
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో ఆరోగ్య శాఖకు అధిపతిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను నియమించారు. ఈయన అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ తినే ఫాస్ట్ ఫుడ్‌ను విషంగా అభివర్ణించి, ఇప్పుడు ట్రంప్ పక్కన కూర్చుని ఫాస్ట్ ఫుడ్‌ను తింటున్న ఉదంతానికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ షేర్ చేసిన ఫొటోలో ఎలన్ మస్క్, ట్రంప్, యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా ఉన్నారు. అలాగే ఈ ఫొటోలో కెన్నెడీ జూనియర్ మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను చేతిలో పట్టుకోవడం కనిపిస్తుంది. అక్కడి టేబుల్‌పై కోకా-కోలా బాటిల్ కూడా కనిపిస్తోంది. దీనికితోడు మెక్‌డొనాల్డ్స్ బర్గర్, ఫ్రైస్ ఉన్న ప్లేటు ట్రంప్, మస్క్ ముందు ఉంచారు. ట్రంప్ జూనియర్ ‘మేక్ అమెరికా హెల్దీ అగైన్ టుమారో స్టార్ట్స్’ అనే క్యాప్షన్‌తో చిత్రాన్ని షేర్ చేశారు.
Make America Healthy Again starts TOMORROW. 🇺🇸🇺🇸🇺🇸 pic.twitter.com/LLzr5S9ugf
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 17, 2024
ఇటీవల ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూలో కెన్నెడీ జూనియర్ ట్రంప్ తినేవాటిని ‘విషం’గా అభివర్ణించారు. ప్రచార సమయంలో ఆయన ట్రంప్ చెడ్డ ఆహారం తింటున్నారని పేర్కొన్నారు. ఈయన గతంలో దుకాణాల్లోని షెల్ఫ్‌ల నుండి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ప్యాకెట్లను తొలగించాలని కోరారు. అయితే అమెరికాలో ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌కున్న ప్రాముఖ్యతను కెన్నెడీ జూనియర్ ఒప్పుకున్నారు.
ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు