Donald trump: ట్రంప్‌ ఇక లేరంటూ పోస్ట్‌.. ఆపై ట్విస్ట్‌ | Donald Trump Son X Account Hakced, Sensational Trump Death Post Trending On Social Media - Sakshi
Sakshi News home page

Fake Post On Donald Trump Death: ‘మా నాన్న ఇకలేరు’.. కలకలం రేపిన ట్రంప్‌ కొడుకు పోస్ట్‌.. ఆపై ట్విస్ట్‌

Published Wed, Sep 20 2023 9:30 PM | Last Updated on Thu, Sep 21 2023 9:27 AM

hacked Donald Trump Son X account Sensational Tweet Viral - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరణించారంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్‌ కలకలం రేపింది. అదీ ఏకంగా ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ సోషల్‌ మీడియా ఖాతా నుంచే కావడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అయితే, ఆయన అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని తర్వాత తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

తన తండ్రి డొనాల్డ్‌ ట్రంప్‌ మరణించారంటూ పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ ఎక్స్‌(ట్విటర్‌) ఖాతా నుంచి ఈ ఉదయం ఓ పోస్ట్‌ వచ్చింది. అంతేకాదు 2024 ఎన్నికల్లో ట్రంప్‌ బదులు అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తాననేది ఆ పోస్టు సారాంశం. అదే ఖాతా నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను దూషిస్తూ పలు పోస్టులు కూడా వెలువడ్డాయి. 

అయితే, ట్రంప్‌ జూనియర్‌ అకౌంట్‌ ఎక్స్ ఖాతా హ్యాక్‌ అయినట్లు తర్వాత గుర్తించారు. కాసేపటికే పాత పోస్టులను తొలగించారు. అయినప్పటికీ సంబంధిత స్క్రీన్‌షాట్‌ మాత్రం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement