మెక్సికో సిటీ: మరికొద్ది రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుండగా, సెక్స్ స్కాండల్ మెక్సికో జట్టును కుదిపేసింది. రష్యాకు బయలుదేరే ముందు ఆటగాళ్ల దగ్గరకి వేశ్యలను పంపిన విషయం వెలుగులోకి రావటంతో మెక్సికో ఫుట్‌బాల్ అసోషియేషన్(ఎంఎఫ్‌ఏ)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెక్సికోకు చెందిన టీవీ నోటాస్ మాగ్జైన్ కథనం ప్రకారం.. గత శనివారం అజ్‌టెక్ స్టేడియంలో స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెక్సికో జట్టు విజయం సాధించింది. అనంతరం 9 మంది ఆటగాళ్లను ఓ ప్రైవేట్ రిసార్ట్స్‌కు తరలించి, సుమారు 30 మంది వేశ్యలను వారి వద్దకు అధికారులు పంపారు. ‘ఆటగాళ్లకు అద్భుతమైన ఫేర్‌వెల్’ అంటూ సదరు మాగ్జైన్ ఫోటోలతో సహా ఓ కథనం ప్రచురించింది. దీంతో ఎంఎఫ్‌ఏపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే మెక్సికన్ అధికారులు మాత్రం ఈ అంశాన్ని వివాదాస్పదం చేయటం సరికాదంటున్నారు. ‘వారు ప్రాక్టీస్‌కు క్రమం తప్పకుండా హాజరయ్యారు. ఫ్రీ టైమ్‌లోనే ఏకాంతంగా గడిపారు. రిప్రెష్‌మెంట్ కోసమే ఈ పని చేశాం. కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవు’ అని మెక్సికన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ ప్రకటించింది. గతంలో(సెప్టెంబర్ 2010) ఆటగాళ్లు ఇదే రీతిలో అమ్మాయిలతో గడపగా.. క్రమశిక్షణ నియమావళి కింద ఇద్దరు ఆటగాళ్లు తాత్కాలిక నిషేధం ఎదుర్కున్నారు.
Comments
Please login to add a commentAdd a comment