Krunal Pandya
-
డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికాడు.. ఇప్పుడు అతడే..: నీతా అంబానీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా స్టార్లుగా ఎదిగారు హార్దిక్ పాండ్యా(Hardik Pandya), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah). క్రికెట్ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని సత్తా చాటుతున్నారు. అయితే, ఈ ఇద్దరిలో దాగున్న అద్భుత నైపుణ్యాలను తెరమీదకు తెచ్చింది మాత్రం ముంబై ఇండియన్స్ యాజమాన్యం అని చెప్పవచ్చు.అంతేకాదు పాండ్యా, బుమ్రా సాధారణ ఆటగాళ్ల నుంచి సూపర్స్టార్లుగా ఎదగడంలో ఈ ఐపీఎల్ ఫ్రాంఛైజీదే కీలక పాత్ర. ఇక ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్‌గా వెలుగొందుతుండగా.. హార్దిక్ పాండ్యా సైతం టీమిండియా కీలక ప్లేయర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. అంతేకాదు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ స్థాయికీ చేరుకున్నాడు.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమాని, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ(Nita Ambani) పాండ్యా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా, అతడి అన్న కృనాల్ పాండ్యాలో తాము ఆట పట్ల అంకిత భావాన్ని గుర్తించి అవకాశం ఇచ్చామని.. ఈరోజు వాళ్లు ఉన్నతస్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.అరుదైన గౌరవంకాగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ఆమెకు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బోస్టన్‌లో మాట్లాడిన నీతా అంబానీ హార్దిక్ పాండ్యా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘‘ఐపీఎల్లో మాకు ఫిక్స్డ్ బడ్జెట్ ఉంటుంది. ఒక్కో ఫ్రాంఛైజీ ఇంతే ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంటుంది. అయితే, మేము ఆ డబ్బును కొత్త మార్గాల్లో ఖర్చుచేయాలనుకున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలికితీయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాం.బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువకులుముఖ్యంగా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు జరిగినప్పుడు నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్లేదాన్ని. నాతో పాటు మా స్కౌట్ బృందం కూడా ఉండేది. ప్రతి దేశవాళీ మ్యాచ్‌ను నిశితంగా గమనించేవాళ్లం. మా స్కౌట్ క్యాంపులో భాగంగా బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లను చూశాం.మ్యాగీ మాత్రమే తిని బతికారునేను వెళ్లి వాళ్లతో మాట్లాడాను. తాము గత మూడేళ్లుగా కేవలం మ్యాగీ మాత్రమే తిని బతుకుతున్నామని అప్పుడు వాళ్లు చెప్పారు. తమ దగ్గర డబ్బు లేదని అందుకే నూడుల్స్‌తో కడుపు నింపుకొంటున్నామని అన్నారు. అయితే, అప్పుడు నాకు వారిలో ఆట పట్ల ఉన్న నిబద్ధత.. ఏదో సాధించాలన్న బలమైన తపన కనిపించాయి.ఆ ఇద్దరు.. సోదరులు.. వారు మరెవరో కాదు.. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. 2015లో నేను హార్దిక్ పాండ్యా కోసం రూ. 10 లక్షలు ఖర్చుచేసి వేలంలో అతడిని కొనుక్కున్నా. ఇప్పుడు అతడు ముంబై ఇండియన్స్‌కు గర్వకారణమైన కెప్టెన్’’ అని నీతా అంబానీ హార్దిక్ పాండ్యా నైపుణ్యాలపై ప్రశంసలు కురిపించారు.మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్రఇక ఆ మరుసటి ఏడాది.. తమకు మరో ఆణిముత్యం దొరికిందన్న నీతా అంబానీ.. ‘‘ఓ యువ క్రికెటర్. అతడి బాడీ లాంగ్వేజ్ భిన్నంగా ఉంది. అతడు బౌలింగ్ చేస్తే చూడాలని అక్కడ కూర్చున్నాం. తానేంటో అతడు బంతితోనే నిరూపించుకున్నాడు. అతడు బుమ్రా. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఓ చరిత్ర’’ అంటూ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తారు. ఇక తిలక్ వర్మను కూడా తాము ఏరికోరి ఎంచుకున్నామన్న నీతా అంబానీ.. టీమిండియాకు ముంబై ఇండియన్స్ ఓ నర్సరీ లాంటిదంటూ తమ ఫ్రాంఛైజీపై ప్రశంసలు కురిపించారు.ఐపీఎల్ 2025లో పాల్గొనే ముంబై ఇండియన్స్ జట్టుహార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుతుర్, సత్యనారాయణ రాజు, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్, రీస్ టాప్లే, లిజాడ్ విలియమ్స్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.#WATCH | Boston, US: Reliance Foundation Founder-Chairperson Nita Ambani tells how she scouted for new talent for the Mumbai Indians team and included Hardik Pandya, Krunal Pandya, Jasprit Bumrah and Tilak Varma in the teamShe says, "In IPL, we all have a fixed budget, so every… pic.twitter.com/v0HriPJH8T— ANI (@ANI) February 17, 2025 -
టీ20 క్రికెట్లో పెను సంచలనం.. హార్దిక్ పాండ్యా లేకుండానే ప్రపంచ రికార్డు!
టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. కృనాల్ పాండ్యా కెప్టెన్సీలోని బరోడా జట్టు 349 పరుగులతో ప్రపంచ రికార్డు సాధించింది. భారత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా ఈ ఫీట్ నమోదు చేసింది. ఇండోర్ వేదికగా సిక్కింపై ఈ మేర పరుగుల విధ్వంసం సృష్టించింది.ఆది నుంచే దంచికొట్టారుఈ నేపథ్యంలో జింబాబ్వే పేరిట ఉన్న ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన బరోడా.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో రంగంలోకి దిగకుండానే.. బరోడా ప్లేయర్లు తమ వీరబాదుడుతో ఈ అరుదైన ఘనతను జట్టు ఖాతాలో వేశారు.కాగా ఇండోర్‌లోని ఎమరాల్డ్ హై స్కూల్ గ్రౌండ్లో గురువారం సిక్కిం జట్టుతో బరోడా తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బరోడాకు ఓపెనర్లు శశ్వత్ రావత్(16 బంతుల్లో 43), అభిమన్యు సింగ్(53) అదిరిపోయే ఆరంభం అందించారు.ఊచకోత.. 15 సిక్సర్లువీళ్లిద్దరు మెరుపు ఇన్నింగ్స్ ఆడితే.. వన్‌డౌన్‌లో వచ్చిన భాను పనియా మాత్రం తుఫాన్ ఇన్నింగ్స్‌తో సిక్కిం బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 51 బంతులు ఎదుర్కొని ఏకంగా 134 పరుగులతో అజేయంగా నిలిచాడు. భాను పనియా ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు ఉంటే.. సిక్సర్లు ఏకంగా 15 ఉండటం విశేషం.మిగతా వాళ్లలో శైవిక్ శర్మ(17 బంతుల్లో 55), వికెట్ కీపర్ విష్ణు సోలంకి(16 బంతుల్లో 50) బ్యాట్‌తో వీరవిహారం చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన బరోడా జట్టు 349 పరుగులు చేసింది. సిక్కిం బౌలర్లలో పల్జోర్ తమాంగ్, రోషన్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. తరుణ్ శర్మ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే రికార్డు బ్రేక్కాగా టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా జింబాబ్వే ఇటీవల గాంబియాపై 344-4 స్కోరు చేసింది. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో ఇదే అత్యధిక స్కోరు. అయితే, ఈ రికార్డును ఇప్పుడు బరోడా అధిగమించింది.చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
హ్యాట్రిక్ తీసిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. డకౌటైన పాండ్యా బ్రదర్స్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ గోపాల్ ఈ ఘనత సాధించాడు. గోపాల్ సాధించిన హ్యాట్రిక్‌లో టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వికెట్లు ఉన్నాయి. పాండ్యా సోదరులను గోపాల్ ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపాడు. వరుస బంతుల్లో గోపాల్.. హార్దిక్, కృనాల్ వికెట్లతో పాటు శాశ్వత్ రావత్ వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో గోపాల్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. గోపాల్ బంతితో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఓటమిపాలైంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ (34 బంతుల్లో 56; 6 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. స్మరన్ రవిచంద్రన్ (38), కృష్ణణ్ శ్రీజిత్ (22), శ్రేయస్ గోపాల్ (18), మనీశ్ పాండే (10) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలమయ్యాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, అతీత్ సేథ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. లుక్మన్ మేరీవాలా, ఆకాశ్ మహారాజ్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా.. శ్రేయస్ గోపాల్ (4-0-19-4) దెబ్బకు మధ్యలో ఇబ్బంది పడింది. 15 పరుగుల వ్యవధిలో గోపాల్ నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు. అయితే శివాలిక్ శర్మ (22), విష్ణు సోలంకి (28 నాటౌట్), అతీత్ సేథ్ (6 నాటౌట్) కలిసి బరోడాను విజయతీరాలకు చేర్చారు. మరో ఏడు బంతులు మిగిలుండగానే బరోడా లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). బరోడా ఇన్నింగ్స్‌లో శాశ్వత్ రావత్ (63), భాను పూనియా (42) రాణించారు.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ గోపాల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గోపాల్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. గోపాల్‌కు ఐపీఎల్‌లోనూ హ్యాట్రిక్ తీసిన ఘనత ఉంది. -
Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ టోర్నీలో హార్దిక్ తన అన్న కృనాల్ పాండ్యా సారథ్యంలో బరోడా జట్టుకు ఆడనున్నాడు. తొలుత ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో హార్దిక్ పేరు లేదు. అయితే హార్దిక్ స్వయంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడేందుకు ఆసక్తి కనబర్చాడని తెలుస్తుంది. జాతీయ జట్టుకు ఆడని సమయంలో దేశవాలీ క్రికెట్లో ఆడతానని హార్దిక్ బీసీసీఐకి చెప్పాడట. దీంతో బరోడా క్రికెట్ అసోసియేషన్ హార్దిక్‌ను తమ జట్టులో చేర్చుకుంది. సహజంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి 18 మంది సభ్యుల జట్టును ప్రకటిస్తారు. తాజాగా హార్దిక్ చేరికతో బరోడా టీమ్ సంఖ్య 18కి పెరిగింది. ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో బరోడాతో పాటు తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, సిక్కిం, త్రిపుర జట్లు ఉన్నాయి. హార్దిక్ త్వరలో ఇండోర్‌లో జరిగే ట్రైనింగ్ క్యాంప్‌లో బరోడా జట్టుతో జాయిన్ అవుతాడు. బరోడా తమ టోర్నీ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం (నవంబర్ 23) జరుగుతుంది.కాగా, హార్దిక్ ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత టీ20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో హార్దిక్ 59 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది.ముంబై ట్రైనింగ్ క్యాంప్లోన కనిపించిన హార్దిక్హార్దిక్ దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే నవీ ముంబైలోని ఏర్పాటు చేసిన ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ సెషన్స్‌లో కనపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.బరోడా జట్టుకు బూస్టప్హార్దిక్ చేరికతో బరోడా జట్టు బలపడింది. ఈ టోర్నీలో ఆ జట్టు విజయావకాశాలు మరింత మెరుగయ్యాయి. హార్దిక్ ఎనిమిదేళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొంటున్నాడు. -
కృనాల్ పాండ్యా సెంచరీ.. హ్యాట్రిక్ విజయాలు.. హార్దిక్ పోస్ట్ వైరల్
రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. తాజాగా శతకంతో మెరిశాడు. ఒడిశాతో మ్యాచ్‌లో 143 బంతులు ఎదుర్కొని 119 పరుగులు సాధించాడు. కృనాల్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.ఇక ఈ మ్యాచ్‌లో బరోడా ఒడిషాపై ఏకంగా ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన అన్న కృనాల్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘మా అన్నయ్య.. ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. టాప్ సెంచరీ.. నీ శ్రమకు తగ్గ ఫలితం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా రంజీ తాజా సీజన్లో కృనాల్ పాండ్యా సారథ్యంలోని బరోడా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో ముంబైని 84 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో సర్వీసెస్‌ను 65 రన్స్ తేడాతో ఓడించింది. ఈ క్రమంలో వడోదర వేదికగా ఒడిశా జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన బరోడా తొలుత బౌలింగ్ చేసింది.అయితే, బరోడా బౌలర్ల ధాటికి ఒడిశా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడాకు ఓపెనర్ శైవిక్ శర్మ(96) శుభారంభం అందించగా.. మిడిలార్డర్లో విష్ణు సోలంకి(98) దుమ్ములేపాడు. ఇక వీరికి తోడుగా కృనాల్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఫలితంగా బరోడా మొదటి ఇన్నింగ్స్‌లో 456 పరుగులు చేసి.. 263 పరుగులు ఆధిక్యంలో నిలిచింది.అయితే, బరోడా బౌలర్లు మరోసారి చెలరేగడంతో ఒడిశా 165 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆటలోనే ఫలితం తేలింది. బరోడా ఒడిశాపై ఇన్నింగ్స్ 98 రన్స్ తేడాతో జయభేరి మోగించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. కాగా హార్దిక్ పాండ్యా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా పునరాగమనం చేయనున్నాడు.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ View this post on Instagram A post shared by Krunal Himanshu Pandya (@krunalpandya_official) -
నాన్న దగ్గరగా లేడు.. పెదనాన్న, తమ్ముడితో అగస్త్య (ఫొటోలు)
-
గణేశుడి సేవలో పెదనాన్నతో అగస్త్య: హార్దిక్ లేకుండానే (ఫొటోలు)
-
లక్నో కెప్టెన్సీకి రాహుల్ గుడ్‌బై!.. రేసులో ఆ ఇద్దరు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ స్థానంలో మరో సీనియర్ ప్లేయర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు ఫ్రాంఛైజీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వేలం నేపథ్యంలో రిటెన్షన్ విధివిధానాలపై బీసీసీఐ స్పష్టతనిచ్చిన తర్వాత ఇందుకు సంబంధించి లక్నో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.కెప్టెన్‌గా విఫలంకాగా 2022లో క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన లక్నో జట్టుకు ఆది నుంచి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత రెండు సీజన్లలో టీమ్‌ను ప్లే ఆఫ్స్‌నకు చేర్చిన ఈ కర్ణాటక వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆటగాడిగా 520 పరుగులతో పర్వాలేదనపించినా కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. లక్నోతోనే రాహుల్.. కానీఈ క్రమంలో లక్నో ఈసారి పద్నాలుగింట కేవలం ఏడు మాత్రమే గెలిచి ఏడోస్థానానికి పరిమితమైంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో ఫ్రాంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంక బహిరంగంగానే రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు రాగా.. సోమవారం సంజీవ్ గోయెంకాతో భేటీ అయిన రాహుల్ తాను జట్టుతోనే ఉంటాననే సంకేతాలు ఇచ్చాడు. రేసులో ఆ ఇద్దరుఈ క్రమంలో లక్నో జట్టు సంబంధిత వర్గాలు వార్తా సంస్థ IANSతో ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘సీఈఓ సంజీవ్ గోయెంకాతో రాహుల్ అధికారికంగానే భేటీ అయ్యాడు. రిటెన్షన్ గురించి చర్చలు జరిగాయి. వచ్చే ఏడాది కెప్టెన్‌గా ఉండటానికి రాహుల్ విముఖత చూపాడు. బ్యాటర్‌గా తాను మరింతగా రాణించేందుకు సారథ్య బాధ్యతలు వదులుకోవాలని భావిస్తున్నాడు. నిజానికి రాహుల్ కెప్టెన్సీ పట్ల గోయెంకాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే, తను మాత్రం అందుకు సిద్ధంగా లేడు.లక్నో రాహుల్‌ను రిటైన్ చేసుకోవడం ఖాయం. అయితే, కెప్టెన్‌గా ఉండడు. బీసీసీఐ విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత ఈ అంశంపై మేము నిర్ణయం తీసుకుంటాం. అయితే, ఇప్పటికి కెప్టెన్సీ రేసులో కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ ఉన్నారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీతో కేఎల్ రాహుల్ బిజీ కానున్నాడు.చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటన -
మిస్టరీ గర్ల్‌తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ అమ్మాయితో అతడు సన్నిహితంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్.. ‘‘ప్రతీదీ ప్రేమకు అర్హమైందే.. కానీ.. దేవుడిపై ఎప్పుడూ నమ్మకం మాత్రం వదులుకోకూడదు’’ అంటూ నర్మగర్భపూరిత పోస్ట్ చేయడం గమనార్హం.ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శల పాలయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో సారథిగా వచ్చినందుకు సొంత జట్టు అభిమానులే అతడిని అవమానకరంగా ట్రోల్ చేశారు.టీ20 ప్రపంచకప్-2024 హీరోగాఅందుకు తగ్గట్లే ముంబై ఇండియన్స్ పద్నాలుగింట కేవలం నాలుగే గెలవడంతో హార్దిక్ కెప్టెన్సీ తీరుపై మాజీ క్రికెటర్లు సైతం పెదవి విరిచారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నడుమ టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు అతడు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో బీసీసీఐ అతడికి అవకాశం ఇవ్వగా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. టీమిండియాను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించి విమర్శించిన వారే ప్రశంసించేలా సత్తా చాటాడు.కెరీర్ పరంగా కోలుకున్నా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం హార్దిక్ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నటాషా స్టాంకోవిక్‌తో అతడికి విభేదాలు తలెత్తాయని వార్తలు రాగా.. వీరిద్దరు దూరదూరంగా ఉండటం ఇందుకు బలాన్నిచ్చింది.అంతేకాదు.. వరల్డ్‌కప్ విజయం సెలబ్రేట్ చేసుకునే సమయంలో తమ కుమారుడు అగస్త్యను మాత్రమే నటాషా హార్దిక్ దగ్గరికి పంపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విడాకులు నిజమేనన్న వార్తలు గుప్పుమన్నాయి.ఆ మిస్టరీ గర్ల్ ఎవరు?ఇలాంటి తరుణంలో ఓ అమ్మాయి హార్దిక్ పాండ్యాతో పాటు అతడి కుటుంబంతో సన్నిహితంగా మెదిలిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ మిస్టరీ గర్ల్ ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఆమె మరెవరో కాదు.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్, మేకప్ ఆర్టిస్ట్ ప్రాచీ సోలంకి. హార్దిక్ పాండ్యా ఇంటికి వచ్చిన ఆమెను బొట్టుపెట్టి ఆహ్వానించారు. ఈ క్రమంలో హార్దిక్‌తో పాటు అతడి అన్న, టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా- పాంఖురి శర్మ దంపతులతో ప్రాచీ ఫొటోలు దిగింది.వరల్డ్‌కప్ హీరోను కలిసానని.. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఫొటోలు, వీడియోలను ప్రాచీ షేర్ చేసింది. దీంతో నటాషా స్థానంలోకి రాబోయే అమ్మాయి.. కాబోయే వదిన అంటూ హార్దిక్ అభిమానులు తోచినవిధంగా కామెంట్లు చేస్తున్నారు.మరికొందరేమో ఒక్క ఫొటోతో ఆ అమ్మాయిపై లేనిపోని వదంతులు సృష్టించడం సరికాదని హితవు పలుకుతున్నారు. నిజంగానే ప్రాచీ హార్దిక్ ఫ్యాన్‌గర్ల్ మాత్రమేనా.. లేదంటే అతడి కుటుంబంతో అంతకుమించిన అనుబంధం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే, ప్రాచీతో హార్దిక్ ఫొటోలు వైరల్ అయిన తరుణంలో నటాషా పైవిధంగా పోస్ట్ పెట్టడం గమనార్హం.చదవండి: KKR: ద్రవిడ్ కాదు.. కోల్‌కతా కొత్త మెంటార్‌గా దిగ్గజ బ్యాటర్? View this post on Instagram A post shared by Prachi Solanki (@ps_29) -
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల మోత మోగుతుంది. ఈ సీజన్ మరో 18 మ్యాచ్‌లు మిగిలుండగానే 1000 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని తాకింది. సన్‌రైజర్స్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా కొట్టిన సిక్సర్‌తో ఈ సీజన్లో 1000 సిక్సర్లు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకునే క్రమంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. వెయ్యి సిక్సర్ల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న సీజన్‌గా ఐపీఎల్ 2024 సరికొత్త చరిత్ర సృష్టించింది.1000TH SIXES IN IPL 2024...!!!! 🤯- THE MOST CRAZIEST IPL SEASON EVER. 🔥 pic.twitter.com/mfYwS6fbUY— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024ఐపీఎల్ చరిత్రలో 2022 (1062 సిక్సర్లు), 2023 (1124 సిక్సర్లు), 2024 సీజన్లలో మాత్రమే 1000కి పైగా సిక్సర్లు నమోదు కాగా.. ఈ సీజన్లోనే అత్యంత వేగంగా ఆ మార్కు తాకింది. 2022 సీజన్లో ఈ మార్కును తాకేందుకు 16269 బంతులు అవసరమైతే.. గత సీజన్లో 15390 బంతులు.. ఈ సీజన్లో అన్నిటికంటే తక్కువగా 13079 బంతుల్లోనే వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి.సన్‌రైజర్స్-లక్నో మ్యాచ్ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 18 ఓవర్లు పూర్తయ్యాక లక్నో స్కోర్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులుగా ఉంది. డికాక్ (2), స్టోయినిస్ (3), కృనాల్ పాండ్యా (24), రాహుల్ (29) ఔట్ కాగా.. పూరన్ (30), బదోని (39) క్రీజ్‌లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్పెల్‌తో (4-0-12-3) లక్నోను దారుణంగా దెబ్బ కొట్టగా.. కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. కృనాల్‌ను కమిన్స్ అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. -
టీమిండియా క్రికెటర్ భార్య.. మోడల్ కూడా! ఇటీవలే రెండో బిడ్డకు జన్మ(ఫొటోలు)
-
T20 WC: కోహ్లి, హార్దిక్ వద్దు.. ఊహించని ఆటగాడికి ఛాన్స్!
ఐపీఎల్-2024 ఫీవర్ ముగియగానే పొట్టి ప్రపంచకప్ రూపంలో క్రికెట్ ప్రేమికులకు మరో మెగా సమరం కనువిందు చేయనుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ ఆరంభం కానుంది.ఇక హాట్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్లో ప్రయాణం ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టు గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యాకు నోఈ క్రమంలో రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ఎంపికతో ముందుకు వచ్చాడు.తన జట్టులో రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి చోటివ్వకపోగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బదులు ఊహించని పేరును తెరమీదకు తెచ్చాడు. కాగా ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌లో కలిపి 430 పరుగులు సాధించాడు.అత్యధిక పరుగుల వీరుడి జాబితాలో టాప్‌లో కొనసాగుతూ.. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా విఫలమవుతున్నా టీమిండియా వైస్ కెప్టెన్ హోదాలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.ఊహించని ఆటగాళ్లకు చోటుఇక పాండ్యాతో ఇప్పటికే శివం దూబే పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ ఎంపిక చేసుకున్న జట్టులో కోహ్లితో పాటు హార్దిక్ పాండ్యా, శివం దూబేలకు చోటు దక్కలేదు. అంతేకాదు అనూహ్యంగా హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యాను మంజ్రేకర్ ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా లక్నో యువ సంచలనం, స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్‌కు కూడా తన జట్టులో స్థానం కల్పించాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా.. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేశాడు. అదే విధంగా.. 8 మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు.టీ20 ప్రపంచకప్-2024కు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, కృనాల్ పాండ్యా.చదవండి: T20 WC 2024: దాదాపు 900 రన్స్ చేశా.. నాకు చోటు ఇవ్వకపోతే: గిల్ కామెంట్స్ వైరల్ -
రెండోసారి తండ్రైన పాండ్యా
లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా రెండో సారి తండ్రయ్యాడు. ఈ నెల 21 కృనాల్ భార్య పంఖురి శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు 'వాయు' అని నామకరణం చేసినట్లు కృనాల్ తెలిపాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. బిడ్డ పేరుతో (వాయు కృనాల్ పాండ్యా) పాటు పుట్టిన తేదీని (21.4.24) కృనాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. Vayu Krunal Pandya21.04.24 💙🪬 🌍 pic.twitter.com/TTLb0AjOVm— Krunal Pandya (@krunalpandya24) April 26, 2024 కృనాల్-పంఖురి శర్మ దంపతులకు ఇదివరకే ఓ మగబిడ్డ ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు కవిర్ కృనాల్ పాండ్యా. కవిర్ 2022 జులై 24న జన్మించాడు. ప్రముఖ మోడల్ అయిన పంఖురితో కృనాల్‌కు 2017లో వివాహమైంది. కృనాల్ సోదరుడు హార్దిక్‌కు కూడా ఓ కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు అగస్త్య. అగస్త్య.. హార్దిక్-సటాషా స్టాంకోవిచ్ దంపతులకు జన్మించిన సంతానం.ఇదిలా ఉంటే, కృనాల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో కృనాల్ 8 మ్యాచ్‌ల్లో 58 పరుగులు చేసి, 5 వికెట్లు పడగొట్టాడు. కృనాల్ జట్టు లక్నో ఈ సీజన్లో 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో కృనాల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశాలు పెద్దగా రాలేదు. బంతితో మాత్రం వచ్చిన అవకాశాలను కృనాల్ సద్వినియోగం చేసుకున్నాడు.ఈ సీజన్లో కృనాల్ ప్రదర్శనలు..రాజస్థాన్‌పై (4-0-19-0, 3 నాటౌట్)పంజాబ్‌పై (43 నాటౌట్, 3-0-26-0)ఆర్సీబీపై (0 నాటౌట్, 1-0-10-0)గుజరాత్‌పై (2 నాటౌట్, 4-0-11-3)ఢిల్లీపై (3, 3-0-45-0)కేకేఆర్‌పై (7 నాటౌట్, 1-0-14-0)సీఎస్కేపై (3-0-16-2)సీఎస్కేపై (2-0-15-0) -
ఇషాన్ కిషన్‌తో కలిసి హార్దిక్ పాండ్యా పూజలు (ఫొటోలు)
-
హార్దిక్ పాండ్యా సోదరుడి అరెస్ట్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోదరుడు వైభవ్ పాండ్యా అరెస్టైనట్లు సమాచారం. పాండ్యా సోదరులను మోసం చేసిన కారణంగా ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోర్జరీ ద్వారా దాదాపు రూ. 4.3 కోట్ల నిధులు మళ్లించిన నేపథ్యంలో వైభవ్ పాండ్యాపై కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు 37 ఏళ్ల వైభవ్ పాండ్యా సవతి సోదరుడు. వీరితో కలిసి అతడు 2021లో పాలిమర్ వ్యాపారం మొదలుపెట్టాడు. ఇందుకోసం హార్దిక్, కృనాల్ మూలధనం కింద ఒక్కొక్కరు 40 శాతం.... వైభవ్ తన వంతు వాటాగా 20 శాతం ఇచ్చాడు. అయితే, సోదరులకు తెలియకుండా మరో సంస్థను మొదలుపెట్టిన వైభవ్.. పాత వ్యాపారంలోని నిధులను మళ్లించాడు. హార్దిక్, కృనాల్లకు తెలియకుండా ఫోర్జరీ ద్వారా రూ. 4.3 కోట్లు తన సొంత వ్యాపారానికి వాడుకున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కాగా హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా భారీ మొత్తం వెనుకేయగా.. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న కృనాల్ ఈసారి రూ. 8.25 కోట్లు అందుకున్నాడు. ఇక ఈ సీజన్లో హార్దిక్ సారథ్యంలో ముంబై ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి గెలిచింది. మరోవైపు.. కృనాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో నాలుగింట మూడు విజయాలతో టాప్-3లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. గుజరాత్‌కు చెందిన హార్దిక్ పాండ్యాకు కృనాల్ తోబుట్టువు కాగా.. వైభవ్ పాండ్యా, గౌరవ్ పాండ్యా అనే మరో ఇద్దరు సవతి సోదరులు కూడా ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్ -
Hardik Pandya: కెప్టెన్ నేనే కాబట్టి తొలి ఓవర్ నేనే బౌలింగ్ చేస్తా..!
ఇటీవలికాలంలో హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ ఎక్కువైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఐపీఎల్ కెప్టెన్ అయ్యాక హార్దిక్‌కు పొగరు తలకెక్కిందని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల వ్యవహరించిన తీరును ఉదహరిస్తూ హార్దిక్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. తనకంటే సీనియరైన రోహిత్ పట్ల కనీస గౌరవం కూడా లేకుండా బౌండరీ లైన్ వద్ద అటుఇటు తిప్పడాన్ని సగటు భారత క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా హార్దిక్ వెలగబెట్టిన ఓ ఘన కార్యాన్ని ప్రస్తావిస్తూ ఇట్లుంటది ఈ కెప్టెన్తోని అంటూ వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్ టైటాన్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో బుమ్రా, లూక్ వుడ్, గెరాల్డ్ కొయెట్జీ లాంటి స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నప్పటికీ హార్దిక్ పాండ్యా తనే తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఇదే ముంబై అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నప్పుడు ఈ ఓవరాక్షన్ ఎందుకు అని వారు మండిపడుతున్నారు. వేస్తే వేశాడు. ఏమైనా పొడిచాడా అంటే అదీ లేదు. 3 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 30 పరుగులు సమర్పించుకున్నాడు. కెప్టెన్ అయ్యాక ఇలా చేయడం హార్దిక్‌కు కొత్తేమీ కాదు. Just Pandya brothers things🔥 pic.twitter.com/1KGsblX1lc — CricTracker (@Cricketracker) March 25, 2024 టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్నప్పుడు, గుజరాత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఇలా చేశాడు. అసలు పిచ్ ఆరంభ ఓవర్లలో తన బౌలింగ్ శైలికి సహకరిస్తుందా లేదా అని కూడా ఆలోచించకుండా తొలి ఓవరే బంతినందుకున్నాడు. కెప్టెన్ నేనే కాబట్టి, తొలి ఓవర్ నేనే వేస్తాను అన్నట్లుంది అతని ధోరణి. ఈ అతి చేష్టలే ముంబై అభిమానులకు అసలు రుచించడం లేదు. దీనికి తోడు సీనియర్ అని కూడా చూడకుండా రోహిత్ అగౌరవపరచడం ముంబై అభిమానులకు అస్సలు సహంచడం లేదు. ఎక్కడో గుజరాత్ వాడు వచ్చి మాపై (రోహిత్) పెత్తనం చెలాయించడమేంటని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. హార్దిక్ ఒక్కడే ఇలా (కెప్టెన్‌గా తొలి ఓవర్ బౌలింగ్ చేయడం) అనుకుంటే పొరబడ్డట్టే. అతని అన్న కృనాల్ పాండ్యా కూడా గతంలో ఇలాగే చేశాడు. గత సీజన్లో కేఎల్ రాహుల్ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌లకు లక్నో కెప్టెన్‌గా వ్యవహరించిన కృనాల్.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పిచ్ గురించి పట్టించుకోకుండా కెప్టెన్ నేనే కాబట్టి నేనే తొలి ఓవర్ వేస్తా అన్నట్లు వ్యవహరించాడు. పిచ్ పేసర్లకు సహకరిస్తుందని తెలిసినప్పటికీ కృనాల్ తొలి ఓవర్ వేయడంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. మొత్తంగా ఇలా చేయడం పాండ్యా బ్రదర్స్‌కు మాత్రమే సాధ్యమైంది. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (45) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టగా.. గెరాల్డ్ కొయెట్జీ 2, పియుశ్ చావ్లా ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ (43), డెవాల్డ్ బ్రెవిస్ (46) రాణించినప్పటికీ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గుజరాత్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్,స్పెన్సర్ జాన్సన్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ తలో 2 వికెట్లు, సాయికిషోర్ ఓ వికెట్ పడగొట్టారు. -
పాండ్యాకు బిగ్ షాక్..!?
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు వైస్ కెప్టెన్‌గా విండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను లక్నో ఫ్రాంచైజీ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లక్నో వెల్లడించింది. పూరన్‌కు నెం 29తో కూడిన వైస్ కెప్టెన్ జెర్సీని లక్నో సారథి కేఎల్ రాహుల్ అందించాడు. కాగా గత రెండు సీజన్లలో రాహుల్ డిప్యూటీగా వ్యవహరించిన స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా స్ధానాన్ని పూరన్ భర్తీ చేయనున్నాడు. ఇక నికోలస్ పూరన్ ప్రస్తుతం టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇటీవల ముగిసిన యూఏఈ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. కాగా ఐపీఎల్-2023 వేలంలో పూరన్‌ను రూ.16 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: స్ట్రైక్‌రేటు ఏకంగా 600.. అంతర్జాతీయ టీ20లలో ఇదే తొలిసారి? 🚨BREAKING🚨: Lucknow Super Giants have appointed Nicholas Pooran as the vice-captain for IPL 2024. 📸: LSG#IPL2024 #LSG pic.twitter.com/ZYtiqVm0Eb — CricTracker (@Cricketracker) February 29, 2024 -
ఇర్ఫాన్‌తో ప్రేమ.. గంభీర్ మిస్డ్కాల్స్ ఇచ్చేవాడు: నటి సంచలన వ్యాఖ్యలు
Payal Ghosh Viral Comments On Irfan Pathan- Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, గౌతం గంభీర్‌లను ఉద్దేశించి నటి పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇర్ఫాన్‌తో తను ప్రేమలో ఉన్నపుడు.. గంభీర్ తనకు తరచూ మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉండేవాడంటూ క్రీడావర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. ఊసరవెళ్లి వంటి బడా సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాతో చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన కలకత్తా బ్యూటీ పాయల్ ఘోష్. ఆ తర్వాత తెలుగులో జూ. ఎన్టీఆర్ ‘ఊసరవెళ్లి’ వంటి పలు చిత్రాల్లో అదృష్టం పరీక్షించుకున్నారు ఈ బెంగాలీ నటి. తర్వాత బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. అయితే, సినిమాల కంటే సంచలన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నామె. బాలీవుడ్ దర్శకుడిపై ఆరోపణలు గతంలో.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించిన ఆమె.. అప్పట్లో ఓ సూసైడ్ నోట్ షేర్ చేసి తన అభిమానులను ఆందోళనకు గురిచేశారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి తరచుగా మాట్లాడే పాయల్ ఘోష్.. వన్డే ప్రపంచకప్-2023 నుంచి క్రికెటర్ల గురించి తన సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. షమీ ‘ఇంగ్లిష్’ గురించి సెటైర్లు భారత్ వేదికగా వరల్డ్‌కప్-2023లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గురించి పాయల్ అప్పట్లో ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మ్యాచ్ అనంతరం షమీ కేవలం హిందీలో మాత్రమే మాట్లాడటాన్ని ఉద్దేశించి.. ‘‘షమీ నువ్వు నీ ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకో.. నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని పాయల్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇర్ఫాన్‌తో ప్రేమలో ఉన్నపుడు గంభీర్ అలా దీంతో షమీ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. తాజాగా మరో ఇద్దరు మాజీ క్రికెటర్ స్టార్లను ఉద్దేశిస్తూ పాయల్ చేసిన పోస్టులు సంచలనంగా మారాయి. ‘‘గౌతం గంభీర్ గారు నాకు తరచూ మిస్డ్కాల్స్ ఇచ్చేవారు. ఈ విషయం ఇర్ఫాన్ పఠాన్‌కు బాగా తెలుసు. ఎందుకంటే అతడు నా ఫోన్ కాల్స్ మొత్తం చెక్ చేసేవాడు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఉన్నపుడే ఈ విషయాన్ని యూసఫ్ భాయ్(ఇర్ఫాన్ అన్న), హార్దిక్, కృనాల్ పాండ్యా సమక్షంలో అతడే స్వయంగా నాకు చెప్పాడు. పుణెలో బరోడా జట్టు దేశవాళీ మ్యాచ్ జరుగుతున్నపుడు ఇర్ఫాన్‌ను కలవడానికి వెళ్లినపుడు.. అతడు నా ఫోన్ చెక్ చేసినట్లు తెలిపాడు. ఇర్ఫాన్‌ని తప్ప ఎవరినీ ప్రేమించలేదు అయితే, మా బ్రేకప్ జరిగిన తర్వాత నేను అనారోగ్యం పాలయ్యాను. ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను. నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి అతడే.. ఇర్ఫాన్ తర్వాత నేనెవరినీ ప్రేమించలేదు’’ అని పాయల్ ఘోష్ శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్‌తో దిగిన సెల్ఫీని ఆమె షేర్ చేశారు. అటెన్షన్ సీకర్ అంటూ ట్రోల్స్ కాగా పాయల్ వ్యాఖ్యలపై అటు ఇర్ఫాన్ పఠాన్ గానీ.. ఇటు గంభీర్ గానీ ఇంతవరకు స్పందించలేదు. అయితే, వారి అభిమానులు మాత్రం.. ‘‘కేవలం వార్తల్లో నిలవడానికి మాత్రమే.. అందరి చూపును తన వైపునకు తిప్పుకొనేందుకే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా పాయల్ ఘోష్ జూ.ఎన్టీఆర్, అతడి అభిమానులను.. దక్షిణాది ప్రేక్షకులను ఎల్లప్పుడూ ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. చదవండి: తొలిసారి భారత జట్టులోకి.. యువ సంచలనంపై అశ్విన్ ప్రశంసలు Gautam Gambhir mujhe regularly miscall dete the , yeh Irfan ko bohot achhi ta rah pata tha , woh mera sab calls check karta tha .. woh yeh baat mere Samna Yusuf bhai, Hardik Aur Krunal Pandya ko bhi bataya tha jab main irfan ko Pune mein Milne gayi thi.. Domestic match tha… — Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023 After we broke up … I fell ill .. I couldn’t work for years… but he was the only guy whom I loved… after that I never loved anybody 🥲 pic.twitter.com/vKRYWJl0Ti — Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023 -
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
ఎక్కువగా వాళ్ల మీదే ఆధారపడ్డారు.. ఫలితం అనుభవించారు.. వచ్చే సీజన్లోనైనా..
IPL 2023- LSG: విదేశీ ఆటగాళ్ల మీద అతిగా ఆధారపడటం లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచిందని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ అభిప్రాయడపడ్డాడు. అదే సమయంలో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా వంటి దేశీ ప్లేయర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోవడం ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరోసారి ఈ విషయం నిరూపితమైందన్నాడు. ఆ ముగ్గురే అద్భుతంగా ఐపీఎల్-2023లో లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో 8 గెలిచిన లక్నో టాప్-3లో నిలిచి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా కృనాల్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించాడు. అయితే, లక్నో గెలిచిన చాలా మ్యాచ్‌లలో విదేశీ ఆటగాళ్లు కైలీ మేయర్స్, నికోలసన్ పూరన్, మార్కస్ స్టొయినిస్లే కీలక పాత్ర పోషించారు. హుడా దారుణంగా మార్కస్ స్టొయినిస్ మొత్తంగా సీజన్లో 15 మ్యాచ్‌లలో 408 పరుగులతో లక్నో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 13 మ్యాచ్‌లు ఆడి 379 పరుగులు సాధించిన కైలీ మేయర్స్ అతడి తర్వాతి స్థానంలో ఉండగా.. పూరన్ 15 మ్యాచ్‌లలో 358 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. ఇలా లక్నో టాప్ స్కోరర్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. మరోవైపు.. తాత్కాలిక కెప్టెన్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా 188 పరుగులు చేయగా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన దీపక్ హుడా పూర్తిగా నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లలో అతడు చేసిన మొత్తం పరుగులు కేవలం 84. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో మేయర్స్ 18 పరుగులకే పెవిలియన్ చేరగా.. కృనాల్ 8 రన్స్ మాత్రమే చేశాడు. పాపం స్టొయినిస్ ఒంటరి పోరాటం చేస్తున్న స్టొయినిస్(27 బంతుల్లో 40 పరుగులు)ను అనవసరంగా రనౌట్‌కు బలైపోయేలా చేసిన దీపక్ హుడా(15) తాను కూడా రనౌట్ అయి కొంపముంచాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా లక్ష్య ఛేదనలో తడబడ్డ లక్నో 101 పరుగులకే చేతులెత్తేసింది. 81 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడి మరోసారి భంగపడింది. కనీసం వచ్చే సీజన్లో అయినా ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం క్రిక్‌బజ్ షోలో భారత మాజీ బౌలర్ మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘లక్నో ఎక్కువగా విదేశీ ఆటగాళ్ల మీదే ఆధారపడింది. ఆ జట్టులో ఉన్న భారత ఆటగాళ్లలో ఒక్కరు కూడా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో స్టొయినిస్ ఒక్కడే కాసేపు పోరాడాడు. వచ్చే సీజన్లోనైనా లక్నో ఈ లోపాలు సరిదిద్దుకోవాలి. ఈ మ్యాచ్‌లో పూరన్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. స్టొయినిస్ ఆడతాడు అనుకుంటే చెత్తగా రనౌట్ కావాల్సి వచ్చింది’’ అని లక్నో బ్యాటర్ల తీరును విమర్శించాడు. చదవండి: ఆర్సీబీలో నెట్‌బౌలర్‌గా ఉన్నా... ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు.. తిలక్ వర్మను టీజ్ చేసిన సూర్యకుమార్.. వీడియో వైరల్ 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Plenty of smiles and celebrations after a resounding victory in a crunch game 😃 The Mumbai Indians stay alive and how in #TATAIPL 2023 😎#Eliminator | #LSGvMI | #Qualifier2 | @mipaltan pic.twitter.com/qYPQ1XU1BI — IndianPremierLeague (@IPL) May 25, 2023 -
నాదే బాధ్యత.. డికాక్ గొప్ప బ్యాటరే, అతనికి మంచి రికార్డు ఉందని..!
-
Krunal: నాదే బాధ్యత.. డికాక్ గొప్ప బ్యాటరే, అతనికి మంచి రికార్డు ఉందని..!
ఐపీఎల్ 2023లో భాగంగా నిన్న (మే 24) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిపాలైంది. ఫలితంగా వరుసగా రెండో ఏడాది ఎలిమినేటర్ గండం దాటలేక లీగ్ నుంచి నిష్క్రమించింది. ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ (3.3-0-5-5) లక్నోను ఇంటిబాట పట్టేలా చేశాడు. బ్యాటింగ్ వైఫల్యం, కెప్టెన్ తప్పుడు నిర్ణయాలు (డికాక్‌ను కాదని కైల్ మేయర్స్‌కు అవకాశం ఇవ్వడం) ఎల్ఎస్జీ కొంపముంచాయి. మ్యాచ్ అనంతరం ఈ విషయాలపై లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యానికి తనదే బాధ్యత అని ఒప్పుకున్నాడు. బ్యాటింగ్ సైతం సజావుగా సాగుతున్న సమయంలో (8.1 ఓవర్లలో 69/2) అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నానని, దాని వల్లే తమ బ్యాటింగ్ లయ తప్పిందని తెలిపాడు. రాంగ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నానని, దాని పూర్తి బాధ్యత తనదేనని అన్నాడు. బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తోండిందని, తాము మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉండిందని తెలిపాడు. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత చెత్త క్రికెట్ ఆడామని, అంతకు వెయ్యి రెట్లు మెరుగైన క్రికెట్ ఆడాల్సిందని పేర్కొన్నాడు. డికాక్‌ను కాదని కైల్ మేయర్స్‌ను తీసుకోవడంపై స్పందిస్తూ.. డికాక్ నాణ్యమైన బ్యాటర్ అయినప్పటికీ చెన్నైలో మేయర్స్‌కు మెరుగైన రికార్ ఉండటంతో అతనివైపే మొగ్గు చూపాల్సి వచ్చిందని వివరించాడు. పేసర్లను కాదని స్పిన్ బౌలింగ్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడంపై మాట్లాడుతూ.. ముంబై బ్యాటర్లు ఫాస్ట్ బౌలర్లను బాగా ఆడగలరని భావించామని, అందుకే స్పిన్ అటాక్‌తో బౌలింగ్ ప్రారంభించామని చెప్పుకొచ్చాడు. ఆకాశ్ మధ్వాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ముంబై ప్లేయర్లు ఫీల్డ్‌లో పాదరసంలా కదిలారని ప్రశంసించాడు. ఓవరాల్‌గా జట్టు ఓటమి బాధ్యత తానే తీసుకుంటానని, తప్పుడు నిర్ణయాలే కొంపముంచాయని తెలిపాడు. కాగా, నిన్నటి పోరులో లక్నోపై ముంబై 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (23 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. స్టొయినిస్ (27 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయిన లక్నో 21 బంతుల ముందే కుప్పకూలింది. చదవండి: సపోర్ట్ బౌలర్‌గా వచ్చాడు.. అతనిలో టాలెంట్ ఉందని ముందే పసిగట్టాను: రోహిత్ శర్మ -
#LSG: ఎలిమినేటర్ గండం దాటలేక.. ఓటమికి కారణాలెన్నో!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి ప్లేఆప్స్కే పరిమితమైంది. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో 81 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని చవిచూసింది. ఐపీఎల్లో గతేడాదే కొత్తగా వచ్చి లక్నో సూపర్‌జెయింట్స్ ఎలిమినేటర్ గండాన్ని వరుసగా రెండోసారి కూడా దాటలేకపోయింది. గతేడాది ఆర్సీబీ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన లక్నో.. ఈసారి ముంబై ఇండియన్స్‌కు దాసోహమంది. అయితే లక్నో సూపర్‌జెయింట్స్ ఓటమికి చాలా కారణాలున్నాయి. మొదటిది పదేపదే జట్టును మార్చడం లయను దెబ్బతీసింది. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కృనాల్ పాండ్యా లీగ్ స్టేజీలో బాగానే నడిపించాడు. కైల్మేయర్స్ను కాదని ప్రేరక్ మన్కడ్‌ను తీసుకోవడం.. క్వింటన్ డికాక్‌కు అవకాశం ఇవ్వడం వరకు బాగానే ఉంది. అయితే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌కు డికాక్‌ను పక్కనబెట్టి కృనాల్ పెద్ద తప్పే చేశాడు. అసలు ఏమాత్రం ఫామ్‌లో లేని దీపక్ హూడాకు అవకాశమిచ్చి చేతులు కాల్చుకున్నాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా ఔట్ చేసి చివరకు తాను కూడా రనౌట్ అయి కర్మ ఫలితం అనుభవించాడు. ముంబైతో ఎలిమినేటర్ మ్యాఛ్‌లో కైల్ మేయర్స్, డికాక్‌తో ఓపెనింగ్ చేయించి ఉంటే లక్నో పరిస్థితి వేరుగా ఉండేదేమో. కేఎల్ రాహుల్ ఉన్నప్పుడు జట్టు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికి మిడిలార్డర్లో స్టోయినిస్, పూరన్‌లు చాలా మ్యాచ్‌ల్లో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు, అయితే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పూరన్ గోల్డెన్ డకౌట్ అవ్వడం.. 40 పరుగులతో నిలకడగా ఆడుతున్న స్టోయినిస్ రనౌట్ కావడం లక్నో ఓటమిని ఖరారు చేసింది. మరి వచ్చే సీజన్లోనైనా సరికొత్త ప్రణాళికతో ఎలిమినేటర్ గండం దాటి కప్ కొడుతుందేమో చూద్దాం. -
కావాలనే యశ్ చేతికి బంతినిచ్చా! అతడు క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి వణికిపోవాల్సిందే!
IPL 2023 KKR Vs LSG- LSG qualify for the playoffs: ‘‘సంతృప్తిగా ఉంది. తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన సమయంలోనూ మా ఆటగాళ్లు రాణించారు. మేమెప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటాం. క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాట పటిమ కనబరుస్తాం. నిజానికి ఒక దశలో వాళ్ల స్కోరు 61/1. అయినప్పటికీ.. ఇంకో 2-3 ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే మేము పోటీలో ఉంటామని భావించాను. అదే సమయంలో స్పిన్నర్లకు కాస్త పట్టు దొరికింది. అది మాకు అనుకూలించింది’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కృనాల్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్‌లో లక్నో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శనివారం నాటి ఉత్కంఠ పోరులో లక్నో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది. వరుసగా రెండో ఏడాది టాప్-4లో నిలిచి సత్తా చాటింది. పూరన్ అర్ధ శతకంతో.. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లక్నో నికోలస్ పూరన్ అద్భుత అర్థ శతకం కారణంగా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్ జేసన్ రాయ్(45) శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (24) సైతం మెరుగ్గా రాణించాడు. రింకూ మరోసారి ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నితీశ్ రాణా (8), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన రహ్మనుల్లా గుర్బాజ్ (10) వెంట వెంటనే అవుటయ్యారు. మిగతా బ్యాటర్లు సైతం పెవిలియన్‌కు క్యూ కట్టగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రింకూ సింగ్ ఒంటరి పోరాటం చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం బెరుకు లేకుండా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. రింకూ విజృంభణ చూస్తే కేకేఆర్ విజయం సాధ్యమే అనిపించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమైన తరుణంలో లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోయాడు. నరాలు తెగే ఉత్కంఠ అతడి బౌలింగ్‌లో తొలి బంతికి 1 పరుగు రాగా, రెండో బంతి వైడ్ వెళ్లగా ఆ తర్వాతి రెండు బంతుల్లో పరుగులు రాలేదు. కానీ యశ్ మరోసారి వైడ్ వేశాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. రింకూ వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్ కొట్టాడు. కానీ కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు. గెలుపునకు ఒక్క అడుగు దూరంలో కేకేఆర్ నిలిచిపోగా.. లక్నో ప్లే ఆఫ్స్‌నకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం లక్నో సారథి కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. రింకూను ప్రశంసించాడు. ‘‘ఈ ఏడాది రింకూకు స్పెషల్. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు అద్భుతంగా ఆడాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి అలర్ట్ కావాల్సిందే. కావాలనే అతడికి బంతినిచ్చా ఈరోజు కూడా రింకూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టాడు’’ అని పేర్కొన్నాడు. ఇక ఆఖరి ఓవరల్లో యశ్ ఠాకూర్‌కు బంతినివ్వడాన్ని సమర్థించుకున్న కృనాల్.. ‘‘డెత్ ఓవర్లలో మప ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలని ముందే బౌలర్లకు చెప్పాను. ప్రతీ బంతికి వాళ్లతో చర్చించాను. ఇక ఆఖర్లో యశ్ ఠాకూర్‌కు బంతినివ్వాలని నేను నిర్ణయం తీసుకున్నా. గత మ్యాచ్‌లో రివర్స్ సింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి మొహిసిన్‌ను రంగంలోకి దింపాను. కోల్‌కతా వికెట్ కాస్త స్లోగా ఉంది. అందుకే ఏదైతే అది అయిందని రిస్క్ చేసి మరీ యశ్‌కు బంతినిచ్చాను’’ అని తెలిపాడు. చదవండి: నిలకడకు నిలువుటద్దం.. ఆడిన 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్‌కు జడేజాపై సీరియస్ అయిన ధోని! ఇది క్రికెట్ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి! A breathtaking finish to a sensational encounter! 🔥@LucknowIPL clinch a victory by just 1 run after Rinku Singh's remarkable knock 🙌 Scorecard ▶️ https://t.co/7X1uv1mCyL #TATAIPL | #KKRvLSG pic.twitter.com/umJAhcMzSQ — IndianPremierLeague (@IPL) May 20, 2023 -
కేకేఆర్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం.. ఫ్లేఆఫ్స్‌కు లక్నో
కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్‌జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రింకూ సింగ్ 33 బంతుల్లో 67 పరుగులు నాటౌట్ మరోసారి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసినప్పటికి కేకేఆర్‌ను గెలిపించలేకపోయాడు. జేసన్ రాయ్ 45 పరుగులు చేశాడు. యష్ ఠాకూర్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యాలు చెరొక వికెట్ తీశారు. టార్గెట్ 177..120 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్ లక్నోతో మ్యాచ్‌లో కేకేఆర్ 120 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన రసెల్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 11 ఓవర్లలో కేకేఆర్ 88/3 11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. గుర్బాజ్ 6, రింకూ సింగ్ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 8 పరుగులు చేసిన నితీశ్ రానా రవి బిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. జేసన్‌రాయ్(45 పరుగులు) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 6 ఓవర్లలో కేకేఆర్ 61/1 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. 24 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. జేసన్‌రాయ్ 36 పరుగులతో ఆడుతున్నాడు. రాణించిన పూరన్.. కేకేఆర్ టార్గెట్ 177 కేకేఆర్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక దశలో 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో నికోలస్ పూరన్(30 బంతుల్లో 58 పరుగులు), ఆయుష్ బదోని(21 బంతుల్లో 25 పరుగులు) ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. కేకేఆర్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరాలు తలా రెండు వికెట్లు తీయా.. హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి చెరొక వికెట్ తీశారు. 17 ఓవర్లలో లక్నో 133/5 17 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 44, ఆయుష్ బదోని 14 పరుగులతో ఆడుతున్నారు. 73 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో లక్నో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తడబడుతోంది. 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన డికాక్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. 8 ఓవర్లలో 58/3 8 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 24, కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలో లక్నో 54/1 ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ప్రేరక్ మన్కడ్ 26, క్వింటన్ డికాక్ 20 పరుగులతో ఆడుతున్నారు. 4 ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్ 27/1 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ వికెట్ నష్టానికి 27 పరుగుఉల చేసింది. క్వింటన్ డికాక్ 19, ప్రేరక్ మన్కడ్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు మూడు పరుగులు చేసిన కరణ్ శర్మ హర్షిత్ రానా బౌలింగ్‌లో క్యాచ్ఔట్గా వెనుదిరిగాడు, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్లో శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా 68వ మ్యాచ్‌లో కేకేఆర్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి ప్లేఆఫ్ చేరే అవకాశాలు కేకేఆర్‌కు తక్కువగా ఉన్నప్పటికి లక్నోను ఓడిస్తే రేసులో ఉంటుంది.. ఒకవేళ లక్నో గెలిస్తే మాత్రం 17 పాయింట్లతో ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ను గెలిచిన సీఎస్కే రెండో జట్టుగా ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. -
హోమ్ గ్రౌండ్లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్
-
కృనాల్ పాండ్యా చెత్త రికార్డు.. కెప్టెన్ హోదాలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో..!
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కృనాల్ పాండ్యా ఐపీఎల్లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. తొలుత సీఎస్కేతో రద్దైన మ్యాచ్‌లో (వర్షం కారణంగా) సున్నా పరుగులకే పెవిలియన్‌కు చేరిన కృనాల్.. నిన్న (మే 7) తమ్ముడు హార్ధిక్ సారధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి తొలి బంతికే డకౌటయ్యాడు. కాగా, కేఎల్ రాహుల్ గాయపడటంతో అనూహ్య పరిణామాల మధ్య కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కృనాల్.. సారధిగా తనదైన ముద్ర వేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఫలితం తేలకపోగా.. రెండో మ్యాచ్‌లో తమ్ముడి జట్టు చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. అంతకుముందు రాహుల్ గాయపడిన మ్యాచ్‌లోనూ (ఆర్సీబీ) తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన కృనాల్.. ఆ మ్యాచ్‌లోనూ తన జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఇక గుజరాత్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. లక్నో టీమ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. శుభ్‌మన్ గిల్ (51 బంతుల్లో 94 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో లక్నో సైతం ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ప్రారంభించింది. డి కాక్ (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కైల్ మేయర్స్ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెచ్చిపోయి ఆడారు. అయితే 9వ ఓవర్లో మేయర్స్ ఔట్ కావడంతో లక్నో పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఒక్కరు కూడా క్రీజ్‌లో కుదురుకోలేదు. డికాక్ సైతం కొంతవరకు పోరాడి చేతులెత్తేశాడు. దీంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: IPL 2023: గిల్, సాహా విధ్వంసం.. లక్నోపై గుజరాత్ ఘన విజయం -
అన్నదమ్ముళ్ల అనుబంధం.. 'నాన్న గర్వంగా ఫీలయ్యేవారు'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆదివారం అద్బుత దృశ్యం చోటుచేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా నేతృత్వం వహించగా.. గాయంతో కేఎల్ రాహుల్ దూరం కావడంతో కృనాల్ లక్నో జట్టు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు అన్నదమ్ములు కెప్టెన్లుగా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు హార్దిక్, కృనాల్‌లు ఒకరినొకరు అభినందించుకున్నారు. అనంతరం హార్దిక్.. కృనాల్ క్యాప్‌ను సరిచేసి అతన్ని హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపు ముచ్చటించుకున్న ఇద్దరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. పాండ్యా బ్రదర్స్ మధ్య జరిగిన సంభాషణను ఇరుజట్ల ఆటగాళ్లు వీక్షించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ వెబ్సైట్ ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు..'' అన్నదమ్ముళ్ల అనుబంధం.. మా దిష్టే తగిలేలా ఉంది.'' అంటూ కామెంట్ చేశారు. ఇక టాస్ సమయంలోనూ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఈరోజు మా ఇద్దరిని ఇలా చూసి నాన్న గర్వంగా ఫీలయ్యేవాడు. మేమిద్దరం రెండు వేర్వేరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించడం సంతోషంగా ఉంది. నిజంగా ఇది మా కుటుంబానికి మంచి ఎమోషనల్ మూమెంట్'' అని చెప్పుకొచ్చాడు. The two Pandya brothers are up against one another here in Ahmedabad. Who do you reckon will come on Top after Match 51 of the #TATAIPL #GTvLSG pic.twitter.com/Zvh2kRRjwN — IndianPremierLeague (@IPL) May 7, 2023 Hardik Pandya said "Our father would definitely be proud, it's an emotional moment for my family". First time in IPL two brothers are captaining each other. pic.twitter.com/i7D5xPvGEk — Johns. (@CricCrazyJohns) May 7, 2023 చదవండి: నక్క తోక తొక్కిన పాండ్యా.. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన పాండ్యా బ్రదర్స్
ఐపీఎల్లో భారత ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ప్రత్యర్థి జట్లకు కెప్టెన్లగా వ్యవహరించిన సోదరులుగా హార్దిక్, కృనాల్ నిలిచారు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తుండగా.. లక్నో సూపర్ జెయింట్స్‌కు కృనాల్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, లక్నో జట్లు తలపడతున్నాయి. ఈ క్రమంలో పాండ్యా బ్రదర్స్ ఈ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు. కాగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ టోర్నీ మధ్యలో తప్పుకోవడంతో కృనాల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. చదవండి: IPL 2023: హ్యారీ బ్రూక్‌ను పక్కన పెట్టండి.. అతడికి ఛాన్స్ ఇవ్వండి! అయినా కష్టమే -
IPL 2023: కెప్టెన్ అయ్యానన్న ఆనందం అంతలోనే ఆవిరి! లక్ష్మణ్ తర్వాత..
IPL 2023 LSG Vs CSK- Krunal Pandya: కేఎల్ రాహుల్ గాయపడిన కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి కెప్టెన్ అయ్యాడు టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా. ఐపీఎల్-2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా పగ్గాలు చేపట్టాడు. అయితే, కెప్టెన్ అయ్యానన్న ఆనందం కృనాల్‌కు ఎంతో సేపు నిలవలేదు. అంతలోనే ఆనందం ఆవిరి లక్నో బ్యాటింగ్ ఆరంభించిన కొద్దిసేపటికే అతడి సంతోషం ఆవిరైపోయింది. కృనాల్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో సీఎస్కేతో మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్‌కు దిగింది. చెత్త రికార్డు మూటగట్టుకుని ఈ క్రమంలో చెన్నై బౌలర్ మొయిన్ అలీ.. ఓపెనర్ కైల్ మేయర్స్(14)ను పెవిలియన్‌కు పంపగా.. మహీశ్ తీక్షణ మరో ఓపెనర్ మనన్ వోహ్రా(10) వికెట్ కూల్చాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కరణ్ శర్మ 9 పరుగులు చేయగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కృనాల్ పాండ్యా డకౌట్ అయ్యాడు. లక్నో ఇన్నింగ్స్ ఆరో ఓవర్ చివరి బంతికి మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో అజింక్య రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రహానే అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తద్వారా ఐపీఎల్లో కెప్టెన్‌గా డెబ్యూ మ్యాచ్‌లోనే డకౌట్ అయిన మూడో క్రికెటర్‌గా అప్రదిష్ట మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయింది వీరే! ►2008లో కేకేఆర్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో దెక్కన్ చార్జర్స్ కెప్టెన్ వీవీఎస్ లక్ష్మణ్ ►2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నాయకుడు ఎయిడెన్ మార్కరమ్ ►2023లో లక్నోలో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారథి కృనాల్ పాండ్యా చదవండి: 'నేను ఔటయ్యానా?'.. జడ్డూ దెబ్బకు షాక్‌లో స్టోయినిస్ Virat Kohli: ఐపీఎల్ ఆడేందుకే వచ్చా! ఎవరెవరితోనూ తిట్టించుకోవడానికి కాదు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
LSG Vs CSK: విన్నర్ రెయిన్, మ్యాచ్ రద్దు.. ఇరుజట్లకు చెరో పాయింట్
Lucknow Super Giants vs Chennai Super Kings Updates: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. లక్నో సూపర్‌జెయింట్స్, సీఎస్కే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. లక్నో తొలి ఇన్నింగ్స్ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి లక్నో సూపర్‌జెయింట్స్ 19.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులతో ఆడుతోంది. ఆయుష్ బదోని 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. 19.2: ఏడో వికెట్ డౌన్.. వర్షం ఆటంకం పతిరణ బౌలింగ్‌లో గౌతం(1) రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వరణుడి అంతరాయం కారణంగా ఆటను నిలిపివేశారు. స్కోరు 125/7 (19.2). అర్ధ శతకంతో మెరిసిన బదోని ఓవైపు వికెట్లు పడుతున్నా లక్నో యువ ప్లేయర్ ఆయుష్ బదోని మాత్రం పట్టుదలగా నిలబడి హాఫ్ సెంచరీతో మెరిశాడు. 18.3 ఓవర్లో చహర్ బౌలింగ్‌లో సిక్సర్ బాది 50 పరుగుల మార్కు అందుకున్నాడు. 19 ఓవర్లలో లక్నో స్కోరు: 125/6 17.4: ఆరో వికెట్ కోల్పోయిన లక్నో 20 పరుగులతో నిలకడగా ఆడుతున్న పూరన్‌ను.. మతీశ పతిరణ బోల్తా కొట్టించాడు. ఈ యువ పేసర్ బౌలింగ్‌లో పూరన్.. అలీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. క్రిష్ణప్ప గౌతం, ఆయుష్ బదోని (38) క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లలో లక్నో స్కోరు: 57/5 నికోలస్ పూరన్ 11, ఆయుష్ బదోని 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9.4: ఐదో వికెట్ కోల్పోయిన లక్నో మొయిన్ అలీ బౌలింగ్‌లో కరణ్ శర్మ(9) బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లలో లక్నో స్కోరు: 44-5 6.5: కష్టాల్లో కూరుకుపోయిన లక్నో చెన్నై బౌలర్లు పంజా విసరడంతో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన లక్నో.. తాజాగా స్టొయినిస్ రూపంలో మరో వికెట్‌ను చేజార్చుకుంది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ అయిన స్టొయినిస్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. 7 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోరు 34-4. కరణ్ శర్మ, నికోలస్ పూరన్ క్రీజులో ఉన్నారు. 5.5: మూడో వికెట్ డౌన్ తీక్షణ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయిన కృనాల్ పాండ్యా. పవర్ ప్లేలో లక్నో స్కోరు: 31/3 (6) 5.4: రెండో వికెట్ కోల్పోయిన సూపర్ జెయింట్స్ లక్నో ఓపెనర్ మనన్ వోహ్రాను బౌల్డ్ చేసిన మహీశ్ తీక్షణ. కృనాల్ పాండ్యా, కరణ్ శర్మ క్రీజులో ఉన్నారు. 3.4: తొలి వికెట్ కోల్పోయిన లక్నో మొయిన్ అలీ బౌలింగ్‌లో మేయర్స్(14) అవుట్. ఆసక్తికర పోరు ఐపీఎల్-2023లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. కాగా ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరం కావడంతో కృనాల్ పాండ్యా లక్నోను ముందుండి నడిపించనున్నాడు. ఇక టాస్ సందర్భంగా చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ.. ‘‘చిరుజల్లులు కురుస్తున్నాయి.. వికెట్ కాస్త పచ్చిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి మేము ముందు బౌలింగ్ చేస్తాం. దీపక్ చహర్ ఫిట్‌గా ఉన్నాడు. ఆకాశ్ సింగ్ స్థానంలో చహర్ జట్టులోకి వస్తున్నాడు. ఈ ఒక్కటి తప్ప మరే ఇతర మార్పులు లేవు’’ అని పేర్కొన్నాడు. చాలా మంది ఇదే తనకు చివరి ఐపీఎల్ అని ఫిక్సైపోయారని.. అయితే, తాను మాత్రం అలా భావించడం లేదని నవ్వులు చిందించాడు. కాగా గత మ్యాచ్‌లో సీఎస్కే చెన్నైలో లక్నోతో మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో సొంతమైదానంలో సీఎస్కేకు విజయంతో జవాబు ఇవ్వాలని భావిస్తోంది. IPL 2023 LSG Vs CSK Playing XI తుది జట్లు: లక్నో సూపర్ జెయింట్స్ : కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా(కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్. చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీ(వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ -
IPL 2023: ఐపీఎల్ జట్టుకు కొత్త కెప్టెన్
ఐపీఎల్-2023 సీజన్లో ఓ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. మే 1న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. లీగ్‌లో లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్‌కు కృనాల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఎల్ఎస్జీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. కృనాల్ నేతృత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ ఇవాళ (మే 3) చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుందని పేర్కొంది. కేఎల్ రాహుల్ గాయం తీవ్రమైందని, ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా టేకప్ చేస్తుందని, ఐపీఎల్లో తదుపరి మ్యాచ్‌ల్లో రాహుల్ ఆడాలా లేదా అన్న విషయంపై తుది నిర్ణయం బీసీసీఐ / ఎన్సీఏలదేనని లక్నో టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. వచ్చే నెలలో డబ్ల్యూటీసీ ఫైనల్ (జూన్ 7) ఉన్న దృష్ట్యా బీసీసీఐ రాహుల్ ఇంజ్యూరీ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుందని, రాహుల్ విషయంలో ఎన్సీఏ మెడికల్ టీమ్ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. కాగా, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ (బౌండరీని ఆపే క్రమంలో ఛేజ్ చేస్తూ) కేఎల్ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనే రాహుల్ స్థానంలో కృనాల్ తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. లీగ్ కీలక దశకు చేరిన తరుణంలో గాయం కారణంగా రాహుల్ దూరం కావడం లక్నో టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం లక్నో.. గుజరాత్ (అగ్రస్థానం), రాజస్థాన్ (రెండో స్థానం), చెన్నై (నాలుగు), ఆర్సీబీ (ఐదు), పంజాబ్ (ఆరు)లతో పాటు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. -
గిల్ డకౌట్.. ఫ్లైయింగ్ కిస్‌తో సెలబ్రేషన్స్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డకౌట్ అయ్యాడు. ఈ సందర్భంగా కృనాల్ పాండ్యా చేసిన సెలబ్రేషన్ వైరల్‌గా మారింది. Photo: IPL Twitter విషయంలోకి వెళితే.. కృనాల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతిని గిల్ లాంగాఫ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న బిష్ణోయి ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సమయంలో పాండ్యా ఆకాశంవైను చూస్తూ దేవుడా నువ్వు ఉన్నావు అన్నట్లుగా ప్లైయింగ్ కిస్‌తో సెలబ్రేషన్ చేసుకున్నాడు. pic.twitter.com/7qHlPdH8Eb — IPLT20 Fan (@FanIplt20) April 22, 2023 -
మా విజయానికి సీక్రెట్ అదే.. కృనాల్ సూపర్! చాలా తెలివిగా: రాహుల్
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండో విజయం నమోదు చేసింది. వాజ్‌పేయి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో ఆగ్ర స్థానంలో నిలిచింది. ఇక ఈ ఘనవిజయంపై మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. ఈ అద్భుత విజయానికి కారణం తమ జట్టు స్పిన్నర్లే అని రాహుల్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో లక్నో స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో ఎస్ఆర్హెచ్ టాప్ఆర్డర్ను దెబ్బతీయగా.. మిశ్రా రెండు, రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టారు. రాహుల్ కీలక సమయాల్లో స్పిన్నర్లను ఊపయోగించి ఎస్ఆర్హెచ్ను ఏ దశలోను కోలుకోకుండా చేశాడు. ఇక పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రాహుల్ మాట్లాడుతూ.. "లక్నో వికెట్ పరిస్థితి ఎలా ఉందో మాకు ఒక రోజు ముందే మాకు అర్ధమైంది. గత రెండు వారాలగా మేము ఇక్కడే ఉన్నాం. కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు బాగా తెలుసు. ఒక వేళ నేను టాస్ గెలిచి ఉన్నా తొలుత బౌలింగే ఎంచుకునేవాడిని. ఇక్కడ ఇలా ఆడాలో నాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మొదటి రెండు ఓవర్లలో పేసర్లకు బంతి అద్భుతంగా టర్న్ అవ్వడం గమనించాను. జయదేవ్ ఉనద్కట్ వేసిన కొన్ని బంతులు అనూహ్యంగా టర్న్ అయ్యాయి. అటువంటి సమయంలో స్పిన్నర్లను తీసుకువస్తే బంతి మరింత టర్న్ అవుతుంది అని భావించాను. అందుకే కృనాల్ చేతికి బంతికి ఇచ్చాను. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక లక్నో వంటి వికెట్‌పై చాలా తెలివగా బ్యాటింగ్ చేయాలి. మేము ఈ మ్యాచ్‌లో ఒక యూనిట్‌గా అదే చేసి చూపించాం. రాబోయే మ్యాచ్‌ల్లో ఇదే రిపీట్ చేస్తాము" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Harry Brook: రూ. 13 కోట్లు పెట్టారు కదా! ఇలాగే ఉంటది.. కానీ పాపం: టీమిండియా మాజీ క్రికెటర్ -
సన్‘రైజ్’ కాలేదు! హైదరాబాద్‌కు రెండో ఓటమి.. కృనాల్ ఆల్‌రౌండ్ షో..
లక్నో: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ సీజన్లో రెండో మ్యాచ్ కూడా కలిసి రాలేదు. సొంతగడ్డపై మొదటి మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇప్పుడు సమష్టి వైఫల్యంతో ప్రత్యర్థి వేదికపై పరాజయాన్ని మూటగట్టుకుంది. శుక్రవారం జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (41 బంతుల్లో 34; 4 ఫోర్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (26 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం లక్నో 16 ఓవర్లలో 5 వికెట్లకు 127 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించారు. బ్యాటింగ్ వైఫల్యం... ఆటగాళ్లు మారినా, సన్‌రైజర్స్ ఆట మారలేదు. మొదటి మ్యాచ్ ఓటమి నుంచి ఆ జట్టు పాఠాలు నేర్చుకున్నట్లుగా లేదు. దాదాపు అదే తరహాలో పేలవ బ్యాటింగ్‌తో మరోసారి టీమ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (8) మళ్లీ విఫలం కాగా, అన్మోల్ కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది. అయితే కృనాల్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ రైజర్స్‌ను దెబ్బ తీసింది. అన్మోల్ను ఎల్బీగా అవుట్ చేసిన కృనాల్ తర్వాతి బంతికి కెపె్టన్ మార్క్రమ్ (0)ను వెనక్కి పంపాడు. హైదరాబాద్ టీమ్‌కు సారథిగా బరిలోకి దిగిన మొదటి మ్యాచ్‌లో మార్క్రమ్ తొలి బంతికే వెనుదిరగాల్సి వచ్చిం ది. హ్యారీ బ్రూక్ (3) కూడా ప్రభావం చూపలేకపోవడంతో స్కోరు 55/4కు చేరింది. ఈ దశలో త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ (16) కలిసి కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే లక్నో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు రావడం కష్టంగా మారిపోవడంతో బంతులు వృథా అయ్యాయి. వీరిద్దరు ఐదో వికెట్‌కు 39 పరుగులు జత చేసినా... ఏకంగా 50 బంతులు తీసుకొని మూడే ఫోర్లు కొట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన సన్ టీమ్ అతి కష్టమ్మీద వంద పరుగులు దాటగలిగింది. చివర్లో అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వేగంగా పరుగులు జోడించగలిగాడు. కీలక భాగస్వామ్యం... ఛేదనలో ఆరంభంలో లక్నో కొంత తడబడింది. పవర్‌ప్లేలో 45 పరుగులు చేసిన ఆ జట్టు మేయర్స్ (13), దీపక్ హుడా (7) వికెట్లు కోల్పోయింది. అయితే రాహుల్, కృనాల్ భాగస్వామ్యం టీమ్‌ను విజయానికి చేరువ చేసింది. వీరిద్దరు ప్రశాంతంగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ ద్వయం మూడో వికెట్‌కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించారు. వీరిద్దరితో పాటు షెఫర్డ్ (0)ను తక్కువ వ్యవధిలో సన్‌రైజర్స్ వెనక్కి పంపగలిగినా... అప్పటికే జెయింట్స్ విజయం దాదాపు ఖాయమైంది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అన్మోల్ప్రీత్ (ఎల్బీ) (బి) కృనాల్ 31; మయాంక్ (సి) స్టొయినిస్ (బి) కృనాల్ 8; త్రిపాఠి (సి) మిశ్రా (బి) యష్ 34; మార్క్రమ్ (బి) కృనాల్ 0; బ్రూక్ (స్టంప్డ్) పూరన్ (బి) బిష్ణోయ్ 3; సుందర్ (సి) హుడా (బి) మిశ్రా 16; సమద్ (నాటౌట్) 21; రషీద్ (సి) హుడా (బి) మిశ్రా 4; ఉమ్రాన్ (రనౌట్) 0; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–21, 2–50, 3–50, 4–55, 5–94, 6–104, 7–108, 8–109. బౌలింగ్: మేయర్స్ 1–0–5–0, ఉనాద్కట్ 3–0–26–0, కృనాల్ 4–0–18–3, యష్ 3–0– 23–1, బిష్ణోయ్ 4–0–16–1, హుడా 1–0–8–0, అమిత్ మిశ్రా 4–0–23–2. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) మయాంక్ (బి) ఫజల్ 13; రాహుల్ (ఎల్బీ) (బి) రషీద్ 35; హుడా (సి అండ్ బి) భువనేశ్వర్ 7; కృనాల్ (సి) అన్మోల్ప్రీత్ (బి) ఉమ్రాన్ 34; స్టొయినిస్ (నాటౌట్) 10; షెఫర్డ్ (ఎల్బీ) (బి) రషీద్ 0; పూరన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (16 ఓవర్లలో 5 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–35, 2–45, 3–100, 4–114, 5–114. బౌలింగ్: భువనేశ్వర్ 2–0– 19–1, సుందర్ 1–0–11–0, ఫజల్ 3–0–13–1, మార్క్రమ్ 2–0–14–0, రషీద్ 3–0–23–2, నటరాజన్ 3–0–23–0, ఉమ్రాన్ 2–0–22–1. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ VS ఢిల్లీ (మ. గం. 3:30 నుంచి) ముంబై VS చెన్నై (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
అమిత్ షాతో పాండ్యా బ్రదర్స్ భేటీ
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను న్యూఇయర్‌ను పురస్కరించుకుని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం షాతో భేటీపై సోషల్ మీడియా వేదికగా ఫోటో షేర్ చేశారు హార్దిక్ పాండ్యా. తన ఇంటికి ఆహ్వానించినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మీతో విలువైన సమయాన్ని గడిపేందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవడం గౌరవంగా భావిస్తున్నాం. ’అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. పాండ్యా స్వస్థలం గుజరాత్ కావడంతోనే షా వారిని కలిసినట్లుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హార్దిక్, క్రునాల్ పాండ్యాలు క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుని సేదతీరుతున్నారు. డిసెంబర్లో బంగ్లాదేశ్ టూర్‌కు హార్దిక్‌కు విశ్రాంతినివ్వగా.. క్రునాల్ పాండ్యా చివరిసారిగా నవంబర్‌లో విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరఫున ఆడారు. ఇటీవలో భారత టీ20 జట్టుకు సారథిగా ఎన్నికయ్యాడు హార్దిక్ పాండ్యా. కొత్త ఏడాదిని శ్రీలంకతో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మొదలు పెట్టనున్నాడు. జనవరి 3 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్లో రోహీత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్లకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. మరోవైపు.. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. Thank you for inviting us to spend invaluable time with you Honourable Home Minister Shri @AmitShah Ji. It was an honour and privilege to meet you. 😊 pic.twitter.com/KbDwF1gY5k — hardik pandya (@hardikpandya7) December 31, 2022 ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్ -
కేజీఎఫ్ హీరోతో పాండ్యా బ్రదర్స్.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్..!
కేజీఎఫ్ మూవీ సృష్టించిన సంచలన అంతా ఇంతా కాదు. రెండు భాగాలు రిలీజై బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యశ్. బాలీవుడ్‌తో సహా దక్షిణాదిలో యశ్ అంటే తెలియని వారు ఉండరు. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే క్రికెట్లో బిజీగా ఉండే పాండ్యా బ్రదర్స్ యశ్‌తో దిగిన ఫోటో అభిమానులను కట్టి పడేస్తోంది. ఈ ఫోటోను హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ ఫోటోలను షేర్ చేస్తూ..' కేజీఎఫ్-3' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ ఫోటోల్లో కృనాల్ పాండ్యా కూడా ఉన్నారు. పాన్-ఇండియా స్టార్‌తో దిగిన ఫోటోలు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. మరికొందరైతే కన్నడ పరిశ్రమకు దక్కినన గొప్ప గౌరవం అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. కేజీఎఫ్ మూడో భాగం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కథ ఇంకా సిద్ధం కాలేదని తెలిపారు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
తండ్రైన కృనాల్ పాండ్య
-
కృనాల్ పాండ్యా వారసుడొచ్చాడు..
Krunal Pandya: టీమిండియా ఆల్‌రౌండర్, హార్ధిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా తండ్రి అయ్యాడు. కృనాల్ భార్య పంఖురి శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ ఇవాళ (జులై 24) మధ్యాహ్నం ట్విటర్ వేదికగా రివీల్ చేశాడు. భార్య పంఖురి చేతిలో ఒదిగిన బిడ్డను ముద్దాడుతూ దిగిన ఫోటోను కృనాల్ ట్విటర్లో షేర్ చేశాడు. కవిర్ కృనాల్ పాండ్యా అంటూ ఫోటోకు క్యాప్షన్‌ను జోడించాడు. Kavir Krunal Pandya 🌎💙👶🏻 pic.twitter.com/uitt6bw1Uo — Krunal Pandya (@krunalpandya24) July 24, 2022 విషయం తెలుసుకున్న సన్నిహితులు, సహచరులు కృనాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది నిమిషాలకే వైరలైంది. దీంతో అభిమానులు కూడా కృనాల్‌ను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. కృనాల్ 2017లో ప్రముఖ మోడల్ పంఖురి శర్మను పెళ్లాడాడు. ఇదిలా ఉంటే, టీమిండియా తరఫున 19 టీ20లు, 5 వన్డేలు ఆడిన కృనాల్.. ఈ ఏడాది ఐపీఎల్లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు వలస వెళ్లాడు. అతను ఇటీవలే ఇంగ్లీష్ కౌంటీ జట్టైన వార్విక్షైర్తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బ్యాటర్ అయిన కృనాల్.. వన్డే అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (26 బంతుల్లో) బాదడంతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. చదవండి: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..? -
వార్విక్షైర్ జట్టుకు ఆడనున్న కృనాల్ పాండ్యా
ఇంగ్లండ్ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ రాయల్ లండన్ కప్‌లో భారత క్రికెటర్ కృనాల్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 2 నుంచి 23 వరకు జరిగే ఈ టోర్నీలో కృనాల్ వార్విక్షైర్ కౌంటీ జట్టు తరఫున ఆడనున్నాడు. 31 ఏళ్ల కృనాల్ భారత్ తరఫున ఐదు వన్డేలు, 19 టి20 మ్యాచ్‌లు ఆడాడు. గత ఏడాది వన్డే ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన కృనాల్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి అరంగేట్రంలో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. -
'నిన్ను మరిచిపోయే స్టేజ్‌కు వచ్చారు.. గోడకు కొట్టిన బంతిలా'
ఐపీఎల్ 2022 సీజన్ చాంపియన్స్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అరంగేట్రం సీజన్లోనే టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. కెప్టెన్‌గా అన్నీ తానై నడిపించిన పాండ్యా ఫైనల్లోనూ 32 పరుగులు చేయడంతో పాటు మూడు కీలక వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడమేగాక జట్టుకు టైటిల్‌ను అందించాడు. అయితే ఇదే హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ ప్రారంభానికి ముందు క్రికెట్ అభిమానుల నుంచి అవమానాలు ఎదురయ్యాయి. గాయంతో టీమిండియాకు కొన్నినెలల పాటు దూరమవ్వడం.. ఆ తర్వాత జట్టులోకి వచ్చినా దారుణ ప్రదర్శన చేయడం.. ముఖ్యంగా టి20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా కాకుండా ఒక బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగినప్పటికి ఘోరంగా విఫలమవ్వడంతో పాండ్యా విమర్శలు వచ్చాయి. అయితే వీటిన్నింటిని ఓర్చుకున్న పాండ్యా తనను విమర్శించిన వారికి ఐపీఎల్‌తోనే సమాధానం ఇచ్చాడు. జాస్ బట్లర్, కేఎల్ రాహుల్ తర్వాత సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా పాండ్యా ఔరా అనిపించాడు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ ప్రదర్శనపై సోదరుడు కృనాల్ పాండ్యా ఎమోషనల్ నోట్ రాయడం వైరల్‌గా మారింది. తన తమ్ముడు దీనికోసం ఎంత కష్టపడ్డాడో కృనాల్ వివరించాడు. ''కంగ్రాట్స్ హార్దిక్.. ఈ విజయం వెనుక నీ కష్టం ఎంత ఉందో నాకు మాత్రమే తెలుసు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ప్రతీరోజు తెల్లవారుజామునే నిద్ర లేవడం.. గంటల పాటు ట్రైనింగ్ సెషన్లో గడపడం, మానసికంగా దృడంగా తయారయ్యేదుకు చాలా కష్టపడ్డావు. నీ నిజాయితీ ఊరికే పోలేదు. ఐపీఎల్ టైటిల్ రూపంలో నీ ముందుకొచ్చింది. కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ అందుకోవడంలో వంద శాతం నువ్వు అర్హుడివి. ఇక క్రికెట్ ఫ్యాన్స్ నీ గురించి ఎలా విమర్శించారో నాకు తెలుసు. అందరు నిన్ను మరిచిపోయే స్టేజ్‌లో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చావు.. నీ పేరు మళ్లీ వాళ్ల నోళ్లలో నానేలా చేశావు.'' అంటూ ఎమెషనల్ అయ్యాడు. ఇక ఐపీఎల్ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. జూన్ 9 నుంచి మొదలుకానున్న టి20 సిరీస్‌లో హార్దిక్ తన మెరుపులు మెరిపిస్తాడోమే చూడాలి. ఇక కృనాల్ పాండ్యా ఈ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ తరపున ఆడాడు. సీజన్లో పెద్దగా ఆకట్టుకోని కృనాల్ 14 మ్యాచ్‌లాడి 183 పరుగులతో పాటు బౌలింగ్‌లో 10 వికెట్లు తీశాడు. చదవండి: Jos Buttler: పరుగులే కాదు.. ప్రైజ్‌మనీ విషయంలోనూ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన..కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా..! My bro 🤗 Only you know the amount of hard work that’s gone behind this success of yours - early mornings, countless hours of training, discipline and mental strength. And to see you lift the trophy is the fruits of your hard work ❤️ You deserve it all and so much more 😘😘 pic.twitter.com/qpLrxmjkZz — Krunal Pandya (@krunalpandya24) May 31, 2022 -
బరోడా జట్టు తరపున ఆడనున్న అంబటి రాయుడు
టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు రాబోయే దేశవాళీ సీజన్లో బరోడా జట్టు తరపున ఆడునున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. రాయుడు ఇప్పటికే బరోడా క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా రాయుడు తన కెరీర్లో ఇప్పటికే బరోడా తరఫున నాలుగు సీజన్లు ఆడాడు. కాగా జూన్‌లో బరోడా సన్నాహక శిబిరంలో రాయుడు చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతేడాది సీజన్లో బరోడా సారథి కృనాల్ పాండ్యాతో విభేదాలు ఏర్పాడిన తర్వాత.. దీపక్ హుడా బరోడా జట్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దీపక్ హుడా ప్రస్తుతం రాజస్థాన్ తరపున ఆడుతున్నాడు. అయితే అతడి స్థానంలో రాయుడును భర్తీ చేయాలని బరోడా క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. ఉమ్రాన్, డీకేలకు అవకాశం -
అన్నాదమ్ముల సవాల్.. కృనాల్, హార్ధిక్లను ఊరిస్తున్న రికార్డులివే..!
ఐపీఎల్ 2022 సీజన్లో అన్నాదమ్ముల జట్లు రెండోసారి ఎదురెదురుపడనున్నాయి. హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్.. కృనాల్ పాండ్యా ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా ఇవాళ (మే 10) మరోసారి అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో చెరి 8 విజయాలు సాధించగా, లక్నో 16 పాయింట్లతో 0.703 రన్‌రేట్, గుజరాత్ 16 పాయింట్లతో 0.120 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సీజన్ తొలి అర్ధ భాగంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా, నేటి మ్యాచ్‌లో రాహుల్ సేన అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన గుజరాత్.. మహ్మద్ షమీ (3/25) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో జట్టును 158 పరుగులకే కట్టడి చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో దీపక్ హుడా (55), ఆయుష్ బదోని (54) అర్ధ సెంచరీలతో రాణించారు. ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు తలో చేయి వేయడంతో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఓవర్లో తెవాతియా (40*) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. నేటి మ్యాచ్‌లో గుజరాత్, లక్నో జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.. గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ ఈ మ్యాచ్‌లో మరో నాలుగు వికెట్లు తీస్తే ఐపీఎల్లో 50 వికెట్ల క్లబ్లో చేరతాడు లక్నో ఆల్‌రైండర్ కృనాల్ నేటి మ్యాచ్‌లో మరో సిక్సర్ బాదితే ఐపీఎల్లో 50 సిక్సర్ల మైలురాయి చేరుకుంటాడు లక్నో ఓపెనర్ డికాక్ మరో 6 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో అరుదైన 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో 5 సిక్సర్లు కొడితే 50 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు లక్నో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ మరో మరో 5 సిక్సర్లు కొడితే 50 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ 100 ఐపీఎల్ వికెట్లకు మరో 6 వికెట్ల దూరంలో ఉన్నాడు లక్నో ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ 50 ఐపీఎల్ వికెట్లకు 3 వికెట్ల దూరంలో ఉన్నాడు చదవండి: టాప్ టు జట్ల మధ్య పోరు.. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: నా లక్కీ చార్మ్ ఈసారి నావైపే.. కాబట్టి: కృనాల్ పాండ్యా
IPL 2022 LSG Vs GT: టీమిండియా ఆటగాళ్లు, పాండ్యా సోదరులు కృనాల్- హార్దిక్ ఐపీఎల్-2022లో వేర్వేరు జట్లకు ఆడుతున్న విషయం తెలిసిందే. గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ ఇద్దరు అన్నదమ్ములు తాజా ఎడిషన్‌లో కొత్త ఫ్రాంఛైజీల్లో భాగమయ్యారు. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా నియమితుడు కాగా.. కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఉన్నాడు. ఇక అరంగేట్రంలోనే అదరగొడుతున్న ఈ రెండు జట్లు ఆడిన 11 మ్యాచ్‌లలో చెరో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించాయి. అయితే నెట్‌రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న లక్నో పట్టికలో ప్రథమ స్థానంలో ఉండగా.. గుజరాత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పాండ్యా బృందం, రాహుల్ సేన మంగళవారం తలపడనున్నాయి. కాగా గత మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించగా.. ఈసారి ఎలాగైనా పైచేయి సాధించాలని లక్నో భావిస్తోంది. ఈ నేపథ్యంలో కృనాల్ పాండ్యా ఆసక్తికర ట్వీట్ చేశాడు. హార్దిక్ పాండ్యా కుమారుడు అగస్త్య ఫొటోలు షేర్ చేసిన అతడు.. ‘‘ఈసారి నా లక్కీ చార్మ్ నా వైపు ఉన్నాడు’’ అని కామెంట్ చేశాడు. కాబట్టి విజయం తమనే వరిస్తుందని పరోక్షంగా పేర్కొన్నాడు. ఇందులో చిన్నారి అగస్త్య లక్నో జెర్సీ ధరించి ఉండటం చూసిన అభిమానులు.. ‘‘క్యూట్‌గా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ బ్రో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా లక్నో, గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చదవండి👉🏾Rohit Sharma: బుమ్రా స్పెషల్.. అది ముందే తెలుసు.. అయినా చెత్త ప్రదర్శన.. అంతా వాళ్లే చేశారు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Got my lucky charm on my side for tomorrow’s game @hardikpandya7 😉 pic.twitter.com/OiDfEMHeHJ — Krunal Pandya (@krunalpandya24) May 9, 2022 -
IPL 2022: ఆయన వల్లే ఇదంతా.. బ్యాట్‌తో కూడా రాణిస్తా: కృనాల్
IPL 2022 PBKS Vs LSG: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా అదరగొట్టాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ను లక్నో బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. దుష్మంత చమీర, కృనాల్ పాండ్యా, మోహ్సిన్ ఖాన్ ధాటికి పంజాబ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో రాహుల్ బృందం.. మయాంక్ సేనపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ వేసిన కృనాల్ పాండ్యా కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మాట్లాడుతూ తన ఆట పట్ల సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘‘గత ఏడెమినిది నెలలుగా కఠినంగా శ్రమిస్తున్నాను. బాగా బౌలింగ్ చేయగలుగుతున్నాను. ఇక్కడ రాహుల్ సాంఘ్వీ పేరు తప్పక ప్రస్తావించాలి. నా నైపుణ్యాలు మెరుగుపరచుకోవడంలో ఆయన పాత్ర ఉంది. ఆయన సలహాలు, సూచనలు నాకెంతో ఉపకరించాయి’’ అని టీమిండియా మాజీ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ రాహుల్ సంఘ్వీ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. బాల్‌ను రిలీజ్ చేసే సమయంలో ఎత్తు, గ్రిప్ సహా పలు టెక్నిక్ అంశాలపై దృష్టి సారించినట్లు వెల్లడించాడు. ఇక బ్యాటింగ్ చేయడం తనకెంతో ఇష్టమన్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా.. ఇప్పటి వరకు పెద్దగా రాణించలేకపోయానని, ఇంకా మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఎదుర్కొన్న కృనాల్ 7 పరుగులు చేసి.. కగిసో రబడ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ మ్యాచ్-42: పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్ స్కోర్లు లక్నో- 153/8 (20) పంజాబ్- 133/8 (20) చదవండి👉🏾 చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి.. ఇప్పుడిలా! That's that from Match 42.@LucknowIPL win by 20 runs and add two more points to their tally. Scorecard - https://t.co/H9HyjJPgvV #PBKSvLSG #TATAIPL pic.twitter.com/dfSJXzHcfG — IndianPremierLeague (@IPL) April 29, 2022 -
IPL 2022: పాపం పొలార్డ్.. కృనాల్ ఓవరాక్షన్ భరించలేకున్నాం!
IPL 2022 MI Vs LSG- Krunal Pandya- Kieron Pollard: లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా తీరును టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ విమర్శించాడు. ఎదుటి వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వ్యవహరించాలంటూ హితవు పలికాడు. స్నేహితుడే కదా అని ఇష్టారీతిన ప్రవర్తించడం సరికాదని, ఎదుటివారి మనోభావాలను గౌరవించాలని సూచించాడు. కాగా ముంబై ఇండియన్స్, లక్నో జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో ముంబైపై 36 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, చివరి ఓవర్లో కృనాల్ పాండ్యా.. ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌తో వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా పొలార్డ్ కృనాల్ పాండ్యాను అవుట్ చేశాడు. ఇక ముంబై లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ వికెట్‌ను కృనాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశతో క్రీజును వీడుతున్న పొలార్డ్ వీపు పైకి దుమికి కృనాల్ అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు. అయితే, పొలార్డ్ ఎలాంటి స్పందనా లేకుండా భారంగా పెవిలియన్ చేరాడు. ఈ ఘటనపై స్పందించిన పార్థివ్ పటేల్ క్రిజ్బజ్తో మాట్లాడుతూ.. ‘‘కృనాల్, పొలార్డ్ మంచి స్నేహితులు. కానీ, ప్రత్యర్థులుగా మైదానంలో దిగినపుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. పొలార్డ్ పరుగులు చేయలేకపోవడంతో నిరాశలో ఉన్నాడు. ముంబై మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది. అలాంటపుడు ఎవరి మానాన వారిని వదిలేయాలి. అంతగా చనువు ఉంటే.. డ్రెస్సింగ్‌రూంలో ‘స్నేహితుల’తో ఏడాదంతా ఎంత సరదాగా ఉన్నా పర్లేదు కానీ.. మైదానంలో ఇలా చేయకూడదు. ఈ రియాక్షన్ నాకైతే మరీ ఓవర్‌గా అనిపిస్తోంది’’ అని కృనాల్ తీరును తప్పుబట్టాడు. ఇక మరో మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘‘ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు. ఒక ఆటగాడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితిలో ఇలాంటివి చేయకపోవడం మంచిది. ఆ సమయంలో అతడి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. ఒకవేళ పొలార్డ్ వెనక్కి తిరిగి సమాధానం ఇచ్చి ఉంటే ఏమయ్యేది? తను జట్టును గెలపించలేకపోతున్నాననే నిరాశతో వెనుదిరిగినపుడు కృనాల్ ఇలా చేయడం నిజంగా టూ మచ్’’ అని కృనాల్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. కాగా గతంలో పొలార్డ్, కృనాల్ ఒకే ఫ్రాంఛైజీ(ముంబై)కి ఆడారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐపీఎల్-2022లో భాగంగా ప్రత్యర్థులుగా మైదానంలోకి దిగుతున్నారు. ఇక భారీ హిట్టర్‌గా పేరొందిన పొలార్డ్ ఈ సీజన్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడికి తాజా ఐపీఎల్ ఎడిషన్ ఏమాత్రం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి 115 పరుగులు(అత్యధిక స్కోరు: 25) చేసిన ఈ వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్.. 3 వికెట్లు తీశాడు. ఇక లక్నోతో మ్యాచ్‌లో పొలార్డ్ చేసిన స్కోరు: 20 బంతుల్లో 19 పరుగులు. ఇదిలా ఉంటే.. ముంబై వరుసగా ఎనిమిదో ఓటమి మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఈ జట్టు నిష్క్రమించినట్లయింది. చదవండి👉🏾 Trolls On Ishan Kishan: ధర 15 కోట్లు.. ఇషాన్ ఇదేమైనా టెస్టు మ్యాచ్ అనుకున్నావా? పాపం ముంబై ఫ్రాంఛైజీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); That's that from Match 37 and @LucknowIPL take this home with a 36-run win over #MumbaiIndians Scorecard - https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/9aLniT8oHi — IndianPremierLeague (@IPL) April 24, 2022 -
'ఒకప్పుడు కొట్టుకునే స్థాయికి '.. కట్‌చేస్తే
కృనాల్ పాండ్యా.. దీపక్ హుడా... ఈ ఇద్దరి పేర్లు వినగానే టక్కున గుర్తుచ్చేది 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో జరిగిన గొడవ. దాదాపు కొట్టుకునే స్థాయికి వెళ్లిన ఈ ఇద్దరిలో ఎవరు తగ్గలేదు. అప్పటి బరోడా జట్టుకు కలిసి ఆడుతున్న సమయంలో కృనాల్ తనపై దౌర్జన్యం చేశాడని దీపక్ హుడా ఆరోపించాడు. అటు కృనాల్ కూడా ఏమాత్రం తగ్గలేదు. అతని మిస్‌బిహేవియర్ నాకు నచ్చలేదని.. అందుకే తిట్టానంటూ వివరణ ఇచ్చాడు. ఈ ఉదంతం తర్వాత దీపక్ హుడా బరోడాకు గుడ్‌బై చెప్పి రాజస్తాన్ జట్టులోకి వెళ్లిపోయాడు. అప్పటినుంచి కృనాల్, దీపక్ హుడాలు ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. Courtesy: IPL Twitter తాజాగా ఐపీఎల్ ఈ ఇద్దరిని మరోసారి ఎదురుపడేలా చేసింది. గత ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో దీపక్ హుడా, కృనాల్‌లను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. అంత గొడవ జరిగిన తర్వాత ఈ ఇద్దరు ఎలా ఉంటారోనని అభిమానుల్లోనూ ఆసక్తి కలిగింది. అయితే చేదు జ్ఞాపకాలను మరిచిపోయి ఇద్దరు ఒకరినొకరు అభినందించుకోవడంతో గొడవకు ఎండ్‌కార్డ్ పడినట్లయింది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కృనాల్ వికెట్ తీసిన సందర్భంలో దీపక్ హుడా అతని వద్దకు వచ్చి అభినందిస్తూ హత్తుకున్నాడు. మ్యాచ్ అనంతరం దీపక్ హుడా దైనిక్ జాగరణ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో కృనాల్‌తో పంచుకున్న సంతోషాన్ని వివరించాడు . ''కృనాల్ పాండ్యా నాకు సోదరుడులాండి వాడు. అన్నదమ్ముళ్లు అంటేనే సరదాగా కొట్టుకుంటారు. ఆట అన్నప్పుడు గొడవలు సాధారణం. అప్పుడు తప్పు అనిపించింది.. అందుకే కృనాల్‌పై విరుచుకుపడ్డా. అవన్నీ మరిచిపోయాం. ఇప్పుడు ఇద్దరం ఒకే జట్టుకు ఆడుతున్నాం. మా ఏకైక లక్ష్యం లక్నో సూపర్ జెయింట్స్‌ను విజేతగా నిలపడమే.'' అని చెప్పుకొచ్చాడు. ఇది విన్న అభిమానులు..''శత్రుత్వం ఎప్పటికి శాశ్వతం కాదని మరోసారి నిరూపించారు'' అని కామెంట్ చేశారు. చదవండి: మ్యాచ్ గెలిచిన సంతోషం ముద్దుతో ఉక్కిరిబిక్కిరి; ట్విస్ట్ ఏంటంటే IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం! -
'నట్టూ భయ్యా.. ఎంతకాలం అయ్యిందో ఇలాంటి బంతి చూసి'
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలర్ నటరాజన్ సూపర్ బంతితో మెరిశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ నటరాజన్ వేశాడు. క్రీజులో కృనాల్ పాండ్యా ఉన్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని నట్టూ యార్కర్ వేశాడు. కృనాల్ దాన్ని ఎదుర్కొనే క్రమంలో విఫలమయ్యాడు. అయితే బంతి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఇక్కడివరకు బాగానే ఉంది. సాధారణంగా బంతికి ఏదైనా అడ్డుపడితే నిధానంగా వెళ్లడం చూస్తుంటాం. కానీ నట్టు వేసిన బంతి ఎంత వేగంగా వికెట్లను గిరాటేసిందో.. అంతే వేగంగా బౌండరీ లైన్‌ను దాటింది. కృనాల్ మొదట బంతి మిస్ అయి బౌండరీ వెళ్లిందనుకున్నాడు.. కానీ తిరిగి చూస్తే బౌల్డ్ అయినట్లు తెలిసింది. దీంతో నిరాశగా పెవిలియన్‌వైపు నడిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నట్టూ బౌలింగ్ చూసిన ఫ్యాన్స్.. ''ఎంతకాలం అయింది నీ దగ్గర్నుంచి ఇలాంటి బంతి చూసి..'' అంటూ కామెంట్ చేశారు. నటరాజన్ అద్బుత యార్కర్ బంతి కోసం క్లిక్ చేయండి చదవండి: సుందర్- ఎవిన్ లూయిస్ చిత్రమైన యుద్దం.. చివరికి -
IPL 2022 GT vs LSG: అరె తమ్ముడు.. సారీ రా! పర్లేదు మేము మ్యాచ్ గెలిచాం కదా!
Krunal Pandya Vs Hardik Pandya- Video Viral: తోడబుట్టిన అన్నదమ్ములు... అంతకుముందు జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్‌లోనూ ఒకే జట్టుకు ఆడారు.. అలాంటిది తాజా సీజన్‌తో ఒక్కసారిగా ‘ప్రత్యర్థులు’గా మారిపోయారు. నువ్వా- నేనా అంటూ పోటీ పడ్డారు. అయితే, ఇద్దరినీ ‘విజయం’ వరించింది. అన్నకు వికెట్ రూపంలో అదృష్టం కలిసి వస్తే.. తమ్ముడు ఏకంగా మ్యాచ్ గెలిచేశాడు. ఈ ప్రస్తావనంతా పాండ్యా బ్రదర్స్ గురించే! టీమిండియా ఆటగాళ్లైన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఐపీఎల్-2022 సీజన్లో వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అది కూడా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లకు! హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ కాగా.. కృనాల్ లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆడుతున్నాడు. ఇక సోమవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక లక్ష్యం ఛేదించే క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ సారథి హార్దిక్.. తన అన్న కృనాల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 11వ ఓవర్ మొదటి బంతికే మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అయితే, ఆ సమయంలో హార్దిక్ నిరాశగా వెనుదిరగగా.. కృనాల్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు... ‘‘అరె చోటే(తమ్ముడు)... సారీ రా..! నన్ను క్షమించురా అన్నట్లుగా పాపం కృనాల్ ముఖం దాచుకున్నాడు. అయినా ఆటలో ఇవన్నీ సహజమే కదా! లైట్ తీసుకోవాలి బ్రదర్! అయినా మీ తమ్ముడు మ్యాచ్ గెలిచాడుగా’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Hardik Out On Krunal Pandya Ball.. See the reaction of hardik wife’s after dismissal on youngest Brother ball 🏏👌😊 #krunal #HardikPandya #GujaratTitans #GTvsLSG #LucknowSuperGiants pic.twitter.com/LKXAsCPJqM — Ankit Kunwar (@TheAnkitKunwar) March 28, 2022 ఇక ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది విజయంతో అరంగేట్రం చేసింది. What a game. Went down to the wire and it is the @gujarat_titans who emerge victorious in their debut game at the #TATAIPL 2022.#GTvLSG pic.twitter.com/BQxkMXc9QL — IndianPremierLeague (@IPL) March 28, 2022 చదవండి: IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్ పాండ్యా "The family is neutral and happy," @hardikpandya7 on the mini battle between the Pandya brothers 😀😀#TATAIPL #GTvLSG pic.twitter.com/FlspapmnRK — IndianPremierLeague (@IPL) March 28, 2022 -
IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం.. మా కుటుంబం హ్యాపీ: హార్దిక్ పాండ్యా
IPL 2022- Gujarat Titans Hardik Pandya Comments: ‘‘ఈ మ్యాచ్, ఇందులో గెలిచిన తీరు మాకు చాలా పాఠాలు నేర్పించింది. నిజానికి షమీ తన అద్భుత ప్రదర్శనతో మాకు శుభారంభం అందించాడు. ఇకపై నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక అనుభవజ్ఞుడైన ఆటగాడిగా ఒత్తిడిని జయించగలను.. కాబట్టి మిగతా వాళ్లకు కాస్త స్వేచ్ఛగా ఆడే వెసలుబాటు ఉంటుంది. ఎవరో ఒకరి మీద ఆధారపడటం కాకుండా మేమంతా సమష్టి ప్రదర్శనతో జట్టుగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. మనోహర్ రూపంలో ప్రతిభావంతుడైన ఆటగాడు మాకు దొరికాడు. భవిష్యత్తు ఆశాకిరణం తను. ఇక తెవాటియా ఒక సంచలనం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’’ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు సభ్యులపై ప్రశంసలు కురిపించాడు. ఇక లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో తన సోదరుడు కృనాల్ పాండ్యా తనను అవుట్ చేశాడని, తానేమో మ్యాచ్ గెలిచానని.. అందుకే తమ కుటుంబం మొత్తం ఇప్పుడు సంతోషంగా ఉందని చమత్కరించాడు. కాగా ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ(3 వికెట్లు) బంతితో రాణించగా.. రాహుల్ తెవాటియా(40 పరుగులు- నాటౌట్) జట్టుకు అవసరమైన సమయంలో పరుగులు సాధించాడు. దీంతో లక్నోపై గుజరాత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన హార్దిక్ పాండ్యా పైవిధంగా స్పందించాడు. ఇక హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా లక్నో జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుత సీజన్లో తొలిసారిగా వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థులుగా ఆడిన తొలి మ్యాచ్‌లో కృనాల్ హార్దిక్‌ను అవుట్ చేశాడు. తాను మాత్రం 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. "The family is neutral and happy," @hardikpandya7 on the mini battle between the Pandya brothers 😀😀#TATAIPL #GTvLSG pic.twitter.com/FlspapmnRK — IndianPremierLeague (@IPL) March 28, 2022 -
కృనాల్ పాండ్యా ట్విటర్ అకౌంట్ హ్యాక్.. మద్యం మత్తులో తనే అలా..!
Krunal Pandyas Twitter Account Hacked: టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. అతని అకౌంట్ నుంచి చిత్ర విచిత్ర ట్వీట్లు రావడంతో ఈ విషయం స్పష్టమైంది. బిట్ కాయిన్ కోసం తన అకౌంట్‌ను అమ్మేస్తానంటూ, ఓ అమ్మాయి అంటే తనకి ఇష్టమంటూ కృనాల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్లు వచ్చాయి. దీంతో తన అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న విషయాన్ని గ్రహించిన కృనాల్.. సదరు ట్వీట్లతో తనకెటువంటి సంబంధం లేదంటూ మరో ఖాతా ద్వారా వెల్లడించాడు. అయితే, ఈ విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌తో ముడి పెడుతున్న నెటిజన్లు.. కృనాల్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది ఓ టోర్నీ సందర్భంగా తనని అందరి ముందు బూతులు తిట్టి, అవమానించాడంటూ నాటి బరోడా కెప్టెన్‌గా ఉన్న కృనాల్‌పై ఆ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న దీపక్ హూడా స్థానిక క్రికెట్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన బరోడా క్రికెట్ అసోసియేషన్.. అనూహ్యంగా దీపక్ హుడాపై నిషేధం వేటు వేసింది. దీంతో బరోడా నుంచి రాజస్థాన్‌కు వలస వెళ్లిన హూడా.. అనంతరం జరిగిన దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి, తాజాగా విండీస్ టూర్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. సరిగ్గా దీపక్ హూడాకు టీమిండియా నుంచి పిలుపు వచ్చిన రోజే, కృనాల్ ట్విటర్ అకౌంట్ నుంచి వింత వింత ట్వీట్లు రావడంతో ఈ విషయాన్ని గతంలో హూడాతో ఉన్న విభేదాలకు లింక్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. హూడా టీమిండియాకు ఎంపిక కావడంతో కృనాల్ మతి భ్రమించి, తనే స్వయంగా ఇలా చేసుకుంటాడని కొందరు, మద్యం మత్తులో కృనాల్ ఈ ట్వీట్లు చేసుంటాడని మరికొందరు అంటున్నారు. కృనాల్ అకౌంట్ ఒకే ఫోన్ నుంచి రెండు సార్లు లాగిన్ అయ్యిందని, అకౌంట్ హ్యాక్ అయితే ఇలా చేయడం కుదరదని నిపుణులు తేల్చడంతో మనోడే హూడా టీమిండియాకు ఎంపిక కావడం జీర్ణించుకోలేక, మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా టీమిండియాలోకి ఆరంగ్రేటం చేసిన కృనాల్.. మొదటి వన్డేలోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా.. అనంతరం శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో విఫలం కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. చదవండి: వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా? -
Krunal Pandya: కృనాల్ పాండ్యా సంచలన నిర్ణయం.. గుడ్‌బై చెప్పేశాడు!
Krunal Pandya Steps Down As Baroda Captain Why Report Says This: టీమిండియా ఆల్‌రౌండర్, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. బరోడా జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు కృనాల్ బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) అధ్యక్షుడు ప్రణశ్ అమిన్‌కు శుక్రవారం ఇ- మెయిల్ పంపాడు. కాగా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లతో విభేదాలు తలెత్తిన కారణంగానే కృనాల్ పాండ్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం... ‘‘ప్రస్తుత దేశవాళీ సీజన్లో బరోడా కెప్టెన్‌గా కొనసాగబోను. అయితే, సెలక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటాను. జట్టు కోసం ఆడతాను. ఆటగాడిగా బరోడా క్రికెట్ కోసం నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తాను. జట్టు ప్రయోజనాల కోసం నా వంతు కృషి చేస్తాను. ఎల్లప్పుడూ జట్టు మెరుగైన ప్రదర్శన కోసం పాటుపడతాను’’అని కృనాల్ పాండ్యా మెయిల్లో పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ ట్రోఫీలో కృనాల్ సారథ్యంలోని బరోడా జట్టు దారుణంగా విఫలమైంది. ఐదింట కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి గ్రూపు-బిలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక ఆటగాడిగా కూడా కృనాల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టోర్నీ మొత్తంలో కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. 5.94 ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. జట్టు ఎంపిక విషయంలో కృనాల్ తనకు నచ్చిన ఆటగాళ్ల వైపే మొగ్గు చూపాడంటూ ఆరోపణలు వచ్చాయని బీసీఏ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఓ ఆటగాడు సెలక్టర్లతో వాదనకు దిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కృనాల్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పగా.. అతడి స్థానంలో బీసీఏ కేదార్ దేవ్‌ధర్‌కు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది తమిళనాడు ఈ దేశవాళీ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో కర్ణాటకను ఓడించి మూడోసారి ట్రోఫీని గెలిచింది. ఇక కృనాల్ విషయానికొస్తే.. టీ20ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు... ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో వన్డేల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చదవండి: IND Vs NZ: సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే.. -
Hardik Pandya: అలా జరగనట్లయితే పెట్రోల్ పంపులో పనిచేసేవాడిని.. నిజం..
Otherwise I would be working at a petrol pump Says Hardik Pandya: ఆటగాడి జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. వృత్తిగతంగా ముందుకు వెళ్లేందుకు, ప్రేరణ పొందేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నాడు. డబ్బు కారణంగానే జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పుకొచ్చాడు. కాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా టీమిండియా, ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అతడి సోదరుడు కృనాల్ పాండ్యా సైతం క్రికెటర్‌గా మంచి గుర్తింపు పొందాడు. భారత జట్టుకు ఆడుతున్న ఈ అన్నదమ్ములు.. ఐపీఎల్‌లోనూ ఒకే టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా... ‘‘ఐపీఎల్ వేలంలో భారీ మొత్తంలో ఆఫర్ దక్కించుకునే ఆటగాళ్లు.. తాము ఆ ధరకు అమ్ముడుపోయేందుకు అర్హులమనే భావనలోకి వెళ్తారు కదా? ఇలాంటివి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసే, ఆలోచనలను పక్కదోవ పట్టించే అంశాలుగా పరిణమిస్తాయి కదా’’ అన్న ప్రశ్న హార్దిక్‌కు ఎదురైంది. అలా అయితే పెట్రోల్ పంపులో పనిచేసేవాడిని ఇందుకు బదులుగా... ‘‘అసలేం జరుగుతుందో అర్థం చేసుకోగలిగే శక్తి మనకు ఉండాలి. నేను, కృనాల్ దృఢచిత్తం కలిగిన వాళ్లం. ఐపీఎల్లో కచ్చితంగా డబ్బు దొరుకుతుందనే విషయం మాకు తెలుసు. అయితే, డబ్బు వచ్చినంత మాత్రాన ఆలోచనలు మారకూడదు. కాళ్లు నేల మీదే ఉండాలి. డబ్బు మంచిది సోదరా! ఎన్నో మార్పులు తీసుకువస్తుంది. అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ. నాకు ఇలాంటి అవకాశాలు రాకపోయినట్లయితే.. ఇప్పటికి ఏ పెట్రోల్ పంపులోనూ పనిచేస్తూ ఉండేవాడిని. నేనేమీ సరదాకి ఈ మాట చెప్పడం లేదు. నా వరకు కుటుంబమే నా మొదటి ప్రాధాన్యత. నా కుటుంబ సభ్యులకు మంచి జీవితం ఇవ్వడానికి నేను ఇలాంటి పనులు చేసేందుకు వెనుకాడను’’ అని పేర్కొన్నాడు. కాబట్టి ఆటతో పాటు డబ్బు కూడా ముఖ్యమే అని చెప్పుకొచ్చాడు. డబ్బు దండిగా దొరకనట్లయితే... ఎంత మంది క్రికెట్ ఆడతారో తనకైతే తెలీదంటూ హార్దిక్ పాండ్యా.. తనదైన స్టైల్లో పంచ్ వేశాడు. మరి మీరేమంటారు?! కాగా ఐపీఎల్-2021లో 11 మ్యాచ్‌లలో 127 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా... టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి సిద్ధమవుతున్నాడు. చదవండి: Prithvi Shaw: ఖరీదైన కారు కొన్న పృథ్వీ షా.. ధర ఎంతంటే! ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలం సందర్భంగా హార్దిక్ పాండ్యా షేర్ చేసిన వీడియో View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
ఔటవ్వాల్సింది బతికిపోయాడు.. కృనాల్, రోహిత్ క్రీడాస్పూర్తి
Rohit Sharma And Krunal Pandya Great Sportsmanship.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, కింగ్స్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మలు ప్రదర్శించిన క్రీడాస్పూర్తికి ఫ్యాన్స్‌తో పాటు కేఎల్ రాహుల్ కూడా ఫిదా అయ్యాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 6వ ఓవర్ కృనాల్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఓవర్ చివరి బంతిని గేల్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రాహుల్ అడ్డుగా రావడంతో అతని చేతికి బంతి తగిలి కృనాల్ వైపు వెళ్లింది. కాగా అప్పటికే రాహుల్ క్రీజుదాటి బయటికి వెళ్లడం.. కృనాల్ బంతిని వికెట్ల మీదకు విసరడం జరిగిపోయాయి. చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు Courtesy: IPL Twitter వాస్తవానికి కేఎల్ రాహుల్ అవుటవ్వాల్సిందే. అంపైర్ కూడా థర్డ్ అంపైర్‌కు సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. అయితే రాహుల్ ఏంటిది అన్నట్లుగా కృనాల్ వైపు చూశాడు. కృనాల్ కూడా అంపైర్ వద్దకు వెళ్లి తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రోహిత్‌కు కూడా అప్పీల్ వద్దంటూ వివరించాడు. దీంతో రోహిత్ వెనక్కి తగ్గాడు. ఓవర్ ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ కృనాల్, రోహిత్‌ల వైపు చూస్తూ థ్యాంక్స్ అనే అర్థం వచ్చేలా బొటనవేలితో థంప్సమ్ గుర్తు చూపించాడు. అలా రాహుల్ ఔటవ్వాల్సినప్పటికీ.. రోహిత్, పాండ్యాలు క్రీడాస్పూర్తి ప్రదర్శించడంతో బతికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత రాహుల్ 21 పరుగులు చేసి పొలార్డ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. Courtesy: IPL Twitter కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల నిలకడైన బౌలింగ్‌కు పంజాబ్ పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఎయిడెన్ మక్రమ్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపక్ హుడా 28 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, పొలార్డ్ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్, రాహుల్ చహర్ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: IPL 2021: కొద్దిలో తప్పించుకున్నాడు.. లేదంటే మొహం పచ్చడయ్యేది pic.twitter.com/7YsM7OyL4w — Simran (@CowCorner9) September 28, 2021 -
T20 World Cup: ఆ ఇద్దరిని సెలక్ట్ చేయాల్సింది: ఎమ్మెస్కే ప్రసాద్
MSK Prasad On T20 World Cup Squad Selection: వచ్చే నెలలో మరో మెగా క్రికెట్ ఈవెంట్‌కు తెరలేవనుంది. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ మేజర్ టోర్నీ కోసం ఇప్పటికే ప్రధాన దేశాలన్నీ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, ఈ ఎంపికపై ఇప్పటికీ కొంతమంది మాజీ సెలక్టర్లు పెదవి విరుస్తున్నారు. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ సెలక్టర్ సబా కరీం అభ్యంతరం వ్యక్తం చేయగా.. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు చోటు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్‌తక్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ టోర్నమెంట్లలో శిఖర్ ధావన్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అతడి సేవలు జట్టుకు అవసరం. అలాగే కృనాల్ పాండ్యా కూడా.. గత రెండు, మూడేళ్లుగా టీ20 ఫార్మాట్లో రాణిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. టీ20 జట్టును ఎంపిక చేసే సమయంలో సెలక్టర్లు ఈ విషయాలు ఆలోచించాల్సి ఉండాల్సింది. వీళ్లిద్దరినీ ఎంపిక చేయాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ధవన్ ప్రస్తుత సీజన్ అత్యధిక పరుగుల జాబితాలో 422 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాహుల్ చహర్ ఎంపిక నేపథ్యంలో ఎమ్మెస్కే మాట్లాడుతూ.. ‘‘టీమిండియా టీ20 బౌలర్లలో యజువేంద్ర చహల్ అత్యుత్తమ ఆటగాడిగా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా వరుస మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో రాహుల్ చహర్ సైతం ఐపీఎల్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. వీరిద్దరి మధ్య పోటీ నెలకొన్నపుడు తాజా పర్ఫామెన్స్‌ను బట్టి సెలక్టర్లు చహర్ వైపు మొగ్గు చూపారు. ఈ ఎంపిక సైతం చర్చనీయాంశమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దుబాయ్‌లో అక్టోబరు 24న జరిగే మ్యాచ్‌తో టీమిండియా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది. చదవండి: IPL 2021: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. ఇంటి దారి పట్టిన స్టార్ ఆల్‌రౌండర్ -
కృనాల్‌కు కరోనా.. సంచలన విషయాలు వెలుగులోకి..!
ముంబై: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇటీవలే ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తొలుత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా వైరస్ బారిన పడగా.. అనంతరం మరో ఇద్దరు ఆటగాళ్లకు వైరస్ సోకింది. అయితే కృనాల్ కరోనా వ్యవహారంలో కొన్ని సంచలన నిజాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కృనాల్ గొంతునొప్పి వస్తోందని చెప్పిన వెంటనే(జులై 26) బీసీసీఐ వైద్యుడు అభిజిత్ సల్వీ ర్యాపిడ్ టెస్ట్ చేయలేదని తెలుస్తోంది. అంతేకాకుండా జట్టు సమావేశంలో పాల్గొనేందుకు కూడా సదరు వైద్యుడు కృనాల్‌కు అనుమతి ఇచ్చాడట. అయితే, గొంతు నొప్పి తీవ్రం కావడంతో ఆ మరుసటి రోజున(జులై 27) కృనాల్‌కు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో చేసేదేమీ లేక ఆ రోజు జరగాల్సిన మ్యాచ్‌ను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ, లంక బోర్డులు ప్రకటించాయి. కృనాల్‌తో సన్నిహితంగా ఉన్న ఎనిమిది మందికీ పరీక్షలు చేయగా, అప్పుడు అందరికీ నెగెటివ్ అనే వచ్చింది. అయితే, శ్రీలంక నుంచి బయల్దేరే ముందు కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చహల్‌కు పాజిటివ్ అని తేలింది. ఇదిలా ఉంటే, లంక పర్యటనలో మూడు వన్డేల సిరీస్, తొలి టీ20 సజావుగా సాగాయి. మొదటి టీ20 తర్వాత కృనాల్ కరోనా బారిన పడటంతో రెండో టీ20ని ఒక రోజు వాయిదా వేశారు. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందిని ఐసోలేషన్‌కు తరలించారు. దీంతో స్టార్ ఆటగాళ్లు చివరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు. 11 మంది అందుబాటులో లేకపోవడంతో.. లంక పర్యటనకు నెట్ బౌలర్లుగా వెళ్లిన వారు జట్టులోకి వచ్చారు. దాంతో జట్టు బలహీనంగా మారి 1-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది. -
IND Vs SL: నేటి మ్యాచ్ యధాతథం.. కెప్టెన్‌గా భువీ..?
కొలంబో: టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ20 నేటికి వాయిదా పడటంతో పాటు జట్టు సమీకరణలంతా ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కృనాల్ గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో అతడికి కరోనా పరీక్ష నిర్వహించారు. ఇందులో అతనికి పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత భారత బృందం మొత్తానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే కృనాల్ సహా అతనికి అతిసమీపంగా మెలిగిన ఎనిమిది మంది(పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చహల్, శిఖర్ ధవన్, మనీష్ పాండే) ఆటగాళ్లను ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. దీంతో మిగతా టీ20ల నుంచి వారంతా తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జట్టులో కేవలం నలుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు(దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు సామ్సన్, నితీష్ రాణా) మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై చర్చించిన బీసీసీఐ.. సిరీస్ యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించింది. దీంతో తదుపరి రెండు మ్యాచ్‌లకు జట్టు కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత భారత జట్టు: దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు సామ్సన్ (కీపర్), నితీష్ రాణా, దీపక్ చహార్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, నవదీప్ సైనీ, చేతన్ సకారియా. -
అయ్యో సూర్య, పృథ్వీ పరిస్థితి ఏంటో?!
వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుగైన ప్లేయర్‌గా గుర్తింపు... సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌తో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం... ప్చ్.. అయినా రెండుసార్లు బెంచ్‌కే పరిమితం.. ముచ్చటగా మూడోసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. అడుగుపెట్టగానే సిక్సర్‌తో మొదలెట్టి 28 బంతుల్లోనే అర్థసెంచరీతో రికార్డు... ఇక ప్రస్తుత శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డేల్లోనూ అరంగేట్రం... ప్రతిభ ఆధారంగానూ, ఇంగ్లండ్ ప్రస్తుత సిరీస్‌కు ఎంపికైన ఇతర క్రికెటర్లు గాయాల బారిన పడటం మూలాన.. టెస్టుల్లోనూ అరంగేట్రం చేసే అవకాశం.. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.. అవును టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గురించే ఈ ఉపోద్ఘాతం. అన్నీ సజావుగా సాగితే.. సూర్య.. కోహ్లి కెప్టెన్సీలో సంప్రదాయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయం అని ఫ్యాన్స్ సంబరపడి పోతున్న సమయం. ఇంతలోనే కృనాల్ పాండ్యాకు కరోనా సోకిందన్న వార్త అభిమానులను కలవరపెడుతోంది. అతడితో పాటు సూర్యకుమార్, పృథ్వీ షా కూడా ఒకే గదిలో ఉండటమే ఇందుకు కారణం. కాబట్టి వీరిద్దరి ఇంగ్లండ్ ప్రయాణం సందిగ్ధంలో పడిపోయింది. ఒకవేళ నెగటివ్ వచ్చినా.. ఆగష్టు 4 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్ నాటికి అక్కడికి చేరుకుని క్వారంటైన్ పూర్తి చేసుకునే అవకాశం లేదు. దీంతో వీరిద్దరి స్థానంలో టెస్టు సిరీస్‌కు వేరే ఆటగాళ్లను ఎంపిక అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీదైన రోజు నిన్నెవరూ ఆపలేరు ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘‘అయ్యో పాపం సూర్య. నీకు ఏదీ అంత తేలికగా దక్కదు. అయినా నీదైన రోజు నువ్వు చెలరేగి ఆడగలవు. ఏదేమైనా కృనాల్ పాండ్యాకు కరోనా సోకడం.. ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న రెండో టీ20ను వాయిదా వేయడంతో పాటుగా... సూర్య, పృథ్వీ ఇంగ్లండ్ పయనానికి ఎసరు పెట్టింది. చూడాలి మరి.. ఏం జరుగుతుందో’’ అంటూ క్రికెట్ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు. ఇక టీ20 మ్యాచ్ వాయిదాపై స్పందించిన టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్.. ‘‘కృనాల్ త్వరగా కోలుకోవాలి. ఆటగాళ్లంతా సురక్షితంగా ఉండాలి’’ అని ప్రార్థించాడు. ఇందుకు స్పందనగా.. ‘‘కృనాల్ ఓకే.. కానీ సూర్య, పృథ్వీ పరిస్థితి ఏంటో.. చేతిదాకా వచ్చిన అవకాశం చేజారుతుందేమో’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక కృనాల్ దూకుడైన ఆటిట్యూడ్ నచ్చని వారు.. ‘‘ఇదిగో ఇప్పుడు కృనాల్ ఇలాగే కరోనాను కూడా భయపెడతాడు చూడండి. ఏదేమైనా ఐసోలేషన్‌లో పెట్టినా పాండ్యా బ్రదర్స్ అంత తేలికగా సుతరాయించరు’’ అంటూ ఫన్నీ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో కృనాల్ ఒక వికెట్ తీయగా.. సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. ఇక పృథ్వీ షా అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. Wishing @krunalpandya24 a speedy recovery. Hoping everyone is safe. #SLvsIND https://t.co/VrmXZOjB1j pic.twitter.com/Gz1AI7x2C3 — Wasim Jaffer (@WasimJaffer14) July 27, 2021 Krunal to Covid 19 right now pic.twitter.com/DqN6RZklRI — Umakant (@Umakant_27) July 27, 2021 But ab suryakumar aur prithvi ka kya?? 😭😭😭😭 — Rahul Khandare (@Rahul_Khandare1) July 27, 2021 -
Ind Vs Sl: కరోనా కలకలం.. రెండో టీ20 వాయిదా!
