
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలు వనెస్సా ట్రంప్‌తో దిగ్గజ గోల్ఫర్ టైగర్ వుడ్స్ ప్రేమాయణం నడిపిస్తున్నాడు. వనెస్సాతో రిలేషిప్ విషయాన్ని వుడ్స్ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించాడు. వనెస్సాతో బంధాన్ని వెల్లడిస్తూ వుడ్స్ తన సోషల్‌మీడియా ఖాతాల్లో ఇలా రాసుకొచ్చాడు.
నీ ప్రేమలో ఉంటే గాల్లో తేలినట్లుంది. నువ్వు నా పక్కన ఉంటే జీవితం అద్భుతంగా ఉంది. కలిసి జీవితంలో ముందుకు సాగేందుకు ఎదురు చూస్తున్నాం. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు ధన్యవాదాలు. మా హృదయాలకు దగ్గరిగా ఉన్న వారి గోప్యత కొరకు కూడా అభ్యర్దిస్తున్నామంటూ వెనెస్సాతో సన్నిహితంగా ఉన్న దృష్యాలను షేర్ చేశాడు.
Love is in the air and life is better with you by my side! We look forward to our journey through life together. At this time we would appreciate privacy for all those close to our hearts. pic.twitter.com/ETONf1pUmI
— Tiger Woods (@TigerWoods) March 23, 2025
వుడ్స్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచుకునే వుడ్స్ పబ్లిక్‌గా వెనెస్సాతో బంధాన్ని అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.
వెనెస్సా ట్రంప్ ఎవరు..?
వెనెస్సా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాజీ భార్య. వీరిద్దరు 12 ఏళ్లు వివాహ బంధాన్ని కొనసాగించి ఆ తర్వాత విడిపోయారు. వీరికి ఐదుగురు సంతానం.
వెనెస్సా కూమార్తెలలో ఒకరైన కాయ్, వుడ్స్ ఇద్దరు సంతానం సామ్, ఛార్లీ ఒకే స్కూల్‌లో (ద బెంజమిన్ స్కూల్) చదువుకుంటున్నారు. కాయ్, ఛార్లీ ఇటీవల ఓ జూనియర్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు.
సామ్, ఛార్లీ.. వుడ్స్ అతని మాజీ భార్య ఎలిన్ నార్‌డెగ్రెన్‌కు కలిగిన సంతానం. వుడ్ ఎలిన్‌తో 2010లో విడిపోయాడు. వెనెస్సాకు ముందు వుడ్స్ ఎరికా హెర్మన్‌తో కొద్దికాలం సహజీవనం చేశాడు. వీరిద్దరి బంధం 2022లో ముగిసింది. 49 ఏళ్ల వుడ్స్ ప్రస్తుతం గాయంతో బాధపడుతూ మాస్టర్స్ టోర్నీతో పాటు మిగిలిన గోల్ఫ్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
1996లో ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా మారిన వుడ్స్ తన కెరీర్‌లో 15 మేజర్ ఛాంపియన్షిప్స్‌ను సొంతం చేసుకున్నాడు. 1997 నుంచి వరుసగా 683 వారాల పాటు వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్‌గా చలామణి అయిన ఈ అమెరికన్ గోల్ఫ్ దిగ్గజం 82 సార్లు పీజీఏ టూర్ విజయాలు, 41 సార్లు యూరోపియన్ టూర్‌లో విజయాలు సాధించాడు. 2021లో వుడ్స్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment