మిగతా 50 శాతం కూడా మహిళలుగా మారిన పురుషులే ఉంటారు. అది మహిళా ప్రాతినిధ్య లక్ష్యాలకే గొడ్డలిపెట్టు’’అని ‘ఫర్ విమెన్ స్కాట్లాండ్’(ఎఫ్‌డబ్ల్యూఎస్) అనే మహిళ స్వచ్ఛంద సంస్థ అంటోంది. అంతిమంగా ఇది మహిళల రక్షణకూ విఘాతమమేనన్ని వాదిస్తోంది. ఈ చట్టాన్ని స్కాట్లాండ్ కోర్టులో సవాలు చేయగా చుక్కెదురైంది. ఈ కేసును కోర్టు తిరస్కరించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడానికి గతేడాది అనుమతించింది. అలా బంతి బ్రిటన్ సుప్రీంకోర్టు వద్దకు చేరింది. ట్రాన్స్జెండర్ల హక్కులకు విఘాతం: ఆమ్నెస్టీ సమానత్వ చట్టం ప్రకారం లైంగికత తల్లి గర్భంలోనే నిర్ణయమవుతుందని ఎఫ్‌డబ్ల్యూఎస్ తరపు న్యాయవాది అంటున్నారు. పుట్టిన అనంతరం దాన్ని మార్చడం సాధ్యం కాదని వాదిస్తున్నారు. దీనితో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా పలు మానవహక్కుల సంఘాలు విభేదిస్తున్నాయి. ‘‘జెండర్ అనేది శారీరక వ్యక్తీకరణ. లింగ గుర్తింపు సరి్టఫికెటున్న ట్రాన్స్జెండర్లకు మహిళల హక్కులను నిషేధించడం మానవ హక్కుల సూత్రాలకు విరుద్ధం’’అని అవి అంటున్నారు. ట్రాన్స్జెండర్ల హక్కులకు విఘాతం కలగకుండా చూడాలని బ్రిటన్ సుప్రీంకోర్టును ఆమ్నెస్టీ లిఖితపూర్వకంగా కోరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గేలి చేసినచోటే గెలిచి చూపిద్దాం!
ఆనందం ఎక్కడ ఉంటుందో ఆత్మస్థైర్యం అక్కడ ఉంటుంది. ఆత్మస్థైర్యం కొలువైన చోట అనేక ద్వారాలు తెరుచుకుంటాయి. విజయానికి సింహద్వారాన్ని చూపిస్తాయి.శారీరక మార్పుల వల్ల లింగమార్పిడికి ముందు, లింగ మార్పిడి తరువాత ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది శ్వేతాసుధాకర్. అవమానాలు, కష్టాలలో ఆమె జపించిన మంత్రం... ‘జీవితం ఒక్కటే. బార్న్ 2 విన్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యకర్త, రచయిత, మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతోమంది ట్రాన్స్జెండర్ల జీవితాలలో వెలుగులు నింపుతోంది చెన్నైకి చెందిన శ్వేతా సుధాకర్.వెయ్యి ఏనుగుల బలంతో రోజు మొదలు కావాలి అంటారు. ఆ మాట విషయం ఎలా ఉన్నా శ్వేతకు రోజు మొదలైందంటే దిగులుగా ఉండేది. ‘ఈరోజు ఎన్ని అవమానాలు పడాలో!’ అనుకునేది. చెన్నైలో పుట్టిన శ్వేత సుధాకర్లోని శారీరక మార్పులు చూసి ‘నీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందేమిటి... అలా మాట్లాడుతున్నావేమిటీ’... ఇలా రకరకాలుగా వెక్కిరించేవారు. శారీరకంగా వచ్చిన మార్పులతో కుటుంబాన్ని వదిలి లింగమార్పిడితో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది శ్వేత. ‘చదువును నమ్ముకున్నవారు ఎప్పుడూ జీవితంలో ఓడిపోరు’ తాను విన్న మాట ఆ రోజు పదే పదే గుర్తు వచ్చింది. ఇక అప్పటినుంచి చదువు తన నేస్తం అయింది. ఆత్మీయత పంచే కుటుంబం అయింది. ధైర్యం ఇచ్చే గురువు అయింది. మద్రాస్ యూనివర్సిటీలో ఎం.ఏ. సోషియాలజీ చేసిన శ్వేతాసుధాకర్ ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలనుకోలేదు. ఒక ఉద్యమంలా తనలాంటి వారి కోసం విస్తరించాలనుకుంది. ‘బార్న్ 2 విన్’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టింది. అయితే చెన్నైలో సంస్థ కార్యాలయం కోసం గదిని అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఒక మానవతావాది సహాయంతో చెన్నైలోని సైదాపేటలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగింది శ్వేత. (క్రేజీ.. డీజే..)గురుకులం...ఇప్పుడు ఈ కార్యాలయం వందలాది మంది ట్రాన్స్జెండర్లకు రణక్షేత్రం. ‘ఇదిగో... జీవితంలో ఎదురయ్యే సమస్యలతో ఇలా యుద్ధం చేయాలి’ అని నేర్పుతుంది. ‘చింతవద్దు. నువ్వు బతికేమార్గాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ ఉపాధి విద్యలను నేర్పే గురుకులం అవుతోంది. లింగమార్పిడి చేసుకున్న వారి హక్కుల కోసం తన గళాన్ని వినిపించడంతో పాటు విద్య, ఉపాధి, లైఫ్‌స్కిల్స్... మొదలైన వాటిలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, టైలరింగ్, కాస్మోటాలజీ, ఫ్యాషన్ డిజైన్కోర్సులతో ఎవరికి వారు తమ సొంత కాళ్లపై నిలబడే విధంగా తీర్చిదిద్దుతుంది శ్వేతా సుధాకర్.ట్రాన్స్ అచీవర్స్ అవార్డ్తమిళనాడుకే పరిమితం కాకుండా దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు విస్తరించింది బార్న్ 2 విన్. శ్రీలంక నుంచి మొదలు యూరప్‌లోని ఎన్నో దేశాల వరకు వివిధ రంగాలలో రాణిస్తున్న ట్రాన్స్జెండర్లను గత పదకొండు సంవత్సరాలుగా ‘ట్రాన్స్ అచీవర్స్’ అవార్డులతో సత్కరిస్తోంది శ్వేత. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం లాంటి భాషలను అనర్గళంగా మాట్లాడుతూ ‘శ్వేతా టాక్ షో’ పేరుతో ట్రాన్స్ మీడియా యూ ట్యూబ్‌ను నిర్వహిస్తోంది. ‘మిస్ తమిళనాడు ట్రాన్స్ క్వీన్ ప్రొగ్రామ్‌ను గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ‘బార్న్ 2 విన్ అనేది సంస్థ కాదు. మా కుటుంబం. అది నాకు ఇచ్చిన ధైర్యం ఇంతా అంతా కాదు’ అంటుంది సుప్రియ. నిజానికి ఇది ఆమె మాటే కాదు ‘బార్న్ 2 విన్’ ద్వారా గెలుపు పాఠాలు నేర్చుకున్న ఎందరో విజేతల మాట.మన కోసం మనంకుటుంబాన్ని వదిలి నేను ఎన్నో బాధలు పడ్డాను. ఆ ఒంటరి రోజులలో పుస్తకాలు నా కుటుంబసభ్యులు అయ్యాయి. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అదే చదువు ద్వారా ఎంతోమందికి ధైర్యం వచ్చేలా చేస్తున్నాను. ‘నా కోసం ఏదీ లేదు. నా కోసం ఎవరూ లేరు’ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ విశాల ప్రపంచంలో మన కోసం ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని వెదుక్కోగలగాలి. వాటిని వెదకాలంటే బలం కావాలి. ఆ బలం జీవనోత్సాహం నుంచి వస్తుంది. అందుకే నిరాశానిస్పృహలకు దూరంగా ఉంటూ ఎప్పుడూ సంతోషంగా ఉండేలా ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు ‘బార్న్ 2 విన్’ రూపంలో నాకంటూ ఒక కుటుంబం ఉంది. సామాజిక, రాజకీయ రంగాలలో గుర్తింపు దొరికింది.– శ్వేతా సుధాకర్, బార్న్ 2 విన్–ఫౌండర్అక్షర బలంశ్వేతా సుధాకర్ మంచి వక్త మాత్రమే కాదు రచయిత్రి కూడా. నిండైన భావుకత, చక్కని శైలి ఆమె అక్షరబలం. ‘నన్గై స్వేతాసీ’ పేరుతో హిజ్రాల జీవితాలపై ‘ఇయర్కై ఎలిదియ ఎలుత్తు పిలయ్(ప్రకృతి రాసిన అక్షర దోషం)’, కూందలుం... మీసయుం (శిరోజాలు..మీసాలు), వానం పాత్త తారగయే (ఆకాశం చూసిన తార), తర్కొలై దాహంగల్ (ఆత్మహత్యా దాహం), కల్యాణ కనువుగల్ (పెళ్లి కలలు)... మొదలైన పుస్తకాలను తన ‘నన్గై పబ్లికేషన్స్’ ద్వారా ప్రచురించింది.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
CISF: మరో అడుగు...
వెయ్యిమందికిపైగా మహిళలతో తొలిసారిగా మహిళా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థ వంటి దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను సంరక్షించడం, వీఐపీలకు కమాండోలుగా భద్రత కల్పించే బాధ్యతలను ఈ బెటాలియన్ భుజాలకెత్తుకోనుంది.ప్రస్తుతం 1.80 లక్షల మంది ఉన్న సీఐఎస్ఎఫ్లో ఏడు శాతానికి పైగా మహిళలు ఉన్నారు. సీనియర్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలో 1,025 మంది సిబ్బందితో రిజర్వ్ బెటాలియన్ అని పిలిచే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయడానికి ముందస్తు నియామకం, శిక్షణ, స్థలాన్ని ఎంపిక చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.సీఐఎస్ఎఫ్ 1969లో ఏర్పాటు అయింది. ఎన్నికల భద్రత లాంటి తాత్కాలిక బాధ్యతల నుంచి పార్లమెంట్ హౌజ్ భద్రత వరకు సీఐఎస్ఎఫ్ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా...ఆల్–ఉమెన్ బెటాలియన్ ఏర్పాటు చేయడమన్నది మహిళా సాధికారత విషయంలో సీఐఎస్ఎఫ్ వేసిన మరో అడుగు అనవచ్చు.‘వీఐపీ భద్రతతో పాటు విమానాశ్రయాలు, దిల్లీ మెట్రో... మొదలైన వాటి భద్రతలో కమాండోలుగా బహుముఖ పాత్రపోషించే సామర్థ్యం ఉన్న ఎలైట్ బెటాలియన్‌ను రూపొందిస్తున్నాం. దేశానికి సేవ చేయాలనుకునే మహిళలకు సీఐఎస్ఎఫ్ మంచి ఎంపిక. కొత్త ఆల్–ఉమెన్ బెటాలియన్ వల్ల దేశవ్యాప్తంగా మరింతమంది యువతులు సీఐఎస్ఎఫ్లో చేరేందుకు ప్రోత్సాహం లభిస్తుంది’ అని అధికార ప్రకటన తెలియజేసింది.‘ఇదొక చారిత్రక నిర్ణయం. జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఆల్–ఉమెన్ బెటాలియన్ ఉపకరిస్తుంది’ అంటూ ‘ఎక్స్’ వేదికగా సీఐఎస్ఎఫ్ హర్షం ప్రకటించింది. -
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్‌టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్‌ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్‌టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్‌తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
లింగ సమానత్వంలో భారత్ ముందడుగు
న్యూఢిల్లీ: లింగ సమానత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకమని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. అయితే సామాజిక కట్టుబాట్లు, పరిమిత శ్రామిక భాగస్వామ్యం, సరైన భద్రత లేకపోవడం లింగ సమానత్వానికి ఇంకా ఆటంకం కలిగిస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రయత్నాలు అవసరమని సూచించింది. దేశంలో మహిళల పురోగతి, సవాళ్లపై ఐరాస మహిళా వ్యూహాత్మక భాగస్వామ్యాల డైరెక్టర్ డేనియల్ సీమౌర్, భారత్‌లో ఐరాస మహిళల కంట్రీ రిప్రజెంటేటివ్ సుసాన్ జేన్ ఫెర్గూసన్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళల జీవితాలను మార్చడానికి, మహిళలు, బాలికల నిర్దిష్ట అవసరాలకు బడ్జెట్లో 6.8 శాతానికి నిధులు పెరిగాయన్నారు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగాల్లో అంతరాలను తొలగించడానికి బడ్జెట్ నిరంతర విస్తరణ అవసరమని నొక్కి చెప్పారు. ఈ లక్ష్యాలను పూర్తిగా చేరుకోవడానికి ప్రైవేట్ రంగ పెట్టుబడులు అవసరమని ఫెర్గూసన్ పేర్కొన్నారు. పంచాయతీలు, స్థానిక ప్రభుత్వ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యంతో నాయకత్వంలో కూడా పురోగతి కనిపిస్తోందని చెప్పారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందడం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావాన్ని చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే లింగ ఆధారిత హింస (జీబీవీ) దేశంలో నిరంతర సమస్యగా ఉందని, ఇది మహిళల భద్రత, స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని అధికారులు ఎత్తిచూపారు. చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ సామాజిక కట్టుబాట్లు మహిళలను అడ్డంకిగా మారాయన్నారు. మహిళల భద్రతపై దృష్టి సారించే కమ్యూనిటీ పోలీసింగ్ ప్రయత్నాలను ప్రవేశపెట్టడానికి, పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి మధ్యప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో యూఎన్ ఉమెన్ సహకరిస్తోందని తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022–23 ప్రకారం దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతానికి పెరిగినప్పటికీ, సవాళ్లు ఉన్నాయని, పిల్లల సంరక్షణ, సురక్షిత రవాణా, పనిప్రాంతంలో భద్రతతో మహిళలు మరిన్ని ఆర్థిక అవకాశాలు పొందగలుగుతారని సూచించారు. -
ఇంటికొచ్చి లింగ నిర్ధారణ పరీక్ష
కామారెడ్డి టౌన్: మొబైల్ వైద్య పరీక్షల ముసుగులో ఇంటి వద్దకే వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గురువారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్లో పని చేస్తూ గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఓ గర్భిణి లింగనిర్ధారణ కేసులో ఆ ఆస్పత్రి రెండేళ్ల క్రితం సీజ్ కావడంతో రవీందర్ రాజంపేటలో స్వయంగా లింగనిర్ధారణ పరీక్షలు ప్రారంభించాడు. ఇందుకోసం ఓ మినీ స్కానింగ్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు.వాస్తవానికి అతనికి స్కానింగ్ చేసే అర్హత లేదు. అయితే వారి కుటుంబ వృత్తి అయిన బీడీ కార్ఖానా ముసుగులో స్కానింగ్ పరీక్షలు ప్రారంభించాడు. రోజూ బీడీల గంప పేరుతో జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటించి గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తూ ఆడ, మగ శిశువు అని చెప్పి గర్భస్థ పిండాలను చిదిమేసేందుకు కారకుడయ్యాడు. కామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఇలా చాలా మండలాలకు తన ద్విచక్ర వాహనంపై మినీ స్కానింగ్ యంత్రాన్ని తీసుకెళ్లి గర్భిణి ఇంటి వద్దనే లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు.ఆడ పిల్లలుండి మగ పిల్లలు కావాలనుకునే వారి గురించి ఆరాతీస్తూ గుట్టుచప్పుడు కాకుండా రెండేళ్లుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో కామారెడ్డి సీసీఎస్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి రవీందర్ ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. -
జెండర్, లైంగిక సమస్యల పరిష్కారంలో థియేటర్ రోల్
వర్గం, మతం, జెండర్, లైంగిక సమస్యలను పరిష్కార దిశగా న్యూ ఢిల్లీలోని కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ థియేటర్లో జరిగిన ఫెస్టివల్ నటీనటుల పెర్ఫార్మెన్స్ను సరికొత్తగా చూపింది. లైంగికతతో పాటు సామాజిక దుర్బలత్వాలను పరిష్కరించడంలో ఈ సమకాలీన థియేటర్ దృష్టి పెడుతుంది.ఫెస్టివల్ క్యూరేటర్‌గా ఉన్న బెంగళూరుకు చెందిన నటుడు, దర్శకుడు, చిత్రనిర్మాత కీర్తన కుమార్ కొత్త విషయాలను అన్వేషించే నాటకాలను ఒకచోట చేర్చాలని కోరుకున్నారు. అలాగే ‘ఈ రోజుల్లో కళాకారులు ఎలాంటి నాటకాలు వేస్తున్నారు’ అనే అంశం గురించి సంభాషణలను ప్రోత్సహించారు. ‘ఈసారి దృష్టి సమకాలీన థియేటర్‌పై ఉంది. ఎందుకంటే కళాకారులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలనే ఆసక్తితో ΄ాటు వారు ఏ రంగస్థల రూపాలు, భాషలను అన్వేషిస్తున్నారు, ఏ సమస్యలు వారిని ఉత్తేజపరుస్తాయి, ఎలా సృష్టిస్తారు, డబ్బు సమస్యలేంటి, వారి ప్రేరణ ఏమిటి, ఏం వ్యక్తం చేయాలనుకుంటున్నారు...అనేవి ఈ విధానం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు జాతీయ దృష్టిని ఆకర్షించని కళాకారుల నాటకాలు, వారి ఆలోచనలు, రూపాలను ఆహ్వానించాలనుకుంటున్నాను’అని కీర్తన కుమార్ చెప్పింది.ఇతిహాసాల నుంచి...మైసూరు ప్రాంతాలకు సమీపంలో ఉన్న మలే మహదేశ్వర కొండలలోని హలు కురుబా కమ్యూనిటీ పురుషులతో అనుబంధించబడిన బీసు కంసలే అనే విన్యాస జానపద రూపంతో ఈ పండుగ ప్రారంభమైంది. దీని తర్వాత కటకథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్ సమర్పించిన ది నైట్స్, అరేబియన్ నైట్స్ సిరియన్, చైనీస్, ఇండియన్ వెర్షన్లకు తోలుబొమ్మల గౌరవం, కీటకాలతో నిండిన అద్భుత ప్రపంచంలోకి ప్రేక్షకులను స్వాగతించింది. ఇంకా, రామాయణంలోని అరణ్యకాండ నుండి తీసుకున్న అడవిలో నివసించే సోదరులు, వాలి మరియు సుగ్రీవుల కథను పరిచయం చేసింది.మోహిత్ తకల్కర్ రాసిన ‘లవ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్–హోపింగ్ / సోషల్ మీడియా స్క్రోలింగ్’ వేగాన్ని ప్రతిబింబిస్తుంది. అభి తాంబే ద్వారా పోర్టల్ పెయిటింగ్, థియేటర్లో రాక్ షో అనుభవం మనల్ని సమ్మోహితులను చేస్తాయి. నిషా అబ్దుల్లా సోలో ప్రదర్శన. ఇది పోగొట్టుకున్న, శాశ్వతమైన స్నేహాల గురించి మాట్లాడటానికి పాట, కథ, పురాణం, చరిత్రను కలిపి అల్లినది. -
చీర, గాజులా..?! తీరు మారదా? మాట వరుస మారదా?
ఇటీవల ఒక నాయకుడు మరో నాయకుడిని దూషించాడు. ఆ దూషణ మహిళలను కించపరిచే అర్థంలో సాగింది. అసమర్థతకు సమానార్థకంగా చీర, గాజులను ప్రస్తావించాడు. దూషణలో ఒక కులాన్ని ప్రస్తావిస్తే కేసు పెట్టడానికి చట్టాలున్నాయి. స్త్రీల గౌరవానికి భంగం కలిగే ఇలాంటి వ్యాఖ్యలకు గట్టి చట్టాలెక్కడ? సమాజంలో నెలకొని ఉన్న వివక్షపూరిత భావజాలానికి అడ్డకట్ట ఎప్పుడు? ఈక్వాలిటీ అంటే ఇదేనా? రాజ్యాంగం స్త్రీపురుషులిద్దరికీ సమానమైన గౌరవాలనే చెప్పింది. వివక్షకు తావులేని నిబంధనలున్నా వివక్ష తప్పలేదు. ఐక్యరాజ్య సమితి 1975 ఉమెన్స్ ఇయర్‌గా ప్రకటించి, అధ్యయనానికి కమిటీని వేసింది. ఆ కమిటీ 1977లో ‘టూవార్డ్స్ ఈక్వాలిటీ’ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం కోసం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాం కదా, ఇంకా ఏం కావాలి అనే అభి్ర΄ాయంలో ఉన్న మన పాకుల కళ్లు తెరిపించింది ఆ నివేదిక. దీనికి కొనసాగింపుగా 1985 వరకు మహిళాభివృద్ధి కోసం పని చేయాలని కూడా సూచించింది ఐక్యరాజ్య సమితి. మహిళ సాధికారత సాధనలో ముందడుగు వేస్తున్న క్రమంలో 2001 సంవత్సరాన్ని ‘ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఇయర్’గా ప్రకటించింది మన భారత ప్రభుత్వం. ఇన్ని జరుగుతున్నా సమాజం మాత్రం పితృస్వామ్య భావజాలం నుంచి బయటపడడం లేదు. ఒక మగవాడు సాటి మగవాడిని మాటలతో దాడి చేయాల్సి వచ్చినప్పుడు ‘చీర కట్టుకో, గాజులు వేసుకో’అంటున్నారు. ఎదుటి వ్యక్తి మీద అసమర్థత, అనైతికత ఆరోపణలు చేయడానికి స్త్రీత్వాన్ని ఆపాదించడం, స్త్రీల వస్త్రధారణతో గేలి చేయడం వంటి ప్రాక్టిస్ ఏ మాత్రం సరికాదు. ప్రజాజీవితంలోకి వచ్చే వాళ్లు ముందు దయచేసి రాజ్యాంగాన్ని చదవాలి. - ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి (రిటైర్డ్), వరంగల్ మౌనంగా ఉంటే మరింత దిగజారుతుంది! ‘ఇక్కడెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు’ అనే మాట సమాజంలో వినిపిస్తూనే ఉంది. మగవాళ్ల నుంచే కాదు మహిళల నుంచి కూడా. ‘తాము అసమర్థులం కాదు, సమర్థులమే’ అని చెప్పుకోవడానికి మగవాళ్లు గాజులు, చీరలను మాట్లాడుతుంటారు. నిరక్షరాస్యుల్లో తరచూ వినిపిస్తుంటే చదువుకున్న వాళ్లలో అరుదుగా వినిపిస్తుంటుంది. అంతే తేడా. మరికొందరు ఎదుటి వారి మీద దుమ్మెత్తి పోయడానికి, అసమర్థుడివని దెప్పి పొడవడానికి, ‘నీకు చీర, గాజులు పంపిస్తా’ అనడాన్ని కూడా చూస్తున్నాం. మగవాళ్లు ఇలా అన్నప్పుడు ఆడవాళ్లు మౌనంగా ఉంటే ఆ మాటలను, వారి భావాన్ని, అభి్ర΄ాయాన్ని సమ్మతించి నట్లవుతుంది. అందుకే మహిళలు ప్రతిస్పందించాలి. మహిళ మౌనం వహిస్తే పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. తప్పు చేసిన వాళ్లను ఒకప్పుడు గుండు గీయించి, సున్నం బొట్లు పెట్టి ఊరంతా తిప్పేవాళ్లు. ఇలా నోటి దురుసుగా మాట్లాడిన వాళ్ల వ్యాఖ్యలను ఖండించి, తగిన విధంగా తిప్పికొడుతూ ఉండాలి. అప్పుడే సమాజంలో తరతరాలుగా పాతుకు΄ోయిన ఇలాంటి మాటలకు అడ్డుకట్ట పడుతుంది. – ఎం. అమ్మాజీ, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ మాట వెనక్కి తీసుకోవాలి! ఇలాంటి మాటలు ఏ మాత్రం సమ్మతించదగినవి కావు. మగవాళ్లు ఒకరినొకరు తిట్టుకోవడానికి ‘... కొడకా’ అంటూ ఆడవాళ్లనే నిందిస్తారు. వాటి మీద మా తరమంతా పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. స్త్రీల కట్టు, బొట్టుతో గేలి చేయడమూ ఎక్కువైంది. ఒక మగవాడు మరో మగవాడిని అవహేళన చేయాలంటే స్త్రీలతో పోల్చడం, స్త్రీలలాగ వస్త్రధారణ చేసుకోమని గేలిచేయడం అంటే వాళ్ల దృష్టిలో చేతకానివాళ్లకు ప్రతీక స్త్రీలే అనే అభిప్రాయం స్థిరంగా ఉందని అర్థం. ఆ మాటలను వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయాలి. మాట వెనక్కి తీసుకునే వరకు పోరాడాలి. ప్రొఫెసర్ గూడూరు మనోజ (రిటైర్డ్), హైదరాబాద్ ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా -
2036 కల్లా పెరగనున్న లింగ నిష్పత్తి
న్యూఢిల్లీ: భారత్‌లో లింగ నిష్పత్తి 2036 సంవత్సరాలికల్లా కొద్దిగా మెరుగుపడనుంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని గణాంక, ప్రణాళిక అమలు శాఖ సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2011లో మన దేశంలో లింగ నిష్పత్తి 1000: 943గా ఉంది. లింగ సమానత్వం దిశగా సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 2036 కల్లా భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. అదే సమయంలో జనాభాలో మహిళల శాతం స్వల్పంగా పెరిగి 48.8 శాతానికి చేరుకుంటుందని వివరించింది. 2011లో భారత జనాభాలో మహిళ శాతం 48.5 మాత్రమే కావడం గమనార్హం. 2011తో పోలిస్తే 2036లో పదిహేనేళ్ల లోపు వయసున్న వారి సంఖ్య తగ్గుతుందని, జననాలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణమని పేర్కొంది. మరోవైపు ఇదేకాలంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. -
ఒలింపిక్స్‌లో జెండర్ వివాదం : ఆమె మహిళే ఇదిగో సాక్ష్యం, వేధించకండి!
ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ ఈవెంట్లో జెండర్ వివాదం చర్చకు దారి తీసింది. అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్ (Imane Khalif)తో జరిగిన పోటీలో ‘‘ఆమె అస్సలు లేడీ బాక్సర్ కాదు’’ అంటూ ప్రత్యర్థి బాక్సర్, ఇటలీ బాక్సర్ ఏంజిలా కారిని బౌట్ నుంచి వైదొలగడంతో వివాదం రాజుకుంది. దీనిపై కొందరు ఇమేనికి మద్దతుగా పలుకుతుండగా, మరికొందరు ఏంజిలా కారినిగా సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అయితే ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇమేని ఖాలీఫ్కు మద్దతు పలికారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు.ఇటాలియన్ మహిళా బాక్సర్ ఏంజెలా కారినితో జరిగిన పోరాటంలో ‘బయోలాజికల్ మగ’ అని ఆరోపణల మధ్య అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖెలిఫ్ విజయం సాధించడంతో పారిస్ ఒలింపిక్స్ వివాదాస్పదమైంది. అయితే ఇమానే ఖలీఫ్ పుట్టుకతో అమ్మాయిగానే పుట్టింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అల్జీరియాలో వారి లింగాన్ని మార్చుకునే హక్కు నిషేధం ఉంది అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు. ఇలానే అమ్మాయిలా కనిపించడం లేదంటూ అద్భుతమైన క్రీడాకారిణి శాంతి సౌందర్‌రాజన్‌ను ఇండియాలో వేధించారు. ఇపుడు ఇమేనా ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన వేధింపులెదుర్కొంటోంది. ఆమె బావుండాలని ఆశిస్తున్నాను అంటూ చిన్నయి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇమానే చిన్నప్పటి ఫోటోను పోస్ట్ చేశారు.కాగా గురువారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 46 సెకన్ల స్వల్ప వ్యవధలోనే ఆ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు కారిని ప్రకటించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు తప్పదంటూ వైదొలగడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. అటు అల్జీరియా ఒలింపిక్ కమిటీ కూడా బాక్సార్ ఇమేని ఖాలిఫ్కు మద్దతుగా నిలిచింది.Imane Khelif is BORN WOMAN. She is NOT a man. *The right to change their gender is illegal and banned in Algeria, the country she represents.*Indians have harassed and harangued Shanthi Soundarrajan, a brilliant sportswoman, just because she didn’t look the way they expect a… pic.twitter.com/JzYvTNgTVV— Chinmayi Sripaada (@Chinmayi) August 2, 2024 గతంలోనూ అల్జీరియా బాక్సర్ ఇమేని ఖాలిఫ్‌పై లింగ ఆరోపణలు వచ్చాయి. 2023 చాంపియన్‌షిప్ నుంచి డిస్క్వాలిఫై అయ్యింది. జెండర్ ఇష్యూ వల్లే ఆమెను ఆ క్రీడల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇమేనీకి డీఎన్ఏ టెస్టుల్లో ఆమెకు ఎక్స్‌వై క్రోమోజోమ్‌లు ఉన్నట్లు తేలినందని ఐబీఏ అధ్యక్షుడు ఉమర్ క్రమ్లేవ్ తెలిపారు. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో అనుమతి లభించింది. ఖాలిఫ్ పాస్‌పోర్టుపై ఫిమేల్ అని రాసి ఉందని, అందుకే ఆమె మహిళల క్యాటగిరీలోని 66 కేజీల విభాగంలో అనుమతినిన్చినట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్ తెలిపారు. ఐఓసీ నిర్ణయంపై కొంతమంది మాజీ మహిళా బాక్సర్లు మండిపడుతున్నారు. మరోవైపు కొన్ని దేశాలు తాను మెడల్ గెలవడాన్ని ఇష్టపడడం లేదని ఖాలిఫ్ ఆరోపించారు.దీనిపై అంతర్జాతీయ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.🇮🇹🇩🇿 Angela Carini from Italy in blue realizes she doesn’t want to fight a man and pulls out mid fight against the trans from Algeria in red at the Olympics.The "fight" lasted less than a minute.Cruel pic.twitter.com/VMksyAAbsx— Lord Bebo (@MyLordBebo) August 1, 2024 -
‘థ్యాంక్యూ సర్’ అన్నందుకు విమానం నుంచి దించారు!
ఎవరైనా మిమ్మల్ని సర్..అనబోయి పొరపాటును మేడమ్ అన్నారంటే.. ఏం చేస్తారు? సర్లే.. ఏదో కంగారులో అని ఉంటారని అసలు ఆ విషయాన్నే పట్టించుకోరు కదా. కానీ ఇటీవల యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మహిళా సిబ్బందిని పొరపాటున ‘సర్’ అన్నందుకు ఏకంగా విమానంలో నుంచే దించేశారు. దాంతో సదరు ప్రయాణికురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు(16 నెలలు), తల్లితో కలిసి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విమానం ఎక్కే సమయంలో సిబ్బంది బోర్డింగ్ పాస్‌ను అందించారు. దాంతో మహిళా అటెండెంట్‌ను పొరపాటుగా పురుషునిగా భావించి ‘థాంక్యూ సర్’ అని తెలిపింది. వెంటనే ఆ అటెండెంట్ ఆగ్రహానికి గురైంది. జెన్నా తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది. అదే సమయంలో జెన్నా మరో మేల్ అటెండెంట్ సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేట్ వద్ద మరో మేల్ అటెండెంట్ ఆపేశారని ఫిర్యాదు చేసింది. దాంతో ఆ సిబ్బంది.. మీరు ఫిర్యాదు చేయాలనుకున్న అటెండెంట్ ‘ఆయన’ కాదు ‘ఆమె’ అని బదులిచ్చారు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చేప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. అంతటితో ఆగకుండా విమానం నుంచి దింపేశారని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.My 16-month old & I were denied entry on a @united flight back to Austin bc I used the wrong pronoun for the attendant. We have no luggage, nothing. we’re stranded in San Francisco. What are my rights? @elonmusk @jchilders98 pic.twitter.com/2b1rC14wg4— The Period Guru ® (@JennaLongoria) June 26, 2024 -
‘ఆడామగా సమానమే, కానీ పురుషుల్లో..’ సుధామూర్తి కీలక వ్యాఖ్యలు
ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి లింగ సమానత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీవితం అనే బండికి చక్రల్లాంటివారు. జీవన యానం సాఫీగా సాగాలంటే ఇద్దరూ ఉండాలి.. తన దృష్టిలో స్త్రీపురుషులిద్దరూ సమానమే కానీ, వేర్వేరు మార్గాల్లో అన్నారు.లింగ సమానత్వం అంటే ఏమిటో వివరిస్తూ ఒక వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. స్త్రీ, పురుషులు సైకిల్‌కి రెండు చక్రాల్లాంటివారు. వీరిలో ఎవరూ లేకపోయినా బండి ముందుకు సాగదు.. అని ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి మూర్తి పేర్కొన్నారు.In my view, men and women are equal but in different ways. They complement each other like two wheels of a bicycle; you can't move forward without the other. pic.twitter.com/MMShEOtg9Q— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 27, 2024మహిళలు పురుషులు ఇద్దరూ ఒకరికొకరు భిన్నం. ఇద్దరిలోనూ ప్లస్, మైనస్‌లు ఉంటాయి. అయితే పురుషులతో పోలిస్తే మహిళలకు చాలా భాష తెలుసు. మేనేజ్మెంట్లో వారు చాలా అద్భుతం. పుట్టుకతోనే వారు మంచి మేనేజర్లు. ప్రేమ, జాలి కరుణ ఎక్కువ. అమ్మ, నాన్న, తోబుట్టువులు, అత్తమామలు, వదినలు, పిల్లలు ఇలా సన్నిహిత బంధువులు అందరికీ చక్కటి ప్రేమను పంచుతారు. మరోవైపు పురుషులు మహిళలంత భావోద్వేగులు కాదు. కొంచెం భిన్నం. పురుషుల్లో మంచి ఐక్యూ ఉండివచ్చు కానీ,మంచి ఈక్యూ (ఎమోషనల్ కోషెంట్) ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. -
పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు
కొచ్చి: వంటగది అనగానే అమ్మ వండుతున్నట్లు చూపే ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తుంటారు. ఇలాంటి ధోరణికి చెల్లుచీటి ఇస్తూ కేరళ ప్రభుత్వం లింగసమానత్వ చిత్రాలకు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చోటు కలి్పంచింది. అమ్మ అంటే ఉద్యోగం చేయదని, ఇంట్లోనే ఉంటుందనే భావన బడిఈడు పిల్లల్లో నాటుకుపోకుండా ఉండేందుకు, సమానత్వాన్ని వారి మెదడులో పాదుకొల్పేందుకు కేరళ సర్కార్ కృషిచేస్తోంది. ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడో తరగతి మలయాళం మాధ్యమం పాఠ్యపుస్తకం పేజీలను కేరళ సాధారణ విద్యాశాఖా మంత్రి వి.శివాన్కుట్టి సోషల్‌మీడియాలో షేర్చేశారు. తండ్రి వంటింట్లో కూర్చుని పచ్చి కొబ్బరి తురుము తీస్తున్నట్లు ఒక పేజీలో డ్రాయింగ్ ఉంది. తన కూతురు కోసం తండ్రి అల్పాహారం సిద్ధంచేస్తున్నట్లు మరో పేజీలో డ్రాయింగ్ ఉంది. ఇంటి పనిలో పురుషులు ఎంత బాధ్యతగా ఉండాలని ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయని నెటిజన్లు మెచ్చుకున్నారు. -
Health: కడుపులోని బిడ్డ జాగ్రత్త!
కర్నాటక ప్రభుత్వం అల్ట్రాస్కానింగ్ గదిలోకి గర్భిణులతోపాటు వచ్చే అటెండర్స్ను నిషేధిస్తూ సర్క్యులర్ తెచ్చింది. ప్రతి తల్లి తన కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్లైనా మగపిల్లాడైనా కనడానికి సిద్ధంగా ఉంటుంది. కాని అటెండర్స్ రూపంలో వచ్చే అయినవాళ్లు అల్ట్రాస్కానింగ్ని వీడియో తీసి లింగ నిర్థారణ చేయిస్తున్నారు. తర్వాత అబార్షన్ చేయిస్తున్నారు. ఇలా ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదో. కర్నాటక మేలుకొంది. ఆ రాష్ట్రం తీసుకున్న మరిన్ని జాగ్రత్తలు..హర్యాణలోని జాట్ కుటుంబంలో యోగ్యుడైన వరునికి తగిన వధువు కోసం 3000 కిలోమీటర్ల దూరంలో కూడా వెతుకుతున్నారనే వార్తలు వస్తున్నా కానీ ఆడశిశువుల భ్రూణ హత్యల విషయంలో మనలో మార్పు రావడం లేదు. 2000 సంవత్సరం నుంచి 2019లోపు మన దేశంలో 90 లక్షల మంది ఆడపిల్లలు భ్రూణ హత్యల ద్వారా పుట్టకుండానే మరణించారని ఒక అధ్యయనం చెబుతోంది.2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్, హర్యాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో 120 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలే ఉన్నారు. లెక్కలు ఇంత భయపెడుతున్నా నేటికీ ఒడిశా, కర్నాటక రాష్ట్రాలలో లింగ నిర్థారణ జరిపించి మరీ ఆడపిల్లలను ఛిద్రం చేస్తూనే ఉన్నారు. తాజాగా కర్నాటకలోని మాండ్య జిల్లాలో ఈ రాకెట్ ఒకటి బట్టబయలు కావడంతో ప్రభుత్వం మేల్కొని కొత్త నియమ నిబంధనలు తెచ్చింది.చట్టం ఉన్నా...ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయగ్నొస్టిక్ టెక్నిక్స్ (పిసిపిఎన్డిటి) యాక్ట్ 1994 (లింగ నిర్థారణ నిషేధ చట్టం) కింద లింగ నిర్థారణ చేయించేవారికి గరిష్టంగా 5 సంవత్సరాల కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా ఉన్నా కొందరు ఎప్పటికప్పుడు దొంగదారులు కనిపెడుతూనే ఉన్నారు. ఇటీవల కర్నాటకలో లింగ నిర్థారణ నిషేధ చట్టం అమలులో భాగంగా రేడియాలిజిస్ట్లు, గైనకాలజిస్ట్‌లతో ఒక వర్క్‌షాప్ జరిగినప్పుడు వారు కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.– పేషెంట్లతోపాటు అటెండర్ల పేరుతో బంధువులు లోపలికి వస్తున్నారు.– అల్ట్రాసౌండ్ స్కానింగ్‌ను తమ మొబైల్ కెమెరాలలో బంధిస్తున్నారు.– సింగపూర్, థాయ్‌లాండ్, దుబాయ్ దేశాలలో లింగ నిర్థారణ నేరం కాదు.– కొందరు ఒక రాకెట్లాగా ఏర్పడి ఆ వీడియోలను ఈ దేశాలలోని వైద్యులకు పంపి లింగ నిర్థారణ చేయిస్తున్నారు. ఆ తర్వాత అబార్షన్లు చేయిస్తున్నారు.తాజాగా మాండ్యాలో ఇలాంటి రాకెట్‌ను పోలీసులు ఛేదించి పట్టుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం వెంటనే కొత్త సర్క్యులర్ జారీ చేసింది.ఇతరులు రాకూడదు..– అల్ట్రాసౌండ్ గదిలోకి గర్భిణితోపాటు ఇకపై అటెండర్లు రాకూడదు. వారికి ప్రవేశం లేదు.– గర్భిణి తన ఆల్ట్రాసౌండ్ పరీక్షను గమనించేలాగా గతంలో అడిషనల్ స్క్రీన్ గదిలో ఉంచేవారు. ఇకపై ఆ స్క్రీన్ ఉండదు. అంటే గర్భిణి తన అల్ట్రాసౌండ్ పరీక్షను చూడటానికి అనుమతి లేదు. ఎందుకంటే కొందరు రేడియాలజిస్ట్‌లు డబ్బుకు కక్కుర్తి పడి ఒక మాట గాని, చర్యగాని లేకుండా గర్భిణులకు అర్థమయ్యేలా పాయింటర్‌తో చూపుతున్నారు.ఆడపిల్లలు చదువులో అద్భుతంగా రాణిస్తున్నా, ఉపాధి అవకాశాలు పొందుతున్నా, క్రీడల్లో పతకాలతో మెరుస్తున్నా, రాజకీయ పదవులు పొందుతున్నా, ఉన్నతోద్యోగాలు చేస్తున్నా ఇంకా ‘కొడుకు’ కావాలనే కోరిక చాలామంది తల్లిదండ్రులను పీడిస్తోంది. ఆ భావజాలం నుంచి కొద్దిగా బయటడినా చాలామంది ఆడపిల్లలు బతికి΄ోతారు. బంగారు దేశాన్ని నిర్మిస్తారు.ఇవి చదవండి: Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు! -
సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్నాలజీ రంగంలో లింగ అసమానతలు గణనీయంగా ఉంటున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. మహిళలంటే ఉపాధ్యాయ వృత్తిలాంటివి మాత్రమే చేయగలరంటూ స్థిరపడిపోయిన అభిప్రాయాలే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ రంగంలో మహిళల వాటా 36 శాతమే ఉండగా, స్టెమ్ గ్రాడ్యుయేట్స్‌లో 43 శాతం, మొత్తం సైంటిస్టులు, ఇంజినీర్లు, టెక్నాలజిస్టుల్లో 14 శాతం మాత్రమే ఉందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ’ గాల్స్ ఇన్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈషా తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో పరిస్థితిని సరిదిద్దుకునే అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. -
ట్రాన్స్‌జెండర్‌కు ఘోర అవమానం!
మహారాష్ట్రకు చెందిన తొలి మరాఠీ లింగమార్పిడి (ట్రాన్స్ జెండర్) నటి ప్రణీత్ హట్టే ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఒక హోటల్లో రూమ్ బుక్ చేశారని, అయితే తాను ట్రాన్స్‌ను అయినందున సదరు హోటల్ తన బుకింగ్‌ను రద్దు చేసిందని వాపోయారు. ఈ ఘటనపై తన ఆవేదనను ఆమె ఒక వీడియోలో పంచుకున్నారు.దానిలో ప్రణీత్ హట్టే మాట్లాడుతూ ‘నేను నాసిక్‌కు ఒక షోలో పాల్గొనేందుకు వచ్చాను. ఇక్కడ ఉండేందుకు ఓ హోటల్లో రూమ్ బుక్ చేశాను. అయితే నేను ట్రాన్స్‌జండర్‌ను అయినందున హోటల్ యజమానులు నా రూమ్ బుకింగ్‌ను రద్దు చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి?’ అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసిన ప్రణీత్ హట్టే అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక యూజర్ ‘నేను ఇప్పుడే ఫోన్ చేసి హోటల్వారితో మాట్లాడాను. వారు ఇప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడివుంటారు’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని రాశారు.ప్రణీత్ హట్టే మరాఠీ నటి. ఆమె మరాఠీ చిత్రం ‘కరభారి లయభరి’లో గంగ పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రం ‘హడ్డీ’లో కూడా ప్రణీత్ కనిపించారు. -
వనిత ప్రగతి పరుగు?!
"ఆడాళ్ళు మీకు జోహార్లు .. ఓపిక,ఒద్దిక మీ పేర్లు- మీరు ఒకరి కంటే ఒకరు గొప్పోళ్ళు.." - ఆచార్య ఆత్రేయ. అది అక్షరాలా నిజం. 'క్షమయా ధరిత్రి' అన్న ఆర్యోక్తికి మరోరూపం ఇచ్చారు ఆచార్యులవారు. ప్రతి రంగంలోనూ ఒకరిని మించి మరొకరు దూసుకెళ్తునే ఉన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ ఇలా చమత్కరించారు. "ఆడవాళ్లు - మగవాళ్లు ఇద్దరూ సమానమే,కాకపోతే మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం". ముళ్ళపూడివారి మాటలు కూడా నిజాన్ని ప్రతిబింబించేవే. 'ఆకాశంలో సగం' అనే మాట వినడానికి అందంగానే ఉంటుంది కానీ, ఆచరణలో అన్నింటా ఆడవాళ్లకు సగభాగం దొరుకుతోందన్నది అర్ధసత్యం. ఇప్పటికీ ప్రపంచంలో స్త్రీ ఎక్కువ గౌరవాలు పొందుతున్నది మన భరతభూమిలో అన్నది కాదనలేని నిజం. కొంత ఛాందసాలు, చాదస్తాలు రాజ్యమేలుతున్నా, మన వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు మనల్ని మిగిలినవారి కంటే భిన్నంగా నిలుపుతున్నాయి. బంధాలు, బాంధవ్యాల వీచికలు ఇంకా వీస్తూనే ఉన్నాయి. ప్రతి మార్చి 8వ తేదీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకోవడంతోనే సరిపోదు. నిజమైన పండుగ వారి గుండె గుడిలో నిండుగ ఉదయించాలి. ఈ వేడుకను ఒకొక్క దేశంలో ఒకొక్క రకంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కాకమునుపే అమ్మను అమ్మవారుగా నిత్యం కొలిచే ఆచారం మనకు వేళ్లూనుకొని వుంది.అదే సమయంలో కష్టాలు,కన్నీళ్లు,బానిసత్వం, అణగదొక్కే విధానం,ఆచారాల పేరిట అసమానతలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక సమాజంలోనూ ఆటవిక పోకళ్ళు వదలడం లేదు.'నిర్భయ' చట్టాల వంటివి ఎన్ని వచ్చినా,ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే రోజులు ఇంకా రాలేదు. అక్షరాస్యత పెరుగుతున్నా,అరాచకాలు ఆగడంలేదు.ఉద్యోగిత పెరుగుతున్నా సమానత ఇంకా సాధ్యమవ్వలేదు. ఓటు హక్కు వచ్చినా,చట్ట సభల్లో మహిళలు ఇంకా ఆమడ దూరంగానే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించినా, ఆచరణకు ఏళ్ళుపూళ్ళు పట్టేలా వుంది. శాసనాలు చేసే అధికారం రావాలంటే ఇంకా చాన్నాళ్ళు ఆగాల్సిందే.అప్పటిదాకా శాసించే శక్తి మగవాళ్ల దగ్గరే వుంటుంది. ప్రజాస్వామ్యం,రాజ్యాంగం అందించిన అవకాశాలతో మహిళామణులు రాష్ట్రపతి , స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అందుకున్నా, అది సరిపోదు.సమత, సమతుల్యత ఇంకా సాధించాల్సి వుంది. ఇంకొక వైపు వరకట్నపు చావులు, అత్తారింటి వేదింపులు ఆగకుండా సాగుతూనే ఉన్నాయి. 'స్త్రీలకు స్త్రీలే శత్రువులు' అన్నది ఇంకా వీడడం లేదు. లింగవివక్ష నుంచి పూర్తిగా బయటపడే తరుణం కోసం తరుణులంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్ధిక స్వేచ్ఛ,సమానత్వం కోసం ఎదురుతెన్నులు కాస్తూనే ఉన్నారు.కార్మిక సంఘాలు ఏర్పడినా,చట్టాలు వచ్చినా మహిళా కార్మికులు,కర్షకుల వేతనాల చెల్లింపుల్లో అన్యాయం జరుగుతూనే ఉంది.1991లో భారతదేశం సరళీకరణ ఆర్ధిక విధానాల వల్ల ప్రైవేట్ రంగం ఎంతో బలపడింది.ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి కానీ, ఎంపిక ప్రక్రియలో అసమానత అలాగే ఉంది.సాఫ్ట్ వేర్ రంగం మాత్రం కాస్త నయం.అమ్మాయిలను తరలించే (విమెన్ ట్రాఫికింగ్) విషవ్యాపారం,బాలికలపై అత్యాచారాలు యదేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. గ్రామీణ మహిళా సాధికారత ఎంతో పెరగాల్సి ఉంది. పేదరిక విముక్తి, ఆకలి నిర్మూలనకు ముగింపు వాక్యాలు పలకాల్సి ఉంది. 'పని సంస్కృతి' (వర్క్ కల్చర్ ) మారుతున్న క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులకు తగినట్లుగా సౌకర్యాలు పెరగాలి. 100 సంవత్సరాల పై నుంచీ 100 దేశాలకు పైగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదాన్ని వినిపిస్తున్నారు. అవి నినాదాల దశ దాటి ఆచరణ దశకు చేరుకోవడం లేదు. కొంత అభివృద్ధి, ప్రగతి చోటుచేసుకున్నప్పటికీ సమగ్రత,సంపూర్ణత సాధించాల్సి ఉంది. 'లింగ సమానత్వం సాధించడం' 2022 సంవత్సరంలో ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ డిజిటల్ యుగంలో, 'నవీనత్వం - సాంకేతికతలో లింగ వివక్షలేని సమానత్వం' 2023 ఎజెండాగా కల్పన చేసుకున్నారు. ' ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ - యాక్సలరేట్ ప్రోగ్రెస్ '- 2024 ఎజెండాగా పెట్టుకున్నారు. మహిళా సాధికారితను సాధించడానికి ఇంకెన్నాళ్లు పోరాడాలి? అనుకున్నది జరగాలి, ఈ పోరాటం ఆగాలి అన్నది మహిళాలోకం కోరుకుంటున్నది. మహిళా ప్రగతి వేగం పెరగాలని ఈ ఏటి ప్రధాన ఎజెండా. వినడానికి ఎజెండాలు ఎప్పుడూ బాగానే వుంటాయి. ఆచరణలో ఎక్కడ? అనే ప్రశ్నలు ఉదయించడం మానడంలేదు. మరోపక్క...స్త్రీలు అబల దశ నుంచి సబల దశకు చేరుకుంటూనే ఉన్నారు.అనేక రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. కొన్ని రంగాల్లో మించి పోతున్నారు. ఇది పూర్తిగా మహిళామణుల స్వయంకృషి,పట్టుదల, దీక్షాదక్షతలు మాత్రమే. అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్నారు. సవాళ్లు, దాడులు ఎదుర్కొని నిలుస్తున్నారు.కాకపోతే, సమానత్వంలో సమగ్రత సాధించాలి. మహిళాలోకం వెలగాలి, వెలుగులు పంచాలి (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మా శర్మ స్పెషల్ స్టోరీ..) - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
మహిళా దినోత్సవం: మహిళల ప్రాతినిథ్యం ఎలా ఉంది?
ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెరుగుపడిందని సంబరపడిపోతాం. అయినప్పటికీ ఇంకా చాల చోట్ల మహిళలు కొన్ని అంశాల్లో వెనుకంజలోనే ఉన్నారని వివక్షను ఎదుర్కొంటున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ మహిళల ప్రాతినిధ్యం ఎలా ఉంది?. వారి స్థితి మెరుగు పడిందా? అనే విషయాల గురించి ఈ దినోత్సవం సందర్భంగా కూలంకషంగా తెలుసుకుందామా!. ప్రపంచ ఆర్థిక వేదిక ( వరల్డ్ ఎకనామిక్ ఫోరం ) 2023 సంవత్సరానికి వెలువరించిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారతదేశం 0.643 స్కోర్‌తో 127వ స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరం కంటే ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. అన్ని రంగాల్లో లింగ భేదాన్ని తొలగించడంలో భారతదేశం 64.3% ముందంజ వేసినా, పురుషుల ఆర్థిక భాగస్వామ్యంలో, ఆర్థిక అవకాశాల్లో 36.7% సాఫల్యాన్ని మాత్రమే సాధించిందని వివరించింది. 146 దేశాల లింగ సమానత్వ సూచీలో ఐస్లాండ్ వరుసగా 14వ సారి అగ్రస్థానానంలో ఉంది. పొరుగు దేశం బంగ్లాదేశ్ 59వ స్థానంతో మెరుగైన ఫలితాన్ని సాధించింది. అయితే భారత్ లింగ సమానత్వంలో బెటర్‌గా ఉన్నా.. కొన్ని విషయాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఏయో వాటిలో మెరుగవ్వాల్సి ఉందంటే.. మహిళల విద్య!: భారతదేశంలో మహిళా విద్య అనేది దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే అంశంగా ఉంది. ఎందుకంటే ఈ విషయంలో భారత్ భాగా వెనుకబడి ఉండటమే. పురుషులతో సమానంగా చదువుకునేందుకు మహిళలకు హక్కులు ఉన్నా తరతరాలుగా వేన్నేళ్లుకు పోయిన భావనల కారణంగా పురుషులే అత్యధికంగా విద్యావంతులుగా ఉంటున్నారు. ఇప్పటకీ అక్షరాస్యతలో 2021 నాటి లెక్కల ప్రకారం.. స్త్రీల అక్షరాస్యత రేటు 70.3% కాగా, పురుషుల అక్షరాస్యత రేటు 84.7%గా ఉంది. సామాజిక ఒత్తిళ్లు, పేదరికం, బాల్య వివాహాలు తదితర కారణాల కారణంగా నిర్భంధ విద్యహక్కుకు దూరమవ్వుతున్నారని చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టి విద్యనందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పలు కార్యక్రమాలతో మహిళా సాధికారత కోసం ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్కాలర్షిప్లు వంటివి అందిస్తున్నాయి కూడా. అయినప్పటికి పలుచోట్ల బాలికలు విద్యకు దూరమవుతుండటం బాధకరం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా పురుషుల అక్షరాస్యత రేటు 90% ఉండగా, స్త్రీలు 82.7%తో కొంచెం వెనుకబడి ఉన్నారు. దేశాల పరంగా చూస్తే..అభివృద్ధి చెందిన దేశాలు సాధారణంగా వయోజన అక్షరాస్యత రేటు 96% లేదా అంతకంటే ఎక్కువ. దీనికి విరుద్ధంగా, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు అక్షరాస్యత రేటు 65% మాత్రమే ఉండటం గమనార్హం. ఏ దేశాలు మెరుగ్గా ఉన్నాయంటే.. రష్యా, పోలాండ్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, క్యూబా, అజర్బైజాన్, తజికిస్తాన్, బెలారస్ మరియు కిర్గిజ్‌స్థాన్‌లు స్త్రీ పురుషుల అక్షరాస్యత రేటు 100% కలిగి ఉన్నాయి. తక్కువగా ఉన్న దేశాలు: చాద్, మాలి, బుర్కినా ఫాసో, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజర్, సోమాలియా, గినియా, బెనిన్ వంటి దేశాలు ఈ విషయంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో అక్షరాస్యత రేటు 27% నుంచి 47% వరకు ఉంది. వ్యత్యాసం ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 781 మిలియన్ల పెద్దలలో మూడింట రెండు వంతుల మంది స్త్రీలు చదవడం లేదా వ్రాయడం రాని ఉన్నారు. తక్కువ-అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే పురుషులు ఉద్యోగాలు చేస్తుండగా, మహిళలు వంటింటికి పరిమితమవ్వుతున్నారు. మహిళా అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉన్న దేశాలు: తైవాన్ 99.99% మహిళా అక్షరాస్యత రేటుతో ముందంజలో ఉండగా, 99.98%తో ఎస్టోనియా తర్వాత స్థానంలో ఉంది. ఇక ఇటలీ మూడో స్థానంలో ఉంది. స్త్రీలు అక్షరాస్యతలో మెరుగుపడితే, ఆర్థికపరంగా, ఉద్యోగాల్లోనూ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడే లింగ సమానత్వానికి సరైన నిర్వచనం ఇవ్వగలం. ఈ మహిళల అక్షరాస్యతలో అసమానతను పరిష్కరించడం అనేది అత్యంత కీలకమైనది. ఇదే స్త్రీలను శక్తిమంతంగా మార్చి సాధికారతవైపుకి అడుగులు వేయించి దేశాన్ని ప్రగతి పథంలోకి దూసుకుపోయేలా చేస్తుంది. (చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) -
South Korea: మాతృత్వానికి దూరం.. దూరం!
ఆమె పేరు యెజిన్. టీవీ యాంకర్. ఓ సాయం వేళ స్నేహితురాళ్లతో సరదాగా గడుపుతుండగా మొబైల్లో ఓ పాపులర్ మీమ్ ప్రత్యక్షమైంది. ‘మాలా మీరూ అంతరించిపోకముందే జాగ్రత్త పడండి’ అని ఓ కార్టూన్ డైనోసార్ హితబోధ చేయడం దాని సారాంశం. దాంతో వారందరి మొహాల్లోనూ విషాద వీచికలు. 30 ఏళ్లు దాటుతున్నా వారెవరికీ ఇంకా పిల్లల్లేరు మరి! వారే కాదు, లో చాలామంది మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడి సమాజంలోని సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణం...! దక్షిణ కొరియా చాలా ముందుంది. దాంతో ఆడవాళ్లలో అత్యధికులు ఉద్యోగులే. ఇంటిపట్టున ఉండేవారు చాలా తక్కువ. అయితే అక్కడ ఏ రంగంలోనైనా పని ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. సుదీర్ఘ పనిగంటలు. పైగా తరచూ ఓవర్ టైమ్ చేయడం తప్పనిసరి. నిరాకరిస్తే ఆ ప్రభావం ప్రమోషన్లతో పాటు చాలారకాలుగా పడుతుంది. దాంతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చే భర్తలు పిల్లల బాధ్యతలను అస్సలు పంచుకోరు. పైగా వేతనాలతో పాటు చాలా అంశాల్లో మితిమీరిన. దీనికి తోడు దాల్ చేసేలా కంపెనీలు ఒత్తిడి చేయడం సర్వసాధారణం. దాంతో పిల్లల్ని కనే క్రమంలో కెరీర్ ఒకసారి వెనకబడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అదీగాక దక్షిణ కొరియాలో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య పిల్లల్ని కని, సజావుగా పెంచేందుకు కావాల్సిన సమయం, ఓపిక, కుటుంబ మద్దతు మహిళలకు ఏ మాత్రమూ ఉండటం లేదు. పిల్లలు, కెరీర్లో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి. అత్యధికులు రెండో ఆప్షన్‌కే ఓటేస్తున్నారు. అలా మొత్తంగా మాతృత్వానికే దూరమవుతున్నారు! అట్టడుగుకు జననాల రేటు ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింట్లోనూ చాలాకాలంగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ దక్షిణ కొరియాలో ఈ ధోరణి మరీ ప్రమాదకరంగా ఉంది. నిజానికి అతి తక్కువ జననాల రేటు విషయంలో 20 ఏళ్లుగా ఆ దేశానిదే ప్రపంచ రికార్డు! పైగా అది ఏటికేడు మరింతగా తగ్గుతూ వస్తోంది. తాజాగా బుధవారం విడుదలైన గణాంకాలైతే ప్రమాద ఘంటికలే మోగిస్తున్నాయి. 2023లో అక్కడ జననాల రేటు (ఒక మహిళ జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్య) 8 శాతం తగ్గి కేవలం 0.73గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి దేశ జనాభా సగానికి సగం తగ్గిపోనుంది. దాంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది! ఫలించని ప్రోత్సాహకాలు... పిల్లల్ని కనేలా జనాలను ప్రోత్సహించేందుకు దక్షిణ కొరియాలో ప్రభుత్వాలు చేయని ప్రయత్నాల్లేవు. నగదు ప్రోత్సాహకం, ఇంటి కొనుగోలుపై సబ్సిడీ, పిల్లలను చూసుకునేందుకు ఉచితంగా ఆయా సదుపాయం వంటివెన్ని ప్రకటించినా లాభముండటం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించనంత కాలం ఇటువంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఒరిగేదేమీ ఉండబోదని సామాజికవేత్తలు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nishtha Satyam: సత్య నిష్ఠతో...
వివక్ష అనేది ఎక్కడో ఉండదు. మన చుట్టూనే పొంచి ఉంటుంది. అలాంటి వివక్షను సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది నిష్ఠా సత్యం. స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై నిష్ఠగా పనిచేస్తోంది... బాలీవుడ్ సినిమా ‘మొహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాట యువ గళాల్లో ఎక్కువగా వినిపిస్తున్న కాలం అది. అందరిలాగే తాను కూడా ఆ పాట హమ్ చేస్తోంది నిష్ఠ. ఆమె తండ్రికి విపరీతమైన కోపం వచ్చి ‘నువ్వు ఎలాంటి పాట పాడుతున్నావో తెలుసా’ అంటు తిట్టాడు. చిన్నపాటి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. ‘సరదాగా రెండు లైన్లు పాడినందుకు ఇంత రాద్ధాంతమా?’ అనుకుంది నిష్ఠ. ఒకవేళ ఈ పాట అబ్బాయి పాడి ఉంటే ఇలాగే జరిగి ఉండేదా? ‘జరగదు’ అని బలంగా చెప్పవచ్చు. ఈ సంఘటన ఒక్కటే కాదు పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న కాలంలోనూ లింగవివక్షను ఎదుర్కొంది నిష్ఠ. మల్టీనేషనల్ కంపెనీ కేపీఎమ్‌జీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఎకానమిస్ట్‌గా పనిచేసిన నిష్ఠా సత్యం ఐక్యరాజ్య సమితిలోకి అడుగు పెట్టింది. ఐక్యరాజ్యసమితిలో పాట్నర్‌షిప్ అడ్వైజర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన నిష్ఠ డిప్యూటీ హెడ్ హోదాలో పనిచేసింది. ఆ తరువాత యూఎన్ ఉమెన్ మిషన్ హెడ్– తిమోర్–లెస్తే బాధ్యతలు చేపట్టింది. ‘రెండు విధాలుగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించాలి. ఒకటి డిఫాల్ట్ సెట్టింగ్ రెండోది డిజైన్ సెట్టింగ్. డిజైన్ సెట్టింగ్ అనేది పురుషుల నుంచి వచ్చింది. వారికి అనుకూలమైనది’ అంటుంది నిష్ఠ. స్మార్ట్ ఫోన్ల సైజ్ నుంచి పీపీయీ కిట్స్ వరకు మార్కెట్లో ఉన్న ఎన్నో వస్తువుల డిజైన్లు మహిళలకు అనుకూలంగా లేకపోవడంలోని వివక్షను ప్రశ్నిస్తుంది నిష్ఠ. ‘సాంస్కృతిక సందర్భాలు వివిధ మార్గాలలో మహిళలను శక్తిమంతం చేస్తాయి. సాధికారతకు సంబంధించి మన ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దడంలో అర్థం లేదని తిమోర్–లెస్తే మహిళల నుంచి నేర్చుకున్నాను’ అంటుంది నిష్ఠా సత్యం. -
అబ్బాయిగా మారిన లేడి కానిస్టేబుల్.. తండ్రిగా ప్రమోషన్
మహారాష్ట్రకు చెందిన మహిళా కానిస్టేబుల్. ఎన్నో కష్టాలు పడి మగవాడిలా మారింది. కుటుంబాన్ని, సమాజాన్ని ఎదురించి పురుషుడిగా సర్జరీ చేయించుకుంది. తర్వాత కొన్నాళ్లకు ఓ యుతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ జంట బిడ్డకు జన్మనివ్వడంతో.. కానిస్టేబుల్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. వివరాలు.. బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన లలితా సాల్వే(35) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. 25 ఏళ్ల వయసులో (2013) తన శరీరంలో మార్పులు రావడాన్ని గమనించింది. ఆసుప్రతికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోగా.. ఆమెలో మగవారిలో ఉండే వై క్రోమోజోమ్‌లు ఉన్నట్లు తేలింది. (ఆడవారిలో రెండు ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి). జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్న ఆమెకు లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో లలితా సాల్వే 2017లో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. బాంబే హైకోర్టుతోపాటు 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతివ్వడంతో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు మూడు సర్జరీల ద్వారా పురుషుడిగా మారింది. దీంతో లలితా నుంచి తన పేరును లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకుంది. అనంతరం 2020లో ఛత్రపతి శంభాజీనగర్‌కు (ఔరంగాబాద్) చెందిన సీమాను పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వివాహమైన నాలుగేళ్ల తర్వాత జనవరి 15న ఆ జంటకు బాబు పుట్టాడు. చదవండి: Video: అకస్మాత్తుగా కూలిన అయిదు అంతస్తుల భవనం లలిత్ సాల్వే మాట్లాడుతూ.. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అనేక పోరాటాలు చేసి చివరికి తన జెండర్ మార్చుకునట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. -
టెక్కీ దారుణ హత్య.. హద్దుల్లేని ప్రేమ పరిణామాలు ఇలాగే ఉంటాయా?
