Who is Nikkole Teja? Mexican footballer who joins Only Fans on public demand - Sakshi
Sakshi News home page

#NikkoleTeja: అభిమానుల డిమాండ్‌; అశ్లీల వెబ్‌సైట్‌లో జాయిన్‌ అయిన ఫుట్‌బాలర్‌

Published Thu, Jun 29 2023 5:18 PM | Last Updated on Thu, Jun 29 2023 6:23 PM

Nikkole Teja-Mexican Footballer Who Joins Only-Fans -Adult Website - Sakshi

మెక్సికో చెందిన మహిళా ఫుట్‌బాలర్‌ నిక్కోల్‌ తేజ తన అభిమానుల కోసం ఎవరు చేయని సాహసం చేసింది. అభిమానుల డిమాండ్‌ మేరకు ఆమె అశ్లీల వెబ్‌సైట్‌ అయిన ఓన్లీ ఫ్యాన్స్‌(OnlyFans)లో జాయిన్‌ అయింది. ఈ విషయాన్ని నిక్కోల్‌ తేజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

''అభిమానుల డిమాండ్‌ మేరకు ఓన్లీఫ్యాన్స్‌లో జాయిన్‌ అయ్యాను..ఇదే ముఖ్య కారణం.. నా పిక్స్‌ చూసేయండి'' అంటూ పేర్కొంది. ఇక నిక్కోల్‌ తేజ ఫోటోలను ఓన్లీఫ్యాన్స్‌లో చూడాలనుకుంటే 17.50 డాలర్లతో సబ్‌స్క్రిప్షన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తన అందంతో కట్టిపడేసే నిక్కోల్‌ తేజకు ఇన్‌స్టాగ్రామ్‌లో 358,000 ఫాలోవర్స్‌ ఉన్నారు.

కాగా సియాటెల్‌లో పుట్టిన ఆమె మెక్సికోలో స్థిరపడింది. చిన్న వయసులోనే ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టిన నిక్కోల్‌ తేజ మెక్సికోకు చెందిన పలు ఫుట్‌బాల్‌ క్లబ్స్‌లో ఆడింది. ప్రస్తుతం టోర్నియో క్లాసురా క్లబ్‌కు ఆడుతున్న ఆమె ర్యాంకింగ్స్‌లో ఆఖరి స్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో కేవలం రెండు గోల్స్‌ మాత్రమే కొట్టింది. చెత్త ప్రదర్శన కారణంగా టోర్నియో క్లబ్‌ ఈ జనవరిలో నిక్కోల్‌ తేజతో కాంట్రాక్ట్‌ను టర్మినేట్‌ చేసుకుంది.

ఓన్లీఫ్యాన్స్‌(OnlyFans).. చూడాలంటే  డబ్బులు కట్టాల్సిందే
ఓన్లీఫ్యాన్స్‌ అనేది సబ్‌స్క్రిప్షన్‌ బేస్‌డ్‌ కంటెంట్‌ ప్లాట్‌ఫామ్‌గా ఉంది. 2016లో ఇది ప్రారంభమైంది. అభిమానులు తమకిష్టమైన సెలబ్రిటీల అశ్లీల ఫోటోలను డబ్బులు కట్టి ఈ వెబ్‌సైట్‌లో చూసే అవకాశం ఉంటుంది. గతంలో ఈ వెబ్‌సైట్‌లో అశ్లీలత అధికంగా ఉండేది. అయితే ఓన్లీఫ్యాన్స్‌ ప్లాట్‌ఫార్మ్‌లో ముందు నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు డబ్బులు కట్టాల్సి ఉండడంతో ఇది లీగ్‌ల్‌ వెబ్‌సైట్‌గానే కొనసాగింది.

మధ్యలో కొంతమంది అశ్లీలత మరీ ఎక్కువగా ఉందని ఆందోళన చేయడంతో ఆగస్టు 2021లో ఓన్లీఫ్యాన్స్‌లో ఇకపై అశ్లీలత ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసే అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. తీవ్ర వ్యతిరేఖత రావడంతో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

చదవండి: #SteveSmith: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్‌ దిగ్గజం సరసన 

బాల్‌గర్ల్‌గా బ్రిటన్‌ యువరాణి.. మెళుకువలు నేర్పిన ఫెదరర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement