Krunal Pandyas Twitter Account Hacked: టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. అతని అకౌంట్ నుంచి చిత్ర విచిత్ర ట్వీట్లు రావడంతో ఈ విషయం స్పష్టమైంది. బిట్ కాయిన్ కోసం తన అకౌంట్‌ను అమ్మేస్తానంటూ, ఓ అమ్మాయి అంటే తనకి ఇష్టమంటూ కృనాల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్లు వచ్చాయి. దీంతో తన అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న విషయాన్ని గ్రహించిన కృనాల్.. సదరు ట్వీట్లతో తనకెటువంటి సంబంధం లేదంటూ మరో ఖాతా ద్వారా వెల్లడించాడు.
అయితే, ఈ విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌తో ముడి పెడుతున్న నెటిజన్లు.. కృనాల్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది ఓ టోర్నీ సందర్భంగా తనని అందరి ముందు బూతులు తిట్టి, అవమానించాడంటూ నాటి బరోడా కెప్టెన్‌గా ఉన్న కృనాల్‌పై ఆ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న దీపక్ హూడా స్థానిక క్రికెట్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన బరోడా క్రికెట్ అసోసియేషన్.. అనూహ్యంగా దీపక్ హుడాపై నిషేధం వేటు వేసింది. దీంతో బరోడా నుంచి రాజస్థాన్‌కు వలస వెళ్లిన హూడా.. అనంతరం జరిగిన దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి, తాజాగా విండీస్ టూర్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
సరిగ్గా దీపక్ హూడాకు టీమిండియా నుంచి పిలుపు వచ్చిన రోజే, కృనాల్ ట్విటర్ అకౌంట్ నుంచి వింత వింత ట్వీట్లు రావడంతో ఈ విషయాన్ని గతంలో హూడాతో ఉన్న విభేదాలకు లింక్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. హూడా టీమిండియాకు ఎంపిక కావడంతో కృనాల్ మతి భ్రమించి, తనే స్వయంగా ఇలా చేసుకుంటాడని కొందరు, మద్యం మత్తులో కృనాల్ ఈ ట్వీట్లు చేసుంటాడని మరికొందరు అంటున్నారు.
కృనాల్ అకౌంట్ ఒకే ఫోన్ నుంచి రెండు సార్లు లాగిన్ అయ్యిందని, అకౌంట్ హ్యాక్ అయితే ఇలా చేయడం కుదరదని నిపుణులు తేల్చడంతో మనోడే హూడా టీమిండియాకు ఎంపిక కావడం జీర్ణించుకోలేక, మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా టీమిండియాలోకి ఆరంగ్రేటం చేసిన కృనాల్.. మొదటి వన్డేలోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా.. అనంతరం శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో విఫలం కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.
చదవండి: వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment