Twitter Account Hack
-
హీరోయిన్ నయనతార అకౌంట్ హ్యాక్
సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు హ్యాకర్లు.. ఖాతాల్ని తమ అధీనంలోకి తీసుకుంటూ ఉంటారు. కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయినట్లు చెప్పాడు. ఇప్పుడు హీరోయిన్ నయనతార ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉండే నయనతార ఇన్ స్టాలో పెద్దగా పోస్టులేం పెట్టదు. కాకపోతే పిల్లలు, భర్తతో ఉన్న ఫొటోల్ని ఎప్పుడో ఓసారి పోస్ట్ చేస్తుంటుంది. ట్విటర్లోనూ అడపాదడపా పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా తన ట్విటర్ ఖాతా హ్యాక్ అయినట్లు ట్విటర్లోనే రాసుకొచ్చింది. తన అకౌంట్ నుంచి ఎవరైనా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వొద్దని పేర్కొంది.తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ని పెళ్లి చేసుకున్న నయనతార.. సరోగసి విధానంలో ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఫ్యామిలీతోనూ సమయాన్ని గడుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఈమె చేతిలో తని ఒరువన్ 2, టెస్ట్, మన్నన్ గట్టి 1960, డియర్ స్టూడెంట్స్ అనే మూవీస్ ఉన్నాయి. తెలుగులో అయితే చివరగా చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో కనిపించింది.(ఇదీ చదవండి: ఈ చెత్త పనేంటి దర్శన్.. ఇంకా మార్పు రాకుంటే ఎలా..?)Account has been hacked. Please ignore any unnecessary or strange tweets being posted.— Nayanthara✨ (@NayantharaU) September 13, 2024 -
అసోం కాంగ్రెస్ ‘ఎక్స్’ అకౌంట్లో టెస్లా లోగో.. ఏం జరిగిందంటే..
అసోం కాంగ్రెస్ అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతా బుధవారం హ్యాక్ అయింది. ప్రొఫైల్ పేరు 'టెస్లా ఈవెంట్'గా మారిపోయింది. ప్రొఫైల్ ఫొటోగా అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా లోగోను పెట్టారు హ్యాకర్లు.ఈ మేరకు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఖాతా హ్యాక్‌కు గురైందని ఏపీసీసీ సోషల్ మీడియా & ఐటీ చైర్మన్ రతుల్ కలితా గౌహతిలోని భంగాగర్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్ హ్యాక్ అయిందని, ఇప్పుడే పునరుద్ధరించామని అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బుధవారం మధ్యాహ్నం ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపింది. పూర్తి భద్రతను నిర్ధారించడానికి ప్రస్తుతం సమీక్షలో ఉందని పేర్కొంది. ఇది ప్రభుత్వ పనే అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.We would like to inform you that our official Twitter handle, Assam Pradesh Congress Committee, was hacked but has now been restored and is currently under review to ensure full security. This attempted silencing by the fascist government will not deter us. We remain committed to… pic.twitter.com/DE7vWGXWcv— Tesla Event (@INCAssam) May 8, 2024 -
గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
-
Donald trump: ట్రంప్ ఇక లేరంటూ పోస్ట్.. ఆపై ట్విస్ట్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ కలకలం రేపింది. అదీ ఏకంగా ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సోషల్ మీడియా ఖాతా నుంచే కావడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అయితే, ఆయన అకౌంట్ హ్యాక్ అయ్యిందని తర్వాత తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ మరణించారంటూ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఎక్స్(ట్విటర్) ఖాతా నుంచి ఈ ఉదయం ఓ పోస్ట్ వచ్చింది. అంతేకాదు 2024 ఎన్నికల్లో ట్రంప్ బదులు అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తాననేది ఆ పోస్టు సారాంశం. అదే ఖాతా నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను దూషిస్తూ పలు పోస్టులు కూడా వెలువడ్డాయి. అయితే, ట్రంప్ జూనియర్ అకౌంట్ ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు తర్వాత గుర్తించారు. కాసేపటికే పాత పోస్టులను తొలగించారు. అయినప్పటికీ సంబంధిత స్క్రీన్‌షాట్ మాత్రం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ ఖాతా హ్యాక్
హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని టీఎస్ ఆర్టీసీ ధృవీకరించింది. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ సజ్జనార్ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురి కావడం చాలా దురదృష్టకర సంఘటనగా టీఎస్ ఆర్టీసీ పేర్కొంది. ప్రస్తుతం సదరు అకౌంట్ నుంచి ఎటువంటి ట్వీట్లను చేయడం కానీ రిప్లై ఇవ్వడం కానీ జరగడం లేదని టీఎస్ ఆర్టీసీ పీఆర్వో పేర్కొన్నారు. ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నామని , దీనికి ట్విట్టర్ సపోర్ట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. -
ప్రముఖ నటుడి ట్విటర్ హ్యాక్..!
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. దయచేసి ఎవరూ కూడా తన అభిమానులు ఆందోళనకు గురి కావొద్దని తెలిపారు. అకౌంట్ తిరిగి సరిచేసేంత వరకు అభిమానులు దాని జోలికి వెళ్లొద్దని కోరారు. నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు దయచేసి అభిమానులు ఎవరూ నా అకౌంట్వెళ్లొద్దు. నా అకౌంట్ నుంచి వచ్చిన ఎటువంటి పోస్టులను అంగీకరించొద్దు. సమస్య పరిష్కరించాక నేను మీకు అప్ డేట్స్ ఇస్తా.' ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఇటీవలే శాండల్‌వుడ్‌లోనూ ఓ స్టార్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. కాంతార ఫేమ్ కన్నడ స్టార్ కిశోర్ కుమార్‌కు ట్విట్టర్లో ఓ సమస్య ఎదురయ్యింది. ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఓ ఈ సందేశం కనిపించింది. దీంతో ఆయన ట్విట్టర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని అందుకే తన ఖాతాను నిలిపివేశారని అన్నారు. కానీ.. తన ఆ తర్వాత అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేయడం వల్లే ఇలా జరిగిందని కిశోర్ ఇన్‌స్టాలో తెలిపారు. -
ఏపీ: వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
-
Sakshi Cartoon 03-10-2022
సంతోషం! అలా అయినా మనకో ట్విట్టర్ అకౌంట్ ఉందని పబ్లిసిటీ అయింది! -
యూజీసీ అకౌంట్‌కి చిక్కులు, ఎన్ఎఫ్టీలు అమ్ముతామంటూ చొరబడిన హ్యాకర్లు
ప్రతిష్టాత్మక సంస్థ యూనిర్సిటీ గ్రాంట్ కమిషన్ ఖాతా హ్యాక్ అయ్యింది. ట్విట్టర్లో యూజీసీకి చెందిన అధికారిక ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. యూజీసీ ట్విట్టర్ ఖాతాకు సంబంధించి డీపీ, కవర్ ఫోటోలను మార్చివేశారు. అజూకీ క్యారెక్టర్లతో డీపీ, కవర్ ఫోటోలను కొత్తగా లోడ్ చేశారు. యూజీసీ ట్విట్టర్ అకౌంట్‌కి 2,96,000ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022 ఏప్రిల్ 10న యూజీసీ ఖాతాలో వచ్చిన మార్పులు డీపీ చేంజ్ కావడం చూసిన వారు వెంటనే అప్రమత్తమయ్యారు, హ్యాకింగ్ గురించి రిపోర్టు చేశారు. సాయంత్రానికి ట్విటర్ ఖాతాను యూజీసీ రిస్టోర్ చేసుకోగలింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఫోర్బ్స్ పత్రిక కథనం ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న నాన్ ఫంజిబుల్ టోకెన్లు (ఎన్ఎఫ్టీ)లుగా అజూకీ క్యారెక్టర్లు ఉన్నాయి. యూజీసీ ట్విట్టర్ ఖాతాను వశం చుసుకున్న హ్యాకర్లు ఈ ఖాతా ద్వారా అజూకీ ఎన్ఎఫ్టీలు అమ్ముతామంటూ ప్రకటించారు. UGC India's official Twitter account hacked. pic.twitter.com/t37ui8KNuC — ANI (@ANI) April 9, 2022 చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ఎఫ్టీ మార్కెట్ హ్యాక్..! -
రోహిత్ శర్మకు ఏమైంది.. ? ట్విట్టర్ అకౌంట్ నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు
Fans Feel Rohit Sharma Twitter Account Has Been Hacked: వరుస సిరీస్ విజయాలతో పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సోషల్‌మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హిట్‌మ్యాన్‌ను అనుసరించేవారు ట్విట్టర్లో 20.2 మిలియన్లు, ఇన్‌స్టాలో 22.6 మిలియన్ల మంది ఉన్నారు. ఇన్‌స్టా అకౌంట్‌ను వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసేందుకు మాత్రమే ఉపయోగించే హిట్‌మ్యాన్.. ట్విట్టర్లో మాత్రం క్రికెట్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటాడు. Rohit sharma Account hacked maybe 🙄...weirds tweets ho re h bas 😂 #RohitSharma #hack pic.twitter.com/u1xzz9a80n — gungun♡ (@thoughtfulkid_) March 1, 2022 కాగా, ఇవాళ (మార్చి 1న) రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్లు అతని అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ‘నాకు కాయిన్ టాస్ అంటే ఇష్టం. ముఖ్యంగా అవి నా కడుపులోకి ఎప్పుడైతే చేరతాయో..’ అంటూ రోహిత్ అకౌంట్ నుంచి పలు అర్ధం పర్ధం లేని ట్వీట్లు వచ్చాయి. ఇవి చూసిన అభిమానులు రోహిత్ భాయ్‌కి ఏమైంది..? అర్ధం పర్ధం లేని ట్వీట్లతో తికమకపెడుతున్నాడంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఎప్పుడూ ఇలాంటి ట్వీట్లు చేయని రోహిత్ కొత్తగా పిచ్చి పిచ్చి మెసేజ్‌లు చేస్తుండటంతో అతని అకౌంట్ హ్యాక్ అయ్యిందేమోనన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. Is that rohit sharma Twitter got hacked ??? @ImRo45 pic.twitter.com/sfVDnIeqM1 — Mr Unknown (@MrUnknown812) March 1, 2022 ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత విరాట్ కోహ్లి నుంచి టీ20 పగ్గాలు చేపట్టిన రోహిత్.. తదనంతర పరిణామాల్లో టీమిండియా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమించబడిన విషయం తెలిసిందే. రోహిత్.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక వరుసగా మూడు టీ20 సిరీస్‌లు, ఓ వన్డే సిరీస్ (విండీస్‌పై)ను క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు పొట్టి క్రికెట్లో వరుసగా 12 విజయాలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ ద్వారా రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టబోతున్నాడు. It's got to be hacked because his last two tweets were from TweetDeck while the rest are from an iPhone. pic.twitter.com/jTVVFGzH19 — Ishika (@IshikaMullick) March 1, 2022 చదవండి: కెప్టెన్సీ విషయంలో నాన్చుడేంది.. అర్థం కాని ఆర్సీబీ వైఖరి -
నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ఆదివారం కొద్దిసేపు అయింది. యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌కు సాయం చేయాలంటూ ఒక పోస్ట్, రష్యాకు సాయం చేయాలంటూ మరో పోస్టు ఆయన అకౌంట్లో ప్రత్యక్షమయ్యాయి. విరాళాలను క్రిప్టో కరెన్సీ రూపంలోనూ స్వీకరిస్తున్నట్లు అందులో ఉంది. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పీటీఐతో మాట్లాడుతూ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ)కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు సాగుతోందన్నారు. ప్రస్తుతం జేపీ నడ్డా ట్విట్టర్ అకౌంట్ యథావిధిగా నడుస్తోందని, హ్యాకింగ్‌పై ట్విట్టర్ బాధ్యులతో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. -
కృనాల్ పాండ్యా ట్విటర్ అకౌంట్ హ్యాక్.. మద్యం మత్తులో తనే అలా..!
Krunal Pandyas Twitter Account Hacked: టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. అతని అకౌంట్ నుంచి చిత్ర విచిత్ర ట్వీట్లు రావడంతో ఈ విషయం స్పష్టమైంది. బిట్ కాయిన్ కోసం తన అకౌంట్‌ను అమ్మేస్తానంటూ, ఓ అమ్మాయి అంటే తనకి ఇష్టమంటూ కృనాల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్లు వచ్చాయి. దీంతో తన అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న విషయాన్ని గ్రహించిన కృనాల్.. సదరు ట్వీట్లతో తనకెటువంటి సంబంధం లేదంటూ మరో ఖాతా ద్వారా వెల్లడించాడు. అయితే, ఈ విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌తో ముడి పెడుతున్న నెటిజన్లు.. కృనాల్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది ఓ టోర్నీ సందర్భంగా తనని అందరి ముందు బూతులు తిట్టి, అవమానించాడంటూ నాటి బరోడా కెప్టెన్‌గా ఉన్న కృనాల్‌పై ఆ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న దీపక్ హూడా స్థానిక క్రికెట్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన బరోడా క్రికెట్ అసోసియేషన్.. అనూహ్యంగా దీపక్ హుడాపై నిషేధం వేటు వేసింది. దీంతో బరోడా నుంచి రాజస్థాన్‌కు వలస వెళ్లిన హూడా.. అనంతరం జరిగిన దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి, తాజాగా విండీస్ టూర్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. సరిగ్గా దీపక్ హూడాకు టీమిండియా నుంచి పిలుపు వచ్చిన రోజే, కృనాల్ ట్విటర్ అకౌంట్ నుంచి వింత వింత ట్వీట్లు రావడంతో ఈ విషయాన్ని గతంలో హూడాతో ఉన్న విభేదాలకు లింక్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. హూడా టీమిండియాకు ఎంపిక కావడంతో కృనాల్ మతి భ్రమించి, తనే స్వయంగా ఇలా చేసుకుంటాడని కొందరు, మద్యం మత్తులో కృనాల్ ఈ ట్వీట్లు చేసుంటాడని మరికొందరు అంటున్నారు. కృనాల్ అకౌంట్ ఒకే ఫోన్ నుంచి రెండు సార్లు లాగిన్ అయ్యిందని, అకౌంట్ హ్యాక్ అయితే ఇలా చేయడం కుదరదని నిపుణులు తేల్చడంతో మనోడే హూడా టీమిండియాకు ఎంపిక కావడం జీర్ణించుకోలేక, మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా టీమిండియాలోకి ఆరంగ్రేటం చేసిన కృనాల్.. మొదటి వన్డేలోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా.. అనంతరం శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో విఫలం కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. చదవండి: వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా? -
ఎన్డీఆర్ఎఫ్ ట్విటర్ ఖాతా హ్యాక్..!
న్యూఢిల్లీ: నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన ట్విట్టర్ ఖాతా శనివారం(జనవరి 22) రోజున కొద్దిసేపు హ్యాక్ అయినట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. "ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ హ్యాండిల్ జనవరి 22న హ్యాకర్స్ హ్యాక్ చేశారు. సాంకేతిక నిపుణులు ఈ సమస్యను పరిశీలిస్తున్నారని" అని డిజీ కర్వాల్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. '@NDRFHQ ట్విటర్ హ్యాండిల్ ద్వారా హ్యాకర్స్ కొన్ని యాదృచ్ఛిక సందేశాలను పోస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాను కొద్ది సేపు హ్యాక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్లో బిట్కాయిన్లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతోందని లింక్‌లు పోస్ట్ చేశారు. (చదవండి: లబోదిబో అంటున్న జొమాటో ఇన్వెస్టర్లు..!) -
ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
న్యూఢిల్లీ: సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతల ట్విట్టర్ అకౌంట్లు పదే పదే హ్యాకింగ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్‌కు గురవుతుండగా, తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది. బిట్ కాయిన్లను లీగల్ చేశామంటూ హ్యాకర్స్ ట్వీట్ చేశారు. 500బిట్ కాయిన్లను పంచుతున్నామని ట్వీట్లో తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే ట్విటర్‌కు తెలిపినట్లు పీఎంవో వెల్లడించడమే కాకుండా, ప్రధాని ట్విటర్అకౌంట్కు భద్రత కల్పించింది. అయితే గతంలో మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైన సంగతి విదితమే. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. నైట్ కర్ఫ్యూ విధించాలంటూ లేఖ.. -
ఇమ్రాన్ ఖాన్‌కు ఘోర పరాభవం.. పరువు పాయే
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు గత మూడు నెలల నుంచి జీతాలు చెల్లించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పాక్, ఉగ్రవాదులకు అత్యంత సురక్షిత ప్రాంతంగా ప్రపంచదేశాల భావిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఆదుకోవడానికి ఏ దేశం ముందుకు రావడం లేదు. మరోవైపు డ్రాగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం పాక్‌కు రుణం ఇస్తోంది కానీ.. అవి ఆ దేశ అవసరాలను తీర్చడం లేదు. మరి కొన్ని నెలలు పరిస్థితి ఇలానే కొనసాగితే.. పాకిస్తాన్ ప్రభుత్వంలో భారీ మార్పుల చోటు చేసుకుంటాయి. పాక్ ప్రభుత్వంపై సామాన్యులతో పాటు ప్రభుత్వ అధికారులకు కూడా పీకల్దాక కోపం ఉంది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ వైఫల్యాలను ఎండగడతూ రూపొందిచిన ఓ పెరడీ వీడియో పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ వీడియోను సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం తన ట్విటర్లో షేర్ చేసింది. (చదవండి: ఈ కడుపుమంట ఎందుకు?) ‘‘ద్రవ్యోల్బణంలో పాకిస్తాన్ గత రికార్డులను బద్దలు కొట్టింది. ఇమ్రాన్ ఖాన్.. మీరు ఇంకేత కాలం ప్రభుత్వ అధికారులు నోరు మెదపకుండా.. మీ కోసం పని చేయాలని ఆశిస్తున్నారు. గత మూడు నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఫీజు కట్టకపోవడంతో మా పిల్లలను పాఠశాల నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇంకెంత కాలం మొద్దు నిద్ర నటిస్తారు.. ఇదేనా కొత్త పాకిస్తాన్’’ అనే క్యాప్షన్‌తో పెరడీ పాట వీడియోను షేర్ చేశారు. ఇక దీనిలో ఓ వ్యక్తి.. ‘‘సబ్బు ధర పెరిగిందా.. వాడకండి.. పిండి ఖరీదు ఎక్కువగా ఉందా.. తినకండి.. మందుల ధరలు పెరిగాయా.. అయితే ఆస్పత్రులకు వెళ్లకండి.. మీరు కేవలం పన్నుల చెల్లించి.. హాయిగా నిద్రపోండి. మీ పిల్లలకు తిండి, తిప్పలు, చదువు లేకపోయినా పర్వాలేదు. పాకిస్తాన్ ఎప్పటికి మేల్కొదు’’ అని సాగుతూ ఉంటుంది. ఇక ప్రతి వైఫల్యం దగ్గర ఇమ్రాన్ ఖాన్ గతంలో చెప్పిన డైలాడ్ ‘కంగారు పడకండి’ అని వస్తుంది. అంటే తిండి లేకపోయినా సరే కంగారు పడకండి అని సాగుతుంది ఈ పాట. (చదవండి: ఇంటికి నిప్పు పెట్టి ఆర్పుతున్నట్లు నటన) ఈ వీడియోని ట్విటర్లో షేర్ చేసిన కాసేపటికే ఇది తెగ వైరలయ్యింది. దాంతో అధికారుల స్పందించారు. ట్విటర్ నుంచి వీడియోని తొలగించారు. అకౌంట్ హ్యాక్ అయ్యిందని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత పాక్ విదేశాంగ మంత్రిత్వ ‘‘సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ఈ ఖాతాలలో పోస్ట్ చేసిన సందేశాలు సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుంచి వచ్చినవి కావు’’ అని ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ఉంది. The Twitter, Facebook and Instagram accounts of the Embassy of Pakistan in Serbia have been hacked. Messages being posted on these accounts are not from the Embassy of Pakistan in Serbia. — Spokesperson 🇵🇰 MoFA (@ForeignOfficePk) December 3, 2021 చదవండి: కశ్మీర్ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్ -
అసదుద్దీన్ ఓవైసీ ట్విటర్ అకౌంట్ మరోసారి హ్యక్..
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విటర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు మరోసారి హ్యక్ చేశారు. కాగా, ఒక నెలలో ఆయన ట్విటర్ అకౌంట్ హ్యక్ అవడం ఇది రెండోసారి. అయితే, 9 రోజుల క్రితం అసదుద్దీన్ ట్విటర్ ఖాతా హ్యకింగ్‌కు పాల్పడగా .. ఆ తర్వాత పోలీసులు తిరిగి పునరుద్ధరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మరోసారి సైబర్ నేరగాళ్లు ఆయన ట్విటర్ అకౌంట్‌ను హ్యక్ చేసి.. ఆయన ప్రొఫైల్ ఫోటో స్థానంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఫోటోను అప్లోడ్ చేశారు. దీంతో మరోసారి ఆయన ఖాతా హ్యకింగ్‌కి గురయినట్లు పార్టీ వర్గాలు గుర్తించాయి. అసదుద్దీన్ ట్విటర్ అకౌంట్‌కు 6.78 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, ఎంఐఎం పార్టీ వర్గాలు సోమవారం హైదరాబాద్ సైబర్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. -
హ్యాకింగ్‌కు గురైన తమిళనాడు సీఎం ట్విటర్ అకౌంట్..!
సాక్షి, చెనై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో ఆయన ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమస్య మాజీ సీఎం ఈపీఎస్ పళనిస్వామి ట్విటర్ అకౌంట్‌ను స్టాలిన్‌కు బదిలీ చేయడంలో ఈ సమస్య తలెత్తినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం తన వ్యక్తిగత ట్విటర్ ఖాతా ద్యారా అధికారిక సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. అంతకుముందు ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి అధికార ట్విటర్ ఖాతాను ట్విటర్లో మాజీ సీఎం ఇపీఎస్ పళనిస్వామి కార్యాలయంగా మార్చారు. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని, తిరిగి తమిళనాడు సీఎం అధికార ఖాతాగా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నాడీఎంకే ఐటీ వింగ్ తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలలో కూడా ఇదే లోపం నెలకొంది. తమిళనాడు సీఎం అధికార ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇంకా పళనిస్వామి ఛాయాచిత్రం, పేరు, ఇతర వివరాలతోనే ఉంది.డీఎంకే ఐటీ విభాగం కార్యాలయ అధికారి మాట్లాడుతూ ..‘రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ట్విట్టర్ వచ్చిన తరువాత తమిళనాడులో ప్రభుత్వం మారడం ఇదే మొదటిసార’ ని అన్నారు. "ముఖ్యమంత్రి అధికార ట్విట్టర్ ఖాతాను బదిలీ చేయడంలో మాజీ సీఎం ఈపీఎస్‌కు తప్పు సలహా ఇచ్చారని బీజేపీ నాయకుడు ఎస్జీ సూర్య ట్విటర్లో ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి ట్విటర్ ఖాతాను అప్పగించడం, గత సీఎం చేసిన ట్వీట్లను ఆర్కైవ్ చేయడం సరైన పద్ధతని తెలిపారు. చదవండి: M K Stalin: తమిళనాడు సీఎం బహిరంగ లేఖ -
నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది: మంత్రి మేకపాటి
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని మంత్రి శనివారం తెలియజేశారు. దుండగులు తన అకౌంట్‌ను హ్యాక్ చేసి నేర సంబంధితమైన సమాచారాన్ని తన ప్రమేయం లేకుండా పోస్ట్ చేశారని, వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ట్విట్టర్లో తనని అనుసరించే వారికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెపుతున్నట్లు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. -
ప్రధాని మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్!
-
వణికిన ట్విట్టర్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఏడాదిలోనే సామాజిక మాధ్యమం ట్విట్టర్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నులే లక్ష్యంగా వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మీడియా మొఘల్ మైక్ బ్లూమ్‌బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తోపాటు యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్ అయ్యాయి. వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగా అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టులన్నీ క్రిప్టో కరెన్సీకి సంబంధించినవే కావడం గమనార్హం. బిట్‌కాయిన్ సైబర్ నేరగాళ్లు చేసిన ఈ పనితో ట్విట్టర్ వణికిపోయింది. ‘‘వచ్చే 30 నిమిషాల్లో నాకు వెయ్యి డాలర్లు పంపండి. నేను తిరిగి 2 వేల డాలర్లు పంపుతాను’’అంటూ బిట్‌కాయిన్ లింక్ అడ్రస్ ఇస్తూ ప్రముఖుల అధికారిక ఖాతాలలో ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ ట్వీట్లు మూడు, నాలుగు గంటలసేపు ఉన్నాయి. హ్యాక్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ట్విట్టర్ యంత్రాంగం పోస్టులన్నింటినీ తొలగించి తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసింది. భద్రతా పరమైన అంశాలను పరీక్షించి అకౌంట్లను పునరుద్ధరించింది. బిట్‌కాయిన్ వాలెట్‌లోకి లక్షకు పైగా డాలర్లు సోషల్ మీడియా చరిత్రలోనే అతి పెద్దదైన ఈ హ్యాకింగ్ ద్వారా బిట్‌కాయిన్ వాలెట్‌లోకి లక్షా12 వేలకు పైగా డాలర్లు వచ్చి చేరాయని అంచనా. ఒకసారి గుర్తు తెలియని వాలెట్లలోకి వెళ్లిన మొత్తాన్ని తిరిగి రాబట్టడం అసాధ్యమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ‘‘మా సంస్థకు ఇవాళ గడ్డుదినం. ఈ దాడి అత్యం త భయానకమైనది. ఏం జరిగిందో విచారించి ట్విట్టర్లో భద్రతాపరమైన లోపాలను పరిష్కరిస్తాం’’అని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ట్వీట్ చేశారు. ఎలా హ్యాక్ చేశారంటే బిట్‌కాయిన్ సొమ్ముల్ని రెట్టింపు చేసుకోండంటూ గతంలోనూ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి కానీ, ఇలా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఖాతాలు హ్యాక్ కావడం ఇదే మొదటిసారి. దీనిని సమన్వయ సామాజిక ఇంజనీరింగ్ దాడిగా ట్విట్టర్ సపోర్ట్ టీమ్ అభివర్ణించింది. ట్విట్టర్లో అంతర్గతంగా ఉండే వ్యవస్థలు, టూల్స్ సాయంతో హ్యాకర్లు ట్విట్టర్ ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్ ప్రివిలేజెస్ సంపాదించారు. దాని ద్వారా ప్రముఖుల పాస్వర్డ్లు తెలుసుకొని మెసేజ్‌లు పోస్టు చేశారని ట్విట్టర్ సపోర్ట్ టీమ్ తెలిపింది. వీలైనంత త్వరగా డబ్బులు సంపాదించడమే వారి లక్ష్యమని ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
అమెరికాలో హ్యాకింగ్ కలకలం..
-
పోర్న్ వీడియోలకు లైక్స్.. వకార్ కీలక నిర్ణయం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ హ్యాకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్‌కు గురైనట్లు పేర్కొంటూ ఓ వీడియోను వకార్ తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ సందర్బంగా ఈ మాజీ పేసర్ మాట్లాడుతూ.. తన సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్‌కు గురయ్యాయని, హ్యాక్ అయిన సమయంలో తన అకౌంట్ నుంచి ఏదైనా పోస్ట్ అయ్యుంటే పెద్దగా పట్టించుకోకండి అంటూ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఇక జీవితంలో సోషల్ మీడియా జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. వకర్ యూనిస్ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు పలు పోర్న్ వీడియోలు, ఫోటోలకు లైక్ కొట్టారు. అంతేకాకుండా పలు అసభ్యకరమైన పోస్టులను షేర్ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వకార్ తన టెక్నికల్ టీం సహాయంతో అన్ని అకౌంట్లను తన చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఇక ఈ పేస్ బౌలర్ హ్యాక్‌కు గురవ్వడం ఇదే తొలి సారి కాదు గతంలో కూడా మూడునాలుగు సార్లు ఇలాగే ఇబ్బందులకు గురయ్యాడు. దీంతో అసహనానికి లోనైన వకార్ ఇక జీవితంలో సోషల్ మీడియా జోలికి వెళ్లనని స్పష్టం చేశాడు. ఇన్ని రోజులు తనను ఫాలో అయిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాకుండా తన నిర్ణయంతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండంటూ వకార్ పేర్కొన్నాడు. చదవండి: అందుకే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు ప్రపంచకప్-2011 ఫైనల్: రెండుసార్లు టాస్ pic.twitter.com/cl8iZFykVC — Waqar Younis (@waqyounis99) May 29, 2020 -
ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అసభ్యకరంగా పోస్టులు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచ్ డారెన్ లీమన్ ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని లీమన్ అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్‌కు కోచ్‌గా లీమన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం బ్రిస్బేన్- సిడ్నీ థండర్స్ మ్యాచ్ సందర్భంగా లీమన్ బిజీగా ఉండటంతో అతడి ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైన విషయాన్ని ఆలస్యంగా గుర్తించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లీమన్ ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసిన ఓ హ్యాకర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా.. ఇరాన్, ఖాసీం సులేమానీలకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేశాడు. అంతేకాకుండా లీమన్ ఖాతా పేరును 'Qassem Soleimani| F**k Iran' గా అసభ్యకరంగా మార్చాడు. దీంతో లీమన్ ఫాలోవర్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా కొందరు లీమన్‌పై దుమ్మెత్తిపోశారు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన లీమన్ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగాడు. తన ట్విటర్ ఆకౌంట్‌కు హ్యాక్‌కు గురైందని బ్రిస్బేన్ హీట్ అధికారిక ట్విటర్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లు, పోస్ట్‌లను ఎవ్వరూ నమ్మవద్దని, తనను తప్పుగా అపార్థం చేసుకోవద్దని తన ఫోలవర్స్‌కు, అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అంతేకాకుండా తన ఫాలోవర్స్‌కు క్షమాపణలు చెప్పాడు. అయితే తన ట్విటర్ హ్యాక్ గురవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూశాక కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు. కాస్త విరామం తర్వాత మళ్లీ వసానని, అప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటానన్నాడు. లీమన్‌కు 3,40,000కు పైగా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక లీమన్ సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడు. ఆటకు సంబంధించి ఛలోక్తులు విసురుతుంటాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆస్ట్రేలియా కోచ్ పదవికి లీమన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో ట్విటర్ హ్యాక్‌కు గురైన రెండో ఆసీస్ మాజీ క్రికెటర్‌గా లీమన్ చేరాడు. గతేడాది అక్టోబర్‌లో షేన్ వాట్సన్ అకౌంట్ కూడా హ్యాక్‌కు గురైంది. వాట్సన్ ట్విటర్ ఆకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్ అశ్లీల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులతో పాటు, వాట్సన్ కూడా షాక్‌కు గురయ్యాడు. అయితే తన వలన జరిగిన అసౌకర్యానికి వాట్సన్ అభిమానులకు క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. ఆ హెలికాప్టర్‌ను తమ సైన్యమే పేల్చేసిందని, వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే సులేమానీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో రెండు దేశాల మధ్య అగ్గి రాజుకుంది. అమెరికాపై ప్రతిదాడి తప్పదని ఇరాన్.. గట్టిగానే హెచ్చరించింది. అయితే, ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాక్‌కు మరిన్ని సైనిక బలగాలను పంపుతున్నట్టు అమెరికా ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకుంది. -
బేడి, ఖేర్‌ల ట్వీటర్ ఖాతాలు హ్యాకింగ్
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తాల ట్వీటర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ పని వెనక టర్కీ కేంద్రంగా పనిచేస్తున్న, పాక్ అనుకూల అయిల్దిజ్ టిమ్ బృందం ఉన్నట్లు తెలిసింది. బేడి ఖాతాలో టర్కిష్, ఆంగ్ల భాషల్లో ట్వీట్లతో పాటు టర్కీ జెండా ఎమోజి కనిపించింది. ‘మా సోషల్ మీడియా అకౌంట్లను మూసివేస్తున్నందుకు నిరసన తెలుపుతున్నాం. మాపై నిషేధాన్ని తొలగించే వరకూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖాతాలకు ముప్పు తప్పదు’ అని టర్కిష్ భాషలో ట్వీట్ వచ్చింది. సమస్యను పరిష్కరించడానికి తమ బృందాలు కృషి చేస్తున్నాయని ట్వీటర్ వెల్లడించింది. -
భారత అధికారి ట్వీటర్ హ్యాక్.. కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన ఉన్నతాధికారి ట్వీటర్ అకౌంట్ హ్యాక్‌కి గురికావటం కలకలం రేపింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అకౌంట్‌ను పాక్ ఉగ్రసంస్థలు హ్యాక్ చేశాయి. సయ్యద్ ట్విటర్లో పాక్ జెండాను, దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఫోటోను పోస్టు చేశాయి. ఆదివారం ఉదయం సయ్యద్ ట్విటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు రెండు పాకిస్థాన్ జెండా ఫోటోలను ఉంచారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అధికారిక ట్విటర్‌కు ఉండాల్సిన బ్లూ టిక్ మార్క్ కూడా కనిపించకుండా పోయింది. అప్రమత్తమైన ఆయన ఫిర్యాదు చేయటంతో ఆయా పోస్టులను తొలగించి అకౌంట్‌ను ట్వీటర్ పునరుద్ధరించింది. పాక్‌కు చెందిన హ్యాకర్లే ఈ పనికి పాల్పడినట్లు అధికారులు దృవీకరించారు. భారత అధికారిక సైట్లను పాక్ ఉగ్రసంస్థలు హ్యాక్ చేయటం కొత్తేం కాదు. 2013-2016 మధ్య 700 సైట్లను హ్యాక్ చేయగా.. అందులో 199 ప్రభుత్వ వెబ్ సైట్లు ఉన్నాయి. గతేడాది జనవరిలో జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ)ని హ్యాక్‌కి గురి కావటం పెను కలకలమే రేపింది.