KL Rahul Impress With Rohit Sharma And Krunal Pandya Great Sportsmanship - Sakshi
Sakshi News home page

IPL 2021: ఔటవ్వాల్సింది బతికిపోయాడు.. కృనాల్‌, రోహిత్‌ క్రీడాస్పూర్తికి రాహుల్‌ ఫిదా

Published Tue, Sep 28 2021 10:09 PM | Last Updated on Wed, Sep 29 2021 7:07 PM

KL Rahul Impress With Rohit Sharma And Krunal Pandya Great Sportsmanship - Sakshi

Courtesy: IPL Twitter

Rohit Sharma And Krunal Pandya Great Sportsmanship.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, కింగ్స్‌ పంజాబ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కృనాల్‌ పాండ్యా, రోహిత్‌ శర్మలు ప్రదర్శించిన క్రీడాస్పూర్తికి ఫ్యాన్స్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌ కూడా ఫిదా అయ్యాడు. విషయంలోకి వెళితే..  ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌ చేశాడు. ఓవర్‌ చివరి బంతిని గేల్‌ స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆడాడు. అయితే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న రాహుల్‌ అడ్డుగా రావడంతో అతని చేతికి బంతి తగిలి కృనాల్‌ వైపు వెళ్లింది. కాగా అప్పటికే రాహుల్‌ క్రీజుదాటి బయటికి వెళ్లడం.. కృనాల్‌ బంతిని వికెట్ల మీదకు విసరడం జరిగిపోయాయి.

చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్‌ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు


Courtesy: IPL Twitter
వాస్తవానికి కేఎల్‌ రాహుల్‌ అవుటవ్వాల్సిందే. అంపైర్‌ కూడా థర్డ్‌ అంపైర్‌కు సిగ్నల్‌ ఇవ్వబోతున్నాడు. అయితే రాహుల్‌ ఏంటిది అన్నట్లుగా కృనాల్‌ వైపు చూశాడు. కృనాల్‌ కూడా అంపైర్‌ వద్దకు వెళ్లి తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రోహిత్‌కు కూడా అప్పీల్‌ వద్దంటూ వివరించాడు. దీంతో రోహిత్‌ వెనక్కి తగ్గాడు. ఓవర్‌ ముగిసిన తర్వాత కేఎల్‌ రాహుల్‌ కృనాల్‌, రోహిత్‌ల వైపు చూస్తూ థ్యాంక్స్‌ అనే అర్థం వచ్చేలా బొటనవేలితో థంప్సమ్‌ గుర్తు చూపించాడు. అలా రాహుల్‌ ఔటవ్వాల్సినప్పటికీ.. రోహిత్‌, పాండ్యాలు క్రీడాస్పూర్తి ప్రదర్శించడంతో బతికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత రాహుల్‌ 21 పరుగులు చేసి పొలార్డ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.


Courtesy: IPL Twitter

కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల నిలకడైన బౌలింగ్‌కు పంజాబ్‌ పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఎయిడెన్‌ మక్రమ్‌ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీపక్‌ హుడా 28 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, పొలార్డ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్‌, రాహుల్‌ చహర్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

చదవండి: IPL 2021: కొద్దిలో తప్పించుకున్నాడు.. లేదంటే మొహం పచ్చడయ్యేది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement