
Photo: IPL Twitter
సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన కీపింగ్ స్మార్ట్‌నెస్ మరోసారి చూపించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో మొదట సూపర్ స్టంపింగ్‌తో మెరిసిన ధోని ఆఖర్లో సుందర్‌ను రనౌట్ చేసిన తీరు హైలెట్‌గా మారింది. ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతిని మార్కో జాన్సెన్ మిస్ చేశాడు. ఒక్క పరుగుతో వచ్చేది ఏం లేదని అక్కడే ఆగిపోయే ఉంటే బాగుండేది.
ఎదురుగా ఉన్నది ధోని అని తెలిసి కూడా జాన్సెన్ రిస్క్ చేశారు. ఫలితం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న సుందర్ క్రీజులోకి వచ్చేలోపే ధోని బంతితో డైరెక్ట్ హిట్ వేయడంతో వికెట్లు ఎగిరిపడ్డాయి. "సుందరానికి బాగా తొందరెక్కువ.. బంతి ధోని చేతుల్లోకి వెళితే తప్పించుకోవడం కష్టమని తెలిసి కూడా రిస్క్ అవసరమా'' అంటూ అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
\ | / Dhoni 𝚠̶𝚊̶𝚜̶ is here! 💥#CSKvSRH #TATAIPL #IPLonJioCInema #IPL2023 pic.twitter.com/9r21Ay7PIS
— JioCinema (@JioCinema) April 21, 2023