run out
-
క్రికెట్ చరిత్రలో అసాధారణ రనౌట్
క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన రనౌట్ నమోదైంది. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అండర్-19 జట్టు ఆటగాడు ఆర్యన్ సావంత్ అసాధారణ రీతిలో రనౌటయ్యాడు. మ్యాచ్ 3వ రోజు సావంత్ 11 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ జేసన్ రౌల్స్ వేసిన బంతిని స్లాగ్-స్వీప్ చేశాడు. అయితే బంతి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జోరిచ్ వాన్ షాల్క్విక్ హెల్మెట్‌ను బలంగా తాకి, స్టంప్స్‌పైకి తిరిగి వచ్చింది. ఆ సమయంలో సావంత్ క్రీజ్ బయట ఉన్నాడు. సెకెన్ల వ్యవధిలో జరిగిపోయిన ఈ తంతు చూసి కొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రనౌట్‌కు అప్పీల్ చేయగా.. మరికొందరు బంతి హెల్మెట్‌కు తాకి గాయపడిన జోరిచ్ను పరామర్శించే పనిలో పడ్డారు. The first and last time you'll see a run out like this... @collinsadam pic.twitter.com/ZIEFI8s1Te— Brent W (@brentsw3) January 28, 2025దక్షిణాఫ్రికా ఫీల్డర్ల అప్పీల్‌తో ఔటయ్యానన్న విషయాన్ని గ్రహించిన సావంత్ మెల్లగా పెవిలియన్ బాట పట్టగా.. బంతి బలంగా తాకడంతో జోరిచ్ మైదానంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గాయపడిన జోరిచ్ను హుటాహుటిన అసుపత్రికి తరలించారు. జోరిచ్కు ఎలాంటి అపాయం కలగలేదని తదనంతరం దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్ వెల్లడించింది. సావంత్ అసాధారణ రీతిలో రనౌటైన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.కాగా, ఈ మ్యాచ్‌లో సావంత్ ఔటయ్యే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ను కొనసాగించిన ఇంగ్లండ్, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే 20 పరుగులు వెనుకపడ్డ ఇంగ్లండ్ ప్రస్తుతం 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో థామస్ ర్యూ (71) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఫర్హాన్ అహ్మద్, జాక్ హోమ్ అర్ద సెంచరీలతో రాణించారు. బదులుగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తరఫున ముహమ్మద్ బుల్బులియా, జేసన్ రౌల్స్ అర్ద సెంచరీలు చేశారు. -
ఇదెక్కడి రనౌట్ రా సామీ.. క్రికెట్ చరిత్రలో వింత ఘటన
పాకిస్తాన్ దేశవాలీ క్రికెట్లో ఓ వింత రనౌట్ చేసుకుంది. కైడ్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా పెషావర్‌తో జరిగిన మ్యాచ్‌లో సియాల్కోట్ బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. బౌలర్ రిటర్న్ త్రోను తప్పించుకోబోయి మొహమ్మద్ వాలీద్ గాల్లోకి ఎగరగా.. అదే సమయంలో బంతి వికెట్లను తాకింది. దీంతో వాలీద్ రనౌటయ్యాడు. ఈ వింత రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.A STRANGE RUN-OUT IN PAKISTAN DOMESTIC CRICKET. 🤯 pic.twitter.com/dCCV6e9DhO— Johns. (@CricCrazyJohns) January 4, 2025పూర్తి వివరాల్లో వెళితే.. పెషావర్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ ఖాన్ సంధించిన బంతిని మొహమ్మద్ వాలీద్ డిఫెండ్ చేసుకున్నాడు. ఆ బంతి నేరుగా బౌలర్ ఆమిర్ ఖాన్ చేతుల్లోకి వెళ్లింది. బ్యాటర్ ముందుకు రావడం చూసిన ఆమిర్ ఖాన్ బంతిని వికెట్లపైకి విసిరాడు. అప్పటికే క్రీజ్‌లో ఉన్న వాలీద్ బంతి నుంచి తప్పించుకోబోయి పైకి జంప్ చేశాడు. వాలీద్ గాల్లో ఉండగానే బంతి వికెట్లను తాకింది. దీంతో పెషావర్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. అప్పీల్ రీజనబుల్‌గా ఉండటంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేశాడు. పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ బ్యాటర్ వాలీద్‌ను రనౌట్‌గా ప్రకటించాడు. వాలీద్ గాల్లో ఉన్నప్పుడు బంతి వికెట్లను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనపడింది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి విచిత్ర రనౌట్లు చోటు చేసుకోవడం చాలా అరుదు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఇదెక్కడి రనౌట్ రా సామీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాక్ జాతీయ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పాక్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు తేలిపోవడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా బ్యాటర్లు మూడంకెల స్కోర్ చేశారు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. టెంబా బవుమా (106), కైల్ వెర్రిన్ (100) సెంచరీ అనంతరం ఔట్ కాగా.. డబుల్ సెంచరీ చేసిన ర్యాన్ రికెల్టన్ (233 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. 123 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోర్ 477/6గా ఉంది. రికెల్టన్కు జతగా జన్సెన్ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. -
అంపైర్ల తీరుపై హర్మన్‌ప్రీత్ అసహనం.. తప్పెవరిది?
మహిళా టీ20 ప్రపంచకప్-2024లో న్యూజిలాండ్ బ్యాటర్ అమేలియా కెర్ రనౌట్ విషయంలో అంపైర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దీంతో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. అసలేం జరిగిందంటే..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ న్యూజిలాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడింది. దుబాయ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. హర్మన్‌ప్రీత్ సేనను బౌలింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ దీప్తి శర్మ పద్నాలుగో ఓవర్ ఆఖరి బంతిని ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించింది. అప్పుడు క్రీజులో ఉన్న అమేలియా కెర్ లాంగాఫ్ దిశగా షాట్ బాదగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బంతిని అందుకుంది. అప్పటికి అమేలియా సోఫీ డివైన్‌తో కలిసి సింగిల్ పూర్తి చేసుకుంది.ఈ క్రమంలో ఓవర్ ముగిసింది కాబట్టి హర్మన్ బంతిని త్రో చేయకుండా అలాగే చేతుల్లో పట్టుకుంది. దీనిని ఆసరాగా తీసుకున్న కివీస్ బ్యాటర్లు మరో పరుగు కోసం యత్నించారు. అంతలో హర్మన్ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు బంతిని అందించగా.. అమేలియా రనౌట్ అయింది.కానీ.. అంపైర్ మాత్రం అప్పటికే బంతి డెడ్ అయినట్లు ప్రకటించారు. నిజానికి కివీస్ బ్యాటర్లు రెండో పరుగు కోసం ప్రయత్నించకముందే ఫీల్డ్ అంపైర్.. బౌలర్ దీప్తి క్యాప్‌ను ఆమెకు తిరిగి ఇచ్చేశారు. అప్పటికే హర్మన్ చేతిలో బంతి ఉండి ఐదు సెకన్లకు పైగా కాలం గడవడంతో బంతిని డెడ్‌గా ప్రకటించారు. అయినప్పటికీ న్యూజిలాండ్ డబుల్‌కు యత్నించగా.. అమేలియా రనౌట్ అయింది. దీంతో ఆమె తాను అవుటైనట్లు భావిస్తూ పెవిలియన్‌కు వెళ్తుండగా.. అంపైర్లు మాత్రం ఆమెను వెనక్కి పిలిపించారు.దీంతో అమేలియా మళ్లీ తన స్థానంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంతి డెడ్ అయిందనుకుని తాము నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించినా వారికి అనుకూలంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాసేపు వివాదం నెలకొనగా.. మళ్లీ ఆట మొదలైంది. ఆ తర్వాతి ఓవర్లో రెండో బంతికే అమేలియా కెర్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రేణుకా సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయింది. మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. అంపైర్లు ఇలా వ్యవహరించడం సరికాదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. సమిష్టిగా విఫలమై 58 పరుగుల తేడాతో పరాజయం పాలై.. తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదుర్కొంది.చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్OUT or NOT OUT 🧐Animated Harmanpreet Kaur Spotted🔥🔥🇮🇳#INDvsNZ #WomenInBlue #T20WorldCup pic.twitter.com/QJVYKG6ZIE— Sports In Veins (@sportsinveins) October 4, 2024 -
పాపం రుతురాజ్.. క్రికెట్ చరిత్రలో ఇలా ఎవరూ రనౌటై ఉండరు..!
టీమిండియా యువ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి రుతురాజ్ గైక్వాడ్ వినూత్న రీతిలో రనౌటై వార్తల్లో నిలిచాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో పుణేరీ బప్పా టీమ్‌కు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్ 7) రత్నగిరి జెట్స్తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా రనౌటయ్యాడు. పుణేరీ బప్పా ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రుతు రెండు పరుగులు రాబట్టే ప్రయత్నంలో బాధాకరమైన రీతిలో రనౌటయ్యాడు. రుతు రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో క్రీజ్‌లోకి చేరకముందే బ్యాట్‌కు అతని చేతికి కనెక్షన్ కట్టైంది. రుతురాజ్ బ్యాట్ క్రీజ్‌లోకి చేరినా అది అతని చేతిలో నుంచి జారిపోయింది. ఈ లోపు వికెట్‌కీపర్ వికెట్లను గిరాటు వేశాడు. రీప్లేలో రుతురాజ్ బ్యాట్ క్రీజ్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా బ్యాట్ అతని చేతిలో లేకపోవడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఈ రనౌట్ డ్రామాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.Ruturaj Gaikwad was dismissed in a bizarre fashion during Maharashtra Premier League (MPL).pic.twitter.com/zQHMxWt1kX— OneCricket (@OneCricketApp) June 7, 2024కాగా, ఈ మ్యాచ్‌లో రుతురాజ్ సారథ్యం వహిస్తున్న పుణేరీ బప్పా జట్టు ప్రత్యర్థి రత్నగిరి జెట్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పుణేరీ టీమ్ 19.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. రత్నగిరి బౌలర్లలో సత్యజిత్ (4-0-24-4) పుణేరీ టీమ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. పుణేరీ ఇన్నింగ్స్‌లో పవన్ షా (32), రుతురాజ్ (29), యశ్ సాగర్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రత్నగిరి టీమ్.. 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ధీరజ్ (25), అజిమ్ ఖాజీ (31), నిఖిల్ నాయక్ (27 నాటౌట్), సత్యజిత్ (17 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి రత్నగిరి జెట్స్‌ను గెలిపించారు. -
వారెవ్వా విరాట్.. చిరుతలా పరిగెత్తుతూ! సంచలన రనౌట్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి మరోసారి అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ సంచలన త్రో తో మెరిశాడు.కళ్లు చెదిరే త్రోతో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్‌ను కింగ్ కోహ్లి రనౌట్ చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన లూకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో నాలుగో బంతిని డిప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే డిప్ మిడ్ వికెట్లో ఫీల్డర్ లేకపోవడంతో సామ్ కుర్రాన్ రెండో పరుగుకు పిలుపునిచ్చాడు.ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి దాదాపుగా 20 మీటర్ల దూరం పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు త్రో చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. బంతిని అందుకునే క్రమంలో కోహ్లి బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి గురి మాత్రం తప్పలేదు. బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి శశాంక్ సింగ్ క్రీజును చేరుకోకపోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి రనౌట్ చూసిన సహచర ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై 60 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్, కరణ్ శర్మ, స్వప్నిల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు.He's unfolding magic tonight 💫First with the bat & now on the field with that outstanding direct hit 🎯Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvRCB | @imVkohli | @RCBTweets pic.twitter.com/6TsRbpamxG— IndianPremierLeague (@IPL) May 9, 2024 -
చరిత్ర సష్టించిన ధోని.. ఐపీఎల్లో తొలి ఆటగాడిగా
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక రౌనట్లు చేసిన ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో అనూజ్ రావత్‌ను రనౌట్ చేసిన ధోని.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 251 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ కూల్.. 24 రనౌట్లు చేశాడు. ఇంతకు ముందు ఈ అరుదైన రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. 227 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన జడేజా.. మొత్తం 23 రనౌట్లు చేశాడు. తాజా మ్యాచ్‌తో జడేజా ఆల్‌టైమ్ రికార్డును 42 ఏళ్ల ధోని బ్రేక్ చేశాడు. కాగా ఈ ఏడాది సీజన్‌కు ముందు సీఎస్కే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడు. తన బాధ్యతలను యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించేశాడు. ఇక ఈ ఏడాది సీజన్లో సీఎస్కే బోణీ కొట్టింది. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
పాపం కేన్ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి.. 12 ఏళ్లలో..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (0) ఆసక్తికర రీతిలో రనౌటయ్యాడు. కేన్ పరుగు పూర్తి చేసే క్రమంలో మరో ఎండ్ నుంచి వస్తున్న సహచరుడు విల్ యంగ్‌ను గుద్దుకోవడంతో పరుగు పూర్తి చేయలేకపోయాడు. కేన్ క్రీజ్‌కు చేరకునే లోపు లబూషేన్ డైరెక్ట్ త్రోతో వికెట్లకు గిరాటు వేశాడు. కేన్ రనౌట్ కావడానికి ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా పరోక్ష కారకుడయ్యాడు. కేన్ పరుగు తీస్తుండగా.. స్టార్క్ కూడా అడ్డుతగిలాడు (ఉద్దేశపూర్వకంగా కాదు).12 ఏళ్లలో కేన్ రనౌట్ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా అతను 2012లో రనౌటయ్యాడు. కేన్ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. KANE WILLIAMSON IS RUN OUT IN TEST CRICKET FOR THE FIRST TIME IN 12 YEARS...!!! 🤯pic.twitter.com/KRheTm61sg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 కాగా, ఆసీస్ బౌలర్లు మూకుమ్మడగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. కేన్‌తో పాటు రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయగా డారిల్ మిచెల్ 11 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలువగా.. స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్‌వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు. 204 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్మెన్ లయెన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
రెప్పపాటులో జరిగిన అద్భుతం.. జురెల్ స్కిల్ చూడాల్సిందే!
India Wicket-Keeper Dhruv Jurel Inflicts Stunning Run-Out: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమి గాయాలను చెరిపేసేలా టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి విశాఖపట్నంలో బదులు తీర్చుకున్న రోహిత్ సేన.. రాజ్‌కోట్‌లో చారిత్రాత్మక గెలుపుతో అభిమానులను ఖుషీ చేసింది. ఇంగ్లండ్‌ను ఏకంగా 434 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత టెస్టు చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(214)కు తోడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(5 వికెట్లు) బంతితో మాయాజాలం చేయడంతో ఈ గెలుపు సాధ్యమైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా భారత్ తరఫున ఇద్దరు యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వరుస అర్ధ శతకాలతో(62, 68) సత్తా చాటితే.. ఉత్తరప్రదేశ్ క్రికెటర్ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్(తొలి ఇన్నింగ్స్‌లో- 46), వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రమాదకర బ్యాటర్, ఓపెనర్ బెన్ డకెట్(4)ను రనౌట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను గట్టెక్కించాలని కంకణం కట్టుకున్న డకెట్.. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6.1వ ఓవర్లో) బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించగా.. మహ్మద్ సిరాజ్ బాల్‌ను ఆపాడు. Super Jurel 🦸♂️ with some 🔝glove-work 🔥👌#IDFCFirstBankTestSeries #INDvENG #BazBowled #JioCinemaSports pic.twitter.com/dTlzQZXKAn — JioCinema (@JioCinema) February 18, 2024 ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న జాక్ క్రాలే పరుగుకు నిరాకరించగా.. డకెట్ వెంటనే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే సిరాజ్ వేసిన బంతిని అందుకున్న వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మెరుపు వేగంతో స్టంప్‌ను ఎగురగొట్టాడు. రెప్పపాటులో జరిగిన ఈ అద్భుతం కారణంగా డకెట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జురెల్ స్కిల్స్‌కు అద్దం పట్టే వీడియోను అభిమానులు నెట్టింట షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డకెట్ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర శతకం(153)తో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. చదవండి: సర్ఫరాజ్ ఒక్కడేనా.. ఈ ‘వజ్రాన్ని’ చూడండి! (ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి) -
సర్ఫరాజ్‌ను ముంచేశాడు.. రోహిత్‌కు నచ్చలేదు!
టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు.. మరొకరికి సాయం చేసే క్రమంలో అన్యాయంగా అవుటయ్యాడని పేర్కొన్నాడు. కాగా రంజీల్లో పరుగుల వరద పారించి.. ఎన్నో రికార్డులు సృష్టించిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా అతడు టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ప్రత్యర్థి జట్టు ఎంతటి పటిష్ట బౌలింగ్ దళం కలిగి ఉన్నా.. తనకు లెక్కలేదన్నట్లుగా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించాడు. తొలి రోజు ఆటలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్.. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 అయితే, దురదృష్టవశాత్తూ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. నిజానికి స్ట్రైకర్ ఎండ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన తప్పిదానికి సర్ఫరాజ్ బలైపోయాడు. పరుగు తీస్తే సెంచరీ పూర్తి చేసుకోవచ్చన తొందరలో లేని పరుగు కోసం జడ్డూ.. పిలుపునివ్వగా సర్ఫరాజ్ క్రీజును వీడాడు. అయితే, బంతిని గమనించిన జడ్డూ మళ్లీ వెనక్కి వెళ్లగా.. అంతలోనే ఫీల్డర్ మార్క్ వుడ్ బాల్‌ను అందుకుని స్టంప్‌నకు గిరాటేశాడు. ఫలితంగా సర్ఫరాజ్ రనౌట్ అయ్యాడు. ఈ ఘటన గురించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ స్పందిస్తూ.. ‘‘తన స్వార్థం కోసం రవీంద్ర జడేజా .. యువ బ్యాటర్ అద్భుత ఇన్నింగ్స్‌ను నాశనం చేశాడు. పాపం.. ఆ యంగ్‌స్టర్ సింగిల్‌కు రమ్మనగానే పరిగెత్తాడు. అంతలో జడేజా తాను వెనక్కి వెళ్లి పోయి, అతడినీ వెళ్లమన్నాడు. వుడ్ మాత్రం వేగంగా స్పందించి స్టంప్స్‌ను గిరాటేశాడు. నిజానికి జడ్డూ చేసిన పని రోహిత్ శర్మకు ఎంతమాత్రం నచ్చలేదు’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ ఖాన్ తన కారణంగా రనౌట్ అయ్యాడంటూ జడ్డూ మ్యాచ్ అనంతరం క్షమాపణలు చెప్పాడు. ఇందుకు బదులుగా.. భయ్యా వల్లే నేను స్వేచ్ఛగా ఆడగలిగానంటూ సర్ఫరాజ్.. జడేజాకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ సెంచరీ(112) సాధించాడు. టెస్టుల్లో ఈ ఆల్‌రౌండర్‌కు ఇది నాలుగో శతకం కావడం విశేషం. చదవండి: Virat Kohli: లండన్‌లోనే ఆ బిడ్డ జననం.. మీకు ఆ హక్కు లేదు! మరీ చెత్తగా.. -
Ind Vs Eng: ఎంత పని చేశావు జడ్డూ.. పాపం సర్ఫరాజ్! రోహిత్ ఫైర్
India vs England, 3rd Test - Rohit sharma was not happy with Jadeja: టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను దురదృష్టం వెంటాడింది. అరంగేట్రంలోనే మెరుపు అర్ధ శతకం సాధించిన ఈ ముంబై బ్యాటర్ రనౌట్‌గా వెనుదిరగడం అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీ వీరుడు సర్ఫరాజ్ ఖాన్ .. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా ఎట్టకేలకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. రాజ్‌కోట్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ(131) అవుటైన తర్వాత అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు సర్ఫరాజ్. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 26 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 48 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. చక్కటి షాట్లు ఆడుతూ.. బౌండరీలు బాదుతూ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 తొలుత తప్పించుకున్నాడు రవీంద్ర జడేజాతో కలిసి రోహిత్ మాదిరే మంచి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా పయనించాడు. కానీ.. 82వ ఓవర్లో సర్ఫరాజ్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో మూడో బంతికి జడేజా ఆఫ్ దిశగా షాట్ ఆడి.. సర్ఫరాజ్ ఖాన్‌ను పరుగుకు పిలిచాడు. కానీ అంతలోనే ఫీల్డర్ బంతిని దొరకబుచ్చుకోగా.. లక్కీగా అది స్టంప్స్ మిస్ కావడంతో అప్పటికే డైవ్ చేసిన సర్ఫరాజ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి అలా ప్రమాదం తప్పింది. అయితే, ఆ మరుసటి రెండో బంతికే మళ్లీ సర్ఫరాజ్ రనౌట్ అయ్యాడు. దురదృష్టం వెంటాడింది ఆండర్సన్ బౌలింగ్‌లో జడ్డూ పరుగు తీసి సెంచరీ మార్కును అందుకునేందుకు సిద్ధం కాగా.. సర్ఫరాజ్ కూడా అతడికి సహకారం అందించేందుకు సన్నద్ధమయ్యాడు. అయితే, బంతిని గమనించిన జడేజా వెనక్కి వెళ్లగా.. అప్పటికే క్రీజు వీడిన సర్ఫరాజ్ వెనక్కి వచ్చేలోపే ప్రమాదం జరిగిపోయింది. బంతిని అందుకున్న ఫీల్డర్ మార్క్ వుడ్ స్టంప్‌నకు గిరాటేయగా.. సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఒకరకంగా జడ్డూ వల్ల పొరపాటు జరిగిందన్న చందంగా క్యాప్ తీసి నెలకేసి కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొక మంచి పార్ట్నర్షిప్ నిర్మిస్తారనుకుంటే నిరాశ ఎదురుకావడంతో హిట్‌మ్యాన్ ఇలా అసహనానికి లోనయ్యాడు. 𝑹𝒂𝒋𝒌𝒐𝒕 𝒌𝒂 𝑹𝒂𝑱𝒂 👑 Jadeja slams his fourth Test 💯 to keep #TeamIndia on the front foot ⚡#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/RSHDu8MMAD — JioCinema (@JioCinema) February 15, 2024 మరోవైపు.. సర్ఫరాజ్ సైతం తాను రనౌట్ అయిన విషయాన్ని జీర్ణించుకోలేక బాధగా పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ రనౌట్‌తో టీమిండియా డ్రెసింగ్‌రూంలో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొనగా.. ఆ మరుసటి బంతికే జడేజా సెంచరీ చేయడంతో కాస్త ఊరట లభించినట్లయింది. ఇక తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. జడ్డూ 110, కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. చదవండి: #Gill: మొన్న సెంచరీ.. ఇప్పుడు డకౌట్! ఏంటిది గిల్? Jadeja was so selfish 🙄 🤔👀 Your thoughts on this run-out of #SarfarazKhan 🤔#INDvENG #INDvsENGTest #RohitSharma#Jadejapic.twitter.com/brhecR1UqW — Fourth Umpire (@UmpireFourth) February 15, 2024 Rohit sharma was not happy with Sarfaraz run out.... He know jadeja was selfish#INDvsENGTest #SarfarazKhan #INDvENG pic.twitter.com/93cGrcOjXO — Neha Bisht (@neha_bisht12) February 15, 2024 -
క్రికెట్ చరిత్రలోనే విచిత్ర ఘటన.. ఇప్పటి వరకు చూసుండరు!
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో ఆసీస్ సొంతం చేసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో రనౌట్ విషయంలో ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయకపోవడంతో అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఇది మీకు వినడానికే కొత్తగా ఉండవచ్చు.. అసలేం ఏం జరిగిందో ఓ లూక్కేద్దాం. అసలేం ఏం జరిగిందంటే? విండీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్లో పేసర్ అల్జారీ జోసెఫ్ కవర్స్ వైపు ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టిమ్ డెవిడ్ బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌కు అందించాడు. బంతిని అందుకున్న స్పెన్సర్ జాన్సన్ బెయిల్స్‌ను పడగొట్టాడు. అయితే అది క్లియర్‌గా ఔట్ అనుకుని జాన్సన్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం మొదలు పెట్టాడు. తర్వాత రిప్లేలో బిగ్ స్క్రీన్‌పై కూడా బెయిల్స్ కిందపడేటప్పటికి జోషఫ్ క్రీజుకు దూరంగా ఉన్నట్లు కన్పించింది. దీంతో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌తో పాటు డేవిడ్ సైతం సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయారు. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ మాత్రం అతడిని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆసీస్ ఆటగాళ్లు అంపైర్‌ను ప్రశ్నించగా.. రనౌట్‌కు ఎవరూ అప్పీల్ చేయకపోవడంతో తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించానని బదులిచ్చాడు. అయితే టిమ్ డేవిడ్ మాత్రం తను అప్పీల్ చేశానని అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అతడితో కెప్టెన్ మార్ష్ కూడా అంపైర్ నిర్ణయం పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏంసీసీ రూల్స్‌లోని సెక్షన్ 31.1 ప్రకారం, అప్పీల్ లేకుండా అంపైర్లు బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించకూడదు. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! ONE OF THE RAREST MOMENTS ...!!! Johnson attempted the run out, big screen showed its out, but nobody appealed so the on-field umpire dismissed the decision. pic.twitter.com/5b0x6y6KaF — Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2024 -
వారెవ్వా శ్రేయస్.. డైరెక్ట్ త్రో! స్టోక్స్ రనౌట్.. వీడియో
India vs England, 2nd Test Day 4 Vizag: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో బ్యాటింగ్‌లో విఫలమైనా తన ఫీల్డింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. వైజాగ్ మ్యాచ్‌లో ఈ మిడిలార్డర్ బ్యాటర్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 56 (27, 29) పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ జాక్ క్రాలే(76) ఇచ్చి క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు అయ్యర్. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కాలే షాట్ ఆడేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికి బంతి గాల్లోకి లేవగానే బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్.. వెనక్కి పరిగెత్తి డైవ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇలా రెండో రోజు ఆటలో... కీలక వికెట్ పడగొట్టడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. తాజాగా సోమవారం నాటి ఆటలో అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 52.4 ఓవర్ వద్ద అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ బెన్ స్టోక్స్ బద్దకంగా కదిలాడు. ఈ క్రమంలో మిడ్ వికెట్ మీదుగా వచ్చిన బంతిని ఒంటిచేత్తో అందుకున్న శ్రేయస్ అయ్యర్.. నేరుగా దానిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికి స్టోక్స్ ఇంకా క్రీజులోకి చేరుకోకపోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోగా.. టీమిండియా విజయానికి ఇంకా మూడు వికెట్ల దూరంలో నిలిచింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ►టాస్: టీమిండియా... బ్యాటింగ్ ►మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 396-10 (112 ఓవర్లలో) ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 253-10 (55.5 ఓవర్లలో) ►రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 255-10 (78.3 ఓవర్లలో) ►ఇంగ్లండ్ విజయ లక్ష్యం: 399 రన్స్. చదవండి: Ind vs Eng: 0.45 సెకన్లలో మెరుపు వేగంతో రోహిత్.. రెప్పపాటులో క్యాచ్! -
రోహిత్ రనౌట్.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్
India vs Afghanistan, 1st T20I - Rohit Sharma Run Out: అంతర్జాతీయ టీ20 పునరాగమనంలో విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అండగా నిలిచాడు. శుబ్‌మన్ గిల్ కారణంగానే రోహిత్ వికెట్ పారేసుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. గిల్ గనుక సరైన సమయంలో స్పందించి ఉంటే రోహిత్ ఆట తీరు మరోలా ఉండేదని పేర్కొన్నాడు. సుమారు 14 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా తిరిగి టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన హిట్‌మ్యాన్.. ఆరంభ మ్యాచ్‌లోనే రనౌట్ అయ్యాడు. గిల్ కదల్లేదు.. రోహిత్ రనౌట్ మొహాలీ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. నిజానికి బంతిని బాదిన తర్వాత వేగంగా క్రీజును వీడిన రోహిత్ శర్మ.. తన జోడీ గిల్‌ను పరుగుకు రావాల్సిందిగా పిలిచాడు. కానీ ఫీల్డర్ల విన్యాసాలు గమనిస్తూ.. బంతిని చూస్తూ అలాగే ఉండిపోయిన గిల్ అక్కడి నుంచి కదల్లేదు. అప్పటికే రోహిత్.. గిల్ ఉన్న ఎండ్‌కి వచ్చేయగా.. అఫ్గనిస్తాన్ వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ వికెట్లను గిరాటేశాడు. అంతే.. రోహిత్ శర్మ సున్నాకే పెవిలియన్ చేరాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా.. తప్పు ఎవరిదన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ స్పందించాడు. రోహిత్ శర్మపై నమ్మకం ఉంచాల్సింది స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మపై శుబ్‌మన్ గిల్ నమ్మకం ఉంచాల్సింది. అంతర్జాతీయ టీ20లలో వాళ్లిద్దరు కలిసి ఓపెనింగ్ చేయడం ఇదే తొలిసారి అని తెలుసు. కానీ వన్డే, టెస్టుల్లో వారిద్దరు ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లలో కలిసి ఆడారు. శుబ్‌మన్ గిల్ బాల్నే చూస్తూ ఉండటం వల్ల సమన్వయలోపం చోటుచేసుకుంది. గిల్ అలా చేసే బదులు రోహిత్ పిలవగానే పరిగెత్తుకుని వస్తే బాగుండేది’’ అని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా రీఎంట్రీలో రోహిత్ శర్మ ఇలా డకౌట్ కావడం నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా అఫ్గనిస్తాన్‌తో మొదటి టీ20లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. ఇండోర్‌లో జనవరి 14న రెండో మ్యాచ్‌లో తలపడనుంది. చదవండి: Ind vs Afg: కావాలనే అలా చేశాం: రోహిత్ శర్మ Ind vs Afg: కోహ్లి రీఎంట్రీ.. అతడిపై వేటు? సంజూకు మళ్లీ నో ఛాన్స్ -
ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు.. శాంసన్ కెరీర్ ముగిసినట్లా!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు విండీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నిర్ణీత 20 ఓవర్లల 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా బ్యాటింగ్‌లో ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీనికి తోడు సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఇదే అనుకుంటే శాంసన్ రనౌట్ కావడం మరింత ఆశ్చర్యపరిచింది. జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతిని అక్షర్ పటేల్ కవర్స్ దిశగా ఆడాడు. అక్షర్ పటేల్ వద్దని చెప్పినా సంజూ శాంసన్ అనవసరంగా సింగిల్‌కు ప్రయత్నించాడు. సంజూ శాంసన్ క్రీజులోకి చేరేలోపే బంతిని అందుకున్న కైల్ మేయర్స్ నేరుగా వికెట్లను గిరాటేయడంతో 12 పరుగులు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే సంజూ శాంసన్ రనౌట్‌ను ఎంఎస్ ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో ధోని రనౌట్ అయిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోని అప్పటికే 51 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో షాట్ ఆడిన ధోని రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే సింగిల్‌తో సరిపెట్టుకొని ఉంటే బాగుండేది. కానీ ధోని అనవసరంగా రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. మార్టిన్ గప్టిల్ అద్బుతమైన డైరెక్ట్ హిట్‌కు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ధోని రనౌట్ కావడంతో అభిమానులు గుండె బరువెక్కిపోయింది. ఈ మ్యాచే ధోనికి అంతర్జాతీయంగా ఆఖరి మ్యాచ్‌గా మారిపోయింది. ఆ తర్వాత ధోని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇక 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా సంజూ శాంసన్ రనౌట్‌ను ధోని రనౌట్‌తో పోల్చడంతో అభిమానులు వినూత్న కామెంట్స్ చేశారు. ''ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు బాగానే ఉంది.. కానీ ధోని అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడింది ఇక్కడే.. అలా అయితే సంజూ శాంసన్ కెరీర్ కూడా ముగిసినట్లేనా''.. మీ లాజిక్‌లు తగలయ్యా.. బోలెడు కెరీర్ ఉన్న శాంసన్ ఔట్‌ను ధోని రనౌట్‌తో పోల్చకండి.. అతనికి మంచి భవిష్యత్తు ఉంది'' అంటూ పేర్కొన్నారు. pic.twitter.com/cAl95iDMV7 — No-No-Crix (@Hanji_CricDekho) August 3, 2023 WHAT A MOMENT OF BRILLIANCE! Martin Guptill was 🔛🎯 to run out MS Dhoni and help send New Zealand to their second consecutive @cricketworldcup final! #CWC19 pic.twitter.com/i84pTIrYbk — ICC (@ICC) July 10, 2019 చదవండి: Deodhar Trophy: రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్‌జోన్ -
అయ్యో హార్దిక్.. దురదృష్టమంటే నీదే! అస్సలు అది ఔటా! వీడియో వైరల్
బార్బోడస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను దురదృష్టం వెంటాడింది. ఊహించని రీతిలో హార్దిక్ రనౌటయ్యాడు. ఏం జరిగిందంటే? భారత ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన విండీస్ స్పిన్నర్ యాన్నిక్ కరియా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ స్ట్రైట్‌గా ఆడాడు. ఈ క్రమంలో కార్నియా క్యాచ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే బంతి అతడి చేతుల్లోంచి బౌన్స్ అయి నేరుగా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో స్టంప్స్‌ను తాకింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా కాస్త క్రీజు నుంచి ముందు ఉన్నట్లు అన్పించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే తొలుత రిప్లేలో హార్దిక్ క్రీజుకు చేరుకున్నప్పటికీ, బెయిల్స్ పడినప్పుడు మాత్రం బ్యాట్ గాలిలో ఉన్నట్లు కన్పించింది. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ పాండ్యాను రనౌట్‌గా ప్రకటించాడు. దీంతో 5 పరుగులు చేసిన హార్దిక్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అస్సలు పాండ్యాది ఔటా? ఇక పాండ్యాపై రనౌట్‌పై బిన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాండ్యాది నౌటాట్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ఐసీసీ కొత్త రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ పరుగు తీసే సమయంలో డైవ్ కొడుతూ బ్యాట్‌ను ముందుగా ఒకసారి గ్రౌండ్‌ను తాకి ఉంచితే చాలు. ఆ తర్వాత అదే బ్యాట్ గాలిలో ఉంచినప్పటికీ తొలుత జరిగిన చర్యనే పరిగిణలోకి తీసుకోవాలి. అంటే బ్యాట్ గాలిలో ఉండగా స్టంప్ప్‌ను గిరాటేసినప్పటికీ.. బ్యాటర్ మందుగా క్రీజులో బ్యాట్‌ను ఉంచాడు కాబట్టి నాటౌట్‌గా ప్రకటించాలి. కానీ హార్దిక్ విషయంలో మాత్రం విండీస్‌కు ఫేవర్ థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. చదవండి: నేను అస్సలు ఊహించలేదు.. కానీ క్రెడిట్ మొత్తం వాళ్లకే! అతడు సూపర్: రోహిత్ శర్మ ☝️dismissed by a whisker🤏#Windies secure the big wicket of #HardikPandya 🫤 Keep watching #WIvIND - LIVE & FREE on #JioCinema in 11 languages ✨ #SabJawaabMilenge pic.twitter.com/00TiGVvFhs — JioCinema (@JioCinema) July 27, 2023 -
పరిగెత్తడానికి మరీ ఇంత బద్దకమా.. ఫలితం అనుభవించాల్సిందే! వీడియో వైరల్
మేజర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా శనివారం శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో సీటెల్ ఓర్కాస్ ఘన విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్ ఫ్రాన్సిస్కో 142 పరుగులకే ఆలౌటైంది. సీటెల్ ఓర్కాస్ విజయంలో హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో ఓపెనర్ ఫిన్ అలెన్ విచిత్రకర రీతీలో ఔటయ్యాడు. ఏం జరిగిందంటే? శాన్ ఫ్రాన్సిస్కో ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్ వేసిన కామెరాన్ గానన్ బౌలింగ్‌లో రెండో బంతిని అలెన్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఫీల్డర్ కాస్త దూరంగా ఉండడంతో ఈజీగా పరుగు తీయవచ్చని అలెన్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌కి నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే ఫీల్డర్ షెహన్ జయసూర్య వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో క్రీజుకు దగ్గరలో ఉన్న అలెన్ కాస్త వేగంగా పరిగిత్తే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ బ్యాట్ పిచ్‌లో ఇరుక్కుపోయి కింద పడిపోయింది. అంతలో షెహన్ జయసూర్య స్టంప్స్‌ను పడగొట్టడంతో అలెన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 28 పరుగులు చేసిన అలెన్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. అలెన్ రనౌట్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రనౌట్‌పై ఓ యూజర్ స్పందిస్తూ.. "పరిగెత్తడానికి మరీ ఇంత బద్దకమా.. ఫలితం అనుభవించాల్సిందే" అంటూ కామెంట్ చేశాడు. చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. వరుసగా రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి WHAT JUST HAPPENED⁉️ Was this the only way Finn Allen could get out tonight? HEADS-UP play and a BEAUTIFUL throw from Shehan Jayasuriya! 4⃣2⃣/1⃣ (3.2) pic.twitter.com/GZk5bkYG4Q — Major League Cricket (@MLCricket) July 16, 2023 -
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే
లార్డ్స్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 371 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ పోరాడతోంది. 114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లడ్ జట్టు.. లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 128 పరుగులు కావాలి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(108) పరుగులతో అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. ఏం జరిగిదంటే? ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 52 ఓవర్ వేసిన కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని బెయిర్ స్టో వెనుక్కి విడిచిపెట్టాడు. ఈ క్రమంలో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఓవర్ ముగిసిందని భావించిన జానీ బెయిర్‌స్టో.. క్రీజును వదిలి ముందుకు వచ్చాడు. దీన్ని గమనించిన వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని స్టంప్స్‌కు త్రో చేసి రనౌట్‌కి అప్పీల్ చేశాడు. అయితే బెయిర్‌స్టో కనీసం కీపర్‌కి కానీ, అంపైర్‌కీ కానీ సిగ్నల్ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్ అంపైర్ రనౌట్‌గా ప్రకటించాడు. సాధారణంగా ఒక ఆటగాడు ఓవర్ పూర్తి అయిన వెంటనే క్రీజు నుండి బయటకు వచ్చే ముందు కీపర్ లేదా అంపైర్‌కు సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే డెడ్‌బాల్(ఓవర్ పూర్తి అయినట్లు)గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో బెయిర్‌స్టో అలా చేయనందున అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని చూసిన బెయిర్ స్టో ఆశ్యర్యపోయాడు. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన బెయిర్‌స్టో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక బెయిర్‌స్టో రనౌట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ఆసీస్ ఛీటర్స్.. ఇంగ్లండ్ ఫ్యాన్స్, జానీ బెయిర్‌స్టో రనౌట్‌ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా అభివర్ణిస్తున్నారు. ఆస్ట్రేలియా రనౌట్ అప్పీల్‌ను ఉపసంహరించుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఓవర్ అయిపోయిందనే ఉద్దేశంతో క్రీజు దాటిన వ్యక్తిని రనౌట్ చేయడం సరికాదని ఆసీస్ జట్టుపై విమర్శల గుప్పిస్తున్నారు. మరి కొంత మంది ఆసీస్‌కు ఇది అలవాటే అని, ఛీటర్స్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అదే విధంగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఛీటర్స్ అంటూ గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. చదవండి: Ind vs WI: వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. ఫోటో వైరల్ BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 -
పిచ్ మధ్యలోకి వచ్చి నిద్రపోతున్నావా? నడవడానికి ఇబ్బందిగా ఉంటే ఆడడం ఎందుకు?
యూరోపియన్ క్రికెట్ గేమ్‌లో సీరియస్‌నెస్ చాలా తక్కువగా కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకోవడం ఇక్కడ మాత్రమే చూస్తుంటాం. పరుగులు తీయడానికి ఇబ్బందులు పడుతూ అనవసరంగా రనౌట్ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఫన్నీ ఘటనే మరోసారి చోటుచేసుకుంది. రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునే చాన్స్ ఉన్నా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అయినట్లు పరిగెత్తడానికే ఇష్టపడని ఒక బ్యాటర్ చేతులు కాల్చుకున్నాడు. విషయంలోకి వెళితే.. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ లెగ్‌సైడ్ దిశగా ఆడి సింగిల్ కంప్లీట్ చేశాడు. ఫీల్డర్ బంతి అందుకొని కీపర్‌కు త్రో వేశాడు. అప్పటికే సింగిల్ పూర్తి చేసిన స్ట్రైకింగ్ బ్యాటర్ రెండో పరుగు వద్దని సిగ్నల్ ఇచ్చాడు. ఇది గమనించని నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్ ముందుకు వచ్చాడు. కానీ అప్పటికి వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. కానీ నడవడానికి కూడా ఇబ్బంది పడినట్లుగా ఏం జరగదులే అన్నట్లుగా మెళ్లిగా వెళ్లాడు. ఇదే చాన్స్‌గా భావించిన కీపర్ నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు డైరెక్ట్ త్రో వేయడం.. బ్యాటర్ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. ఇంకేముంది సదరు బ్యాటర్గారూ చేసేదేం లేక పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ''ఎక్కడలేని వింతలన్నీ యూరోపియన్ క్రికెట్లోనే జరుగుతుంటాయి''.. ''నడవడానికి ఇబ్బందిగా ఉంటే క్రికెట్ ఆడడం ఎందుకు.. కనీసం ఫిట్నెస్ కూడా లేదు.. ''పిచ్ మధ్యలోకి వచ్చి నిద్రపోతున్నావా'' అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. 😴 😴 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/ZX7kP0OECa — European Cricket (@EuropeanCricket) June 23, 2023 చదవండి: వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? 'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్ బతికుంటే సంతోషించేవాడు -
బౌలర్ పెట్టిన బిక్షతో మ్యాచ్‌ను గెలిపించాడు
జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రధానంగా వెస్టిండీస్, జింబాబ్వే,శ్రీలంకలు ఫెవరెట్‌గా కనిపిస్తున్నాయి. తాజాగా బుధవారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను రనౌట్(మన్కడింగ్) చేసే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. చేజింగ్‌లో భాగంగా స్కాట్లాండ్కు ఆఖరి ఓవర్లో 8 పరుగులు కావాల్సి ఉంది. ఆఖరి ఓవర్ మార్క్ అడైర్ వేశాడు. అడైర్ వేసిన తొలి రెండు బంతులకు ఫోర్ సహా సింగిల్ తీశాడు. మూడో బంతిని వేసే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న లీస్క్ క్రీజు బయటికి వచ్చాడు. ఇది గమనించిన మార్క్ అడైర్ బంతి వేయడం ఆపివేసి మన్కడింగ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇంతలో అలర్ట్ అయిన లీస్క్ వెంటనే బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు. అలా బతికిపోయిన లీస్క్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి స్కాట్లాండ్కు ఒక్క వికెట్ తేడాతో మరిచిపోలేని విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలవాల్సింది.. తమ ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఆ జట్టు బౌలర్ పెట్టిన బిక్షతో లీస్క్ తన జట్టును గెలిపించుకున్నాడు అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: #CWCQualifiers2023: స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా! -
#ShubmanGill: లవ్ ప్రపోజ్‌కు పడిపోయాడు.. రనౌట్ మిస్ చేశాడు!
ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో బ్యాటింగ్‌లో వీరవిహారం చేసి 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న శుబ్‌మన్ గిల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. 13 పరుగులు మాత్రమే చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే తాజాగా ఫీల్డింగ్‌లోనూ గిల్ విఫలమయ్యాడు. ఈజీ రనౌట్ చేసే చాన్స్‌ను చేజేతులా జారవిడిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇది జరిగింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్ ఆడిన షాట్ నేరుగా శుబ్‌మన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. సమన్వయ లోపంతో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరూ కూడా ఒకే వైపు పరుగెత్తారు. మూడో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, మెల్లిగా లేచి బంతి అందుకుని వికెట్ కీపర్ వైపు బంతి వేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. అయితే బంతిని ఆపగానే కంగారుపడిన శుబ్‌మన్ గిల్ బ్యాటర్లు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా బౌలింగ్ ఎండ్‌వైపు బంతి త్రో చేశాడు. అటు వైపు బంతిని ఆపేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో రనౌట్ ఛాన్స్ మిస్ అయింది. అయితే ఈ సంఘటనకి ముందు గ్రౌండ్లో ఉన్న ఓ యువతి, శుబ్‌మన్ గిల్‌కి మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ''శుబ్‌మన్ గిల్ మ్యారీ మీ'' అని రాసి ఉన్న ఫ్లకార్డును కెమెరావైపు ప్రదర్శించింది. వాస్తవానికి గిల్ దీనిని పట్టించుకోలేదు. కానీ అభిమానులు ఊరికే ఉండరుగా. గిల్ ఆ పిల్ల ప్రపోజల్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రనౌట్ చాన్స్ మిస్ చేశాడంటూ ట్రోల్ చేశారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో ఫాలోఆన్ గండం దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలతో రాణించి ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించి టీమిండియాను ఫాలోఆన్ ముప్పు నుంచి తప్పించారు. ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యం లభించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన గిల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహా ఆటతీరు నమోదు చేస్తే అభిమానుల ఆగ్రహానికి గురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మ్యాచ్‌లో విజయావకాశాలు ఆసీస్‌కే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులతో ఆడుతున్న ఆసీస్ మొత్తంగా 253 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు సమయం ఉండడంతో టీమిండియా ఏ మేరకు పోరాడుతుందనేది ఆసక్తిగా మారింది. Proposal for Shubman Gill at the Oval. pic.twitter.com/76hpNoPlbi — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్ -
#DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ కథ ఎలిమినేటర్‌లో ముగిసింది. వరుసగా రెండోసారి ఎలిమినేటర్ గండం దాటడంలో లక్నో విఫలమైంది. ముంబై ఇండియన్స్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన లక్నో 101 పరుగులకే ఆలౌటై చేతులెత్తేసింది. ఫలితంగా భారీ ఓటమిని మూటగట్టుకొని ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. అయితే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల మధ్య సమన్వయ లోపం. ఒక ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు అయ్యాయంటే వారి బ్యాటింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యాదృశ్చికంగా ఈ మూడు రనౌట్లకు ప్రధాన కారణం దీపక్ హుడా. మొదటి రెండు రనౌట్లకు తాను కారణమయ్యాడు.. చివరికి కర్మ ఫలితం అన్నట్లుగా తానే రనౌట్‌కు బలవ్వాల్సి వచ్చింది. 40 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ రనౌట్ కావడానికి ప్రధాన కారణం హుడానే. బంతిపై దృష్టి పెట్టి ఎదుట బ్యాటర్ ఎలా వస్తున్నాడో గమనించకపోగా అతన్నే గుద్దుకోవడంతో స్టోయినిస్ రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్‌ను తన తప్పిదంతో పాటు హుడా ముందుకు పరిగెత్తుకొచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవడంతో రనౌట్ అయ్యాడు. ఇక ముచ్చటగా మూడోసారి దీపక్ హుడా రనౌట్ అయ్యాడు. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్లుగా లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా రనౌట్ అయి భారీ నష్టం మిగిల్చాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా రనౌట్ చేసి హుడా పెద్ద తప్పు చేశాడు. ఈ చర్య దీపక్ హుడాను లక్నో జట్టుకు దూరం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. Run out ka Mahual!! Deepak Hooda involved in three run outs!!#LSGvMI #LSGvsMI #IPLFinals #Eliminator #CricketTwitter pic.twitter.com/SNp6Hxiv2A — cricketinsideout (@Cricketinout) May 24, 2023 చదవండి: #Akash Madhwal: దిగ్గజం సరసన.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా -
పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి దిశగా సాగుతుంది. అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్లు చేజార్చుకుంటున్న లక్నో వరుసగా రెండో సీజన్లోనూ ఎలిమినేటర్‌లోనే ఇంటిబాట పట్టేలా ఉంది. ఇక స్టోయినిస్ రనౌట్ అయిన తీరు అయితే లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో గ్రీన్ వేసిన ఐదో బంతిని స్టోయినిస్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఆడాడు. రిస్క్ అయినా రెండు పరుగులు తీసే అవకాశం ఉండడంతో ఇద్దరు వేగంగానే పరిగెత్తారు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగుకు వస్తున్న యత్నంలో అటు దీపక్ హుడా.. ఇటు స్టోయినిస్ ఇద్దరు బంతిపై దృష్టి పెట్టి తమకు తెలియకుండానే ఒక లైన్లో పరిగెత్తి ఎదురుపడ్డారు. దీంతో మిడిల్పిచ్లోకి రాగానే ఇద్దరు ఒకరినొకరు గుద్దుకున్నారు. అప్పటికే బంతిని అందుకున్న టిమ్ డేవిడ్ నేరుగా ఇషాన్ కిషన్‌కు త్రో వేయడం.. వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ స్టోయినిస్ బంతిపై దృష్టి పెట్టకుండా పరుగు తీసి ఉంటే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడేమో. The collision sums up the game for LSG😵#MarcusStoinis #LSGvsMI #IPL2023 #Cricket pic.twitter.com/kMejyL51Jy — Wisden India (@WisdenIndia) May 24, 2023 When Cricketers turn into Actors 😂#LSGvMI #owned #fixing #runout #stoinis #MumbaiIndians #LucknowSuperGiants pic.twitter.com/wOmYcjNO9J — Sai Teja Kolagani (@SaitejaKolagani) May 24, 2023 చదవండి: ప్లేఆఫ్స్.. ముంబై ఇండియన్స్ పేరిట అరుదైన రికార్డు -
చివరకు వికెట్ కీపర్ వెర్రిబాగులోడయ్యాడు!
క్రికెట్లో రనౌట్స్ ఒక్కోసారి నవ్వులు పూయిస్తాయి. అది వికెట్ కీపర్ లేదా బ్యాటర్ లేదా ఫీల్డర్ కావొచ్చు.. తాము చేసే చిన్న తప్పు జట్టుకు నష్టం తెచ్చినప్పటికి మనకు మాత్రం ఫన్ కలిగిస్తోంది. తాజాగా ఒక క్లబ్ క్రికెట్ సందర్భంగా వికెట్ కీపర్ తెలివితక్కువ పనితో నవ్వులపాలయ్యాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌లో స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ లాంగాఫ్ దిశగా ఆడి రెండు పరుగులు తీసేందుకు యత్నించాడు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం పరిగెత్తాడు. కానీ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ నుంచి స్పందన రాకపోవడంతో అప్పటికే స్ట్రైక్ ఎండ్ నుంచి మిడిల్ పిచ్‌లోకి వచ్చేసిన బ్యాటర్ ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పటికే బంతిని అందుకున్న వికెట్‌కీపర్‌కు ఈజీగా రనౌట్ చేసే చాన్స్ వచ్చింది. అలా చేయకుండా బ్యాటర్లు గొడవపడుతుండడాన్ని ఎంజాయ్ చేస్తూ అసలు విషయం మరిచిపోయాడు. తాను ఔట్ అయ్యాననుకొని స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ పెవిలియన్‌కు వెళ్తూ కీపర్ బెయిల్స్ పడగొట్టకపోవడం గమనించాడు. అయితే కీపర్ మాత్రం తాను బెయిల్స్ ఎగురగొట్టాననే భ్రమలో బౌలర్ దగ్గరకి వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ బ్యాటర్ క్రీజులోకి చేరుకొని ఇంకా బెయిల్స్ పడగొట్టలేదు నేను ఔట్ కాదు అంటూ అంపైర్‌కు బ్యాట్ చూపించాడు. రూల్ ప్రకారం బెయిల్స్ కింద పడేస్తేనే రనౌట్ అయినట్లుగా పరిగణిస్తారు. దీంతో తనను ఔట్ చేయనందుకు సదరు బ్యాటర్ కీపర్‌కు థాంక్యూ చెప్పడం విశేషం. తన చర్యకు నాలుక్కరుచుకున్న కీపర్ ఏం చేయలేక బంతిని బౌలింగ్ ఎండ్‌కు విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/7mAlyHdHe9 — Out Of Context Cricket (@GemsOfCricket) May 23, 2023 చదవండి: 'కావాలని మాత్రం కాదు.. మనసులో ఏదో గట్టిగా పెట్టుకొనే!' -
ధోనిని గుర్తుకుతెచ్చిన అనూజ్ రావత్.. అశ్విన్ డైమండ్ డక్
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో సూపర్ విజయాన్ని అందుకుంది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఏ దశలోనూ టార్గెట్ దిశగా సాగలేదు కదా.. ఆర్సీబీ బౌలర్ల దాటికి బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ నేపథ్యంలో 59 పరుగులకే కుప్పకూలి ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. ఇక మ్యాచ్‌లో రాజస్తాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ అయ్యాడు. డైమండ్ డకౌట్ అంటే ఎలాంటి బంతులు ఎదుర్కోకుండానే ఔటవ్వడం. అయితే మ్యాచ్‌లో అశ్విన్‌ను.. అనూజ్ రావత్ రనౌట్ చేసిన విధానం ఎంఎస్ ధోనిని గుర్తుకుతెచ్చింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ చివరి బంతిని హెట్‌మైర్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో హెట్‌మైర్ అశ్విన్‌కు రెండో పరుగు కోసం కాల్ ఇచ్చాడు. అప్పటికే బంతిని అందుకున్న సిరాజ్ కీపర్ అనూజ్ రావత్‌కు త్రో వేశాడు. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు వెళ్లిన రావత్.. బంతిని అందుకొని వెనుక వైపు నుంచి వికెట్లవైపు విసిరాడు. గతంలో ధోని కూడా ఇలాగే బ్యాక్ఎండ్ నుంచి వికెట్లను గిరాటేసి బ్యాటర్‌ను ఔట్ చేశాడు. ఇప్పుడు అచ్చం ధోని స్టైల్‌ను కాపీ కొట్టిన అనూజ్ రావత్ ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇక ఐపీఎల్లో ఒక బ్యాటర్ డైమండ్ డక్ అవ్వడం ఇది ఏడోసారి. ఇందులో ఐదుసార్లు సదరు జట్ల కెప్టెన్లు డైమండ్ డక్ కాగా.. రెండుసార్లు బ్యాటర్లు డైమండ్ డకౌట్ అయ్యారు. డైమండ్ డకౌట్ అయిన ఆటగాళ్లు ఎవరంటే షేన్ వార్న్ వర్సెస్ ముంబై ఇండియన్స్(2009) షేన్ వార్న్ వర్సెస్ సీఎస్కే(2010) గౌతమ్ గంభీర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(2013) ఇయాన్ మోర్గాన్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్(2021) కేఎల్ రాహుల్ వర్సెస్ కేకేఆర్(2022) ఉమ్రాన్ మాలిక్(ఎస్ఆర్హెచ్) రవిచంద్రన్ అశ్విన్(రాజస్తాన్ రాయల్స్) వర్సెస్ ఆర్సీబీ 2023 Anuj Rawat channelling a bit of Dhoni? 🤯 Superb presence of mind from the #RCB gloveman 🤩#IPLonJioCinema #RRvRCB #TATAIPL #IPL2023 pic.twitter.com/WXrBSyhQds — JioCinema (@JioCinema) May 14, 2023 చదవండి: పరుగులే కాదు క్యాచ్‌ల విషయంలోనూ రికార్డులే -
ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచిన ఇంపాక్ట్ ప్లేయర్...
-
జైశ్వాల్ శివతాండవం.. బట్లర్ త్యాగం ఊరికే పోలేదు
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 150 పరుగుల టార్గెట్‌ను 13.1 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. యశస్వి జైశ్వాల్ 47 బంతుల్లోనే 98 పరుగులు నాటౌట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. అయితే ఇదే జైశ్వాల్ రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో బట్లర్ రనౌట్‌కు ప్రధాన కారణమయ్యాడు. జైశ్వాల్‌తో మిస్ కమ్యునికేషన్ గ్యాప్ వల్ల బట్లర్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో హర్షిత్ రానా వేసిన నాలుగో బంతిని బట్లర్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే బంతిని చూస్తూ బట్లర్ క్రీజు నుంచి కాస్త ముందుకు కదిలాడు. అయితే సింగిల్ కోసం వస్తున్నాడేమోనని భావించిన జైశ్వాల్ పరిగెత్తుకొచ్చాడు. ఇది గమనించిన బట్లర్ జైశ్వాల్‌ను వద్దని వారించకుండా తాను నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. అప్పటికే బంతిని అందుకున్న రసెల్ మెరుపు వేగంతో త్రో విసరగా బట్లర్ డైరెక్ట్ హిట్‌కు బలయ్యాడు. ఒక రకంగా జైశ్వాల్‌ను ఔట్ చేయడం ఇష్టం లేక తన వికెట్‌ను త్యాగం చేశాడు. బట్లర్ త్యాగం అర్థం చేసుకున్న జైశ్వాల్ దానిని వృథా కానివ్వలేదు. తన కారణంగా బట్లర్ ఔటయ్యాడన్న కోపంతో మరింత ధాటిగా ఆడాడు. దీంతో జైశ్వాల్.. 13 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్న సమయంలో డగౌట్లో బట్లర్ పైకి లేచి చప్పట్లతో అభినందించడం హైలెట్‌గా నిలిచింది. The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 చదవండి: జైశ్వాల్ సెంచరీ కోసం తపించిన శాంసన్.. -
'నువ్వు ఆడకపోతివి.. ఆడేటోడిని రనౌట్ జేస్తివి!'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలోనే వార్నర్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే ప్రభావం చూపాల్సింది పోయి తన జట్టు ఆటగాడికే ఎసరు పెట్టాడు. ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్‌ను అనవసరంగా రనౌట్ అయ్యేలా చేశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఓవర్ తొలి బంతిని మనీష్ పాండే కవర్స్ దిశగా ఆడాడు. మనీష్ ముందుకు కదలడంతో సింగిల్‌కు పిలిచాడనుకొని మార్ష్ పరిగెత్తాడు. మనీష్ పరిగెత్తినట్లే చేసి మళ్లీ వెనక్కి వచ్చాడు. అప్పటికే మార్ష్ సగం క్రీజు దాటాడు. బంతిని అందుకున్న రహానే తెలివిగా వ్యవహరించాడు. త్రో వేయకుండా నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. మార్ష్ స్ట్రైక్ ఎండ్‌కు చేరుకున్నప్పటికి మనీష్ పాండే తన వికెట్‌ను త్యాగం చేయడానికి ఇష్టపడలేదు. దీంతో రహానే వికెట్లను ఎగురగొట్టడంతో పాపం మార్ష్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇక్కడ తప్పంతా మనీష్ పాండేదే అని క్లియర్‌గా అర్థమవుతుంది. స్ట్రైక్ ఎండ్‌వైపు వచ్చిన మార్ష్.. మనీష్ పాండేను ముందుకు వెళ్లాలని కోరినా పట్టించుకోలేదు. అయితే మార్ష్ ఔట్‌కు తానే కారణమని తెగ బాధపడిపోయిన మనీష్ పాండే తన చేత్తో హెల్మెట్‌ను బలంగా కొట్టుకోవడం కొసమెరుపు. ఇక మార్ష్‌ను ఔట్ చేసి తాను ఏమైనా ఆడాడా అంటే అదీ లేదు. పైగా 29 బాల్స్ ఎదుర్కొని 27 పరుగులు చేసి పతీరానా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. పాండే పనితనం ఎలా ఉందంటే.. తాను ఆడకపోగా.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అనవసరంగా ఔట్ చేసి విలన్‌గా తయరయ్యాడు. దీంతో మనీష్ పాండేపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అనవసరంగా రనౌట్ చేశావు.. ఆడేవాడిని ఔట్ చేశావు.. నువ్వు ఆడకపోయావో అంతే సంగతి.. అంటూ కామెంట్ చేశారు. చదవండి: క్రేజ్ మాములుగా లేదు.. యాడ్ వేయలేని పరిస్థితి! It’s so hilarious to see the way Manish Pandey bodied Marsh after calling him halfway through! 🤣🤣 pic.twitter.com/TIxVPOAlvj — Akif (@KM_Akif) May 10, 2023 Impact of Manish Pandey 🔥 pic.twitter.com/tNhUZtCF3i — Indian Memes (@Theindianmeme) May 10, 2023 చదవండి: రహానే షాక్ తిన్న వేళ.. అంపైర్ ఇంప్రెస్ అయ్యాడు -
గార్గ్ తప్పిదం.. దిక్కుతోచని స్థితిలో వార్నర్ ఔట్!
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వైఫల్యం సక్సెస్‌గా కొనసాగుతోంది. అయితే కెప్టెన్ డేవిడ్ వార్నర్ సీజన్లో మెల్లిగా ఆడుతున్నాడన్న విమర్శలు ఉన్నా బ్యాటర్‌గా జట్టు తరపున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఎవరు ఆడకపోయినా తాను ఒంటరిపోరాటం చేశాడు. అయితే తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం వార్నర్‌ను దురదృష్టం వెంటాడింది. మరో ఓపెనర్ ప్రియమ్ గార్గ్ తప్పిదం వల్ల వార్నర్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. పైగా అది నోబాల్ కావడం విశేషం. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండో బంతిని ప్రియమ్ గార్గ్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే క్రీజులో ఉన్న గార్గ్ బయటకు రావడంతో వార్నర్ సింగిల్‌కు కాల్ ఇచ్చాడేమో అని పరిగెత్తుకొచ్చాడు. కానీ రషీద్ బంతి అందుకోవడం గార్గ్ వెనక్కి వెళ్లిపోయాడు. అప్పటికే వార్నర్ పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. వార్నర్ తిరిగి వచ్చేలోపే రషీద్ వేగంగా వచ్చి వికెట్లను గిరాటేశాడు. దీంతో వార్నర్ నిరాశగా పెవిలియ్ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పాంటింగ్, గంగూలీ లాంటి ఇద్దరు దిగ్గజ కెప్టెన్ల ఆధ్వర్యంలో ఈ సీజన్లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఘోరంగా విఫలమవుతుంది. అంచనాలు అందుకోలేక చతికిలపడుతున్న ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరిని పంపాలి.. బౌలింగ్ కూర్పుపై ఒక స్పష్టతకు రాలేకపోతుంది. అంతంత బ్యాటింగ్ మాత్రమే కలిగిన ఢిల్లీ అహ్మదాబాద్ పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమేంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. Delhi capitals is mentally not ready to play tonight game Mohammad Shami Bamboozled Dc top order#GTvsDC#IPL2023#IPL#DavidWarnerpic.twitter.com/5dwOjkvc5r — Aman Raina (@ImRaina45) May 2, 2023 చదవండి: బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌కు చుక్కలే! -
#MSDhoni: హెట్‌మైర్ మిస్సయ్యాడు.. జురేల్ చిక్కాడు
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన అద్బుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. తాను డైరెక్ట్ త్రో వేశాడంటే ప్రత్యర్థి బ్యాటర్ ఔట్ అవ్వాల్సిందే అన్నట్లుగా గురి ఉంటుంది. తాజాగా గురువారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని సూపర్ రనౌట్‌తో మెరిశాడు. హెట్మైర్ను రనౌట్ చేసే చాన్స్ మిస్సయినప్పటికి ద్రువ్ జురేల్‌ను స్టన్నింగ్ త్రో విసిరి రనౌట్ చేసి ఆ లెక్కను సరిచేశాడు ధోని. విషయంలోకి వెళితే.. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నాలుగో బంతిని పతీరానా వైడ్ వేశాడు. అయితే లో ఫుల్‌టాస్ అయిన బంతి లెగ్‌స్టంప్ అవతల పడగా పడిక్కల్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ మిస్ అయింది. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్ నుంచి ద్రువ్ జురేల్ పరిగెత్తుకురావడంతో పడిక్కల్ కూడా ముందుకు కదిలాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న ధోని అక్కడినుంచే నేరుగా డైరెక్ట్ త్రో వేశాడు. అంతే జురేల్ క్రీజుకు చాలా దూరంలో ఉన్నప్పుడే బంతి వికెట్లను గిరాటేసింది. అంపైర్ డౌట్‌తో థర్డ్ అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చాడు. కానీ జురేల్ తన ఔట్ విషయంలో క్లారిటీ ఉండడంతో నిర్ణయం వచ్చేలోపే డగౌట్‌కు వెళ్లిపోయాడు. Cheetah ki chaal, baaz ki nazar aur MS Dhoni ki throw par kabhi sandeh nahi karte, Kabhi bhi maat de sakte hai..🔥#MSDhoni #RRvCSKpic.twitter.com/yq7Dr5z21F — 𝐒 𝐰 𝐚 𝐫 𝐚 (@SwaraMSDian) April 27, 2023 WHAT A THROW BY DHONI. AGE IS JUST A NUMBER FOR MS. pic.twitter.com/umut4GPWqs — Johns. (@CricCrazyJohns) April 27, 2023 చదవండి: రనౌట్ చాన్స్ మిస్.. ధోని అసహనం -
రనౌట్ చాన్స్ మిస్.. ధోని అసహనం
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని అసహనం వ్యక్తం చేశాడు. తాను వేసిన త్రోకు అడ్డుగా వచ్చిన బౌలర్ మతీషా పతీరానా వైపు కోపంగా చూడడం వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. రాజస్తాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ పతీరానా వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని హెట్‌మైర్ ఆడే ప్రయత్నంలో అతని కాలికి తగిలి ధోని వైపు వెళ్లింది. అంపైర్ లెగ్‌బై ఇవ్వగా హెట్‌మైర్ పరుగుకు యత్నించాడు. బంతిని అందుకున్న ధోని నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు డైరెక్ట్ త్రో వేశాడు. కానీ పతీరానా బంతిని అందుకునే ప్రయత్నంలో భాగంగా త్రోకు అడ్డు వచ్చాడు. అప్పటికి హెట్‌మైర్ క్రీజులోకి చేరుకోలేదు. ఒకవేళ ధోని వేసిన త్రో వికెట్లకు తాకుంటే హెట్‌మైర్ రనౌట్ అయ్యేవాడే. రనౌట్ చాన్స్ మిచ్ అవడంతో ధోని.. పతీరానాను చూస్తూ ''వాట్ యార్(What Yar)..'' అంటూ పేర్కొన్నాడు. అయితే హెట్‌మైర్ మరుసటి ఓవర్లోనే ఔటయ్యాడు. 8 పరుగులు చేసిన అతను తీక్షణ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. One of the rare scenes in cricket. Angry Ms Dhoni. 🥵 #RRvCSK pic.twitter.com/kpPFnZmD8h — Sexy Cricket Shots (@sexycricketshot) April 27, 2023 చదవండి: #MSDhoni: హెట్‌మైర్ మిస్సయ్యాడు.. జురేల్ చిక్కాడు; లెక్క సరిపోయింది -
ఎవర్రా మీరంతా?.. వదిలేస్తే వంద పరుగులైనా తీస్తారేమో!
క్రికెట్ అంటే ఆట ఒక్కటే కాదు.. మ్యాచ్ ఆడుతున్నామంటే ఆటగాడు ప్రతీ మూమెంట్ మ్యాచ్‌పైనే ఉండాలి. అంతే కానీ బాడీ ప్రజెంట్.. మైండ్ ఆబ్సెంట్ అయితే ఊహించని సంఘటనలు జరుగుతాయి. కొన్నిసార్లు తెలివితక్కువగా చేసే పనుల వల్ల ఆయా జట్లు చాలా నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా క్రికెట్ లాంటి ఆటల్లో టీమ్ వర్క్ చాలా ముఖ్యం. తాజాగా అలాంటి ఘటనే భారత్‌లో జరిగింది. విషయంలోకి వెళితే.. మ్యాట్ పిచ్‌పై ఒక లోకల్ మ్యాచ్ నిర్వహించారు. బంతిని అందుకున్న ఫీల్డర్ బౌలర్‌కు త్రో వేశాడు. అప్పటికే ప్రత్యర్థి బ్యాటర్లు సింగిల్ పూర్తి చేశారు. బంతిని అందుకునే లోపే బ్యాటర్ మరో పరుగుకు యత్నించాడు. అప్పుడు బౌలర్ స్ట్రైక్ఎండ్వైపు బంతిని విసరకుండా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు కొట్టాడు. కానీ అప్పటికే రెండో పరుగు కూడా పూర్తి చేశారు. విచిత్రమేంటంటే.. వికెట్లకు తాకిన బంతి మరోసారి బౌండరీ వైపు పరుగులు పెట్టింది. దీంతో మూడో పరుగు కోసం బ్యాటర్ పరిగెత్తడం.. ఈసారి కూడా ఫీల్డింగ్ జట్టు మినిమం కామన్సెన్స్ ఉపయోగించకుండా స్ట్రైక్ఎండ్ వైపు బంతిని విసిరారు. ఏం లాభం అప్పటికే మూడు పరుగులు వచ్చాయి. ఇక నాలుగో పరుగు కోసం పరిగెత్తగా అప్పటికి కానీ జ్ఞానోదయం కాని సదరు ఫీల్డర్లు మొత్తానికి బ్యాటర్‌ను రనౌట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/XbNmcTSxVD — Out Of Context Cricket (@GemsOfCricket) April 27, 2023 చదవండి: 'ఓటమికి అర్హులం.. ఫీల్డింగ్ వైఫల్యం కొంపముంచింది' -
ఫినిషర్ పాత్రకు న్యాయం చేయకపోగా పనికిమాలిన రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో దినేశ్ కార్తిక్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని కార్తిక్ తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ మరోసారి విఫలమయ్యాడు. 18 బంతుల్లో 22 పరుగులు చేసిన కార్తిక్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫినిషర్ పాత్రకు న్యాయం చేయని దినేశ్ కార్తిక్ ఒక పనికిమాలిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రనౌట్లలో పాలుపంచుకున్న బ్యాటర్‌గా దినేశ్ కార్తిక్ తొలి స్థానంలో నిలిచాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో సుయాష్ శర్మ వేసిన బంతిని కార్తిక్ డీప్ కవర్స్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేసిన కార్తిక్ రెండో పరుగు కోసం యత్నించాడు. అయితే మిస్ కమ్యునికేషన్ వల్ల సుయాష్ ప్రభుదేశాయ్ ఆలస్యంగా స్పందించాడు. అప్పటికే బంతిని అందుకున్న అనుకుల్ రాయ్ సుయాష్‌కు త్రో వేయగా..అతను వికెట్లను గిరాటేశాడు. దీంతో ప్రభుదేశాయ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే దినేశ్ కార్తిక్ ఐపీఎల్ చరిత్రలో 39వ రనౌట్‌లో పాలుపంచుకున్నాడు. కార్తిక్ తర్వాతి స్థానంలో 37 రనౌట్లతో రోహిత్ రెండో స్థానంలో ఉండగా.. 35 రనౌట్లతో ధోని మూడో స్థానంలో, 30 రనౌట్లతో రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనాలు సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. Dinesh Karthik The Greatest Finisher Will Finish RCB One Day 😭😂. pic.twitter.com/iGsxXmfERB — Aufridi Chumtya (@ShuhidAufridi) April 26, 2023 చదవండి: #ViratKohli: అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలి ఆటగాడిగా -
'అర్జున్ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!'
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 55 పరుగుల తేడాతో ఓటమిపాలై 2017 తర్వాత అత్యంత పెద్ద ఓటమిని మూటగట్టుకుంది. నెహల్ వదేరా 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చావ్లాను బలిచేసిన నెహల్ వదేరా.. అయితే మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన నెహర్ వదేరా చేసిన ఒక తప్పిదం చర్చనీయాంశంగా మారింది. తాను బ్యాటింగ్ చేయడం కోసం లేని పరుగు కోసం యత్నించి పియూష్ చావ్లాను రనౌట్ చేశాడు. ఆ తర్వాత అర్జున్ టెండూల్కర్ సింగిల్ తీయడానికి ప్రయత్నిస్తే అతనిపై అసహనం వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళితే.. 18వ ఓవర్లో మోహిత్ శర్మ వేసిన తొలి బంతిని పియూష్ చావ్లా మిస్ చేయడంతో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బంతిని అందుకున్నాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న నెహాల్ వదేరా వేగంగా పరిగెత్తుకొచ్చాడు. బంతి మిస్ అయిందని తెలిసినా కూడా పరిగెత్తుకురావడం పియూష్ చావ్లాను ఆశ్చర్యానికి గురి చేసింది. (Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత) Photo: IPL Twitter అంతటితో ఆగక చావ్లాను క్రీజు వదలమని సంకేతం ఇచ్చాడు. చివరికి చేసేదేం లేక చావ్లా వదేరా కోసం క్రీజు నుంచి బయటకు వచ్చి పరిగెత్తాడు. కానీ అప్పటికే సాహా మోహిత్‌కు బంతి ఇవ్వడం.. ఆలస్యం చేయకుండా వికెట్లను ఎగురగొట్టడంతో చావ్లా రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బంతిని నెహాల్ వదేరా డీప్స్వ్కేర్లెగ్ దిశగా ఆడాడు. అర్జున్‌పై అసహనం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అర్జున్ సింగిల్ కోసం పరిగెత్తుకొచ్చాడు. తన వద్దే స్ట్రైక్ ఉంచుకోవాలని భావించిన వదేరా తొలుత సింగిల్ తీయడానికి ఇష్టపడలేదు. కానీ అర్జున్ అప్పటికే సగం క్రీజు దాటడంతో చేసేదేంలేక సింగిల్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఎందుకు పరిగెత్తుకొచ్చావ్ అంటూ అర్జున్‌పై అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత బంతికి అర్జున్ సింగిల్ తీసి వదేరాకు స్ట్రైక్ ఇవ్వగా.. ఫిఫ్టీ పూర్తి చేయకుండానే వదేరా.. మోహిత్ శర్మ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. (సెంచరీలతో విధ్వంసం.. పసికూనపై లంక ఓపెనర్ల ప్రతాపం) కాగా నెహల్ వదేరాపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అర్జున్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడని తిడుతున్నావా.. మరి పియూష్ చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి''.. ''సిగ్గుండాలి.. ఫిఫ్టీ కోసం చావ్లాను బలిచేశావు.. పైగా అర్జున్‌ని తిడుతున్నావు''.. ''ఒక రకంగా నీవల్లే ముంబై ఓడింది '' అంటూ కామెంట్ చేశారు. Nehal Wadhera gets frustrated after immature run by Arjun Tendulkar. He was saying 'No' but Arjun covered 70% pitch already. #NehalWadhera #GTvsMI pic.twitter.com/VAPip85lyF — Vikram Rajput (@iVikramRajput) April 25, 2023 -
సుందరానికి తొందరెక్కువ.. తప్పించుకోవడం కష్టం!
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన కీపింగ్ స్మార్ట్‌నెస్ మరోసారి చూపించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో మొదట సూపర్ స్టంపింగ్‌తో మెరిసిన ధోని ఆఖర్లో సుందర్‌ను రనౌట్ చేసిన తీరు హైలెట్‌గా మారింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతిని మార్కో జాన్సెన్ మిస్ చేశాడు. ఒక్క పరుగుతో వచ్చేది ఏం లేదని అక్కడే ఆగిపోయే ఉంటే బాగుండేది. ఎదురుగా ఉన్నది ధోని అని తెలిసి కూడా జాన్సెన్ రిస్క్ చేశారు. ఫలితం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న సుందర్ క్రీజులోకి వచ్చేలోపే ధోని బంతితో డైరెక్ట్ హిట్ వేయడంతో వికెట్లు ఎగిరిపడ్డాయి. "సుందరానికి బాగా తొందరెక్కువ.. బంతి ధోని చేతుల్లోకి వెళితే తప్పించుకోవడం కష్టమని తెలిసి కూడా రిస్క్ అవసరమా'' అంటూ అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. \ | / Dhoni 𝚠̶𝚊̶𝚜̶ is here! 💥#CSKvSRH #TATAIPL #IPLonJioCInema #IPL2023 pic.twitter.com/9r21Ay7PIS — JioCinema (@JioCinema) April 21, 2023 చదవండి: క్లాసెన్ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు! -
సిరాజ్‌ను పూనిన రొనాల్డో.. వీడియో వైరల్
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ మరో విజయం దిశగా పరుగులు పెడుతుంది. గురువారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లు ముగిసేరికి 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇదిలా ఉంటే ఆర్సీబీ బౌలర్ సిరాజ్ పంజాబ్ బ్యాటర్ హర్‌ప్రీత్ సింగ్ బాటియాను రనౌట్ చేయడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో విజయ్‌కుమార్ వేసిన మూడో బంతిని ప్రబ్‌సిమ్రన్ సింగ్ మిడాఫ్ దిశగా ఆడాడు. సింగిల్ తీసే ప్రయత్నం చేసిన ప్రబ్‌సిమ్రన్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న హర్‌ప్రీత్ బాటియాకు కాల్ ఇచ్చాడు. ప్రబ్‌సిమ్రన్ పిలుపుతో హర్‌ప్రీత్ పరిగెత్తాడు. కానీ బంతిని అందుకున్న సిరాజ్ డైరెక్ట్ త్రో విసిరాడు. హర్‌ప్రీత్ క్రీజులోకి వచ్చేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో అతను రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. డైరెక్ట్ త్రోతో స్టన్నింగ్ రనౌట్ చేసిన సిరాజ్ రొనాల్డో ఫేమస్ 'Sui' సెలబ్రేషన్‌తో మెరిశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. WHAT A THROW, SIRAJ 🔥pic.twitter.com/iFouuBYLpe — Johns. (@CricCrazyJohns) April 20, 2023 -
బులెట్ కన్నా వేగంగా.. అక్కడుంది శాంసన్ బ్రో!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్బుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. లక్నో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మూడుఔట్లు నమోదు కాగా.. అన్నింటిలో శాంసన్ పాత్ర ఉండడం విశేషం. ఇందులో రెండు రనౌట్లు ఉంటే ఒకటి క్యాచ్ ఔట్. ఇక 29 పరుగులతో వేగంగా ఆడుతున్న నికోలస్ పూరన్‌ను సంజూ శాంసన్ ఔట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ ఓవర్ ఐదో బంతిని కృనాల్ స్వింగ్ ఆడే ప్రయత్నంలో మిస్ అయ్యాడు. అయితే క్విక్ సింగిల్ కోసం పూరన్ ముందుకు పరిగెత్తుకొచ్చాడు. కృనాల్ వద్దన్నా వినలేదు. ఇక కీపర్ శాంసన్ తన చేతిలోకి బంతి రావడమే ఆలస్యం.. డైరెక్ట్ త్రో వేశాడు. బులెట్ కన్నా వేగంతో వచ్చిన బంతి పూరన్ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. రిప్లేలో పూరన్ రనౌట్ అని క్లియర్‌గా తెలుస్తోంది. పెవిలియన్ బాట పట్టిన పూరన్ తనను తాను తిట్టుకుంటూ వెళ్లడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Brilliant keeping by captain cool #SanjuSamson to get Pooran out. #RRvLSG #RajasthanRoyals pic.twitter.com/M8ofJci3YX — Roshmi 💗 (@CricketwithRosh) April 19, 2023 What a run-out by Captain Sanju Samson - A brilliant direct hit and even Sanju didn't take off his gloves.Captain Sanju leading by example! pic.twitter.com/xOLmTLRO5B— CricketMAN2 (@ImTanujSingh) April 19, 2023 చదవండి: 'డికాక్‌ను మిస్ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!' -
పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే
ఎస్ఆర్హెచ్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యాడు. కనీసం పరిగెత్తడంలోనూ అలసత్వం ప్రదర్శించడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ జాసన్ బెహండార్ఫ్ వేశాడు. అప్పటికే రెండు ఫోర్లతో సుందర్ టచ్‌లో కనిపించాడు. Photo: IPL Twitter ఓవర్ ఐదో బంతిని ఫుల్‌టాస్ వేయగా సుందర్ మిడాఫ్ దిశగా డ్రిల్ చేశాడు. సింగిల్‌కు ప్రయత్నించిన సుందర్ మొదట్లో వేగంగానే పరిగెత్తుకు వచ్చాడు. బంతిని అందుకున్న ఫీల్డర్ టిమ్ డేవిడ్ నేరుగా బంతిని డైరెక్ట్ త్రో వేశాడు. మరి డేవిడ్ వేసిన బంతి వికెట్లకు తాకదనుకున్నాడో.. తాను ఔట్ కానని నమ్మకమో తెలియదు కానీ క్రీజుకు అడుగు దూరంలో నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ఆ నిర్లక్ష్యమే సుందర్‌ను దెబ్బకొట్టింది. రిప్లేలో సుందర్ క్రీజులోకి వచ్చేలోపే టిమ్ డేవిడ్ వేసిన త్రో డైరెక్ట్‌గా వికెట్లను తాకింది. పరిగెత్తడంలో అలసత్వం ప్రదర్శించిన సుందర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ గుప్పుమన్నాయి. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు.. పరిగెత్తడంలో ఇంత నిర్లక్ష్యమా.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అంటూ ద్వజమెత్తారు. Extreme sloppy and lazy running from Washington Sundar! When you are hitting the ball so well, why to get run out like that!!#RohitSharma𓃵 #ViratKohli𓃵 #MSDhoni𓃵 #washingtonsundar #Sundar #SRHvsMI #TATAIPL2023 #Rohit #IPLOnStar #IPL2O23 #kavyamaran pic.twitter.com/H0LtWKJcPV — Cricket Fanatic (@CricketFanati20) April 18, 2023 చదవండి: #Tilak Varma: ఉన్నది కాసేపే.. కానీ దడదడలాడించాడు -
అక్కడుంది ధోని.. టార్గెట్ మిస్సయ్యే చాన్స్ లేదు!
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సీఎస్కే కెప్టెన్‌గా 200వది. దీంతో సీఎస్కే మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మ్యాచ్ గెలిచి ధోనికి కానుకగా అందివ్వాలని చూస్తోంది. ఇక ధోని కెప్టెన్‌గా తన 200వ మ్యాచ్‌లో సూపర్ రనౌట్‌తో మెరిశాడు. మాములుగానే ధోని చేతికి బంతి చిక్కిందంటే రెప్పపాటులో వికెట్లను గిరాటేస్తాడు. తాజాగా రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఓవర్ ఆఖరి బంతిని ఆడమ్ జంపా షార్ట్ ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు. తీక్షణ క్యాచ్ వదిలేయడంతో సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే క్యాచ్ మిస్ చేసినప్పటికి తీక్షణ సరైన త్రో వేశాడు. త్రో అందుకున్న ధోని ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా నేరుగా వికెట్లను గిరాటేశాడు. అయితే ఇదే సమయంలో తుషార్ దేశ్‌పాండే తనకు బంతి వేయమని ధోనిని అడగడం గమనించొచ్చు. కానీ ధోని ఎవరికి అవకాశం ఇవ్వకూడదని భావించి తానే రనౌట్ చేశాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. Always on target @msdhoni 🎯🤩 pic.twitter.com/Z7br8nJ4zh — CricTracker (@Cricketracker) April 12, 2023 చదవండి: అరుదైన ఫీట్.. టీమిండియా తరపున తొమ్మిదో బౌలర్‌గా -
అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్; బలయ్యింది మాత్రం ఒక్కడే
ఐపీఎల్ 16వ సీజన్లో తొలిసారి ముంబై ఇండియన్స్‌కు మంచి ఆరంభం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అయితే ఇద్దరు మంచిగా ఆడుతున్నారు అన్న తరుణంలో రోహిత్ తప్పిదం కారణంగా ఇషాన్ కిషన్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో లలిత్ యాదవ్ వేసిన మూడో బంతిని ఇషాన్ పాయింట్ దిశగా ఆడాడు. సింగిల్‌కు రిస్క్ అని తెలిసినా రోహిత్ కాల్ ఇచ్చి పరిగెత్తాడు. అయితే ఇషాన్‌కు సింగిల్ తీయడం ఇష్టం లేదు. కానీ కెప్టెన్ అప్పటికే సగం పిచ్ దాటి వచ్చేయడంతో చేసేదేం లేక పరిగెత్తాడు. కానీ అప్పటికే ఫీల్డర్ ముకేశ్ కుమార్ నుంచి బంతిని అందుకున్న లలిత్ యాదవ్ ఇషాన్ క్రీజులోకి చేరుకునేలోపే వికెట్లను గిరాటేశాడు. దీంతో ఇషాన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఇషాన్ ఔటవ్వడం రోహిత్‌కు బాధ కలిగించింది. ఇషాన్ కూడా పెవిలియన్ వెళ్తూ రోహిత్‌వైపు బాధతో చూశాడు. ఇక ఇషాన్‌కు ఇది కొత్తేం కాదు. ఇంతకముందు మరో సీనియర్ కోహ్లి కారణంగా ఇటీవలే జరిగిన వన్డే సిరీస్‌లో అచ్చం ఇలానే రనౌట్ అయ్యాడు. అప్పుడు కోహ్లి కారణమైతే.. ఇప్పుడు రోహిత్. ఎటు చూసినా బలయ్యింది మాత్రం ఇషాన్ కిషనే. ఇక్కడ తేడా ఏంటంటే కోహ్లి ఔట్ చేసింది అంతర్జాతీయ మ్యాచ్ అయితే.. రోహిత్ ఔట్ చేసింది ఐపీఎల్లో. ఈ క్రమంలో రోహిత్ రనౌట్ల విషయంలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో రోహిత్ ఒక బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేయడం ఇది 37వ సారి కావడం విశేషం. ఈ విషయంలో దినేశ్ కార్తిక్‌తో కలిసి రోహిత్ సంయుక్తంగా ఉన్నాడు. ఇక తన ఓపెనింగ్ పార్టనర్‌ను రనౌట్ చేయడం రోహిత్‌కు ఇది 26వ సారి. ఈ విషయంలో ఎంఎస్ ధోనితో సంయుక్తంగా ఉండడం గమనార్హం. Rohit robbed IshanKishan. Totally unnecessary call.#DCvMI pic.twitter.com/dd8Q7rrOmK — Kasturi Shankar (@KasthuriShankar) April 11, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కఠిన ప్రశ్న.. పుజారాను నమ్ముకుంటే అంతే!
టీమిండియా స్టార్ కింగ్ కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 186 పరుగులతో దుమ్మురేపిన కోహ్లి.. వన్డేల్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేస్తాడనుకుంటే నిరాశపరుస్తున్నాడు. తొలి వన్డేలో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన కోహ్లి రెండో వన్డేలో మాత్రం 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినసంగతి తెలిసిందే. ఇక చెన్నై వేదికగా బుధవారం ఇరుజట్ల మధ్య చివరి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో మరో పది రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో కోహ్లి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ నిర్వహిస్తున్న మిస్టర్ 360 షోకి అతిథిగా హజరయ్యాడు. ఈ షోలో విరాట్ కోహ్లికి ఒక ప్రశ్న ఎదురైంది. ఇప్పటివరకు నువ్వు చూసిన వారిలో వికెట్ల మధ్య ఫాస్ట్‌గా పరిగెత్తే బెస్ట్ రన్నర్ ఎవరు.. అలాగే వరస్ట్ రన్నర్ ఎవరు అని అడిగాడు. ''నా దృష్టిలో ఎంఎస్ ధోని కంటే ఏబీ డివిలియర్స్ బెస్ట్ రన్నర్ అని చెబుతాను. వాస్తవానికి ధోనికి, నాకు చాలామంచి టెంపో ఉంటుంది. మాహీతో కలిసి బ్యాటింగ్ చేస్తుంటే నేను సింగిల్ కోసం కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గుడ్డిగా కళ్లు మూసుకుని పరిగెత్తొచ్చు. అయితే వికెట్ల మధ్య పరుగెత్తడంలో ఏబీ డివిల్లియర్స్ తర్వాతే ఎవరైనా అని కచ్చితంగా చెప్పగలను.అతను నాకంటే వేగంగా వికెట్ల మధ్య పరిగెడతాడు. కొన్నిసార్లు నేను కూడా అతనితో పరుగులు తీయడానికి వేగాన్ని అందుకోలేక అవుట్ అయిపోతానేమోనని భయపడ్డాను. ఇక వికెట్ల మధ్య పరుగెత్తడంలో వరస్ట్ రన్నర్ అంటే చతేశ్వర్ పూజారా. అతన్ని నమ్మి పరుగెట్టాలంటే భయమేస్తుంది.పూజారాకి ఓపిక చాలా ఎక్కువ. క్విక్ సింగిల్స్ తీయాల్సిన అవసరం ఏముందని అతను నమ్ముతాడు. అందుకే పూజారాతో బ్యాటింగ్ చేస్తే అతను పిలిచే దాకా నాన్‌స్ట్రైయికింగ్‌లో పడుకోవచ్చు.. అంత టైమ్ ఉంటుంది. అందుకు నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది. 2018లో దక్షిణాఫ్రికాలో పర్యటించాం. సెంచురియన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ అనుకుంటా. నేను పెద్దగా పరుగులు చేయకుండానే డగౌట్‌కు చేరాను. నేను అలా వెళ్లి కూర్చొన్నాను లేదో సౌతాఫ్రికా శిబిరంలో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మిడాన్ దిశగా ఆడిన పుజారా పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. ఎన్గిడి అనుకుంటా పుజారాను ఔట్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పార్థివ్ పటేల్ గల్లీ దిశలో ఆడాడు. పుజారా పరుగుకు పిలవడంతో పటేల్ వెళ్లాడు. అయితే క్వినైన్ బంతిని అందుకొని పుజారా క్రీజులోకి రాకముందే బెయిల్స్ ఎగురగొట్టాడు. దీంతో పుజారా ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత డగౌట్‌కు వచ్చిన పుజారాకు చివాట్లు పెట్టాను.'' అంటూ గుర్తుచేసుకున్నాడు. Join me live on “the 360 show” 60min from now. Hit the link below or find it in my bio. We have a cool show lined up! https://t.co/P0fRiTAkiA pic.twitter.com/DhHsZ62ODT — AB de Villiers (@ABdeVilliers17) March 21, 2023 చదవండి: ఒక్క మ్యాచ్‌కే పరిమితం.. మళ్లీ అదే ఆటతీరు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎంతవరకు విజయవంతం? -
చరిత్రలో నిలిచిపోయే రనౌట్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వుమెన్, యూపీ వారియర్జ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ స్టన్నింగ్ రనౌట్లతో మెరిసింది. మాములుగానే తాను ఫీల్డ్‌లో ఉందంటే ప్రత్యర్థి బ్యాటర్ల పప్పులు ఉడకవు. ఎందుకంటే బంతి ఆమె చేతి నుంచి వెళ్లడం అసాధ్యం. అయితే పరుగులు సేవ్ చేయడమో లేదంటే ప్రత్యర్థి ఆటగాళ్లను రనౌట్ చేయడమో జరుగుతుంది. తాజాగా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా రెండు రనౌట్లతో మెరవడం విశేషం. అయితే ఇసీ వాంగ్‌ను రనౌట్ చేసిన తీరుకు మాత్రం ఆమెను మెచ్చుకోకుండా ఉండలేం. ఆఖరి ఓవర్‌ను దీప్తి శర్మనే వేసింది. ఓవర్ నాలుగో బంతిని ఇసీ వాంగ్ లాంగ్‌ఆఫ్ దిశగా ఆడింది. సింగిల్ పూర్తి చేసిన వాంగ్ రెండో పరుగుకు పిలుపునిచ్చింది. అప్పటికే బంతిని అందుకున్న దీప్తి శర్మకు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఈజీగా రనౌట్ చేసే చాన్స్ వచ్చింది. కానీ తను మరోలా ఆలోచించింది. స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వెళ్తున్న ఇసీ వాంగ్‌ను రనౌట్ చేయాలనుకొని డైరెక్ట్ త్రో వేసింది. అంతే వాంగ్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీప్తి శర్మ కాన్ఫిడెంట్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. Right On Target 🎯 ft. Deepti Sharma#CricketTwitter #WPL2023 #MIvUPW pic.twitter.com/LkGcz9ubKt — Female Cricket (@imfemalecricket) March 18, 2023 చదవండి: విశాఖ చేరుకున్న క్రికెటర్లు; వర్షం నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన -
'చేసేయాల్సింది ఒక పనైపోయేది..'
క్రికెట్లో మన్కడింగ్ అనగానే గుర్తుకు వచ్చే క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేసి అశ్విన్ చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత మరోసారి కూడా మన్కడింగ్ చేశాడు. అశ్విన్ చర్యపై అభిమానులు రెండుగా చీలిపోయారు. మన్కడింగ్ అంశంపై చాలా వివాదాలు జరిగాయి. అయితే చివరకు మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ చట్టబద్ధం చేసింది మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ). అప్పటినుంచి మన్కడింగ్‌ను రనౌట్‌గా పిలవడం మొదలుపెట్టారు. ఈ నిబంధన అమల్లోకి వచ్చినప్పటి నుంచి నాన్‌స్ట్రైక్ ఎండ్ రనౌట్స్ తగ్గిపోయాయి. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని తెలిసి కొంతమంది బౌలర్లు నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్లను హెచ్చరిస్తున్నారే తప్ప రనౌట్ చేయడం లేదు. తాజాగా అశ్విన్ మరోసారి నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్‌కు హెచ్చరికలు పంపాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇది చోటుచేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో మార్నస్ లబుషేన్ ఉన్నాడు. అశ్విన్ బంతి విడవడానికి ముందే లబుషేన్ క్రీజు దాటాడు. ఇది గమనించిన అశ్విన్ చేతిలో నుంచి బంతిని విడవలేదు. అశ్విన్ చర్యతో వెంటనే అలర్ట్ అయిన లబుషేన్ తన బ్యాట్‌ను తిరిగి క్రీజులో పెట్టాడు. ఆ తర్వాత అశ్విన్ చిరునవ్వుతో లబుషేన్వైపు చూస్తూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం అశ్విన్ చేసేయాల్సింది ఒక పని అయిపోయేది.. అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లోనే మార్నస్ లబుషేన్ వెనుదిరిగాడు. 90 పరుగుల వరకు ఒక్క వికెట్ కోల్పోయి పటిష్టంగా కనిపించిన ఆసీస్ అశ్విన్ దెబ్బకు వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. పీటర్ హ్యాండ్స్కోబ్ 54 పరుగులతో ఆడుతున్నాడు. అంతకముందు ఉస్మాన్ ఖవాజా 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. జడేజా, షమీ చెరొక రెండు వికెట్లు పడగొట్టారు. Ash is setting the tone of the Legendary #BorderGavaskarTrophy #Ashwin pic.twitter.com/E2B1fMds3p — Mohammed MD (@iammohammed2022) February 17, 2023 -
దగ్గర్నుంచి కొట్టడంలోనూ ఇంత బద్దకమా!
యూరోపియన్ క్రికెట్ అంటేనే ఫన్నీకి పెట్టింది పేరు. అక్కడ ఆడే పిచ్‌లు చాలా చిన్నగా ఉంటాయి. క్లబ్ క్రికెట్‌కు మారుపేరుగా నిలిచే యూరోపియన్ లీగ్‌లో కొన్ని సంఘటనలు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. తాజాగా బౌలర్.. రనౌట్ చాన్స్‌ను మిస్ చేసిన తీరు నవ్వులు పూయిస్తుంది. చేతికి వచ్చిన బంతితో నేరుగా వికెట్లను కొట్టడంలో బౌలర్ విఫలం కావడం బ్యాటర్‌కు కలిసివచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూరోపియన్ క్రికెట్ సిరీస్ టి10 మాల్టా లీగ్‌లో బుగిబ్బా బ్లాస్టర్స్, స్వీకీ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. బ్లాస్టర్స్ బ్యాటింగ్ సమయంలో విబోర్ యాదవ్ వేసిన బంతిని బ్యాటర్ వదిలేశాడు. దీంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఇంతలో కీపర్ బంతిని విబోర్కు విసిరాడు. బంతిని సక్రమంగానే అందుకున్న అతను వికెట్లకు గిరాటేయడంలో మాత్రం విఫలమయ్యాడు. ఏదో దూరం నుంచి మిస్ అయిదంటే పర్వాలేదు.. కానీ ఒక అడుగు దూరం నుంచి కూడా రనౌట్ చేయలేకపోవడం విడ్డూరంగా అనిపించింది. Power ✅ Accuracy ❌ Missed from point-blank range😱 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether #CricketinMalta pic.twitter.com/xTORBNPQx6 — European Cricket (@EuropeanCricket) February 6, 2023 చదవండి: ఫిక్సింగ్ బారిన క్రికెటర్.. రెండేళ్ల నిషేధం -
కోహ్లి, ఇషాన్ ఇద్దరూ ఒకేవైపు.. ఏం జరిగిందో చూడండి..!
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పరుగు కోసం టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ ఒకేవైపు పరిగెత్తారు. ఫలితంగా ఇషాన్ కిషన్ రనౌటయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీలు చేసి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లి (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 17; ఫోర్, సిక్స్) సైతం బ్యాట్ ఝులిపిస్తున్నారు. ఇన్నింగ్స్ 35వ ఓవర్ మూడో బంతికి ఇషాన్ కవర్స్ దిశగా బంతిని ఆడి పరుగు కోసం కోహ్లికి పిలుపునిచ్చాడు. ఇందుకు కోహ్లి వెంటనే రియాక్ట్ అయ్యాడు. అయితే ఇషాన్ క్రీజ్ సగం మధ్యకు వచ్చాక మనసు మార్చుకుని, తిరిగి స్ట్రయికింగ్ ఎండ్‌కు వెళ్లాడు. అప్పటికే కోహ్లి క్రీజ్‌లోకి చేరుకోగా.. ఇషాన్ అతన్ని ఫాలో అయ్యాడు. pic.twitter.com/KZpVEBKwt7 — Saddam Ali (@SaddamAli7786) January 24, 2023 పరుగుకు వెళ్లాలా వద్దా అన్న సందిగ్దంలో ఉండిన ఇషాన్ చివరికి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇషాన్‌కు ఇంకా పిల్ల చేష్టలు పోలేదని, ప్రొఫెషనల్ ఆటగాడిగా ప్రవర్తించట్లేదని మండిపడుతున్నారు. రన్‌కు పిలిచి మనసు మార్చుకోవడం ఆటలో సహజమే అయినప్పటికీ.. ఇషాన్లో ఎక్కడా సిరీయస్‌నెస్ కనిపించలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇషాన్ ఇదే సిరీస్‌లో రెండో వన్డేలోనూ ఇలాగే ఇమెచ్యూర్డ్‌గా బిహేవ్ చేశాడు. అనవసరంగా స్టంపింగ్‌కు అప్పీల్ చేసి పరువు పోగొట్టుకున్నాడు. అప్పుడు కూడా నెటిజన్లు ఇషాన్‌ను ఇలాగే ఆటాడుకున్నారు. ఇషాన్‌కు పిల్ల చేష్టలు ఇంకా పోలేదని పరుష పదజాలం ఉపయోగించి కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రోహిత్, గిల్ మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ భారీ స్కోర్ చేసింది. -
రూల్స్ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం
ఐసీసీ అండర్-19 టి20 వుమెన్స్ వరల్డ్‌కప్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక మహిళా క్రికెటర్ ఐసీసీ రూల్స్‌ను తుంగలోకి తొక్కి క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను క్రీజులోకి రానీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే గాక రనౌట్‌కు కారణమైంది సదరు లంక క్రికెటర్. విషయంలోకి వెళితే.. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా వుమెన్స్, శ్రీలంక వుమెన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా వుమెన్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ నేత్రాంజలి వేసింది. ఆ ఓవర్ చివరి బంతిని అమీ స్మిత్ లాంగాఫ్ దిశగా ఆడింది. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో అమీ స్మిత్ పరిగెత్తింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న హామిల్టన్ రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో దిశానాయకే బంతి అందుకొని నాన్‌స్టైక్ర్ ఎండ్ వైపు విసిరింది. అయితే ఇదే సమయంలో అక్కడే ఉన్న నేత్రాంజలి హామిల్టన్‌కు క్రీజులోకి రాకుండా కావాలనే ఆమెకు అడ్డుగా వెళ్లింది. ఇదంతా రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అప్పటికే బంతి నేరుగా వికెట్లను గిరాటేయడం.. అంపైర్ రనౌట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ లంక బౌలర్ అడ్డుకోకపోయుంటే హామిల్టన్ సకాలంలో క్రీజులోకి చేరేదే. ఈ పరిణామంతో షాక్ తిన్న ఆసీస్ బ్యాటర్లు ఇదేం చర్య అన్నట్లుగా చూశారు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వడంతో చేసేదేం లేక హామిల్టన్ నిరాశగా పెవిలియన్ చేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అంత క్లియర్‌గా చీటింగ్ అని తెలుస్తుంది.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం'' అంటూ కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా వుమెన్స్ 108 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎల్లా హేవార్డ్ 36, సియాన్నా జింజర్ 30 పరుగులు, కేట్ పిల్లే 27 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక మహిళల జట్టు 51 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో ఒక్కరు మాత్రమే డబుల్ డిజిట్ మార్క్ అందుకోగా.. మిగతా పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మ్యాగీ క్లార్క్ , లూసీ హామిల్టన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 43 ఏళ్లలో తొలిసారి.. ముంబై జట్టుకు ఘోర అవమానం స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ -
పాపం బాబర్.. అలా ఔట్ అవుతానని అస్సలు ఊహించి ఉండడు!
కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం దురదృష్టకర రీతిలో పెవిలియన్‌కు చేరాడు. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ఇచ్చిన తప్పుడు కాల్ వల్ల బాబర్ అనవసర రనౌట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. ఏం జరిగిందంటే? పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 25 ఓవర్ వేసిన మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హక్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో ఇమామ్, బాబర్ రెండు పరుగులు పూర్తిచేసుకుని మూడో పరుగు కోసం ప్రయత్నించారు. అయితే ఇమామ్ మూడో పరుగు తీసేందుకు ముందుకు వచ్చి మళ్లీ వెనుక్కి వెళ్లిపోయాడు. అది గమనించని బాబర్ ఇమామ్ పిలుపు ఇవ్వడంతో స్ట్రైకర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరు బ్యాటర్లు ఒక వైపే ఉండిపోయారు. దీంతో కివీస్ ఫీల్డర్ హెన్రీ నికోల్స్ బౌలర్ ఎండ్ వైపు త్రో చేశాడు. ఈజీ రనౌట్ రూపంలో బాబర్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో తీవ్ర నిరాశతో బాబర్ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రెండో రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో ఇమామ్ ఉల్ హక్(74), షకీల్(13) పరుగులతో ఉన్నారు. Babar Azam Run out amazing 😍🤩 #PakistanCricket #BabarAzam #PakvsNZ #NZvsPAK #wicket pic.twitter.com/WmJxMITVlt — Salman Meo (@SalmanK62069884) January 3, 2023 చదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్‌కు త్వరలోనే గుడ్‌బై! -
తొందరెందుకు? క్రీజులో ఉండు డ్యూడ్..! అబ్బో చెప్పావులే!
Australia vs South Africa, 2nd Test: ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తాను బాల్ వేసేకంటే ముందే క్రీజు దాటేందుకు ప్రయత్నించిన ప్రొటిస్ బ్యాటర్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్. రనౌట్(మన్కడింగ్) ప్రమాదాన్ని గుర్తు చేస్తూ క్రీజులో ఉండాలి కదా అంటూ హితవు పలికాడు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్ చేస్తున్న సమయంలో తెంబా బవుమా క్రీజులో ఉన్నాడు. మూడో బంతి సంధించిన తర్వాత మరో డెలివరీకి సిద్ధమవుతున్న స్టార్క్.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న వన్‌డౌన్ బ్యాటర్ థీనిస్ డి బ్రూయిన్ క్రీజు వీడటాన్ని గమనించాడు. క్రీజులో ఉండు వెంటనే వెనక్కి వచ్చి అతడిని హెచ్చరించాడు. ‘‘క్రీజులో ఉండు. రూల్స్ ఉన్నది ఎందుకు? క్రీజులోనే ఉండు డ్యూడ్’’ అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఓవర్లో బవుమా ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. దీంతో పరుగు తీద్దామన్న ఆసక్తితో ఉన్న బ్రూయిన్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక వీడియోపై స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది అక్టోబరులో టీమిండియా బౌలర్ దీప్తి శర్మను ఉద్దేశించి స్టార్క్ విమర్శలు సంధించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ మహిళా బ్యాటర్ చార్లీ డీన్ రనౌట్(మన్కడింగ్) చేయడంపై ఎంత చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన్కడింగ్ చేయడాన్ని రనౌట్‌గా పరిగణిస్తూ నిబంధనలు వచ్చినా.. దీప్తిని చాలా మంది తప్పుబట్టారు. అపుడు దీప్తి శర్మను ఉద్దేశించి.. ఈ నేపథ్యంలో స్టార్క్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా నాన్ స్ట్రైకర్ జోస్ బట్లర్‌ను రనౌట్ చేసే అవకాశం ఉన్నా వదిలేశాడు. అంతేగాక నేనేమీ దీప్తిని కాదంటూ వ్యాఖ్యానించి టీమిండియా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక తాజాగా మరోసారి బ్యాటర్‌ను అవుట్ చేసే అవకాశం ఉన్నా వదిలేశాడు. దీంతో కొంతమంది అతడి చర్యను సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం రూల్స్ పాటించడంలో తప్పు లేదని, స్టార్క్.. నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకోనంత మాత్రాన ఇతరులను విమర్శించే హక్కు మాత్రం లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీప్తి శర్మ విషయంలో అతడి వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇన్నింగ్స్ మీద 182 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో సౌతాఫ్రికా ఓటమి పాలైంది. బాక్సింగ్ డే టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. చదవండి: Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం! IPL: జట్టును నాశనం చేయకండి.. చేతనైతే: సన్‌రైజర్స్‌పై మాజీ ప్లేయర్ ఘాటు వ్యాఖ్యలు Aus Vs SA 2nd Test: ఎదురులేని ఆసీస్.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక.. Wow! Starc reminding de Bruyn to stay grounded! 🍿#AUSvSA pic.twitter.com/2y4U9t7glv — cricket.com.au (@cricketcomau) December 28, 2022 -
'దరిద్రం నెత్తిన ఉందంటారు'.. అది ఇదేనేమో?
రనౌట్లు కొన్నిసార్లు ఊహించని విధంగా జరుగుతుంటాయి. ఒక్కోసారి బ్యాట్స్‌మెన్ గ్రహచారం బాగాలేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు. అలాంటి రనౌట్స్ మనకు నవ్వు తెప్పించినప్పటికి బ్యాటర్‌కు మాత్రం చిర్రెత్తిస్తాయి. గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి. తాజాగా యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఒక ఫన్నీ రనౌట్ చోటుచేసుకుంది. ఫ్యాన్‌కోడ్ ఈసీఎస్ మాల్టా గేమ్‌లో భాగంగా ఓవర్సీస్ క్రికెట్, స్వీకీ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఓవర్సీస్ బ్యాటర్ హెన్రిచ్ గెరిక్ బౌన్స్ అయిన బంతిని ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే బౌలర్ బంతిని అందుకునే ప్రయత్నంలో మిస్జడ్జ్ అయ్యాడు. దీంతో బంతి అతని నెత్తికి తాకి దిశను మార్చుకుంది. ఇంతలో పరుగు తీయడానికి ప్రయత్నించగా.. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ నేరుగా వికెట్లవైపు విసిరాడు. అంతే 20 బంతుల్లో 44 పరుగులతో దాటిగా ఆడుతున్న గ్రీక్ కథ అక్కడితో ముగిసింది. '' దరిద్రం నెత్తిన ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.. అయితే ఇక్కడ దరిద్రం బ్యాటర్ నెత్తిలో కాకుండా బౌలర్ నెత్తిపై ఉండడం అది బ్యాటర్‌కు శాపంగా మారిదంటూ..'' కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఓవర్సీస్ క్రికెట్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 104 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన స్వికీ యునైటెడ్ నిర్ణీత 10 ఓవర్లలో 89 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. Sometimes you gotta use your head to get a wicket🤭😝 #EuropeanCricket #EuropeanCricketSeries #CricketinMalta pic.twitter.com/fpqDXrsVY1 — European Cricket (@EuropeanCricket) December 24, 2022 చదవండి: చిన్న టార్గెట్‌కే కిందా మీదా .. ఇలాగైతే డబ్ల్యూటీసీ గెలిచేదెలా? -
బాధపడకు స్టోక్స్.. నీ త్యాగం ఊరికే పోలేదు!
17 సంవత్సరాల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లండ్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మూడోటెస్టులోనూ గెలిచి ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు పాక్ మాత్రం ఎలాగైనా టెస్టు గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటుంది. ఇక మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 304 పరుగులకు ఆలౌట్ అయింది. బలమైన బ్యాటింగ్ లైనఫ్ కలిగిన ఇంగ్లండ్ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 327 పరుగులతో ఆడుతుంది. పాక్‌పై ఇంగ్లండ్ 23 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ రనౌట్ అయిన తీరు ఆసక్తిగా నిలిచింది. హ్యారీ బ్రూక్‌తో ఏర్పడిన మిస్ కమ్యూనికేషన్ కారణంగా స్టోక్స్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 33వ ఓవర్లో ఐదో బంతిని బ్రూక్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. బ్రూక్, స్టోక్స్‌లు రెండు పరుగులు తీశారు. అయితే స్టోక్స్ మూడో పరుగు కోసం వస్తున్నాడని బ్రూక్ అంచనా వేయలేదు. బ్రూక్స్ పరిగెత్తాలనుకొనేలేపే పాక్ ఫీల్డర్ బంతిని అందుకొని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరాడు. అప్పటికే స్టోక్స్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వచ్చేశాడు. బ్రూక్స్ కోసం స్టోక్స్ తన వికెట్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే స్టోక్స్ త్యాగం ఊరికే పోలేదు. మిస్ కమ్యూనికేషన్ కారణంగా తన కెప్టెన్‌ను ఔట్ చేశానన్న బాధనో ఏమో తెలియదు కానీ మరోసారి కీలక సెంచరీతో మెరిశాడు బ్రూక్స్. ఈ సిరీస్‌లో బ్రూక్స్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 111 పరుగులు చేసిన బ్రూక్స్ మహ్మద్ వసీమ్ జూనియర్ బౌలింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. అంతేకాదు పనిలో పనిగా 125 ఏళ్ల రికార్డును కూడా బద్దలుకొట్టాడు బ్రూక్స్. ఇంగ్లండ్ తరపున తొలి ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బ్రూక్స్ నిలిచాడు. ఇంతకముందు కేఎస్ రంజిత్ సిన్హ్జి 418 పరుగులతో ఉన్నాడు. తాజాగా బ్రూక్స్ రంజిత్సిన్హ్జిని అధిగమించాడు. "Utter, utter confusion!" ⚡#PAKvENG | #UKSePK pic.twitter.com/wdyDwg9AIU — Pakistan Cricket (@TheRealPCB) December 18, 2022 చదవండి: 125 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్ ఉగ్రరూపం దాల్చిన పేసర్లు.. రెండు రోజుల్లోనే ఖేల్ ఖతం -
ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ చర్య నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ జోర్డాన్ వేశాడు. ఆ ఓవర్లో జోర్డాన్ వేసిన నాలుగో బంతిని మహ్మద్ వసీమ్ కట్‌షాట్ ఆడగా నేరుగా హ్యారీబ్రూక్ చేతుల్లోకి వెళ్లింది. బ్రూక్ క్యాచ్ పట్టుంటే మాత్రం టోర్నీలో మరొక బెస్ట్ క్యాచ్ నమోదయ్యేది. కానీ ఆఖరి నిమిషంలో బ్రూక్ బంతిని కింద పెట్టేశాడు. అప్పటికే మహ్మద్ వసీమ్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే బ్రూక్ బంతి విసరగా అందుకున్న జోర్డాన్ త్రో వేయడంలో విఫలమయ్యాడు. అలా బంతి మరోసారి పరుగులు పెట్టింది. స్టోక్స్ త్రో వేయగా.. ఈసారి కూడా జోర్డాన్ వికెట్లకు బంతిని వేయడంలో విఫలమయ్యాడు. అలా జోర్డాన్ చేసిన పనికి పాక్‌కు మూడు పరుగులు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇక టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ఘోరంగా తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పాక్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ ఆజం 32, షాన్ మసూద్ 38 పరుగులు చేశారు. pic.twitter.com/rQ5PRkMLg7 — The sports 360 (@Thesports3601) November 13, 2022 చదవండి: T20 WC Final: ఇంగ్లండ్, పాక్ ఫైనల్.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్ -
ENG Vs IND: పాండ్యా కోసం పంత్ త్యాగం..
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో పంత్ మరోసారి విఫలమయ్యాడు. కోహ్లి ఔట్ అయ్యాకా క్రీజులోకి వచ్చిన పంత్ 4 బంతుల్లో ఆరు పరుగులు చేసి రనౌటయ్యాడు. మ్యాచ్‌లో పెద్దగా మెరవకపోయినా అభిమానుల మనుసులు మాత్రం గెలుచుకున్నాడు. విషయంలోకి వెళితే.. జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ మూడో బంతిని ఔట్‌సైడ్ వేయగా పంత్ బ్యాట్‌కు తాకలేదు. అయితే పాండ్యా సింగిల్ కోసం సగం పిచ్ దాటేశాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్ వెళ్లడం ఇష్టంలేక పాండ్యా ముందుకు కదిలాడు. ఇది గమనించిన పంత్ తాను ఔటైనా పర్లేదనుకొని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. అయితే బట్లర్ నుంచి బంతి అందుకున్న జోర్డాన్ నేరుగా వికెట్లకు త్రో వేయడంతో పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో పంత్ హార్దిక్ వైపు చూస్తూ పర్లేదు.. నువ్వు ఆడు అన్నట్లుగా పేర్కొంటూ పెవిలియన్ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి పంత్ బాగా ఆడకపోయినప్పటికి అభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకున్నాడని కామెంట్ చేశారు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. పాండ్యా 63 పరుగులు, కోహ్లి 50 పరుగులతో రాణించగా.. రోహిత్ శర్మ 27 పరుగులు చేశాడు. pic.twitter.com/Wie8RPGVaU — The sports 360 (@Thesports3601) November 10, 2022 చదవండి: సెమీస్ అంటే కోహ్లికి పూనకాలే.. -
షాదాబ్ ఖాన్ సూపర్ త్రో.. కాన్వే మొహం మాడిపోయింది
టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ సూపర్ రనౌట్‌తో మెరిశాడు. హారిస్ రౌఫ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ చివరి బంతిని కాన్వే మిడాఫ్ దిశగా ఆడాడు. డెవన్ కాన్వే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కేన్ విలియమ్సన్కు కాల్ ఇచ్చాడు. విలియమ్సన్ పరిగెత్తగా.. కాన్వే మాత్రం సకాలంలో క్రీజులోకి చేరుకోలేకపోయాడు. అప్పటికే మిడాఫ్‌లో ఉన్న షాదాబ్ ఖాన్ విసిరిన డైరెక్ట్ త్రోకు కాన్వే రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ సూపర్ త్రోకు కాన్వే మొహం మాడిపోయింది. అలా పవర్ ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్ 36 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #ShadabKhan #NZvsPAK pic.twitter.com/3rNG3pYjUX — Raj (@Raj54060705) November 9, 2022 -
AFG Vs AUS: మ్యాచ్‌లో హైడ్రామా.. మ్యాక్స్‌వెల్‌పై బౌలర్ ఆధిపత్యం
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 19వ ఓవర్ నవీన్ ఉల్ హక్ వేశాడు. ఆ ఓవర్ ఆఖరి బంతికి పెద్ద హైడ్రామా నడిచింది. నవీన్ ఉల్ హక్ తొలుత రన్ అప్‌కు వచ్చి బంతి వేయకుండా పిచ్ మధ్యలోకి వచ్చి ఆగిపోయాడు. తన చర్యకు బ్యాటర్‌తో పాటు అంపైర్‌కు క్షమాపణ చెప్పాడు. ఇక రెండోసారి నవీన్ ఉల్ హక్ బంతిని వేద్దామనుకునే సమయానికి తనకు స్క్రీన్ అడ్డుగా వస్తుందని ఈసారి మ్యాక్స్‌వెల్ పక్కకు జరిగాడు. దీంతో నవీన్ ఉల్ హక్ నవ్వుతూ వెనక్కి తిరిగాడు. అలా ఒకసారి తాను ఆగిపోగా.. రెండోసారి మ్యాక్స్‌వెల్ ఆపడంతో నవీన్ ఉల్ హక్కు చిర్రెత్తింది. దీంతో మరుసటి బంతిని ఫుల్‌లెంగ్త్‌తో ఔట్‌సైడ్ వేయగా స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతిని అందుకున్న నవీన్ ఉల్ హక్ అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రిచర్డ్సన్ పిచ్ మధ్యలోకి రావడంతో కసితో డైరెక్ట్ త్రో వేయగా బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో రిచర్డ్సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. మొత్తానికి మ్యాక్స్‌వెల్ చర్యతో చిర్రెత్తిన నవీన్ ఉల్ హక్ తన రివేంజ్‌ను రిచర్డ్సన్పై చూపించడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Made it count 🧐 pic.twitter.com/zYBoVMlZtL — Aakash Srivastava (@Cursedbuoy) November 4, 2022 చదవండి: 27 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా విఫలం.. ఎట్టకేలకు NZ Vs IRE: ఐర్లాండ్‌పై ఘన విజయం.. సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్! -
మహ్మద్ నవాజ్ రనౌటా లేక ఎల్బీనా?
టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ మహ్మద్ నవాజ్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఆఖరి బంతికి నవాజ్ ప్యాడ్లను తాకుతూ ఇన్సైడ్ ఎడ్జ్ అయింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. కానీ నవాజ్ ఎలాంటి రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో మాత్రం బంతి ముందు బ్యాట్‌ను తాకినట్లు స్పైక్స్ కనిపించాయి. ఒకవేళ నవాజ్ రివ్యూకు వెళ్లి ఉంటే నాటౌట్ అయ్యేవాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది. అంపైర్ ఔట్ ఇచ్చేసరికే మహ్మద్ నవాజ్ క్రీజు బయట ఉన్నాడు. అప్పుడే బంతిని అందుకున్న ఫీల్డర్ డైరెక్ట్ త్రోతో వికెట్లను గిరాటేశాడు. అప్పటికి నవాజ్ క్రీజులోకి చేరుకోలేదు. అయితే నవాజ్ పెవిలియన్ బాట పట్టింది రనౌట్ అయినందుకా లేక ఎల్బీగానా అన్నది ఎవరికి అర్థం కాలేదు. ఒకవేళ నవాజ్ రివ్యూ తీసుకొని ఫలితం అనుకూలంగా వచ్చినా రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చేది. కానీ క్రికెట్ రూల్స్ ప్రకారం అంపైర్ ఒకసారి తన వేలిని పైకెత్తిన తర్వాత బంతిని డెడ్‌బాల్‌గా పరిగణిస్తారు. ఈ దశలో రనౌట్ చేసినా పనికిరాదు. మొత్తానికి తాను ఎలా ఔటయ్యాననే దానిపై క్లారిటీ లేకుండానే మహ్మద్ నవాజ్ పెవిలియన్ చేరడం ఆసక్తి కలిగించింది. ఇక పాకిస్తాన్‌కు సెమీస్ ఆశలు నిలవాలంటే కచ్చితంగా సౌతాఫ్రికాపై నెగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇప్తికర్ అహ్మద్ 51, షాదాబ్ ఖాన్ 52 అర్థసెంచరీలతో చెలరేగగా.. మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్‌లు తలా 28 పరుగులు చేశారు. pic.twitter.com/8lZ6zc7Qr9 — Guess Karo (@KuchNahiUkhada) November 3, 2022 చదవండి: పదే పదే మైదానంలోకి.. టీమిండియాతో ఉన్న సంబంధం? -
బ్యాటర్ కంటే ముందుగానే.. గేమ్ ఛేంజర్ నువ్వే! అతడికి హ్యాట్సాఫ్
ICC Mens T20 World Cup 2022 - India vs Bangladesh: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు తీవ్ర విమర్శలు.. మొదటి మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం.. తుది జట్టు నుంచి తప్పించాలంటూ ట్రోలింగ్.. వాటన్నింటికీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. సూపర్-12లో భాగంగా అడిలైడ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. జట్టు యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు ఈ కర్ణాటక బ్యాటర్. తద్వారా టీమిండియా భారీ స్కోరు నమోదు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. కోలుకోలేని దెబ్బ కొట్టాడు బ్యాటర్‌గా ఇలా అర్ధ శతకంతో మెరిసిన రాహుల్.. బంగ్లాదేశ్‌ను కట్టడి చేయడంలోనూ కీలక పాత్ర పోషించాడనే చెప్పుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించి బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్‌ను రనౌట్ చేయడం ద్వారా షకీబ్ బృందాన్ని కోలుకోలేని దెబ్బకొట్టాడు. నిజానికి లిటన్ దాస్ పెవిలియన్ చేరిన తర్వాత మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. వర్షం కారణంగా మ్యాచ్ డక్‌వర్త్ లూయీస్ మెథడ్లోకి వెళ్లే సమయానికి లిటన్ 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 60 పరుగులతో జోరు మీదున్నాడు. ఎనిమిదో ఓవర్లో అశ్విన్.. షాంటోకు బంతిని సంధించాడు. డీప్ మిడ్ వికెట్ దిశగా బంతిని బాదిన షాంటో.. లిటన్ దాస్‌తో కలిసి ఒక పరుగు పూర్తి చేసుకున్నాడు. రెండో రన్ కూడా తీసేందుకు ఫిక్సయిపోగా. లిటన్ దాస్ నెమ్మదిగా కదిలాడు. కొంపముంచిన రనౌట్ అదే బంగ్లాదేశ్ కొంపముంచింది. డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ డైరెక్ట్‌గా వికెట్లకు బంతిని త్రో చేశాడు. నేల మీద వేగంగా దూసుకువచ్చిన బంతి లిటన్ దాస్ డైవ్ చేసే లోపే బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో లిటన్ దాస్ నిరాశలో కూరుకుపోగా టీమిండియాలో సంబరాలు మొదలయ్యాయి. ఇక ఫామ్‌లో ఉన్న లిటన్ దాస్ పెవిలియన్ చేరిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 5 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. అతడికి హ్యాట్సాఫ్ అన్న టీమిండియా దిగ్గజం ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. లిటన్ దాస్ రనౌట్ రాహుల్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌కు అద్దం పట్టిందంటూ టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ కొనియాడాడు. బంగ్లాతో మ్యాచ్‌లో ఇదో మ్యాజికల్ మూమెంట్ అని హర్షం వ్యక్తం చేశాడు. వికెట్లను హిట్ చేయాలని చూడకుండా.. బంతిని త్రో చేసి రాహుల్ తెలివైన పని చేశాడని ప్రశంసించాడు. ఇక రాహుల్ ఫ్యాన్స్ అయితే అతడి ప్రదర్శనతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. బ్యాట్‌తో రాణించాడు. ప్రత్యర్థి జట్టులో కీలక బ్యాటర్‌ను రనౌట్ చేసి జట్టును గెలిపించడంలో కీలకంగా మారాడు. నువ్వు నిజంగా గేమ్ ఛేంజర్ భాయ్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు: ఇండియా- 184/6 (20) బంగ్లాదేశ్- 145/6 (16) డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్ Shakib Al Hasan: నాకు ఆ స్థాయి ఉందంటారా? పాపం.. పుండు మీద కారం చల్లినట్లు ఏంటది? View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind Vs Ban: పిచ్‌పై పచ్చిక.. బంగ్లా ఓపెనర్ కొంపముంచింది
టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ రనౌట్ సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. కేఎల్ రాహుల్ వేసిన బులెట్ త్రోకు లిటన్ దాస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. అయితే లిటన్ దాస్ రనౌట్‌కు పరోక్షంగా కారణమయింది మాత్రం మరో ఓపెనర్ నజీముల్ హొస్సేన్ షాంటో అయితే ప్రత్యక్షంగా మాత్రం పిచ్‌పై ఉన్న పచ్చిక. వర్షం అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తొలి ఓవర్‌ను అశ్విన్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని షాంటో డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఆడాడు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం షాంటో ప్రయత్నించగా.. లిటన్ దాస్ మాత్రంరెండో పరుగు వద్దనుకున్నాడు. కానీ షాంటో వేగంగా పరిగెత్తడంతో లిటన్ దాస్ రెండు పరుగుకు వచ్చాడు. అయితే క్రీజుపై కాస్త పచ్చిక ఉండడంతో జారిన లిటన్ మరింత స్లో అయ్యాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేఎల్ మెరుపు వేగంతో త్రో వేయగా నేరుగా వికెట్లను గిరాటేయడంతో డైరెక్ట్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అంతే పెవిలియన్ వెళ్తూ తన కోపాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియోపై మీరు ఒక లుక్కేయండి. What a run-out pic.twitter.com/i2WCPyv1PD — Adam NBA (@AdamNBA5) November 2, 2022 చదవండి: -
అశ్విన్.. మిల్లర్‌ను వదిలేసి తప్పుచేశావ్
మన్కడింగ్(నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ రనౌట్) అనగానే మొదటగా గుర్తుకువచ్చేది రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం ద్వారా అశ్విన్ పెద్ద వివాదానికే తెర లేపాడు. ఆ తర్వాత మన్కడింగ్‌ను చట్టబద్ధం చేస్తూ రూల్ తీసుకురావడంతో అశ్విన్ చర్యను సమర్థించారు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌కు మరోసారి మన్కడింగ్ చేసే అవకాశం వచ్చింది. అది కూడా ప్రొటిస్ విజయంలో కీలకపాత్ర పోషించిన డేవిడ్ మిల్లర్‌ది. అయితే ఈసారి రనౌట్ చేయకుండా కేవలం హెచ్చరికతోనే వదిలిపెట్టాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్లో అశ్విన్ చివరి బంతిని వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మిల్లర్ క్రీజు బయట ఉన్నాడు. ఇది గమినించిన అశ్విన్ బంతి వేయడం ఆపేసి మిల్లర్‌కు..''యూ ఆర్ ఔట్ ఆఫ్ క్రీజ్'' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే రూల్స్ ప్రకారం మిల్లర్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా అశ్విన్ వదిలేశాడు. ఇది క్రీడాస్పూర్తిగా పరిగణించినప్పటికి అశ్విన్ చర్యపై మాత్రం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ సంతోషంగా లేరు. ఎందుకంటే అప్పటికే మిల్లర్ తన జట్టును విజయంవైపు నడిపిస్తున్నాడు. కిల్లర్ మిల్లర్‌గా గుర్తింపు పొందిన అతను ఉంటే మ్యాచ్ కచ్చితంగా గెలిపిస్తాడు. ఈ నేపథ్యంలోనే మిల్లర్‌ను రనౌట్ చేయాల్సింది అని అభిమానులు పేర్కొన్నారు. ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే ఆ తర్వాత మిల్లర్ మూడు ఫోర్లు కొట్టి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చాడు. ఒకవేళ అశ్విన్ మిల్లర్‌ను మన్కడింగ్ చేసి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. అందుకే ఫ్యాన్స్..'' ఛ.. అశ్విన్ మిల్లర్‌ను వదిలేసి పెద్ద తప్పు చేశావ్'' అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: రోహిత్ మరీ ఇంత బద్దకమా.. -
రోహిత్ మరీ ఇంత బద్దకమా..
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ఫేలవమైన ఫీల్డింగ్ టీమిండియా కొంపముంచుతుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్‌లో మరీ బద్దకంగా కనిపించాడు. మార్ర్కమ్ రనౌట్ విషయంలో రోహిత్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. షమీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఐదో బంతిని మిల్లర్ ఆన్‌సైడ్ ఆడాడు. సింగిల్‌కు కాల్ ఇచ్చిన మిల్లర్ పరిగెత్తేలోపే బంతి రోహిత్ శర్మ అందుకున్నాడు. ఆ సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మార్క్రమ్ క్రీజు మధ్యలోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ మంచి రనౌట్ చాన్స్ మిస్ చేశాడు. ఎంత టైమ్ గ్యాప్ ఉందంటే.. డైరెక్ట్ హిట్ కాకపోయినా.. కనీసం వేగంగా పరిగెత్తి వికెట్లను తాకించినా మార్క్రమ్ ఔటయ్యేవాడు. అలా బంగారం లాంటి రనౌట్ చాన్స్ మిస్ అయింది. అంతకముందు కోహ్లి కూడా మార్క్రమ్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. అలా రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకన్న మార్క్రమ్ అర్థసెంచరీతో మెరిశాడు. Virat Kohli drops a catch & Rohit Sharma misses a run-out❌ Aiden Markram survivies twice in an over! 📸: Disney + Hotstar pic.twitter.com/pxAjo6xsWS — CricTracker (@Cricketracker) October 30, 2022 చదవండి: తెలివిగా వ్యవహరించిన కార్తిక్.. లాస్ట్ మ్యాచ్ హీరో జీరో అయ్యాడు -
మ్యాచ్‌ను మలుపు తిప్పిన రనౌట్.. పాపం జింబాబ్వే
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో ఆదివారం జింబాబ్వేతో జరిగిన పోరులో బంగ్లాదేశ్ ఉత్కంఠ విజయం సాధించింది. గెలుపు కోసం చివరి దాకా పోరాడినప్పటికి ఒత్తిడిలో జింబాబ్వే కేవలం 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే జింబాబ్వే పోరాడి ఓడినప్పటికి వారి ఆటతీరు మాత్రం సగటు అభిమానిని ఆకట్టుకుంది. ఒక దశలో జింబాబ్వే విజయానికి చేరువగా వచ్చింది. అయితే బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చేసిన రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ 64 పరుగులతో టాప్ స్కోరర్. 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో రియాన్ బర్ల్తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన సీన్ విలియమ్స్ 63 పరుగులు జోడించాడు. 9 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన దశలో షకీబ్ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతిని విలియమ్స్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే బంతి ఎక్కువ దూరం పోనప్పటికి అనవసరంగా సింగిల్‌కు ప్రయత్నించాడు. అప్పటికే బంతి వేసి అక్కడే ఉన్న షకీబ్ మెరుపువేగంతో పరిగెత్తి నాన్స్టై్రక్ ఎండ్‌వైపు బంతిని విసిరాడు. నేరుగా వికెట్లను గిరాటేయడంతో సీన్ విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలం కావడంతో జింబాబ్వే ఓటమి పాలయ్యింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: క్రికెట్ చరిత్రలో ఇలా తొలిసారి.. నాటకీయంగా నో బాల్ ప్రకటన -
సహనం కోల్పోయిన షాదాబ్ ఖాన్.. 'కెప్టెన్‌గా పనికిరావు'
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వార్మప్ మ్యాచ్‌కు పాక్ రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజం దూరంగా ఉండడంతో షాదాబ్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సాధారణంగా కెప్టెన్ అనేవాడు ఎంతో కూల్‌గా ఉంటూ జట్టు సభ్యులను కంట్రోల్ చేస్తూ తన ఆటను కొనసాగిస్తాడు. కానీ కెప్టెన్ సహనం కోల్పోయి తోటి ఆటగాళ్లపై ఆగ్రహం ప్రదర్శించడం మంచిది కాదు. అయితే షాదాబ్ ఖాన్ మాత్రం ఒక రనౌట్ విషయంలో తోటి ఆటగాడిపై అసహనం వ్యక్తం చేసి ట్రోల్స్ బారిన పడ్డాడు. ఒక్క రనౌట్‌కే సహనం కోల్పోతే ఎలా.. ఇలా అయితే కెప్టెన్‌గా పనికిరావు అంటూ కామెంట్ చేశారు. విషయంలోకి వెళితే.. అప్పటికే లియామ్ లివింగ్‌స్టోన్ మంచి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. షాదాబ్ ఖాన్ వేసిన బంతిని లివింగ్‌స్టోన్ ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. లివింగ్‌స్టోన్ సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్‌కు కాల్ ఇచ్చినప్పటికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే బంతి దూరంగా వెళ్లడంతో అప్పుడు స్పందించిన బ్రూక్ పరిగెత్తాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న హారిస్ రౌఫ్ త్రో వేయడంలో విఫలమయ్యాడు. బంతి వికెట్లకు తగిలి ఉంటే లివింగ్‌స్టోన్ కచ్చితంగా ఔటయ్యేవాడు. అంతే కోపం కట్టలు తెంచుకున్న షాదాబ్ ఖాన్ హారిస్ రౌఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 14.4 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. హ్యారీ బ్రూక్ 45 నాటౌట్, లివింగ్‌స్టోన్ 35, సామ్ కరన్ 33 నాటౌట్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 19 ఓవర్లలో( వర్షం అంతరాయం వల్ల ఒక ఓవర్ కుదింపు) 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. షాన్ మసూద్ 39, ఇప్తికర్ అహ్మద్ 22, మహ్మద్ వసీమ్ 26 పరుగులు చేశారు. Pakistan being Pakistan! #ENGvPAK #Pakistan #England #CricketTwitter pic.twitter.com/SQsU3qzNYp — Vaishnavi Iyer (@Vaishnaviiyer14) October 17, 2022 చదవండి: న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్.. సూర్యకుమార్ దూరం! -
నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు.. దటీజ్ కోహ్లి
ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. కోహ్లి కొట్టిన డైరెక్ట్ త్రోకు టిమ్ డేవిడ్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హర్షల్ పటేల్ వేసిన రెండో బంతిని జోష్ ఇంగ్లిస్ ఆన్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే క్విక్ సింగిల్ కోసం ఇంగ్లిస్ ప్రయత్నించడంతో టిమ్ డేవిడ్ స్పందించాడు. అయితే ఇక్కడే కోహ్లి తన ఫీల్డింగ్ మ్యాజిక్ చూపించాడు. బంతిని అందుకున్న కోహ్లి బులెట్ వేగంతో త్రో వేయగా.. టిమ్ డేవిడ్ క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో డేవిడ్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత కోహ్లి తీసుకున్న స్టన్నింగ్ క్యాచ్ కూడా చూసి తీరాల్సిందే. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో షమీ వేసిన లో ఫుల్‌టాస్ బంతిని లాంగాన్ దిశగా ఆడాడు. అది సిక్స్ అని అంతా భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లి అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. అయితే తన కాలు బౌండరీ తాకుతుందేమోనన్న అనుమానం కలిగినప్పటికి కోహ్లి జాగ్రత్తపడ్డాడు. దీంతో కమిన్స్ ఏడు పరుగుల చేసి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీంతో బ్యాటింగ్‌లో రాణించనప్పటికి కోహ్లి ప్రదర్శనపై అభిమానులు సంతోషంగా ఉన్నారు. ''ఫీల్డింగ్ కోసమైనా కోహ్లిని తుదిజట్టులో ఉండాల్సిందే.. నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు చేసి చూపెట్టాడు.. దటీజ్ కింగ్ కోహ్లి'' అంటూ కామెంట్ చేశారు. What a throw King Kohli 👑💯 pic.twitter.com/oOGuNGtrJS — Vinay (@YouKnowVK_) October 17, 2022 What a Catch 🔥 👑 #kohli ra luchaaaass pic.twitter.com/1C13jWYQbA — Virat Akhil Hari (@ViratAkhilHari8) October 17, 2022 ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆఖర్లో షమీ మ్యాజిక్‌తో టీమిండియా విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటై ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మహ్మద్ షమీ ఆఖరి ఓవర్లో నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 76 పరుగులు చేయగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 23 పరుగులు చేశాడు. అంతకముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లు అర్థశతకాలతో మెరిశారు. చదవండి: చెలరేగిన సూర్యకుమార్.. తగ్గేదే లే -
నీ పని నువ్వు చూసుకో ముందు! ఆ తర్వాత పక్కవాళ్ల గురించి మాట్లాడు
టీమిండియా బౌలర్ దీప్తి శర్మను ఉద్దేశించి ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘క్రికెట్ నిబంధనలు తెలియకుండానే ‘స్టార్ బౌలర్’గా ఎదిగావా?.. అయినా నీ ఆట గురించి నువ్వు చూసుకోకుండా పక్కవాళ్ల గురించి కామెంట్లు చేయడం దేనికి’’ అంటూ భారత జట్టు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంగ్లండ్‌కు మద్దతుగా నిలవాలనుకుంటే అలాగే చేయొచ్చు.. కానీ అందుకు దీప్తి పేరు ప్రస్తావించాల్సి అవసరం లేదని మండిపడుతున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్ చార్లీ డీన్‌ను దీప్తి శర్మ రనౌట్(మన్కడింగ్) చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బ్రిటిష్ మీడియా సహా పలువురు క్రీడా విశ్లేషకులు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అదే స్థాయిలో దీప్తి శర్మకు మద్దతు కూడా లభించింది. నిబంధనలకు అనుగుణంగానే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఆమె రనౌట్ చేసిందని పలువురు అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో శుక్రవారం నాటి టీ20 మ్యాచ్ సందర్భంగా మిచెల్ స్టార్క్‌కు.. జోస్ బట్లర్‌ను రనౌట్ చేసే అవకాశం లభించింది. కానీ అతడు.. ఇంగ్లండ్ సారథికి కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ‘‘నేనేమి దీప్తిని కాదు.. మన్కడింగ్ చేయడానికి.. కానీ ఇది రిపీట్ చేయకు బట్లర్'’ అని వ్యాఖ్యానించడం అతడిపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఇక ఈ విషయంపై భారత మాజీ ఆల్‌రౌండర్ హేమంగ్ బదాని స్పందిస్తూ.. ‘‘స్టార్క్ నువ్వింకా ఎదగాలి! నీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు. ఆటలో భాగంగా దీప్తి చేసిన పని నిబంధనలకు అనుగుణంగానే ఉంది. నువ్వు ఒకవేళ నాన్‌స్ట్రైకర్‌ను హెచ్చరించాలని భావిస్తే అలాగే చేయి.. అది నీ సొంత నిర్ణయం. అంతేగానీ మధ్యలో దీప్తి పేరును ఎందుకు లాగావు? క్రికెట్ ప్రపంచం నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అంటూ మిచెల్ స్టార్క్‌ను విమర్శించాడు. ఈ మేరకు బదాని చేసిన ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు.. ‘‘అవును.. నువ్వు దీప్తిశర్మవు కావు. కాలేవు. ఎందుకంటే నీకు రూల్స్ ఫాలో అయ్యే ధైర్యం లేదు కదా! అయినా తనేదో నేరం చేసినట్లు నువ్వు తన పేరును వాడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని స్టార్క్‌ను ఏకిపారేస్తున్నారు. చదవండి: Women Asia Cup Final: ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్ Runout controversy: అప్పటికే పలుమార్లు హెచ్చరించా: రనౌట్ వివాదంపై దీప్తి శర్మ వివరణ Grow up Starc. That’s really poor from you. What Deepti did was well within the rules of the game. If you only want to warn the non striker and not get him out that’s fine and your decision to make but you bringing Deepti into this isn’t what the cricket world expects of you https://t.co/vb0EyblHB8 — Hemang Badani (@hemangkbadani) October 15, 2022 -
'తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'.. దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్ చార్లీ డీన్ ను రనౌట్ (మన్కడింగ్)చేసిన విషయం తెలిసిందే. మన్కడింగ్ చట్టబద్ధం చేసినప్పటికి.. ఇంగ్లీష్ మీడియా సహా అక్కడి క్రికెటర్లు మాత్రం దీప్తి శర్మ ఏదో పెద్ద నేరం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. క్రికెట్ చట్టాల్లో ఈ నిబంధన ఉన్నా ఇలా ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ తమ వెర్రితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఒక్క ట్వీట్‌తో ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లు,విశ్లేషకులు,విమర్శకుల నోళ్లు మూయించాడు. తాజాగా షేర్ చేసిన వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియాకు సంబంధించిన ఓ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియా..తన ముందున్న వారిని దాటేయడానికి గాను సైకిల్‌ను వేగంగా తొక్కి తర్వాత తన బాడీని సీట్ మీద ఫ్లాంక్ పొజిషన్ లో ఉంచుతాడు.దీంతో సైకిల్.. తన ముందున్న సైకిళ్లను దాటేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ వీడియోను జాఫర్ రీట్వీట్ చేస్తూ.. ''ఇది (గరియా చేసిన పని) వాస్తవానికి చట్టబద్దమైనదే కావచ్చు. నిబంధనల్లో ఉండొచ్చు. కానీ ఇది సైక్లింగ్ స్ఫూర్తికి విరుద్ధం.. అని ఇ ఓ ఇంగ్లీష్ సైక్లిస్టు చెప్పాడు.తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'' అని రాసుకొచ్చాడు. పేరు చెప్పకపోయినా జాఫర్ ట్వీట్ ద్వారా ఇంగ్లీష్ మీడియా,క్రికెటర్ల వ్యాఖ్యలకు కౌంటరిచ్చినట్టేనని స్పష్టమవుతున్నది. Italian cyclist Michael Guerra uses his knowledge of physics and aerodynamics to adopt a “plank” position and overtake his competitors. pic.twitter.com/EsRt16l2PT — Ian Fraser (@Ian_Fraser) September 27, 2022 Deepti Sharma nailed id today on field 😄 what she did it was heart breaking feeling for England . Superb #DeeptiSharma . Gore ko unki line se bahar jaane ki saja 😄🤣#ENGvsIND #womenscricket #JhulanGoswami #ODI pic.twitter.com/NKnoHhfRQD — Vishoka M🇮🇳 (@Vishokha) September 24, 2022 చదవండి: ధోని కొత్త అవతారం.. వీడియో వైరల్ -
రనౌట్ వివాదంపై దీప్తి శర్మ వివరణ
-
Runout controversy: ‘అప్పటికే పలుమార్లు హెచ్చరించాం’
కోల్‌కతా: మూడో వన్డేలో ఇంగ్లండ్ చివరి బ్యాటర్ చార్లీ డీన్‌ను భారత బౌలర్ దీప్తి శర్మ రనౌట్ చేసిన తీరు వివాదంపై మ్యాచ్ ముగిసిన తర్వాత తీవ్ర చర్చ జరిగింది. దీప్తి బంతి వేయకముందే డీన్ క్రీజ్ దాటడంతో నిబంధనల ప్రకారం దీప్తి ఆమెను రనౌట్ చేసినా... మరోసారి క్రీడాస్ఫూర్తి అంశం ముందుకు వచ్చింది. దీనిపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పటికే వివరణ ఇచ్చినా దీప్తి శర్మ కూడా స్పందించింది. రిటైర్ అయిన పేసర్ జులన్ గోస్వామితో పాటు దీప్తికి స్వదేశం తిరిగొచ్చిన అనంతరం కోల్‌కతా విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ‘రనౌట్ విషయంలో మేం వ్యూహంతో సిద్ధమయ్యాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె మళ్లీ మళ్లీ క్రీజ్ దాటి ముందుకు వెళ్లింది. ఆ విషయాన్ని అంపైర్లకు కూడా చెప్పాం. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. దాంతో నిబంధనల ప్రకారమే అవుట్ చేశాం. మేం ఇంకేం చేయగలం’ అని దీప్తి వివరణ ఇచ్చింది. దీప్తి వ్యాఖ్యలపై ఇంగ్లండ్ కెప్టెన్ హీతర్ నైట్ మళ్లీ స్పందించింది. ‘మ్యాచ్ ముగిసిపోయింది. నిబంధనల ప్రకారమే చార్లీ అవుటైంది. మ్యాచ్‌తోపాటు సిరీస్ గెలిచేందుకు భారత్‌కు అన్ని విధాలా అర్హత ఉంది. అయితే రనౌట్ గురించి మమ్మల్ని హెచ్చరించారనడంలో వాస్తవం లేదు. నిజానికి వారు చేసింది తప్పు కాదు కాబట్టి హెచ్చరించాల్సిన అవసరం లేదు. కానీ తాము చేసిన దానిని సమర్థించుకోవాలని, అందుకు హెచ్చరిక అనే ఒక అబద్ధాన్ని వాడుకోవాలని కూడా భారత్ భావించరాదు’ అని నైట్ వ్యాఖ్యానించింది. తానియా గదిలో చోరీ... వన్డే సిరీస్‌లో భారత జట్టు సభ్యురాలిగా ఉన్న తానియా భాటియాకు అనూహ్య పరిణామం ఎదురైంది. లండన్‌లో ఆమె బస చేసిన మారియట్ హోటల్లోని తన గదిలో దొంగతనం జరిగినట్లు ఆమె వెల్లడించింది. ‘నన్ను చాలా నిరాశకు గురి చేసిన, నిర్ఘాంతపోయే ఘటన ఇది. ఎవరో అపరిచితులు నా గదిలోకి వచ్చి బ్యాగ్ చోరీ చేశారు. ఇందులో నగదు, కార్డులు, గడియారాలతో పాటు నగలు కూడా ఉన్నాయి. ఇంగ్లండ్ బోర్డుతో భాగస్వామ్యం ఉన్న హోటల్లోనే ఇలా జరిగింది. భద్రతా ఏర్పాట్ల వైఫల్యం ఇది. వీలైనంత తొందరగా విచారణ జరిపి తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నా’ అని తానియా ట్వీట్ చేసింది. -
ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్'లా కనబడింది
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌ను టీమిండియా 16 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే గాక చివరి మ్యాచ్ ఆడిన ఝులన్ గోస్వామికి విజయాన్ని కానుకగా అందించింది. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా నెలకొంది. ఇంగ్లండ్ చివరి వికెట్ వివాదాస్పదమైంది. దీప్తి శర్మ బంతి వేయకముందే నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్ (47; 5 ఫోర్లు) క్రీజు దాటి ముందుకు వెళ్లింది. యాక్షన్ పూర్తి చేసిన దీప్తి వెంటనే వికెట్లను గిరాటేసింది. దాంతో చార్లీ డీన్‌ను అంపైర్ రనౌట్‌గా ప్రకటించడంతో భారత విజయం ఖాయమైంది. ఇలా ఔట్ చేయడాన్ని మన్కడింగ్ అంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన్కడింగ్‌పై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. కానీ ఇటీవలే క్రికెట్లో చట్టాలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. దీంతో మన్కడింగ్ ఇకపై రనౌట్‌గా పిలవనున్నారు. ఐసీసీ కూడా దీనికి ఆమోదముద్ర వేసింది. కాగా అక్టోబర్ 1 నుంచి క్రికెట్లో మన్కడింగ్(రనౌట్) సహా పలు కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఇక ఐపీఎల్లో రవిచంద్రన్ అశ్విన్.. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. తాజాగా టీమిండియా నుంచి అశ్విన్ తర్వాత మన్కడింగ్ చేసిన బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. దీంతో క్రికెట్ అభిమానులు.. ''ఇవాళ దీప్తి శర్మ మరో అశ్విన్‌లా కనబడింది.. తగ్గేదే లే'' అంటూ కామెంట్ చేశారు. What’s your take on this? A: What Deepti did was spot on! B: Hey mate, where is the spirit of the game? C: Stay within the laws (crease) or get OUT! Comment below!#ENGvIND | #DeeptiSharma | #ThankYouJhulan pic.twitter.com/CjWxr0xkiz — Women’s CricZone (@WomensCricZone) September 24, 2022 చదవండి: జులన్‌కు క్లీన్‌స్వీప్ కానుక -
'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్!
మాములుగా క్రికెట్లో రనౌట్ అంటే హార్ట్ బ్రేకింగ్ లాంటిది. మ్యాచ్ ఉత్కంఠస్థితిలో ఉన్నప్పుడు కీలక బ్యాటర్ రనౌట్‌గా వెనుదిరిగితే విజయపథంలో ఉన్న జట్టుకు చాలా నష్టం కలిగిస్తుంది. అదే రనౌట్ ప్రత్యర్థి జట్టుకు ఊహించని విజయాన్ని అందింస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే రనౌట్ మాత్రం కాస్త వింతగా ఉంది. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న పాక్ క్రికెటర్ రనౌట్ అయిన తీరు నవ్వులు పూయిస్తుంది. విషయంలోకి వెళితే.. పాకిస్తాన్‌కు చెందిన రోహెయిల్ నజీర్ అనే వికెట్ కీపర్ ముల్తాన్ వేదికగా నేషనల్ టి20 కప్‌లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో రోహెయిల్స్ నార్త్రన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కైబర్ పక్తున్వాతో మ్యాచ్‌లో బ్యాటింగ్ వచ్చిన నజీర్ ఫ్రీ హిట్‌ను భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచింది. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ క్యాచ్ తీసుకున్నాడు. అయితే ఫ్రీ హిట్ కావడంతో ఔట్‌గా పరిగణించరు. ఇక్కడివరకు బాగానే ఉంది. నజీర్ సింగిల్ కోసం పరిగెత్తకుండా బద్దకాన్ని ప్రదర్శించాడు. క్రీజులోకి వచ్చేవరకు కూడా ఏదో అత్తారింటికి వెళ్లినట్లు మెళ్లిగా నడుచుకుంటూ వచ్చాడు. ఇది గమనించిన ఫీల్డర్.. ప్రీ హిట్లో రనౌట్‌కు అవకాశముందని తెలిసి వెంటనే వికెట్లకు గిరాటేశాడు. అంతే నజీర్ క్రీజులో బ్యాట్ పెట్టడానికి 10 సెకన్ల ముందే బంతి వికెట్లను గిరాటేసింది. అప్పటికి తన బద్దకాన్ని వదిలించుకోకుండా నవ్వుతూ ఉండిపోయాడు. అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా.. అందులో నజీర్ రనౌట్ అని తేలింది. దీంతోఅతని ఇన్నింగ్స్ ఊహించని రీతిలో ఎండ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు.. వీడిని క్రికెటర్ అని ఎవరైనా అంటారా''.. ''కర్మ ఫలితం అనుభవించాల్సిందే''.. ''పాక్ క్రికెటర్లతో ఏదైనా సాధ్యమే''.. అంటూ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Pakistan Cricket (@therealpcb) చదవండి: పవర్ హిట్టర్ రీఎంట్రీ.. టి20 ప్రపంచకప్‌కు విండీస్ జట్టు -
గమ్మత్తుగా కేన్ మామ వ్యవహారం..
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో భారీ విజయం దక్కించుకొని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ రనౌట్ నుంచి తప్పించుకున్న తీరు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే.. తొలి ఓవర్లోనే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఔటయ్యాడు. గప్టిల్ తర్వాత కేన్ విలియమ్సన్ క్రీజులో అడుగుపెట్టాడు. ఆడిన తొలి బంతికే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించకున్నాడు. ఆ తర్వాత కూడా పెద్దగా ఆడలేదనుకోండి.. కానీ జట్టు టాప్ స్కోరర్‌గా మాత్రం నిలిచాడు. మిచెల్ స్టార్కవేసిన బంతిని విలియమ్సన్ కవర్స్‌లోకి ఆడి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న డెవన్ కాన్వేను పట్టించుకోకుండానే వచ్చశాడు. అప్పటికే ఫీల్డింగ్ చేస్తున్న సీన్ అబాట్‌కు బంతి దొరకలేదు. ఆ సమయంలో ఇద్దరు బ్యాటర్లు నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు పరుగు తీశారు. బంతిని అందుకోవడంలో అబాట్ మళ్లీ విఫలమయ్యాడు. అయితే ఈసారి ఇద్దరు బ్యాటర్లు గమ్మత్తుగా స్ట్రైకింగ్ ఎండ్‌వైపు పరుగులు తీశారు. అయితే బంతిని అందుకున్న కీపర్ అలెక్స్ కేరీ వికెట్లకు కొట్టడంలో సఫలం కాలేకపోయాడు. దీంతో కివీస్ కెప్టెన్ కేన్ మామ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 61 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్ 25 పరుగులు చేశాడు. అయితే 150 పరుగుల మార్క్‌ను దాటుతుందా అన్న అనుమానం కలిగినప్పటికి చివర్లో మిచెల్ స్టార్క్(45 బంతుల్లో 38 నాటౌట్), జోష్ హాజిల్‌వుడ్(16 బంతుల్లో 23 పరుగులు నాటౌట్) చేయడంతో నిర్ణీత ఓవర్లలో 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 33 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలి 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.కేన్ విలియమ్సన్ 17, మిచెల్ సాంట్నర్ 16 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఇరు జట్లఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే సెప్టెంబర్ 11న(ఆదివారం) జరగనుంది. Mayhem in the middle #AUSvNZ pic.twitter.com/FzBY9SuKHD — cricket.com.au (@cricketcomau) September 8, 2022 చదవండి: AUS Vs NZ 2nd ODI: ఆస్ట్రేలియానే దారుణమనుకుంటే.. అంతకన్నా చెత్తగా ఆడి! -
పంత్ ప్రవర్తనపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. వెస్టిండీస్‌తో నాలుగో టి20లో బ్యాటింగ్‌లో 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసిన పంత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే పూరన్ రనౌట్ విషయంలో పంత్ ప్రవర్తన హిట్‌మ్యాన్‌కు కోపం తెప్పించింది. విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ 5వ ఓవర్లో నికోలస్ పూరన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ రనౌట్ చేసింది ఎవరో కాదు.. రిషబ్ పంత్. అయితే రనౌట్‌కు ముందు ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కవర్ పాయింట్ దిశగా ఆడిన పూరన్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కైల్ మేయర్స్ వద్దని వారించిన వినకుండా ముందుకు పరిగెత్తాడు. అప్పటికే మిడ్‌ఫీల్డ్‌లో ఉన్న సంజూ శాంసన్ వేగంగా పరిగెత్తుకొచ్చి పంత్‌కు క్విక్ త్రో వేశాడు. బంతిని అందుకున్న పంత్.. వికెట్లను గిరాటేయకుండా సమయాన్ని వృథా చేశాడు. అయితే పూరన్ అప్పటికే సగం క్రీజు దాటి మళ్లీ వెనక్కి వచ్చినా తాను క్లియర్ రనౌట్ అవుతానని తెలిసి ఆగిపోయాడు. ఆ తర్వాత పంత్ బెయిల్స్ ఎగురగొట్టాడు. అయితే ఇదంతా గమనించిన రోహిత్.. పంత్ దగ్గరకు వచ్చి..''సమయం ఎందుకు వృథా చేస్తున్నావ్.. బంతి దొరికిన వెంటనే బెయిల్స్ పడగొట్టొచ్చుగా'' అంటూ కోపాన్ని ప్రదర్శించాడు. అయితే తర్వాత కూల్ అయిన రోహిత్.. నవ్వుతూ పంత్‌ను హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా క్రీజులోకి వచ్చిన వెంటనే మూడు భారీ సిక్సర్లతో విరుచుకుపడిన పూరన్ 8 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. అతను క్రీజులో నిలదొక్కుకుంటే ఎంత డేంజర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే పూరన్ రనౌట్ విషయంలో పంత్ ప్రవర్తనపై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అభిమానులు కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా 55 పరుగుల తేడాతో విజయం అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (31 బంతుల్లో 44; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజు సామ్సన్ (23 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం విండీస్ 19.1 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. పూరన్ (24), రావ్మన్ పావెల్ (24) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. Rishabh Pant 🤣🤣🤣@RishabhPant17 pic.twitter.com/mtXoIOqgYa — VISWANTH (@RisabPant17) August 7, 2022 చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు' ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు హీరో! -
పాక్ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై తోటి బ్యాటర్ తిట్ల దండకం అందుకున్నాడు. అనవసరంగా రనౌట్ చేశాడన్న కారణంతో పాక్ కెప్టెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. 17 పరుగులు చేసి ఫఖర్ జమాన్ ఔటైన తర్వాత బాబర్ ఆజం క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ ఇమాముల్ హక్‌తో కలిసి పాక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 120 పరుగులు కీలక భాగస్వామ్యం కూడా ఏర్పడింది. తమ బ్యాటింగ్‌తో ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బాబర్ ఆజం చేసిన చిన్న తప్పు వికెట్ పడేలా చేసింది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అకీల్ హొసేన్ బౌలింగ్‌కు వచ్చాడు. ఇమాముల్ హక్ మిడ్‌వికెట్ దిశగా ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎక్కువ దూరం వెళ్లకపోవడంతో బాబర్ పరుగు తీయలేదు. అయితే అప్పటికే ఇమాముల్ హక్ సగం క్రీజు దాటి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు వచ్చేశాడు. బాబర్ పిలుపుతో వెనక్కి వెళ్లినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంతిని అందుకున్న షెయ్ హోప్ వికెట్లను గిరాటేయడంతో ఇమాముల్ హక్ 72 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అంతే ఇమాముల్ హక్‌లో కోపం కట్టలు తెచ్చుకుంది. పెవిలియన్‌కు వెళ్తూ బ్యాట్‌ను కింద కొట్టుకుంటూనే తిట్ల దండకం అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత బాబర్ ఆజం 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. కాగా బాబర్ ఆజం, ఇమాముల్ హక్లకు ఇది వరుసగా ఆరో అర్థసెంచరీలు కావడం విశేషం. చదవండి: దీనస్థితిలో ఉత్తరాఖండ్ రంజీ ఆటగాళ్లు .. రోజూవారి వేతనం తెలిస్తే షాకవుతారు 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం View this post on Instagram A post shared by Pakistan Cricket (@therealpcb) -
'నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం'.. అంటే ఇదేనేమో!
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చూస్తూనే ఉంటాం. ఫీల్డర్ క్యాచ్ జారవిడవడం.. రనౌట్ మిస్ చేయడం.. సమన్వయలోపంతో మిస్ ఫీల్డ్ చేయడం జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక్క బంతికే జరగడం మాత్రం అరుదు. అలాంటిదే ఈసీఎస్ పోర్చుగల్ టి20 లీగ్‌లో చోటుచేసుకుంది. టోర్నీలో భాగంగా కోయింబ్రా నైట్స్, ఫ్రెండ్షిప్ సీసీ మధ్య 21వ లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కోయింబ్రా నైట్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఫ్రెండ్షిప్ సీసీ జట్టు కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్ చేసింది. కాగా చివరి ఓవర్లో పెద్ద హైడ్రామా చోటుచేసుకుంది. క్రీజులో ఉన్న సీసీ బ్యాటర్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే క్యాచ్ అందుకునే ప్రయత్నంలో ఫీల్డర్ తప్పిదం చేశాడు. బంతి ఎక్కడ పడుతుందో అంచనా వేయలేక చతికిలపడ్డాడు. వెంటనే తేరుకొని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు త్రో విసిరాడు. క్యాచ్ పోతే పోయింది రనౌట్ అయ్యే అవకాశం వచ్చింది అని అనుకునేలోపే అది కూడా చేజారిపోయింది. ఫీల్డర్ వేసిన వేగానికి బంతి ఎక్కడ ఆగలేదు. నేరుగా థర్డ్‌మన్ దిశగా పరిగెత్తింది. అక్కడ ఇద్దరు ఫీల్డర్లు ఉండడంతో రెండు పరుగులు మాత్రమే వస్తాయిలే అని అనుకుంటాం. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బంతిని ఎవరో ఒకరు అందుకుంటారులే అని మనం అనుకుంటే ఇద్దరు వదిలేశారు.. ఇంకేముందు బంతి నేరుగా బౌండరీలైన్ దాటింది. దీంతో ఒక్క బంతికే సిక్సర్ రూపంలో కాకుండా ఆటగాళ్ల తప్పిదంతో ఆరు పరుగులు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అంటే ఇదేనంటూ'' క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. చదవండి: Prithvi Shaw: ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన పృథ్వీ షా.. ఐదేళ్ల ఐపీఎల్ శాలరీకి సమానం! Just when you think you've seen it all... 😂 via @EuropeanCricket pic.twitter.com/6qAQ6q8dH0 — That’s so Village (@ThatsSoVillage) May 2, 2022 -
ఐపీఎల్ 2022 సీజన్ కోహ్లికి కలిసిరావడం లేదా!
ఆర్సీబీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. లేని పరుగు కోసం యత్నించి చేతులు కాల్చుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ శార్దూల్ ఠాకూర్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని కోహ్లి కోహ్లి కవర్స్ దిశగా ఆడాడు. అయితే బంతి ఎక్కువ దూరం కూడా వెళ్లలేదు. సింగిల్‌కు ప్రయత్నించిన కోహ్లి మ్యాక్స్‌వెల్‌కు కాల్ ఇచ్చాడు. మ్యాక్స్‌వెల్ వద్దని వారించడంతో కోహ్లి వెనక్కి వచ్చేశాడు. కానీ అప్పటికే బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకొచ్చిన లలిత్ యాదవ్ బులెట్ వేగంతో డెరెక్ట్ త్రో వేశాడు. కోహ్లి క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో కోహ్లి నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగా ఐపీఎల్ 2022లో కోహ్లి రనౌట్ కావడం ఇది రెండోసారి. ఇదే సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి తొలిసారి రనౌట్ అయ్యాడు. కాగా ఒకే సీజన్లో కోహ్లి రెండుసార్లు రనౌట్ కావడం ఇది రెండోసారి. ఇంతకముందు 2013లోనూ కోహ్లి రెండుసార్లు రనౌట్ అయ్యాడు. అయితే కోహ్లికి ఐపీఎల్ 2022 సీజన్ కలిసిరావడం లేదనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కోహ్లి మంచి ఆరంభం సాధిస్తున్నప్పటికి పెద్ద స్కోరుగా మలచడంలో విఫలమవుతున్నాడు. దీనికి తోడు అనవసరంగా లేని పరుగు కోసం యత్నించి రెండుసార్లు రనౌట్ కాగా.. ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ పొరపాటు కారణంగా ఎల్బీగా వెనుదిరిగాల్సి వచ్చింది. మొత్తానికి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాకా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాలన్న కోరిక కోహ్లికి తీరేలా కనిపించడం లేదు. Virat Kohli Again RUN-OUT pic.twitter.com/WN0Q6x3gnK — Keshav Bhardwaj 👀 (@keshxv1999) April 16, 2022 -
పాండ్యా చేయి పడితే అంతే.. వికెట్ అయినా విరిగిపోవాల్సిందే
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హార్దిక్ బులెట్ వేగంతో వేసిన త్రో దెబ్బకు మిడిల్ స్టంప్ వికెట్ రెండు ముక్కలయింది. పాండ్యా బులెట్ వేగానికి సంజూ శాంసన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో చోటు చేసుకుంది. ఫెర్గూసన్ వేసిన ఓవర్ మూడో బంతిని శాంసన్ మిడాఫ్ దిశగా ఆడాడు. సింగిల్ రిస్క్ అని తెలిసినప్పటికి శాంసన్ అవనసరంగా పరిగెత్తాడు. అప్పటికే బంతిని అందుకున్న పాండ్యా మెరుపు వేగంతో డైరెక్ట్ త్రో వేశాడు. శాంసన్ సగం క్రీజు దాటి వచ్చేలోపే బంతి వికెట్లను గిరాటేయడంతో క్లియర్ రనౌట్ అని తేలింది. అయితే పాండ్యా బంతిని ఎంత బలంతో త్రో విసిరాడో తర్వాతి సెకన్లోనే అర్థమైంది. అతని దెబ్బకు మిడిల్ స్టంప్ రెండు ముక్కలయ్యి బయటికి వచ్చేసింది. శాంసన్‌ను రనౌట్ చేసిన తీరు కంటే ఇది హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు పాండ్యా చేయి పడితే అంతే.. వికెట్ అయినా విరిగిపోవాల్సిందే.. ఏమా వేగం అంటూ కామెంట్స్ చేశారు. అంతకముందు పాండ్యా బ్యాటింగ్‌లోనూ ఇరగదీశాడు. 52 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా బులెట్ త్రో కోసం క్లిక్ చేయండి Hardik Pandya breaks the stumps. #IPL20222 #GTvsRR pic.twitter.com/VNcU6uswuT — Cricketupdates (@Cricupdates2022) April 14, 2022 -
పొలార్డ్.. మరీ ఇంత నిర్లక్ష్యం పనికి రాదు!
ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తన నిర్లక్ష్యం కారణంగా వికెట్ పారేసుకోవాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతిని పోలార్డ్ లాంగాన్ దిశగా ఆడాడు. ఇక్కడ ఈజీగా రెండు పరుగులు వచ్చే అవకాశం ఉంది. కానీ పొలార్డ్ పరుగు తీయాలా వద్దా అన్నట్లుగా నత్తనడకన సింగిల్ పూర్తి చేశాడు. అయితే అప్పటికే సూర్యకుమార్ సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం వస్తున్నాడు. ఇది గమనించని పొలార్డ్ కొన్ని సెకన్లు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్నాడు. సూర్యను చూసి తేరుకున్న పొలార్డ్ రెండో పరుగుకు వెళ్లినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంతి అందుకున్న ఓడియన్ స్మిత్ కీపర్ జితేశ్ శర్మకు త్రో వేశాడు. పొలార్డ్ క్రీజులోకి చేరుకునేలోపే అతను వికెట్లను గిరాటేయడంతో రనౌట్ అయ్యాడు. పొలార్డ్ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. రెండు పరుగులు వచ్చే చోట ఒక పరుగుకే పరిమితం కావడం ఏంటని అభిమానులు దుమ్మెత్తి పోశారు. అప్పటికే సూర్య కారణంగా తిలక్ వర్మ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా సూర్య తప్పు లేదు.. తిలక్ వర్మ ఆవేశంగా పరిగెత్తి అనవసరంగా రనౌట్ అయ్యాడు. చదవండి: IPL 2022: సూర్య తప్పు లేదు.. తిలక్వర్మదే దురదృష్టం పొలార్డ్ రనౌట్ కోసం క్లిక్ చేయండి -
సూర్య తప్పు లేదు.. తిలక్వర్మదే దురదృష్టం
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మను దురదృష్టం వెంటాడింది. సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయ లోపం కారణంగా తిలక్ వర్మ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. మ్యాచ్‌లో 20 బంతుల్లో 36 పరుగులతో తిలక్ వర్మ మంచి టచ్‌లో కనిపించాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ల అర్ష్‌దీప్ వేసిన ఐదో బంతిని సూర్యకుమార్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు.. అయితే అప్పటికే సూర్య క్రీజు నుంచి కదలడంతో రన్‌కు కాల్ చేశాడని భావించిన తిలక్ వర్మ వేగంగా పరిగెత్తాడు. అయితే బంతి అందుకున్న మయాంక్ అర్ష్‌దీప్‌కు త్రో విసిరాడు. అప్పటికే సగం క్రీజు దాటిన తిలక్ వెనక్కి వచ్చినప్పటికి లాభం లేకుండా పోయింది. అర్ష్‌దీప్ వికెట్లను గిరాటేయడంతో తిలక్ వర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇది చూసిన అభిమానులు.. దీనిలో సూర్య తప్పు లేదు.. తిలక్ వర్మ కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోయేది.. దురదృష్టం తిలక్ వర్మదే అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022: రోహిత్ శర్మ కొత్త చరిత్ర.. టీమిండియా నుంచి రెండో ఆటగాడిగా తిలక్ వర్మ రనౌట్ కోసం క్లిక్ చేయండి -
'అక్కడ ఉంది ఎవరు?.. అట్లనే ఉంటది'
ఐపీఎల్ 2022 సీజన్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో తిలక్ వర్మను మెరుపు వేగంతో రనౌట్ చేశాడు. దీంతో మ్యాక్సీ ఘనంగా ఎంట్రీ ఇస్తే.. పాపం తిలక్ వర్మ లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా రనౌట్ అయ్యాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 10వ ఓవర్ ఆకాశ్ దీప్ వేశాడు. అప్పటికే ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసిన ఆకాశ్ దీప్ ఓవర్లో ఐదో బంతిని వేశాడు. తిలక్ వర్మ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. అక్కడ ఉంది మ్యాక్స్‌వెల్ అన్న విషయం మరిచిపోయిన తిలక్ వర్మ.. సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. సూర్య స్పందించడంతో తిలక్ వర్మ పరిగెత్తాడు. అంతే బంతిని అందుకున్న మ్యాక్స్‌వెల్ మెరుపు వేగంతో డైవ్ చేస్తూ డైరెక్ట్ త్రో విసిరాడు. తిలక్ వర్మ క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను గిరాటేయడంతో క్లియర్ రనౌట్ అని తేలింది. ఆర్సీబీలో సంబరాలు మొదలు కాగా.. ముంబై నిరాశలో కూరుకుపోయింది. ఏదైతేనేం.. మ్యాక్స్‌వెల్ మాత్రం సూపర్ ఎంట్రీతో మెరిశాడు. మ్యాక్సీ తిలక్ వర్మను ఔట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''అక్కడ ఉంది ఎవరు.. మ్యాక్స్‌వెల్.. అట్లనే ఉంటది మరి.. పాపం తిలక్ వర్మ ఊహించి ఉండడు'' అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. మ్యాక్స్‌వెల్ మెరుపు రనౌట్ కోసం క్లిక్ చేయండి చదవండి: IPL 2022: 12 ఏళ్ల క్రితం ఇలాగే.. సేమ్ సీన్ రిపీట్ అయ్యేనా! -
ఔట్ చేయాలన్న తొందర.. అసలు విషయం మరిచిపోయాడు
పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ఇన్నింగ్స్ ఓవర్ ఆఖరి బంతికి పెద్ద హైడ్రామా చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. హర్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేశాడు. హార్దిక్ వేసిన ఆఖరి బంతిని అర్ష్‌దీప్ సింగ్ డీప్‌మిడ్ వికెట్ మీదుగా ఆడాడు. అయితే బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ ఉండడంతో రెండో పరుగు తీయడమే కష్టం.. కానీ రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సక్సెస్ అయ్యారు. అయితే ఫీల్డర్ కీపర్ వైపు త్రో వేయడం అది మిస్ కావడంతో మూడో రన్ కోసం పరిగెత్తారు. అయితే ఈజీగా రనౌట్ చేసే అవకాశాన్ని హార్దిక్ జారవిడిచాడు. బంతి చేతిలోకి రాకముందే అతని పాదం వికెట్లకు తగిలింది. దీంతో బంతి అందుకొని కొట్టేలోపే రెండు బెయిల్స్ కిందపడిపోయాయి. ఎటు తేల్చుకోలేని అంపైర్.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. రిప్లేలో హార్దిక్ బంతి రాకముందే కాలితో వికెట్లను తన్నడం కనిపించింది. ఆ తర్వాత కూడా బంతితో వికెట్లను ఎక్కడా తాకించినట్లు అనిపించలేదు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. హార్దిక్ చర్యకు తోటి ఆటగాళ్లు సహా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కూడా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: 'కొంచెం జాగ్రత్తగా ఉంటే వేరుగా ఉండేది.. తప్పు చేశావ్' pic.twitter.com/XMfk5pk99L — Sam (@sam1998011) April 8, 2022 -
కోహ్లి ఎందుకంత బద్దకం.. వీడియో వైరల్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సూపర్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. ఈ దెబ్బకు కోహ్లి రనౌట్ గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. చహల్ వేసిన బంతిని డేవిడ్ విల్లీ డిఫెన్స్ ఆడాడు. కానీ కోహ్లి ఇది గమనించకుండానే సగం క్రీజు వరకు పరిగెత్తుకొచ్చాడు. ఇది చూసిన కీపర్ సంజూ శాంసన్ మెరుపు వేగంతో పరిగెత్తి బంతిని బులెట్ వేగంతో చహల్ వైపు త్రో విసిరాడు. సకాలంలో స్పందించిన చహల్ కోహ్లి క్రీజులోకి రాకముందే బెయిల్స్‌ను పడగొట్టాడు. Courtesy: IPL Twitter అయితే ఇక్కడ కోహ్లి బద్దకం స్పష్టంగా కనిపించిది. కాస్త వేగంగా పరిగెత్తి ఉంటే కోహ్లి రనౌట్ నుంచి తప్పించుకునేవాడు. చహల్ బెయిల్స్ ఎగురగొట్టే సమయంలో కోహ్లి బ్యాట్ క్రీజుకు ఇంచు దూరంలో ఉండిపోయింది. కేవలం తన నిర్లక్ష్యం కారణంగా అనవసరంగా వికెట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. '' కోహ్లి ఎందుకంత బద్దకం.. కాస్త వేగంగా పరిగెత్తి ఉంటే బాగుండేది కదా..'' అని కామెంట్ చేశారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. బట్లర్ 70 నాటౌట్, హెట్‌మైర్ 42 నాటౌట్ రాణించారు. కోహ్లి రనౌట్ వీడియో కోసం క్లిక్ చేయండి చదవండి: IPL 2022 RR Vs RCB: కోహ్లి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ Ayush Badoni: ఆ ఆటగాడు పెను సంచలనం.. నాలుగేళ్ల క్రితం ట్వీట్ వైరల్ -
విజయ్ శంకర్ చేసిన రనౌట్ సరైనదేనా!
ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 25 పరుగులు చేసిన లలిత్ యాదవ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అతను రనౌట్ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ విజయ్ శంకర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని పంత్ లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. సింగిల్‌కే అవకాశమున్నప్పటికి పంత్ అనవసరంగా రెండో పరుగుకు యత్నించాడు. కాగా బంతిని అందుకున్న మనోహర్ విజయ్ శంకర్‌కు త్రో విసిరాడు. లలిత్ యాదవ్ క్రీజులోకి చేరేలోపే విజయ్ శంకర్ వికెట్లను గిరాటేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతి అందుకోవడానికి ముందే విజయ్ శంకర్ తన కాలితో పొరపాటున వికెట్లను తన్నడంతో ఒక బెయిల్ కిందపడింది. అప్పటికే బంతి విజయ్ శంకర్ చేతిలో పడడం.. వెంటనే వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. ఇది గమనించిన పంత్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. అంపైర్ వద్దకు వచ్చి మరోసారి రనౌట్‌ను పరిశీలించాలని కోరాడు. అయితే అంపైర్లు విజయ్ శంకర్ పొరపాటున ముందే వికెట్లను తన్నినప్పటికి.. లలిత్ యాదవ్‌ను రనౌట్ చేసే సమయానికి బంతి అతని చేతిలోనే ఉందని.. కాబట్టి అది ఔటేనని వివరించారు. దీంతో చేసేదేం లేక లలిత్ యాదవ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విజయ్ శంకర్ చేసిన రనౌట్ కరెక్టేనా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. చదవండి: Ashwin Vs Tilak Varma: తిలక్ వర్మపై రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం లలిత్ యాదవ్ రనౌట్ కోసం క్లిక్ చేయండి -
ఎల్బీ నుంచి తప్పించుకున్నా.. రనౌట్‌కు బలయ్యాడు
ఐపీఎల్ 2022లో సీఎస్కేతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు రవి బిష్ణోయి సూపర్ రనౌట్‌తో మెరిశాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఆండ్రూ టై వేశాడు. ఓవర్ మూడో బంతిని రుతురాజ్ గైక్వాడ్ ప్యాడ్స్‌తో పాటు బ్యాట్‌ను తాకుతూ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. అదే సమయంలో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న రవి బిష్ణోయి బంతిని వేగంగా అందుకొని డైరెక్ట్ త్రో వేశాడు. గైక్వాడ్ క్రీజులోకి చేరుకోవడానికి ముందే బంతి వికెట్లను గిరాటేసింది. రిస్క్ అని తెలిసినా సింగిల్‌కు ప్రయత్నించిన గైక్వాడ్ అనవసరంగా రనౌట్ అయ్యాడు.దీంతో గైక్వాడ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇంకా విచిత్రమేంటంటే ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు అని మనం అనుకునేలోపే రనౌట్‌కు బలవ్వాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రుతురాజ్ రనౌట్ కోసం క్లిక్ చేయండి -
‘రెండో ఆలోచన వద్దు.. రనౌట్ చేసేయండి’
‘మన్కడింగ్’ విషయంలో ఎంసీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనపై భారత స్పిన్నర్ అశ్విన్ హర్షం వ్యక్తం చేశాడు. ఇకపై దీనిని రనౌట్ అని ప్రకటిస్తూ, నాన్ స్ట్రైకర్ క్రీజ్ బయట ఉంటే తప్పు అతడిదే తప్ప బౌలర్‌ది కాదని కొత్త నిబంధనల్లో స్పష్టం చేశారు. ‘నా బౌలర్ మిత్రులారా... నాన్‌స్ట్రైకర్ ఒక అడుగు బయట ఉంచి అదనపు ప్రయోజనం తీసుకుంటే అది మీ కెరీర్లనే నాశనం చేయవచ్చు. కాబట్టి రెండో ఆలోచన లేకుండా అతడిని రనౌట్ చేసేయండి’ అని అశ్విన్ సూచించాడు. ఇక 'మన్కడింగ్' అని వినగానే మనకు గుర్తొచ్చే పేరు రవిచంద్రన్ అశ్విన్. ఇంతకు ముందు మన్కడింగ్ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. క్రికెట్ లవర్స్‌కు దీన్ని పరిచయం చేసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. 2019 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ తరుపున ఆడిన అశ్విన్... రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేశాడు. అప్పట్లో ఈ అంశం వివాదంగా మారింది. ఐతే మన్కడింగ్ అనేది క్రికెట్ రూల్స్‌లో భాగమైనప్పటికీ ఇది క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని క్రికెట్ ఫాన్స్‌తో పాటు పలువురు ఆటగాలు అశ్విన్ తీరుపై మండిపడ్డారు. రూల్ ఉన్నప్పుడు మన్కడింగ్ చేస్తే తప్పేంటని అశ్విన్ సమర్థించుకున్నాడు. ఇటీవలే క్రికెట్లో చట్టాలు చేసే మెరిల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్(ఎంసీసీ) మన్కడింగ్ తప్పు కాదని పేర్కొంది. ఇకపై మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా క్రికెట్ నిబంధనల్లో లా-41 (క్రీడాస్పూర్తికి విరుద్ధం) నుంచి లా-38(రనౌట్)కు మార్చారు. రానున్న అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చదవండి: David Warner: వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేశావా?! Sanju Samson: కండలు కరిగించాడు.. ఇక సిక్సర్ల వర్షమేనా! New Rules Of Cricket 2022: మన్కడింగ్ తప్పుకాదు: ఐసీసీ -
సీరియస్ రనౌట్‌ను కామెడీ చేశారు.. మనవాళ్లు ఊరుకుంటారా
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీరియస్‌గా ఆట సాగుతున్న వేళ లంక ఆటగాళ్లు ఒక సీరియస్ రనౌట్‌ను కాస్త కామెడీగా మార్చేశారు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 125వ ఓవర్‌ను విశ్వా ఫెర్నాండో వేశాడు. రవీంద్ర జడేజా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ 150 పరుగుల మార్క్ దాటి డబుల్ సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాడు. అతనికి షమీ కూడా చక్కగా సహకరిస్తున్నాడు. ఫెర్నాండో జడేజాకు ఆఫ్ కట్టర్ వేయగా.. మిడ్ వికెట్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం జడేజా ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్ వేసిన బంతిని అందుకోవడంలో ఫెర్నాండో విఫలమయ్యాడు. అలా జడేజా బతికిపోయాడు. ఇదే సమయంలో షమీ కూడా దాదాపు నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తుకొచ్చాడు. ఇక షమీ ఔట్ అని అంతా భావించారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. స్ట్రైకింగ్ ఎండ్ నుంచి కీపర్ బంతి ఇవ్వు అని అరిచాడు.. ఫెర్నాండో బంతిని తీసుకున్నప్పటికి విసరలేకపోయాడు. అప్పటికే షమీ వేగంగా పరిగెత్తి అవతలి ఎండ్‌కు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక డబుల్ సెంచరీ చేస్తాడని భావించిన రవీంద్ర జడేజా 175 నాటౌట్‌గా నిలిచి 25 పరుగుల దూరంలో నిలిచాడు. దీంతో రోహిత్ కూడా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. కాగా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 175*, రిషబ్ పంత్ 96, హనుమ విహారి 58, కోహ్లి 45 పరుగులు చేశారు. pic.twitter.com/OelmwQiTVJ — crictalk (@crictalk7) March 5, 2022 -
అంపైర్ ఔట్‌గా ప్రకటించినా.. నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు.. సూపర్ షకీబ్
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో.. నజిబూల్లా జద్రాన్ బౌలర్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతిని ఆపేందుకు షకీబ్ ప్రయత్నించగా.. అది నేరుగా వెళ్లి స్టంప్స్‌ను తాకింది. ఈ క్రమంలో షకీబ్ రనౌట్‌కు అపీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే రీప్లేలో నాన్‌స్ట్రైకర్ రహామత్ షా క్రీజులో లేనప్పుడు బంతి స్టంప్స్‌ను తాకినట్లు సృష్టంగా కనిపించింది. అయితే బంతి షకీబ్ చేతికి తగిలిందో లేదో రీప్లేలో సృష్టంగా కనిపించలేదు. దీంతో బెనిఫిట్ ఆప్ డౌట్ కింద థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే ఇక్కడే షకీబ్ అల్ హసన్ తన క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. జద్రాన్ కొట్టిన బంతికి తన చేతికి తాకలేదని భావించి, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో చర్చించి తన అప్పీల్ వెనుక్కి షకీబ్ తీసుకున్నాడు. దీంతో థర్డ్ అంపైర్ మళ్లీ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షకీబ్ అల్ హాసన్ చూపించిన క్రీడా స్పూర్తిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: IPL 2022 Auction: సగం పని పూర్తైంది.. మా జట్టు భేష్.. టైటిల్ గెలవడమే లక్ష్యం! లేదంటే కనీసం ప్లే ఆఫ్స్ అయినా! -
అయ్యో హర్మన్‌ప్రీత్.. ఇలా రనౌట్ అయ్యావు ఏంటి?.. వీడియో వైరల్
న్యూజిలాండ్ మహిళలతో జరగిన రెండో వన్డేలో భారత స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ అనూహ్య రీతిలో రనౌటైంది. భారత ఇన్నింగ్స్ 28 ఓవర్ వేసిన ఫ్రాన్సెస్ మాకై బౌలింగ్‌లో.. హర్మన్‌ప్రీత్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి బౌలర్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో బంతి బౌలర్ మాకై చేతికి వెళ్లింది. వెంటనే మాకై వేగంగా బంతిని కీపర్‌కి త్రో చేసింది. అయితే క్రీజులోకి తిరిగి చేరుకోవడానికి హర్మన్‌ప్రీత్ కొంచెం ఇబ్బంది పడింది. కాగా కీపర్ వెంటనే స్టంప్స్ పడగొట్టడంతో హర్మన్‌ప్రీత్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరింది. రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్‌పై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో మేఘన(61), షఫాలీ వర్మ(51), దీప్తి శర్మ(69) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో హన్నా రోవ్, మైర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, మాకై, కేర్ చెరో వికెట్ సాధించారు. 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. చదవండి: తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! an unfortunate wicket of Harmanpreet Kaur, team India down by 4 wickets! 🏏 #NZvIND #LiveCricketOnPrime pic.twitter.com/mjI4wbz1ou — amazon prime video IN (@PrimeVideoIN) February 18, 2022 -
'అది నీ తప్పు కాదు'.. ఇషాన్ కిషన్‌తో మెసేజ్
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కేఎల్ రాహుల్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్, కేఎల్ రాహుల్ మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడి టీమిండియా భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తుంది. ఈ సమయంలో కేఎల్ రాహుల్ రనౌట్ అవ్వడం మ్యాచ్ ఫ్లోను దెబ్బతీసింది. సూర్యతో సమన్వయలోపం వల్లే రాహుల్ ఔటయ్యాడని అంతా భావించారు. తాజాగా సూర్యకుమార్.. కేఎల్ రాహుల్ రనౌట్‌పై స్పందించాడు. ''మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ రనౌట్ అవ్వడం దురదృష్టం. కానీ అందులో నా తప్పేం లేదు. అయితే కేఎల్ రాహుల్ తన రనౌట్ విషయంలో ఇషాన్ కిషన్ ద్వారా నాకు సమాచారం పంపాడు. డ్రింక్స్బ్రేక్ సమయంలో ఇషాన్ నా దగ్గరకు వచ్చి రాహుల్ పంపిన మెసేజ్ ఇచ్చాడు. అది నీ తప్పిదం కాదు.. నో.. నో అంటూ వేరేవాళ్లు అన్న వాయిస్‌ను వినబడి మధ్యలో ఆగిపోయా. అంతేకానీ నీతో సమన్వయలోపం వల్ల కాదు. బాధపడకు.. నీ ఆట నువ్వు ఆడు అని మెసేజ్‌లో ఉందని'' చెప్పుకొచ్చాడు. చదవండి: KL Rahul: సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు; అనవసర రనౌట్ ఇక రాహుల్ రనౌట్ అయిన విధానం చూసుకుంటే.. కీమర్ రోచ్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 29వ ఓవర్ నాలుగో బంతిని కేఎల్ రాహుల్ స్వేర్‌లెగ్ దిశగా ఆడాడు. సింగిల్ ఈజీగా వస్తుంది.. కానీ రాహుల్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. సూర్య కూడా వేగంగా స్పందించడంతో రాహుల్ పరిగెత్తాడు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత కొన్ని సెకన్ల పాటు నిలబడిపోయాడు. అంతే అకియెల్ హొసేన్ వేసిన బంతిని అందుకున్న కీపర్ హోప్ వికెట్లను గిరాటేశాడు. సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయలోపం అనుకుందామనుకున్నా పొరపాటే అవుతుంది. ఎందుకంటే రాహుల్ కాల్‌కు సూర్య సరిగ్గానే స్పందించాడు. కానీ రెండో పరుగు కోసం వెళ్లిన రాహుల్ రెండు సెకన్లు ఆగిపోయాడు. అలా కేఎల్ రాహుల్ 49 పరుగుల వద్ద అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. చదవండి: IND Vs WI: కేఎల్ రాహుల్ హిట్టయ్యాడు కానీ సమస్య అక్కడే.. Village Cricket pic.twitter.com/Q3GvS4UUmv — Stone Cold (@StoneCo06301258) February 9, 2022 -
సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు
వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్(49 పరుగులు) అనవసరంగా రనౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయలోపం అనుకుందామనుకున్నా పొరపాటే అవుతుంది. ఎందుకంటే రాహుల్ కాల్‌కు సూర్య సరిగ్గానే స్పందించాడు. కానీ రెండో పరుగు కోసం వెళ్లిన రాహుల్ రెండు సెకన్లు ఆగిపోయాడు. ఎందుకో ఆగాడో తెలియదు కానీ.. ఆ రెండు సెకన్లు అతని కొంప ముంచింది. కేవలం ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అలా కీలక భాగస్వామ్యానికి తెరపడింది. చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. ప్రతిష్టాత్మక వన్డేలో కోహ్లి చెత్త ప్రదర్శన వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. టీమిండియా ఇన్నింగ్స్ గాడిన పడింది అనుకున్న సమయంలో రాహుల్ రనౌట్ అవ్వడం బాధ కలిగించింది. కీమర్ రోచ్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 29వ ఓవర్ నాలుగో బంతిని కేఎల్ రాహుల్ స్వేర్‌లెగ్ దిశగా ఆడాడు. సింగిల్ ఈజీగా వస్తుంది.. కానీ రాహుల్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. సూర్య కూడా వేగంగా స్పందించడంతో రాహుల్ పరిగెత్తాడు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత కొన్ని సెకన్ల పాటు నిలబడిపోయాడు. అంతే అకియెల్ హొసేన్ వేసిన బంతిని అందుకున్న కీపర్ హోప్ వికెట్లను గిరాటేశాడు. దీంతో రాహుల్ సూర్యను చూస్తూ ఏంటిది అనుకుంటూ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: 'గుర్తుపెట్టుకోండి నా కూతురు పేరు'.. 2016 టి20 వరల్డ్‌కప్ హీరో KL Rahul Run Out 💔#INDvWI #KLRahul #ViratKholi pic.twitter.com/qcwkQohdko — Saqlain Khan (@Saqlainejaz56) February 9, 2022 -
ఎంత పని చేశావు సూర్య.. పంత్‌ను వెంటాడిన దురదృష్టం
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను దురదృష్టం వెంటాడింది. అనూహ్య రీతిలో పంత్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అల్జారీ జోసెఫ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ మూడో బంతిని సూర్యకుమార్ స్ట్రెయిట్డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అల్జారీ జోసెఫ్ తన కాలి బూటుతో బంతిని టచ్ చేశాడు. అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న పంత్ క్రీజుదాటి ముందుకు వచ్చాడు. దీంతో బంతి వెళ్లి బెయిల్స్‌ను ఎగురగొట్టడంతో పంత్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అయితే ఇది అనుకోకుండా జరిగినప్పటికి సూర్యకుమార్ యాదవ్ తనవల్లే ఇలా జరిగిందన్నట్లుగా హావభావాలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అండర్ 19 వరల్డ్‌కప్ హీరో రాజ్ బవాకి యువరాజ్ సింగ్‌తో ఉన్న లింక్ ఏంటి..? -
కేఎల్ రాహుల్ సూపర్ త్రో.. బవుమా రనౌట్
టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ త్రోతో మెరిశాడు. రాహుల్ త్రో దెబ్బకు బవుమా రనౌట్‌గా వెనుదిరిగాడు. 12 బంతుల్లో 8 పరుగులతో బవుమా మంచి టచ్‌లో కనిపించాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మూడో బంతిని బవుమా మిడాఫ్ దిశగా ఆడాడు. క్విక్ సింగిల్ తీయాలని భావించిన బవుమా చేతులు కాల్చుకున్నాడు. రిస్క్ అని తెలిసినప్పటికి పరిగెత్తాడు.. అప్పటికే బంతిని అందుకున్న రాహుల్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు త్రో విసిరాడు. డైరెక్ట్ హిట్‌తో బవుమా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం బవుమా రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా 34 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ సెంచరీతో మెరవగా.. డుసెన్ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. pic.twitter.com/6hgPJzK4Pd — Bleh (@rishabh2209420) January 23, 2022 -
రసెల్‌తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం
క్రికెట్లో రనౌట్లు జరగడం సహజం. అందులో కొన్ని విచిత్ర రనౌట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే రనౌట్ మాత్రం అంతకుమించినది. అసలు ఎవరు ఊహించని రీతిలో ఆండ్రీ రసెల్ రనౌటవ్వడం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇది చోటుచేసుకుంది. ఢాకా ప్లాటూన్, కుల్నా టైగర్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. చదవండి: BBL 2021-22: స్టన్నింగ్ క్యాచ్.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది ఆండ్రీ రసెల్, మహ్మదుల్లా నిలకడైన బ్యాటింగ్‌తో ఢాకా ప్లాటూన్ ఇన్నింగ్స్ సజావుగా సాగుతుంది. ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం కూడా ఏర్పడింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఐదో బంతిని రసెల్ భారీ సిక్స్ కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ ఉంచుకోవాలని భావించి థర్డ్‌మన్ దిశగా ఆడాడు. మెహదీ హసన్ బంతిని అందుకొని స్ట్రైకింగ్ వైపు విసిరాడు. బంతి వికెట్లకు తాకినప్పటికి.. అప్పటికే మహ్మదుల్లా క్రీజులోకి చేరుకున్నాడు. అవతలి వైపు రసెల్ కూడా ఇక భయం లేదనుకొని కాస్త స్లో అయ్యాడు. ఇక్కడే రసెల్‌ను దురదృష్టం వెంటాడింది. మెహదీ హసన్ వేసిన త్రో స్ట్రైకింగ్ ఎండ్ వద్ద ఉన్న వికెట్లను తాకి.. మళ్లీ అక్కడినుంచి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వెళ్లింది. రసెల్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. బిగ్స్క్రీన్పై రసెల్ క్లియర్ రనౌట్ అని తేలింది. పాపం తాను ఇలా ఔటవుతానని రసెల్ అసలు ఊహించి ఉండడు. తాను ఔటైన తీరుపై నవ్వాలో.. ఏడ్వాలో తెలియక ఆకాశం వైపు చూస్తూ పెవిలియన్ బాట పట్టాడు.'' విధి అతన్ని ఈ రకంగా వక్రీకరించింది... ఎంత ఘోరం జరిగిపోయింది..'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రసెల్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND Vs SA: అరె! పంత్.. కొంచమైతే కొంపమునిగేది Rajinikant fielding? 😲😲😲pic.twitter.com/aWGwKMJYyG — Rohit Sankar (@imRohit_SN) January 21, 2022 -
అరె! పంత్.. కొంచమైతే కొంపమునిగేది
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్‌లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. పంత్‌తో జరిగిన సమన్వయ లోపం వల్ల కేఎల్ రాహుల్ కొద్దిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 15వ ఓవర్ ఆఖరి బంతిని పంత్ మిడ్‌వికెట్ దిశగా ఆడాడు. రిస్క్ అని తెలిసినా కేఎల్ రాహుల్ క్విక్ సింగిల్ కోసం పరిగెత్తాడు. అయితే స్ట్రైకింగ్‌లో ఉన్న పంత్ వద్దని చెబుతున్నప్పటికి.. అప్పటికే రాహుల్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు చేరుకున్నాడు. చదవండి: 450వ మ్యాచ్.. కోహ్లి చెత్త రికార్డు ఇంతలో బంతిని అందుకున్న బవుమా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసురుదామనుకున్నాడు. ఇక రాహుల్ ఔట్ అని మనం అనుకునేలోపు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బవుమా సరైన దిశలో బంతిని వేయకపోవడం.. కేశవ్ మహరాజ్ దానిని అందుకోవడం విఫలమవ్వడం.. అప్పటికే రాహుల్ వేగంగా పరిగెత్తి క్రీజులోకి చేరుకోవడం జరిగిపోయింది.అలా టీమిండియా బతికిపోయింది.. రాహుల్ కూడా బతికిపోయాడు. ఈ సంఘటన తర్వాత రాహుల్ పంత్‌వైపు.. ''అరె పంత్.. కొంచమైతే కొంపముంచేవాడివి అన్నట్లుగా'' చూశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 😭#SAvIND pic.twitter.com/nGoDadBwAF — ًFaf Du Plessis (@Fad_du_pussy) January 21, 2022 -
'బులెట్ వేగం'తో మార్క్రమ్ను దెబ్బకొట్టిన వెంకటేశ్ అయ్యర్
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా డెబ్యూ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ సూపర్ త్రోతో మెరిశాడు. అతని దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఎయిడెన్ మార్ర్కమ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ నాలుగో బంతిని మార్క్రమ్ మిడాఫ్ దిశగా ఆడాడు. రిస్క్ అని తెలిసినప్పటికి బవుమాకు సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. దీంతో మార్ర్కమ్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి చేరుకునేలోపే వెంకటేశ్ అయ్యర్ బంతిని అందుకొని డైరెక్ట్ త్రో వేశాడు. క్రీజుకు కొన్ని ఇంచుల దూరంలో మార్క్రమ్ ఉండగా.. అప్పటికే బంతి వికెట్లను గిరాటేయడం బిగ్స్క్రీన్పై కనిపించింది. ఇంకేముంది మార్క్రమ్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. చదవండి: డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన బౌలర్ ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన టెస్టు సిరీస్‌లో మార్క్రమ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు టెస్టులు కలిపి కేవలం 76 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే తొలి వన్డేలో 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. రిస్క్ అని తెలిసినా అనవసర పరుగుకు యత్నించి చేజేతులా మార్క్రమ్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: కోహ్లి భయ్యా.. నేనెవరి వికెట్ తీయాలో చెప్పవా?: చహల్ భావోద్వేగం Aiden Markram wicket !! #SAvsIND #venkateshiyer pic.twitter.com/H3RlkwZHEl — Jalaluddin Sarkar (Thackeray) 🇮🇳 (@JalaluddinSark8) January 19, 2022 -
బాబర్ అజమ్ మరీ ఇంత బద్దకమా!