కొలంబో: శ్రీలంక టూర్లో కరోనా కలకలం రేగింది. భారత్ - శ్రీలంక మధ్య మంగళవారం జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రేపటికి వాయిదా పడింది. కాగా టీమిండియా ప్లేయర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరు జట్లు ఐసోలేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లకు అందరికీ కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగటివ్‌గా తేలితేనే బుధవారం మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది. మరోవైపు.. విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్ వంటి యువ ప్లేయర్లు గాయాల బారిన పడటంతో.. శ్రీలంక పర్యటనలో ఉన్న సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాకు టెస్టు సిరీస్‌లో ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే, ప్రస్తుతం వీరితో పాటు లంక టూర్లో ఉన్న కృనాల్‌కు కరోనా సోకడంతో ఇంగ్లండ్‌కు వెళ్లే అంశంపై సందిగ్దత నెలకొంది. ఇక మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించి ముందంజలో నిలిచిన విషయం తెలిసిందే. -
అంతలోనే ఇంత మార్పా..? అంతా ద్రవిడ్ మాయ అంటున్న నెటిజన్లు
కొలంబో: నిన్న శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ధవన్ సారధ్యంలోని టీమిండియా అద్భుతంగా రాణించి మూడు వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత నవ యువ కిషోరాలు మూకుమ్మడిగా రాణించడంతో టీమిండియా ఆతిధ్య శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ విజయంలో ఆటగాళ్ల ప్రతిభ కంటే, వారిపై కోచ్ ద్రవిడ్ ప్రభావం అధికంగా కనబడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు శ్రీలంక ఇన్నింగ్స్ 22వ ఓవర్లో జరిగిన ఓ ఘటనను ఉదహరిస్తున్నారు. కృనాల్ పాండ్యా బౌల్ చేస్తున్న ఆ ఓవర్లో స్ట్రైకింగ్ ఎండ్‌లో ధనంజయ డిసిల్వా ఉన్నాడు. Upholding the Spirit of Cricket! 😌 Lovely gesture by Krunal 👏🏽 Tune into Sony Six (ENG), Sony Ten 1 (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/QYC4z57UgI) now! 📺#SLvINDOnlyOnSonyTen #HungerToWin #KrunalPandya pic.twitter.com/REg3TB2Yu9 — Sony Sports (@SonySportsIndia) July 18, 2021 అతను స్ట్రెయిట్‌గా కొట్టిన ఓ షాట్‌ను కృనాల్ డైవ్ చేస్తూ ఆపబోయిన క్రమంలో.. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న చరిత్ అసలంకకు తన కాలు తగిలింది. దీంతో వెంటనే అతడు పైకి లేచి అసలంకను హగ్ చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హుందాతనానికి మారు పేరైన ద్రవిడ్ కోచ్‌గా రావడం వల్లే కృనాల్ లాంటి ప్లేయర్స్‌లోనూ తక్కువ సమయంలో ఇంత మార్పు కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ది ద్రవిడ్ ఎఫెక్ట్ పేరుతో మిస్టర్ డిపెండబుల్ నిన్న ట్విటర్లో ట్రెండ్ అయ్యాడు. కొందరైతే రవిశాస్త్రి కోచింగ్‌లో కృనాల్ ఎలా ఉండేవాడు.. ఇప్పుడు ద్రవిడ్ కోచింగ్‌లో ఇలా అయ్యాడంటూ ఫొటోలు షేర్ చేశారు. ద్రవిడ్‌ను శాశ్వతంగా టీమిండియా కోచ్‌గా చేస్తే.. యువ ఆటగాళ్లకు ఇలాంటి మంచి లక్షణాలు వస్తాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. The discipline, love and care for opponent under Rahul Dravid. pic.twitter.com/U9I8GHpP4Y — Mufaddal Vohra (@mufaddal_vohra) July 18, 2021 Indian Players under Ravi Shastri : pic.twitter.com/uiyCAtwTm6 — Adish 🏏 (@36__NotAllOut) July 18, 2021 #SLvIND Krunal Pandya Krunal Pandya under Ravi Shastri under Rahul Dravid pic.twitter.com/zHw5DoAJI5 — Guru (@okguru123) July 18, 2021 -
కృనాల్.. నీ పద్ధతి మార్చుకుంటే మంచిది
అహ్మదాబాద్: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా తన సహచర ఆటగాడు అంకుల్ రాయ్‌పై ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. విషయంలోకి వెళితే.. గురువారం ముంబై ఇండియన్స్ రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ముంబై బ్యాటింగ్ సమయంలో డికాక్, కృనాల్‌లు క్రీజులో ఉన్నారు. కాగా బ్యాటింగ్ చేస్తున్న కృనాల్ పరుగు పూర్తి చేసే క్రమంలో బ్యాట్‌ను క్రీజులో పెట్టేందుకు కింద పడ్డాడు. దాంతో అతని చేతి రాసుకుపోయింది. దీంతో మాయిశ్చరైజర్ కావాలంటూ డగౌట్‌కు కాల్ ఇచ్చాడు. డగౌట్ నుంచి అంకుల్రాయ్ వచ్చి మాయిశ్చరైజర్‌ను అందించగ.. కృనాల్ దానిని తీసుకొని చేతికి రాసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ఇచ్చే క్రమంలో అంకుల్ రాయ్ పట్ల కఠినంగా ప్రవర్తించాడు. మాయిశ్చరైజర్‌ను అతని చేతికి ఇవ్వకుండా ముఖానికి విసిరేసినట్లుగా పడేసి దురుసుగా ప్రవర్తించాడు. అయితే ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డ్ కాగా ఆలస్యంగా వెలుగుచూసింది. కృనాల్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తప్పుబడుతున్నారు. ''కృనాల్ నీ పద్దతి మార్చుకుంటే బాగుంటుంది.. అప్పుడు దీపక్ హుడా.. ఇప్పుడు అంకుల్ రాయ్.. నువ్వు మారవా అంటూ'' కామెంట్లతో రెచ్చిపోయారు. ఇంతకముందు కూడా కృనాల్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీ సందర్భంగా దీపక్ హుడాపై దురుసుగా ప్రవర్తించిన తీరు వివాదానికి దారి తీసింది. ఇక రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన ముంబై రెండు వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలోనే 172 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డికాక్ 70* చివరివరకు నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: 'చహర్ ఇదేం బాలేదు.. పాపం జైస్వాల్‌ను చూడు' 'పో.. పో.. ఫోర్ వెళ్లు' అంటూ పొలార్డ్.. నోరెళ్లబెట్టిన మోరిస్ pic.twitter.com/H70kWa4X1m — pant shirt fc (@pant_fc) May 1, 2021 -
భార్యలతో అదరగొట్టిన పాండ్యా బ్రదర్స్.. వీడియో వైరల్
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో తొలి మ్యాచ్ ఓడిన ముంబై ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి మంచి జోష్‌లో ఉంది. అదే ఉత్సాహంతో నేడు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ విషయం పక్కనపెడితే.. ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యులుగా ఉన్న పాండ్యా బ్రదర్స్ ఎంటర్టైన్ అందించడంలో ముందుంటారు. తాజాగా పాండ్యా బ్రదర్స్ తమ భార్యలు నటాషా స్టాంకోవిక్, పంకూరీ శర్మలతో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నదమ్ములైన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఒకేరకమైన డ్రెస్ వేసుకోగా.. హార్దిక్ భార్య నటాషా.. కృనాల్ భార్య పంకూరీ శర్మ వైట్, బ్లాక్ కాంబినేషన్ వేసుకున్నారు. దానికి పాండ్యా స్వాగ్ అని పేరు పెట్టి బ్యాక్ అండ్ ఫార్వార్డ్ డ్యాన్స్స్టెప్స్తో దుమ్ములేపారు. దీనికి సంబంధించిన వీడియోనూ హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తన షూపై ఏదో ఒక అంశాన్ని రాసుకొని అవగాహన కల్పించడం కూడా బాగా వైరలైంది. చదవండి: అతను బంతితో మ్యాజిక్ చేయడం చూడాలి బౌలర్ గీత దాటితే చర్య.. బ్యాట్స్‌మన్ దాటితే మాత్రం View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
వారెవ్వా జేమిసన్.. దెబ్బకు బ్యాట్ విరిగింది
చెన్నై: చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ను కైల్ జేమిసన్ వేయగా.. పొలార్డ్, కృనాల్ క్రీజులో ఉన్నారు. కాగా 19వ ఓవర్ మూడో బంతిని జేమిసన్ యార్కర్ వేశాడు. దానిని ఎదుర్కోవడంలో కృనాల్ విఫలం కాగా.. బంతి బ్యాట్‌ను బలంగా తాకింది. దీంతో దెబ్బకు బ్యాట్‌కున్న హ్యాండిల్ హుక్ ఊడి బయటకొచ్చింది. దీనిని చూసి కృనాల్ మొదట షాక్ అయినా.. ఆ తర్వాత రెండు ముక్కలైన తన బ్యాట్‌ను చూసి నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ''వారెవ్వా జేమిసన్.. దెబ్బకు బ్యాట్ విరిగింది.. బుల్లెట్ లాంటి బంతికి కృనాల్ దగ్గర సమాధానం లేకుండా పోయింది'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్‌లో లిన్ 49 పరుగులతో రాణించగా.. మిగతావారు విఫలం అయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ ఐదు వికెట్లతో చెలరేగగా.. సుందర్, జేమిసన్ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: ఒక ఓపెనర్‌కు రెస్ట్.. మరొక ఓపెనర్ క్వారంటైన్లో కోహ్లి మెరుపు ఫీల్డింగ్.. రోహిత్ రనౌట్ -
రోహిత్ శర్మకు ఘన స్వాగతం..
ముంబై: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన మరుసటి రోజే ముంబై ఇండియన్స్ శిబిరంలో ప్రత్యక్షమాయ్యడు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. మరో పది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 ప్రారంభంకానున్న నేపథ్యంలో జట్టుతో పాటు శిక్షణా శిబిరంలో చేరాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేయటంతో జట్టు సభ్యులు ఒక్కొక్కరుగా ముంబైకి చేరుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన గంటల వ్యవధిలోనే పాండ్యా సోదరులు(హార్దిక్, కృనాల్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు ముంబై ఇండియన్స్ జట్టుతో చేరగా, తాజాగా రోహిత్ కూడా వీరితో పాటు ముంబై శిబిరంలో చేరిపోయాడు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లందరూ స్థానికంగా ఉన్న ఓ హోటల్లో క్వారంటైన్ అంక్షల నడుమ బస చేస్తున్నారు. 🙁 Where is RO ➡️ Here we GO! 😎#OneFamily #MumbaiIndians #IPL2021 @ImRo45 https://t.co/epbgkGM3at pic.twitter.com/GCVeKrKr3P — Mumbai Indians (@mipaltan) March 29, 2021 సోమవారం జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ హోటల్లో అడుగుపెట్టగానే ఆటగాళ్లతోపాటు మేనేజ్మెంట్ సభ్యులు అతనికి ఘన స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి పాండ్యా సోదరులు, సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు జట్టుతో చేరిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. తాజాగా రోహిత్‌కు వెల్కమ్ చెబుతున్న వీడియోను సైతం ట్విటర్లో షేర్ చేసింది. ఇదిలా ఉండగా చెన్నై వేదికగా ఏప్రిల్ 9న ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఢీకొంటుంది. The boys have come home! 💙 Hardik, Surya and Krunal checked in at the @RenaissanceMum last night ✅#OneFamily #MumbaiIndians #IPL2021 @hardikpandya7 @surya_14kumar @krunalpandya24 @MarriottBonvoy pic.twitter.com/zWJ5Sfb6vy — Mumbai Indians (@mipaltan) March 29, 2021 -
నాన్నకు ప్రేమతో.. కృనాల్ ఏం చేశాడో తెలుసా..?
పూణే: ఇంగ్లండ్‌తో తొలి వన్డే ద్వారా వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసి, అదిరిపోయే ప్రదర్శనతో(31 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు, 10 ఓవర్లలో 1/59) ఆకట్టుకున్న కృనాల్ పాండ్యా.. తన తండ్రి పట్ల ఉన్న ఎమోషన్‌ను ఆపుకోలేకపోతున్నాడు. తమ్ముడు హార్ధిక్ నుంచి వన్డే క్యాప్ అందుకునే సమయంలో తొలుత భావోద్వేగానికి లోనైన కృనాల్.. ఆతరువాత ప్రజెంటేషన్ వేదిక వద్ద కన్నీలను ఆపుకోలేకపోయాడు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత మాట్లాడే ప్రయత్నం చేసినా.. అతను భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. తన ప్రదర్శన తండ్రికి అంకితమంటూ భావోద్వేగ ప్రకటన చేశాడు. ఇదిలా ఉండగా తొలి వన్డేలో విజయం అనంతరం హార్దిక్, తన సోదరుడు కృనాల్‌ను ఇంటర్వ్యూ చేయగా, ఆ వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ సందర్భంగా పాండ్య సోదరులిరువురు మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. తమ తండ్రి తమతో లేకపోయినా ఆయన ధరించాలనుకున్న దుస్తులు తమతో పాటు డ్రస్సింగ్ రూమ్‌లో ఉన్నాయని, తమ తండ్రి మ్యాచ్‌ను చూడలేకపోయినా ఆయన దుస్తులైనా ఆ అనుభూతిని పొందుతాయని వారు సంతోషం వ్యక్తం చేశారు. 💬 Our father was with us in dressing room: Pandya brothers @hardikpandya7 interviews @krunalpandya24 post his emotional knock on ODI debut. This has all our heart 💙- By @RajalArora #TeamIndia #INDvENG @Paytm Watch the full interview 🎥 👇https://t.co/yoDGXVi2aK pic.twitter.com/4JrsxtejgC — BCCI (@BCCI) March 24, 2021 హార్దిక్ నుంచి క్యాప్ అందుకోవడం చూసి నాన్న సంతోషించే ఉంటారని కృనాల్ పేర్కొనగా... "మన జీవిత కాలంలో తొలిసారి నాన్న డ్రస్సింగ్ రూమ్‌లోకి వచ్చారు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. మన ఇద్దరి తరఫున నువ్వు అద్భుతంగా ఆడి, నాన్నకు ముందుగానే పుట్టినరోజు కానుక ఇచ్చావంటూ" హార్దిక్ భావోద్వేగం చెందాడు. కాగా, ఈ ఏడాది జనవరి 16న పాండ్యా సోదరుల తండ్రి హిమాన్షు పాండ్యా(71) కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. కృనాల్.. తన తండ్రి దుస్తుల సంచీని బరోడా నుంచి పూణేకు తీసుకొచ్చాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం ఆటగాళ్లు(కృనాల్, ప్రసిద్ద్ కృష్ణ(4/54)) అద్భుతంగా రాణించడంతో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం(మార్చి 26న) జరుగనుంది. చదవండి: భావోద్వేగానికి లోనైన కృనాల్ పాండ్యా -
కృనాల్- టామ్ కరన్ గొడవ; కోహ్లి రియాక్షన్ చూశారా?!
పుణె: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత ఆటగాళ్లు పలు రికార్డులు నమోదు చేశారు. వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా... కెరీర్ తొలి ఇన్నింగ్స్‌లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ (26 బంతుల్లో) చేసిన టీమిండియా బ్యాట్స్‌మన్‌గా నిలవగా, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4/54) నమోదు చేసిన భారత బౌలర్‌గా ప్రసిధ్ కృష్ణ రికార్డు సాధించాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశంలో 10 వేల పరుగులు చేసిన రెండో టీమిండియా ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇక ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ల జాబితాలో ఓపెనర్ శిఖర్ ధావన్(98) ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తొలి వన్డేలో 66 పరుగులతో పర్యాటక జట్టును మట్టికరిపించిన భారత్ గెలుపుతో సిరీస్‌ను ఆరంభించింది. అయితే, మొదటి వన్డేలో పలు చిరస్మరణీయ రికార్డులతో పాటు, కృనాల్ పాండ్యా- టామ్ కరన్ మధ్య జరిగిన వాగ్వాదం కూడా క్రీడా ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. కాగా, 49వ ఓవర్లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ టామ్ కరన్ బౌలింగ్‌ల్ సింగిల్ తీసే క్రమంలో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. అంపైర్ నితిన్ మీనన్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ, కృనాల్ దూకుడుగా వ్యవహరిస్తూ టామ్పైకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో జోస్ బట్లర్ వచ్చి, టామ్‌తో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత ఎవరిస్థానాల్లోకి వారు వెళ్లారు. ఈ క్రమంలో కృనాల్‌ను తన స్థానానికి వెళ్లాల్సిందిగా అంపైర్ మరోసారి సూచించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక డగౌట్లో కూర్చుని, ఇదంతా చూస్తున్న కెప్టెన్ కోహ్లి కాసేపు కన్ఫ్యూజన్కు లోనయ్యాడు. ఏం జరుగుతుందో అర్థంకాక అలాగే తీక్షణంగా చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. pic.twitter.com/3Xn1UWQVdF — tony (@tony49901400) March 23, 2021 -
సవాల్ ఛేదించలేక చాంపియన్ చతికిలపడింది
318 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఒకదశలో ఇంగ్లండ్ స్కోరు 135/0. ఆపై చేతిలో 10 వికెట్లు... ఓవర్‌కు 5 పరుగులు చేసినా చాలు. జట్టు గెలుపు ఖాయమనిపించింది. అయితే ఈ స్థితిలో భారత బౌలర్లు ఒక్కసారిగా చెలరేగారు. 41 పరుగుల వ్యవధిలో 5 ప్రధాన వికెట్లు తీసి మ్యాచ్‌ను మనవైపు తిప్పేశారు. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ప్రసిధ్ కృష్ణతో పాటు శార్దుల్ ఠాకూర్ ఒక్కసారిగా చెలరేగి జట్టును గెలుపు దిశగా నడిపించారు. అంతకుముందు ధావన్, కోహ్లి, రాహుల్‌లతోపాటు వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ భారత్‌కు భారీ స్కోరు అందించగా... ఈ సవాల్‌ను ఛేదించలేక ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ చతికిలపడింది. పుణే: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 66 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా... కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కృనాల్ పాండ్యా (31 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (60 బంతుల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (66 బంతుల్లో 94; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా, జేసన్ రాయ్ (35 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ప్రసిధ్ కృష్ణకు 4, శార్దుల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది. కోహ్లి అర్ధ సెంచరీ ఇంగ్లండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆరంభంలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (42 బంతుల్లో 28; 4 ఫోర్లు), ధావన్ జాగ్రత్తగా ఆడారు. స్టోక్స్ చక్కటి బంతితో రోహిత్‌ను అవుట్ చేసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ధావన్, కోహ్లి జత కలిశాక స్కోరు వేగం అందుకుంది. సరిగ్గా 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కోహ్లి వెనుదిరిగాడు. మరోవైపు 5 బంతుల వ్యవధిలో 3 ఫోర్లు కొట్టి ధావన్ జోరు కొనసాగించగా... అయ్యర్ (6) విఫలమయ్యాడు. అయితే స్టోక్స్ బౌలింగ్‌లో ధావన్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి శతకం చేజార్చుకోగా, హార్దిక్ (1) ఎక్కువసేపు నిలవలేదు. మెరుపు బ్యాటింగ్ రాహుల్, కృనాల్‌ల ఆరో వికెట్ భాగస్వామ్యం భారత్ స్కోరు 300 దాటేలా చేసింది. వీరిద్దరు జత కలిసే సమయానికి జట్టు స్కోరు 40.3 ఓవర్లలో 205 కాగా... మిగిలిన 9.3 ఓవర్లలో టి20 తరహాలో ఆడుతూ 112 పరుగులు జత చేశారు. స్యామ్ కరన్ ఓవర్లో కృనాల్ మూడు ఫోర్లు బాదగా, వుడ్ ఓవర్లో వీరిద్దరు 2 సిక్సర్లు, ఫోర్ సహా మొత్తం 21 పరుగులు రాబట్టారు. 26 బంతుల్లో కృనాల్... 39 బంతుల్లో రాహుల్ అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఓపెనర్లు చెలరేగాక... ఇంగ్లండ్ ఓపెనర్ల జోరు చూస్తే భారత ఓటమి ఖాయమనిపించింది. రాయ్, బెయిర్‌స్టో ఓవర్‌కు ఏకంగా 9.5 రన్‌రేట్‌తో పరుగులు సాధించారు. ప్రసిధ్ వేసిన ఒక ఓవర్లో బెయిర్‌స్టో 2 సిక్సర్లు, 2 ఫోర్లు బాదడంతో 22 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కృనాల్ ఓవర్లో రాయ్ 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఫలితంగా 10 ఓవర్లలోనే స్కోరు 89 పరుగులకు చేరింది. కుల్దీప్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బెయిర్‌స్టో కృనాల్ తర్వాతి ఓవర్లో మళ్లీ వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. ఎట్టకేలకు ప్రసిధ్ ఈ జోడీ ని విడదీశాడు. అంతే... అప్పటినుంచి ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. ప్రసిధ్ తర్వాతి ఓవర్లో స్టోక్స్ (1) అవుట్ కాగా, భారీ షాట్‌కు ప్రయత్నించి బెయిర్‌స్టో సెంచరీ అవకాశం కోల్పోయాడు. శార్దుల్ ఒకే ఓవర్లో మోర్గాన్, బట్లర్‌లను అవుట్ చేసిన తర్వాత ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) బట్లర్ (బి) స్టోక్స్ 28; ధావన్ (సి) మోర్గాన్ (బి) స్టోక్స్ 98; కోహ్లి (సి) అలీ (బి) వుడ్ 56; అయ్యర్ (సి) (సబ్) లివింగ్‌స్టోన్ (బి) వుడ్ 6; రాహుల్ (నాటౌట్) 62; హార్దిక్ (సి) బెయిర్‌స్టో (బి) స్టోక్స్ 1; కృనాల్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 317. వికెట్ల పతనం: 1–64, 2–169, 3–187, 4–197, 5–205. బౌలింగ్: వుడ్ 10–1– 75–2, స్యామ్ కరన్ 10–1–48–0, టామ్ కరన్ 10–0–63–0, స్టోక్స్ 8–1–34–3, రషీద్ 9–0–66–0, అలీ 3–0–28–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) (సబ్) సూర్యకుమార్ (బి) ప్రసిధ్ 46; బెయిర్‌స్టో (సి) కుల్దీప్ (బి) శార్దుల్ 94; స్టోక్స్ (సి) (సబ్) గిల్ (బి) ప్రసిధ్ 1; మోర్గాన్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 22; బట్లర్ (ఎల్బీ) (బి) శార్దుల్ 2; బిల్లింగ్స్ (సి) కోహ్లి (బి) ప్రసిధ్ 18; అలీ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 30; స్యామ్ కరన్ (సి) (సబ్) గిల్ (బి) కృనాల్ 12; టామ్ కరన్ (సి) భువనేశ్వర్ (బి) ప్రసిధ్ 11; రషీద్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 0; వుడ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (42.1 ఓవర్లలో ఆలౌట్) 251. వికెట్ల పతనం: 1–135, 2–137, 3–169, 4–175, 5–176, 6–217, 7–237, 8–239, 9–241, 10–251. బౌలింగ్: భువనేశ్వర్ 9–0–30–2, ప్రసిధ్ 8.1–1–54–4, శార్దుల్ 6–0–37–3, కృనాల్ 10–0–59–1, కుల్దీప్ 9–0–68–0. ►కెరీర్ తొలి వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4/54) నమోదు చేసిన భారత బౌలర్‌గా ప్రసిధ్ కృష్ణ నిలిచాడు. అరంగేట్ర మ్యాచ్‌లో భారత బౌలర్ 4 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. ►తొమ్మిదేళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో అన్నదమ్ములైన రెండు జోడీలు (హార్దిక్, కృనాల్; టామ్ కరన్, స్యామ్ కరన్) తుది జట్టులో ఆడాయి. 2012లో యూఏఈ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన జరిగిన మూడు వన్డేలలో (మైక్ హస్సీ, డేవిడ్ హస్సీ; కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్) రెండు జోడీలు బరిలోకి దిగాయి. కృనాల్ భావోద్వేగం భారత్ తరఫున 18 టి20లు ఆడిన తర్వాత వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా... కెరీర్ తొలి ఇన్నింగ్స్‌లోనే వేగవంతమైన అర్ధ సెంచరీ (26 బంతుల్లో) చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గత జనవరిలో కన్నుమూసిన తన తండ్రికి ఈ ఇన్నింగ్స్‌ను అంకితమిచ్చిన కృనాల్, ఇంటర్వ్యూ సమయంలో తన భావోద్వేగాలను ఆపుకోలేక కంటతడి పెట్టాడు. వెంటనే సోదరుడు హార్దిక్ దగ్గరకు తీసుకొని అతడిని ఓదార్చాల్సి వచ్చింది. రోహిత్ , అయ్యర్‌లకు గాయాలు తొలి వన్డేలో ఇద్దరు భారత ఆటగాళ్లు గాయపడ్డారు. వుడ్ వేసిన బంతి రోహిత్ కుడి మోచేతికి బలంగా తాకింది. నొప్పికి రెండుసార్లు మైదానంలోనే చికిత్స చేయించుకొని ఆట కొనసాగించిన అతను ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపే క్రమంలో శ్రేయస్ అయ్యర్ భుజానికి బలంగా దెబ్బ తగిలింది. వెంటనే మైదానం వీడిన అతడిని స్కానింగ్ కోసం పంపించారు. గాయం తీవ్రత దృష్ట్యా అయ్యర్ తదుపరి మ్యాచ్‌ల్లో బరిలోకి దిగేది అనుమానమే. ఫీల్డింగ్‌లో గాయపడిన ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ కూడా చేతికి నాలుగు కుట్లతో బ్యాటింగ్‌కు దిగాడు. -
వైరల్: కృనాల్ పాండ్యా- టామ్ కరన్ వాగ్వాదం!
పుణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా, మొదటి మ్యాచ్‌లోనే పలు రికార్డులు సొంతం చేసుకుని సత్తాచాటాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కృనాల్, అరంగేట్రంలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేగాక, తొలి వన్డేలోనే అర్ధ శతకం సాధించిన 15వ టీమిండియా ఆటగాడిగా, అదే విధంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, ఫిఫ్టీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు, సోదరుడు హార్దిక్ పాండ్యా చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్న కృనాల్ తండ్రిని తలచుకుని భావోద్వేగానికి లోనైన క్షణాలు అతడి అభిమానుల మనసును మెలిపెడుతున్నాయి. ఇలా మంగళవారం మ్యాచ్ ఆరంభమైన సమయం నుంచి అతడు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అయితే, అంతా బాగానే ఉన్నా, 49వ ఓవర్లో కృనాల్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ టామ్ కరన్ బౌలింగ్‌ల్ సింగిల్ తీసే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వీరి మాటల యుద్ధం శ్రుతిమించడంతో అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, కృనాల్ వెనక్కి తగ్గలేదు. ‘అసలేంటి నీ సమస్య’ అన్నట్లుగా టామ్ కరన్ వైపు దూసుకురాబోయాడు. ఇంతలో జోస్ బట్లర్ సైతం టామ్‌కు జతకలిశాడు. అయితే, వెంటనే టామ్ తన స్థానంలోకి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కాగా కృనాల్- టామ్ కరన్ గొడవకు గల స్పష్టమైన కారణం తెలియాల్సి ఉంది. చదవండి: కృనాల్ ఖాతాలో పలు రికార్డులు Krunal pandya debut includes a 50 Plus Verbal battle with Tom Curran #ENGvIND #IndiavsEngland pic.twitter.com/EX3qAQE8KQ — theshivamkapoor (@sherlony3000) March 23, 2021 -
Krunal Pandya: అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు..
పూణే: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అరంగేట్రం ఆటగాడు కృనాల్ పాండ్యా(31 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణతో కలిసి టీమిండియా వన్డే క్యాప్‌ను అందుకున్న ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. క్లిష్ట సమయంలో(40.3 ఓవర్లలో 205/5 స్కోర్ వద్ద) క్రీజ్‌లోకి వచ్చి ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడు. ఈ క్రమంలో అతను ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 112 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు.. 26 బంతుల్లోనే అర్ధశతకాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో అరంగేట్రంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు జాన్ మోరిస్(35 బంతుల్లో) పేరిట నమోదై ఉంది. దీంతోపాటు తొలి వన్డే మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ నమోదు చేసిన 15వ భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నమోదు చేశాడు. అలాగే 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో కృనాల్‌కు తోడుగా మరో ఎండ్‌లో రాహుల్(43 బంతుల్లో 62; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సైతం భారీ షాట్లతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 317 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. తొలుత ధవన్(98), కోహ్లి(56) అర్ధశతకాలతో రెచ్చిపోగా, ఆఖర్లో రాహుల్, కృనాల్ ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేశారు. కాగా, ఈ మ్యాచ్ ఆరంభంలో తమ్ముడు హార్దిక్ నుంచి వన్డే క్యాప్ అందుకున్న కృనాల్.. తన తండ్రిని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: భావోద్వేగానికి లోనైన కృనాల్ పాండ్యా ధవన్ ఖాతాలో అరుదైన రికార్డు.. -
భావోద్వేగానికి లోనైన కృనాల్ పాండ్యా
పుణే: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో కృనాల్‌తోపాటు కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కూడా వన్డే క్యాప్ అందుకున్నారు. ప్రసిద్ద్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కాగా, కృనాల్ ఇప్పటికే 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. Some brotherly love 💙🫂 A moment to cherish for the duo 🧢#TeamIndia #INDvENG @Paytm pic.twitter.com/UYwt5lmlQq — BCCI (@BCCI) March 23, 2021 కాగా, ఈ ఏడాది ఆరంభంలో పాండ్య సోదరులు తమ తండ్రిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో తమ్ముడు హార్దిక్ నుంచి క్యాప్ అందుకున్న కృనాల్.. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. హార్డిక్.. తన అన్నను హత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, పాండ్యా సోదరుల తండ్రి హిమాన్షు పాండ్యా(71) ఈ ఏడాది జనవరి 16న కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. ODI debut for @krunalpandya24 👌 International debut for @prasidh43 👍#TeamIndia @Paytm #INDvENG pic.twitter.com/Hm9abtwW0g — BCCI (@BCCI) March 23, 2021 -
ప్రసిధ్ కృష్ణకు పిలుపు
ముంబై: ఇంగ్లండ్‌తో తలపడే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 18 మంది సభ్యుల ఈ బృందంలో ముగ్గురు ఆటగాళ్లకు తొలిసారి వన్డే టీమ్‌లో చోటు దక్కింది. కర్ణాటక పేస్ బౌలర్, గతంలో భారత ‘ఎ’ జట్టుకు ఆడిన ప్రసిధ్ కృష్ణ జాతీయ సీనియర్ జట్టులో ఎంపిక కావడం ఇదే తొలిసారి కాగా... ఇప్పటికే టి20లు ఆడిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, తాజా టి20 సిరీస్‌లో ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా అవకాశం దక్కింది. ఐపీఎల్లో కోల్‌కతా జట్టు తరఫున కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసిధ్‌కు దేశవాళీ వన్డేల్లో మంచి రికార్డు ఉంది. 48 వన్డేల్లో అతను 23.07 సగటుతో 81 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున 18 టి20లు ఆడిన కృనాల్ ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 5 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. టెస్టు సిరీస్ ప్రదర్శన ఆధారంగా సిరాజ్‌కు మరోసారి వన్డే పిలుపు లభించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో టీమ్‌లో ఉన్న మయాంక్, మనీశ్ పాండే, సైనీ, సంజూ సామ్సన్ తమ స్థానాలు కోల్పోయారు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు ఈనెల 23, 26, 28వ తేదీల్లో పుణేలో జరుగుతాయి. జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, గిల్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, పంత్, రాహుల్, చహల్, కుల్దీప్, కృనాల్ పాండ్యా, సుందర్, నటరాజన్, భువనేశ్వర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దుల్. -
తొలి సెంచరీ.. లవ్ యూ అన్నయ్య: పాండ్యా
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ-2021 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా తొలిసారిగా సెంచరీ నమోదు చేశాడు. బరోడా జట్టు తరఫున ఆడుతున్న అతడు 90 బంతుల్లో 127 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు త్రిపురపై 6 వికెట్ల తేడాతో బరోడా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా తన తండ్రి హిమాన్షు పాండ్యాను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఒకవేళ ఇప్పుడు ఆయన బతికి ఉంటే ఎంతో సంతోషించే వారని, తను గతంలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసినప్పుడు తనను అభినందించిన తీరును జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు... ‘‘గత నెలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నేను 76 పరుగులు చేసినపుడు, నాన్న నాతో చివరిసారిగా క్రికెట్ గురించి మాట్లాడారు. ‘‘నా ప్రియమైన కుమారుడా.. ఇప్పుడు నీ టైం స్టార్ట్ అయ్యింది’’ అని నన్ను ప్రోత్సహించారు. ఇక ఇప్పుడు నేను తొలిసారి సెంచరీ చేశాను. కానీ భౌతికంగా ఆయన మాతో లేరు. అయితే, నిన్న నేను పరుగు తీస్తున్న ప్రతిసారీ ఆయన నన్ను చీర్ చేసి ఉంటారని నా హృదయం బలంగా నమ్ముతోంది. ‘‘శభాష్ కృనాల్ శభాష్’’ అని ఆయన అని ఉంటారు! నా ఈ ప్రత్యేక ఇన్నింగ్స్ నాన్నకే అంకితం. నా కలలు నిజం చేసకునే క్రమంలో క్షణక్షణం తోడున్న నీకు ధన్యవాదాలు. లవ్ యూ పప్పా’’అంటూ కృనాల్ ఇన్‌స్టాలో ఎమోషల్ పోస్టు షేర్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన అతడి సోదరుడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ‘‘నాన్న నిన్ను చూసి గర్వపడుతూనే ఉంటాడు అన్నయ్యా.. లవ్ యూ’’అని ప్రేమ చాటుకున్నాడు. కాగా జనవరి 16న హార్దిక్ తండ్రి హిమాన్షు పాండ్యా గుండెపోటుకు గురై మరణించిన విషయం విదితమే. View this post on Instagram A post shared by Krunal Pandya (@krunalpandya_official) -
మిస్ యూ నాన్న: కృనాల్
ముంబై: టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా తన తండ్రి హిమాన్షు పాండ్యాను తలచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. తండ్రితో కలిసి ఉన్న మొమరబుల్ మూమెంట్స్‌ను వీడియో రూపంలో పంచుకున్నాడు. 'మీరు దూరమయ్యారన్న బాధ నుంచి బయటికి రావడం కష్టంగా ఉంది. మీ జ్ఞాపకాల నుంచి ఇప్పటికి బయటికి రాలేకపోతున్నాం. మీరు భౌతికంగా దూరమైనా.. మీ గురించి చెప్పాల్సినవి.. చేయాల్సినవి చాలా ఉన్నాయి.. మిస్ యూ పప్పా..' అంటూ ఎమోషన్ల్ అయ్యాడు. చదవండి: 'నేను కావాలని చేయలేదు.. క్షమించండి' కృనాల్ పాండ్యా టీమిండియా తరపున 18 టీ20లు ఆడి 121 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు. కాగా మంగళవారం కృనాల్ సోదరుడు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా తన తండ్రిని స్మరించుకుంటూ ఎమోషన్ల్ ట్వీట్ చేశాడు. గత జనవరి 16న హిమాన్షు పాండ్యా గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. Cannot get over the feeling that you have left us. Still processing the loss and emptiness that you have left behind. There were so many things left to say and do. Miss you everyday Papa. Wanted to thank everyone who took the time out to message me and share this loss. 🙏🏿❤️💫 pic.twitter.com/LzLJCvupN7 — Krunal Pandya (@krunalpandya24) February 3, 2021 -
తండ్రి మరణం: హార్దిక్ ఎమోషనల్ పోస్టు
అహ్మదాబాద్: తండ్రి మరణం పట్ల టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఆయన లేని లోటు జీవితంలో పూడ్చలేనిదని పేర్కొన్నాడు. జీవితంలో తన తండ్రి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోవడం అత్యంత కఠినమైనదని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫోటోతోపాటు భావోద్వేగ పోస్టు చేశాడు. ‘నాన్నా.. నువ్ నా హీరో. నువ్ ఇక లేవు అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. మీరు వదిలి వెళ్లిన ఎన్నో మధుర జ్ఞాపకాలను, మీ నవ్వును ఎప్పుడూ మరువం నాన్నా. అన్నయ్య, నేను ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం మీరే. మీ కష్టం, మీపై మీకున్న నమ్మకం మీ కలల్ని నిజం చేసింది. మీ లేమితో ఈ ఇంటికి కళ తప్పింది. మిమ్మల్నెప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాం. మీ పేరు నిలబెడతాం. మీరు ఎక్కడున్నా మమ్మల్ని కనిపెడుతూనే ఉంటారని ఆశిస్తున్నా. మమ్మల్ని చూసి మీరు గర్వపడ్డారు. కానీ, మీ ఆదర్శవంతమైన జీవన ప్రయాణం చూసి మేమంతా గర్విస్తున్నాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా కింగ్. ప్రతిరోజు ప్రతి గడియా మిమ్మల్ని మిస్ అవుతా. లవ్ యూ డాడీ!!’ అని పాండ్యా పేర్కొన్నాడు.! (చదవండి: శార్దూల్, వషీ జబర్దస్త్; గతం గుర్తు చేసుకున్న సెహ్వాగ్) కాగా, భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు పితృవియోగం కలిగింది. వారి తండ్రి, 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండెపోటుతో శనివారం వడోదరలో కన్నుమూశారు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో బరోడా జట్టుకు సారథ్యం వహిస్తూ నగరంలోనే ఉన్న కృనాల్ ఇంటికి బయల్దేరగా... ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ముంబైలో సన్నద్ధమవుతోన్న హార్దిక్ వెంటనే వడోదర చేరుకున్నాడు. హిమాన్షు పాండ్యా మృతి పట్ల భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ సంతాపం తెలియజేశారు. (చదవండి: నేను ఇలాగే ఆడతా : రోహిత్ శర్మ) View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
పాండ్యా సోదరులకు పితృ వియోగం
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు పితృవియోగం కలిగింది. వారిద్దరి తండ్రి, 71 ఏళ్ల హిమాన్షు పాండ్యా గుండెపోటుతో శనివారం వడోదరలో కన్నుమూశారు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో బరోడా జట్టుకు సారథ్యం వహిస్తూ నగరంలోనే ఉన్న కృనాల్ ఇంటికి బయల్దేరగా... ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం ముంబైలో సన్నద్ధమవుతోన్న హార్దిక్ వెంటనే వడోదర చేరుకున్నాడు. హిమాన్షు పాండ్యా మృతి పట్ల భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ సంతాపం తెలియజేశారు. -
హార్దిక్ పాండ్యా తండ్రి కన్నుమూత
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంట విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. అతని సోదరుడు కృనాల్ పాండ్యా కూడా క్రికెటర్కాగా.. ప్రస్తుతం అతను సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బరోడా తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. తండ్రి మృతి విషయం తెలియగానే హుటాహుటిన అతను ఇంటికి పయనమయ్యాడు. ఇక త్వరలో ఇంగ్లండ్‌తో సిరీస్ ఆరంభమయ్యే క్రమంలో హార్దిక్ పాండ్యా ట్రైనింగ్ సెషన్లో ఉన్నాడు. ఇటీవల ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత ఇంటికి వచ్చిన హార్దిక్.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నద్ధం అవుతున్నాడు. తండ్రి హిమాన్షు పాండ్యా అంటే హార్దిక్ పాండ్యాకి చాలా ఇష్టం. అన్న కంటే ముందు టీమిండియాకి ఆడిన హార్దిక్ పాండ్యా.. తన సంపాదనతో హిమాన్షు పాండ్యాకి ఖరీదైన కారుని బహూకరించాడు. అప్పట్లో ఓ విదేశీ టూర్లో ఉన్న హార్దిక్ పాండ్యా.. కారుని బుక్ చేసి షోరూమ్‌కి తండ్రిని తీసుకెళ్లాల్సిందిగా కృనాల్, తన కజిన్‌ని కోరాడు. అక్కడ హిమాన్షుకి అందరూ కలిసి సర్ప్రైజ్ ఇచ్చారు. హిమాన్షు పాండ్య అప్పట్లో సూరత్‌లో కార్ల ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు. అయితే.. కొడుకుల క్రికెట్ ట్రైనింగ్ కోసం ఆ బిజినెస్‌ని వదిలేసి ఫ్యామిలీని వడోదరికి మార్చేశారు. అక్కడే భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పించారు. మొత్తానికి అతని కష్టం ఫలించింది. హార్దిక్, కృనాల్ పాండ్యా టీమిండియా తరఫున ఆడారు. హార్దిక్-కృనాల్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా మృతి చెందిన వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. ఆయన ఇక లేరన్న వార్తతో గుండె పగిలింది. ఆయనతో నేను చాలాసార్లు మాట్లాడా. మంచి సరదా అయిన మనిషి. కుటుంబానికి విలువనిచ్చే పనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. హార్దిక్-కృనాల్‌లు ధైర్యంగా ఉండాలి. విరాట్ కోహ్లి, టీమిండియా కెప్టెన్ నేను ఆయన్ను మోతిబాగ్‌లో తొలిసారి కలిశా. అది ఇంకా గుర్తుంది. ఆ సమయంలో హార్దిక్-కృనాల్‌లు చాలా చిన్నవారు. అప్పటికే వారు మంచి క్రికెట్ ఆడుతున్నారు. ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ కష్టసమయంలో వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా ఇర్ఫాన్ పఠాన్, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ -
కెప్టెన్‌తో గొడవ.. టీమ్ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్
ఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభానికి ముందే బరోడా టీమ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆదివారం నుంచి టోర్నీ ప్రారంభం అవుతుండగా జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా..కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవ కారణంగా క్యాంప్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. బరోడా టీమ్‌కి కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఈ టీమ్‌కి కెప్టెన్‌గా పనిచేసిన దీపక్ హుడా ప్రస్తుతం వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నాడు.కాగా క్యాంప్ నుంచి వెళ్లిన అనంతరం తాను టీమ్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని దీపక్ హుడా ఈ మెయిల్ ద్వారా బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు వివరించాడు. (చదవండి: బుమ్రా చేసిన పనికి షాక్ తిన్న అంపైర్) 'ఇటీవల జరిగిన టీమ్ సమావేశాల్లో పదే పదే నన్ను టార్గెట్ చేస్తూ కృనాల్ పాండ్యా దూషిస్తున్నాడు. తాను ఒక సీనియర్ ఆటగాడినేనని.. భారత్ జట్టుతో పాటు ఐపీఎల్‌లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాను. గతంలో ఇదే బరోడా జట్టకు కెప్టెన్‌గా పనిచేసిన నేను ఇప్పుడు వైస్ కెప్టెన్ హోదాలో ఏదైనా సలహా ఇచ్చినా కృనాల్ దానిని స్వీకరించడం లేదు. పైగా జట్టు సహచరుల ముందే నన్ను దూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. గతంలో ఎన్నో జట్లకు ఆడాను.. ఒక ఆటగాడిగా చాలా మంది కెప్టెన్సీలో పనిచేశాను.. కానీ కృనాల్ పాండ్యా తరహా వేధింపులు ఎక్కడా ఎదుర్కోలేదు. కేవలం కృనాల్ బ్యాడ్ బిహేవియర్ కారణంగానే టీమ్ క్యాంప్ నుంచి బయటికి వెళ్లిపోయానంటూ ' దీపక్ హుడా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే వీరిద్దరి గొడవపై ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా బరోడా టీమ్ మేనేజర్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ కోరింది. కృనాల్ పాండ్యా టీమిండియాకి ఆడాడు. 2018లో భారత్ తరఫున టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకూ 18 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు దీపక్ హుడా భారత్ జట్టులోకి 2017-18లో భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఇక ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున కృనాల్ పాండ్యా ఆడుతుండగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి ఐపీఎల్ 2020 సీజన్లో దీపక్ హుడా ఆడాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో- సెక్యూర్ వాతావరణంలో ఈ ట్రోఫీని బీసీసీఐ నిర్వహించనుంది. ముస్తాక్ అలీ ట్రోపీలో 38 జట్లు క్వారంటైన్లో ఉండి బయో బబుల్‌లోకి వచ్చాయి. కృనాల్‌తో గొడవ కారణంగా క్యాంప్ నుంచి వెళ్లిపోయిన దీపక్ హుడా మళ్లీ జట్టులోకి రావాలంటే.. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కానుంది.(చదవండి: ఒకవేళ అక్కడ సచిన్ ఉంటే పరిస్థితి ఏంటి?) -
ఆరు గంటల పాటు కృనాల్ విచారణ
ముంబై: ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను సుదీర్ఘ విచారణ అనంతరం కస్టమ్స్ అధికారులు విడిచిపెట్టారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ దుబాయ్ నుంచి గురువారం ముంబై చేరుకున్నాడు. అతని వద్ద విలువైన వస్తువులు (ధ్రువపత్రాలు లేని), బంగా రం ఉండటంతో ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డగించారు. పరిమితికి మించి బంగారం, అత్యంత విలువైన నాలుగు లగ్జరీ వాచ్‌లు (ఒమెగా, అంబులర్ పిగెట్ బ్రాండ్లు) దుబాయ్‌లో కొనుగోలు చేసినట్లు తెలిసింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. కోటి. ఈ విచారణ అర్ధరాత్రి దాకా సాగింది. నిబంధనలు తెలియకే ఇంతగా కొనుగోలు చేశానని, పన్నులతో పాటు జరిమానా కూడా కడతానని విచారణ సందర్భంగా అతను క్షమాపణలు చెప్పడంతో అధికారులు అతన్ని విడిచిపెట్టారు. అయితే అతను తెచ్చిన వస్తువుల్ని తిరిగివ్వలేదు. విలువైన బ్రాండ్లకు చెందిన వాచీలను కొనుగోలు చేసిన కృనాల్ దీనికి సంబంధించి కస్టమ్స్ డ్యూటీ చెల్లించలేదు. ఇప్పుడు వీటిపై 38 శాతం డ్యూటీ, అదనంగా జరిమానా చెల్లించాక... దర్యాప్తు మొత్తం పూర్తయ్యాకే వీటిని అతనికి అప్పగిస్తారు. -
కృనాల్ పాండ్యా నిర్బంధం
ముంబై: క్రికెటర్ కృనాల్ పాండ్యాను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిర్బంధించారు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ పాండ్యా సరైన ధ్రువ పత్రాలు లేని బంగారం, ఇతర విలువైన వస్తువులు కలి గి వుండటంతో అతన్ని విమానాశ్రయంలోనే ఆపివేశారు. ఐపీఎల్–13 చాంపియన్ ముంబై జట్టు సభ్యుడైన అతను గురువారం యూఏఈ నుంచి వచ్చాడు. పరిమితికి మించి బంగారం ఉండటంతో పాటు ఇన్వాయిస్ లేని వస్తువులు కొనుగోలు చేయడంతో నిర్బంధించినట్లు డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. -
దుబాయ్ బంగారం: కృనాల్ పాండ్యాకు షాక్
సాక్షి, ముంబై : టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 క్రికెట్ సంబరం ముగిసిన అనంతరం భారత్‌కు తిరిగి వస్తుండగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాండ్యాకు ఎదురుదెబ్బ తగిలింది. దుబాయ్ నుంచి బంగారంతోపాటు ఇతర విలువైన వస్తువులను అక్రమంగా తీసుకొస్తున్నారనే ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు అతడిని అడ్డుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చాడనే ఆరోపణలతో క్రునాల్ పాండ్యాను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. దీనిపై నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ పరిమితి కంటే ఎక్కువ బంగారం దీనితో పాటు మరికొన్ని విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్య సోదరుడైన కృనాల్ ఎడమచేతి వాటం బ్యాట్స్ మాన్, బౌలర్‌గా రాణిస్తున్నారు. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా పాండ్యా ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. Cricketer Krunal Pandya stopped by Directorate of Revenue Intelligence (DRI) at the Mumbai International Airport over suspicion of being in possession of undisclosed gold and other valuables, while returning from UAE: DRI sources pic.twitter.com/9Yk82coBgz — ANI (@ANI) November 12, 2020