చెన్నై శివారులోని తాలంబూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి నందినిని స్నేహితురాలు మహేశ్వరి అలియాస్ వెట్రిమారన్ దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. నందినిని ప్రేమించిన మహేశ్వరి ఆరునెలల కిందటే అబ్బాయిగా మారి వెట్రిమారన్‌గా పేరు మార్చుకుంది. తన కోసమే లింగమార్పిడి చేసుకున్న తనను నందిని దూరంగా పెడుతుందన్న కోపంతో హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్నేహితుడు లేదా స్నేహితురాలి కోసం లింగమార్పిడి చేసుకున్న తర్వాత తనను పట్టించుకోకపోవడం, వేరొకరితో సన్నిహతంగా ఉండటంతో దాడులు చేసిన ఘటనలు గతంలోనూ వార్తల్లో కనిపించాయి. ఈ నేపథ్యంలో లింగమార్పిడి చుట్టూ ఉన్న సామాజిక సంక్లిష్టతల గురించి, ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం చూపించే తిరస్కరణ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కొందరు వ్యక్తులు జెండర్ ఐడెంటిటీలో ఎందుకు గందరగోళ పడతారనేది సంక్లిష్టమైన ప్రశ్న. దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. జెండర్ ఐడెంటిటీకి జీన్స్ కు మధ్య సంబంధాలను అనేక అధ్యయనాలు గుర్తించాయి. అయితే నిర్దిష్టంగా ఏ జీన్స్ కారణమనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు చిన్ననాటి అనుభవాలు, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు ఒక వ్యక్తి జెండర్ ఐడెంటిటీకి దోహదపడతాయి. అంటే ఒక వ్యక్తి ట్రాన్స్ జెండర్‌గా మారడమనేది వారి ఎంచుకున్నది కాదనేది గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ‘మగ’ లేదా ‘ఆడ’ వర్గాల్లోనే కాకుండా మధ్యలో కూడా ఉండవచ్చు. వారి జెండర్ ఐడెంటిటీని గుర్తించడం, వారు గౌరవంగా జీవించడానికి సహకరించడం అవసరం. అలా జరగనప్పుడు, ఆ గుర్తింపు గౌరవం దొరకనప్పుడు తీవ్రంగా గందరగోళ పడతారు. మానసిక సమస్యలకు లోనవుతారు. తమ సమస్యలకు కారణమైన వారిపై దాడికి కూడా పాల్పడవచ్చు. ఒక వ్యక్తికి ఐడెంటిటీ అనేది ఎంత ముఖ్యమో తెలుసుకుంటే జెండర్ ఐడెంటిటీ ప్రాధాన్యం తెలుస్తుంది. ఉదాహరణకు నా పేరు విశేష్. నేను Psy.Vishesh అని రాస్తా. అంటే సైకాలజిస్ట్ గా నా ప్రొఫెషన్ తో ఐడెంటిఫై చేసుకుంటున్నా. నన్ను అలా పిలిస్తేనే నాకు ఇష్టం, మరోలా పిలిస్తే కష్టంగా ఉంటుంది. పేరు విషయంలోనూ ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు.. బాలికగా పుట్టిన వ్యక్తిలో పురుష భావనలు ఉంటే మనసులో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అలాంటి భావనలను సమాజమే కాదు కుటుంబం కూడా ఒప్పుకోదు. అలాంటి పరిస్థితుల్లో తనను పురుషుడిగా అంగీకరించిన స్నేహితురాలు దొరికితే అంతకంటే ఆనందం ఉండదు. ఆ స్నేహితురాలిని, ఆ స్నేహాన్ని శాశ్వతంగా తనది చేసుకోవాలనుకుంటారు. పురుషుడిగా మారితే నందిని తనను అంగీకరిస్తుందనే, పెళ్లిచేసుకుంటుందనే ఆశతో లేదా అపోహతో మహేశ్వరి లింగమార్పిడి చేయించుకుని వెట్రిమారన్‌గా మారింది. కానీ నందిని దూరంగా ఉంచడం మారన్ మనసులో కల్లోలం రేపి ఉండవచ్చు. తనకోసం, తన ప్రేమ కోసం, తనతో జీవితం గడపడంకోసం లింగమార్పిడి సైతం చేయించుకున్నా దూరంగా పెట్టడంతో నందినిపై కోపం ఏర్పడి ఉండవచ్చు. ఆ కోసం హద్దులు దాటి నందిని హత్యకు దారితీసి ఉండవచ్చు. కోరుకున్నది దక్కనప్పుడు అందరూ ఒకేరీతిలో స్పందించరు. కొందరు తీవ్ర డిప్రెషన్‌కు లోనైతే, మరికొందరు ఫ్రస్ట్రషన్, అగ్రెషన్ కు లోనవుతారు. కారణమైన వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటారు. అప్పటికే జెండర్ ఐడెంటిటీ సమస్యలో ఉన్నవారిలో ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్ర భావోద్వేగాలకు కారణమవుతాయి. అప్పటికే సమాజం నుంచి తిరస్కరణ ఎదుర్కొంటున్న వ్యక్తి మనసులో ప్రేమించిన వ్యక్తి తిరస్కరణ మరింత బలమైన గాయాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇలాంటి హింసాత్మక ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. నందిని హత్య నిస్సందేహంగా బాధాకరం. అయితే ఆ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం పోకడను మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జెండర్ ఐడెంటిటీ అనేది ఏ ఒక్కరి ఎంపిక కాదని, కొందరిలో అది భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆడ, మగలతో పాటు ట్రాన్స్ జెండర్స్‌కు కూడా గౌరవంగా జీవించే హక్కు ఉందని గుర్తించాలి. వారి సమస్యలను సహానుభూతితో అర్థం చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీ ద్వారా వారి సమస్యల పరిష్కారానికి వీలైన సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు తగ్గుతాయని అందరం అర్థం చేసుకోవాలి. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com 8019 000066 -
ఇంకా లింగ వివక్ష: సీజేఐ
బెంగళూరు: ప్రాంతీయ భేదాలకు అతీతంగా చాలా కుటుంబాల్లో నేటికీ లింగ వివక్ష సూక్ష్మ రూపంలో కొనసాగుతూనే ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. పైగా వాటిని ఎవరూ ప్రశ్నించరాదన్న ధోరణి కూడా గూడుకట్టుకుని పోయిందని ఆక్షేపించారు. ‘‘ఎవరు ఔనన్నా, కాదన్నా చేదు నిజం మాత్రం ఇదే. పైగా న్యాయస్థానాలు వ్యక్తిగత స్వేచ్ఛ కంటే వివాహ వ్యవస్థను నిలబెట్టడానికే ప్రాధాన్యతనిస్తూ రావడం ద్వారా దీనికి కొంతవరకు పరోక్షంగా ఆమోదముద్ర వేశాయి’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో ఆయన జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య శతాబ్ది స్మారక ప్రసంగం చేశారు. సంతానంలో ఒకరికి మించి పై చదువులు చదివించలేకపోతే అత్యధిక కుటుంబాల్లో ఆ అవకాశం కచి్చతంగా మగ సంతానానికే దక్కుతుంది. స్త్రీకి ఉండే ఆంక్షలు, ఒత్తిళ్లు మగవాడికి ఉండవన్నది కూడా వాస్తవం’’ అని సీజేఐ అన్నారు. -
భారత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య ఇదే
పురుషుల మాదిరిగానే మహిళలు కూడా ప్రజా సదుపాయాలకు అర్హులని ఐఏఎస్ అధికారి శరణ్య అరి పేర్కొన్నారు. స్మిళిత పట్టణ ప్రణాళిక భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య అని లింగసమానత్వంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని పార్క్ హయాత్ హోటల్లో జరిగిన TEDx (టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ అండ్ డిజైన్) కార్యక్రమంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. సమ్మిళిత పట్టణ ప్రణాళిక భారతీయ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ సమస్య. మహిళలు పని కోసం 5 నుంచి 8 కి.మీల వరకు నడకను ఎంచుకుంటారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజా సౌకర్యాలు మహిళలకు ఉపయోగకరంగా ఉండవు. వియన్నాలో 90 శాతం కార్యాలయాలు మహిళలకు అనుకూలంగా రూపొందించబడ్డాయి. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా సరైన రకమైన ప్రజా సదుపాయాలకు అర్హులు కాదా?అభివృద్ధిలో మహిళలను కూడా భాగస్వాములను చేయండి. బహిరంగ ప్రదేశాల్లో భద్రత లింగ సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా మహిళల అవకాశాలను మెరుగుపర్చవచ్చు అంటూ ఆమె పేర్కొన్నారు. ఇక తన కెరీర్లో గత 15 ఏళ్లుగా అంగవైకల్యం ఉన్న ప్రత్యేక వ్యక్తులను తన సిబ్బందిని నియమించుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు సస్టైనబిలిటీ/ఇఎస్జి ఇనిషియేటివ్స్ లీడర్ ఆరాధన. మాజంలోని మహిళలు, అంగవైకల్యం ఉన్నవారు..ఇలా అందరిని కలుపుకొని పోవడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని, ఇది సంస్థలకు కూడా మేలు చేస్తుందని ఆమె తెలిపింది. సామాజిక ప్రయోజన సంస్థల్లో కేవలం 19% మహిళలు మాత్రమే నాయకత్వం వహిస్తున్నారని, పురుషులకు సమానంగా మహిళలకు కూడా అవకావాలు కల్పించాలని ఆమె తెలిపింది. -
ఆలోచన రేపుతున్న ఎంపిక
ఏటా ఇచ్చే పురస్కారాలు సైతం విజేతల ఎంపిక, వారు చేసిన కృషి రీత్యా విశిష్టంగా నిలుస్తాయి. రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఈ ఏడాదికి గాను ఇప్పటి దాకా ప్రకటించిన పురస్కారాల్లో కొన్ని అలాంటివే! స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ అనే పేరు కన్నా ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఇచ్చే ‘నోబెల్ పురస్కారం’గానే ప్రసిద్ధమైన ఈ గౌరవం దక్కిన ఇద్దరు మహిళల గురించి ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి కనబరుస్తోంది. మహిళా శ్రామికశక్తిపై విస్తృత పరిశోధన జరిపిన ఆర్థిక శాస్త్రవేత్త క్లాడియా గోల్డిన్‌కు అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్, అలాగే ఇరాన్లో జైలులో మగ్గుతున్న మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గిస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కడం వారు దీర్ఘకాలంగా చేస్తున్న కృషికి అతి పెద్ద అంతర్జాతీయ గుర్తింపు. ఈ ఇద్దరి ఎంపిక వేతనాల్లో స్త్రీ పురుష వ్యత్యాసం మొదలు లింగ సమానత్వం దాకా అనేక అంశాలపై మరోసారి చర్చ రేపుతోంది. గోల్డిన్ కృషికి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కడం బాగున్నా, అందులోనూ వైచిత్రి ఉంది. ఆమె నాలుగు దశాబ్దాల కృషి అంతా శ్రామిక విపణుల్లో మహిళలు, లింగ సమానత్వం గురించి! విచిత్రం ఏమిటంటే 1969లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని స్థాపించినప్పటి నుంచి నిన్నటి వరకు ఆ పురస్కారం దక్కింది ఇద్దరంటే ఇద్దరు మహిళలకే! అదీ వేరేవాళ్ళతో కలసి! ఆ గౌరవం దక్కిన మూడో మహిళ గోల్డినే! పైగా, ఒక మహిళకు ఒంటరిగా అర్థశాస్త్రంలో నోబెల్ దక్కడమూ ఇదే ప్రప్రథమం. నోబెల్ బహుమతుల్లో లింగ అసమానత్వంపై విమర్శలు వస్తున్న వేళ లేబర్ మార్కెట్లో మహిళా విజయం లోతుపాతులు విశ్లేషించిన గోల్డిన్‌కు ఈ గౌరవం దక్కడం గమనార్హం. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరైన గోల్డిన్ అమెరికాలోని శ్రామిక విపణినీ, అలాగే వేతనాల్లో లింగ అసమానత్వానికి కారణాలనూ నాలుగు దశాబ్దాలుగా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చారు. 200 ఏళ్ళ అమెరికా చరిత్రను లోతుగా విశ్లేషిస్తూ, చారిత్రకంగా స్త్రీ పురుషుల ఆదాయాల్లో తేడాకు ప్రధానంగా చదువు, వివిధ రకాల ఉద్యోగాలే కారణమని తేల్చారు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఆధారిత వ్యవస్థ వైపు దేశం మారడంతో శ్రామిక విపణిలో వివాహిత స్త్రీల భాగస్వామ్యం పడిపోయిందనేది ఆమె అధ్యయన సారం. ఆ తర్వాత 20వ శతాబ్దంలో సర్వీసుల పరిశ్రమ వృద్ధి చెందడంతో, మరింత విద్యావంతులైన మహిళలు రంగంలోకి వచ్చారు. గర్భనిరోధక విధానాల లాంటివి ఆరోగ్యరంగంలో వ్యాప్తిలోకి వచ్చాయి. తత్ఫలితంగా, శ్రామికశక్తి లోకి మహిళలు మళ్ళీ ప్రవేశించారు. కానీ, అప్పటికే తలెత్తిన అంతరం మాత్రం పూడిపోలేదు. ముఖ్యంగా, తొలిచూలుతో ఈ తేడా తలెత్తుతోందని గోల్డిన్ పరిశోధన. ఇక, మరణశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పినందుకూ, దేశంలో మహిళలకు సైతం సమాన హక్కులు ఉండాలని కోరినందుకూ ఇరాన్లో కటకటాలు లెక్కపెడుతున్న నర్గిస్ పోరాటం మరో పెద్ద కథ. ఇప్పటికి ఆమె 13 సార్లు అరెస్టయి, అయిదుసార్లు దోషిగా తీర్మానమై, 31 ఏళ్ళ జైలుశిక్షను ఎదుర్కొంటోంది. 2022 నాటి డబ్యూఈఎఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో అట్టడుగున అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లతో పాటు నిలిచిన దేశంగా ఇరాన్ పేరుమోసింది. అలాంటి దేశాల్లో నర్గిస్ లాంటి మహిళలు కడకు తమ ఉనికిని కాపాడుకొనేందుకు సైతం పోరాడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు క్లాడియా గోల్డిన్ అధ్యయనానికీ, ఇటు నర్గిస్ మొహమ్మదీ అలుపెరుగని పోరాటానికీ నోబెల్ గుర్తింపు రావడం ఆనందదాయకం. సరిగ్గా గోల్డిన్‌కు నోబెల్ ప్రకటించిననాడే మన దేశంలో వార్షిక ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే‘ (పీఎల్ఎఫ్ఎస్) విడుదలైంది. గత 2022 జూలై నుంచి ఈ 2023 జూన్‌కి సంబంధించిన ఈ సర్వే శ్రమజీవుల్లో మహిళల సంఖ్య మునుపటి కన్నా కొద్దిగా పెరిగిందని పేర్కొంది. అయితే, అది సహజ మైన పెరుగుదల కాక కరోనా తర్వాత కుటుంబ ఆదాయాలు దెబ్బతినడంతో తప్పని పరిస్థితుల్లో వచ్చిన పాలపొంగు అని విశ్లేషకుల అభిప్రాయం. వెరసి, లోతుగా గమనిస్తే భారత్‌లోనూ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు ఇవాళ్టికీ తక్కువగానే ఉందన్నది విచారకరమైన వాస్తవం. ఇది మారాలంటే... అర్థవంతమైన ఉపాధి, అదే సమయంలో మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం పెరి గేలా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలది. అందుకు ప్రొఫెసర్ గోల్డిన్ అధ్యయనం నుంచి భారతదేశం సైతం పాఠాలు నేర్వాలి. ఏ దేశమైనా సరే ఆర్థిక పురోగతి సాధించినంత మాత్రాన శ్రామిక విపణిలో లింగ వ్యత్యాసం దానంతట అది తగ్గిపోదని గోల్డిన్ నిరూపించారు. అలాగే, సామాజిక, వ్యవస్థాపరమైన అవ రోధాలు ఉన్నంత కాలం కేవలం స్త్రీ విద్య సైతం శ్రామికశక్తిలో లింగ అంతరాల్ని తగ్గించలేదు. సాంప్రదాయిక సమాజాల్లో పిల్లల పెంపకమూ ఓ కీలకాంశం. విధాన నిర్ణేతలు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. లింగ కోణం నుంచి అర్థశాస్త్ర అధ్యయనం ప్రధాన స్రవంతిలో భాగం కాదన్న భావనల్ని గోల్డిన్ బద్దలుకొట్టారు. అమెరికా నుంచి ఇరాన్ దాకా ప్రపంచంలో ప్రతి చోటా ఇవాళ్టికీ ఆడవారి పరిస్థితి ఒకేలా ఉంది. ఇవాళ పురుషుల్లో నూటికి 80 మంది ఉద్యోగాల్లో ఉంటే, ప్రపంచ మహిళా జనాభాలో కేవలం సగం మందే వేతన ఉపాధి పొందుతున్నారు. అదీ మగవాళ్ళ కన్నా తక్కువ వేతనాలకే పనిచేస్తూ, వృత్తిలో ఉన్నత శిఖరాల అధిరోహణకు అవకాశాలూ తక్కువే. అందుకే, లింగ సమానత్వ సాధనలో ప్రపంచం ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది. ఆ దిశలో నోబెల్ విజేతలైన గోల్డిన్ అధ్యయనం, నర్గిస్ పోరాటం మనకు తాజా మార్గదర్శకాలు. -
Women : ఆడబిడ్డల ఆంధ్రా!
సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలికల సంఖ్య పెరుగుతోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా, రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బిహార్‌తో పాటు మిజోరాం, నాగాలాండ్‌లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ఆడపిల్లల జననాల పట్ల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది. ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సానుకూల చర్యలను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ క్యాలెండర్ జారీ అయినట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు తెలిపింది. -
భారతదేశ న్యాయవ్యవస్థలో లింగ సమానత్వానికి నాంది!
భారతీయ సమాజంలోని వివిధ రంగాలలో సమాన హక్కులు అంతుచిక్కని లక్ష్యం. న్యాయవ్యవస్థలో కూడా ఇదే ధోరణి. భారతీయ న్యాయ వ్యవస్థలోని మహిళల ప్రాతినిధ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే, మగవారి ఆడవారి మధ్యలో ఉన్న అసమానత్వం స్పష్టమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. పైగా ఇందులో మార్పు అత్యంత అవసరం అనే విషయాన్ని నొక్కి చెబుతుంది. అత్యున్నత న్యాయస్థానంలో 36 మంది న్యాయమూర్తులలో కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు. ఈ అసమానత అత్యున్నత న్యాయస్థానానికి మాత్రమే పరిమితం కాదు. ఇది హైకోర్టుల వరకు వ్యాపించింది, ఇక్కడ వెయ్యి మంది న్యాయమూర్తులలో కేవలం 96 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. జిల్లా న్యాయవ్యవస్థలో కూడా పరిస్థితి మెరుగుపడలేదు. 3.3 లక్షల మంది న్యాయమూర్తులకు న్యాయ అధికారులలో కేవలం 6% మంది మహిళలు ఉన్నారు. భారతదేశంలోని విస్తృత చట్టపరమైన ల్యాండ్‌స్కేప్‌లో 15% కంటే తక్కువ మంది మహిళలు న్యాయవాదులు ఉన్నారు. ఈ నిరుత్సాహపరిచే అసమానతకు దోహదపడే కారకాలు చాల ఉన్నాయి. అవి చాలా లోతుగా పాతుకుపోయాయి. ఇప్పటికి సామాజిక పక్షపాతాలు, నిబంధనలు న్యాయవాద వృత్తిని కొనసాగించకుండా మహిళలను నిరుత్సాహపరుస్తున్నాయి. దానితో పాటు చట్టపరమైన విద్య కూడా చాల తక్కువ అవకాశాలు ఉంటున్నాయి. న్యాయవాద వృత్తిలో ఆదాయం చాలా మారవచ్చు. ఇది న్యాయమూర్తులు కావాలనుకునే మహిళా న్యాయవాదులకు కష్టతరం చేస్తుంది. న్యాయనిర్ణేతగా మారడం వారికి కష్టంగా ఉంటుంది. ఇలా చాల సవాళ్లు ఉన్నాయి. కానీ దాంతో పాటు ఆశ కూడా మిగిలి ఉంది. మాజీ, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తులు కోర్టులలో చాల సార్లు మహిళలకు పదోన్నతులు కల్పించారు. ఇలాంటి పరిస్థితిలో చట్టపరమైన రంగంలో లింగ సమానత్వం కోసం ప్రయత్నాలు మరింత ముఖ్యమైనవిగా ఉండాలి. మెరుగైన మహిళా ప్రాతినిధ్యానికి స్థిరమైన లక్ష్యం, విధానం అవసరం. ఈ మొదటి అడుగు ప్రశంసనీయమే కానీ నిజమైన సమానత్వం కోసం ప్రతి ఒక్కరి కృషి అవసరం. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పౌర సమాజం అందరు కలిసి పనిచేయాలి. ఇటీవలే, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో మహిళా కమిటీని ఏర్పాటు చేయడం వంటి చర్యలు చూసి, కోర్టులు మహిళా న్యాయానికి కట్టుబడి ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇలాంటి చర్యలు సమాన హక్కులు గూర్చి లోతైన కారణాలపై పోరాడటానికి న్యాయస్థానాలు తమ బాధ్యతను అంగీకరిస్తాయని చూపిస్తుంది. కొంతకాలం క్రితం, భారతదేశ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగస్ట్ 7న మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితి గురించి ప్రకటన చేసారు. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బృందానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వం వహించారు. ఇది ఒక కొలిక్కి రావాలంటే ఈ తరహా సహాయం ఆయన చేయాలనీ సుప్రీంకోర్టు గ్రహించింది. కాబట్టి, వారు సహాయం చేయడానికి మొత్తం మహిళల కమిటీని రూపొందించడానికి తమ ప్రణాళికను పంచుకున్నారు. ఈ ఏర్పడిన కమిటీలో ఉన్నత న్యాయస్థానాల నుంచి ముగ్గురు ప్రముఖ మాజీ న్యాయమూర్తులు ఉంటారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్ కమిటీకి నాయకత్వం వహిస్తారు. ఇతర కమిటీ సభ్యులు జస్టిస్ షాలినీ ఫన్సల్కర్ జోషి (బాంబే హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసారు), జస్టిస్ ఆశా మీనన్ (గతంలో ఢిల్లీ హైకోర్టు నుండి పనిచేశారు). సహాయక చర్యలను పర్యవేక్షించడం, ప్రార్థనా స్థలాలు, గృహాలను పునరుద్ధరించడం, సహాయక చర్యలను మెరుగుపరచడం తోపాటు మరిన్ని బాధ్యతలు కమిటీకి ఉంటాయి. మే నుంచి జులై వరకు జరిగిన హింసాత్మక సంఘటనల గురించి పరిశోధన చేయడానికి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దత్తాత్రయ్ పద్సాల్గికర్ను నాయకత్వం వహించడానికి ఎంపిక చేసారు. పద్సల్గికర్ ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నాగాలాండ్‌లో పనిచేశాడు. ఈ కేసుల కోసం మణిపూర్‌లో 6500 పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ, న్యాయవ్యవస్థలో లింగ సమానత్వాన్ని సాధించడానికి సమయం పడుతుంది. మహిళలకు మాత్రమే న్యాయస్థానాలను సృష్టించడం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడడం తదితరాలు సానుకూల అభివృద్ధి. కానీ, నిజమైన పురోగతికి మరిన్ని మార్పులు అవసరం. న్యాయవాద వృత్తిలో మహిళలకు మరింత అధికారం ఇవ్వడం ముఖ్యం. చట్టంలో మహిళలపై అన్యాయమైన నమ్మకాలను తొలగించడం చాలా కీలకం. మహిళలు ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ మార్పుల కోసం నిరంతర శ్రద్ధ, కృషి అవసరం. ఇలాంటి కార్యక్రమాలతో మనం స్థిరంగా కొనసాగితే, న్యాయవ్యవస్థలో మహిళలు తమ స్థానాలను సక్రమంగా చేపట్టేందుకు చాల గొప్ప అవకాశం ఉంటుంది. దీని వల్ల న్యాయ వ్యవస్థలో మహిళలకు పెద్ద పాత్ర ఉంటుంది. వైవిధ్యమైన న్యాయ వ్యవస్థ బలంగా, న్యాయంగా ఉండవచ్చు. భారతదేశ న్యాయ వ్యవస్థలో స్త్రీలను, పురుషులను సమానంగా చూడటం ముఖ్యం. మనమందరం మహిళల అభిప్రాయాన్ని ఎక్కువగా వినడానికి, చూడటానికి సహాయం చేస్తే, పరిస్థితులు మారవచ్చు. పురుషులు, మహిళలు ఒకే విధంగా పరిగణించే భవిష్యత్తును సృష్టించడానికి ప్రయాస పడాలి. -డాక్టర్ శ్రీదేవి రెడ్డి గాధే, సీనియర్ హైకోర్టు అడ్వకేట్(అభిజ్ఞా భారత్ ఆర్గనైజేషన్ ఫౌండర్) -
తీర్పుల్లో మహిళల పట్ల అనుచిత పదాలు వాడొద్దు
ఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ, తీర్పులు వెల్లడించే సమయంలో మహిళలపై వివక్షకు తావు లేకుండా కీలక ముందడుగు పడింది, వేశ్య, పతిత, ఎఫైర్, హౌస్‌వైఫ్, ట్రాన్సెక్సువల్, వ్యభిచారం వంటి పదాలు ఇక ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిర్దేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ బుధవారం ఒక హ్యాండ్‌బుక్‌ను విడుదల చేశారు. ‘‘హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్’’ పేరుతో ఉన్న ఈ హ్యాండ్‌బుక్‌లో న్యాయస్థానాలు గతంలో ఇచి్చన తీర్పుల సమయంలో మహిళల పట్ల అనుచితంగా ఉండే 100కి పైగా పదాలు అందులో ఉన్నాయి. ఆ పదాలకు బదులుగా ఏం వాడాలో కూడా అందులో వివరంగా రాశారు. రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లి కాకుండానే తల్లి, ఎఫైర్, వేశ్య వంటి పదప్రయోగాలకు చేయకూడదని, వాటికి బదులుగా దుస్తులు, తల్లి, వివాహేతరం సంబంధం, సెక్స్ వర్కర్ అని మాత్రమే రాయాలని ఆ హ్యాండ్‌బుక్ స్పష్టంగా చెబుతోంది. ఈవ్‌టీజింగ్ బదులుగా స్ట్రీట్ సెక్యువల్ హెరాజ్‌మెంట్, హౌస్‌వైఫ్ బదులుగా హోమ్‌మేకర్ అన్న పదాలు వాడాలని నిర్దేశించింది. మూస పదాలు వద్దు ఈ హ్యాండ్‌బుక్ విడుదల చేసిన సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మాట్లాడుతూ న్యాయ ప్రక్రియల్లో మహిళలపై మూస పద్ధతుల్లో ఎలాంటి పదాలు ఉపయోగిస్తారో ఈ పుస్తం చెబుతుందని అన్నారు. ‘‘తీర్పులు రాసే సమయంలో న్యాయమూర్తులు మహిళల పట్ల అనాలోచితంగా అనుచిత పదాలు వాడుతున్నారు. మూసపద్ధతుల్లో ఉండే పద ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో వచ్చిన తీర్పుల్ని విమర్శించడం ఉద్దేశం కాదు. భవిష్యత్‌లో న్యాయమూర్తులు ఆ పదాలు ఉపయోగించకుండా ఈ హ్యాండ్‌బుక్ ఉపయోగపడుతుంది. ఏ పదాలకు గుర్తింపు ఉందో స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్లు ఇచ్చే తీర్పుల్లో న్యాయమూర్తులు సరైన పదాలు వాడితే వారిచ్చే తీర్పులపై అపోహలకు కూడా తావుండదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
టీ తోట నుంచి చైతన్యం
పోష్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) యాక్ట్ 2013 ప్రకారం వ్యవస్థీకృతమైన రంగాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులను నివారించడానికి ఇంటర్నల్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. కానీ అసంఘటిత రంగాల్లో పని చేసే మహిళలకు ఇలాంటి ఒక చట్టం ఉందనే సంగతి కూడా తెలియదు. ఇలాంటి స్థితిలో అస్సాంలోని టీ తోటల్లో పని చేసే మహిళలు సంఘటితమై తమ హక్కును కాపాడుకోవడానికి ఉద్యమించారు. ఒకరికొకరు అండగా మనదేశంలో వ్యవసాయరంగం తర్వాత మహిళలు అతిపెద్ద సంఖ్యలో పని చేస్తున్నది టీ తోటల్లోనే. ఈ తోటల్లో పని చేసే కార్మికుల్లో ఎనభైశాతం మహిళలే. అస్సాం, వెస్ట్‌బెంగాల్, కేరళ, తమిళనాడులన్నీ కలిపి దేశంలో 350కి పైగా టీ తోటలున్నాయి. దాదాపుగా ఒక్కో తోటలో వెయ్యికి పైగా మహిళలు పనిచేస్తుంటారు. దేశవ్యాప్తంగా మూడు లక్షల అరవైవేలకు పైగా మహిళలు టీ తోటల్లో పని చేస్తున్నారు. ఈ మహిళల పరిస్థితి ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేది. వాళ్ల మాటకు ఇంట్లో విలువ ఉండేది కాదు, పని చేసే చోట లైంగిక వేధింపులు, వివక్ష తప్పేది కాదు. ఒకరి కష్టాన్ని మరొకరికి చెప్పుకుని ఓదార్పు పొందడమే తప్ప, ఆ కష్టాల నుంచి బయటపడవచ్చని తెలియని రోజులవి. ఒకసారి తెలిసిన తరవాత ఇక వాళ్లు ఆలస్యం చేయలేదు. ఉమెన్స్ సేఫ్టీ యాక్సెలరేటర్ ఫండ్ (డబ్లు్యఎస్ఏఎఫ్) స్వచ్ఛంద సంస్థ అండతో ముందుకురికారు. అస్సాం నుంచి కేరళ వరకు తమకు భద్రత కల్పించడానికి పోష్ అనే చట్టం ఉందని తెలిసిన తర్వాత ఆ చట్టం ద్వారా ఎన్ని రకాలుగా రక్షణకవచంగా ఉపయోగించుకోవచ్చనే వివరాలు కూడా తెలుసుకున్నారు. ‘సమాజ్’ పేరుతో వాళ్లలో వాళ్లు కమిటీలుగా ఏర్పడ్డారు. బృందంగా వెళ్లి ప్రభుత్వ అధికారులను కలుస్తూ... ప్రతి తోటలో ఇంటర్నల్ సెల్ ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని ఆపలేదు. లైంగిక వేధింపులకు గురయినప్పుడు ఎలా ప్రతిఘటించాలో, ఎలాంటి ఆధారాలతో ఇంటర్నల్ సెల్‌కు ఎలా తెలియచేయాలో కళ్లకు కడుతూ చిన్నచిన్న నాటికలు ప్రదర్శించారు. అస్సాం, బెంగాల్ నుంచి కొంతమంది చురుకైన మహిళలు కేరళ, తమిళనాడులకు వచ్చి ఇక్కడి వారిని చైతన్యవంతం చేసే పని మొదలుపెట్టారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు! పోష్ చట్టం ప్రకారం సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రసల్ కమిటీలు భవన నిర్మాణ రంగంలో కూడా ఉండాలి. అయితే టీ తోటల్లో మహిళల్లాగ భవన నిర్మాణంలో పని చేసే మహిళలు సంఘటితం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాలం ఒకే చోట నివసిస్తున్న వాళ్లు మాత్రమే వేధింపులకు గురవుతున్న విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతారు. టీ తోటల్లో పని చేసే వాళ్లు సుదీర్ఘకాలం ఒకే చోట నివసిస్తూ, అదే తోటల్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు అలా కాదు. ఒక భవనం పూర్తి కాగానే మరోభవనం కోసం వెళ్లిపోతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కోసం సంఘటితం కాగలిగినంత సమయం కూడా ఒకేచోట ఉండరు. కాబట్టి పని చేసే ప్రదేశంలో కంప్లయింట్ ఇవ్వాల్సిన వివరాలతోపాటు ఫోన్ నంబరు రాయడమే వారిలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అలాగే రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లలో కూడా మహిళలు ఎక్కువగా ఉంటారు. అధికారులు సమావేశం ఏర్పాటు చేసి లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు కంప్లయింట్ ఇవ్వవచ్చని తెలియచేయాలి. కంప్లయింట్ విభాగానికి చెందిన ఫోన్ నంబర్‌ను ఆ మార్కెట్లో కూరగాయల ధరల పట్టిక కనిపించినట్లు బాగా కనిపించేటట్లు రాయాలని సూచించారు మహిళల హక్కుల యాక్టివిస్టు కొండవీటి సత్యవతి. ఒక నోడల్ పాయింట్ లైంగిక వివక్ష, వేధింపు, హింస, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసవ సమయంలో మరణాలు దేశంలో అస్సాం మొదటిస్థానంలో ఉంటుంది. అస్సాం, బెంగాల్లో మహిళల కోసం ప్రాతినిధ్యం వహించేవాళ్లు లేరు. టీ ఎస్టేట్లలో పనిచేసే బాలికలు, మహిళల భద్రత, హింస నిరోధం కోసం ఏర్పడిన కన్షార్షియం డబ్లు్యఎస్ఏఎఫ్... మహిళలను చైతన్యవంతం చేయడంతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, హెల్త్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు, పోలీస్, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. అస్సాం టీ తోటల్లో పని చేసే మహిళలు దేశానికి దిక్సూచి అయ్యారు. – వాకా మంజులారెడ్డి చట్టం... కమిటీలే కాదు... ప్రభుత్వం ఇంకా చేయాలి! వ్యవస్థీకృత రంగంలో పనిచేసే మహిళల కోసం ఇంటర్నల్ కమిటీలున్నట్లే అసంఘటితరంగంలో కూడా కమిటీలుండాలి. ఇళ్లలో పని చేయడం, వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం వంటి ఇతర పనుల్లో ఉండే మహిళల కోసం లోకల్ కంప్లయింట్స్ కమిటీలుండాలి. కమిటీలు వేయడంతో సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి కమిటీలున్నాయనే విషయం మహిళలకు తెలియాలి. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఆయా కమిటీలకు కంప్లయింట్ ఎలా ఇవ్వాలో తెలియచేయాలి. ఫోన్ నంబర్ లేదా హెల్ప్‌లైన్ నంబర్లను పని ప్రదేశంలోనూ ఇతర కమ్యూనిటీ సెంటర్లలోనూ బాగా కనిపించేటట్లు బోర్డు మీద రాయాలి. అందుకు ప్రభుత్వమే పూనుకోవాలి. చట్టం చేసి తన బాధ్యత అయిపోయిందనుకుంటే సరిపోదు. చట్టాన్ని అమలు చేయడం, అమలయ్యే పరిస్థితులు కల్పించడం, చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, తమ హక్కుల ఉల్లంఘన కలిగినప్పుడు గళమెత్తగలిగేటట్లు భరోసా కల్పించడం కూడా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతలే. – కొండవీటి సత్యవతి,భూమిక ఉమెన్స్ కలెక్టివ్, మెంబర్, లోకల్ కంప్లయింట్ కమిటీ, రంగారెడ్డి జిల్లా -
ఇద్దరు యువతుల ప్రేమ పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన సంఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం వారిలో ఒకరు లింగమార్పిడి చేసుకున్నారు. ఆ సంబంధిత ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. బరేలీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని బరేలీలో ఇద్దరు అమ్మాయిలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. వీరిలో ఒకరు బరేలికి చెందినవారు కాగా.. మరొకరు బదాయూ ప్రాంతానికి చెందినవారు. ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వారు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ జంటలోని ఓ అమ్మాయి లింగమార్పిడి చేయించుకుంది. చికిత్స అనంతరం ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. డిజిస్ట్రేషన్ ద్వారా వివాహానికి ప్రత్యేక వివాహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారని బరేలీ ఎస్డీఎం ప్రత్యూష పాండే తెలిపారు. ఇలాంటి కేసు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. ఇదీ చదవండి: అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్.. అసలే పేషెంట్.. మళ్ళీ పేషెంట్ అయ్యాడు.. -
జెండర్ ఈక్వాలిటీ అంటే అది!'దటీజ్ జపాన్'
ఇటీవల జూన్ 24, 25 తేదీల్లో లింగ సమానత్వం, మహిళ సాధికారతపై జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి జపాన్ ఆతిధ్య ఇచ్చింది. ఈ సదస్సులో ఏడుగురు మంత్రుల బృందం సమావేశమై ప్రతిజ్ఞ చేసింది. ఆ మంత్రులంతా మహిళా కార్యనిర్వాహకులకు మద్దతు ఇస్తామని, నిర్వాహక పాత్రలలో మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరింపజేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆ మంత్రుల సదస్సు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని తెగ ఆకర్షించింది. అసాధారణరీతిలో లింగ సమానత్వ మహిళా మంత్రులు సదస్సులో ఒకే ఒక్క మగ మంత్రి తన దేశం తరుపున ప్రాతినిధ్య వహించడం విశేషం. ఈ సమావేశానకి ఆతిధ్యమిచ్చిన జపాన్ దేశమే మహిళ సాధికారతపై జరగుతున్న సదస్సుకు తన దేశం తరుఫు నుంచి ఓ ఫురుషుడిని పంపి అందర్నీ ఆశ్చర్యపర్చింది. జెండర్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏమిటో చెప్పకనే చెప్పింది. పైగా చెప్పడం కాదు చేసి చూపడం లేదా ఆచరించి చూపడం అని చాచిపెట్టి కొట్టినట్లు చెప్పింది. "దటీజీ జపాన్" అని సగర్వంగా ఎలుగెత్తి చెప్పింది. ఇక ఆ సమావేశంలో తన దేశం తరుఫున పాల్గొన్న జపాన్‌కు చెందిన రాజకీయ ప్రముఖుడు, కేబినేట్ మంత్రి మసనోబు ఒగురా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆ సమావేశంలో ఏకైక పురుష డెలిగేట్ అయ్యినందుకు ఎలా భావిస్తున్నారని అడుగగా..లింగ సమానత్వం కోసం పురుషులు ఇంకాస్త చొరవ తీసుకుని ముందుకొచ్చి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. ఇతర దేశాల సహకారంతో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా పని చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే లింగ సమానత్వమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా, టైమ్ మ్యాగ్జైన్ ప్రకారం..వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన తాజా వార్షిక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే జపాన్‌లో నిక్కోలో ఈ జీ7 శిఖారాగ్ర సమావేశం జరగడం గమనార్హం. కాగా, ఈ ఎకనామిక్ ఫోరం ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యాసాధన, ఆరోగ్యం, మనుగడ, రాజకీయ సాధికారత తదితర కీలక కొలమానాల ఆధారంగా ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ని అంచనా వేస్తుంది. (చదవండి: ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్') -
స్నేహితురాలిపై ప్రేమతో ఆమె..‘అతని’గా మారాలనుకుంది.. తరువాత జరిగిన దారుణమిదే..
