Photo: IPL Twitter
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సీఎస్‌కే కెప్టెన్‌గా 200వది. దీంతో సీఎస్‌కే మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మ్యాచ్ గెలిచి ధోనికి కానుకగా అందివ్వాలని చూస్తోంది. ఇక ధోని కెప్టెన్‌గా తన 200వ మ్యాచ్‌లో సూపర్ రనౌట్‌తో మెరిశాడు.
మాములుగానే ధోని చేతికి బంతి చిక్కిందంటే రెప్పపాటులో వికెట్లను గిరాటేస్తాడు. తాజాగా రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఓవర్ ఆఖరి బంతిని ఆడమ్ జంపా షార్ట్ ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు. తీక్షణ క్యాచ్ వదిలేయడంతో సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే క్యాచ్ మిస్ చేసినప్పటికి తీక్షణ సరైన త్రో వేశాడు.
త్రో అందుకున్న ధోని ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా నేరుగా వికెట్లను గిరాటేశాడు. అయితే ఇదే సమయంలో తుషార్ దేశ్‌పాండే తనకు బంతి వేయమని ధోనిని అడగడం గమనించొచ్చు. కానీ ధోని ఎవరికి అవకాశం ఇవ్వకూడదని భావించి తానే రనౌట్ చేశాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
Always on target @msdhoni 🎯🤩 pic.twitter.com/Z7br8nJ4zh
— CricTracker (@Cricketracker) April 12, 2023
Comments
Please login to add a commentAdd a comment