PAK vs WI: Babar Azam Run Out Viral.. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో బాబర్ అజమ్ రనౌట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విండీస్ స్పిన్నర్ ఏకియల్ హొస్సేన్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని మహ్మద్ రిజ్వాన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే క్విక్ సింగిల్ తీయొచ్చనే ఉద్దేశంతో రిజ్వాన్ నాన్ స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. కాల్ అందుకున్న బాబార్ అజమ్ కూడా పరిగెత్తినప్పటికి సకాలంలో క్రీజులోకి చేరుకోలేకపోయాడు. ఇంతలో బంతిని అందుకున్న హెడెన్ వాల్ష్ కీపర్ పూరన్‌కు త్రో విసిరాడు. చదవండి: PAK Vs WI: ప్రపంచ రికార్డు సాధించిన పాకిస్తాన్.. ఏకైక జట్టుగా! దీంతో బాబర్ అజమ్ క్రీజుకు చాలా దూరంలో ఉండగానే పూరన్ బెయిల్స్ ఎగురగొట్టడంతో బాబర్ రనౌటయ్యాడు. ప్రస్టేషన్‌తో బాబర్ అజమ్ పెవిలియన్‌కు వెళ్తూ బ్యాట్‌ను కోపంతో కొట్టడం కెమెరాలకు చిక్కింది. దీంతో బాబర్ అజమ్‌ను క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ''బాబర్ అజమ్ మరీ ఇంత బద్దకమా.. నీకు వయసు అయిపోతుంది.. సింగిల్ వద్దు అనుకుంటే రిజ్వాన్‌కు కాల్ ఇవ్వాల్సింది..'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిజ్వాన్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇఫ్తిఖార్ అహ్మద్ (32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), హైదర్ అలీ (31; 4 ఫోర్లు) రాణించారు. విండీస్ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), షెపర్డ్ (35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. చివరి ఓవర్లో గెలుపు కోసం 23 పరుగులు చేయాల్సిన స్థితిలో వెస్టిండీస్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది 3 వికెట్లు తీశాడు. చివరి టి20 గురువారం జరుగుతుంది. Early loss for Pakistan, Babar Azam in run out!#PAKvWI#HumTouKhelainGey pic.twitter.com/wNWyZVt2fa — Pakistan Cricket (@TheRealPCB) December 14, 2021 -
ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్
Warner Lucky Missing Form Run Out Ashes Series.. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు అదృష్టం బాగా కలిసొస్తుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వార్నర్ ప్రస్తుతం సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 54 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 193 పరుగులు చేసింది. ఇక వార్నర్ మూడుసార్లు ఔట్ నుంచి ఎలా తప్పించుకున్నాడో చూద్దాం. చదవండి: Ben Stokes No Balls: స్టోక్స్ నోబాల్స్ కథేంటి! అంపైర్లకు కళ్లు కనబడవా? ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 12వ ఓవర్లో వార్నర్ 17 పరుగులు వద్ద ఉన్నప్పుడు బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. అది నోబాల్ కావడంతో తొలిసారి తప్పించుకున్నాడు. వార్నర్ 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ 32వ ఓవర్లో ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను స్లిప్‌లో రోరీ బర్న్స్ నేలపాలు చేయడంతో రెండోసారి బతికిపోయాడు. 60 పరుగుల వద్ద వార్నర్ ముచ్చటగా మూడోసారి బతికిపోయాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో షాట్ ఆడిన వార్నర్ సింగిల్‌కు ప్రయత్నించగా.. షార్ట్‌లెగ్ దిశలో ఉన్న హమీద్ బంతిని అందుకున్నాడు. దీంతో అలెర్ట్ అయిన వార్నర్ వెనక్కి తిరిగే క్రమంలో జారి పడ్డాడు. బ్యాట్‌ను క్రీజులో పెట్టడంలో వార్నర్ విఫలం కావడం.. హమీద్ బంతిని వేగంగా స్టంప్స్ వైపు విసరడంతో కచ్చితంగా ఔట్ అనే అనుకున్నాం. కానీ బంతి స్టంప్స్‌కు తగలకుండా పక్కకు వెళ్లడం.. వార్నర్ కూడా పాక్కుంటూ తన చేతులను క్రీజులో ఉంచడం జరిగిపోయింది. ఈ వీడియో చూసిన అభిమానులు వార్నర్‌కు అదృష్టం బాగా కలిసొచ్చింది.. అంటూ కామెంట్ చేశారు. చదవండి: Ashes Series: స్టోక్స్ సూపర్ ఎంట్రీ అనుకున్నాం.. ఊహించని ట్విస్ట్ David Warner had to work hard to reach the crease. pic.twitter.com/ykvM8wmutO — Mufaddal Vohra (@mufaddal_vohra) December 9, 2021 -
షోయబ్ మాలిక్.. మరీ ఇంత బద్దకమా
Shoaib Malik Gets Run Out In Bizarre Manner: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టి20లో పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ విచిత్రరీతిలో రనౌట్ అయ్యాడు. బ్యాట్‌ను క్రీజులో పెట్టేందుకు బద్దకించిన మాలిక్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. టాపార్డర్ విఫలమైన చోట బాధ్యతగా బ్యాటింగ్ చేయాల్సిన మాలిక్ ఇలా చేయడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది విషయంలోకి వెళితే.. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్, హైదర్ అలీ రూపంలో తొందరగానే వికెట్ కోల్పోయింది. ఈ సందర్భంగా క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో చివరి బంతిని ఫ్లిక్ చేయడంలో విఫలమయ్యాడు. మాలిక్ క్రీజు దాటి బయటికి రావడంతో బంతిని అందుకున్న కీపర్ నురుల్ హసన్ వికెట్ల వైపు విసిరాడు. డైరెక్ట్ హిట్ అవ్వడంతో బెయిల్స్ ఎగిరిపడ్డాయి. అప్పటికే మాలిక్ క్రీజులోకి వచ్చాడని అంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. క్రీజులోకి వచ్చిన మాలిక్ బ్యాట్‌ను మాత్రం కింద పెట్టలేదు. దీంతో బంగ్లా అప్పీల్‌కు వెళ్లగా.. థర్డ్అంపైర్ మాలిక్‌ను ఔట్ అని ప్రకటించడంతో డకౌట్‌గా రనౌటయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ 4 వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. ఇరుజట్ల మధ్య రెండో టి20 నవంబర్ 20న జరగనుంది. చదవండి: Syed Mustaq Ali T20 Trophy: ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్.. సూపర్ ఓవర్ ద్వారా సెమీస్‌కు Shoaib Malik👀pic.twitter.com/MIGoTLXAEn — CricTracker (@Cricketracker) November 19, 2021 -
వారెవ్వా సూపర్ త్రో.. రుతురాజ్ గైక్వాడ్ రనౌట్
Ruturaj Gaikwad Run Out Syed Mustak Ali T20 Trophy.. ఐపీఎల్ 2021 హీరో రుతురాజ్ గైక్వాడ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సూపర్ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఐపీఎల్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్న రుతురాజ్ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలోనూ రెచ్చిపోతున్నాడు. ఇక గోవాతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన రుతురాజ్.. గోవా ఆటగాడు దీప్రాజ్ గోవాంకర్ డైరెక్ట్ త్రోకు బలయ్యాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతిని రుతురాజ్ లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. తొలి పరుగు పూర్తి చేసి రెండో పరుగుకోసం వెళ్లగా.. అప్పటికే బంతిని అందుకున్న దీప్రాజ్ త్రో వేయగా.. బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో రుతురాజ్ క్లియర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: James Pattinson: బాగా ఆడుతున్నాడని మండినట్టుంది.. కోపంతో బంతిని లాగిపెట్టి ఇక మ్యాచ్‌లో మహారాష్ట్ర గోవాపై 73 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. యష్ నాయర్(68 బంతుల్లో 103, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన గోవా 18.1 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. https://www.bcci.tv/videos/155606/deepraj-gaonkar-s-brilliant-direct-hit-to-run-out-ruturaj-gaikwad?fbclid=IwAR1V4uPNxKpQMKRekqJzNUELZ20lOXj9BsU1Ak0AVaRlaPU0OZLX9qL_VlY -
BAN Vs WI: రసెల్ డైమండ్ డక్.. వెంటాడిన దురదృష్టం
Russell Diamond Duck.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్‌ను దురదృష్టం వెంటాడింది. ఒక్క బంతి ఎదుర్కోకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతిని తస్కిన్ అహ్మద్ రోస్టన్ చేజ్‌కు విసిరాడు. అతను స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న తస్కిన్ అహ్మద్ కాలితో బంతిని టచ్ చేయడం.. అది వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేయడం జరిగిపోయింది. అప్పటికే క్రీజు బయటికి వచ్చేసిన రసెల్ ఎవరు ఊహించని విధంగా రనౌట్(డైమండ్ డక్)అయ్యాడు. చదవండి: IND Vs NZ: కోహ్లి రెండుసార్లు ఓడిపోయావు.. మరి ఈసారైనా! ఇక టి20 ప్రపంచకప్‌ల్లో డైమండ్ డక్(ఒక్క బంతి ఎదుర్కోకకుండా ఔటవ్వడం) అయిన ఆటగాళ్ల జాబితాలో రసెల్ తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు డానియల్ వెటోరి(న్యూజిలాండ్), మొహమ్మద్ అమీర్(పాకిస్తాన్), మైకెల్ యార్డి(ఇంగ్లండ్), మిస్బా-ఉల్-హక్(పాకిస్తాన్), టి దిల్షాన్(శ్రీలంక), మహేళ జయవర్ధనే(శ్రీలంక), డేవిడ్ విల్లీ(ఇంగ్లండ్), ముస్తాఫిజుర్ రెహమాన్(బంగ్లాదేశ్) ఉన్నారు. చదవండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే Russell is run out by Taskin Ahmed for zero via @t20worldcup https://t.co/oTxgZEv65E — varun seggari (@SeggariVarun) October 29, 2021 -
కన్ఫ్యూజ్ రనౌట్.. ఇంగ్లండ్ ఆటగాడి డ్యాన్స్
England Player Dance Afrter Bangladesh Batsman Run Out.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఒక కన్ఫ్యూజ్ రనౌట్ నవ్వులు పూయించింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ను లివింగ్‌స్టోన్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని కెప్టెన్ మహ్మదుల్లా షార్ట్‌ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న టైమల్ మిల్స్ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో మిస్‌ఫీల్డ్ జరిగింది. ఇక్కడే మహ్మదుల్లా రెండో పరుగుకోసం యత్నించాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న ఆఫిఫ్ హొస్సేన్ సగం క్రీజువరకు వచ్చేశాడు. దీంతో మిల్స్ బంతిని వేగంగా బట్లర్‌కు త్రో విసిరాడు. అంతే హొస్సేన్ క్రీజులోకి చేరేలోపే బెయిల్స్ ఎగరడంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అయితే ఈ కన్ఫ్యూజ్ రనౌట్‌తో ఇంగ్లండ్ ఆటగాడు డ్యాన్స్ చేయడం మిగతావారికి నవ్వులు పంచింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. చదవండి: T20 WC 2021: న్యూజిలాండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్ Confusion galore between Mahmud Ullah and Afif via @t20worldcup https://t.co/BXVu58xBgr — varun seggari (@SeggariVarun) October 27, 2021 -
వారెవ్వా హసన్ అలీ.. అయ్యో విలియమ్సన్
Hasan Ali Strikes With Stunning Throw.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ స్టన్నింగ్ త్రోతో మెరిశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను తన బౌలింగ్‌లోనే అద్భుత రనౌట్‌తో పెవిలియన్ చేర్చాడు. కివీస్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 14వ ఓవర్‌ను హసన్ అలీ వేశాడు. ఓవర్ తొలి బంతిని విలియమ్సన్ ఢిపెన్స్ ఆడాడు. అయితే విలియమ్సన్ రిస్క్ అని తెలిసినప్పటికి సింగిల్‌కు ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కాన్వే వెనక్కి వెళ్లిపోవడంతో విలియమ్సన్ మళ్లీ వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే హసన్ అలీ వేగంగా పరిగెత్తి బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. దీంతో విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
WI VS SA: రసెల్ స్టన్నింగ్ త్రో.. దాదాపు 100 కిమీ వేగంతో
Andre Russel Bullet Throw.. టి20 ప్రపంచకప్ 2021లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఆండీ రసెల్ సూపర్ త్రోతో మెరిశాడు. దాదాపు 100 కిమీ వేగంతో విసిరిన డైరెక్ట్ త్రోకు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఇది చోటుచేసుకోవడం విశేషం. చదవండి: T20 WC 2021: ఫోకస్‌గా లేవు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పక్కనపెడుతున్నా తొలి ఓవర్‌ను ఎకిల్ హొస్సేన్ వేయగా.. చివరి బంతిని బవుమా మిడాన్ దిశగా ప్లిక్ చేశాడు. ఫీల్డర్ దూరంగా ఉండడంతో ఈజీ సింగిల్ అనుకున్నారు.. కానీ రసెల్ ఇక్కడే మ్యాజిక్ చేశాడు. వేగంగా ముందుకు పరిగెత్తుకు వచ్చిన రసెల్ బంతిని అందుకొని వేగంగా త్రో విసిరాడు. దీంతో బంతి డైరెక్టుగా వికెట్లను గిరాటేయడం.. బవుమా రనౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. చదవండి: T20 WC 2021 SA Vs WI: విండీస్ బ్యాటర్ చెత్త రికార్డు.. 35 బంతుల్లో..! A bullet of a throw from Russell gets the wicket of Bavuma via @t20worldcup https://t.co/87kxjf0Ysb — varun seggari (@SeggariVarun) October 26, 2021 -
AUS Vs SA: అయ్యో కేశవ్ ఎంత పనైంది
Keshav Maharaj Run Out.. టి20 ప్రపంచకప్ 2021లో ఆరంభ మ్యాచ్ దక్షిణాఫ్రికాకు ఏ మాత్రం కలిసిరావడం లేదు. డికాక్ ఔట్ అయిన విధానం దురదృష్టం అనుకుంటే.. ఇక కేశవ్ మహరాజ్ ఔటైన తీరు చూస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేం. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 15 ఓవర్‌ను కమిన్స్ వేశాడు. ఓవర్ మూడో బంతిని కేశవ్ మహరాజ్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మక్రమ్ సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. అయితే బంతిని అందుకున్న ఫీల్డర్ మక్రమ్ వైపు విసరడంతో ఇద్దరు ఆగిపోయారు. అయితే బంతి ఓవర్ త్రో అయి మిస్‌ఫీల్డ్ అయింది. దీంతో మక్రమ్ సింగిల్ కోసం ప్రయత్నించగా... ఇక్కడే కేశవ్‌ను దురదృష్టం వెంటాడింది. సగం క్రీజు వరకు వచ్చిన కేశవ్ జారి పడ్డాడు. దీంతో మక్రమ్ వెనక్కి వెళ్లిపోగా.. అప్పటికే మ్యాక్స్‌వెల్ కీపర్ వేడ్‌కు త్రో వేయగా.. అతను నేరుగా వికెట్లను గిరాటేశాడు. దీంతో కేశవ్ మహరాజ్ రనౌట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. కేశవ్ రనౌట్‌పై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. '' అయ్యో కేశవ.. ఎంత పని జరిగే.. ''.. '' అనవసరంగా పరిగెత్తావు.. '' కామెంట్ చేశారు. చదవండి: AUS Vs SA: దురదృష్టం అంటే డికాక్‌దే.. మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బౌలర్ల దాటికి మక్రమ్(40) మినహా ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఐదుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, కమిన్స్ చెరో వికెట్ తీశారు. A terrible mix-up leads to the run out of Maharaj via @t20worldcup https://t.co/g8kph9LoX5 — varun seggari (@SeggariVarun) October 23, 2021 -
సూపర్ త్రో.. విలియమ్సన్ రనౌట్; సీజన్లో ఎస్ఆర్హెచ్ చెత్త రికార్డు
SRH Makes Worst Record After Kane Williamson Run Out.. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ విలియమ్సన్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. షకీబ్ డైరెక్ట్ త్రోకు విలియమ్సన్ వెనుదిరగాల్సి వచ్చింది. 26 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన విలియమ్సన్ ఇన్నింగ్స్ 7వ ఓవర్లో షకీబ్ వేసిన ఐదో బంతి మిడ్ వికెట్ దిశగా ఆడాడు. పరుగు తీయడం రిస్క్‌తో కూడుకున్నదని తెలిసినప్పటికి అనవసరంగా పరిగెత్తి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2021 సీజన్లో రనౌట్ విషయంలో ఎస్ఆర్హెచ్ ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్లు మూడుసార్లు రనౌట్ కావడం విశేషం. రెండుసార్లు డేవిడ్ వార్నర్.. తాజాగా విలియమ్సన్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నాడు. ఈ సీజన్లో పంత్ రెండుసార్లు రనౌట్ అయ్యాడు. ఇక సీఎస్కే, రాజస్తాన్ మినహా మిగిలిన టీమ్‌ల కెప్టెన్లు ఒక్కసారి రనౌట్‌గా వెనుదిరిగారు. Courtesy: IPL Twitter ఇక కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అబ్దుల్ సమద్ 25, ప్రియమ్ గార్గ్ 21 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ మెరుపులు మెరిపించలేకపోయింది. దీనికి తోడూ మిగతా బ్యాట్స్‌మెన్ కూడా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. షకీబ్ ఒక వికెట్ తీశాడు. చదవండి: IPL 2021: హర్షల్ పటేల్ సూపర్ త్రో.. మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్; కోహ్లి గెంతులు pic.twitter.com/H7prWRNSq0 — Cricsphere (@Cricsphere) October 3, 2021 -
హర్షల్ పటేల్ సూపర్ త్రో.. మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్
Harshal Patel Super Throw Turning Point For RCB.. ఐపీఎల్ 2021 సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ సత్తా చాటింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. అయితే 19వ ఓవర్ వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబుచులాడింది. ఇక ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. కాగా 20వ ఓవర్‌ను హర్షల్ పటేల్ వేశాడు. కాగా హర్షల్ తన తొలి బంతికే షారుక్ ఖాన్‌ను అద్భుత త్రోతో రనౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. మ్యాచ్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకముందు ఒక ఫోర్.. ఒక సిక్స్‌తో షారుక్ మంచి టచ్‌లో ఉన్నాడు. అతను స్ట్రైక్ తీసుకోవాలని భావించాడు. అందుకే హర్షల్ వేసిన తొలి బంతిని హెన్రిక్స్ ఢిఫెన్స్ ఆడినప్పటికి షారుక్ అనవసరంగా పరుగుకు కాల్ ఇచ్చాడు. ఇంకేముంది అప్పటికే సగం క్రీజులో ఉన్న హర్షల్ మెరుపువేగంతో బంతిని త్రో విసరగా.. నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో షారుక్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక షారుక్ అవుటయ్యాడని తెలియగానే కోహ్లి సంబరాలు మాములుగా లేవు. మైదానంలో నే గెంతులు వేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మ్యాక్స్‌వెల్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు నష్టపోయి 158 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చదవండి: కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర.. వరుసగా నాలుగోసారి Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ -
షమీ సూపర్ త్రో.. డెబ్యూ మ్యాచ్‌లోనే రనౌట్
Mohammed Shami Stunning Throw.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ మహ్మద్ షమీ సూపర్ త్రోతో మెరిశాడు. షమీ వేసిన డైరెక్ట్ త్రోకు టిమ్ స్టీఫెర్ట్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. కాగా స్టీఫెర్ట్కు ఐపీఎల్లోలో ఇదే డెబ్యూ మ్యాచ్ కావడం విశేషం. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నాలుగో బంతిని స్టీఫెర్ట్ డిఫెన్స్ ఆడాడు. అయితే బంతి అక్కడే పడడంతో పరుగు తీయాలా వద్దా అని ఆలోచించాడు. కానీ అప్పటికే దినేశ్ కార్తిక్ సగం క్రీజు దాటేయడంతో స్టీఫెర్ట్ ఆలస్యంగా పరిగెత్తాడు.అప్పటికే బంతిని అందుకున్న షమీ మెరుపు వేగంతో విసరగా.. నేరుగా వికెట్లను గిరాటేసింది. ఇక మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(67 పరుగులు) హాఫ్ సెంచరీతో మెరవగా.. రాహుల్ త్రిపాఠి 34, నితీష్ రాణా 31 పరుగులతో అయ్యర్‌కు సహకరించారు. చదవండి: Virender Sehwag: ప్రత్యర్థి ఆటగాడిని దూషించాడు.. మనోడైనా తిట్టాడు; అది క్రీడాస్పూర్తి Ravi Bishnoi: నా మీద ఆ ముగ్గురి ప్రభావం గట్టిగా ఉంది.. అందుకే -
వారెవ్వా రియాన్ పరాగ్.. బులెట్ కంటే వేగంగా
Riyan parag Super Throw Virat Kohli Runout.. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ సూపర్ త్రోతో మెరిశాడు. దీంతో పరాగ్ దెబ్బకు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్యంగా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. క్రిస్ మోరిస్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఐదో బంతిని కోహ్లి స్వేర్ లెగ్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న రియాన్ పరాగ్ అద్భుతంగా డైవ్ చేసి బంతిని ఆపాడు. అప్పటికే కోహ్లి కదలాల వద్దా అన్న సంశయంలోనే క్రీజు దాటి ముందుకు వచ్చేశాడు. చదవండి: IPL 2021: అర్జున్ టెండూల్కర్‌కు గాయం.. అతని స్థానంలో అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న భరత్ సగం క్రీజు దాటేయడంతో కోహ్లి చేసేదేంలేక పరిగెత్తాడు. అప్పటికే పరాగ్ బంతిని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసరడం.. నేరుగా వికెట్లను తగలడంతో కోహ్లి క్లియర్ రనౌట్ అయ్యాడు. కోహ్లికి సంబంధించిన రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆర్సీబీ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ 17, భరత్ 24 పరుగులు చేసింది. చదవండి: Virender Sehwag: మిస్టర్ మోర్గాన్.. లార్డ్స్ బయట ధర్నా చేయాల్సింది pic.twitter.com/ELrk1Z404H — Cricsphere (@Cricsphere) September 29, 2021 -
ఔటవ్వాల్సింది బతికిపోయాడు.. కృనాల్, రోహిత్ క్రీడాస్పూర్తి
Rohit Sharma And Krunal Pandya Great Sportsmanship.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, కింగ్స్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మలు ప్రదర్శించిన క్రీడాస్పూర్తికి ఫ్యాన్స్‌తో పాటు కేఎల్ రాహుల్ కూడా ఫిదా అయ్యాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 6వ ఓవర్ కృనాల్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఓవర్ చివరి బంతిని గేల్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రాహుల్ అడ్డుగా రావడంతో అతని చేతికి బంతి తగిలి కృనాల్ వైపు వెళ్లింది. కాగా అప్పటికే రాహుల్ క్రీజుదాటి బయటికి వెళ్లడం.. కృనాల్ బంతిని వికెట్ల మీదకు విసరడం జరిగిపోయాయి. చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు Courtesy: IPL Twitter వాస్తవానికి కేఎల్ రాహుల్ అవుటవ్వాల్సిందే. అంపైర్ కూడా థర్డ్ అంపైర్‌కు సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. అయితే రాహుల్ ఏంటిది అన్నట్లుగా కృనాల్ వైపు చూశాడు. కృనాల్ కూడా అంపైర్ వద్దకు వెళ్లి తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రోహిత్‌కు కూడా అప్పీల్ వద్దంటూ వివరించాడు. దీంతో రోహిత్ వెనక్కి తగ్గాడు. ఓవర్ ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ కృనాల్, రోహిత్‌ల వైపు చూస్తూ థ్యాంక్స్ అనే అర్థం వచ్చేలా బొటనవేలితో థంప్సమ్ గుర్తు చూపించాడు. అలా రాహుల్ ఔటవ్వాల్సినప్పటికీ.. రోహిత్, పాండ్యాలు క్రీడాస్పూర్తి ప్రదర్శించడంతో బతికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత రాహుల్ 21 పరుగులు చేసి పొలార్డ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. Courtesy: IPL Twitter కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల నిలకడైన బౌలింగ్‌కు పంజాబ్ పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఎయిడెన్ మక్రమ్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపక్ హుడా 28 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, పొలార్డ్ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్, రాహుల్ చహర్ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: IPL 2021: కొద్దిలో తప్పించుకున్నాడు.. లేదంటే మొహం పచ్చడయ్యేది pic.twitter.com/7YsM7OyL4w — Simran (@CowCorner9) September 28, 2021 -
రనౌట్ అవకాశం.. హైడ్రామా.. బతికిపోయిన అశ్విన్
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ఇన్నింగ్స్ చివర్లో రనౌట్ విషయంలో హైడ్రామా నెలకొంది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన చిన్న పొరపాటుకు అశ్విన్ బతికిపోయాడు. అయితే ముస్తాఫిజుర్- అశ్విన్ మధ్య చోటుచేసుకున్న సన్నివేశం నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ముస్తాఫిజుర్ వేసిన నాలుగో బంతిని అశ్విన్ రెహమాన్ దిశగా రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే బంతిని అందుకున్న రెహమాన్ శాంసన్ వైపు విసిరాడు. కానీ శాంసన్ తనకు అవుట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ బంతిని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరాడు. చదవండి: DC Vs RR: పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే అయితే అశ్విన్ అప్పటికి క్రీజులోకి రాకపోవడం.. ముస్తాఫిజుర్ జాగ్రత్తగా అందుకున్న ఈజీగా రనౌట్ చేయొచ్చు. కానీ అతను డైవ్ చేస్తూ బంతిని వికెట్ల వైపు విసిరినప్పటికీ అది పక్క నుంచి వెళ్లిపోవడంతో అశ్విన్ రెండో పరుగు పూర్తి చేశాడు. ఆ తర్వాత పైకి లేచిన ముస్తాఫిజుర్ అశ్విన్‌ను చూస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ఇక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని దక్కించుకుంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేసి 33 పరుగులతో పరాజయం పాలైంది. pic.twitter.com/00sh7UWo6y — Simran (@CowCorner9) September 25, 2021 -
ఔటయ్యాననే కోపంతో బ్యాట్ విసిరాడు.. అది కాస్తా..
Batsman Swing Bat After Run Out Hurts Team Mate.. క్రికెట్లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. ఆ ఫన్నీ కాస్త శృతిమించితే సీరియస్‌గా మారిపోతుందనే దానికి ఈ సంఘటనే ఉదాహరణ. రనౌట్ అయ్యాననే కోపంతో నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాట్స్‌మన్ తన బ్యాట్‌ను కోపంతో విసిరాడు. అది కాస్త వెళ్లి ఎవరు ఊహించని రీతిలో స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్ ముఖానికి తగిలింది. ఈ హఠాత్మపరిణామంతో ఆ ఆటగాడు షాక్‌కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా మాజీ క్రికెటర్ .. కేకేఆర్ బౌలర్ హర్భజన్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చదవండి: KL Rahul: 22 పరుగుల దూరం.. ఐపీఎల్ చరిత్రలో రెండో బ్యాట్స్‌మన్‌గా విషయానికి వస్తే.. క్లబ్ క్రికెట్లో ఇది చోటుచేసుకుంది. బౌలర్ బంతి విసరగా.. స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్ గల్లీ దిశగా షాట్ ఆడాడు. నాన్‌స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్‌కు పరుగు కోసం కాల్ ఇచ్చాడు. దీంతో అవతలి ఎండ్ నుంచి బ్యాట్స్‌మన్ సగం వరకు చేరుకున్నాడు. అయితే ఫీల్డర్ బంతిని అందుకోవడంతో స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్ వెనక్కి తగ్గాడు. అప్పటికే బంతి వికెట్లను గిరాటేయడంతో నాన్‌స్ట్రైక్ బ్యాట్స్‌మన్ రనౌట్ అయ్యాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడే మొదలైంది. రనౌట్ అయ్యాననే కోపంతో బ్యాట్‌ను విసిరేయగా.. అది వెళ్లి నేరుగా స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్ ముఖానికి తగిలింది. చదవండి: IPL 2021: అఫ్గాన్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణమట..! వెంటనే ఫిజియో థెరపీ వచ్చి అతన్ని పరీక్షించాడు. అదృష్టవశాత్తు ఆ బ్యాట్స్‌మన్‌కు ఏం కాలేదు. ఇది ఊహించని నాన్‌స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్ అతని వద్దకు పరిగెత్తుకు వచ్చి ఏమైందో అని కంగారు పడిపోయాడు. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ యాదృశ్చికంగా జరిగిందా లేక కావాలనే చేశాడా అని అభిప్రాయపడుతున్నారు. ఇక హర్భజన్ సింగ్ ప్రస్తుతం కేకేఆర్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో హర్భజన్ 163 మ్యాచ్‌లాడి 150 వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
త్రో దెబ్బకు రనౌట్.. స్టంప్ మైక్ ఊడి వచ్చింది
Avishka Fernando Run Out: శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో అవిష్క ఫెర్నాండో రనౌట్ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికా ఆటగాడు నోర్ట్జే మెరుపు వేగంతో వేసిన త్రో దాటికి స్టంప్ బయటికి రావడంతో పాటు స్టంప్ మైక్ కూడా ఊడి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 6వ ఓవర్‌ను రబడ వేశాడు. ఓవర్ ఐదో బంతిని అవిష్క ఫెర్నాండో మిడాన్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న నోర్ట్జే మెరుపువేగంతో బంతిని నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరాడు. అంతే బులెట్ వేగంతో వచ్చిన బంతి మిడిల్ స్టంప్‌ను బయటపడేలా చేసింది. దీంతో పాటు మైక్ స్టంప్ కూడా ఊడి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 28 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. చదవండి: Shane Warne: టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు Dinesh Chandimal's 66* | 1st T20I #SLvSA @chandi_17 Full Highlights➡️ https://t.co/vt7jmJz8AZ pic.twitter.com/ypTwToUaP5 — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2021 -
రనౌట్ కోసం థర్డ్ అంపైర్‌కు అప్పీల్; స్క్రీన్‌పై మ్యూజిక్ ఆల్బమ్
జమైకా: పాకిస్తాన్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగిన సంగతి తెలిసిందే. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. కాగా విండీస్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 77వ ఓవర్లో విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ రనౌట్ విషయంలో థర్ఢ్ అంపైర్‌ను ఆశ్రయించారు. ఆ సమయంలో బ్రాత్‌వైట్ 97 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. రిప్లేలో బ్రాత్‌వైట్ ఔటైనట్లు కనిపించింది. కానీ సంప్రదాయం ప్రకారం బిగ్స్క్రీన్పై చూపించడం ఆనవాయితీ. కాగా థర్ఢ్ అంపైర్ డెసిషన్ కోసం అందరూ స్ర్కీన్ వైపే చూస్తున్నారు. అలాంటి సమయంలో స్ర్కీన్‌పై మ్యూజిక్ ఆల్బమ్ కనిపించింది. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకుల మొహాల్లోనూ నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు ఒక లుక్కేయండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాక్ నిర్దేశించిన 168 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు తడబడినప్పటికీ.. ఆఖర్లో కీమర్ రోచ్ (52 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 142 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా.. జోమెల్ వారికన్ (6), జేడెన్ సీల్స్ (2) అండతో రోచ్ తన జట్టును గట్టెక్కించాడు. ఈ విజయంతో విండీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగష్టు 20న ప్రారంభం కానుంది. చదవండి: Test Cricket: కోహ్లిని ‘అధికార ప్రతినిధి’ని చేయండి! -
ఏంటి రహానే ఇలా చేశావు.. అంత తొందరెందుకు
నాటింగ్హమ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అజింక్యా రహానే అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అయితే రహానే ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓలి రాబిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్ రెండో బంతిని స్ట్రైక్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ఢిపెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాక్వర్డ్ పాయింట్ దిశలో ఉన్న బెయిర్ స్టో దగ్గరికి వెళ్లింది. అయితే రాహుల్ క్రీజు నుంచి కదలడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రహానే పరుగు కోసం ముందుకు వచ్చాడు. రాహుల్ వద్దంటూ చేయితో సిగ్నల్ ఇచ్చినప్పటికి రహానే అది పట్టించుకోకుండా క్రీజు దాటి బయటకు వచ్చేశాడు. అప్పటికే బంతిని అందుకున్న బెయిర్ స్టో రహానే ఉన్న వైపు విసిరాడు. బంతి నేరుగా వికెట్లను గిరాటేయడంతో రహానే రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. రహానే రనౌట్‌పై నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు.'' ఏంటి రహానే ఇలా చేశావు.. అంత తొందరెందుకు నీకు.. రాహుల్ సిగ్నల్ చూస్తే బాగుండు... అనవసర తప్పిదంతో రనౌట్ అయ్యావు'' అంటూ కామెంట్ చేశారు. కాగా పుజారా, కోహ్లి ఔటైన తర్వాత రహానే కూడా వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో వెలుతురులేమితో పాటు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఇప్పటివరకు టీమిండియా 46.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 57, పంత్ 7 పరుగులతో ఆడుతున్నారు. A sensational hour of cricket after lunch 💥 Scorecard/Clips: https://t.co/5eQO5BWXUp#ENGvIND pic.twitter.com/j7TvyxeSCE — England Cricket (@englandcricket) August 5, 2021 -
ఇలా కూడా రనౌట్ చేస్తారా? చాలా విచిత్రంగా ఉందే!
హోవ్: ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (48; 8 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడింది. కేథరిన్ బ్రంట్ వేసిన నాలుగో ఓవర్లో షఫాలీ వరుసగా ఐదు ఫోర్లు కొట్టింది. హర్మన్‌ప్రీత్ (31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (24 నాటౌట్; 1 ఫోర్)లు రాణించారు. ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్ బీమాంట్ (59; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇంగ్లండ్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా... 5 రన్స్ మాత్రమే చేసి ఓడింది. కీలకమైన బీమాంట్ వికెట్‌ను తీసి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పిన దీప్తి శర్మ (1/18)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. వివాదాస్పద రనౌట్? రెండో టీ20 సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ హెదర్ నైట్ రనౌట్ అయిన తీరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీప్తి శర్మ బౌలింగ్‌లో 14 ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్న జోన్స్... స్ట్రెయిట్ షాట్ ఆడింది. అయితే, పరుగు కోసం నైట్ అప్పటికే క్రీజును వీడగా... బాల్ దీప్తి కాళ్ల నడుమ స్టెప్ తిని స్టంప్స్‌ను తాకింది. ఈ క్రమంలో దీప్తి సంబరాలు చేసుకోగా.. ఊహించని పరిణామానికి కంగుతిన్న నైట్.. షాక్‌కు గురైంది. అంపైర్ దీనిని రనౌట్‌గా ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్‌కు చేరింది. ఈ విషయంపై స్పందించిన మాజీ క్రికెటర్, కామెంటేటర్ అలెక్స్ హర్ట్లీ.. ‘‘కావాలనే బ్యాట్స్‌వుమెన్‌ను అడ్డుకున్నట్లు కదా’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక మార్క్ బచర్ మాట్లాడుతూ.. ‘‘బౌలర్ ఉద్దేశపూర్వంగా హెదర్ నైట్‌ను అడ్డుకోనట్లయితే ఇది కచ్చితంగా అవుట్ అన్నట్లే కదా?’’ అని పేర్కొన్నారు. కాగా ఐసీసీ నిబంధనల్లోని 41.5 రూల్ ప్రకారం.. మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ.. ఉద్దేశపూర్వంగా బ్యాటర్‌ను బౌలర్ అడ్డుకుంటే శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై అంపైర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ‘‘ఇలా కూడా రనౌట్ చేస్తారా? విచిత్రంగా ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
పాపం ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు
కార్డిఫ్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్ అద్భుత రనౌట్‌తో మెరిశాడు. ఫుట్‌బాల్ టెక్నిక్‌ను ఉపయోగిస్తూ లంక బ్యాట్స్‌మన్ దనుష్క గుణతిలకను వెనక్కి పంపడం వైరల్‌గా మారింది. టాస్ గెలిచిన శ్రీలంక ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, దనుష్క గుణతిలకలు ఆరంభించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సామ్ కరన్ వేసిన మూడో బంతిని ఫెర్నాండో షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు తగిలి పిచ్‌పైనే ఉండిపోయింది. సింగిల్‌కు అవకాశం ఉండడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న గుణతిలక ఫెర్నాండోకు కాల్ ఇచ్చాడు. అయితే అప్పటికే కరన్ అక్కడే ఉండడంతో రెప్పపాటులో ఫుట్‌బాల్ టెక్నిక్‌ను ఉపయోగించి తన కాలితో బంతిని వేగంగా వికెట్ల వైపు తన్నాడు. అంతే.. గుణతిలక క్రీజులోకి చేరుకోకుముందే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో ఇది ఊహించని గుణతిలక భారంగా పెవిలియన్‌కు చేరాడు. సామ్ కరన్ రనౌట్ వీడియో ఈసీబీ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ఇట్స్ కమింగ్ హోమ్.. సామ్ బ్యాక్ ఆన్ ది నెట్ అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (39; 3 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ (2/18), ఆదిల్ రషీద్ (2/24) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని 18 ఓవర్లలో 103 పరుగులుగా నిర్ణయించారు. ఇంగ్లండ్ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలి చింది. సామ్ బిల్లింగ్స్ (24; 2 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 29 నాటౌట్; సిక్స్), సామ్ కరన్ (8 బంతుల్లో 16 నాటౌట్; ఫోర్, సిక్స్) రాణించి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశారు. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. చదవండి: ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఇంగ్లండ్‌దే టి20 సిరీస్ Great. Let's win this @englandcricket ....@daniel86cricket bro r u watching ur team s worst performance vs ENG — RahulVaidya_fanclub (@vaidyaFan_rahul) June 24, 2021 -
తాహిర్ సూపర్ రనౌట్.. ఈ వయసులోనూ
ముంబై: ఆర్సీబీతో మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ సూపర్ రనౌట్‌తో మెరిశాడు. ఈ సీజన్లో తాహిర్‌కు ఇదే మొదటి మ్యాచ్.. కాగా ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతిని జేమిసన్ స్వేర్‌లెగ్ దిశగా ఆడాడు. అయితే తర్వాతి ఓవర్ స్ట్రైక్ తీసుకోవాలని భావించిన జేమిసన్ చహల్‌కు కాల్ ఇచ్చాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న చహల్ క్రీజు నుంచి కదిలి పరుగు రావడం కష్టమని భావించి మళ్లీ వెనక్కి వచ్చేశాడు. అయితే జేమిసన్ క్రీజు వదిలి ముందుకు రావడం.. అప్పటికే స్వేర్‌లెగ్‌లో ఉన్న తాహిర్ డైరెక్ట్ త్రో విసరడంతో నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో జేమిసన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. తాహిర్ చేసిన రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''తాహిర్ వచ్చీ రావడంతోనే ఇరగదీశావ్.. ఈ వయసులోనూ సూపర్ డైరెక్ట్ త్రో..'' అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇక బౌలింగ్‌లోనూ తాహిర్ మెరిశాడు. 4 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.అందుకుంది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. పడిక్కల్(34) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మ్యాక్స్‌వెల్ 22 పరుగులు చేయగా.. మిగతావారు సీఎస్కే బౌలర్ల దాటికి అలా వచ్చి ఇలా వెళ్లారు. సీఎస్కే బౌలర్లలో జడేజా 3, తాహిర్ 2, శార్ధూల్, సామ్ కరన్ చెరో వికెట్ తీశారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటింగ్‌లో జడేజా 62 నాటౌట్ మెరుపులు మెరిపించగా.. డుప్లెసిస్ 50 పరుగులతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చహల్ ఒక వికెట్ తీశారు. చదవండి : ఒక్క ఓవర్.. 37 పరుగులు.. జడ్డూ విధ్వంసం pic.twitter.com/WefCKRyqTd — Aditya Das (@lodulalit001) April 25, 2021 -
'రనౌట్ చేశానని నా మీదకు కోపంతో రావుగా'
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో బుధవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ డైమండ్ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్ అద్బుతమైన త్రోకు పూరన్ ఒక్క బంతి ఎదుర్కోకుకుండానే రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 7వ ఓవర్‌ను ఖలీల్ వేయగా.. ఆఖరిబంతిని గేల్ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. పరుగు కోసం గేల్ కాల్ ఇవ్వడంతో పూరన్ ఏం ఆలోచించకుండా క్రీజు దాటి ముందుకొచ్చాడు. అయితే గేల్ అప్పటికే సగం క్రీజు దాటేయడంతో పూరన్ పరిగెత్తాల్సి వచ్చింది. అప్పటికే బంతిని అందుకున్న వార్నర్ మెరుపువేగంతో త్రో విసిరాడు. అది నేరుగా వికెట్లను గిరాటేయడంతో పూరన్ డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో ఈ సీజన్లో పూరన్ డకౌట్ల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లాడిన అతను మూడుసార్లు డకౌట్ అవ్వడం విశేషం. ఇక మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ నికోలస్ పూరన్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పూరన్ భయ్యా.. రనౌట్ చేశానని.. నా మీదకు కోపంతో మాత్రం రావుగా... అంటూ క్యాప్షన్ జతచేశాడు. వార్నర్ కామెంట్ వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచిన ఎస్ఆర్హెచ్ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి నిలువలేక 19.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్‌లో వార్నర్ 37 పరుగులు చేసి ఔటవ్వగా.. బెయిర్ స్టో 63*, విలియమ్సన్ 16*.. మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు. కాగా ఎస్ఆర్హెచ్ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 25న చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. చదవండి: సూపర్ రనౌట్.. పూరన్ డైమండ్ డక్ విలియమ్సన్ రాకతో మా బలం పెరిగింది: వార్నర్ pic.twitter.com/TKGafZrQcl — Cricsphere (@Cricsphere) April 21, 2021 -
సూపర్ రనౌట్.. పూరన్ డైమండ్ డక్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. వార్నర్ దెబ్బకు పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 7వ ఓవర్‌ను ఖలీల్ వేయగా.. ఆఖరిబంతిని గేల్ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. పరుగు కోసం గేల్ కాల్ ఇవ్వడంతో పూరన్ ఏం ఆలోచించకుండా క్రీజు దాటి ముందుకొచ్చాడు. అయితే గేల్ అప్పటికే సగం క్రీజు దాటేయడంతో పూరన్ పరిగెత్తాల్సి వచ్చింది. దీంతో కవర్స్‌లో ఉన్న వార్నర్ అప్పటికే బంతిని అందుకొని మెరుపువేగంతో త్రో విసిరాడు. అది నేరుగా వికెట్లను గిరాటేసింది. అయితే కీపర్ బెయిర్ స్టో ప్యాడ్లు వికెట్లకు ఏమైనా తగిలాయేమోనన్న అనుమానంతో ఫీల్ఢ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. రిప్లేలో పూరన్ రనౌట్ అని క్లియర్‌గా తేలడంతో అతను డైమండ్ డక్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. కాగా ఒక బ్యాట్స్‌మన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా ఔట్ అయితే దానిని డైమండ్ డక్ అని పిలుస్తారు. వార్నర్ చేసిన రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడుతున్న పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పంజాబ్ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. హెన్రిక్స్ 9, షారుఖ్ ఖాన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. చదవండి: 'రోహిత్ నా ఫెవరెట్ ప్లేయర్.. అందుకే ఆ పని చేశా' 'రికార్డుల కోసం నేను ఎదురుచూడను' pic.twitter.com/TKGafZrQcl — Cricsphere (@Cricsphere) April 21, 2021 -
సూపర్ జడ్డూ.. ఇటు రనౌట్.. అటు స్టన్నింగ్ క్యాచ్
ముంబై: రవీంద్ర జడేజా.. ఫీల్డింగ్‌లో ఉన్నాడంటే బంతి అతని చేయి దాటి వెళ్లడం అసాధ్యం. మైదానంలో పాదరసంలా కదిలే జడేజా తన ఫీల్డింగ్ పవర్ ఏంటో మరోసారి రుచి చూపించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక కళ్లు చెదిరే క్యాచ్.. ఒక మెరుపు రనౌట్‌తో ఆకట్టుకున్నాడు. మొదట చహర్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ ఐదో బంతిని గేల్ ఫ్లిక్ చేశాడు. అయితే గేల్ రన్ కోసం సిగ్నల్ ఇవ్వడంతో రాహుల్ అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తాడు. దీంతో గేల్ కూడా అవతలివైపుకు వచ్చేశాడు. ఈ దశలో మెరుపువేగంతో స్పందించిన జడేజా డైరెక్ట్ త్రో విసరడంతో రెప్పపాటులో బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో రాహుల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అలా రాహుల్‌ను అద్భుత రనౌట్‌తో పెవిలియన్‌కు చేర్చిన జడ్డూ ఆ తర్వాత గేల్‌ను ఒక స్టన్నింగ్ క్యాచ్‌తో వెనక్కి పంపించాడు. దీపక్ చహర్ వేసిన 5వ ఓవర్ రెండో బంతిని గేల్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశలో ఆడాడు. అయితే అప్పటికే అక్కడ కాచుకు కూర్చున్న జడేజా పాదరసంలా కదిలి ఒకవైపుగా డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అలా ఇద్దరు కీలక ఆటగాళ్లను ఔట్ చేయడంలో జడ్డూ కీలకపాత్ర పోషించాడు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. షారుఖ్ ఖాన్ బాధ్యతాయుతంగా ఆడి 47 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ ఆ మాత్రం స్కోరైనా నమోదు చేయగలిగింది. ఇక సీఎస్కే బౌలర్లలో దీపక్ చహర్ (4-1-13-4)తో తన కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా.. బ్రావో, సామ్ కరన్, మొయిన్ అలీ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: మొదట రనౌట్ చేసినందుకు.. తర్వాత మ్యాచ్ గెలిచినందుకు సంజూ సూపర్ క్యాచ్.. బిక్కమొహం వేసిన ధావన్ "Ravindra Jadeja is the Best fielder in the World. You cannot take a runs against Ravi Jadeja as fielder." - Gautam Gambhir#jadeja #CSKvPBKS @imjadeja | @GautamGambhir Bapu Rocks! pic.twitter.com/7kXIBC8HmO — Akshayrajsinh Mahendrasinh Sarvaiya (@AkshayrajsinhS) April 16, 2021 #CSKvPBKS #MSDhoni Sir Jadeja has mastered the art of fielding. His squad can always rely on him for catching a ball. He has also shown off his fielding skills in the field too. Undoubtedly, he is one of the finest fielder First with run out, second with this catch! Wonder. pic.twitter.com/mRpL3OhJFI — Fenil Kothari CA (@fenilkothari) April 16, 2021 -
రూల్ ప్రకారం అతను నాటౌట్.. అదనంగా 5 పరుగులు కూడా
లండన్: దక్షిణఫ్రికా, పాక్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో ప్రొటీస్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించి, డబుల్ సెంచరీకి చేరువగానున్న పాక్ బ్యాట్స్‌మెన్ ఫకర్ జమాన్(193; 155 బంతుల్లో 18x4, 10x6) రనౌట్‌కు కారణమయ్యాడని క్రికెట్ లామేకర్ మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పేర్కొంది. డికాక్ ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యపై ఫీల్డ్ అంపైర్లు స్పందించకపోవటాన్ని ఎంసీసీ తప్పుపట్టింది. ఎంసీసీ రూల్ 41.5.1 ప్రకారం ఫీల్డర్లు మాటలతో కానీ సైగలతో కానీ బ్యాట్స్‌మెన్‌ను తప్పుదోవ పట్టించి, అతను వికెట్ కోల్పోవడానికి కారణమైతే ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకోవచ్చని ఎంసీసీ వివరణ ఇచ్చింది. Absolutely brilliant from #QuintonDeKock . Brilliant. @OfficialCSA #SAvPAK pic.twitter.com/6LIHaM9ZzV — Tweeter (@tweetersprints) April 4, 2021 ఫీల్డర్ల తప్పుడు సంకేతాల వల్ల బ్యాట్స్‌మెన్ రనౌటైతే, దాన్ని నాటౌట్‌గా పరిగణించాలని అంతేకాకుండా బ్యాట్స్‌మెన్ తీసిన పరుగులకు అదనంగా 5 పరుగులు కలపాలని, తరువాతి బంతిని ఎదుర్కొనే ఛాయిస్‌ను కూడా బ్యాట్స్‌మెన్‌కే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఫకర్ జమాన్ రనౌట్ వివాదంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంసీసీ ఈ మేరకు స్పందించింది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కాగా, కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని 7 పరుగుల తేడాతో మిస్ చేసుకున్న పాక్ బ్యాట్స్‌మెన్.. రనౌట్ వివాదంలో డికాక్ తప్పేమీ లేదని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా, మ్యాచ్ చివరి ఓవర్లో డికాక్ ఉద్దేశపూర్వకంగా చేసిన సైగల కారణంగా ఫకర్ జమాన్ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మార్క్రమ్ వేసిన త్రో బౌలర్ ఎండ్‌కు వెళ్తుందని భావించిన జమాన్.. అటువైపు దృష్టి మళ్లించేసరికి బంతి వికెట్లను తాకడంతో అతను రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పర్యాటక పాక్ జట్టు 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చదవండి: ఐపీఎల్ ప్లేయర్స్‌కు కరోనా వ్యాక్సినేషన్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు -
వివాదాస్పద రనౌట్ దుమారం: ‘డీకాక్ తప్పేమీ లేదు’
జొహన్నెస్‌బర్గ్: ఆటల్లో క్రీడాస్ఫూర్తి అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా క్రికెట్లో దీని పాలు ఎక్కువే! అందుకే దీనిని జెంటిల్మెన్ గేమ్ అంటారు. ఆటలో ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. కానీ మైదానంలో ఆటగాళ్లు ఎలా ప్రవర్తించారనేది చాలా ముఖ్యం. అందుకు సంబంధించి ‘ఫెయిర్ ప్లే’ నియమ నిబంధనలూ ఉన్నాయి. అయితే, తాజాగా పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓపెనర్ ఫకర్ జమాన్ (193; 155 బంతుల్లో 18x4, 10x6) ను రనౌట్ చేసిన విధానం వివాదాస్పదంగా మారింది. ఈ రనౌట్ కు సంబంధించి డీకాక్ చేసింది గేమ్ స్పిరిట్‌కు విరుద్ధమని పాక్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇదే విషయంపై తాజాగా ఫకర్ జమాన్ స్పందించాడు. నేనే మరింత చురుగ్గా వ్యవహరించుండాలి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తన రనౌట్ బాధ్యతను ఫఖర్ జమానే తీసుకున్నాడు. ‘ఆ సమయంలో తానే మరింత చురుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. ఇందులో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ తప్పు లేదు. హరిస్ రౌఫ్ క్రీజ్ నుంచి కొంచెం ఆలస్యంగా పరుగు ప్రారంభించాడు, అందువల్ల అతను ఇబ్బందుల్లో పడతాడని నేను భావించాను. ఈ క్రమంలో నా దృష్టి కొంచెం మళ్లింది. కాబట్టి ఇందులో డికాక్ తప్పుందని నేను అనుకోవడంలేదు’అని జమాన్ పేర్కొన్నాడు. ఇక రనౌట్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో మార్క్రమ్ త్రో చేస్తున్న సమయంలో డీకాక్ చేసిన సైగలతో బంతి తను పరుగెడుతున్న వైపు రావడం లేదని భావించిన జమాన్ వేగాన్ని తగ్గించాడు. కాని బంతి అనూహ్యంగా అతని ఎండ్ వికెట్లకే తగిలి ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా రెండో వన్డేలో 342 పరుగులు చేసిన పాకిస్థాన్‌కు చివరి ఓవర్లో 31 పరుగులు అవసరం. జమాన్ రనౌట్ అయిన తరువాత, పాక్ 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అసలు చట్టం ఏం చెప్తోంది రూల్ 41.5.1 ప్రకారం స్ట్రైకర్ బంతిని అందుకున్న తర్వాత బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవడం, ఏ ఫీల్డర్ అయినా మాటలు లేదా తమ చర్యల ద్వారా ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మన్‌ను దృష్టి మరల్చకూడదని పేర్కొటోంది. ( చదవండి: పవర్ఫుల్ షాట్.. కెమెరానే పగిలిపోయింది! ) #fakharzaman For the ones justifying. he clearly deceived fakhar zaman by his gesture and he unintentionally looked behind and hence slowed himself down. this is clear cheating. fake fielding. against the rules. 👎#fakharzaman #PakvRSA pic.twitter.com/qqNm5oKo8p — Pak Warrior 🇵🇰🇹🇷🇵🇰🇹🇷 (@MUxama3) April 4, 2021 -
రనౌట్ వివాదం.. స్టోక్స్ అవుటా.. కాదా?
పుణే: టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని ధాటికి ఇంగ్లండ్ జట్టు మరో 6.3 ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. కాగా స్టోక్స్ 31 పరుగుల వద్ద ఉన్నప్పుడు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రనౌట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే స్టోక్స్ రనౌటా.. కాదా? అనేది సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఒకవేళ స్టోక్స్‌ను అవుట్‌గా ప్రకటించి ఉంటే మాత్రం ఫలితం వేరేలాగా ఉండేది. అసలు విషయంలోకి వెళితే.. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్ అయిదో బంతిని స్టోక్స్ మిడాన్ దిశగా షాట్‌ను ఆడాడు. సింగిల్ పూర్తి చేసిన స్టోక్స్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా కుల్దీప్ వేసిన త్రో నేరుగా వికెట్లను తాకింది. స్టోక్స్ బ్యాట్ క్రీజులో లేకపోవడంతో అంతా అవుటేనని భావించారు. అయితే రిప్లేలో చాలాసార్లు పరీక్షించిన థర్డ్ అంపైర్ క్లారిటీ లేకపోవడంతో నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే స్టోక్స్ బ్యాట్ గీత దాటి లోపలికి రాకముందే బంతి వికెట్లను గిరాటేసిందని.. అది ఔటేనని యువరాజ్ సింగ్ సహా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలా 31 పరుగుల వద్ద ఔట్ నుంచి బయటపడిన స్టోక్స్ ఆ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు. కుల్దీప్ ఓవర్లో 6, 4 బాది 40 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత స్టోక్స్ కొట్టిన షాట్లు భారత్ గెలిచే అవకాశాలను దూరం చేశాయి. అర్ధసెంచరీ తర్వాత తాను ఆడిన 11 బంతుల్లో స్టోక్స్ వరుసగా 6, 6, 6, 1, 6, 4, 2, 6, 6, 2, 4 (మొత్తం 49) బాదడం విశేషం. ముఖ్యంగా కుల్దీప్ ఓవ ర్లో కొట్టిన మూడు వరుస సిక్సర్లు, కృనాల్ ఓవర్లో కొట్టిన 3 సిక్స్ లు, 1 ఫోర్ స్టోక్స్ ఎంత ప్రమాదకారో చూపించాయి. చదవండి: భారత్ నెత్తిన బెయిర్ స్ట్రోక్స్ బెన్‌స్టోక్స్‌కు అంపైర్ వార్నింగ్.. ఏం చేశాడంటే! What was the soft signal by the field-umpire? #BenStokes @ICC #EngVsInd #INDvENG #ICC #BCCI pic.twitter.com/ww81yH9oHL — Prashant (@vprashant4) March 26, 2021 That was out !!! No part of bat was touching over the line . It was just showing that it was over ! Just my opinion !! #IndiavsEngland — Yuvraj Singh (@YUVSTRONG12) March 26, 2021 -
పంత్ తొందరపడ్డావు.. రెండు రన్స్‌తో ఆగిపోవాల్సింది
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ రనౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. సామ్ కరస్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ తొలి బంతిని పంత్ కవర్స్ దిశగా హిట్ చేసి సింగిల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కోహ్లి వేగంగా స్పందించడంతో అతి కష్టంగా రెండో పరుగును కూడా పూర్తి చేశాడు. ఈ దశలో ఫీల్డర్ మార్క్ వుడ్ బంతిని త్రో వేయగా.. దానిని అందుకున్న బట్లర్ వెనుకనుంచి విసరడంతో వికెట్లను తాకకుండా పక్కకు వెళ్లిపోయింది. ఇక్కడే పంత్ తొందరపడ్డాడు. రెండు పరుగులు చాలు అనుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. నాన్ స్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కోహ్లి పిలుపు అందుకొని ఏం ఆలోచించకుండా పంత్ క్రీజు దాటి సగం దూరం వచ్చేశాడు. అప్పటికే కోహ్లి అవతలి ఎండ్‌కు చేరుకోగా.. పంత్ మాత్రం వేగంగా చేరుకోలేకపోయాడు. రనౌట్ చేసే అవకాశం ఉండడంతో బట్లర్ వేగంగా స్పందించి సామ్ కరన్‌వైపు బంతిని త్రో వేయగా.. అతను క్షణం ఆలస్యం చేయకుండా వికెట్లు గిరాటేశాడు. దీంతో పంత్ డైవ్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాస్తవానికి 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పంత్ కోహ్లితో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరి మధ్య 40 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదైంది. కోహ్లి కాల్‌తో మూడో పరుగు కోసం పంత్ పరిగెత్తకపోయి ఉంటే టీమిండియా ఆట మరో విధంగా ఉండేది. అయితే పంత్ రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (46 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బట్లర్ (52 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించగా... బెయిర్‌స్టో (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. నాలుగో మ్యాచ్ రేపు జరుగుతుంది. చదవండి: పంత్ కళ్లు చెదిరే సిక్స్.. ఈసారి ఆర్చర్ వంతు -
పాపం పుజారా.. ఎంత పని జరిగిపోయింది
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో చతేశ్వర్ పుజారా రెండో ఇన్నింగ్స్‌లో రనౌట్ అయిన సంగతి తెలిసిందే. అతను రనౌట్ అయిన తీరు మాత్రం దురదృష్టకరం అని చెప్పొచ్చు. టీమిండియా ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చిన పుజారా బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అనూహ్యంగా టర్న్ అయిన బంతి అతని బ్యాట్‌కి కాకుండా ఫ్యాడ్‌ను తాకి షార్ట్ లెగ్‌లోని ఫీల్డర్ ఓలీ పోప్ చేతుల్లో పడింది. అప్పటికే పుజారా క్రీజులో లేకపోవడంతో ఓలీ పోప్ బంతిని కీపర్ బెన్ ఫోక్స్‌కి త్రో చేశాడు. రనౌట్ అవకాశముందని ఊహించిన పుజారా క్రీజులో బ్యాట్‌ని ఉంచేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాట్ క్రీజు లైన్పైనే చిక్కుకోవడం.. అదే సమయంలో అతని చేతి నుంచి బ్యాట్ కూడా జారిపోయింది. అయితే ఆఖరి క్షణంలో తన పాదాన్ని ఉంచేందుకు పుజారా ప్రయత్నించగా అప్పటికే ఫోక్స్ బంతితో బెయిల్స్‌ను కిందపడేశాడు. దీంతో పుజారా రనౌట్ అయినట్లు ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు. పుజారా రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులు చేసిన పుజారా మొదటి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు. ఇక టీమిండియా రెండో టెస్టులో విజయం దిశగా సాగుతుంది. 482 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 3 వికెట్లు నష్టపోయి 53 పరుగులు చేసింది. లారెన్స్ 12, రూట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (148 బంతుల్లో 106; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో ఐదో సెంచరీ చేయగా, కోహ్లి (149 బంతుల్లో 62; 7 ఫోర్లు) రాణించాడు. చదవండి: చెన్నపట్నం చిన్నోడు... నైట్‌వాచ్‌మన్‌గా వచ్చి..గోల్డెన్ డక్ Bad Luck Bad Luck Pro Pujara Run-out#INDvENG @cheteshwar1 pic.twitter.com/fcJ0BYjuOI — Chikmaya Kumar Dash (@ckdash045) February 15, 2021 -
రెండు వైపులా రనౌటయ్యాడు..
సిడ్నీ: బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుంది. సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రీకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ ఓపెనర్ జేక్ వెథరాల్డ్ రెండు ఎండ్స్లోనూ రనౌటైన సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో థండర్స్ బౌలర్ క్రిస్ గ్రీన్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో బ్యాట్స్‌మెన్ ఫిలిప్ సాల్ట్ కొట్టిన బంతి గ్రీన్ ఎడమ చేతిని తాకుతూ వికెట్లను ముద్దాడింది. ఈ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో జేక్ వెథరాల్డ్ క్రీజ్ బయట ఉన్నాడు. దీన్ని అంతగా పట్టించుకోని వెథరాల్డ్.. సాల్ట్ పరుగు కోసం పిలుపునివ్వడంతో స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరిగెట్టాడు. వెథరాల్డ్ క్రీజ్‌కు చేరుకునే లోపే వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వికెట్లకు గిరాటు వేశాడు. ప్రత్యర్ధి ఆటగాళ్లు అపీల్ చేయడంతో థర్డ్ అంపైర్ రనౌట్‌ను పరిశీలిస్తుండగా వెథరాల్డ్ రెండు వైపులా రనౌటైనట్లు తేలింది. ఒకే బ్యాట్స్‌మెన్ రెండు ఎండ్స్లోనూ రనౌటైన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
జడ్డూ లేట్ చేసి ఉంటే కథ వేరే ఉండేది
సిడ్నీ: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంటేనే మెరుపు ఫీల్డింగ్‌కు చిరునామా. మైదానంలో పాదరసంలా కదిలే జడేజా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్‌ను రనౌట్ చేసిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. స్మిత్‌ను రనౌట్ చేయడం ద్వారా జడేజా తన ఫీల్డింగ్ విలువేంటో మరోసారి చూపించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కడదాకా నిలిచి టెస్టుల్లో 27వ సెంచరీ నమోదు చేసిన స్మిత్ టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారాడు.(చదవండి: సెంచరీలు సమం చేసి.. పరుగుల్లో దాటేశాడు!) అతని ఒక్క వికెట్ పడితే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసినట్లే. ఈ దశలో 131 పరుగులు చేసిన స్మిత్ బుమ్రా బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ స్వ్కేర్‌లో షాట్ ఆడాడు. రెండో పరుగు తీసి స్ట్రైకింగ్ తీసుకుందామని యత్నించే క్రమంలో స్మిత్ రనౌట్‌గా నిష్క్రమించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అయితే స్మిత్‌ను జడేజా రనౌట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాక్వర్డ్ స్వేర్ లెగ్ నుంచి బంతిని అందుకున్న జడేజా బుల్లెట్ వేగంతో స్టైకింగ్ ఎండ్‌వైపు బంతిని విసరగా అది నేరుగా వికెట్లను గిరాటేసింది. ఒకవేళ జడేజా ఈ రనౌట్ చేయకుంటే స్మిత్ డబుల్ సెంచరీ కూడా చేసేవాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా స్మిత్ సెంచరీతో ఆసీస్ తొలిసారి టెస్టు సిరీస్‌లో 300 మార్కును అధిగమించింది. మరోవైపు సిడ్నీ టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన జడేజా విదేశీ గడ్డపై మూడో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇంతకముందు దక్షిణాఫ్రికాపై జోహెన్నెస్ బర్గ్‌లో 138 పరుగులకే 6 వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయగా.. కొలంబొ వేదికగా 152 పరుగులకే 5 వికెట్లు తీసిన జడేజా విదేశీ గడ్డపై రెండో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి పుజారా(9 బ్యాటింగ్), రహానే(5 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్(26;77 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) , శుబ్‌మన్ గిల్(50;101 బంతుల్లో 8 ఫోర్లు) ల వికెట్లను భారత్ చేజార్చుకుంది. Smith run out by sir jadeja...@ItsYashswiniR @secret_parii @Shersinghzn @RishabhPant17 @RickyPonting @sachin_rt @ShreyasIyer15 @yuzi_chahal @Sir_Jaddu pic.twitter.com/ElFIT6MV6j — Naveen (@Naveen99688812) January 8, 2021 -
పాపం ఫ్లెచర్.. సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో శనివారం హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ వైరల్‌గా మారింది. మెరుపు వేగంతో చేసిన ఆ రనౌట్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ క్రేజీ రనౌట్ హోబర్ట్ హరికేన్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో చోటుచేసుకుంది. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని అండ్రీ ఫ్లెచర్ మిడాఫ్ దిశగా పుష్ చేశాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కార్ట్‌రైట్ పరుగుకు పిలుపివ్వగా.. ప్లెచర్ క్రీజు నుంచి పరిగెత్తాడు. (చదవండి : స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్) అప్పటికే బంతిని మెరుపు వేగంతో అందుకున్న షార్ట్ నాన్‌స్ట్రైకింగ్ వైపు త్రో విసరగా.. అది నేరుగా వికెట్లను గిరాటేసింది. అప్పటికీ ప్లెచర్ క్రీజులోకి చేరుకోలేక రనౌట్‌గా వెనుదిరిగాడు. డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. షార్ట్ ఏంటి ఆ వేగం.. నీ రనౌట్‌తో ఫ్లెచర్ బిక్కమొహం వేశాడు. పాపం ఫ్లెచర్‌కు సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు.. అంటూ కామెంట్లు చేశారు. (చదవండి : ఆస్పత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ) The rocket arm from D'Arcy Short runs out Fletcher and the Stars lose their second wicket #BBL10 pic.twitter.com/4wGRhQuyKr — KFC Big Bash League (@BBL) January 2, 2021 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మలన్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 70 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడినా అతనికి మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. అటు హరికేన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మెల్బోర్న్ స్టార్స్ పరాజయం మూటగట్టుకుంది. (చదవండి : 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు) -
చిరుత కంటే వేగం.. అంత తేలిగ్గా మరిచిపోలేం
బ్రిస్బేన్ : జాంటీ రోడ్స్.. క్రికెట్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. అప్పటివరకు మూస ధోరణిలో ఉండే ఫీల్డింగ్‌కు కొత్త పర్యాయం చెప్పిన వ్యక్తి రోడ్స్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఫీల్డింగ్ విన్యాసాలు.. డైవ్ క్యాచ్‌లు.. మెరుపువేగంతో రనౌట్లు.. మైదానంలో పాదరసంలా కదలడం లాంటివన్నీ రోడ్స్ వచ్చిన తర్వాత వేగంగా మారిపోయాయి. తన 11 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు.. రనౌట్లు.. వెరసి కొన్నిసార్లు దక్షిణాఫ్రికా జట్టును కేవలం తన ఫీల్డింగ్ ప్రతిభతో మ్యాచ్‌లు గెలిపించాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టుకు ఆ ఇద్దరు ఆటగాళ్లు దూరం) అందుకు చాలా ఉదాహరణలున్నాయి.. వాటి గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తుకువచ్చేది 1992 ప్రపంచకప్.. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోడ్స్.. ఇంజమామ్‌ను రనౌట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. రోడ్స్ చేసిన విన్యాసం జిమ్ ఫెన్విక్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించగా.. అది బెస్ట్ ఫోటోగ్రఫీగా నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 211 పరుగులు చేసింది. ఆ తర్వాత మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 36 ఓవర్లకు కుదించి 194 పరుగులను రివైజ్డ్ టార్గెట్‌గా విధించారు. వర్షం తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. పాక్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 135 పరుగులతో పటిష్టంగా నిలిచి విజయానికి చేరువలో ఉంది. క్రీజులో ఇంజమామ్ ఉల్ హక్ 48 పరుగులతో మంచి టచ్‌లో ఉండగా.. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అతనికి అండగా ఉన్నాడు. అలెన్ డొనాల్డ్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఇంజమామ్ షాట్ ఆడాడు. ఇంజమాముల్ హక్ కొట్టిన బంతిని రోడ్స్ చురుగ్గా అందుకొని చిరుత కంటే వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేసి ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఇంజమామ్ షాక్‌కు గురికాగా.. సఫారీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న ఇంజమామ్‌ను రోడ్స్ ఔట్ చేయడంతో ఆ ప్రభావం పాక్‌పై తీవ్రంగా పడి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ రనౌట్‌తోనే జాంటీ రోడ్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఒకే మ్యాచ్‌లో 5 క్యాచ్‌లు అందుకున్న ఘనత రోడ్స్ పేరిట ఇప్పటికి నిలిచిపోయింది. తాజాగా ఐసీసీ క్రిస్టమస్ సందర్భంగా మరోసారి జాంటీ రోడ్స్ రనౌట్ ఫీట్‌ను స్నో స్టాపింగ్ మూమెంట్ పేరుతో ట్విటర్లో షేర్ చేసింది. As a part of our Crickmas celebrations, we bring you some of the biggest 'snow'stopping instances in cricket history ❄️❗ Who remembers this incredible run-out by Jonty Rhodes from the 1992 @cricketworldcup 🤩 pic.twitter.com/cQM5f73TcJ — ICC (@ICC) December 23, 2020 -
ధోని రనౌట్‌కు 16 ఏళ్లు..
ముంబై : ఈ దశాబ్దంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రోజు ఇదే. డిసెంబర్ 23, 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ధోని క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రం మ్యాచ్‌ను మంచి మెమొరబుల్‌గా మలుచుకోవాలని ప్రతి ఒక్క ఆటగాడు భావిస్తాడు. కానీ ఎంఎస్ ధోనికి మాత్రం తొలి మ్యాచ్ ఒక పీడకలగా మిగిలిపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో ధోని తాను ఆడిన తొలి బంతికే రనౌట్ అయి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తపష్ బైష్యా, ఖాలీద్ మసూద్‌లు కలిసి ధోనిని రనౌట్ చేశారు. (చదవండి : దీనిని 'క్యాచ్ ఆఫ్ ది సమ్మర్' అనొచ్చా..) తొలి మ్యాచ్‌లోనే ఇలాంటి ప్రదర్శన చేయడంపై అతను కొంత నిరుత్సాహం వ్యక్తం చేసినా... కొద్దిరోజుల్లోనే అతని విలువేంటనేది టీమిండియాకు అర్థమైంది. అక్కడినుంచి వెనుదిరిగి చూసుకోని ధోని మంచి ఫినిషర్‌గా నిలిచాడు. అంతేగాక క్రికెట్ చరిత్రలోనే గొప్ప కెప్టెన్ల సరసన చోటు సంపాదించాడు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోపీలను సాధించిపెట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే.. ధోని ఏ రనౌట్‌తో కెరీర్‌ను ప్రారంభించాడో యాదృశ్చికంగా అదే రనౌట్‌తో కెరీర్‌ను ముగించాడు. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ వేసిన డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ అయ్యాడు. తద్వారా మరోకప్ సాధించనున్నామనే భావనలో ఉన్న కోట్లాది మంది హృదయాలను విషాదంలోకి నెట్టాడు. ఆ తర్వాత ధోని మళ్లీ అంతర్జాతీయ బరిలోకి దిగలేదు. తన రిటైర్మెంట్పై ఎన్నో రకాల వార్తల వస్తున్న నేపథ్యంలో ఆగస్టు 15, 2020న ధోని తన ట్విటర్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అతని అభిమానులను దిగ్బ్రాంతికి లోనయ్యేలా చేశాడు. (చదవండి : 'పంత్‌కు కీపింగ్...సాహాకు బ్యాటింగ్ రాదు') ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై దారుణ ప్రదర్శన కనబరించింది. ధోని కెప్టెన్సీలోని చెన్నై జట్టు 14 మ్యాచుల్లో 6 విజయాలు, 8 ఓటములతో 7వ స్థానంలో నిలిచింది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని ఐపీఎల్‌కు కూడా దూరమవుతాడని అంతా భావించారు. ఈ విషయంపై నేరుగా స్పందించిన ధోని.. 2021 ఐపీఎల్లో ఆడనున్నట్లు తానే స్వయంగా సంకేతాలు ఇచ్చాడు. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ధోని టీమిండియా తరపున 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20లు ఆడాడు. ఇదే రోజుకు మరో విశేషం కూడా ఉంది. క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు సాధించి చరిత్ర సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేలకు ఇదే రోజు గుడ్‌బై చెప్పాడు. -
అచ్చం ధోని తరహాలో..
అడిలైడ్ : ఆసీస్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా వైఫల్యాన్ని అభిమానులు అంత తొందరగా జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ విధించిన 90 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ 21 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మాథ్యూ వేడ్‌ను వృద్ధిమాన్ సాహా రనౌట్ చేశాడు. సాహా రనౌట్ చేసిన తీరు అచ్చం టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనిని గుర్తుకుతెస్తుంది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 18వ ఓవర్ రెండో బంతిని వేడ్ ఫ్లిక్ చేయగా.. అది కీపర్ సాహా చేతికి చిక్కింది. వెంటనే సాహా.. ధోని తరహాలో తన కాళ్ల సందుల నుంచి బంతిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తిన వేడ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. (చదవండి : 96 ఏళ్ల చరిత్రను రిపీట్ చేశారు) ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. ' అలర్ట్.. అద్భుతమైన రనౌట్.. సాహా నుంచి వచ్చిన ఈ సిగ్నల్ దేనిని సూచిస్తుందో చెప్పగలరా..' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న మొదలుకానుంది. విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశం వెళ్లనున్న నేపథ్యంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. Bizarre dismissal alert! What about that from Saha?! #AUSvIND pic.twitter.com/OqMLnSNgCE — cricket.com.au (@cricketcomau) December 19, 2020 -
'కోహ్లి రనౌట్.. మాకు పెద్ద అవమానం'
అడిలైడ్ : ఆసీస్‌తో జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రనౌట్ అవుతాడని ఎవరు ఊహించి ఉండరు. రహానేతో సమన్వయ లోపం వల్ల కోహ్లి రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. కోహ్లి లాంటి బిగ్ వికెట్‌తో ఆసీస్‌కు ఉపశమనం కలగగా.. అతని అవుట్ అభిమానులకు నిరాశ కలిగించింది. తాజాగా కోహ్లి రనౌట్‌పై ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందించాడు. కోహ్లి రనౌట్ కావడం నన్ను బాధించింది. అతను క్రీజులోకి వచ్చినప్పుడే పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా దూసుకెళ్తున్న కోహ్లి అనూహ్యంగా రనౌట్ కావడం బాధాకరం. ఇది మాలాంటి క్రికెట్ అభిమానులకు పెద్ద అవమానం' అని ట్వీట్ చేశాడు. (చదవండి : పృథ్వీ షా డకౌట్.. వైరలవుతున్న ట్వీట్స్) పుజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే నిలదొక్కుకోవడంతో వీరిద్దరి మధ్య 88 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది. అప్పటికే కోహ్లి 180 బంతుల్లో 74 పరుగులతో క్రీజులో పాతుకుపోయి సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. ఈ నేపథ్యంలో లయన్ బౌలింగ్‌లో రహానే ఫ్లిక్ చేయగా మిడాఫ్‌లో ఉన్న హాజల్‌వుడ్ బంతిని లయన్‌కు అందించగా అతను నేరుగా వికెట్లను గిరాటేశాడు. కాగా రహానే కాల్‌తో అప్పటికే సగం పిచ్ దాటేసిన కోహ్లి ఏం చేయలేక నిరాశగా వెనుదిరిగాడు. Nightmare scenario for India, pure joy for Australia! Virat Kohli is run out after a mix up with Ajinkya Rahane! @hcltech | #AUSvIND pic.twitter.com/YdQdMrMtPh — cricket.com.au (@cricketcomau) December 17, 2020 ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా మొదటి రోజు ఆట ముగిసేసరికి 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లి (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టార్క్ 2 వికెట్లు తీయగా... హాజల్‌వుడ్, కమిన్స్, లయన్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. వృద్ధిమాన్ సాహా (9 బ్యాటింగ్), అశ్విన్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.(చదవండి : పుజారా గోడ.. ద్రవిడ్ కంటే బలమైనదట!) -
సూపర్ రనౌట్.. ఆ మీసానికి పవర్స్ ఉన్నాయా!
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హరికేనక్స్ బౌలర్ రిలే మెరెడిత్ ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేసిన తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఇన్నింగ్స్ సమయంలో 9వ ఓవర్ వేసిన మెరెడిత్ మూడో బంతిని ర్యాన్ గిబ్సన్‌కు విసిరాడు. అయితే బంతి బ్యాట్‌ను తాకి పిచ్‌లో ఉండిపోయింది. అప్పటికే నాన్ స్ట్రైకింగ్ ఎండింగ్లో ఉన్న బ్యాట్స్‌మన్ ముందుకు రావడంతో ర్యాన్ గిబ్సన్ కూడా క్రీజు వదిలి పిచ్ మధ్యకు వచ్చేశాడు.(చదవండి : రషీద్‌ను దంచేసిన ఆసీస్ బ్యాట్స్‌మన్) అప్పటికే పిచ్‌పై పాదరసంలా కదిలిన మెరెడిత్ బంతిని చేత్తో తీసుకోకుండా కేవలం ఫుట్వర్క్తోనే వికెట్లకు గిరాటేశాడు. గిబ్సన్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను తాకినట్లు రిప్లేలో కనపడడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే రషీద్‌ఖాన్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన మెరెడిత్ అంతకముందు వేసిన ఓవర్లోనూ జొనాథన్ వెల్స్‌ను కూడా డకౌట్ చేశాడు. ఓవరాల్‌గా మెరెడిత్ నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే మెరెడిత్ గిబ్సన్‌ను ఔట్ చేసిన తీరును బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేసింది. 'ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం.. మెరెడిత్ ఒక్కడే అన్ని పనులు చేస్తున్నాడు.. కచ్చితంగా అతని మీసానికి ఏవో సూపర్ పవర్స్ ఉన్నాయి' అంటూ ఫన్నీ క్యాప్షన్ జత చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : ముందు మీ టాప్ ఆర్డర్ చూసుకో : వసీం జాఫర్) Incredible! That moustache has super powers. Riley Meredith is doing it all out there! #BBL10 pic.twitter.com/I6ccaj2QQ7 — KFC Big Bash League (@BBL) December 13, 2020 కాగా ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరకేన్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. డీ ఆర్సీ షార్ట్ 48 బంత్లుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 175 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. అడిలైడ్ బ్యాట్స్మెన్లలో డేనియల్ వోర్రాల్ 66* పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హరికేన్స్ బౌలర్లలో జేమ్స్ ఫాల్కనర్ 3 వికెట్లతో రాణించగా.. జాన్ బోతా, రిలే మెరిడిత్ చెరో 2 వికెట్లు తీశారు. (చదవండి : వైరల్ : రనౌట్ తప్పించుకునేందుకే..) -
వారెవ్వా అయ్యర్.. వాట్ ఏ త్రో
సిడ్నీ : టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ మరో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఇప్పటికే ఆసీస్ 36 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్ 60 , లబుషేన్ 27 పరుగులతో కొనసాగుతున్నారు. ఇదిలాఉండగా.. మొదటి వన్డేలో అర్థసెంచరీ సాధించి మంచి ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ రెండో వన్డేలోనూ అదే జోరు కనబరిచాడు. వరుసగా రెండో అర్థసెంచరీ సాధించిన వార్నర్ ఈ మ్యాచ్‌లో వేగంగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలోనే 77 బంతుల్లో 83 పరుగులు చేసిన వార్నర్ శ్రేయాస్ అయ్యర్ వేసిన అద్భుతమైన త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో షాట్ ఆడిన స్మిత్ లాంగాన్ మీదుగా షాట్ ఆడాడు. మొదటి పరుగు వేగంగా పూర్తి చేసిన వార్నర్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా అప్పటికే అయ్యర్ చేతికి చిక్కిన బంతిని త్రోగా విసరడంతో నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో ఆసీస్ 156 పరుగుల వద్ద కీలకమైన వార్నర్ వికెట్‌ను కోల్పోగా.. భారత్‌కు రెండో వికెట్ దక్కింది. అయ్యర్ వార్నర్‌ను రనౌట్ చేసిన తీరును ఐసీసీ ట్విటర్లో పంచుకుంది. అయ్యర్ త్రోను పొగుడుతూ 'వారెవ్వా అయ్యర్.. వాట్ ఏ త్రో' అంటూ క్యాప్షన్ జత చేసింది. (చదవండి : 'బాబర్ అజమ్ నన్ను నమ్మించి మోసం చేశాడు') Spot on 🎯 A brilliant direct hit from Shreyas Iyer and David Warner is run out! A big wicket for India 💥 📝 #AUSvIND scorecard 👉 https://t.co/h5IaKNPjkbpic.twitter.com/u3prXgKJGS — ICC (@ICC) November 29, 2020 -
‘ఇది రనౌట్‌కంటే భిన్నమేమీ కాదు’
న్యూఢిల్లీ: హద్దులు దాటే నాన్‌స్ట్రైకర్‌ను ‘మన్కడింగ్’ ద్వారా అవుట్ చేసే అంశాన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని భారత మాజీ పేసర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో ఇది మామూలు రనౌట్‌కంటే భిన్నమేమీ కాదని, అవుటైన బ్యాట్స్‌మన్ సానుభూతి కోరడంలో అర్థం లేదని ఆయన అన్నారు. అసలు ఈ అంశంలో ‘క్రీడా స్ఫూర్తి’ని ఎందుకు తీసుకొస్తున్నారని శ్రీనాథ్ ప్రశ్నించారు. ‘అదనపు ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేసే నాన్ స్ట్రైకర్‌ను బౌలర్ అవుట్ చేయడం ముమ్మాటికీ సరైందే. (చదవండి: బీసీసీఐ ఇలా అస్సలు ఊహించి ఉండదు!) బౌలర్ ఎదురుగా ఉన్న స్ట్రైకర్‌కు బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టిన సమయంలో నాన్ స్ట్రైకర్‌కు వేరే పనేముంటుంది. బంతి పూర్తి అయ్యే వరకు ఆగలేడా. అది అతని బాధ్యత. ముందుకెళ్లి అనవసర ప్రయోజనం పొందే నాన్ స్ట్రైకర్‌ను రనౌట్ చేయడాన్ని నేను సమర్థిస్తా. నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయని మళ్లీ మళ్లీ చెప్పాం. అవుటయ్యాక క్రీడా స్ఫూర్తి అన్న మాటే అనవసరం. బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో ఉండి తన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచిది’ అని శ్రీనాథ్ విశ్లేషించారు. (చదవండి: సరదా కోసం కాదు... క్రికెట్ ఆడేందుకు వచ్చాం!) -
షేమ్ షేమ్.. షాహిన్ ఆఫ్రిది
సౌతాంప్టన్ : టెస్టు క్రికెట్లో రనౌట్ అనే పదమే చాలా తక్కువగా వినిపిస్తుంది. కానీ అనిశ్చితికి మారుపేరుగా ఉండే పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి అర్థం కాదు.. జట్టులోని ఆటగాళ్లు కూడా అంతే.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్‌లో షాహిన్ ఆఫ్రిది రనౌటైన తీరు చూస్తే జాలేస్తుంది. షాహిన్ తనంతట తానే రనౌట్ కావడం హాస్యాప్పదంగా ఉందంటూ ట్విటర్లో అభిమానులు పేర్కొంటున్నారు. (సచిన్ మొదటి సెంచరీకి 30 ఏళ్లు) సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ ఆడుతున్న పాక్ జట్టు 75 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది ఉన్నారు. క్రిస్ వోక్స్ వేసిన బంతి రిజ్వాన్ లెగ్‌ను తాకుతూ బయటికి వెళ్లింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ కోసం అంపైర్‌ను అడుగుతున్నారు. అయితే స్ట్రైకింగ్‌లో ఉన్న రిజ్వాన్ కాల్ వినిపించుకోకుండానే షాహిన్ పరుగు కోసం సగం క్రీజు వదిలి వచ్చాడు. ఇంతలో బంతిని అందుకున్న డొమినిక్ సిబ్లే కళ్లు చెదిరే వేగంతో వేసిన డైరెక్ట్ త్రో నేరుగా వికెట్లను గిరాటేసింది. అసలు ఇలా ఉదారంగా వికెట్ వస్తుందని ఇంగ్లండ్ కూడా ఊహించి ఉండదు. Another piece of brilliance in the field from @DomSibley! 🎯 Scorecard/Clips: https://t.co/yjhVDqBbVN#ENGvPAK pic.twitter.com/FuEAifdP5p — England Cricket (@englandcricket) August 14, 2020 అనవసరంగా ఒక డాట్ బాల్‌కు అవుటయ్యాననే ఫీలింగ్ కలిగిందేమో.. షాహిన్ ముఖానికి చేతిని అడ్డుపెట్టుకొని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం షాహిన్ రనౌట్ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని ఈసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. డొమినిక్ సిబ్లే అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాన్ని చూడండి అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే మొదటి టెస్టు మ్యాచ్‌ను ఆతిధ్య ఇంగ్లండ్‌కు సమర్పించుకున్న పాక్ రెండో టెస్టును నిరాశజనంకగానే ప్రారంభించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 60*, నసీమ్ షా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3, స్టువర్ట్ బ్రాడ్ 3, సామ్ కరన్, వోక్స్ తలా ఒక వికెట్ తీశారు.(ఎక్కడైనా ధోనియే నెంబర్ వన్) -
ఇందులో తప్పెవరిదీ?
-
‘ఇక్కడ తప్పెవరిదో మీరే చెప్పండి’
హైదరాబాద్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘త్రో బ్యాక్’ ట్రెండ్ నడుస్తోంది. లాక్డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్న క్రికెటర్లు తమ గత స్మృతులను గుర్తుచేసుకుంటూ ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ తన ఇన్‌స్టాలో హైదరాబాద్ వేదికగా 2005లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తను 17 బంతుల్లో 37 పరుగులు కొట్టిన వీడియోను షేర్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన యువరాజ్ సింగ్‌తో భజ్జీ మంచి భాగస్వామ్యం నమోదు చేస్తున్న తరుణంలో యువీ అనవసరంగా రనౌట్ అయ్యాడు. ఇదే విషయాన్ని భజ్జీ ప్రస్తావిస్తూ ఈ రనౌట్‌లో తప్పెవరిదని ఆ వీడియో కింద కామెంట్ జతచేశాడు. ‘అనవసరంగా పరుగు తీసి రనౌట్ అయ్యావు. ఇందులో తప్పెవరిదీ? మొత్తానికి మంచి ఇన్నింగ్స్ ఆడావు’ అంటూ భజ్జీ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన యువీ ‘పాజీ ఈ రనౌట్‌లో నీ తప్పేమి లేదు. నేనే ముందు పిలిచా. అందుకే నేనే వెనుదిరిగిపోయాను. అయినా నువ్వు నీ బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తావనే నమ్మకం ఉంది అప్పుడు’అంటూ బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈమ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. అయితే యువీ (103; 122 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్సర్లు) సెంచరీతో రాణించాడు. యువీకి తోడు ఇర్ఫాన్ పఠాన్(46), హర్భజన్ (37 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్ దిగిన దక్షణాఫ్రికా కలిస్ (68), గ్రేమ్ స్మిత్ (48)లు రాణించడంతో 5 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. చదవండి: బంతులే బుల్లెట్లుగా మారి... బీసీసీఐ మాటే నెగ్గుతుంది: చాపెల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_551241572.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘రిషభ్ రనౌట్.. రహానే కారణం’
వెల్లింగ్టన్: క్రికెట్లో రనౌట్ సర్వసాధారణం.. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో రనౌట్‌ను సాధారణంగా తీసుకుంటారు.. కానీ టెస్టు క్రికెట్లో రనౌట్‌ను ఎవరు ఉపేక్షించరు.. అందులోనూ కష్టకాలంలో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ అవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఓ సీనియర్ బ్యాట్స్‌మన్ అలా ఒక్క పరుగు కోసం ఆరాటపడి అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ రనౌట్‌కు కారణం కావడం విడ్డూరంగా ఉంది. న్యూజిలాండ్-టీమిండియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఎవరూ ఊహించని రనౌట్ చోటుచేసుకుంది. ఓవరనైట్ స్కోర్ 122/5తో రెండో రోజు ఇన్నింగ్ ఆరంభించిన కోహ్లి సేనకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో రోజు ఆటలో భాగంగా 59 ఓవర్లో మెరుపులు మెరిపిస్తాడని భావించిన పంత్ రనౌట్ అయ్యాడు. సౌతీ వేసిన 59 ఓవర్ రెండో బంతిని రహానే ఆఫ్‌సైడ్ తరలించి పరుగు తీయాలని ఆరాటపడ్డాడు. అయితే బంతి ఫీల్డర్ సమీపంలోకి రావడంతో అవతలి ఎండోలో ఉన్న పంత్ పరుగుకు తటపటాయించాడు. కానీ అప్పటికే సగం క్రీజు వరకు రహానే వచ్చి ఆగాడు. దీంతో చేసేదేమి లేక పంత్ కూడా పరుగు కోసం ప్రయత్నం ప్రారంభించాడు. అయితే అప్పటికే బంతి అందుకున్న అజాజ్ పటేల్ నేరుగా వికెట్ల మీదకు త్రో విసిరాడు. అప్పటికీ పంత్ క్రీజు చేరుకోకపోవడంతో రనౌట్ అయ్యాడు. దీంతో పంత్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ఇక ఈ అనూహ్య రనౌట్‌తో సారథి కోహ్లితో పాటు సహచర ఆటగాళ్లు, అభిమానులు తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. అయితే ఇప్పటివరకు 64 టెస్టులు ఆడిన రహానే తన భాగస్వామి రనౌట్‌లో భాగం కావడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. రహానేతో పాటు రోహిత్ శర్మలు ఇప్పటివరకు టెస్టు క్రికెట్లో రనౌట్‌లో భాగస్వామ్యం కాలేదు. ఇక పంత్ రనౌట్‌కు రహానే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘నెలకు పైగా రిజర్వ్ బెంచ్‌పైనే ఉన్నాడు.. పచ్చని పచ్చికపై ఆడే అపూర్వ అవకాశం దక్కింది. కానీ సీనియర్ ప్లేయర్ కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. ఇలా చేయడం పంత్‌కే సాధ్యం’, ‘పంత్ రనౌట్‌తోనే టీమిండియా ఆలౌటైంది’ అంటూ మరొకొంత మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 165 పరుగులకు ఆలౌటైంది. చదవండి: బోల్తా పడ్డారు... ఇంకో 43 కొట్టారు అంతే.. -
జడేజా రనౌట్‌పై వివాదం..
-
అతడు ప్రపంచంలోనే చెత్త కీపర్!
పెర్త్: ఆస్ట్రేలియా టెస్టు సారథి, వికెట్ కీపర్ టిమ్ పైన్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు వరుస కామెంట్స్ చేస్తున్నారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో పైన్ చేసిన చిన్న తప్పిదానికి అతడిపై ఆసీస్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. తొలి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా టిమ్ పైన్ చెత్త కీపంగ్‌తో కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కివీస్ బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మిచెల్ స్టార్ వేసిన 35వ ఓవర్ ఐదో బంతిని రాస్ టేలర్ కవర్ పాయింట్ దిశగా తరలించి సింగిల్ తీశాడు. అయితే నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న వాట్లింగ్, టేలర్ వద్దని వారించినా రెండో పరుగు కోసం సగం క్రీజు వరుకు చేరుకున్నాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నాథన్ లియోన్ బంతిని వేగంగా అందుకొని వికెట్ కీపర్ చేతుల్లోకి విసిరిడు. ఆ సులువైన బంతిని అందుకోవడంలో పైన్ విఫలమయ్యాడు. దీంతో వాట్లింగ్‌కు పైన్ రూపంలో జీవనధారం లభించింది. సులువైన బంతిని అందుకోడంలో విఫలమైన టిమ్ పైన్ సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. అయితే ఈ రనౌట్ మిస్సయినప్పటికీ ఆసీస్‌కు వచ్చిన పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే వాట్లింగ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 పరుగులకే ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే చాలా సులువైన బంతిని అందుకోవడంలోనే పైన్ తడబడటంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ‘అసలు పైన్ జట్టులో ఎందుకో నాకర్థం కావడం లేదు. కీపింగ్‌లో ఎలాంటి గొప్పతనం, కొత్తదనం లేదు.. ఇక బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కేవలం కెప్టెన్‌గా ఉన్నందునే జట్టులో ఇంకా కొనసాగుతున్నాడు. యువ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి అవకాశం ఇచ్చి.. స్మిత్‌కు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి టిమ్ పైన్‌ను జట్టు నుంచి సాగనంపడం బెటర్’అంటూ ఓ నెటజన్ కామెంట్ చేయగా.. ‘ప్రపంచంలోనే చెత్త కీపర్ టిమ్ పైన్’ అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కులు చూపించారు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది. 250 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడటంతో 217 పరుగులకే ఆలౌటైంది.(గాయం కారణంగా హేజిల్‌వుడ్ బ్యాటింగ్‌కు దిగలేదు). దీంతో కివీస్ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చదవండి: ఒకే టెస్టులో ఏకంగా ముగ్గురు.. ‘గుర్తుపెట్టుకోండి.. అతడే మ్యాచ్ డిసైడర్’ An early chance goes by! Paine fumbles with Watling out of the frame! #AUSvNZ live: https://t.co/0Uay6Vh9fg pic.twitter.com/mjZUiWrrqH — cricket.com.au (@cricketcomau) December 14, 2019 -
బట్లర్ బుల్లెట్ త్రో.. స్మిత్ షాక్!
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీస్‌లో జోస్ బట్లర్ తన సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(85)ను బట్లర్ తన బుల్లెట్ త్రోతో అవుట్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్బంగా క్రిస్ వోక్స్ వేసిన 48 ఓవర్ తొలి బంతిని స్మిత్ డిఫెన్స్ ఆడబోయాడు. అది కీపర్ వైపు వెళ్లడంతో నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న స్టార్క్ పరుగు కోసం యత్నించాడు. అయితే ఆలస్యంగా స్పందించిన స్మిత్ అవతలి ఎండ్‌లోకి చేరోలోపే బట్లర్ బంతిని డైరెక్ట్‌గా వికెట్లపైకి విసిరాడు. దీంతో సెంచరీ సాధించకుండానే స్మిత్ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా బట్లర్ సూపర్ ఫీల్డింగ్‌ను మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక స్టార్క్ తప్పిదానికి స్మిత్ బలయ్యాడంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఇంగ్లండ్ బౌలర్లు వణుకుపుట్టించారు. అయితే స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీలు రాణించడంతో ఇంగ్లండ్ ముందు ఆసీస్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. -
కివీస్ తొండాట.. ధోని ఔట్ కాదు!
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని రనౌట్ వివాదస్పదమైంది. ఈ రనౌట్‌తో టీమిండియా గెలుపు సమీకరణాలే మారిపోయి ఓటమి చవిచూసింది. అయితే ధోని రనౌట్ సమయంలో ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా కివీస్ ఫీల్డింగ్ మోహరించిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. మూడో పవర్ ప్లేలో నిబంధనల ప్రకారం 30యార్డ్ సర్కిల్లో ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. అయితే అప్పుడు న్యూజిలాండ్‌కు చెందిన ఆరుగురు ఫీల్డర్లు.. సర్కిల్ వెలుపల ఉన్నారు. దీన్ని అంపైర్లు గుర్తించి ఉంటే అది నోబాల్ అయ్యేది. ఆ తరువాత బంతికి ఫ్రీ హిట్ వచ్చే అవకాశం ఉండటంతో.. ధోనీ కూడా పరుగు కోసం ప్రయత్నించి ఉండేవాడు కాదన్నది అభిమానుల వాదన. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో షమీ బౌలింగ్‌లో రసెల్ క్లీన్ బౌల్డ్ అయినప్పుడు నిబంధనలకు విరుద్దంగా ఫీల్డింగ్ ఉండటంతో అంపైర్ నో బాల్ ప్రకటించాడు. కానీ నిన్నటి మ్యాచ్‌లో అంపైర్లు ఈ తప్పిదాన్ని గుర్తించకపోవడం టీమిండియా కొంపముంచిందని.. ఒకవేళ అంపైర్లు అది నోబాల్‌గా ప్రకటించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ‘నిన్నటి మ్యాచ్‌లో అంపైర్లు నిద్రపోయారు’,‘కివీస్ తొండాట.. ధోని ఔట్ కాదు’, ‘టీమిండియా ఓడింది ధోని రనౌట్‌తో కాదు అంపైర్ల తప్పిదంతో’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. (చదవండి: కొంపముంచిన ధోని రనౌట్!) -
కొంపముంచిన ధోని రనౌట్!
మాంచెస్టర్: 12 బంతుల్లో 31 పరుగులు. సెమీస్‌లో టీమిండియా గెలుపుకు సమీకరణాలు. క్రీజులో కొండంత ధైర్యం ఎంఎస్ ధోని ఉండటంతో అందరిలోనూ గెలుపుపై భరోసా ఉంది. అయితే న్యూజిలాండ్ ఫీల్డర్ మార్టిన్ గప్టిల్ బుల్లెట్ త్రోకు సీన్ అంతా మారిపోయింది. అతడి మెరుపు ఫీల్డింగ్‌కు ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఓటమి ఖాయమైంది. అర్దసెంచరీతో రాణించినా కీలక సమయంలో అవుటవ్వడం అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్లో అందరి అంచనాలను నిజం చేస్తూ ధోని తొలి బంతిని సిక్సర్ కొట్టాడు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ. రెండో బంతిని కీపర్ ఎండ్స్‌వైపు మళ్లించి రెండు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. అయితే రెండో పరుగు తీసే క్రమంలో ధోని తడబడ్డాడు. గప్టిల్ నేరుగా వికెట్లకు త్రో వేయడంతో ధోని రనౌట్ అయ్యాడు. ఇది మ్యాచ్‌పై ప్రభావం చూపి టీమిండియా ఓటమకి కారణమైంది. రనౌట్ కాకుంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘ధోని రనౌట్ టీమిండియా కొంప ముంచింది. ఓటమికి కారణమైంది. ఫైనల్‌కు చేరకుండా అడ్డుకుంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
స్టొయినిస్ సిల్లీ రనౌట్..
-
‘డబ్బు కోసమే.. ధోనిని ఔట్‌గా ప్రకటించారు’
చెన్నై: ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్కే సారథి ధోని రనౌట్ నిర్ణయం వివాదస్పదమైంది. ధోని రనౌట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయి.. ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అయితే ఒక కోణంలో ధోనీ బంతి వికెట్లకు తగలకముందే లైన్‌ను దాటినట్టు కనిపించింది. మరో కోణంలో మాత్రం లైన్‌కు కొద్దిగా అటు-ఇటు ఉన్నట్టు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా నిర్ణయం ప్రకటించకుండా వ్యతిరేకంగా ప్రకటించారని సీఎస్కే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ధోని రనౌట్ నిర్ణయంపై ఇంకా రగులుతూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘మరోసారి ఐపీఎల్లో చెత్త నిర్ణయం..థర్డ్ అంపైర్ తన ఖాతాలో డబ్బులు పడేంత వరకూ ఎదురుచూసి.. ఆ తర్వాత ధోనీని ఔట్‌గా ప్రకటించాడు’ అని కొందరు అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై సీఎస్కే స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘ఫైనల్ మ్యాచ్‌లో మేము తప్పిదాలు చేసిన మాట వాస్తవం. మంచి భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యాం. ముంబై జట్టులో జస్ప్రిత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రపంచకప్‌లో బుమ్రా ప్రధానమవుతాడు. కీలక సమయంలో ధోని రనౌట్ కావడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది. అయితే బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌట్‌గా ప్రకటించాల్సింది కానీ అది జరగేలేదు. సీఎస్కేకు వ్యతిరేకంగా అంపైర్ నిర్ణయం ప్రకటించాడు. ఇది చాలా కఠిన నిర్ణయం. వాట్సన్ పోరాటం ఆకట్టుకుంది.’అంటూ భజ్జీ పేర్కొన్నాడు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : వివాదస్పదమైన ధోని రనౌట్ నిర్ణయం -
సీఎస్కే ఓటమికి కారణమైన వాట్సన్‌ను రనౌట్
-
చెన్నై ఓటమికి అతడే కారణం..
హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కీలక సమయాలలో బ్యాట్స్‌మెన్ రనౌట్లు అవడం చెన్నై సూపర్‌కింగ్స్ కొంపముంచింది. బెస్ట్ ఫినిషర్‌గా పేరుగాంచిన ఎంఎస్ ధోని(2)ని ఇషాన్ కిషన్ తన సూపర్‌త్రోతో రనౌట్ చేసి చెన్నై కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక చివరి ఓవర్లో మంచి ఊపు మీదున్న షేన్ వాట్సన్(80) రనౌట్ కావడం మ్యాచ్ గతినే తిప్పేసింది. అయితే వాట్సన్ రనౌట్‌కు జడేజానే కారణం అంటూ సీఎస్కే అభిమానులు ఫైర్ అవుతున్నారు. అవసరంలేకున్నా జడేజా రెండో పరుగు కోసం యత్నించి వాట్సన్‌ను రనౌట్ చేసి సీఎస్కే ఓటమికి కారణమయ్యాడంటూ మండిపడుతున్నారు. ‘ఏం మనిషివిరా నాయనా.. వాట్సన్‌ను అట్లా రనౌట్ చేయించినవ్’, ‘చెన్నై ఓటమికి జడేజానే కారణం.. అతడే అపరాధి’, ‘జడేజా అత్యుత్సాహానికి వాట్సన్ బలయ్యాడు’, ‘జడేజానే అపరాధి’ ,అంటూ సీఎస్కే ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మ్యాచ్ అనంతరం ధోని, వాట్సన్‌లు జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. చివరి ఓవర్లో చెన్నై విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. మలింగ వేసిన తొలి బంతికి వాట్సన్ సింగల్ తీయగా.. రెండో బంతికి జడేజా సింగల్ తీసాడు. ఇక మూడో బంతికి వాట్సన్ రెండు పరుగులు చేసాడు. దీంతో 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. అప్పటికే వాట్సన్ జోరుమీదుండడంతో చెన్నై విజయం ఖాయం అనుకున్నారు అందరు. చెన్నై అభిమానులు సంబరాలు చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. నాలుగో బంతిని వాట్సన్ డీప్ పాయింట్ వైపు షాట్ ఆడగా.. మొదటి పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించిన వాట్సన్ రనౌటయ్యాడు. వాట్సన్ రెండో రన్ కోసం వెళ్లాలా వద్దా అనుకుంటుండగానే.. జడేజా పరుగు కోసం ప్రయత్నించడంతో అతను కూడా వెళ్లాల్సి వచ్చింది. ఫలితంగా మూల్యం చెల్లించుకున్నాడు. అప్పటి వరకు చెన్నై చేతుల్లో ఉన్న మ్యాచ్ ముంబయి వైపు తిరిగింది. 2 బంతుల్లో 4 పరుగులు కావాలి. ఐదో బంతికి 2పరుగులు తీసిన శార్దూల్.. చివరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో చెన్నై ఓడింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : సీఎస్కే ఓటమికి కారణమైన వాట్సన్‌ను రనౌట్ -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు’
-
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు’
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘వెన్నుపోటు’ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి టీడీపీని, అధికారాన్ని చంద్రబాబు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే కథాంశంతోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్ సాక్షిగా చంద్రబాబు ఎలా అవమానానికి గురిచేశారు.. టీడీపీని, అధికారాన్ని ఎలా హస్తగతం చేసుకున్నారో ఈ చిత్రంలో చూపించనున్నారు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో ప్రస్తుతం ‘వెన్నుపోటు’అంశం ట్రెండ్‌లో ఉండగానే మరో వెన్నుపోటు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (లక్ష్మీస్ ఎన్టీఆర్ : సోషల్ మీడియాలో వైస్రాయ్ సీన్) ఓ క్రికెట్ మ్యాచ్ సందర్బంగా సహచర ఆటగాడినే మరో బ్యాట్స్‌మెన్ రనౌట్ చేయిస్తాడు. బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్‌మన్ డిఫెన్స్ ఆడి పరుగుకు పిలుస్తాడు. వెంటనే నాన్ స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పరుగు కోసం యత్నించాడు. వెంటనే డిఫెన్స్ ఆడిన బ్యాట్స్‌మన్ బంతిని బౌలర్‌కు అందించి సహచర ఆటగాడు రనౌట్‌లో భాగస్వామ్యమవుతాడు. దీంతో సొంత జట్టు ఆటగాడి చర్యతో షాక్‌కు గురైన బ్యాట్స్‌మన్ అసహనంతో క్రీజు వదిలి వెళ్లాడు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు ఇది’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘రాజకీయాల్లోనే కాదు క్రీడల్లోనూ వెన్నుపోటు ఉంటుందని నిరూపించావ్ బ్రదర్’అంటూ వ్యంగ్యంగా పేర్కొంటున్నారు. (ఎన్టీఆర్ సందేశం.. ‘వాడు గాడ్సే కన్నా అధముడు) @RGVzoomin #LakshmiNTR ni minchina venupootu idhi!! pic.twitter.com/nxt3eVfk3F — Saketh Ram Peri (@saketh_4490) March 12, 2019 -
సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఇదే రోజున..
-
ఆ సూపర్ రనౌట్‌కు పాక్ బలి!
హైదరాబాద్: క్రికెట్లో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరంటే ఏమాత్రం తడుముకోకుండా చెప్పే పేరు జాంటీ రోడ్స్. ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మైదానంలో పక్షిలా రివ్వున ఎగురుతూ.. చిరుత కంటే వేగంగా కదులుతూ.. కళ్లు చెదిరేరీతిలో ఫీల్డింగ్ చేయడం అతడి సొంతం. బ్యాటింగ్, బౌలింగ్‌తోనే కాదు ఫీల్డింగ్తోను జట్టుకు విజయాలను అందించవచ్చని పలుమార్లు నిరూపించాడు. తన మెరుపులాంటి ఫీల్డింగ్‌తో దక్షిణాఫ్రికాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. తరం మారినా ఇప్పటికీ ఫీల్డింగ్ అంటే గుర్తుకొచ్చే పేరు రోడ్స్ అంటే అతిశయోక్తి కాదు. తాజాగా జాంటీ రోడ్స్ కళ్లుచెదిరే ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియోను తాజాగా ఐసీసీ షేర్ చేసింది. ఈ వీడియోను క్రికెట్ అభిమానులు మళ్లీ మళ్లీ ప్లే చేసి చూస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఐసీసీ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుండగా.. క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 27 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున.. ప్రపంచకప్-1992లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జాంటీ రోడ్స్ చేసిన రనౌట్ మ్యాచ్ స్వరూపానే మార్చేసింది. ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడుతుండగా.. పాక్ బ్యాట్స్‌మన్ ఇంజమాముల్ హక్ ఆడిన బంతిని రోడ్స్ చురుగ్గా అందుకొని చిరుత కంటే వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేసి ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఇంజమామ్ షాక్‌కు గురికాగా.. సఫారీ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పాక్‌కు వాతావరణం, అదృష్టం కలిసిరాలేదు. వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌ను కాసేపు ఆపిన అంపైర్లు.. అనంతరం ఓవర్లను కుదించి పాక్ లక్ష్యాన్ని 36 ఓవర్లలో 193 పరుగులకు సెట్ చేశారు. మంచి ఫామ్‌లో ఉన్న ఇంజమామ్‌ను రోడ్స్ ఔట్ చేయడంతో ఆ ప్రభావం పాక్‌పై తీవ్రంగా పడి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ రనౌట్‌తోనే జాంటీ రోడ్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
విజయ్ శంకర్ బ్యాడ్ లక్.. తొలి హాఫ్ సెంచరీ మిస్
-
క్రికెట్లో కనీవినీ ఎరుగని రనౌట్
మెల్బోర్న్: క్రికెట్లో రనౌట్లు అనేవి సహజం. పరుగు తీసే క్రమంలో బ్యాట్స్‌మన్ క్రీజ్‌లోకి చేరుకోలేకపోతే రనౌట్‌గా నిష్క్రమిస్తూ ఉంటారు. చేజింగ్ సమయంలో అందులోనూ చివర ఓవర్లలో ప్రతీ పరుగు ముఖ్యమైనదే. ఈ సమయంలో రనౌట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. రనౌట్ అయిన విధానం పట్ల బ్యాట్స్‌మెన్‌పై ఒక్కోసారి జాలి చూపిస్తే.. మరికొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తాం. ఆస్ట్రేలియాలో జరగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో జరిగిన సిల్లీ రనౌట్ అందిరిలోనూ నవ్వు తెప్పిస్తోంది. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ ధండర్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వినూత్న రనౌట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్-సిడ్నీ థండర్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన మెల్బోర్న్, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన సీడ్నీ లక్ష్య చేదనలో పూర్తిగా విఫలమైంది. దీంతో 19.1 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. అయితే సిడ్నీ ఇన్నింగ్స్ 18.3 ఓవర్లో జోనాథన్ కుక్, గురిందర్ సంధు ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో కుక్కు బౌలర్ వేసిన బంతిని ఆడి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న సంధును ఢీకొన్నాడు. దీంతో బౌలర్ హ్యారీ గుర్నే వారిద్దరి మధ్య నుంచి వెళ్లి రనౌట్ చేశాడు. దీంతో బ్యాట్స్‌మన్ కుక్ ఒక్క సారిగా షాక్‌కు గురై.. భారంతో మైదానాన్ని వీడాడు.