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో ఒక యువతి తన స్నేహితురాలిని గాఢంగా ప్రేమించింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పురుషునిగా మారేందుకు ఒక మాంత్రికుని వద్దకు వెళ్లింది. ఇదే అవకాశంగా భావించిన ఆ మాంత్రికుడు ఆమెపై ఘాతుకానికి తెగబడ్డాడు. రెండు నెలల క్రితం కుటుంబ సభ్యులు ఆ యువతి అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మాంత్రికునితో పాటు ఆమె స్నేహితురాలిని కూడా అరెస్టు చేశారు. ఆర్సీమిషన్ పరిధిలో ఉంటున్న పూనమ్ ఇంటి నుంచి ఏప్రిల్ 18న మాయమయ్యింది. ఏప్రిల్ 26న ఆమె సోదరుడు దీనిపై పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాయమైన ఆ యువతి తన స్నేహితురాలు ప్రీతిని పెళ్లాడాలనుకుందని తెలిసింది.ఇదిలా ఉండగా మే 18న లఖీంపురా పరిధిలో ఒక యువతి అస్థిపంజరం పోలీసులకు లభ్యమయ్యింది. పోలీసులు ఆ అస్థిపంజరం శాంపిల్ ల్యాబ్‌కు పంపగా మాయమైన పూనమ్‌దేనని తేలింది. ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ.. పువాయులో ఉంటున్న ప్రీతి, పూనమ్‌లు స్వలింగ సంపర్కులుగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో పూనమ్ తన స్నేహితురాలు ప్రీతిని వివాహం చేసుకోవాలని అనుకుంది. అయితే పూనమ్ కారణంగా ప్రీతికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో ప్రీతి తల్లి ఊర్మిళ.. లఖీంపూర్ ఖీరీ పరిధిలో ఉంటున్న రామ్నివాస్ అనే వ్యక్తిని కలుసుకుంది. తన కుమార్తె వివాహానికి పూనమ్ అడ్డుగా ఉందని, ఆమెను అంతమొందిస్తే రెండున్నర లక్షల రూపాయలు ఇస్తానని అతనికి చెబుతూ రూ. 5 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. తరువాత ప్రీతి, పూనంలను రామ్నివాస్ ఒక అడవికి తీసుకువెళ్లాడు. అక్కడ వారిద్దరికీ వివాహం చేసే విషయమై మాట్లాడాడు. మంత్ర విద్యలతో పురుషునిగా మార్చేస్తానని పూనమ్‌కు రామ్నివాస్ హామీనిచ్చాడు. ఇందుకోసం మరోమారు అడవికి రావాల్సివుంటుందని పూనమ్‌కు చెప్పాడు.అతను చెప్పిన సమయానికి పూనమ్ అడవికి రాగానే రామ్నివాస్ ఆమెపై దాడి చేసి, హత్యచేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని అక్కడున్న పొదల్లో దాచిపెట్టాడు. ఈ కేసు గురించి సిటీ ఎస్పీ సుధీర్ మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న తాము మే 18న వివిధ ఆధారాలతో పూనమ్‌కు చెందిన అస్థిపంజరాన్ని గోమతి నది ఒడ్డున స్వాధీనం చేసుకున్నామన్నారు. పూనమ్ సోదరుడు పర్వీందర్ తన సోదరి దుస్తులను చూసి గుర్తుపట్టాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ రామ్నివాస్, ప్రీతి, ఆమె తల్లి ఊర్మిళలపై కేసు నమోదు చేశారు. రామ్నివాస్, ప్రీతిలను అరెస్టు చేశారు. పరారైన ఊర్మిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఆ హ్యాండ్సమ్ సీరియల్ కిల్లర్‌పై అమ్మాయిల మోజు.. -
పైసల కోసం... ‘పాపం చేస్తున్నారు
ఆడపిల్లంటే ‘ఆడ’ పిల్లని, మగపిల్లాడంటే ‘మన’ పిల్లాడనే భావన ఉన్నంత వరకు ఈ సమాజంలో ఆడ పిల్లలకు స్థానం లేదుకావొ చ్చేమో.. ప్రాణం పోయాల్సిన వైద్యులే కడుపులోనే చంపేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్లని తెలిస్తే గర్భవిచిత్తి చేస్తున్నారు. – సాక్షి, వరంగల్ గర్భస్త లింగ నిర్ధారణ నేరం... అంటూ ఆస్పత్రుల్లో పెద్దపెద్ద బోర్డులు పెడుతున్న వైద్యులే... పైసల కోసం ‘పాప’ం చేస్తున్నారు. గతంలో గర్భవిచిత్తి ఉదంతాలు వెలుగులోకి వచ్చినా... కొందరు వైద్యుల తీరు ఏమాత్రం మారడం లేదు. వరంగల్ నగరంతో పాటు నర్సంపేట పట్టణం, నెక్కొండ ఇలా చాలా ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా అమ్మ కడుపులోని పాపలను భ్రూణహత్యలు చేస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. గర్భంలో ఉన్న శిశువు ఆడనా, మగనా అని తెలుసుకునేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు ఆడపిల్ల అయితే గర్భవిచిత్తి చేస్తున్న కేసుల్లో సంబంధమున్న 18 మంది నిందితులను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో గర్భస్రావానికి రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. హనుమకొండలోని లోటస్, గాయత్రి ఆస్పత్రులతో పా టు నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, నెక్కొండలోని ఉపేందర్ క్లినిక్‌లు వీటిలో భాగస్వామ్యం అయ్యాయని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించడంతో వరంగల్ సిటీతో పాటు జిల్లాలోని ఆస్పత్రుల వ్యవహార శైలిపై అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు ఇంకా లోతైన విచారణ చేస్తే మరిన్ని ఆస్పత్రులు, క్లినిక్‌లపై క్రిమినల్ కేసులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆడపిల్ల అని తెలుసుకోవడానికి వచ్చినా, అబార్షన్ చేయాలన్న వైద్యులు నిరాకరించాల్సి ఉన్నా కాసుల కక్కుర్తి కోసం ప్రోత్సహిస్తుండడం గమనార్హం. అయినా.. మారలే.. ► నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామ శివారు మాలోతు నంద్యానాయక్తండాలోని ప్రశాంత్.. పార్థు నర్సింగ్ హోంలో తన భార్యకు జన్మించిన ఆడ శిశువును రూ.25వేలకు ఆస్పత్రి సిబ్బంది సహకారంతో హనుమకొండలోని విజయ్‌కుమార్, రజనీ దంపతులకు విక్రయించారు. ఈ విషయం బాలల సంరక్షణ విభాగాధికారుల దృష్టికి వెళ్లగా.. 2020 ఏప్రిల్ 25న నెక్కొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ పార్థు, డాక్టర్ ఉపేందర్, స్టాఫ్ నర్సు పద్మ, శిశువు తండ్రి ప్రశాంత్, నాయనమ్మ నర్సమ్మలపై కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు 2020 మే 5న పాప జాడ దొరికింది. అంతకుముందు 2011జూలై 22న కవల పిల్లల విక్రయాల కేసులోనూ ఈ ఆస్పత్రి వివాదానికి కేరాఫ్‌గా నిలిచింది. ఈ రెండు ఘటనల తర్వాత పార్థు నర్సింగ్ హోం పేరును ఉపేందర్ క్లినిక్‌గా మార్చుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈసారి లింగనిర్ధారణ పరీక్షలు చేసి గర్భవిచిత్తు చేస్తున్నారని ఉపేందర్ క్లినిక్‌లోని రెండు స్కానింగ్ మెషీన్లను ఇప్పటికే వైద్యారోగ్యవిభాగాధికారులు సీజ్ చేశారు. ఇవి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఎక్కడి నుంచి తెప్పించారనే దిశగా విచారణ చేస్తున్నారు. అయితే సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు కమలాపురం సీఐ సంజీవ్, నెక్కొండ ఎస్సై జానీ పాషా, గ్రామ కార్యదర్శి సదానందం, రెవెన్యూ సిబ్బందితో కలిసి తనిఖీ చేసి రికార్డులు, గదులను పరిశీలించారు. ఇప్పటికే డాక్టర్ బాల్నె పార్థు, పార్థు భార్య ఆశలత, కాంపౌండర్ కీర్తి మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ► దాదాపు ఏడాది క్రితం ప్రారంభమైన నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు గర్భ విచిత్తి జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నెల 13న అక్కడి స్కానింగ్ మెషీన్‌ను వైద్యారోగ్యవిభాగాధికారులు సీజ్ చేశారు. ఇవన్నీ పకడ్బందీగా చేస్తేనే... ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భం దాల్చిన వారి వివరాలను వైద్యారోగ్య శాఖ సిబ్బంది సమగ్రంగా సేకరించాలి. గుర్తించిన గర్భిణుల సంఖ్యను... ప్రసవాలతో పోలిస్తే గర్భస్రావాలు...గర్భవిచిత్తి ఉదంతాలు బయటపడే అవకాశముంది. ఈ దిశగా యంత్రాంగం దృష్టి సారించాలి. ► ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలకు వస్తున్న గర్భిణుల వివరాలు నమోదు చేయించి. ఆ వివరాలను ప్రసవాల సంఖ్యతో సరిపోల్చడం ద్వారా ఎక్కడైనా అక్రమాలు జరిగితే గుర్తించవచ్చు. ► వైద్యారోగ్యశాఖ అధికారులు స్కానింగ్ కేంద్రాలు తరచుగా తనిఖీ చేయకపోవడంతో రహస్యంగా లింగనిర్ధారణ, భ్రూణహత్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ► జిల్లా పరిధిలో కలెక్టర్ అధ్యక్షతన లింగ నిర్ధారణ నిరోధక కమిటీ ఏర్పాటై ఉంటుంది. పోలీసు కమిషనర్, న్యాయమూర్తి, డీఎంహెచ్ఓ, స్వ చ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. కనీసం ఆరునెలలకోమారు ఈ కమిటీ సమావేశం జరగాలి. తీసుకుంటున్న చర్యలపై సమీ క్షించాలి. ఆ దిశగా కసరత్తు జరగాలి. -
అక్షర స్వరం
‘రచన చేయడం అంటే తెలుసుకోవడం కూడా’ అనే మాట ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్’ పుస్తక రచన కోసం కలం పట్టినప్పుడు కృతిక పాండేకు అనుభవంలోకి వచ్చింది. ఈ పుస్తకం మనల్ని బాధితుల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ పుస్తక ప్రయాణం సానుభూతి కోసం కాదు. ‘మనలో వారి పట్ల చిన్న చూపు ఉంటే మార్చుకుందాం’ అని చెప్పడం. ‘వారితో కలిసి నడవండి’ అని చెప్పడం. ‘విజేతలకు కష్టాలు అడ్డు కాదు’ అనే సత్యాన్ని గుర్తు చేయడం... అవమానాలు, అనుమానాలు, లింగవివక్ష, వేధింపులు, గృహహింసలు... స్త్రీలు ఎదుర్కొనే సకల సమస్యలకు సమాధానం చెబుతుంది ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్: ఎ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్’ పుస్తకం. ఇది కాల్పనిక ఊహల సమాహారం కాదు. నిజజీవితానికి చెందిన కథ. నిమృత్కు చిన్నప్పటి నుంచి మూర్ఛ సమస్య ఉంది. ఆ సమస్య తనను నీడలా వెంటాడింది. ‘ఈ సమస్యతో స్కూల్‌కు ఎలా పంపుతాం?’ ‘ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళతావా? అక్కడ పడిపోతే ఎవరు చూస్తారు?’ పెళ్లి వయసులోనూ ఆ సమస్య ముందుకు వచ్చింది. ‘మీ అమ్మాయికి మూర్ఛ సమస్య ఉందా? ముందే చెప్పి బతికించారు’ అని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నిమృత్కు పెళ్లి జరగడం అనేది అతి కష్టం అనుకునే సందర్భంలో తన సమస్య తెలిసి కూడా ఒక కుటుంబం పెళ్లికి ఒప్పుకుంది. ‘మూర్ఛ’ కారణంగా సంసార జీవితంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. అయితే ముందు కనిపిస్తున్న ముండ్లబాటను చూసి భయపడలేదు నిమృత్. అక్కడే ఆగిపోయి ఉంటే, వెనుతిరిగి ఉంటే ఆమె జీవితం ఈ పుస్తకంలోకి వచ్చేది కాదు. సమస్యను సవాలు చేసి ముందుకువెళ్లింది. కష్టాలను తట్టుకొని నిలబడింది. ప్రపంచం గుర్తుంచుకోదగిన అసాధారణ విజయలేమీ ఆమె సాధించకపోవచ్చు. అయితే తన జీవితాన్ని జయించింది. కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిని ఇచ్చింది. తనలాంటి వారెందరికో ధైర్యాన్ని ఇస్తోంది. ‘ఆరోగ్య స్థితిని బట్టి ఎవరూ నిర్లక్ష్యానికి గురి కావద్దు. వారికి సహాయంగా నిలవండి. వారి అడుగులు ముందుకు పడడానికి సహకరించండి’ అని ఈ పుస్తకం సందేశం ఇస్తుంది. కృతిక పాండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం హెడ్‌గా పనిచేస్తోంది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ చేసిన కృతిక దిల్లీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసింది. డెహ్రడూన్‌కు చెందిన కృతిక ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘మిత్ర జ్యోతి ట్రస్ట్’కు ఇవ్వనుంది కృతిక. -
ఆ వివాహాలు నేరం కాదు.. అవసరం: వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఇది వారి హక్కు అంటూ తన మద్దతు ప్రకటించారు. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటివి సాధారణమైన విషయమని అన్నారు. ఈ సందర్భంగా స్వలింగ వివాహంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వివేక్ తన ట్వీట్లో రాస్తూ.. 'స్వలింగ వివాహం అనేది 'అర్బన్ ఎలిటిస్ట్' అన్న భావన కరెక్ట్ కాదు. ఇది మానవ అవసరం. చిన్న పట్టణాలు, గ్రామాలలో ఎప్పుడూ ప్రయాణించని కొంతమంది వ్యక్తులే దీన్ని ప్రశ్నిస్తున్నారు. మొదట స్వలింగ వివాహం అనేది ఒక కాన్సెప్ట్ కాదు. అది ఒక అవసరం మాత్రమే. అలాగే ఇది ఒక హక్కు కూడా. భారతదేశం వంటి ప్రగతిశీల దేశంలో స్వలింగ వివాహం సాధారణమైన విషయమే. ఎలాంటి నేరం కాదు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. స్వలింగ వివాహం అనేది పట్టణ ఉన్నత వర్గాల భావన అని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇది దేశంలోని సామాజిక తత్వానికి దూరంగా ఉందని తెలిపింది. స్వలింగ వివాహాన్ని ప్రోత్సహించడం కొత్త సమస్యలు సృష్టిస్తుందని కేంద్రం పేర్కొంది. దీన్ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించి ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: షూటింగ్లో ప్రమాదం.. ది కశ్మీర్ ఫైల్స్ నటికి తీవ్రగాయాలు) NO. Same sex marriage is not an ‘urban elitist’ concept. It’s a human need. Maybe some sarkari elites drafted it who have never travelled in small towns & villages. Or Mumbai locals. First, same sex marriage is not a concept. It’s a need. It’s a right. And in a progressive,… https://t.co/M4S3o5InXI — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 18, 2023 -
‘సాగు’లో లింగవివక్ష మూల్యం 81.84 లక్షల కోట్లు!
మహిళలపట్ల వివక్ష వల్ల సామాజికంగా వాటిల్లే నష్టానికి వెలకట్టలేం. అయితే వ్యవసాయం, ఆహార శుద్ధి, నిల్వ, పంపిణీ (అగ్రి ఫుడ్ సిస్టమ్స్) రంగాల్లో లింగవివక్ష వల్ల ఎంత నష్టం వాటిల్లుతున్నదో తెలుసుకొనేందుకు ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఇటీవల అధ్యయనం చేసింది. లింగవివక్ష కారణంగా ఏటా లక్ష కోట్ల డాలర్ల (రూ. 81,84,550 కోట్లు) సంపదను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోల్పోతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. వ్యవసాయ రంగంలో మహిళల స్థితిగతులపై 2010 విరామం తర్వాత ఎఫ్ఏఓ వెలువరించిన తొలి అధ్యయన నివేదిక ఇదే. వ్యవసాయంతోపాటు ఈసారి ఆహార శుద్ధి, రవాణా, నిల్వ, పంపిణీ రంగాల్లో రైతులుగా, కూలీలుగా, ఉద్యోగినులుగా, వ్యాపారవేత్తలుగా, చిరు వ్యాపారులుగా పనిచేసే మహిళల స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక విడుదల చేయటం గమనార్హం. వివక్షను రూపుమాపితే రైతుల ఆదాయం పెరుగుతుంది వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలపట్ల లింగ వివక్షను నిర్మూలిస్తే ఆహారోత్పత్తి పెరిగి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరుతుంది. పేదరికం, ఆకలి తగ్గుతుంది. 4.5 కోట్ల మంది నిరుపేదలకు అదనంగా ఆహార భద్రత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎఫ్ఏఓ తేలి్చచెప్పింది. అంతేకాదు.. వాతావరణ మార్పులు, కోవిడ్ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితులను దీటుగా తట్టుకోవాలన్నా లింగవివక్షను రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎఫ్ఏఓ నివేదిక స్పష్టం చేసింది. లింగ వివక్షను తగ్గించి మహిళా సాధికారతను పెంచే పథకాల వల్ల సగానికి సగం చిన్న రైతులకు మేలు జరుగుతుంది. 5.8 కోట్ల మంది ఆదాయం పెరుగుతుంది. మరో 23.5 కోట్ల మందికి విపత్తులను తట్టుకొనే శక్తి పెరుగుతుందన్నది తమ అంచనా అని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు తెలిపారు. ఏ ముప్పు అయినా మహిళలనే ముందు దెబ్బతీస్తుంది. కోవిడ్ మహమ్మారి వచి్చన మొదటి ఏడాదిలో ఆహార శుద్ధి, పంపిణీ రంగంలో 22% మహిళల ఉద్యోగాలు పోతే, 2% పురుషుల ఉద్యోగాలు పోయాయి. కరువు కాటకాలు, ఉష్ణోగ్రతలు పెచ్చుమీరిన సంక్షోభ కాలాల్లో వ్యవసాయ–ఆహార రంగాల్లో పనిచేసే మహిళల బిడ్డల పోషణ, ఇంటి పనికి అదనంగా దూరం వెళ్లి నీళ్లు తెచ్చే భారం పెరిగిపోతోంది. అల్ప, మధ్య తరహా ఆదాయ దేశాల్లో మొబైల్ ఇంటర్నెట్ సదుపాయం విషయంలో లింగ వివక్ష 25% నుంచి 16 శాతానికి తగ్గినట్లు గుర్తించారు. గత పదేళ్లుగా అనేక దేశాల్లో మహిళలకు అనుకూల విధానాలు వస్తున్నప్పటికీ వ్యవసాయం–ఆహార రంగాల్లో పెద్ద మార్పు కనిపించట్లేదు. 68 దేశాల్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 75% విధానాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తించినప్పటికీ లింగవివక్షను తగ్గించే ప్రయత్నాలు 19% విధానాల్లోనే కనిపించింది. విధాన నిర్ణేతలు క్షేత్రస్థాయిలో లింగవివక్షను తగ్గించేందుకు మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని ఎఫ్ఏఓ సూచించింది. గొడ్డు చాకిరీ.. 18% తక్కువ ఆదాయం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, ఆహార వ్యవస్థలపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య 400 కోట్లు. ఏటా 1,100 కోట్ల టన్నుల ఆహారోత్పత్తి జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సగటున 36% మంది మహిళలకు, 38% మంది పురుషులకు ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. అయితే ఆఫ్రికా దేశాల్లో 66% మంది మహిళలకు వ్యవసాయమే ఉపాధి. చిన్న, సన్నకారు రైతులకు నిలయమైన భారత్ తదితర దక్షిణాసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువ. ఈ దేశాల్లో 71% మంది మహిళలు (మహిళా రైతులు, కూలీలు, ఉద్యోగినులు) వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్నారు. అలాగే పురుషులు 47% మంది ఉపాధి పొందుతున్నారు. అయితే కూలికి వెళ్లే వారిలో పురుషులకన్నా మహిళల సంఖ్యే తక్కువ. గత పదేళ్లలో పొలం పనులపై ఆధారపడే వారి సంఖ్య 10% తగ్గినట్లు ఎఫ్ఏఓ.నివేదిక చెబుతోంది. వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్న మహిళల పని పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. గొడ్డు చాకిరీ చేసినా పని భద్రత లేదు. పార్ట్‌టైమ్ పనులు, కొన్నాళ్లు మాత్రమే ఉండే పనులు, తక్కువ నైపుణ్యం అవసరమైన పనులే మహిళలకు ఇస్తున్నారు. అందువల్ల పురుషులకన్నా 18% తక్కువగా వారి ఆదాయం ఉంటోంది. కౌలు రైతులకు మరీ కష్టం.. భూమిని కౌలుకు తీసుకున్న మహిళా రైతులు తీవ్ర అభద్రతకు గురవుతున్నారని ఎఫ్ఏఓ పేర్కొంది. 46 దేశాల్లో గణాంకాలను పరిశీలిస్తే 40 దేశాల్లో పురుష రైతులకు ఎక్కువ భూమి హక్కులు ఉన్నాయి. అదేవిధంగా కౌలు నిబంధనలు కూడా వారికి అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు మహిళా రైతులకు రుణ సంస్థల నుంచి పరపతి అందట్లేదు. శిక్షణా అవకాశాలు మహిళలకు అంతగా అందుబాటులో ఉండట్లేదు. అన్నిటికన్నా మించి పురుషులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సాంకేతికతలు, యంత్రాలనే మహిళలు ఉపయోగించాల్సి వస్తోంది. ఈ అసమానతల వల్ల సమాన విస్తీర్ణంలో పంటలు సాగు చేసిన పురుషులకన్నా మహిళలు సాగు చేసిన పొలాల్లో ఉత్పాదకత 24% తక్కువగా వస్తున్నట్లు ఎఫ్ఏఓ నివేదిక తెలిపింది. ఇప్పుడు మహిళల కోసం వ్యవస్థలు పనిచేయాలి వ్యవసాయ, ఆహార రంగాల్లో లింగ అసమానతలను స్థానికంగా ఎక్కడికక్కడ పరిష్కరించి మ హిళలకు సాధికారత కలి్పస్తే పేదరికాన్ని అంతం చేయడం, ఆకలి కేకలులేని ప్రపంచాన్ని సృష్టించ డం వంటి లక్ష్యాల సాధన కృషిలో ప్రపంచం ముందుకు దూసుకుపోతుంది. వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలు అనాదిగా పనిచేస్తున్నారు. వారి కోసం ఈ వ్యవస్థలు పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. – డా. క్యూ డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) చదవండి: కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే -
లింగ సమానత్వానికి మరో 300 ఏళ్లు పడుతుంది: గుటేరస్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న లింగ అసమానతలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం మన కళ్ల ముందే కనుమరుగు అవుతోందని పేర్కొన్నారు. మహిళలు, పురుషుల మధ్య అంతరాలు తగ్గడానికి ఇంకో 300 ఏళ్లు పడుతుందని, ఇది బాధాకరం అన్నారు. మహిళల హోదా విషయంపై ఐరాస సెషన్లో సోమవారం మాట్లాడుతూ గుటేరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల హక్కులను అవహేళన చేస్తూ, ప్రమాదంలోకి నెడుతూ, ఉల్లంఘిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. లింగసమానత్వంపై సాధించిన దశాబ్దాల పురోగతి మన కళ్ల ముందే కనుమరుగు కావడం ఆలోచించాల్సిన విషయమన్నారు. అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కులను తాలిబన్ ప్రభుత్వం కాలరాస్తున్న విషయాన్ని కూడా గుటెరస్ ప్రస్తావించారు. సాధారణ ప్రజా జీవితానికి వాళ్లను దూరం చేశారని చెప్పారు. చాలా దేశాల్లో మహిళల లైంగిక, పునరుత్పత్తి హక్కులను కూడా హరించివేస్తున్నారని తెలిపారు. కొన్ని దేశాల్లో పాఠాశాలకు వెళ్లే చిన్నారులను కిడ్నాప్ చేసి దాడులు చేస్తున్నారని, మరికొన్ని దేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వాళ్లపై దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు. లింగ సమానత్వ అంతరం రోజురోజుకు మరింత పెరుగుతోందన్నారు. చదవండి: అంటార్కిటికా కరిగిపోతోంది! -
క్షణ క్షణం వివక్షను ఎదుర్కొంటున్న మహిళ: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: కంపెనీల ప్రకటనలు మొదలు కొని సినిమాల వరకూ మహిళను వివక్షతో చిత్రీకరించడాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు నిరసించాలని, అలాంటి ప్రకటనలు, సినిమాలను తిరస్కరించడం, తమ అభ్యంతరాలను స్పష్టంగా చెప్పడం అవసరమని తెలంగాణ గవర్నర్, పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నా.. విస్తృత స్థాయిలో సమాజంలో మాత్రం వివక్ష కొనసాగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రింట్, వీడియో, సినిమాల్లో లింగ వివక్ష, మహిళలను నిర్దిష్ట దృక్కోణం (స్టీరియో టైపింగ్)లో చూపడాన్ని నియంత్రించడం, రూపుమాపడం లక్ష్యంగా ఇండియన్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) శుక్రవారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘వాయిస్ ఆఫ్ ఛేంజ్’’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళలు నిత్యం వివక్షకు గురవుతూనే ఉన్నారని, ప్రతిక్షణం మహిళను నిర్దిష్ట దృక్కోణంతో చూపుతున్నారని ఈ సందర్భంగా గవర్నర్ సోదాహరణంగా వివరించారు. మహిళలు గవర్నర్లు కారని.. వయసు మీరిన పురుషులే అవుతారన్నట్టుగా ఎనిమిదేళ్ల బాలిక చెప్పడాన్ని తాను ఒక విమానాశ్రయంలో విన్నానని తెలిపారు. ఆఖరుకు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కొన్ని పోటీల్లో బహుమతులుగా వంట పాత్రలు ఇస్తున్నట్లు ప్రకటించారని.. వారి దృష్టిలో ఆడవారంటే వంటిల్లుకు మాత్రమే పరిమితం అని వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పుడు పురుషుల కంటే మహిళ పైలట్లే ఎక్కువగా ఉన్నారని విమానయాన శాఖ మంత్రి తనతో చెప్పినప్పుడు ఎంతో సంతోషించానని, దురదృష్టవశాత్తూ సమాజంలో చాలామంది పాత, మూస పద్ధతుల్లోనే మహిళలను చూస్తున్నారని అన్నారు. సమాజంలో పదిరెట్లు ఎక్కువ కష్టం మాది... ప్రకటనల్లో లింగ వివక్షను ప్రస్తావిస్తూ.. ‘‘ఒక దాంట్లో మహిళ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను చూపారు. ఫర్వాలేదని అనుకుంటూండగానే.. ఆమె ఓ పురుషుడి బనియన్ చూసి తన్మయంతో ఊగిపోతున్నట్లు చూపారు. ఆఖరుకు పురుషుడి లోదుస్తుల ప్రకటనకూ మహిళను స్టీరియోటైపింగ్ చేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తంజావూర్ మెడికల్ కాలేజీలో గైనకాలజిస్టుగా ఉండగా... కవలల తల్లి మగబిడ్డకు చనుబాలు, ఆడబిడ్డకు పలచన చేసిన ఆవుపాలు ఇచ్చిన సంఘటన తాను గమనించానని అన్నారు. ఇలాంటి అంశాల విషయంలో సమాజం మైండ్‌సెట్ మారాలని.. ప్రకటనలు తయారు చేసే వారు కూడా ఈ మార్పునకు తమవంతు సాయం అందించాలని కోరారు. మీడియా, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారు ఇలాంటి అంశంపై చర్చించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఐఏఏను ప్రశంసించారు. సమాజంలో మహిళలు అన్ని విషయాల్లోనూ పురుషుల కంటే పది రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ఇకపై లింగ వివక్ష, స్టీరియోటైపింగ్ విషయాల్లో అందరూ తమ అభ్యంతరాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మాత్రమే ఈ మార్పు సాధ్యమని వివరించారు. ‘నిర్భయ’ తరువాత కొంత మార్పు... ప్రకటనలు, సినిమాలు, ఇతర కంటెంట్లలో మహిళ వివక్ష, స్టీరియోటైపింగ్ నిర్భయ ఘటన మారిందని, బాధితుల పేర్లు ప్రస్తావించకపోవడం మొదలుకొని, వారినే దోషులుగా చూపడం వరకూ మీడియా సంయమనంతో వ్యవహరిస్తోందని పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ.ఎల్.శారద తెలిపారు. డిజిటల్ మాధ్యమం కారణంగా మహిళల అంశాలపై వివరంగా చర్చించే అవకాశం లభిస్తోందని, ప్రకటనలు ఇతర కంటెంట్లలో మహిళలను కించపరచడం తగ్గిందని, యువతకు సంబంధించిన ప్రకటనలో అందరినీ కలుపుకుపోయేలా కంటెంట్ ఉంటోందని ఆమె వివరించారు. ఈ మార్పు భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్న ఆశాభావాన్ని డాక్టర్ ఏఎల్ శారద వ్యక్తం చేశారు. అంతకుముందు యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్స్ నిపుణులు గీతాంజలి మాస్టర్ మాట్లాడుతూ ప్రకటనల్లో లింగవివక్ష, స్టీరియోటైపింగ్‌లపై యునిసెఫ్ జరిపిన పరిశోధన వివరాలను వెల్లడించారు. సమావేశంలో యాక్సెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ చారులత రవికుమార్ ‘రెస్పాన్సిబుల్ కమ్యూనికేషన్’ అన్న అంశంపై ప్రసంగిస్తూ కంటెంట్‌లో ఇప్పటికే సున్నితంగా.. పరోక్షంగా లింగవివక్ష కొనసాగుతోందని వివరించారు. ఐఏఏ ఇండియ ఛాప్టర్ అధ్యక్షులు అవినాశ్ పాండే, ఐఏఏ విమెన్స్ ఎంపవర్మెంట్ కమిటీ ఛైర్పర్సన్ నీనా ఎలవియా జైపూరియా, ‘సాక్షి’ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘జెండర్ కాన్షస్ అండ్ పర్పస్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్’ ‘జెండర్ కాన్షస్ క్రియేటివిటీ ఇన్ కమ్యూనికేషన్స్’, ‘కాన్షస్ క్రియేటివిటీ ఇన్ ఫిల్మ్స్, ఓటీటీ, అండ్ అడ్వర్టైజింగ్’ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ నడిచింది. యాంకర్ స్వప్న సమన్వయకర్తగా వ్యవహరించగా సినీ నటుడు అవసరాల శ్రీనివాస్, దర్శకులు నందినీ రెడ్డి, వైల్యులు ప్రణతి రెడ్డి, ఐపీఎస్ అధికారిణి శిఖా గోయెల్ తదితరులు పాల్గొన్నారు. కాస్మోస్ మాయా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో మేఘ తాత ఒక ప్యానెల్ డిస్కషన్‌కు సమన్వయ కర్తగా వ్యవహరించారు. చదవండి: అసెంబ్లీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం.. -
లింగ పక్షపాతంపై ఐఏఏ సదస్సు.. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ), ఇండియా చాప్టర్ ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లోని టీ-హబ్ వేదికగా 'జెండర్ సెన్సిటైజేషన్ ఇన్ మీడియా' అంశంపై సదస్సు నిర్వహిస్తోంది. 30 సెకన్ల TV ప్రకటన నుంచి నుంచి 3 గంటల సినిమాల్లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయంపై చర్చించనున్నారు. పరిశ్రమలో లింగ పక్షపతాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన ఆవశ్యకతపై మాట్లాడనున్నారు. 'వాయిస్ ఆఫ్ ఛేంజ్' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌కు ప్రిన్సిపల్ పార్ట్నర్గా సాక్షి మీడియా గ్రూప్, నాలెడ్జ్ పార్ట్నర్గా యూనిసెఫ్ వ్యవహరిస్తున్నాయి. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అనేది అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, మీడియాకు ప్రాతినిధ్యం వహించే ఏకైక ఏకీకృత ప్రకటనల వాణిజ్య సంస్థ. ఇందులో కార్పొరేట్, విద్యా అనుబంధ సంస్థలు, టాప్-10 దేశాలతో పాటు ప్రపంచవ్యప్తంగా 76 దేశాలకు చెందిన యువ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. 80 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. -
ప్రతిస్పందించే తీరులో మెదడుకూ ‘జెండర్’ భేదం.. ఆసక్తికర విషయాలు ఇవే..
విషయాలను అర్థం చేసుకోవడంతో పాటు వివిధ అంశాలపై ప్రతిస్పందించే తీరులో మెదడుకూ లింగ భేదం (బ్రెయిన్ జెండర్) ఉందని తేలింది. విభిన్న రంగాలను, విషయాలను అర్థం చేసుకునే విషయంలో ‘జెండర్’ ప్రధాన అంశంగా ఉన్నట్టుగానే.. తాజాగా జరిగిన మెదడు అధ్యయనంపై కూడా ‘జెండర్’ ప్రధాన భూమిక ΄పోషిస్తోందని తెలుస్తోంది. మెదడుకు సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పటికీ తెలియనప్పటికీ ‘జెండర్’ కేంద్రంగా జరిగిన తాజా అధ్యయనాలు మాత్రం విచిత్రంగానూ, కొంచెం విభిన్నంగానూ ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ కేజీ రాఘవేంద్రారెడ్డి: మనిషి మెదడు.. ఓ అంతుచిక్కని వ్యవహారం. మనిషి మొత్తం బరువులో కేవలం 2 శాతం బరువు ఉండే మెదడు మనిషి ఉపయోగించే మొత్తం ఆక్సిజన్‌లో ఏకంగా 20 శాతం ఉపయోగించుకుంటుంది. అంటే ఏ స్థాయిలో మెదడు పనిచేస్తుందో ఇది తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటికీ మెదడును ఏ మేరకు అర్థం చేసుకున్నామని అడిగితే.. ‘మనం ఇంకా క్రిమికీటకాల మెదడునే అర్థం చేసుకోలేదు’ అని అలెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ క్రిస్టోఫ్ కోచ్ చెబుతున్నారు. వాస్తవానికి మనిషి మెదడులో 86 బిలియన్ సెల్స్ ఉంటాయి. వీటికి 100 ట్రిలియన్ కనెక్షన్లు ఉంటాయని అంచనా. కానీ.. క్రిమికీటకాల మెదడులో కేవలం 302 సెల్స్ ఉంటాయి. అయినా పురుగు మెదడునే ఇంకా అధ్యయనం చేయలేక΄ోతున్నామని కోచ్ చెబుతున్నారంటే.. మనిషి మెదడును అధ్యయనం చేసేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో ఊహించడానికి కూడా కష్టమే. కాగా, ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో తాజాగా నిర్వహించిన పరిశోధన కాస్త విభిన్నంగా సాగింది. ఇది మగ/ఆడ (జెండర్) మెదళ్ల మధ్య వ్యత్యాసాలను తేటతెల్లం చేసింది. భావోద్వేగ సంబంధాలకే ప్రాధాన్యం పురుషులతో పోలిస్తే మహిళలు భావోద్వేగ సంబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని మరికొందరు తమ అధ్యయనాల ద్వారా గుర్తించారు. ఇందుకోసం అప్పుడే పుట్టిన పిల్లలు తమ మొదటి 24 గంటల సమయాన్ని ఎవరు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారో అధ్యయనం చేయడం ద్వారా నిర్ణయానికి వచ్చామని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇందుకోసం మొబైల్ బొమ్మతో ΄పాటు కొద్దిమంది వ్యక్తులను ఎదురుగా ఉంచి.. అప్పుడే పుట్టిన 102 మంది పిల్లలపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన సైమన్ బారన్, కోహెన్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పుట్టిన తర్వాత మొదటి 24 గంటల΄పాటు ఎంతసేపు మొబైల్ బొమ్మతోను, మనుషులతోను పిల్లలు సమయాన్ని వెచి్చస్తున్నారో తెలుసుకునేందుకు దీనిని చేపట్టారు. విచిత్రంగా మగపిల్లలు ఎక్కువగా మొబైల్ బొమ్మను చూడటంపైనే దృష్టి కేంద్రీకరించారు. ఆడ పిల్లలు మాత్రం ఎక్కువగా మనుషులవైపే తమ దృష్టిని ఎక్కువ సమయం కేంద్రీకరించడం గమనార్హం. అంటే పుట్టుకతోనే అబ్బాయిలకు వస్తువులపైన, అమ్మాయిలకు బంధాలపై ఎక్కువ అటెన్షన్ ఉంటుందని తేల్చారు. అయితే, కేవలం ఈ ఒక్క అంశం ద్వారానే తుది నిర్ణయానికి రాలేమని మరి కొద్దిమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా జెండర్ అంశం కేంద్రంగా మెదడు అధ్యయనాలు జరగడం ద్వారా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటాన్ని మాత్రం లింగభేదంతో సంబంధం లేకుండా అందరూ ఆహా్వనించాల్సిందే. పురుషుల్లోనే భయం ఎక్కువ.. సహజంగా శారీరక దారుఢ్యం మహిళల కంటే పురుషులకే కాస్త ఎక్కువనేది తిరుగులేని వాస్తవం. ఇందుకు జన్యుపరమైన అంశాలతో ΄ాటు తరతరాలుగా జరిగిన పని విభజన కూడా ఒక కారణంగా చెబుతారు. కానీ.. మెదడు విషయానికి వస్తే శారీరక దారుఢ్యంతో΄ాటు మెదడు పరిమాణం కూడా స్త్రీలతో ΄ోలిస్తే మగవారిలో కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు తేలింది. లైజ్ ఎలియట్, అతని టీం సభ్యులు చేసిన అధ్యయనాల ప్రకారం.. పురుషుల మెదడు స్త్రీల మెదడు కంటే పరిమాణంలో 15 శాతం పెద్దగా ఉంటుందని తేలింది. ఇందుకు అనుగుణంగా అమిగ్డాలా (మనిషి భావోద్వేగంతో ముడిపడిన మెదడులోని ఒక భాగం) కూడా పరిమాణంలో పురుషుల్లోనే ఎక్కువ. పురుషుల్లోని అమిగ్డాలాను స్త్రీలలోని అమిగ్డాలాతో ΄ోల్చి అధ్యయనం చేస్తే పురుషుల్లోనే ఎక్కువ భయం ఉంటుందని వీరి అధ్యయనాల్లో తేలింది. స్త్రీలలోనే భావోద్వేగాలు అధికం పురుషులు, మహిళల్లో ఎవరికి ఎక్కువ భావోద్వేగం ఉంటుందనే అంశంపైనా పరిశోధనలు జరిగాయి. జీవితంలో జరిగిన ఏదైనా ఘటన లేదా సామాజికంగా బాగా గుర్తుండి΄ోయేలా జరిగిన బాధాకరమైన ఘటనలను గుర్తుచేస్తే ఏం జరుగుతుందో పరిశీలించారు. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకే అటువంటి భావోద్వేగ ఘటనలు గుర్తుకు వస్తున్నాయని తేలింది. పురుషులతో ΄ోలిస్తే ఆ సంఘటన తాలూకు వివరాలను స్త్రీలు వెంటనే గుర్తుతెచ్చుకోవడంతో ΄ాటు పురుషుల కంటే ఎక్కువగా ఆ ఘటనలకు సంబంధించిన విషయాలను కూడా పేర్కొనడాన్ని గమనించారు. మెదడుపై ‘జెండర్’ అధ్యయనాల్లో కొన్ని.. జెండర్ కేంద్రంగా ఇప్పటికే వివిధ పరిశోధనలు జరిగాయి. 1991లో మొదలైన ఈ అధ్యయనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. - మొదటిసారిగా 1991లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన డయాన్ హాల్పెర్న్ ‘సెక్స్ డిఫరెన్సెస్ ఇన్ కాగి్నటివ్ ఎబిలిటీస్’ అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. - 1995లో స్టాండ్ఫర్డ్ ప్రొఫెసర్ నైరో షా... స్త్రీ, పురుషుల మెదళ్లపై అధ్యయనం చేశారు. - 2017లో జెండర్ కేంద్రంగా పలువురు రాసిన 70 ఆరి్టకల్స్తో కూడిన ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ రీసెర్చ్’ ప్రత్యేక సంచికను ్ర΄÷ఫెసర్ లారి కాహిల్ వెలువరించారు. - 2021లో బ్రిటన్‌లో 40 సంవత్సరాల వయసు పైబడిన 5 లక్షల మందికి చెందిన జెనటిక్, హెల్త్ డేటాపై ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన గినా రిప్పన్ అనే న్యూరో బయాలజిస్టు అధ్యయనం చేశారు. -
ఆమె కోసం అతడుగా మారిన టీచర్!
ప్రేమ ఎంతపనైనా చేయిస్తుందనడంలో సందేహం లేదు. అందుకు సంబంధించిన పలు ఘటనలు ఎన్నో చూశాం. అచ్చం అలానే ఇక్కడొక మహిళ తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు అతడిగా మారింది. వివరాల్లోకెళ్తే...రాజస్తాన్‌కి చెందిన కుంతల్ అనే పీటీ టీచర్ తన విద్యార్థి కల్పనా ఫౌజ్దార్తో ప్రేమలో పడింది. అదీగాక కల్పన రాష్ట్రస్థాయి కబడ్డీ ప్లేయర్. దీంతో వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగి ప్రేమగా మారిందని చెబుతోంది ఆ జంట. అంతేకాదు ఆ మహిళ టీచర్ తను ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిగా మారాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. తాను మహిళాగా జన్మించినప్పటికీ తాను అబ్బాయిగానే భావించేదాన్ని అని చెబుతోంది కుంతల్. ఈ మేరకు సదరు టీచర్ 2019లో సర్జరీ చేయించుకుని అతడుగా మారింది. ఆ తర్వాత ఆ టీచర్ తన పేరుని ఆరవ్‌గా మార్చుకుంది. ఈ క్రమంలో ఆమె ప్రియురాలు కల్పన మాట్లాడుతూ.... తనకు మొదటి నుంచి ఆమె అంటే ఇష్టం అని సర్జరీ చేయించుకోకపోయినా ఆమెనే పెళ్లి చేసుకునే దాన్ని అని చెబుతోంది. భారతీయ సామాజిక నిబంధనలకు తమ విహహం విరుద్ధమైనా తమ తల్లిదండ్రులు అంగీకరించారని ఆ జంట ఆనందంగా చెబుతోంది. (చదవండి: తప్పతాగి మహిళ గదిలో నగ్నంగా.. ప్రముఖ కంపెనీ అధికారి నిర్వాకం వెలుగులోకి!) -
ఇంటర్వ్యూలో ఆమె వయసు అడిగినందుకు... పరిహారంగా రూ. 3 లక్షలు..
అమ్మాయి వయసు మగాడి జీతం అడగకూడదని పెద్దలు అంటుంటారు. బహుశా ఇందుకేనేమో పాపం ఆ కంపెనీ ఇంటర్వ్యూలో అమ్మాయి వయసు అడిగినందుకు పరిహారంగా ఏకంగా రూ. 3లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే...డోమినోస్ పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగ ఇంటర్వ్యూలో నార్తర్న్ ఐర్లాండ్‌లోని జానిస్ వాల్ష్ అనే మహిళ ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూ సంభాషణలో ఆమె వయసు గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. వాస్తవానికి వాల్ష్ ఈ ఇంటర్వ్యూలో ఎంపికైంది కానీ ఆమె వయసు కారణంగా తిరస్కరణకు గురైనట్లు తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురైంది. అదీగాక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులనే తీసుకుంటారని తెలుసుకున్న తర్వాత తాను లింగ వివక్షతకు గురైనట్లు తెలుసుకుంది. దీంతో వాల్ష్ తాను ఇంటర్వ్యూలో వయసు వివక్షత కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయానని వివరిస్తూ... డోమినోస్ స్టోర్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. వెంటనే ఇంటర్వ్యూ చేసిన సదరు వ్యక్తి క్విర్క్ ఆమెకు క్షమాపణలు చెప్పడమే గాక వయసు గురించి అడగకూడదని తనకు తెలియదని వివరణ ఇచ్చాడు. కానీ ఆ కంపెనీ మాత్రం పిజ్జా డెలీవరీ జాబ్స్ ప్రకటనను ఇస్తూనే ఉండటంతో...వాల్ష్ మరింత దిగులు చెందింది. తనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ కేవలం మహిళను కావడం వల్లే ఈ ఉద్యోగం రాలేదని భావించి వాల్ష్ కోర్టు మెట్లెక్కింది. ఐతే ఆమెకు ఐర్లాండ్ ఈక్వాలిటీ కమీషన్ మద్దతు లభించింది. వ్యాపారాలు యువతకు ఉపాధిని కల్పించడం తోపాటు సమానత్వాన్ని పాటించాలని, అలా లేనప్పుడు ఉద్యోగులు హక్కులు ఎలా రక్షింపబడతాయని సదరు కంపెనీని కోర్టు ప్రశ్నించింది. వాల్ష్కు సదరు డోమినోస్ కంపెనీ దాదాపు రూ. 3.7 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. (చదవండి: వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!) -
లింగ సమానత్వం.. 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135!
న్యూఢిల్లీ: లింగ సమానత్వం విషయంలో ఐస్లాండ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలిచాయి. మొత్తం 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135! అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చాద్ తదితర దేశాలు అట్టడుగులు స్థానాల్లో నిలిచాయి. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ‘వార్షిక జెండర్ గ్యాప్ రిపోర్ట్–2022’ను బుధవారం చేసింది. లింగ సమానత్వంలో ప్రపంచ దేశాలకు ర్యాంక్‌లను కేటాయించింది. లింగ అంతరం పూర్తిగా సమసిపోవడానికి మరో 132 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. లింగ సమానత్వంలో భారత్ వెనుకంజలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషకరమని పేర్కొంది. మహిళా ప్రజాప్రతినిధులు తదితరుల సంఖ్యలో పెరుగుదల కన్పించింది. చదవండి: లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే! -
భారత్‌లో లింగ సమానత్వానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
జెనీవా: భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా లింగ సమానత్వంలో మాత్రం వెకబడిపోయింది. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 'వార్షిక లింగ అంతర నివేదిక 2022' ప్రకారం భారత్ 135వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం మెరుగైనా.. ఇంకా అట్టడుగునే కొనసాగుతోంది. ఐలాండ్స్ మరోమారు లింగ సమానత్వంలో తన తొలిస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజీలాండ్, స్వీడన్లు ఉన్నాయి. మరో 132 ఏళ్లు.. మొత్తం 146 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. భారత్ అట్టడుగున 135వ స్థానంలో నిలవటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ కన్నా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్, ఛాడ్ వంటి 11 దేశాలు మాత్రమే వెనబడి ఉన్నాయి. జీవన వ్యయం పెరిగిపోతుంటటం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య అంతరం పెరిగిపోతోందని డబ్ల్యూఈఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దాని ప్రకారం భారత్‌లో స్త్రీపురుషులు సమానంగా మారేందుకు మరో 132 ఏళ్లు(2021లోని 136వ ర్యాంకు ప్రకారం) పడుతుందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సైతం లింగ అంతరంలో ఓ తరం వెనక్కు వెళ్లేలా చేసిందని తెలిపింది. గడిచిన 16 ఏళ్లలో భారత ర్యాంకు 7 స్థానాలు ఎగబాకినా.. ఇంకా అట్టుడుగునే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూఈఎఫ్.' భారత్‌లోని సుమారు 662 మిలయన్ల మంది మహిళ జనాభాతో ప్రాంతీయ ర్యాంకులపై ప్రభావం పడుతోంది. 2021తో పోలిస్తే.. ఆర్థిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం, అవకాశాల్లో మెరుగైనప్పటికీ.. కార్మిక శక్తిలో మరింత కిందకు పడిపోయింది. శాసనకర్తలు, ఉన్నతాధికారులు, మేనేజర్స్ విభాగాల్లో మహిళలు 14.6 శాతం నుంచి 17.6 శాతానికి చేరుకున్నారు. సాంకేతిక, వృత్తి నిపుణుల్లో మహిళలు 29.2 నుంచి 32.9 శాతానికి చేరారు. వారి ఆదాయం పెరిగింది. అయితే.. మగవారితో పోలిస్తే వారికి అందే గౌరవంలో మాత్రం అంకా వెనకబడే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మగవారి కోసం వారిని తిరస్కరిస్తున్నారు.' అని పేర్కొంది నివేదిక. ఆ విభాగంలో ఊరట.. మహిళల రాజకీయ సాధికారతలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. గత యాభై ఏళ్లుగా మహిళలకు రాజకీయాల్లో దక్కుతున్న స్థానం చాలా తక్కువ. దాంతో ఈ ర్యాంకు మరింత పడిపోయినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. మరోవైపు.. ఆరోగ్యం, జీవన విధానంలో భారత్ 146వ స్థానానికి పరిమితమైంది. లింగ అంతరం 5 శాతానికిపైగా ఉన్న ఐదు దేశాల్లో ఒకటిగా నిలిచింది. అయితే.. భారత్‌కు ఊరట కలిగించే విషయం ఏంటంటే ప్రాథమిక పాఠశాలల నమోదులో లింగ సమానత్వంలో టాప్‌లో నిలిచింది. ఇదీ చూడండి: ప్లాస్టిక్‌ను తినేసే 'రోబో ఫిష్'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు! -
పురుషులకు అండగా స్త్రీ గొంతుక
ఏ చిన్న ఆరోపణ వచ్చినా మహిళలపై ఉన్న సానుభూతితో పురుషుణ్ణి దోషిగా నిర్ధారించి, వెనకా ముందు చూడకుండా శిక్ష విధిస్తారు. పురుషులు కూడా ఒకరికి తండ్రి, మరొకరికి భర్త, ఇంకొకరికి అన్నయ్య లేదా తమ్ముడు అయ్యుంటారు. వారికి సరైన న్యాయం అందాలి అని అంటున్నది మరో పురుషుడు కాదు స్త్రీమూర్తి. అవును మీరు చదివింది నిజమే. సమాజంలో చేయని నేరానికి అన్యాయంగా శిక్షను అనుభవిస్తోన్న ఎంతోమంది పురుషుల కోసం నడుం బిగించి పోరాడుతోంది బర్ఖా త్రెహాన్. సాటి మహిళలకు కాకుండా మగవారి తరపున పోరాడుతూ మీటూతోపాటు ‘మెన్టు’ కూడా ఉంది. దీనిని మనమంతా గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది అని నొక్కి చెబుతోంది. ఒక స్త్రీగా సాటి మహిళలకు అండగా నిలవాల్సిందిపోయి మగవాళ్ల సాధక బాధలను అర్థం చేసుకుని వారితరపున పోరాడుతోన్న బర్ఖా త్రెహాన్ అల్లాహాబాద్లో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనైనా న్యాయం పక్కన నిలబడి గొంతువిప్పి మాట్లాడే స్వభావం తనది. పెళ్లి చేసుకుని ఢిల్లీకి వచ్చాక ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. ఈ సమయంలో కూడా న్యాయం తరపున నిలబడేది. స్నేహితుడిపై వచ్చిన ఆరోపణతో... ఒకసారి బర్ఖా స్నేహితుడు ఓ అమ్మాయిని అత్యాచారం చేశాడన్న ఆరోపణతో చీకటి గదిలో పడేశారు. ఆవిషయం గురించి తెలుసుకున్న బర్ఖా లోతుగా విచారించగా.. అది అబద్ధపు ఆరోపణ అని తెలిసింది. ఆరోపణ చేసినవారు ఉద్దేశ్యపూర్వకంగా చేసారని నిరూపించడానికి ప్రయత్నించింది. ఈ కేసులో భాగంగా ఇలా ఎంతోమంది మగవాళ్లు అసత్య ఆరోపణలతో తీవ్రంగా బాధింపడుతున్నారని గ్రహించింది. అప్పటి నుంచి వారి తరపున నిలబడి పోరాడుతోంది. కమిషన్ ఉండాలి.. ఇండియాలో పక్షులు, జంతువులు, మొక్కల పరిరక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ మగవాళ్ల గోడును వినే కమిషన్లు గానీ చట్టాలు కానీ ఏవీ లేవు. మహిళలకంటే పురుషులు ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని తన పరిశీలనలో తెలుసుకున్న బర్ఖా..దీనిని సీరియస్‌గా తీసుకుని పురుషులకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ‘మెన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా తన దృష్టిలోకి వచ్చిన అనేకమంది సమస్యలను పరిష్కరిస్తోంది. భౌతిక దాడులకు గురైన భర్తలకు తగిన సహాయ సహకారాలు అందిస్తోంది. ఇలా తనకు చేతనైన రీతిలో న్యాయం చేస్తోన్న బర్ఖాను ఎంతోమంది ట్రోల్ చేయడం, చంపేస్తామని బెదిరింపులు వచ్చినప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తోంది. వారి వేదనను అర్థం చేసుకోవాలి ‘‘ఎన్ని సమస్యలు వచ్చినా నేను పోరాడతాను. ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదు. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న పోరాటాన్ని ఎవరూ ఆపలేరు. నేను సమాజంలో మార్పు కోరుతున్నాను. ప్రభుత్వాలు మగవాళ్లకు ప్రత్యేకంగా చట్టాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. వారి మనో వేదనను కూడా అర్థం చేసుకోవాలి’’ అని బర్ఖా ప్రభుత్వాలను కోరుతోంది. -
నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎల్జీబీటీక్యూ+ (లెస్బియన్, గే, ద్విలింగ, ట్రాన్స్‌జెండర్, క్వీర్ ప్లస్ ) విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఒకడుగు ముందుండే నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) మరో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. లింగ గుర్తింపు లేనివారి కోసం హాస్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లేడీస్ హాస్టల్–6లో ఏర్పాట్లు.. నల్సార్‌లో బాలికల హాస్టల్–6 భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ను పూర్తిగా లింగ గుర్తింపు లేని (జెండర్ న్యూట్రల్)వారికోసం కేటాయించారు. అకడమిక్ బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో లింగ గుర్తింపు లేనివారి కోసం వాష్‌రూమ్స్‌ను ఏర్పాటు చేశామని నల్సార్ వైస్ చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. ఇక ‘జెండర్, సెక్సువల్ మైనారిటీ’అంశాలపై సమగ్ర విద్యా విధానం కోసం యూనివర్సిటీ ట్రాన్స్ పాలసీ కమిటీ ముసాయిదా విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. 2015 జూన్‌లో నల్సార్‌లోని ఓ 22 ఏళ్ల బీఏ ఎల్ఎల్బీ విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో జెండర్ గుర్తింపు వద్దని వర్సిటీ ప్రతినిధులను అభ్యర్థించగా.. ఆ అభ్యర్థనను ఆమోదించి.. సదరు స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో జెండర్ కాలమ్‌లో మిస్టర్, మిస్కి బదులుగా ‘ఎంఎక్స్’గా పేర్కొంటూ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. నల్సార్ వర్సిటీకి రూ.1.50 కోట్ల విరాళం శామీర్‌పేట్: నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆండ్ బిజినెస్ లా(జేఆర్‌సీఐటీబీఎల్) అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం ఏర్పాటుకు దాత జస్టిస్ బీపీ. జీవన్‌రెడ్డి రూ. కోటి 50 లక్షల చెక్కును నగరంలోని ఆయన నివాసంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపారకేంద్రం ఏర్పాటుతో చట్టాల్లో సమకాలిన సమస్యలకు సంబంధించిన బోధన, పరిశోధన చేపట్టే లక్ష్యాలు అయిన సెమినార్లు, ఉపన్యాసాలు, స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. నల్సార్ అండర్ గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, డాక్టోరల్ స్థాయిలో కోర్సులను ప్రారంభించడం, బలోపేతం చేయడం, పరిశోధన, ప్రచురించడానికి విధాన రూపకర్తలతో సహకరించడానికి ఐఎంఎఫ్, ఐబీఆర్‌వో, డబ్ల్యూటీవీ. సీఐఐ, ఎఫ్ఐసీసీఐ మొదలైన వివిధ అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో ఇంటర్నషిప్‌లను పొందడంలో సహాయం చేయడానికి అధ్యాపక బృందం కృషిచేసిందన్నారు. సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి పివి రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ఎం కాద్రీ, జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి, సుప్రీకోర్డు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి, పాట్నా హై కోర్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్. నర్సింహారెడ్డి, తెంలగాణ హై కోర్డు న్యాయమూర్తులు ఉజ్వల్‌భూయాన్, రాజశేఖర్‌రెడ్డి, పి.నవీన్‌రావు, బార్ కౌన్సిల్ చైర్మెన్ జస్టిస్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాకంటూ ఓ గది, ఓ బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి: స్టార్ హీరోయిన్
Konkona Sen Sharma Says She Does Not See Herself As Woman: బాలీవుడ్ బ్యూటీ కొంకణ సేన్ శర్మ పేజ్ 3, ఓంకార, లక్ బై ఛాన్స్, తల్వార్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జెండర్ ఈక్వాలిటీపై తనకున్న భావాన్ని పంచుకుంది. తాను లింగ సమానత్వంలో న్యూట్రల్‌గా ఉంటానని పేర్కొంది. ఈ ఇంటర్వ్యూలో 'నేను ఒక చిత్రంలో ఫెమినిస్ట్‌గా నటించాల్సి వస్తే స్త్రీవాది గురించి తెలుసుకోవాలి. ఆ పాత్రకు తగినట్లుగా ఏదైనా నేర్చుకోవాలి. స్త్రీ అయినా, పురుషుడైనా, మరేవరైనా కచ్చితంగా న్యూట్రల్‌గానే ఆలోచించాలని నేను భావిస్తున్నా. అప్పుడే అందరికీ సమన్యాయం చేయగలుగుతామన్నదే నా అభిప్రాయం. అందుకో నన్ను నేను ఎప్పుడూ ఒక మహిళగా భావించుకోను.' అని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ 2010లో యాక్టర్ రణ్వీర్ షోరేని వివాహం చేసుకుంది. పెళ్లైన ఐదేళ్లకు భర్తతో విడిపోయి 2020లో అధికారికంగా విడాకులు తీసుకుంది. ఈ జంటకు 11 ఏళ్ల కుమారుడు హరూన్ షోరే ఉన్నాడు. తన కొడుకును ఎప్పుడూ స్వేచ్ఛగా ఆలోచించమని చెబుతానని కొంకణ సేన్ తెలిపింది. అలాగే తన మాజీ భర్త గురించి చెబుతూ 'సమాజంలో ఉన్నప్పుడు కొన్నింటి గురించి నేర్చుకోవాలి. కొన్ని నియమాలు పాటించాలి. కానీ ఆయనకు సంబంధించి ఆయన ఏమైనా, ఎలాగైనా అనుకోవచ్చని భావిస్తాడు. జనాల కోసం అన్నింటిని భరిస్తూ ఉండటం నా వల్ల కాదు. నాకంటూ ఓ గది, ఓ బాత్రూమ్, ఏసీ వంటి మరికొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఉంటాలి. కొన్నిసార్లు ఎవరి అనుమతి లేకుండా నాకు నచ్చిన పనులు చేసేలా ఉండాలి.' అని కొంకణ సేన్ శర్మ తెలిపింది. -
‘ధరణి’ ప్రశ్నలకు జవాబేది.. రైల్వే ఆడా, మగా?
