IPL 2023, RR Vs CSK: Ms Dhoni Angry And Shouting On Matheesha Pathirana, Video Viral - Sakshi
Sakshi News home page

రనౌట్‌ చాన్స్‌ మిస్‌.. ధోని అసహనం

Published Thu, Apr 27 2023 9:08 PM | Last Updated on Fri, Apr 28 2023 11:48 AM

Dhoni Not Happy Pathirana Got Way-His Throw Miss Hetmyer-Run-out Chance - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అసహనం వ్యక్తం చేశాడు. తాను వేసిన త్రోకు అడ్డుగా వచ్చిన బౌలర్‌ మతీషా పతీరానా వైపు కోపంగా చూడడం వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే.. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ పతీరానా వేశాడు. ఆ ఓవర్‌ మూడో బంతిని హెట్‌మైర్‌ ఆడే ప్రయత్నంలో అతని కాలికి తగిలి ధోని వైపు వెళ్లింది. అంపైర్‌ లెగ్‌బై ఇవ్వగా హెట్‌మైర్‌ పరుగుకు యత్నించాడు. బంతిని అందుకున్న ధోని నేరుగా నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు డైరెక్ట్‌ త్రో వేశాడు.

కానీ పతీరానా బంతిని అందుకునే ప్రయత్నంలో భాగంగా త్రోకు అడ్డు వచ్చాడు. అప్పటికి హెట్‌మైర్‌ క్రీజులోకి చేరుకోలేదు. ఒకవేళ ధోని వేసిన త్రో వికెట్లకు తాకుంటే హెట్‌మైర్‌ రనౌట్‌ అయ్యేవాడే. రనౌట్‌ చాన్స్‌ మిచ్‌ అవడంతో ధోని.. పతీరానాను చూస్తూ ''వాట్‌ యార్‌(What Yar)..'' అంటూ పేర్కొన్నాడు. అయితే హెట్‌మైర్‌ మరుసటి ఓవర్‌లోనే ఔటయ్యాడు. 8 పరుగులు చేసిన అతను తీక్షణ బౌలింగ్‌లో  క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

చదవండి: #MSDhoni: హెట్‌మైర్‌ మిస్సయ్యాడు.. జురేల్‌ చిక్కాడు; లెక్క సరిపోయింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement