
యూరోపియన్ క్రికెట్ గేమ్‌లో సీరియస్‌నెస్ చాలా తక్కువగా కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా వికెట్‌లు పారేసుకోవడం ఇక్కడ మాత్రమే చూస్తుంటాం. పరుగులు తీయడానికి ఇబ్బందులు పడుతూ అనవసరంగా రనౌట్ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఫన్నీ ఘటనే మరోసారి చోటుచేసుకుంది. రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునే చాన్స్ ఉన్నా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అయినట్లు పరిగెత్తడానికే ఇష్టపడని ఒక బ్యాటర్ చేతులు కాల్చుకున్నాడు.
విషయంలోకి వెళితే.. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ లెగ్‌సైడ్ దిశగా ఆడి సింగిల్ కంప్లీట్ చేశాడు. ఫీల్డర్ బంతి అందుకొని కీపర్‌కు త్రో వేశాడు. అప్పటికే సింగిల్ పూర్తి చేసిన స్ట్రైకింగ్ బ్యాటర్ రెండో పరుగు వద్దని సిగ్నల్ ఇచ్చాడు. ఇది గమనించని నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్ ముందుకు వచ్చాడు. కానీ అప్పటికి వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. కానీ నడవడానికి కూడా ఇబ్బంది పడినట్లుగా ఏం జరగదులే అన్నట్లుగా మెళ్లిగా వెళ్లాడు. ఇదే చాన్స్‌గా భావించిన కీపర్ నేరుగా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు డైరెక్ట్ త్రో వేయడం.. బ్యాటర్ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. ఇంకేముంది సదరు బ్యాటర్‌గారూ చేసేదేం లేక పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది చూసిన అభిమానులు.. ''ఎక్కడలేని వింతలన్నీ యూరోపియన్ క్రికెట్‌లోనే జరుగుతుంటాయి''.. ''నడవడానికి ఇబ్బందిగా ఉంటే క్రికెట్ ఆడడం ఎందుకు.. కనీసం ఫిట్‌నెస్ కూడా లేదు.. ''పిచ్ మధ్యలోకి వచ్చి నిద్రపోతున్నావా'' అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు.
😴 😴 #EuropeanCricket #EuropeanCricketSeries #StrongerTogether pic.twitter.com/ZX7kP0OECa
— European Cricket (@EuropeanCricket) June 23, 2023
Comments
Please login to add a commentAdd a comment