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేకు తండ్రి పేరు ఏం రాయాలి? పుట్టిన తేదీ కాలమ్‌లో ఏం నింపాలి? ఇంతకీ ఆడా, మగా అనే చోట ఏం రాయమంటారు?..కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ భూమి యాజమాన్య మార్పిడి కోసం రెవెన్యూ సిబ్బంది అడిగిన ప్రశ్నలివి. వీటికి ఎలాంటి సమాధానం లేదు. ఆ వివరాలను నమోదు చేయకుండా లావా దేవీ నిలిచిపోయింది. దీనికి కారణం ‘ధరణి’ పోర్టల్‌లోని ఓ గందరగోళం. వినడానికి చిత్రంగా కనిపిస్తున్న ఈ సమస్యతో.. తెలంగాణలో కీలక రైల్వే ప్రాజెక్టు జాప్యం అవుతోంది. వాస్తవానికి అంతా సవ్యంగా జరిగి ఉంటే.. వచ్చేనెలలో పార్లమెంటులో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో కాజీపేట రైల్వే ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు జరిగి ఉండే దని అధికారవర్గాలే చెప్తున్నాయి. భూమికి సంబంధించిన కోర్టు కేసులతో దాదాపు 13 ఏళ్లుగా జరుగుతున్న జాప్యం.. ఇప్పుడు ధరణి వల్ల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సమస్య ఎక్కడుంది?: దాదాపు 13 ఏళ్ల కింద కాజీపేటకు రైల్వే వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ మంజూరైంది. కాజీపేట సమీపంలోని మడి కొండలో ఉన్న సీతారామస్వామి దేవాల యానికి చెందిన 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దానిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఏళ్లకేళ్లు జాప్యం జరిగింది. ఈ లోగా రైల్వేశాఖ ఆ ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి మార్చింది. తర్వాత దానిస్థానంలో రూ.383.05 కోట్ల వ్యయ అంచనాతో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపును 2016లో మంజూరు చేసింది. రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు భూమిని కేటాయించకపోవడంతో ఆ నిధులు విడుదల కాలేదు. ఇన్నేళ్ల తర్వాత గత ఏడాది కోర్టుకేసు పరిష్కారమై.. రైల్వేకు భూమిని అప్పగించేందుకు మార్గం సుగమమైంది. నిబంధనల ప్రకారం.. ఆ భూమి పూర్తిగా రైల్వే పేరిట ట్రాన్స్ఫర్ కావాలి, ఆ తర్వాతే ఫ్యాక్టరీ పనులు చేపడతారు. రైల్వే అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర అధికారులకు చెప్పారు కూడా. కానీ ధరణిలో గందరగోళంతో సమస్య వచ్చి పడింది. సంస్థల పేరిట నమోదుకు చాన్స్ లేక.. ధరణిలో వ్యక్తుల వివరాలు నమోదు చేసే వెసులుబాటు ఉందేతప్ప.. సంస్థల పేరిట నమోదు చేసే అవకాశం లేదు. పేరు, తండ్రిపేరు, ఆడా/మగ, పుట్టిన తేదీ, వాటి తాలూకు ఆధారాలు వంటి వివరాలను సంస్థలకు అన్వయించడం కుదరదు. దీనివల్ల రైల్వేకు కేటాయించిన భూముల వివరాలు ధరణిలో చేరడం లేదు. ఇప్పటికే దాదాపు ఎనిమిది నెలల సమయం గడిచిపోయినా.. అధికారులు చిక్కు ముడిని విప్పలేకపోయారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ దగ్గరపడింది. ప్రాజెక్టు భూమి రైల్వే పేరిట ట్రాన్స్ఫర్ కాకపోవడంతో ఈసారి కూడా నిధులు కేటాయించే అవకాశం లేనట్టేనని, మరో ఏడాది వృధా అవుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు త్వరగా సమస్యను కొలిక్కి తెచ్చి.. భూమిని రైల్వే పేరిట మార్చితే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఇక మరో 11 ఎకరాల భూమికి సంబంధించి కూడా కొంత సమస్య నెలకొంది. అందులో పదెకరాలు పరిష్కారమైందని, ఇంకో ఎకరం కేటాయింపు త్వరలో అవుతుందని రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు. అయితే అంతా కలిపి ఇస్తేనే లెక్కగా ఉంటుందని, అసలు భూమి రానప్పుడు ప్రాజెక్టులో కదలికకు అవకాశం ఉండదని రైల్వే అధికారులు తేల్చి చెప్తున్నారు. ఏమిటీ ప్రాజెక్టు? రైల్వేలో వినియోగిస్తున్న గూడ్స్ వ్యాగన్లను నిర్ణీత సమయంలోగానీ, మరమ్మతులు వచ్చినప్పుడుగానీ సరిచేసి.. పూర్తిస్థాయిలో సిద్ధం చేయడం ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు పని. కాజీపేటలో చేపట్టదలచిన ఈ వర్క్‌షాప్‌లో నెలకు వంద గూడ్సు వ్యాగన్లను ఓవర్ హాలింగ్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. దీనితో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. -
ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా?
అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు రాణిస్తున్నా.. పూర్తి సమానత్వం ఇంకా రాలేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇప్పటికీ కొన్ని విషయాల్లో పాత పద్దతులు పాటించడాన్నే సమర్థిస్తున్నారు. కొత్తగా ఎవరైనా ప్రయత్నిస్తే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి విమర్శలు, సూటిపోటీ మాటలతో ఇబ్బంది పడుతున్న ఓ బిజినెస్ విమన్ ఇటీవల వాటి నుంచి విముక్తి పొందింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఆమె తన లింక్డ్ఇన్లో పంచుకుంది. ఆమెకు ఎదురైన అనుభవాలు, వర్క్‌ప్లేస్‌లో కల్చర్ తదితర అంశాలు ఇప్పుడు బిజినెస్ వరల్డ్‌లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలోని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ మేనేజింగ్ కంపెనీల్లో ఒకటైన ఎవల్యూషన్ క్యాపిటల్ పార్టనర్ సంస్థలో జెస్సికా హాంజీ లియోనార్డ్ అనే మహిళ ఇటీవల భాగస్వామిగా చేరింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఎంతో బెరుకుగా ఆమె వాళ్ల బాస్ రూమ్‌లోకి అడుగు పెట్టింది. టాటాల చుట్టే విమర్శలు జెస్సికా హాంజీ లియోనార్డ్‌కి పచ్చబొట్లు (టాటూస్) అంటే ఇష్టం. మణికట్టు నుంచి భుజాలు, మెడ వరకు అనేక డిజైన్లలో పచ్చబొట్లు వేయించుకుంది. అయితే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ హోదాలో అలా పచ్చబొట్లు పొడిపించుకున్నందుకు ఆమెకు తోటి ఉద్యోగుల నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులే ఆమె పట్ల కఠినమైన వ్యాఖ్యలు చేసేవారు. దీంతో ఆ పచ్చబొట్లు కనిపించకుండా ఆమె పొడుగు చేతులు ఉండే దుస్తులు ధరించాల్సి వచ్చేది. మెడ, చెవుల భాగంలో టాటూలు కనిపించకుండా హెయిర్‌స్టైల్‌ను మార్చుకునేది. ఇలాంటి చర్యలతో రణంగా సమ్మర్లో చాలా ఇబ్బందులు పడేది జెస్సికా. ఇంకా దాచలేను టాటూలు ఆమె పాలిట శత్రువులు కావడంతో అనేక కంపెనీలు మారుతూ వచ్చింది. తాజాగా ఎవల్యూషన్ క్యాపిటల్‌లో చేరింది. దీంతో వెబ్సైట్లో ఆమె ఫోటో, ఇతర వివరాలు వెల్లడించాల్సిన అవసరం వచ్చింది. కొత్త ఆఫీసులో టాటూలతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంది. అందుకే బాస్ గదిలోకి అడుగు పెట్టిన జెస్సికా.. భయంభయంగానే తన ఒంటిపై ఉన్న టాటూల సంగతి చెప్పింది. ఇంకా వాటిని దాచి పెడుతూ ఉండలేనంది. ఆఫిషియల్ వెబ్సైట్లో జాకెట్(కోట్)తో కూడిన ఫోటోను అప్లోడ్ చేస్తానని, తన పర్సనల్ లింక్డ్ఇన్లో స్లీవ్‌లెస్ డ్రెస్‌తో టాటూలు కనిపించేలా ఉన్న ఫోటో అప్లోడ్ చేస్తానంటూ రిక్వెస్ట్ చేసింది. బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే టెన్షన్‌తో ఆమెలో పెరిగిపోతోంది. లౌడ్ అండ్ ప్రౌడ్ జెస్సికా రిక్వెస్ట్‌ని విన్న వాళ్ల బాస్ సానుకూలంగా స్పందించారు. ఒక్క లింక్డ్ఇన్లోనే ఎందుకు తమ సంస్థకు సంబంధించిన అఫిషీయల్ వెబ్సైట్లో కూడా టాటూ కనిపించేలా ఉన్న ఫోటోనే అప్లోడ్ చేసుకోమన్నారు. ఈ విషయంలో గోప్యత అనవసరమని.. రెండు చోట్ల స్లీవ్‌లెస్‌తో టాటూలు కనిపించేలా ఫోటోలు అప్లోడ్ చేయ్ విత్ లౌడ్ అండ్ ప్రౌడ్ అంటూ పర్మిషన్ ఇచ్చాడు. పెర్ఫార్మెన్స్ ముఖ్యం నేను కోటు ధరించానా ? స్లీవ్‌లెస్‌లో ఉన్నానా ? నా ఒంటిపై టాటూలు ఉన్నాయా? అనేవి అప్రాధాన్య విషయాలు. నేను ఎలా పని చేస్తున్నాను. నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. వృత్తి పట్ల అంకితభావంతో ఉన్నానా లేనా అనేవే పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇంత కాలం అలా జరగలేదు. నా వృత్తిగత జీవితంలో నా పెర్ఫార్మెన్స్ కంటే టాటూల మీదే ఎక్కువ చర్చ జరిగింది. దీంతో నాకెంతో ఇష్టమైన టాటూలు అంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను. నా మీద ఉన్న ఒత్తిడి తొలగిపోయింది. ఇప్పుడు నేను రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాను అంటూ జెస్సికా లింక్డ్ఇన్లో రాసుకొచ్చింది. చదవండి: దేశంలో మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్న సంస్థలు ఇవే -
వేతనాల్లో మహిళలపై వివక్ష ! ఏడీపీ రీసెర్చ్ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో స్త్రీ, పురుషుల మధ్య వేతన చెల్లింపుల పరంగా అసమానత పెరిగినట్టు ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడైంది. వేతన పెంపులు, బోనస్‌ల పరంగా చూస్తే పురుషల కంటే మహిళలు వెనుకనే ఉన్నట్టు పేర్కొంది. ‘పీపుల్ ఎట్ వర్క్ 2021: ఏ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ వ్యూ’ పేరుతో ఏడీపీ అధ్యయనం నిర్వహించింది. పురుష ఉద్యోగుల్లో 70 శాతం మందికి వేతనాల పెంపు, బోనస్‌ను సంస్థలు ప్రకటించగా.. మహిళల్లో అధిక బాధ్యతలు మోస్తున్నా కానీ 65 శాతం మందికే ఈ భాగ్యం దక్కినట్టు తెలిపింది. కరోనా వల్ల తమ సంస్థలపై అదనపు బాధ్యతలు పడగా.. పురుషులతో సమానంగా మహిళలూ ఈ బాధ్యతలను స్వీకరించారని వివరించింది. ఈ సర్వేలో భాగంగా 17 దేశాల్లో మొత్తం 32,471 మంది ఉద్యోగుల అభిప్రాయాలను ఏడీపీ సేకరించింది. 2020 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉద్యోగుల నుంచి వివరాలు సమీకరించింది. వాటన్నింటీని క్రోడీకరించిన ఏడీపీ.. ఈ వివరాలను తాజాగా విడుదల చేసింది. -
Viral: షేర్వాణీ ధరించి పెళ్లి కూతురు గుర్రపు స్వారీ!
పెళ్లి వేడకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంటాయి. సంప్రదాయం ఏదైనా వివాహ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వరుడు షేర్వాణీ ధరించి గుర్రం మీద పెళ్లికూతురు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వివాహ వేడుకకు వస్తాడు. అయితే వరుడు వచ్చినట్లుగానే వధువు.. షేర్వాణీ ధరించి గుర్రం మీద తన ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమంలో పాల్గొంటుంది. రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో రనోలి గ్రామానికి చెందిన వధువు కార్తిక గుర్రంపై వచ్చి.. ప్రీ-వెడ్డింగ్ ‘బండోరి’ వేడుకల్లో అందరినీ దృష్టిని ఆకర్షించింది. తాము జెండర్ ఇక్వాలిటీ పాటిస్తామని కొడుకు అయినా కూతురైనా ఒకేలా చూస్తామని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అందుకోసమే కార్తిక వివాహం సందర్భంగా ఇలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ఆమె వివాహం సోమవారం జరగాల్సి ఉంది. ‘బండోరి’ వేడుక కోసం కార్తిక స్వయంగా షేర్వాణీ తయారు చేయటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘గుర్రంపై వరుడి కంటే వధువు వస్తేనే బాగుంటుంది’.. ‘జెండర్ ఇక్వాలిటీకి ఇది ఓ ముందడుగు’ అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్‌కు అనుమతి
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళా కానిస్టేబుల్‌కు తీపి కబురు అందించింది. మహిళ విన్నపం మేరకు.. లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఆమెకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స జరుగుతుందని తెలిపారు. ఆమెకు.. చిన్న తనం నుంచి పురుషులలో ఉన్నట్లు కొన్ని లక్షణాలు, హర్మోన్లు ఉన్నట్లు ఆమె గుర్తించింది. దీంతో ఆమె.. 2019లో లింగమార్పిడి శస్త్ర చికిత్సకోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్వాలియర్, ఢిల్లీలోని వైద్యుల సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు.‘లింగమార్పిడి అనేది వ్యక్తి హక్కు..’ అని అన్నారు. అందుకే మహిళా కానిస్టేబుల్‌కు అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సర్జరీకి ఆమె కుటుంబంవారు అంగీకరించలేదని తెలుస్తోంది. కానీ.. మహిళా లింగ మార్పిడి చేసుకోవడానికి మొగ్గుచూపుతుంది. దీనికోసం తాను.. దాచుకున్న డబ్బులతో సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడినట్లు కానిస్టెబుల్ తెలిపారు. కాగా, 2018లో మహరాష్ట్రకు చెందిన లలితా సాల్వె అనే మహిళా కానిస్టేబుల్ కూడా ఇదేవిధంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమెకు సెయింట్ జార్జ్ ఆస్పత్రి వైద్యులు లింగమార్పిడి చికిత్సను నిర్వహించారు. -
ఆ స్కూల్లో బాలబాలికలకు యూనిఫామ్ ఒకటే!
సాధారణంగా పాఠశాలల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా యూనిఫామ్స్ ఉంటాయి. కానీ ఆ స్కూల్లో మాత్రం బాలురు, బాలికలకు ఒకేరకమైన యూనిఫామ్ ఉంటుంది. ఈ పాఠశాల మన దేశంలోనే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. లింగ సమానత్వాన్ని ప్రబోధించేందుకే బాల బాలికలకు ఒకే రకమైన ఏకరూప దుస్తుల ధరించేలా చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికుల సహకారంతో ఈ నిశ్శబ్ద విప్లవానికి తొలి అడుగుపడింది. విద్యార్జనలో అగ్రస్థానాన ఉన్న కేరళలోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఎర్నాకులం జిల్లాలో వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిశ్శబ్ద విప్లవానికి అంకుర్పారణ జరిగింది. లింగ భేదం లేకుండా ఇక్కడ విద్యార్థులందరూ ఒకే రకమైన యూనిఫామ్ ధరిస్తారు. చొక్కాలు, త్రిబైఫోర్త్ షార్ట్స్ వేసుకుని చదువులమ్మ ఒడిలో ఒదిగిపోతున్నారు. బాలికలు ఎటువంటి సంకోచం లేకుండా స్వేచ్ఛగా ఆటపాటలతో చదువుకుంటున్నారు. (ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!) వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ, లోయర్ ప్రైమరీ విభాగాలు ఉన్నాయి. రెండు విభాగాల్లో మొత్తం 746 మంది విద్యార్థులు ఉన్నారు. లింగ సమానత్వ యూనిఫామ్ మొదట 2017లో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు. ఇది ఇప్పుడు 1 నుంచి 4 తరగతులకు విస్తరించారు. లింగ సమానత్వ యూనిఫామ్ ప్రవేశపెట్టడానికి ముందు బాలికలు ఆటలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంకోచించే వారని.. ఇప్పుడు వారిలో ఎటువంటి సంకోచం లేదని ఉపాధ్యాయురాలు సి.రాజీ తెలిపారు. తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత జెండర్ న్యూట్రల్ యూనిఫామ్ అమలు చేశామన్నారు. ‘బాలికలకు ఇబ్బందిగా ఉన్న డ్రెస్ కోడ్ మార్చాల్సిందేనని విద్యార్థినుల తల్లులు బలంగా విశ్వసించారు. తమ కుమార్తెలు తాము ధరించే యూనిఫామ్‌లో సురక్షితంగా ఉండాలని వారు కోరుకున్నారు. కొత్త యూనిఫామ్ అదనపు ఖర్చును భరించడానికి వారు ముందుకు వచ్చార’ని రాజీ వెల్లడించారు. ‘లింగ సమానత్వ ఏకరూప దుస్తులు ప్రవేశపెట్టడం వల్ల అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎక్కువ మంది బాలికలు క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తుండటం ఇందుకు నిదర్శనం. కొత్త డ్రెస్ కోడ్ వారికి గొప్ప స్వేచ్ఛను అందించింది. మా పాఠశాలలో 378 మంది బాలికలు ఉన్నారు. వీరిలో అత్యధికులు పేదవారే. కానీ తల్లిదండ్రులు కొత్త యూనిఫామ్ కోసం అదనంగా డబ్బులు చెల్లించడానికి అంగీకరించారు. అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉన్నార’ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కేపీ సుమ అన్నారు. 2019లోనే జెండర్ న్యూట్రల్ యూనిఫామ్ ప్రవేశపెట్టాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా కాస్త ఆలస్యమైందని తెలిపారు. కొత్త డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టడంతోనే ఆగిపోలేదు.. విద్యార్థుల కోసం జెండర్-సెన్సిటివ్ పాఠాలను కూడా సిద్ధం చేశారు ఉపాధ్యాయులు. బాలురు, బాలికలు ఇద్దరూ సమానమే అని చెప్పేవిధంగా పాఠాలు బోధిస్తున్నట్టు అకడమిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ బినోయ్ పీటర్ చెప్పారు. లింగ సమానత్వ మాడ్యూల్‌ను ప్రోత్సహించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాగా, వలయన్చిరంగార పాఠశాల చేపట్టిన ఈ ప్రయత్నాన్ని కేరళ విద్యా మంత్రి ఆర్ బిందు, సినీ నటి మంజు వారియర్, ఒలింపియన్ అంజు బాబీ జార్జ్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
ఈ రంగాలపై మక్కువ చూపుతున్న మగువలు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ, ఆపరేషన్స్ తదితర విభాగాల్లో మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని, కీలక విధులు నిర్వహించాలని మహిళలు భావిస్తున్నారు. అదే సమయంలో మహిళా సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల ఆయా రంగాలు గణనీయంగా ప్రయోజనం పొందగలవని పురుషులు కూడా అభిప్రాయపడుతుండటం గమనార్హం. జీఈ, అవతార్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జీఈ కోసం అవతార్ ఈ సర్వే నిర్వహించింది. 500 మంది ప్రొఫెషనల్స్ (మహిళలు, పురుషులు) ఇంజినీరింగ్ విద్యార్థినులు, ఆపరేషన్స్.. తయారీ.. ఇంజినీరింగ్ సర్వీసుల సంస్థల్లో బిజినెస్, మానవ వనరుల విభాగాల అధిపతులు ఇందులో పాల్గొన్నారు. పురోగతికి సామర్థ్యాలపై అపోహలే అడ్డంకి.. సర్వే ప్రకారం ఇంజినీరింగ్ సర్వీసులు, ఆపరేషన్స్, తయారీ వంటి రంగాల్లో ప్రస్తుతం 12 శాతం మందే మహిళలు ఉన్నారు. సామర్థ్యాలపై గల అపోహలే ఈ రంగాల్లో తమ కెరియర్ పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయని 63 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సామర్థ్యాల మదింపు ప్రక్రియలో పక్షపాత ధోరణులు కూడా కారణమని మరికొందరు పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ నియంత్రణలే ఆయా విభాగాల్లో మహిళల వృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయని 54 శాతం మంది పురుషులు, సూపర్వైజర్ల నుంచి మద్దతు లేకపోవడం కారణమని 51 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. లింగవివక్ష వివిధ విభాగాల్లో లింగ వివక్షకు తావులేకుండా పరిస్థితి మెరుగుపర్చాల్సిన అవసరాన్ని ఈ సర్వే తెలియజేస్తోందని జీఈ దక్షిణాసియా ఐఅండ్‌డీ కౌన్సిల్ లీడర్ శుక్ల చంద్రా తెలిపారు. అటు, పెద్ద సంస్థలు ఈ దిశగా చర్యలు తీసుకుంటే మరింత మంది మహిళలు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి విభాగాలను ఎంచుకునేందుకు, తయారీ.. ఇంజినీరింగ్ రంగాల్లో కెరియర్ ఏర్పర్చుకునేందుకు ప్రోత్సాహం లభించగలదని అవతార్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ సౌందర్య రాజేశ్ తెలిపారు. చదవండి:అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!!
ఈ మధ్య స్పెయిన్‌లో ఓ ఉద్యమం ఊపందుకుంటోంది. ఓ స్కూల్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు లింగ సమానత్వం పేరుతో ఓ వినూత్న సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. అది ఓ ఉద్యమంగా అక్కడ కొనసాగుతోంది. Wear a Skirt to School campaign: యూకే మిర్రర్ నివేదిక ప్రకారం.. కొన్ని నెలల ముందు ఎడన్బర్గ్లోని కాసిల్‌వ్యూ ప్రైమరీ స్కూల్‌కి చెందిన 15 ఏళ్ల మైకెల్ గొమెజ్ అనే విద్యార్థి స్కర్టు ధరించి పాఠశాలకు వచ్చినందుకు స్కూల్ యాజమాన్యం బయటికి వెళ్లగొట్టింది. దీంతో ధరించే దుస్తులకు లింగ భేదం ఉండదనే స్లోగన్‌తో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు అందరూ స్కూలుకు స్కర్టులతో రావడం ప్రారంభించారట. ఇదంతా సదరు విద్యార్ధికి మద్ధతు తెల్పాలనే ఉద్దేశ్యంతో ‘వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్’ను ఉద్యమంగా చేపట్టారు. మూస పద్ధతులను బద్ధలు కొట్టాలనే నెపంతో ఈ చర్యకు పూనుకున్నట్లు అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. బలవంతంగా స్కర్టులు ధరించమని ఎవ్వరికీ చెప్పం. అది పూర్తిగా విద్యార్ధుల ఇష్టానికే వదిలివేశామని అంటున్నారు. ఐతే ఈ వింత పోకడను కొందరు తల్లిదండ్రులు ప్రశంసిస్తుంటే, మరికొందరేమో బుగ్గలు నొక్కుకుంటున్నారు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
అమెరికాలో తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టు
డెన్వర్: అగ్రరాజ్యం అమెరికాలో పురుషులు, మహిళలు కాని ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది. అమెరికా ప్రభుత్వం ‘ఎక్స్’ జెండర్ హోదా కలిగిన తొలి పాస్‌పోర్టు జారీ చేసింది. ఇది చరిత్రాత్మక పరిణామం, పండుగ చేసుకోవాల్సిన సందర్భం అని ఎల్జీబీటీ హక్కుల కార్యకర్త జెస్సికా స్టెర్స్ వ్యాఖ్యానించారు. అయితే, ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును ఎవరికి జారీ చేశారన్న వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. గోప్యతను కాపాడాలన్న సంకల్పంతో పోస్‌పోర్టు దరఖాస్తుదారుల సమాచారాన్ని బహిర్గతం చేయబోమని అధికారులు చెప్పారు. కొలరాడోలో నివసించే డానా జిమ్ అనే వ్యక్తి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టు కోసం 2015 నుంచి అమెరికా ప్రభుత్వంతో పొరాడుతున్నారు. పురుషుడిగా జన్మించి డానా జిమ్ కొంతకాలం అమెరికాలో సైన్యంలో పనిచేశారు. లింగ మార్పిడి చేయించుకొని మహిళగా మారారు. తనలాంటి వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును డానా జిమ్‌కే జారీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
Mann Deshi: ఇప్పుడు ప్రపంచం నా దగ్గరే ఉంది!
అనారోగ్యంతో పట్టణంలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు లత భర్త. ఊళ్లో ఉన్న భార్య ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. భర్త గురించే ఆమె ఆలోచనలన్నీ... ఎలా ఉన్నాడో ఏమో! భర్త దగ్గర మాత్రమే సెల్‌ఫోన్ ఉంది. లత దగ్గర లేదు. తనకు అవసరం అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే భర్త తన ఫోన్ ఇచ్చేవాడు. అలాంటి లత చేతిలోకి ఇప్పుడు సెల్‌ఫోన్ వచ్చింది. దాంతో గతంలో మాదిరిగా ఆమె ఇతరుల మీద ఆధారపడడం లేదు. తానే భర్తకు ఫోన్ చేసే మాట్లాడుతుంది. వీడియో కాల్స్ మాట్లాడడం కూడా నేర్చుకుంది. లతది మహారాష్ట్రలోని నింబోర గ్రామం. ఇప్పుడు అదే మహారాష్ట్రలో భానుపూరి గ్రామానికి వెళదాం...జ్యోతి దేవ్కర్ చిన్నపాటి కిరాణా దుకాణం నడుపుతుంది. తాను కూడా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే భర్త ఫోన్‌పైనే ఆధారపడేది. ఇప్పుడు తన దగ్గర కొత్త ఫోన్ ఉంది. మాట్లాడడమే కాదు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వస్తువుల గురించి తెలుసుకోవడం నుంచి ఆన్లైన్ పేమెంట్స్ వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఇదే గ్రామానికి చెందిన పూర్ణ కూలి పనులు చేసుకుంటుంది. అంతో ఇంతో చదువువచ్చు. ఒకప్పుడు సెల్ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే...ఎవరినో ఒకరిని బతిమిలాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆమె చేతిలో కొత్త ఫోన్. ‘మాట్లాడడం మాత్రమే కాదు, ప్రపంచంలో ఏంజరుగుతుందో తెలుసుకో గలుగుతున్నాను’ అంటుంది పూర్ణ. ఉన్నట్టుండి వీరి చేతిలోకి ఫోన్లు ఎలా వచ్చాయి? సతార జిల్లా (మహారాష్ట్ర) కేంద్రంగా పనిచేసే ‘మన్‌దేశీ’ అనే స్వచ్ఛంద సంస్థ వీరికి మాత్రమే కాదు ఎంతోమంది పేద మహిళలకు సెల్ఫోన్లను ఉచితంగా ఇచ్చింది. ఇవ్వడమే కాదు ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా నేర్పించింది. ‘నాకంటూ సెల్‌ఫోన్‌లేదు..అని ఈరోజుల్లో ఎవరూ అనరు’ అనుకుంటాంగానీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళితే సెల్‌ఫోన్‌లేని పేద మహిళలు, వాటి గురించి ఏమీ తెలియని మహిళలు ఎంతోమంది ఉన్నారు. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ‘డిజిటల్ జెండర్ గ్యాప్’ ఎక్కువగా ఉందని రకరకాల రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని పేదమహిళలకు ఉచితంగా సెల్ఫోన్లు ఇచ్చింది మన్‌దేశీ. విచిత్రమేమిటంటే ఉచితంగా ఇచ్చినా ‘ఈ ఫోన్లతో మేమేం చేసుకోవాలమ్మా’ అనేంత అమాయకులు కూడా ఉన్నారు. అలాంటి వారికి సెల్‌ఫోన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, సులభంగా ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించారు. ‘తీసుకోవాలా వద్దా? అని మా భర్తను అడిగి చెబుతాను’ అనే మాట చాలామంది నోటి నుంచి వినిపిస్తుంది. మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్...మొదలైన రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో మహిళలు సెల్‌ఫోన్ వాడడంపై అప్రకటిత నిషేధం ఉంది. కొన్ని గ్రామీణప్రాంతాల్లో ‘మహిళలు వాడకూడదు’ అంటూ సెల్ఫోన్లపై నిషేధాలు కూడా ఉన్నాయి. ఈ కారణం వల్లే కావచ్చు...ఫోన్ కొనగలిగే స్థాయి ఉండికూడా కొనలేకపోవడం. దీనికితోడు వారెవ్వరికీ దానిని ఆపరేట్ చేయడం కూడా రాదు. బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో ఉన్న సుందర్‌బడి గ్రామంలో పెళ్లికాని అమ్మాయిలు సెల్‌ఫోన్ వాడితే రెండు వేలు, పెళ్లయిన మహిళలు వాడితే పదివేల రూపాయల జరిమానా విధిస్తారట! అందుకే...సెల్‌ఫోన్ ఇవ్వడం మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న అపోహలను తొలగించే కాన్యాచరణ కూడా చేపట్టింది మన్‌దేశీ. ఫలితంగా ఎంతో మందిలో మార్పు వచ్చింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకుచ్చి ప్రపంచంతో అనుసంధానం కావడానికి సెల్‌ఫోన్ ఎలా ఉపయోగపడుతుంది అనేదానిపై విస్తృత ప్రచారం చేస్తుంది మన్‌దేశీ. చదవండి: Social Star: పైజమా పాప్‌స్టార్ శిర్లే సెటియా.. ఆర్జే నుంచి సింగర్‌గా.. -
క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పు.. ఇకపై వారిని అలా పిలువరాదు
లండన్: క్రికెట్లో లింగభేదానికి తావు లేకుండా మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పురుష క్రికెటర్లను మాత్రమే సంబోధించే బ్యాట్స్‌మన్ అన్న పదాన్ని తొలగించి మహిళలు, పురుషులకు కామన్‌గా వర్తించేలా బ్యాటర్ అన్న పదాన్ని తక్షణమే అమల్లోకి తేవాలని బుధవారం ప్రకటించింది. గత కొంత కాలంగా ఈ ప్రతిపాదన ఎంసీసీ పరిశీలనలో ఉండగా.. తాజాగా ఆమోదించబడింది. లింగభేదం లేని పదాన్ని ఉపయోగించడం వల్ల క్రికెట్ అందరి క్రీడ అని మరోసారి నిరూపించబడుతుందని ఎంసీసీ విశ్వసిస్తోంది. లింగభేదం లేని పదాలు వాడటం వల్ల మరింత మంది మహిళలు క్రికెట్ పట్ల ఆకర్షితులవుతారని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే, క్రికెట్‌కు సంబంధించి లింగభేదానికి ఆస్కారముండే థర్డ్ మ్యాన్, నైట్ వాచ్‌మన్, జెంటిల్మెన్ వంటి పదాలపై ఎంసీసీ ఎలాంటి కామెంట్లు చేయకపోవడం విశేషం. చదవండి: కెప్టెన్సీ విషయంలో వారిద్దరికీ పట్టిన గతే కోహ్లికి కూడా పట్టవచ్చు..! -
ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం
న్యూఢిల్లీ: లింగ వివక్షను రూపుమాపడంతోపాటు మహిళా సాధికారత దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 5న జరుగబోయే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు మహిళకు సైతం అవకాశం కల్పించాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ)ను బుధవారం ఆదేశించింది. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తుది తీర్పును బట్టి విడుదల చేయొచ్చని పేర్కొంది. ఎన్డీఏతోపాటు నావల్ అకాడమీ ప్రవేశ పరీక్షలను రాసే అవకాశాన్ని మహిళలకు సైతం కల్పించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ కుశ్ కాల్రా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. ఎన్డీఏలో మహిళలకు ప్రవేశం కల్పించాలన్న పిటిషనర్ వినతి పట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. మహిళలకు ఎన్డీఏ అడ్మిషన్ టెస్టు రాసేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలని, దీని గురించి ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది. సైన్యం, నావికా దళంలో మహిళల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని తాము గతంలో తీర్పులిచ్చామని, అయినా ప్రభుత్వ ఎందుకు స్పందించడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని ధర్మాసనం ప్రశ్నించింది. మహిళలు సైన్యంలోకి అడుగు పెట్టేందుకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీ వంటి మార్గాలు ఉన్నాయని ఐశ్వర్య భాటీ చెప్పారు. మరి ఎన్డీఏ ద్వారా మహిళలు సైన్యంలోకి ఎందుకు ప్రవేశించవద్దు, కో–ఎడ్యుకేషన్ ఏమైనా సమస్యా? అని ధర్మాసనం నిలదీసింది. ఎన్డీఏలోకి మహిళలను అనుమతించకూడదు అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని భాటీ బదులిచ్చారు. -
335 మందితో డేటింగ్.. మరో 30 మంది కోసం వెయిటింగ్
సాక్షి, వెబ్‌డెస్క్: డేటింగ్ అనగానే మనం ఏదోదే ఊహించుకుంటాం.. పైగా పాశ్చత్య సంస్కృతి కావడంతో చాలా మంది దాన్ని తప్పుగా చూస్తారు. అయితే అన్ని డేట్లు ఒకేలా ఉండవు. ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు తమిళ నటుడు, ప్రొఫెషనల్ డ్యాన్సర్, ఫోటోగ్రాఫర్ సుందర్ రాము. గత కొన్నేళ్లుగా ఆయన 335 మంది మహిళలతో డేటింగ్ చేశారు. ఆయన లక్ష్యం 365 మందితో డేటింగ్ చేయడం. దానికి ఇంక 30 మంది దూరంలో ఉన్నారు. అసలు ఇంత మందితో డేటింగ్ చేయడం ఏంటి.. ఈ టార్గెట్ ఏంటి వంటి తదితర వివరాలు తెలియాలంటే.. సుందర్ రాము గురించి పూర్తిగా తెలియాలి. ఆయన వివరాలు.. తమిళనాడు, చెన్నైకి చెందిన సుందర్ రాము సినిమాల్లోకి రావడానికి ముందు నాటకాల్లో నటించారు. ఆ తర్వాత ఆయన తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. పైగా ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా. అప్పటి వరకు సాధారణ జీవితం గడిపిన సుందర్ రాముని 2012లో జరిగిన నిర్భయ ఘటన బాగా కలచి వేసింది. చాలా రోజులు ఆ బాధలోనే ఉండి పోయారు. విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనకు తరచుగా వినిపించే ప్రశ్న.. ‘‘మీ దేశంలో ఎందుకు మహిళలను అంత దారుణంగా హింసిస్తారు’’ అని. ఇవన్ని ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలో ఆయనభారతదేశ మహిళలకు వారి హక్కుల గురించి తెలియజేయాలనుకున్నారు. అందుకు ఆయన ఎన్నుకున్న మార్గమే ఈ 365 డేటింగ్. దీని గురించి సుందర్ రాము మాట్లాడుతూ.. ‘‘నేను స్త్రీలను బాగా చూసుకునే, గౌరవించే కుటుంబంలో పెరిగాను. లింగ వివక్ష లేని పాఠశాలలో చదువుకున్నాను. అబ్బాయిలు, అమ్మాయిలను వేరుగా చూడలేదు. కానీ, స్కూల్ నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాక, సమాజంలో వేళ్లూనుకున్న లింగవివక్షను గమనించాను. అలాంటి సంస్కృతిని చూసి షాక్‌కు గురయ్యాను. 2012 డిసెంబర్లో జరిగిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటన నన్ను కుదిపివేసింది. చాలా రాత్రులు నిద్రపోలేకపోయాను'' అని తెలిపారు. ‘‘ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం కోసం నేను చేసిన ఆలోచన 365 డేట్స్ ప్రణాళిక. దీని గురించి 2014, డిసెంబర్ 31న ఫేస్బుక్లో ప్రకటించాను. ప్రారంభంలోనే నాకు తెలిసిన 10 మంది నుంచి కాల్ వచ్చింది. మే ఒకరి గురించి ఒకరం తెలుసుకున్న తర్వాత డేట్‌కి వెళ్లేవాళ్లం. 2015లో తమిళనాడులో వరదల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. మరుసటి ఏడాది తిరిగి ప్రారంభించాను. ఇప్పటి వరకు మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా పలువురు మహిళలతో డేట్‌కి వెళ్లాను. వీరిలో మా నానమ్మతో పాటు చెత్త ఎత్తే మహిళలు, పళ్లు అమ్ముకునే మహిళ, 90 ఏళ్ల ఐరిష్ సన్యాసిని, నటి, మోడల్స్, యోగా టీచర్, యాక్టివిస్టులు, రాజకీయాల్లో ఉన్నవారు ఇలా ఎంతోమంది ఉన్నారు. అయితే మా నానమ్మతో వెళ్లిన డేట్ మాత్రం చాలా ప్రత్యేకం’’ అన్నారు సుందర్ రాము. ‘‘ఇక నేను విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాను. నేను వెళ్లే డేట్స్ అన్ని శృంగారభరితమైనవి కావు. నా లక్ష్యం కేవలం ప్రేమ మాత్రమే. నేను ప్రతిరోజు ప్రేమను అన్వేషిస్తాను. డేట్ అనగానే ఏదో ఊహించుకోవడం కాదు. అలానే మహిళ అనగానే కేవలం ఆమె ఒంపుసొంపులు మాత్రమే కాదు. అంతకుమించి ఆలోచించగలగాలి. వారి స్థానంలోకి వెళ్లి.. ఆడవారు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుంటే.. అప్పుడు వారి గురించి మనకు ఎక్కువ అర్థం అవుతుంది. వారి మీద మరింత గౌరవం పెరుగుతుంది. నా 365 డేట్ ఉద్దేశం కూడా ఇదే’’ అన్నారు సుందర్ రాము. -
Tokyo Olympics: ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి..
అంతర్జాతీయ క్రీడా వేడుకల వేదిక ఒలింపిక్స్‌కు ఓ చరిత్ర ఉంది. అయితే ఆ చరిత్రలో వివాదాలు, విమర్శలకు సైతం చోటు దక్కింది. ముఖ్యంగా ఆటల్లో లింగ వివక్ష గురించి ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే వస్తోంది. ఈ తరుణంలో టోక్యో ఒలింపిక్స్ తొలిసారి ఓ అర్హత సాధించింది. ఇప్పటివరకు రికార్డుకానీ రీతిలో ఫిమేల్ అథ్లెట్లతో సందడి చేయబోతోంది ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్. సాక్షి, వెబ్‌డెస్క్: ‘లింగ సమతుల్యపు ఒలింపిక్స్’గా టోక్యో ఒలింపిక్స్‌కి ఓ అరుదైన ఘనత దక్కబోతోంది. విశేషం ఏంటంటే.. ఐదు అగ్ర దేశాలు పురుషుల కంటే మహిళా అథ్లెట్లు పంపించడం. బ్రిటన్, యూఎస్, చైనా, ఆస్ట్రేలియా, కెనెడాలు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాయి. ఇక రష్యా కూడా ఇదే బాటను అనుసరించింది. చైనా 298 మహిళలు..133 పురుషులు, అమెరికా 329 మహిళలు.. 284 పురుషులు, యూకే నుంచి 376 మంది బరిలోకి దిగుతుండగా అందులో 201 మంది మహిళలే ఉన్నారు. ఇక కెనడా అయితే 225 మంది మహిళలను.. 145 మంది పురుష అథ్లెట్లను బరిలోకి దింపింది. ఆస్ట్రేలియా నుంచి 471 మంది ఒలింపిక్స్‌లో పోటీపడుతుండగా.. 252 మంది మహిళలు, 219 మంది పురుషులు ఉన్నారు. రష్యా నుంచి మొత్తం 329లో 183 మంది మహిళలు, 146 మంది పురుషులు పాల్గొంటున్నారు. అధికారికంగా ప్రకటన ఇక ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ)అధికారికంగానే టోక్యో ఒలింపిక్స్‌ను జెండర్ బ్యాలెన్స్డ్ ఒలింపిక్స్‌గా ప్రకటించింది. అంతేకాదు ఆరంభ వేడుకల్లో జెండా మోయడం దగ్గరి నుంచి అది ప్రారంభం కావాలని అభిప్రాయపడింది. లింగ సమానత్వం లక్క్ష్యంగా ముందుకు వెళ్తామని పేర్కొంది. ఇక ఈ దఫా 49 శాతం మహిళలు, 51 శాతం పురుషులు ఇందులో పాల్గొంటున్నారని ప్రకటించింది. భారత్ నుంచి 127 మంది అథ్లెట్లు పాల్గొంటుండగా, 56 మంది మహిళలే ఉన్నారు. ఆతిథ్య జపాన్ మాత్రం 259 మహిళలు, 293 పురుషులతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే.. మొత్తం ఈసారి 48.8 శాతం మహిళా పోటీదారులు పాల్గొనబోతున్నారు. అంటే.. అది 50 శాతం కంటే తక్కువగా ఉందన్నమాట. ఆ లెక్కన ఐవోసీ లక్క్ష్యం సాధనకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఒలింపిక్స్ చరిత్రను పరిశీలిస్తే.. ఆధునిక మొదటి ఏథెన్స్ ఒలింపిక్స్(1896)లో మహిళలను పాల్గొనకుండా నిషేధించారు. అయితే 1900 ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి మహిళా అథ్లెట్లను అనుమతిస్తున్నారు. అందులో మొత్తం 997 మంది పోటీదారుల్లో 22 మంది మాత్రమే మహిళలు(ఐదు ఈవెంట్స్) ఉన్నారు. *2012 లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మహిళా అథ్లెట్ల శాతం 44.2 *2016 రియో ఒలింపిక్స్ పాల్గొన్న వాళ్ల శాతం 45 (టోక్యో వరకు మెరుగైన ఫలితమే కనిపిస్తోంది) *రియో పారాఒలింపిక్స్‌లో పాల్గొన్న మహిళల శాతం 38.6 *టోక్యో పారాఒలింపిక్స్‌లో అది 40.5 శాతంగా ఉండబోతోంది. -
ఆడా-మగా జననాంగాలు.. 25 ఏళ్ల తర్వాత వివాదాస్పదం
వైద్య శాస్త్రంలో ఓ అరుదైన కేసు.. సుమారు పాతికేళ్ల తర్వాత వివాదాస్పదంగా మారింది. ఆడ-మగ జననాంగాలతో(ఇంటర్‌సెక్స్ జెండర్) కలగలిసి పుట్టిన ఓ బిడ్డను.. సర్జరీలతో పూర్తి మగాడిలా మార్చేశారు వైద్యులు. అయితే ఆ నిర్ణయంపై అతడుగా ఉన్న ఆమె ఇన్నేళ్ల తర్వాత పోరాటానికి దిగింది. తన అనుమతి లేకుండా క్రూరంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తనును మళ్లీ యథాస్థితికి మార్చేయాలని కోరుతోంది. హవాయి స్టేట్ పూనాకి చెందిన 24 ఏళ్ల యోగా ఎక్స్పర్ట్ లూనా అనిమిషా.. తనను మహిళగా మార్చేయాలని పోరాడుతోంది. పుట్టినప్పుడు డాక్టర్లు ఆమె జననాంగాన్ని కుట్టేయడంతో పాటు, సర్జరీ ద్వారా గర్భసంచిని తొలగించారు. దీంతో లూనా.. ఇన్నేళ్లూ మగవాడిలానే పెరుగుతూ వస్తోంది. అయితే తనలో ‘ఆమె’ను ఎంతో కాలం అణుచుకోలేకపోయింది లూనా. అయితే తనని ఓ జంతువులా భావించి కర్కశంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తిరిగి సర్జరీలకు ఆమె సిద్ధమైంది. ‘‘తప్పు నా తల్లిదండ్రులదా? ఆ డాక్టర్లదా? అనే ప్రసక్తి కాదు. అంతిమంగా ఇబ్బంది పడుతోంది నేను. నాకు మగాడిగా కంటే ఆడదానిగా బతకడమే ఇష్టంగా అనిపిస్తోంది. 14 ఏళ్ల వయసులో తొలిసారి నా శరీరానికి కలిగిన గాయమేంటో నేను అర్థం చేసుకోగలిగాను. ఇన్నేళ్లలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. అవమానాల్ని భరించాను. అసలు నా గుర్తింపు కోసం మానసిక క్షోభను అనుభవించాను. ఎవరితోనూ కలవలేకపోయాను. బొమ్మలతో ఆడుకోవాలని, గౌన్లు వేసుకోవాలనే కోరికల్ని అణచివేసుకున్నా. ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, ఇప్పుడు పోరాడే వయసు, శక్తి రెండూ నాకు వచ్చాయి’’ అని నవ్వుతూ చెప్తోందామె. మగాడి గుర్తింపును వద్దనుకుంటున్న లూనా.. సర్జరీలకు అవసరమయ్యే డబ్బు కోసం ‘గో ఫండ్ మీ’ వెళ్లింది. లక్షా యాభై వేల డాలర్లు సేకరించి.. తన కోరికను నెరవేర్చుకోవాలని అనుకుంటోంది. 2019లో క్లీవ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళకు చనిపోయిన మహిళ గర్భసంచిని మార్పిడి ద్వారా ఎక్కించారు. అలా ఆ మహిళ తల్లి కాగలిగింది కూడా. ఆ కేసును రిఫరెన్స్‌గా తీసుకుని లూనా.. తనకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తోంది. అంతేకాదు సొసైటీలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఇంటర్‌సెక్స్, ట్రాన్స్‌జెండర్ బాధితుల కోసం లూనా పోరాడుతోంది కూడా. చదవండి: ‘అవును.. నేరాలు చేశా, ఘోరాలకు పాల్పడ్డా’ -
టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష!
ముంబై: క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా పురుషుల, మహిళా క్రికెటర్లు కలిసి ఒకే ఫ్లైట్‌లో ప్రయాణం చేయనున్నట్లు సోమవారం వచ్చిన వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కోహ్లి సేన, మిథాలీ సేన జూన్ 2న ముంబై నుంచి లండన్‌కు బయలుదేరుతాయనేది నిజమే అయినా.. ఇరు జట్లు ఒక ఫ్లైట్‌లో మాత్రం వెళ్లవట. టీమిండియా పురుషుల జట్టుకోసం ప్రత్యేక చార్టడ్ విమానం ఏర్పాటు చేసిన బీసీసీఐ మహిళా జట్టును మాత్రం కమర్షియల్ ప్లైట్‌లో పంపనున్నట్లు సమాచారం. దీంతో బీసీసీఐ టీమిండియా మహిళా క్రికెట్‌పై వివక్ష చూపింస్తుదంటూ వార్తలు వస్తున్నాయి. కాగా బీసీసీఐ కూడా ఇంతవరకు పురుషులు, మహిళల జట్లు ఒకే విమానంలో వెళుతున్నట్లు అఫిషీయల్‌గా ఎక్కడా అనౌన్స్ చేయకపోవడంతో ఈ వార్తలు నిజమేనని పలువురు భావిస్తున్నారు. అంతేగాక జూన్ 2న లండన్‌కు వెళ్లనున్న టీమిండియా పురుషుల జట్టును ఈ బుధవారం క్వారంటైన్లోకి పంపించనున్నట్లు తెలిసింది. అయితే ఇదే సమయంలో మహిళా క్రికెటర్లకు మాత్రం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని తెలిసింది. బీసీసీఐ ఇలా టీమిండియా మహిళల జట్టుపై వివక్ష చూపడం ఇది తొలిసారి కాదని.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ సమయంలోనే టీ20 వుమెన్స్ చాలెంజ్ నిర్వహించాలని భావించారు. అయితే మొదట నాలుగు టీమ్‌లతో నిర్వహించాలని భావించినా చివరకు ఏదో మొక్కుబడిగా మూడు జట్లను ఏర్పాటు చేసి లీగ్‌ను పూర్తి చేశారు. ఇక 2020 ఏడాదిలో కరోనా సమయంలో మొదట టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళుతుందని బీసీసీఐ ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఈసీబీ బయెబబూల్‌లో నిర్వహించడానికి సిద్ధంగా లేదనే కారణం చెప్పి ఆ టోర్నీని రద్దు చేసింది. ఇంకా విచిత్రమేంటంటే.. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న పురుషుల జట్టులోని సభ్యులందరికి ఇంటివద్దే కరోనా పరీక్షలు జరిగేలా ఏర్పాటు చేస్తామని పేర్కొన్న బీసీసీఐ మహిళా క్రికెటర్ల విషయంలో మాత్రం మీ టెస్టులు మీరే చేసుకోవాలంటూ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. టీమిండియా పురుషుల జట్టుకు ఇస్తున్న గౌరవం మహిళల జట్టుకు బీసీసీఐ ఎందుకు ఇవ్వలేకపోతుంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషుల జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్ ఆడనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. మరోవైపు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న మహిళల క్రికెట్ సమరంలో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది.. -
గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్: భారత్ 28 స్థానాలు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా మహిళల పట్ల వివక్ష మరింతగా పెరుగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) లింగ అసమానతల సూచీలో భారత్ 28 స్థానాలు దిగజారడం ఇందుకు నిదర్శనం. 2021కి సంబంధించి 156 దేశాల జాబితాలో భారత్ 140వ స్థానంలో నిల్చింది. 2020లో భారత్ ర్యాంకు 112గా ఉంది. తాజా నివేదిక ప్రకారం రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. రాజకీయ సాధికారతకు సంబంధించిన అంతర్గత సూచీలో భారత్ 13.5 శాతం మేర క్షీణించింది. మహిళా మంత్రుల సంఖ్య 2019లో 23.1 శాతంగా ఉండగా 2021లో 9.1 శాతానికి పడిపోవడం ఇందుకు కారణం. ప్రొఫెషనల్, టెక్నికల్ ఉద్యోగాల్లోనూ మహిళల వాటా 29.2 శాతానికి తగ్గింది. ఇక ఆర్థికాంశాలపరంగా చూస్తే మహిళలు ఆర్జించే ఆదాయం.. పురుషుల ఆదాయంలో అయిదో వంతే ఉంటోంది. దక్షిణ ఆసియాలో బంగ్లాదేశ్ , నేపాల్ కంటే వెనుకబడి ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ జాబితాలో ఐస్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో ఫిన్లాండ్ నార్వే ఉన్నాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్ 156 చివరి స్థానంలో ఉంది. -
లింగ వివక్ష చూపే ఆర్టీసీ సర్క్యులర్ రద్దు
సాక్షి, అమరావతి: రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులేనని, కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ బేధాలు చూపడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మహిళల పట్ల వివక్ష చూపేలా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నందున.. ఆర్టీసీ ఎండీ 2003లో జారీచేసిన సర్క్యులర్‌ను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. కారుణ్య నియామకం కోసం మహిళ చేసుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని శ్రామిక్ లేదా ఆమెకు తగిన పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మపాళేనికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ నేనావత్ శ్రీనివాస్ 2007 ఫిబ్రవరి 16న మరణించారు. కారుణ్య నియామకం కింద తనకు కండక్టర్, అటెండర్, శ్రామిక్ లేదా ఇతర ఏదైనా పోస్టు ఇవ్వాలంటూ 2007 ఆగస్టులో శ్రీనివాస్ భార్య లక్ష్మి ఆర్టీసీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. 2003లో ఆర్టీసీ ఎండీ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం మహిళలు శ్రామిక్ పోస్టుకు అర్హులు కాదని అధికారులు తెలిపారు. మూడు సెంటీమీటర్ల ఎత్తుకు సంబంధించి మినహాయింపు ఇచ్చేందుకు అధికారులు తిరస్కరించడంతో ఆమెను కండక్టర్ పోస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే సమయంలో కొందరికి క్లీనర్లుగా పోస్టులు ఇచ్చారు. దీనిపై లక్ష్మి 2013లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తుది విచారణ జరిపి తీర్పు చెప్పారు. ఓ ఉద్యోగి మృతి చెందితే అతడి కుటుంబసభ్యులు కారుణ్య నియామకం కోసం పెట్టుకునే దరఖాస్తులను మొదట్లో గ్రేడ్ 2 డ్రైవర్, గ్రేడ్ 2 కండక్టర్, క్లీనర్ (శ్రామిక్) పోస్టులకు పరిగణనలోకి తీసుకునే వారని న్యాయమూర్తి తెలిపారు. శ్రామిక్, మెకానిక్, చార్జ్‌మెన్ పోస్టులను పురుషులకే పరిమితం చేస్తూ 2003 మే 26న ఆర్టీసీ ఎండీ ఇచ్చిన సర్క్యులర్ మహిళల పట్ల వివక్ష చూపడమేనని, అందువల్ల దాన్ని రద్దుచేస్తున్నామని చెప్పారు. కారుణ్య నియామకం కోసం లక్ష్మి పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, శ్రామిక్ లేదా ఆమెకు తగిన పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. -
వ్వాట్! ఏమన్నారూ.. అనేముందు ఆలోచించాలి
‘బర్గర్ కింగ్’ సేల్స్ నిన్న, మొన్న కొద్దిగా డౌన్ అయ్యాయి! బహుశా ఇది తాత్కాలికమే కావచ్చు. సేల్స్ పడిపోడానికి బర్గర్ ల రుచి తగ్గడం కారణం కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ మల్టీ నేషనల్ ఫుడ్ జెయింట్ సదుద్దేశంతో మహిళల కోసం చేసిన ఒక కెరీర్ ఆపర్చునిటీ ప్రకటన రుచించక, విషయం అపాలజీ వరకు వచ్చింది. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రికలో ఫుల్ పేజీ గా వచ్చిన ఆ ప్రకటనకు బర్గర్ కింగ్ 'Women belong in the Kitchen' అనే హెడ్డింగ్ పెట్టడం మహిళలకు ఆగ్రహం కలిగించింది. ‘వంటపని ఆడవాళ్లదే’ అని ఆ మాటకు అర్థం. మహిళలకు ఓటు హక్కు రాని వందేళ్ల క్రితం నాటి యూసేజ్ అది. ‘వాళ్లకేం తెలుసు వంటింటి కుందేళ్లు’ అని నలుగురు మగవాళ్లు కలసిన వేళల్లో నవ్వుకుంటూ అనుకునే మాట! బర్గర్ కింగ్ ఆ మాటనే యూజ్ చేస్తూ.. ‘లేడీస్, చెఫ్ లుగా మీరెందుకు రాణించకూడదు?! అక్కడా మగవాళ్ల డామినేషనేనా! రండి. మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం. స్కాలర్ షిప్ ను ఇస్తాం. మిమ్మల్ని రెస్టారెంట్ ఇండస్ట్రీకి మహారాణులను చేస్తాం..’ అని ఆహ్వానించింది. ఇదంతా లోపల ఉన్నా.. పైకి కనిపించేదే కదా ఎవరైనా చూస్తారు! మహరాణుల ఆగ్రహంలో తప్పేమీ లేదు. మహారాజులే మాటను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ‘‘అవును. అయితే ఏంటి?!’’ అనే మాటను ఎప్పుడు అంటాం?! ఒక నిందో, అబద్ధపు ఆరోపణో, విమర్శో వచ్చి మీద పడినప్పుడు; మన నిజాయితీని అంగీకరించడానికి అవతలివారు సిద్ధంగా లేనప్పుడు; వివరించీ, వాదించీ ప్రయోజనం లేదనుకున్నప్పుడు.. తలనొప్పి వదిలించుకోడానికి ‘అవును. అయితే ఏంటి?’ అనేసి, పక్కకు వచ్చేస్తాం. ఎవరికి వారు.. ‘అవును. అయితే ఏంటి?’ అనేస్తే గొడవే లేదు. ఇంకెవరి తరఫునో.. ‘అవును. ఆమె అంతే. అయితే ఏంటి?’ అంటేనే వాగ్వాదాలు, యుద్ధాలు మొదలవుతాయి. ‘బర్గర్ కింగ్’ పేరు వినే ఉంటారు. బర్గర్ల విక్రయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మల్టీనేషనల్ రెస్టారెంట్ల అమెరికన్ కంపెనీ. చాలాచోట్ల దుకాణాలు ఉన్నాయి. ఉమెన్స్ డే రోజు ఆ కంపెనీ యూ.కె. సంస్థ ఇంచుమించు ఇలాంటి ఒక వివాదంలోనే చిక్కుకుంది. మహిళల తరఫున మాట్లాడబోయి, కొంచెం క్రియేటివ్‌గా మాట్లాడి మహిళల ఆగ్రహానికి గురైంది. పాపం బర్గర్ కింగ్ ఉద్దేశం మంచిదే. పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఎందుకనో ఎక్కువగా పురుష చెఫ్‌లే కనిపిస్తారు. మహిళా చెఫ్‌లు కేవలం 20 శాతం మంది మాత్రమే. ఆ విషయాన్నే చెబుతూ.. ‘‘అన్ని రంగాల్లో ముందున్న మహిళలు చెఫ్‌లుగా మాత్రం వెనకబడి ఉండటం ఏంటి? మీకు ఆసక్తి ఉంటే చెప్పండి, మీకు స్కాలర్షిప్ ఇచ్చి, ట్రైనింగ్ ఇప్పించి, రెస్టారెంట్ల మహా సామ్రాజ్యాలకు మిమ్మల్ని మహరాణుల్ని చేస్తాం’’ అని బర్గర్ కింగ్.. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రికలో ఒక ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆ ప్రకటన వచ్చింది కనుక బర్గర్ కింగ్ ఉద్దేశాన్ని శంకించే పనే లేదు. అయితే ఉద్దేశాలు మంచివే అయి ఉండవచ్చు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవి అపార్థాలకు కారణమై ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఈ ప్రకటనలోని పొరపాటు బర్గర్ కింగ్ తన పికప్ లైన్‌గా (లోపలికి లాగేసే ప్రారంభ వాక్యం) ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’ అనే మాటను వాడటం. ఆ మాటకు అర్థం ‘వంటపని ఆడవాళ్లదే’ అని. ఆ మాటలోని అంతరార్థం.. ‘అవును. అయితే ఏంటి? వాళ్లను అననివ్వండి. చెఫ్‌గా రాణించండి’ అని! బర్గర్ కింగ్ మహిళల వైపు మాట్లాడేందుకు, ఇలా మహిళలకు నచ్చని మాటను హెడ్డింగ్‌గా పెట్టడమే వివాదం అయింది. ఆ ఫుడ్ జెయింట్.. పేపర్లో మాత్రమే ఈ యాడ్ ఇచ్చి ఊరుకోలేదు. ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసింది. ఆ పోస్టుకు రివర్స్ ట్వీట్లు వచ్చాయి. ‘ఏం మాటలివి బర్గర్ కింగ్. మహిళల్ని కించపరుస్తావా? నువ్వు తయారు చేసే బర్గర్లు రుచిగా ఉంటే సరిపోతుందా.. మాట శుచిగా ఉండొద్దా’ అని ట్విటిజెన్‌లు కామెంట్లు పెట్టారు. బర్గర్ కింగ్ సాయంత్రానికల్లా ఆ ట్వీట్‌ను తొలగించింది. పేపర్నైతే డిలీట్ కొట్టలేదు కదా. నష్టం జరిగిపోయింది. ఒడ్డున పడే మార్గంగా మహిళలకు క్షమాపణలు చెప్పింది. వాస్తవానికి ఆ ప్రకటన ఇప్పటికే బర్గర్ కింగ్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఉద్దేశించి ఇచ్చింది! అయితే యావత్ మహిళావనికి అది స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తుందన్న ఆలోచనతో అలా బహిరంగ ప్రకటన ఇచ్చింది బర్గర్ కింగ్. ‘ఎక్కడైనా ప్రొఫెషనల్ కిచెన్ ఉందీ అంటే అక్కడ మహిళా చెఫ్ ఉన్నారనే’ అనే క్రియేటివ్ భావనకు వచ్చిన తిప్పలే ఇవి. రీడర్స్కి, నెటిజెన్లకు సరిగా అర్థం కాలేదు. ఎదురొచ్చి తగిలింది. ‘బర్గర్ కింగ్‌లోని మహిళా సిబ్బంది తమ కిచెన్ కలల్ని నిజం చేసుకోడానికి మేమొక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఈ మహిళా దినోత్సవం రోజున సగర్వంగా ప్రకటిస్తున్నాం’ అని కూడా ప్రకటనలో ఉంది. అది మాత్రమే ఉండి ఉంటే సరిపోయేది. వందేళ్ల నాటి మగాళ్ల మాట.. ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’ ను పట్టుకొచ్చి, శీర్షికగా పెట్టి, పర్యవసానంగా తలపట్టుకుంది బర్గర్ కింగ్. అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో వచ్చిన బర్గర్ కింగ్ ఫుల్ పేజీ ప్రకటన. మహిళల ఆగ్రహానికి కారణం అయింది ఈ ప్రకటనలోని శీర్షికే అవును. ఇది వందేళ్లనాటి మాటే. ఇప్పుడు వాడటం మహిళల్ని కించపరచడమే. అమెరికాలో వందేళ్ల క్రితం మహిళలకింకా ఓటు హక్కు రాని కాలంలో మగాళ్లు మాత్రమే మనుషులు అన్నట్లు ఉండేది! నలుగురు మగాళ్లు ఒక చోట చేరినప్పుడు వాళ్ల నవ్వులాటలో.. స్త్రీల గురించి.. ‘వాళ్లకేం తెలుసు. వంటింటి కుందేళ్లు’ అనే మాట వాడుకలో ఉండేది. ఆడవాళ్లు ఇంటికీ, వంటకీ పరిమితం అనీ, బయటికి వెళ్లి వాళ్లే పనీ చెయ్యలేరని మగవాళ్లు బలంగా నమ్మిన కాలం నాటి రోజువారీ మాట ఈ ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’. కాలక్రమంలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఓటర్లుగా మాత్రమే కాదు, పోటీ చేసేవాళ్లుగా కూడా మహిళలు తామేంటో నిరూపించుకున్నారు. విజేతలుగా నిలిచారు. దేశాలను ఏలుతున్నారు. పురుష దేశాధినేతల కంటే కూడా సమర్థంగా పరిపాలిస్తున్నారు. ‘వంట పని ఆడవాళ్లదే’ అనే ఆ మాట దాదాపుగా భూస్థాపితం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ భూతాన్ని బర్గర్ కింగ్ వాళ్లు లేపి, మెడకు తగిలించుకున్నారు. మహిళల నుంచి అభ్యంతరం వ్యక్తం అవడంతో చెంపలు వేసుకున్నారు. చదవండి: బర్గర్ కింగ్‌కు భారీ ఎదురుదెబ్బ -
బర్గర్ కింగ్‌కు భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఫాస్ట్‌ఫుడ్ బిజినెస్ కింగ్ బర్గర్ కింగ్ (యూకే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జెండర్‌పరంగా మహిళలపై వివక్షపూరితంగా ట్వీట్ చేసి ఇబ్బందుల్లో పడింది. అందులోనూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ తన పురుషాధిక్య ధోరణిని చాటుకోవడం వివాదానికి తెరతీసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తప్పయిందంటూ లెంప లేసుకుంది. అయితే ఆ ట్వీట్‌ను తొలగించిన సంస్థ క్షమాపణ చెబుతూ మరో ట్వీట్ చేసింది. ఈ సమయంలో కూడా బర్గర్ కింగ్ తీవ్ర విమర్శల పాలైంది. స్వచ్ఛందంగా తప్పును ఒప్పుకోవాల్సిన సంస్థ తీవ్రమైన ట్రోలింగ్, అబ్యూసివ్ కమెంట్స్ కారణంగా ఈ ట్వీట్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంతే.. నెటిజన్లు బర్గర్ కింగ్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా విమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్ (మహిళలు వంట ఇంటికి చెందినవారు) అంటూ ట్వీట్ చేసింది. ట్వీట్‌తో పాటు న్యూయార్క్ టైమ్స్ ప్రింట్ ఎడిషన్‌లో పూర్తి పేజీ ప్రకటనను ప్రచురించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. "మహిళలు వంటగదిలో ఉన్నారంటూ పెద్ద యాడ్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు బర్గర్కింగ్పై ఫైర్ అయ్యారు. దీనికి తోడు బర్గర్ కింగ్ సమాధానంతో మరింత మండిపడ్డారు.నెటిజన్లు ట్వీట్ల పరంపర సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (Women's Day: ఎస్బీఐ బంపర్ ఆఫర్లు) How stupid can you be? Especially on International Women’s Day... #smh https://t.co/FvEeHQh9am pic.twitter.com/LgkrKo5NZC — Alex Chin (@chinstachinsta) March 9, 2021 “Sorry our sexist bait tweet brought in sexists”🙃🙃 https://t.co/a9zTX2B2dx — _kairy_draws_ (@_kairy_draws_) March 9, 2021 Wait so you only deleted because of that but not because what you tweeted was distasteful? That's a pitiful non apology. https://t.co/Ch7y9NuD2y — Pat Orr (@Powerage1986) March 9, 2021 Wait so you only deleted because of that but not because what you tweeted was distasteful? That's a pitiful non apology. https://t.co/Ch7y9NuD2y — Pat Orr (@Powerage1986) March 9, 2021 -
ప్రాణమిచ్చారు... బడ్జెట్‌ను ఇవ్వలేమా!
చంకలో బిడ్డ. తలపై తట్ట. ఎండలో నడక. తల్లి కష్టపడుతోంది. అలసి ఒగురుస్తోంది. బిడ్డనో, తట్టనో.. ఒక భారం అందుకోమెందుకు? ఎవరైనా వచ్చి చెప్పాలి! ఆలోచన ఇవ్వాలి!! పళ్లెం నిండా పరమాన్నాలు. పక్కనే పండ్లూ ఫలహారాలు.ఎదురుగా ఆకలిగొన్నమ్మ.పేగుల అరుపులపై కొంగు కప్పుకున్నమ్మ. ‘నువ్వు కూర్చోలేదేమిటి!’ అని అడగమెందుకని!‘పిల్లని తినమని అనవేమిరా..’ అని.. ఇంట్లో పెద్దవాళ్లొచ్చి చెప్పాలి. ఆలోచన కలిగించాలి!బడ్జెట్ కూడా ఏళ్లుగా తట్టనీ అందు కోలేదు.. ‘నువ్వు కూడా వచ్చి తినూ..’ అనలేదు. స్త్రీ అనే ప్రాణి ఉందనే ఆలోచనే బడ్టెట్‌లో లేదు! అప్పుడొచ్చి ఆర్థికవేత్తలెవరో ఇచ్చిన ఆలోచనే..‘జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్’.అంటే.. మహిళల్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ వెయ్యడం. ఈసారి బడ్జెట్ మహిళల్ని ఎంతవరకు దృష్టిలో పెట్టుకోబోతోంది?! ఫిబ్రవరి 1 న బడ్జెట్. ఇప్పటికే రెడీ అయిపోయి ఉంటుంది. అందులో మహిళలకు ఎంతిచ్చారో, ఏమిచ్చారో రెండు రోజుల్లో తెలుస్తుంది! ఎప్పట్లా అయితే ఈసారి బడ్జెట్ ఉండేందుకు లేదు. ఉండటం అన్యాయం అవుతుంది. మహిళలకు మరింతగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ప్రణాళికలూ, ప్రభుత్వ విధానాలూ కాపాడలేని విధంగా మహిళలు ఈ ఏడాది కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడారు. తమ ప్రాణాలను పణం గా పెట్టారు. ఆ ‘రుణం’ తీర్చుకునే విధంగా బడ్జెట్ ఉండాలి. దేశ జనాభాలో మహిళ లు 48 మంది ఉన్నా, ‘జాతీయ స్థూల ఉత్పత్తి’ శ్రమలో మహిళల రెక్కల కష్టం 17 శాతం వరకు ఉన్నా.. గత 2020–21 బడ్జెట్లో మహిళల కోసం కేటాయించింది 5 శాతం కన్నా తక్కువే! ఇంట్లో మహిళల శ్రమ, చాకిరి ఎలాగూ ‘ఎకానమీ’ లెక్కల్లోకి రావు. ఆ పదిహేడు శాతానికైనా తిరుగు ప్రతిఫలం ఉండాలి. అది ఈ బడ్జెట్లో ఉండబోతోందా? ఉండబోవడం కాదు. ‘ఉండాలి’ అనే నిబంధన ఉంది. ‘జెండర్–రెస్పాన్సివ్ బడ్జెటింగ్ (జి.ఆర్.బి) ఆ నిబంధన. 2001 నుంచి ఆలోచించి, 2006లో ఈ జి.ఆర్.బి.ని బడ్జెట్లో తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ‘బడ్జెట్ ఎలాగైనా ఉండొచ్చు. మహిళలకు ప్రాధాన్యం లేకుండా మాత్రం ఉండకూడదు’ అని నాడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేసిన సిఫారసును ఆర్థికశాఖ పరిగణనలోకి తీసుకోవలసిందే. స్త్రీ పురుష అసమానతలు, మహిళలపై హింస, లైంగిక వేధింపులు, వేతనాల్లోని వ్యత్యాసాలను తొలగించడానికి ప్రభుత్వం అనుసరించ వలసిన విధానాలలో ఒకటిగా ‘జెండర్–రెస్పాన్సివ్ బడ్జెటింగ్’ ఒక శక్తిమంతమైన సాధనం అయింది. బడ్జెట్‌ను ఎలా రూపొందిస్తారో తెలిసిందే. వచ్చేదింత, పోయేదింత అనే అంచనాలు ఉంటాయి. జెండర్ బడ్జెట్ అందుకు భిన్నమైనది. ఇందులో పార్ట్–ఎ, పార్ట్–బి అని ఉంటాయి. పార్ట్ ఎ లో ప్రత్యేకంగా మహిళలు, బాలికల అభివృద్ధి కోసమే దోహదపడే పథకాలకు, కార్యక్రమాలకు ప్రాధాన్యాలు ఉంటాయి. పార్ట్ బి లో మహిళలు, బాలికల సంక్షేమం కోసం ప్రత్యేకించిన కేటాయింపులు ఉంటాయి. పార్ట్ బికి ఎక్కువ వాటా ఉంటుంది. గత ఏడాది బడ్జెట్లో పార్ట్ ఎ, పార్ట్ బి కి కలిపి 1,43,461 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పెట్టి, అందులో పార్ట్ ఎ కి 28, 568 కోట్లు, పార్ట్ బి కి 1,14, 893 కోట్ల రూపాయలు కేటాయించారు. జెండర్ బడ్జెట్ ప్రధాన ఉద్దేశం మహిళా సాధికారత. లైంగిక సమానత్వ సాధన. ఇవన్నీ కూడా విద్య, ఉపాధి, ఆరోగ్యంతో సమకూరుతాయి కనుక కరోనా పెంచిన అంతరాన్ని సరి చేసేందుకు కూడా ఈ ఏడాది బడ్జెట్లో ఈ మూడింటికి ఎక్కువ నిధులు కేటాయించి ఉంటే సబబుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా.. జెండర్ బడ్జెట్‌ను ఒక ప్రభుత్వ విధానంగా కాక, ప్రభుత్వ నిర్ణయాలలో మహిళలకు భాగస్వామ్యం కల్పించే వినూత్న ప్రణాళికలతో రూపొందించవలసిన అవసరం ఉందన్నది ఆర్థికవేత్తల సూచన. చూడాలి, ఈ ఏడాదిని మనం ‘జెండర్ బడ్జెట్’ కన్నా ఎక్కువదైన ‘ఉమన్ బడ్టెట్’గా చూడబోతున్నామేమో. అదే నిజమైతే అది వండర్ బడ్జెట్టే అవుతుంది. -
జాతీయ కుటుంబ సర్వేలో ఆసక్తికర అంశాలు
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో లింగ సమానత్వంపై కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలు, ఉద్యమాలు, చైతన్యపూరిత కార్యక్రమాలు సత్ఫలితాలిచాయి. గతంతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ సర్వే వెల్లడించింది. రాష్ట్ర సంగటు కంటే జిల్లాలోనే మహిళ సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఐదేళ్ల క్రితం ప్రతి వేయి మంది పురుషులకు జిల్లాలో 1,007 మంది మహిళలు ఉంటే.. ప్రస్తుతం ఏకంగా ఆ సంఖ్య 1,053కు పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 నివేదికలో ఈ విషయాలను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ స్పష్టంచేసింది. 2019 జూన్ 30 నుంచి కేంద్ర కుటుంబ నవంబరు 14 వరకు 892 కుటుంబాల్లోని 911 మంది మహిళలు, 119 మంది పురుషులతో సర్వే నిర్వహించినట్లు ఆరోగ్య సంక్షేమశాఖ తెలియజేసింది. చదవండి: ఆ రాష్ట్రాల్లో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం తగ్గిన సిజేరియన్లు.. జిల్లాలో ప్రసవాలను పరిశీలిస్తే గతంలో కంటే సిజేరియన్ ప్రసవాలు తగ్గినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 2015–16లో నిర్వహించిన సర్వేలో సిజేరియన్ ప్రసవాలు 46.9 శాతంగా నమోదైతే.. ఐదేళ్ల తర్వాత అంటే 2019–20లో 43.2 శాతానికి తగ్గింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ ప్రసవాలు ఐదేళ్ల క్రితం 65.1 శాతంగా ఉండగా...2019–20లో 71.6 శాతానికి పెరగడం గమనార్హం. నవజాత శిశు మరణాలు నాలుగేళ్లలో 1000 మందికి 20 నుంచి 16.8 కి తగ్గాయి. నాలుగేళ్లలోపు వయసున్న శిశు మరణాలు 31.7 నుంచి 29.4కు తగ్గాయి. నాలుగేళ్లలోపు చిన్నారులకు సరైన పోషకాహారం లభించక ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరునెలల నుంచి నాలుగేళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. తగ్గని మధుమేహం.. జిల్లాలో పురుషులు, మహిళల్లో మధుమేహం (డయాబిటీస్) ఎక్కువగా ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బయటపెట్టింది. 141–160 ఎంజీ/డీఎల్ ఉన్నవారిలో మహిళలు 4.4 శాతం మంది, పురుషులు 6.3 శాతం మంది ఉన్నారు. 160 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 5.3, పురుషులు 8.7 శాతం మంది ఉన్నారు. మాత్రలు వేసుకున్నా 140 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 11.3 శాతం, పురుషులు 16.3 శాతం మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మరింత పెరిగే అవకాశం.. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఆడపిల్లలు, మహిళల భవిష్యత్‌పై ప్రభుత్వం అవగాహనా, చైతన్య కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో, విద్య, ఉద్యోగాలలో కూడా ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యమిస్తున్నది. గర్భిణులుగా ఉన్నప్పుడు స్కానింగ్ లాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవరిస్తున్నారు. వైద్యులు కూడా అబార్షన్లు చేయడంలేదు. ఐసీడీఎస్ ద్వారా ఆడపిల్లలను రక్షించాలనే నినాదంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నాం. మున్ముందు బాలికల శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ‘బేఠీ బచావో–బేఠీ పడావో’ నినాదం కూడా బాలికల శాతం పెరగడానికి దోహదపడింది. – పద్మావతి, ఐసీడీఎస్ పీడీ జిల్లా వివరాలు 2015–16(శాతం) 2019–20(శాతం) ఆరేళ్లు, ఆపై వయస్సు గల వారు పాఠశాలకు వెళ్తున్న వారు 57 60.2 15 ఏళ్లలోపు చిన్నారుల జనాభా 26.1 24.1 మహిళల్లో అక్షరాస్యత 57 63.6 20 ఏళ్లలోపు బాలికల వివాహాలు 36.3 30.6 -
క్రీడల్లో లింగ వివక్షపై ఐఓఏ ముందడుగు
న్యూఢిల్లీ: క్రీడా పరిపాలన వ్యవహారాల్లో లింగ వివక్షను రూపుమాపి, పురుషులతో సమానంగా మహిళలకు సమాన అవకాశాలిచ్చేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ముందడుగు వేసింది. ఈ మేరకు జాతీయ క్రీడా సమాఖ్యల జనరల్ అసెంబ్లీలో మూడింట ఒక వంతు మహిళలు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను కోరారు. అన్ని జాతీయ ఒలింపిక్ కమిటీలు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సూచించింది. -
మొన్న ఆడ, నిన్న మగ.. నేడు ఏదీ కాదు..
లండన్: హర్ట్ఫోర్డ్షైర్లో పుట్టి పెరిగిన కైరా బెల్ జన్మతా ఆడపిల్ల. రింగు రింగుల జుట్టుతో చిన్నప్పుడు అచ్చం ఆడ పిల్లలాగే ఉన్నా మగపిల్లల్లా గదమ మీద, చేతుల మీద వెంట్రుకలు వచ్చేవి. వాటిని రేజర్‌తో షేవ్ చేసుకోవాల్సి వచ్చేది. గొంతు కూడా ఆడ పిల్లలాగ కాకుండా పీల గొంతు ఉండేది. ఈ లక్షణాలకు తగినట్లుగానే ఆమెకు చిన్నప్పటి నుంచి మగవాళ్ల దుస్తులే ధరించేది టామ్‌బాయ్ (మగ దుస్తులు ధరించే ఆడపిల్ల)లాగా. ఆడ పిల్లల దుస్తులు «ధరించాల్సిందిగా తల్లి ఎంత మొత్తుకున్న వినేది కాదు. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న తల్లితోనే ఆమె ఉండేది. రానురాను కైరా బెల్ శరీరంలో మగ లక్షణాలతోపాటు ఆలోచనల్లో కూడా మగ లక్షణాలే పెరగడంతో సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది. 16వ ఏటా బ్రిటన్ నేషనల్ హెల్త్ స్కీమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న లండన్‌లోని ‘ది టావిస్టాక్ సెంటర్’ చికిత్సా కేంద్రాన్ని సందర్శించింది. మూడున్నర గంటల కౌన్సిలింగ్ ద్వారా ఆమెకు సెక్స్ మార్పిడి చేయాలని వైద్యులు నిర్ణయించారు. ముందుగా ఆడ లక్షణాలకు సంబంధించిన హార్మోన్స్‌ను అడ్డుకునే మందులు ఇచ్చారు. ఆ తర్వాత సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆమెలో మహిళా హార్మోన్లు నశించడంతోపాటు పీరియడ్స్ ఆగిపోయాయి. లైంగిక కోరిక చచ్చిపోయింది. ఈ దశంలో ఆమెకు ‘టెస్టాస్టెరోన్’ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చారు. అప్పుడు గడ్డం, మీసాలు బాగానే పెరిగాయి. ఆడ పిల్లల్లాగా బ్రెస్ట్ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో ఆమె తన 20వ ఏట ఆపరేషన్ ద్వారా బ్రెస్ట్ తీసేయించుకున్నారు. మళ్లీ పెరగకుండా ‘ప్రెసింగ్’ ట్రీట్మెంట్ తీసుకుందిజ ఈ క్రమంలో ఆమె ఎంతో బాధను అనుభవించింది. బర్త్ సర్టిఫికేట్, విద్యార్హతల్లో జెండర్‌ను ఆడ నుంచి మగగా మార్చుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఎంత కష్టపడ్డా పూర్తి మగ లక్షణాలు రాలేదు. దాంతో ఆమె పునరాలోచనలో పడింది. టెస్టోస్టెరోన్ ఇంజెక్షన్లు తీసుకోవడం మానేసింది. దాంతో ఆమెకు తిరిగి పీరియడ్స్ మొదలయ్యాయి. గడ్డం, మీసాలు పెరగడం తగ్గాయి. లైంగిక కోరికలు కలగడం కూడా మొదలయింది. తిరిగి ఆడపిల్ల కావాలనుకుంది. ఇక్కడే ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. ‘ది టావిస్టాక్ సెంటర్’ 18 ఏళ్లు నిండని మైనర్లకు సెక్స్ మార్పిడి ఆపరేషన్లు చేయడం చట్టవిరుద్ధమంటూ దాఖలైన కేసులో ప్రత్యక్ష సాక్షిగా కైరా బెల్‌ను పేర్కొన్నారు. అందుకని ఆమె సెక్స్ మార్పిడికి ‘ది టావిస్టాక్’గానీ, ప్రాసిక్యూటర్లుగానీ అనుమతించడం లేదు. ఈ కేసు హైకోర్టులో తేలదని, బ్రిటన్ సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంలో కేసు తేలడానికి కొన్నేళ్లు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు కైరా నిరీక్షించాల్సిందే. ‘నాది ఆడ లేదా మగ కాని బతుకైనది. రెండింటి మధ్య నలిగి పోతున్నాను. సెక్స్ మార్పిడి కోరుకునే వారికి నా అనుభవాలు ఓ గుణపాఠం కావాలి’ అని కైరా సమాజానికి సందేశం ఇస్తున్నారు. ఇంతకుముందు బ్రిటన్ చార్లీ ఎవాన్స్ ముందు ఆడ పిల్ల, సెక్స్ మార్పిడి ద్వారా పురుషుడయ్యారు. మళ్లీ ఆపరేషన్ ద్వారా ఆడపిల్లగా మారారు. ఇలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ బ్రిటన్‌లో లింగ మార్పిడికి 13,500 మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారు. 2009–10 సంవత్సరంలో 18 ఏళ్లలోపు ఆడపిల్లలు 40 మంది లింగ మార్పిడి ఆపరేషన్ చేసుకోగా వారి సంఖ్య 2017–2018 సంవత్సరానికి 1806కు చేరుకుంది. ఇక మగవారి సంఖ్య 57 నుంచి 753కు చేరుకుంది. -
లింగ సున్నితత్వ విద్య అవసరం
బాలికలపై, మహిళలపై మగవారు అత్యాచారాలు, దురాగతాలకు ఎందుకు పాల్పడతారు? వారికి ‘అలా ప్రవర్తించకూడదు’ అని బాల్యంలో బలంగా మనసులో నాటుకోవడంలేదు. దానికి భిన్నమైన భావనలు నాటుతున్నారు. దీనికి దీర్ఘకాలిక పరిష్కారం చూడాలి. అది బడి లోనే సాధ్యం. విద్యా కాలం దాటేలోపుగానే వారిలో లింగ సున్నితత్వం ఏర్పరచాలి. ఇందుకు ఒక చిన్న పుస్తకం కావాలి. ప్రాథమిక తరగతులకు ఇరవై పేజీలు ఉంటే సరిపోతుంది. ఆరో తరగతి నుంచీ అటూఇటుగా ముప్పై, నలభై పేజీలు చాలు. ఈ పుస్తకాన్ని మొదటి సబ్జెక్టుగా పెట్టాలి. అన్ని పరీక్షలకన్నా ముందు ఒక ఇరవై మార్కులకి ఈ పరీక్ష జరగాలి. ఈ పరీక్ష ఉత్తీర్ణత ప్రధానమైనదిగా కాక, భాగస్వామ్య ప్రధానంగా సాగాలి. పుస్తకంలో పేజీలు ఒకటి బాలుర కోసం, పక్కనే ఇంకొకటి బాలికల కోసం వుండాలి. అంటే, ఒక పేజీ సమాజంలో ఎదిగే బాలుడిని లక్ష్యంగా చేసుకుని తయారు చేయాలి, ఒక పేజీ బాలికల గురించి. ఉదాహరణకి, ఆరో తరగతిలో ఒక పేజీలో, ‘ఒసే, ఏమే, అది, ఇది అని నీ తరగతిలో బాలికలను పిలవకూడదు. వారి పేర్లతోనే వారిని పిల వాలి’ అని రెండు వాక్యాలు ఇవ్వాలి. దాని గురించి చిన్న చర్చ. ‘అది’ ‘ఇది’ అని తరగతిలో వేటిని పిలుస్తాము? బాలికలకీ ఆ వస్తువులకీ తేడాలు ఏమిటి? బాలిక వస్తువు కాదు, ఒక మనిషి అని చెప్పాలి. అక్కడే ఒక బొమ్మ, వస్తువులకీ; ప్రాణం, అనుభూతులు గల బాలికకూ తేడా చూపేవిధంగా పెట్టాలి. పేజీ చివర, చిన్న ఖాళీ పంక్తులలో, వారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులు ఎవరు? పై సంబోధనలు చేసేది ఎవరిని? ఎందుకు? ఈ అలవాటు ఎందుకు మానెయ్యాలి? అని స్పందన పత్రం రాయాలి. ఇలాగే, ఎనిమిదో తరగతి పిల్లవాడికి, ‘మగ పిల్లలకి మీసాలు రావడం సహజం. వాటిని మెలి తిప్పడంలో ఏవిధమైన ప్రత్యేకతా లేదు. అలాగే, తొడ కొట్టడం వల్ల కొత్త బలం రాదు. బల ప్రదర్శనా పోటీలో కూడా, విజేత హుందాగా గెలవాలి. పురుషత్వం ఒక సహజమైన అంశం. అది గొప్పా కాదు, తక్కువా కాదు’ అని రాయాలి. ఇంకా, నీ చెల్లీ/అక్కా, నువ్వూ ఒక్కసారే భోజనం చేస్తు న్నారా? మీ అమ్మా నాన్నా ఒకే విధంగా ఆహారం తీసుకుంటున్నారా? ముందు ఎవరు తింటున్నారు? ఎందుకు? ఎలా వుంటే బావుంటుంది? అని ప్రశ్నించవచ్చు. అదే పుస్తకంలో బాలికలకు కూడా వాళ్లకి నేర్పవలసిన సంగతులు వుండాలి. ఉదాహరణకు ఒరే, పోరోయ్ అని కాకుండా బాలురని పేరుతో పిలవాలి. ఇంటి విషయాల్లో బాలికలు అన్ని రకాలుగా సమాన భాగస్వాములు. తల్లి, తండ్రి, రోజంతా పని చేసిన తరువాత; పిల్లలు బడి సమయం పూర్తి అయిన తరువాత, విశ్రాంతి కోసం చేరే స్థలాన్ని ‘ఇల్లు’ అంటాము. మీ ఇల్లు మీ కుటుంబం మొత్తానిది. దాని బాధ్యతలు కూడా అందరివీ. ఒక పేజీలో వంట ఇంట్లో పని చేస్తున్న మొత్తం కుటుంబ సభ్యుల చక్కని పెయింటింగ్/ఫొటో ప్రచురించాలి. ఇల్లు భవిష్యత్తులో నేను ‘పూర్తి’ సమయం ఉండవలసిన స్థలం అనే భావన నుంచి బాలికలు బైటికి రావాలి. బాలురు కూడా, ఇల్లు స్త్రీకి చెందినది అనే భావన నుంచి బైటికి రావాలి. ఇలా ఒక పుస్తకం చేసి, దాన్నొక వేడుకగా పిల్లలకి ఇద్దాం. పెద్ద ఖర్చు కూడా కాదు. వచ్చే విద్యా సంవత్సరంనుంచీ ప్రభుత్వం విద్యా రంగంలో మార్పులు తేబోతోంది కాబట్టి, లింగ సున్నితత్వం విద్యా ప్రణాళికలో చేర్చడానికి ఇదే సరైన సమయం. ఈ పుస్తకాన్ని పిల్లలకు వారి వారి సొంత భాషలోనే అందించాలి. ఇక్కడ నేను వ్యక్తీకరించినవి ప్రాథ మిక భావనలు. వీటిని మరింత మెరుగు చేసుకుని ఒక చక్కని సమాజాన్ని నిర్మించుకోవడానికి పిల్లలకోసం కొన్ని రంగు బొమ్మల పేజీలు ముద్రించగలం కదా. ఎమ్మెస్కే. కృష్ణ జ్యోతి వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్ మొబైల్: 91107 28070 -
గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొన్ని స్కానింగ్ సెంటర్లు గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. పీసీపీఎన్డీటీ జాతీయ తనిఖీ బృందం గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తనిఖీలు నిర్వహించగా ఈ విషయం మరోసారి బయటపడింది. మూడు జిల్లాల్లోనూ పది సెంటర్లను తనిఖీ చేయగా వీటిలో ఐదు సెంటర్లు నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. ఆయా సెంటర్లకు నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఒక కార్పొరేట్ ఆస్పత్రి సహా శివారులోని పలు స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 800పైగా స్కానింగ్ సెంటర్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాల్లో 522, మేడ్చల్ జిల్లాలో 600పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే వీటిల్లో తనిఖీలు నిర్వహించి, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్యులతో పాటు రేడియాలజిస్టులు లేని, రికార్డులు సరిగా నిర్వహించని స్కానింగ్ సెంటర్లను గుర్తించి కేసులు నమోదు చేశారు. గతంలో 30పైగా సెంటర్లను సీజ్ చేసిన అధికారులు తాజాగా మరో ఐదు సెంటర్లపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొద్దు నిద్రవీడక పోవడం వల్లే జాతీయస్థాయి బృందాలు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఈ దాడుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూపలు కేంద్రాలు అడ్డంగా దొరికిపోతున్నాయి.