వచ్చేస్తున్నాడు... డోనాల్డ్ ట్రంప్.. దిగ్గజ టెక్ కంపెనీలకు పోటీగా..! | Trump social media app is set to be launched in Apple App Store on Monday | Sakshi
Sakshi News home page

వచ్చేస్తున్నాడు... డోనాల్డ్ ట్రంప్.. దిగ్గజ టెక్ కంపెనీలకు పోటీగా..!

Published Sun, Feb 20 2022 2:21 PM | Last Updated on Sun, Feb 20 2022 2:21 PM

Trump social media app is set to be launched in Apple App Store on Monday - Sakshi

అమెరికా క్యాపిటల్‌ హిల్‌ హింసాత్మక ఘటనల నేపథ్యంలో యూఎస్‌ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను నిషేధిస్తూ పలు సోషల్‌ మీడియా సంస్థలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సొంత ప్లాట్‌ఫాంకు ట్రంప్‌ వడివడిగా అడుగులు వేస్తూ ట్రూత్‌ అనే సోషల్‌ మీడియా ప్లాట్‌పాంను సోమవారం రోజు(ఫిబ్రవరి 21) న లాంచ్‌ చేయనున్నాడు.   


సోషల్ మీడియా దిగ్గజాలకు పోటీగా..
సోషల్‌మీడియా దిగ్గజాలపై అక్కసును తెలియజేస్తూ సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌ను డోనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరి 21న లాంచ్‌ చేయనున్నారు. ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా ట్రూత్‌ యాప్‌ను ట్రంప్‌  ఆవిష్కరించనున్నాడు. యూఎస్‌ ప్రెసిడెంట్‌ డే సందర్భంగా ట్రూత్‌ యాప్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ కు సంబంధించి తాజాగా జూనియర్ డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించాడు.  నిజనిజాలను ట్రూత్ యాప్ తో వ్యక్తపరచ వచ్చునని అభిప్రాయ పడ్డాడు.


ట్రూత్‌ డెమో ఫోటోల ప్రకారం ట్విటర్‌ మాదిరిగానే ఈ యాప్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రెండింగ్‌ టాపిక్స్‌, ట్యాగింగ్‌ వంటి ఆప్షన్స్‌తో రానుంది. ఇప్పటికే ట్రూత్‌కు సంబంధించిన వివరాలను ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌(టీఎంటీజీ) యాపిల్‌ ఇంక్‌ యాప్‌ స్టోర్‌ లిస్టింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. తొలుత ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్స్ లో రిలీజ్ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement