Matheesha Pathirana
-
కివీస్‌తో రెండో టీ20.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడ్డ శ్రీలంక
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఇవాళ (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక జట్టు బొక్కబోర్లా పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంకను తొలుత లోకీ ఫెర్గూసన్ (2-0-7-3) హ్యాట్రిక్‌తో దెబ్బకొట్టగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు తీసి శ్రీలంక చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడిన పథుమ్ నిస్సంకను (52) ఫిలిప్స్ ఆఖరి ఓవర్ రెండో బంతికి ఔట్ చేశాడు. ఆతర్వాత మూడు, ఐదు బంతులకు పతిరణ (0), తీక్షణ (14) వికెట్లు తీశాడు. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు భానుక రాజపక్స్(15), తీక్షణ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫిలిప్స్, ఫెర్గూసన్ తలో 3 వికెట్లు.. బ్రేస్‌వెల్ 2, సాంట్నర్, ఫోల్క్స్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని తొలి టీ20లో శ్రీలంక విజయం సాధించిన విషయం తెలిసిందే. -
లంక స్పిన్నర్ల మాయాజాలం.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
డంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక స్పిన్నర్లు రెచ్చిపోయారు. వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) మాయాజాలం ధాటికి న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. తొలి బంతికే వికెట్ తీసిన పేసర్ నువాన్ తుషార రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి బంతికే ఓపెనర్ టిమ్ రాబిన్సన్ తుషార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్ చాప్మన్ 2, గ్లెన్ ఫిలిప్స్ 4, మైఖేల్ బ్రేస్‌వెల్ 0, మిచ్ హే 3, జాకరీ ఫోల్క్స్ 6, ఐష్ సోధి ఒక్క పరుగు చేశారు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు ఏ దశలోనూ న్యూజిలాండ్ బ్యాటర్లను మెరుగైన స్కోర్ దిశగా సాగనీయలేదు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. -
టీమిండియాతో వన్డే సిరీస్.. శ్రీలంకకు భారీ షాక్! యార్కర్ల కింగ్ ఔట్
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంకకు గట్టి ఎదరు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీషా పతిరాన గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన మూడో టీ20లో పతిరాన గాయపడ్డాడు. పల్లెకెలె వేదికగా జరిగిన ఆఖరి టీ20లో బంతిని ఆపే క్రమంలో పతిరాన భుజానికి గాయమైంది.వెంటనే అతడు మైదానాన్ని విడిచి వెళ్లాడు. అయితే అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించనట్లు సమాచారం. ఈ క్రమంలో పతిరాన భారత్‌తో వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడి స్ధానాన్ని యువ పేసర్ మహ్మద్ షిరాజ్‌తో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.కాగా టీ20 సిరీస్‌ను శ్రీలంక కోల్పోయినప్పటకి పతిరాన మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 వికెట్లతో శ్రీలంక తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక మహ్మద్ సిరాజ్ విషయానికి వస్తే.. డిమాస్టిక్ క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 47 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన షిరాజ్.. 80 వికెట్లు పడగొట్టాడు. కాగా ఆగస్టు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, షిరాజ్, అసిత ఫెర్నాండో -
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (మే 9) ప్రకటించారు. ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ నాయకత్వం వహించనున్నాడు. చరిత్ అసలంక వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. స్టార్లతో నిండిన ఈ జట్టులో వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌కు కూడా చోటు దక్కింది. ఐపీఎల్ హీరో మతీశ పతిరణ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్, జాఫ్నా కుర్రాడు విజయ్‌కాంత్ వియాస్కాంత్ మరో ముగ్గురితో సహా ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు.జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరిగే వరల్డ్‌కప్‌లో శ్రీలంక ప్రస్తానం జూన్ 3న మొదలవుతుంది. న్యూయార్క్‌లో జరిగే తమ తొలి మ్యాచ్‌లో లంకేయులు సౌతాఫ్రికాను ఢీకొంటారు. ఈ వరల్డ్‌కప్‌లో శ్రీలంక గ్రూప్-డిలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, నేపాల్ జట్లతో పోటీపడుతుంది. ఈ వరల్డ్‌కప్‌కు శ్రీలంక క్వాలిఫయర్ పోటీల ద్వారా అర్హత సాధించింది.కాగా, మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో లంకతో కలుపుకుని ఇప్పటివరకు 16 జట్లు ప్రకటించబడ్డాయి. పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ ఇంకా తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత్ ప్రస్తానం జూన్ 5న మొదలవుతుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌లో టీమిండియా పోరాటం ప్రారంభమవుతుంది. జూన్ 9న టీమిండియా చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడుతుంది.టీ20 ప్రపంచకప్ 2024 కోసం శ్రీలంక జట్టు.. వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీశ పతిరణ, దిల్షన్ మధుశంకట్రావెలింగ్ రిజర్వ్‌లు: అసిత ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్, భానుకా రాజపక్సే, జనిత్ లియనాగే -
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.పతిరానా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకునేందుకు స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సీఎస్కే మెనెజ్‌మెంట్ ధ్రువీకరించింది.టీ20 వరల్డ్‌కప్ సమయం దగ్గరపడుతుండడంతో ముందు జాగ్రత్తగా పతిరానాను శ్రీలంక క్రికెట్ స్వదేశానికి రప్పించింది.ఈ సీజన్లో ఇప్పటి వరకు సీఎస్కే తరుపున పతిరానా ఆరు మ్యాచులు ఆడాడు. 7.68 ఎకానమీతో 13 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మన్ సైతం ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు పతిరాన కూడా స్వదేశానికి వెళ్లిపోవడం సీఎస్కేకు నిజంగా బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. -
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్, శ్రీలంక బౌలర్ మతీశ పతిరణ టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ధోని తనకు తండ్రిలాంటి వాడని పేర్కొన్నాడు. తన కన్న తండ్రి మాదిరే ధోని కూడా తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపాడు.కాగా ఐపీఎల్-2022కు సిసంద మగల దూరం కాగా అతడి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌లో అడుగుపెట్టాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే 2023లో 12 మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు పడగొట్టాడు.ధోని నాయకత్వంలో సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బేబీ మలింగగా ప్రశంసలు అందుకుంటూ ప్రస్తుతం సీఎస్కే ప్రధాన పేసర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు.అయితే, దీనకంతటికి కారణం ధోనినే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యువ పేసర్ ఆరంభంలో తడబడ్డా తలా అతడికి అండగా నిలిచాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సమయంలోనూ నైతికంగా మద్దతునిచ్చాడు.ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్కే ‘లయన్స్ అప్‌క్లోజ్’ చాట్‌లో మతీశ పతిరణ మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి వివరించాడు. ‘‘మా నాన్న తర్వాత నా క్రికెట్ లైఫ్‌లో తండ్రి పాత్ర పోషించింది ధోనినే.నన్నొక చిన్నపిల్లాడిలా చూసుకుంటారు. నా పట్ల శ్రద్ధ వహిస్తారు. అవసరమైన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నేను ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ ఉంటారు.ఇంట్లో మా నాన్న నాతో ఇలా ఉంటారో ఇక్కడ ధోని కూడా నాతో అలాగే ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తలు చెబుతారు. నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేలా మోటివేట్ చేస్తారు.మైదానం వెలుపల మేము ఎక్కువగా మాట్లాడుకోము. అయితే, నన్ను కలిసిన ప్రతిసారీ.. ‘‘ఆటను ఆస్వాదించు. ఫిట్నెస్ కాపాడుకో’’ అని చెబుతారు.మహీ భాయ్.. మీరు వచ్చే సీజన్లోనూ ఆడాలి. ప్లీజ్ మాతో కలిసి ఆడండి.. అప్పటికీ నేనిక్కడ ఉంటే(నవ్వుతూ)’’ అంటూ పతిరణ ధోని పట్ల అభిమానం చాటుకున్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక పతిరణ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. సీఎస్కే ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది.The bond beyond the field 💛🫂#LionsupClose Full video 🔗 - https://t.co/xt5t6K9SjR #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/odZdVvlrF6— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2024 -
Viral Video: పతిరణ కళ్లు చెదిరే యార్కర్ దెబ్బకు మార్క్రమ్ ఫ్యూజులు ఔట్
సన్‌రైజర్స్‌తో నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే పేసర్ మతీశ పతిరణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ సీజన్లో అరివీర భయంకర ఫామ్‌లో (6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) ఉన్న పతిరణ.. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు (మార్క్రమ్, క్లాసెన్) పడగొట్టాడు. ఇందులో మార్క్రమ్ను బౌల్డ్ చేసిన బంతి మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. పతిరణ సంధించిన స్వింగింగ్ యార్కర్ దెబ్బకు మిడిల్ స్టంప్ గాల్లోకి ఎగిరింది. ఇది చూసి బ్యాటర్ మార్క్రమ్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. పడిపోయిన వికెట్లను చూస్తూ నిస్సహాయంగా పెవిలియన్ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. PATHIRANA, THE FUTURE LEGEND OF CSK. 👑🦁 pic.twitter.com/Hv5Cwu5r6R— Johns. (@CricCrazyJohns) April 28, 2024 ఈ మ్యాచ్‌లో పతిరణతో పాటు రుతురాజ్ గైక్వాడ్ (98), డారిల్ మిచెల్ (52, 5 క్యాచ్‌లు), తుషార్ దేశ్‌పాండే (3-0-27-4) చెలరేగడంతో సీఎస్కే 78 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్ తలో వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన సన్‌రైజర్స్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. తుషార్ దేశ్ పాండే, ముస్తాఫిజుర్ (2.5-0-19-2), పతిరణ, రవీంద్ర జడేజా (4-0-22-1), శార్దూల్ ఠాకూర్ (4-0-27-1) సన్‌రైజర్స్ పతనాన్ని శాశించారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ట్రవిస్ హెడ్ (13), అభిషేక్ శర్మ (15), నితీశ్ రెడ్డి (15), క్లాసెన్ (20), అబ్దుల్ సమద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో సీఎస్కే మూడో స్థానానికి ఎగబాకగా.. ఆ స్థానంలో ఉండిన సన్‌రైజర్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. -
CSK Vs MI Highlights Photos: పతిరణ విజృంభణ..చెన్నైదే విజయం (ఫొటోలు)
-
CSK Vs MI: ముంబైకి ముకుతాడు
ముంబై: ఐపీఎల్ ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ల సమరంలో ముంబై ఇండియన్స్‌పై డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) పైచేయి సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పతిరణ (4/28) తన పేస్‌తో ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓడింది. రోహిత్ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) తన టి20 కెరీర్లో ఎనిమిదో శతకం చేసినా ఫలితం లేకపోయింది. దూబే, రుతురాజ్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ఓపెనర్ రహానే (5) అవుటయ్యాక రచిన్ రవీంద్రకు జతయిన కెప్టెన్ రుతురాజ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. పవర్‌ప్లేలో 48/1 స్కోరు చేయగా... కాసేపటికి రచిన్ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) నిష్క్రమించాడు. శివమ్ దూబే వచ్చాక చెన్నై స్కోరు, జోరు పెరిగాయి. దూబే బౌండరీలతో, రుతురాజ్ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో 12వ ఓవర్లో చెన్నై స్కోరు 100 దాటింది. ముందుగా గైక్వాడ్ 33 బంతుల్లో, తర్వాత దూబే 28 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. హార్దిక్ బౌలింగ్‌లో రుతురాజ్ అవుటవడంతో మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మిచెల్ (17) పెద్దగా మెరిపించలేదు. ధోని 6,6,6,2.... ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన ధోని... చెన్నై ఇన్నింగ్స్నే కాదు తన మునుపటి శైలి సిక్సర్లతో మొత్తం వాంఖేడేను మోతెక్కించాడు. 20వ ఓవర్లో మిగిలిపోయిన 4 బంతుల్ని ఆడిన ధోని వరుసగా 6, 6, 6, 2లుగా బాదేయడంతో హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. రోహిత్ ఒక్కడే... లక్ష్యానికి తగిన వేగాన్ని ఆరంభం నుంచి జతచేసిన ముంబై ఓపెనర్లు ఇషాన్ (15 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్‌లు పవర్ ప్లే (63/0)లో ఓవర్‌కు పది పరుగుల చొప్పున సాధించారు. కానీ 8వ ఓవర్ వేసిన పతిరణ తొలి బంతికి కిషన్‌ను, మూడో బంతికి హిట్టర్ సూర్య (0)ను అవుట్ చేసి చెన్నై శిబిరాన్ని ఆనందంలో ముంచాడు. కానీ అవతలివైపు రోహిత్ 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. తిలక్ వర్మ (20 బంతుల్లో 31; 5 ఫోర్లు) వేగానికీ పతిరణే కళ్లెం వేశాడు. హార్దిక్ (2) వచ్చివెళ్లగా, రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చిన డేవిడ్ (13), షెఫర్డ్ (1) వెంటవెంటనే అవుట్ కాగానే ముంబై ఆశలు ఆవిరయ్యాయి. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) పాండ్యా (బి) కొయెట్జీ 5; రచిన్ (సి) ఇషాన్ (బి) శ్రేయస్ గోపాల్ 21; రుతురాజ్ (సి) నబీ (బి) పాండ్యా 69; దూబే (నాటౌట్) 66; మిచెల్ (సి) నబీ (బి) పాండ్యా 17; ధోని (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–8, 2–60, 3–150, 4–186. బౌలింగ్: నబీ 3–0–19–0, కొయెట్జీ 4–0–35–1, బుమ్రా 4–0– 27–0, ఆకాశ్ 3–0–37–0, శ్రేయస్ గోపాల్ 1–0– 9–1, పాండ్యా 3–0–43–2, రొమరియో షెఫర్డ్ 2–0–33–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) శార్దుల్ (బి) పతిరణ 23; సూర్యకుమార్ (సి) ముస్తఫిజుర్ (బి) పతిరణ 0; తిలక్ వర్మ (సి) శార్దుల్ (బి) పతిరణ 31; హార్దిక్ (సి) జడేజా (బి) తుషార్ 2; టిమ్ డేవిడ్ (సి) రవీంద్ర (బి) ముస్తఫిజుర్ 13; షెఫర్డ్ (బి) పతిరణ 1; నబీ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–70, 2–70, 3–130, 4–134, 5–148, 6–157. బౌలింగ్: తుషార్ 4–0–29–1, ముస్తఫిజుర్ 4–0–55–1, శార్దుల్ 4–0–35–0, జడేజా 4–0–37–0, పతిరణ 4–0–28–4. ఐపీఎల్లో నేడు బెంగళూరు X హైదరాబాద్ వేదిక: బెంగళూరు రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు బిగ్ షాక్
ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 14) జరుగబోయే కీలక సమరానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీశ పతిరణ గాయం కారణంగా ముంబై మ్యాచ్‌కు దూరం కానున్నాడు. పతిరణ గాయంపై అప్డేట్ను సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు. పతిరణ సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్ సమయానికంతా కోలుకుంటాడని ఫ్లెమింగ్ తెలిపాడు. పతిరణ ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా గాయపడి, ఆతర్వాత సీఎస్కే ఆడిన రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. పతిరణ గైర్హజరీలో సీఎస్కే సన్‌రైజర్స్ చేతిలో ఓడి.. కేకేఆర్‌పై విజయం సాధించింది. కాగా, ఇవాళ రాత్రి జరుగబోయే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ బిగ్ ఫైట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ఎల్ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ధోని, రోహిత్ మెరుపుల కోసం అభిమానులు వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పుడిప్పుడే (రెండు వరుస విజయాలు) గాడిలో పడుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ తమ జైత్రయాత్రను స్టార్ట్ చేసింది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు జరగగా ముంబై 20, సీఎస్కే 16 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. -
IPL 2024 CSK Vs KKR: కేకేఆర్‌తో నేటి మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు బిగ్ న్యూస్
ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 8) జరుగబోయే మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ న్యూస్ అందింది. వేర్వేరు కారణాల చేత ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు దూరంగా ఉండిన ఆ జట్టు స్టార్ పేసర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీశ పతిరణ నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నారని తెలుస్తుంది. టీ20 వరల్డ్‌కప్ వీసా ప్రాసెస్ కోసం స్వదేశానికి (బంగ్లాదేశ్) వెళ్లిన ముస్తాఫిజుర్ చెన్నైకి బయల్దేరాడని సమాచారం. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న పతిరణ పూర్తి ఫిట్నెస్ సాధించాడని తెలుస్తుంది. ముస్తాఫిజుర్, పతిరణ కేకేఆర్‌తో జరుగబోయే నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని సీఎస్కే బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ సూచనప్రాయంగా వెల్లడించాడు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరు అందుబాటులోకి రాకపోయినా సీఎస్కే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంది. కేకేఆర్‌తో మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. కాగా ముస్తాఫిజుర్, పతిరణ లేని లోటు సీఎస్కేకు గత మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ ఇద్దరి గైర్హాజరీలో ఆ జట్టు బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోయింది. ముస్తాఫిజుర్, పతిరణ స్థానాల్లో వచ్చిన విదేశీ ప్లేయర్లు రాణించినప్పటికీ (మొయిన్, తీక్షణ).. లోకల్ పేసర్లు ముకేశ్ చౌదరీ, తుషార్ దేశ్‌పాండే దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్‌తో నేటి మ్యాచ్‌లో సీఎస్కే వీరిద్దరిని నమ్ముకుని బరిలోకి దిగే సాహసం చేయకపోవచ్చు. ప్రస్తుత ఎడిషన్‌లో ముస్తాఫిజుర్ 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు.. పతిరణ 2 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తే సీఎస్కే విజయావకాశాలు మెరుగవుతాయి. ఇదిలా ఉంటే, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం కేకేఆర్ రెండో స్థానంలో.. సీఎస్కే నాలుగో స్థానంలో ఉన్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధిస్తే.. సీఎస్కే నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, రెండు అపజయాలు ఎదుర్కొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీని మట్టికరిపించగా.. సీఎస్కే సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది. -
వారెవ్వా పతిరాన.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! ఒంటి చేత్తో
ఐపీఎల్-2024లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మతీషా పతిరనా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. పతిరనా అద్భుతమైన క్యాచ్‌తో ఢిల్లీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకు ఓపెనర్లు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే సీఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొదటి 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఢిల్లీ ఏకంగా 91 పరుగులు చేసింది. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పేసర్ ముస్తఫిజర్ రెహ్మాన్‌ను బౌలింగ్ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన ముస్తఫిజర్ మూడో బంతిని స్లో డెలివరీగా సంధించాడు. ఆ బంతిని వార్నర్ షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా రివర్స్ ల్యాప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో ఉన్న పతిరనా తన కుడివైపున్కు గాల్లోకి జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో డేవిడ్ వార్నర్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో పతిరాన బౌలింగ్‌లో కూడా ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 3 వికెట్లు పడగొట్టి 31 పరుగులిచ్చాడు. 𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 🤩 Matheesha Pathirana takes a one hand diving catch to dismiss David Warner who was on song tonight Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/sto5tnnYaj — IndianPremierLeague (@IPL) March 31, 2024 -
ఆర్సీబీతో తొలి మ్యాచ్.. సీఎస్కే అదిరిపోయే న్యూస్! యార్కర్ల కింగ్ వచ్చేశాడు?
ఐపీఎల్-2024 సీజన్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా తొలి మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సీఎస్కే అదిరిపోయే న్యూస్ అందింది. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు యువ పేసర్, శ్రీలంక యార్కర్ల కింగ్ మతీషా పతిరాన పూర్తి ఫిట్నెస్ సాధించాడు. తొలి మ్యాచ్ జట్టు సెలక్షన్‌కు పతిరాన అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని అతడి మేనేజర్ అమిలా కలుగలగే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. పతిరానా ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడు. అతడు నిప్పులు చేరిగేందుకు సిద్దమయ్యాడని పతిరానాతో కలిసి ఉన్న ఫోటోను కలుగలగే ఎక్స్‌లో షేర్ చేశాడు. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పతిరానా మోకాలికి గాయమైంది. దీంతో అతడు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. టీ20 సిరీస్ మధ్యలోనే వైదొలిగిన పతిరానా నేరుగా కొలంబోలోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌కు వెళ్లి పునరవాసం పొందాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 ఫస్ట్‌హాఫ్‌కు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అతడు ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగం కానున్నాడు. అతడికి శ్రీలంక క్రికెట్ కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా గతేడాది సీఎస్కే ఛాంపియన్స్‌గా నిలవడంలో పతిరానాది కీలక పాత్ర. 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. The answer to "Where's Pathirana" He is fit and ready to throw Thunder ⚡ balls. Be ready 💣. Finally a 📸 together with the Legend @matheesha_9 😄 #WhistlePodu #csk #IPL2024 pic.twitter.com/JKsv9gacWm — Amila Kalugalage (@akalugalage) March 22, 2024 చదవండి: IPL2024: 'సీఎస్కే ఓపెనర్‌గా యువ సంచలనం.. ధోని బ్యాటింగ్‌కు వచ్చేది అప్పుడే' -
IPL 2024: ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు భారీ షాక్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్, శ్రీలంక పేస్ సంచలనం మతీశ పతిరణ లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సందర్భంగా పతిరణ గాయపడ్డాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో పతిరణకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ఇవ్వలేదు. పతిరణ త్వరలోనే గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడని తెలుస్తుంది. సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్కేకు ఇది రెండో ఎదురుదెబ్బ. కొద్ది రోజుల ముందు ఈ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ డెవాన్ కాన్వే కూడా గాయం కారణంగా లీగ్‌కు (మే వరకు) దూరమయ్యాడు. సీఎస్కే యాజమాన్యానికి కాన్వే స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సమస్య కానప్పటికీ.. పతిరణ స్థానాన్ని భర్తీ చేయడమే పెద్ద తలనొప్పిగా మారింది. కాన్వే స్థానంలో అతని దేశానికే చెందిన రచిన్ రవీంద్ర ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారు కాగా.. పతిరణ స్థానం కోసం బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్, మొయిన్ అలీ, శార్దూల్ ఠాకూర్ పేర్లను పరిశీలిస్తున్నారు. ముస్తాఫిజుర్ కూడా డెత్ ఓవర్స్ స్పెషలిస్టే కావడంతో సీఎస్కే యాజమాన్యం ఇతని వైపే మొగ్గు చూపవచ్చు. సీఎస్కే తొలి మ్యాచ్‌కు వేదిక అయిన చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో మొయిన్ అలీ పేరును కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. కెప్టెన్ ధోని, బౌలింగ్ కోచ్ బ్రావో.. శార్దూల్ ఠాకూర్వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపు (మార్చి 22) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్!
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు చేదువార్త! ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లకు ఆ జట్టు కీలక బౌలర్ దూరం కానున్నట్లు సమాచారం. సీఎస్కే డెత్ ఓవర్ల స్పెషలిస్టు, శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ గాయపడినట్లు తెలుస్తోంది. గత వారం బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా.. తొడకండరాల నొప్పితో పతిరణ జట్టును వీడాడు. ఈ క్రమంలో అతడికి దాదాపు నాలుగు- ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఫలితంగా అతడు.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. ఈ విషయం గురించి సీఎస్కే అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లన్నాక గాయాలు సహజమే. అతడి గురించి శ్రీలంక క్రికెట్ బోర్డుతో మేము చర్చించాల్సి ఉంది. మా ప్రీమియర్ బౌలర్లలో తనూ ఒకడు’’ అని పతిరణ ప్రాధాన్యాన్ని వివరించారు. కాగా శ్రీలంకకు చెందిన రైటార్మ్ పేసర్ పతిరణ.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రియ శిష్యుడిగా పేరొందిన 21 ఏళ్ల పతిరణ.. ఐపీఎల్-2023 సీజన్లో అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 12 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు పతిరణ. చెన్నై ఐదోసారి ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024కు గానూ.. పతిరణను సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఇక పతిరణ గనుక ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే అతడి స్థానంలో బంగ్లాదేశ్ సీనియర్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ సీఎస్కే డెత్ బౌలింగ్ దళంలో చోటు దక్కించుకోనున్నాడు. కాగా మార్చి 22న సీఎస్కే- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో తాజా ఐపీఎల్ ఎడిషన్‌కు చెపాక్ వేదికగా తెరలేవనుంది. చదవండి: Rohit Sharma: రోహిత్ భయ్యా తిడతాడు కానీ... టీమిండియా నయా స్టార్ -
చెత్త ప్రదర్శనతో విసుగు తెప్పించిన శ్రీలంక బౌలర్.. ఏకంగా 36 బంతులు
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మొదటి మ్యాచ్‌లో శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ చెత్త బౌలింగ్ ప్రదర్శనతో విసుగు తెప్పించాడు. టీ20 మ్యాచ్‌లో ఓ బౌలర్ 24 బంతులు వేయాల్సి ఉండగా.. పతిరణ ఏకంగా 36 బంతులు వేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. పతిరణ తన నాలుగు ఓవర్ల కోటాలో తొమ్మిది వైడ్లు, మూడు నో బాల్స్ వేసి 56 పరుగులు సమర్పించుకున్నాడు. తన తొలి ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన పతిరణ.. తన స్పెల్ రెండో ఓవర్లో 2 నో బాల్‌లు, 3 వైడ్లు.. మూడో ఓవర్లో 6 వైడ్లు.. నాలుగో ఓవర్లో నో బాల్ సహా మూడు బౌండరీలు సమర్పించుకుని చెత్త గణాంకాలు నమోదు చేశాడు. పతిరణ.. ఈ చెత్త ప్రదర్శనను తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఎలాగోలా విజయం సాధించి కాబట్టి సరిపోయింది. లేకపోతే లంక అభిమానులు పతిరణను ఆట ఆడుకునే వారు. ఓ అంతర్జాతీయ స్థాయి బౌలర్ ఒక్క మ్యాచ్‌లో ఇన్ని బంతులు వేస్తాడా అని ఏకి పారేసేవారు. కాగా, 207 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ శ్రీలంకకు ముచ్చెమటలు పట్టించింది. ఆతిథ్య జట్టు లక్ష్యానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులకే పరిమితమైంది. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (59), సమరవిక్రమ (61 నాటౌట్) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో అసలంక (44 నాటౌట్) బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు. భారీ లక్ష్య ఛేదనలో తొలుత తడబడ్డ బంగ్లాదేశ్.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మహమదుల్లా (54), జాకిర్ అలీ (68) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడటంతో లక్ష్యం దిశగా పయనించింది. వీరికి పతిరణ చెత్త బౌలింగ్ కూడా తోడవ్వడంతో బంగ్లాదేశ్ సునాయాసంగా గెలుస్తుందని అనిపించింది. అయితే షనక ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి బంగ్లా గెలుపును అడ్డుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన ధోని శిష్యుడు..
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరన అదగొట్టాడు. దంబుల్లా వేదికగా జరిగిన ఆఖరి టీ20లో కూడా రెండు వికెట్లతో సత్తాచాటాడు. ఓవరాల్‌గా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పతిరన 8 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒక టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లంక బౌలర్‌గా మతీషా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో తన ఆరాధ్య బౌలర్, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ రికార్డును పతిరన బ్రేక్ చేశాడు. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మలింగ 7 వికెట్లు తీశాడు. అయితే.. అదే ఏడాది మరో శ్రీలంక పేసర్ తుషారా పాకిస్తాన్‌పై 7 వికెట్లు పడగొట్టి ఆ రికార్డును సమం చేశాడు. ఆ తర్వాత 2022లో దుష్మంత చమీర కూడా ఆస్ట్రేలియాపై 7 వికెట్లు పడగొట్టి మలింగతో పాటు సంయుక్తంగా నిలిచాడు. కానీ వీరివ్వరూ కూడా మలింగను అధిగమించలేకపోయారు. తాజా మ్యాచ్‌తో 5 ఏళ్ల మలింగ ఆల్‌టైమ్ రికార్డును పతిరన బ్రేక్ చేశాడు. కాగా పతిరన ఐపీఎల్లో ధోని సారథ్యంలోని సీఎస్కే ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అందరూ అతడిని ధోని శిష్యుడంటూ పిలుస్తుంటారు. -
నిప్పులు చెరిగిన పతిరణ.. ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన శ్రీలంక
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా డంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హక్ ఫారూకీ (4-0-25-3), నవీన్ ఉల్ హక్ (3-0-25-2), అజ్మతుల్లా (4-0-30-2) నూర్ అహ్మద్ (2-0-18-1), కరీం జనత్ (2-0-23-1) ధాటికి 19 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో హసరంగ (32 బంతుల్లో 67; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. సమరవిక్రమ (25), ధనంజయ డిసిల్వ (24), కుశాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నిస్సంక (6), అసలంక (3), షనక (6), మాథ్యూస్ (6), తీక్షణ (2), ఫెర్నాండో (0) విఫలమయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (67 నాటౌట్) చివరివరకు క్రీజ్‌లో ఉన్నప్పటికీ గెలిపించలేకపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో జద్రాన్‌తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్ (13), గుల్బదిన్ నైబ్ (16), కరీం జనత్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (2), మొహమ్మద్ నబీ (9), నజీబుల్లా జద్రాన్ (0), కైస్ అహ్మద్ (7), నూర్ అహ్మద్ (9), నవీన్ ఉల్ హక్ (1) విఫలమయ్యారు. లంక బౌలర్లలో మతీశ పతిరణ (4-0-24-4) నిప్పులు చెరిగే బంతులు సంధించడంతో పాటు వికెట్లు తీసి ఆఫ్ఘన్ల పతనాన్ని శాశించాడు. దసున్ షనక (2/17), హసరంగ (1/20), తీక్షణ (1/31), మాథ్యూస్ (1/16) కూడా వికెట్లు తీశారు. -
మిచౌంగ్ బీభత్సం: నా చెన్నై.. సేఫ్‌గా ఉండు: లంక యువ పేసర్
#Cyclone Michaung- #ChennaiFloods: ‘‘నా చెన్నై.. సురక్షితంగా ఉండు’’ అంటూ శ్రీలంక యువ క్రికెటర్ మతీశ పతిరణ తమిళనాడు పట్ల అభిమానం చాటుకున్నాడు. తుపాను ఎంతగా భయపెట్టినా.. తిరిగి కోలుకోగలమనే నమ్మకం కూడా అంతే బలంగా ఉండాలని ధైర్యం చెప్పాడు. కాగా తమిళనాడు రాజధాని చెన్నైని వరద నీరు ముంచెత్తుతోంది. మిచౌంగ్ తుపాను ప్రభావం వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. వాన బీభత్సానికి చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వే పైకి వరద నీరు చేరడంతో ఇప్పటికే పలు విమాన సర్వీసులను నిలిపివేశారు. అదే విధంగా ఇప్పటికే పదకొండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా రద్దు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి అవసరార్థులకు సాయం చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తుపాను ప్రభావం వల్ల రానున్న 24 గంటల పాటు ఇలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు చెన్నై ప్రజల కోసం తాము ప్రార్థిస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మిచాంగ్ బీభత్సం.. స్పందించిన డీకే, అశూ టీమిండియా వెటరన్ బ్యాటర్, తమిళనాడు వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నా చెన్నై స్నేహితులారా.. సురక్షితంగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. ఇలాంటి విపత్కర సమయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉంటూ... పరిస్థితులు చక్కదిద్దుతున్న అధికారులకు సెల్యూట్. ఇలాంటపుడే ప్రతి ఒక్కరం పరస్పరం సహాయం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరం బతకాలి’’ అని ట్వీట్ చేశాడు. ఇక టీమిండియా వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం.. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి విజ్ఞప్తి చేశాడు. వీరితో పాటు శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ కూడా చెన్నై ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ‘‘సురక్షితంగా ఉండు నా చెన్నై!! తుపాను భయంకరమైనదే కావొచ్చు.. కానీ మన మనోబలం అంతకంటే గొప్పది. పరిస్థితులు తప్పక చక్కబడతాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఉండిపోండి. ఒకరికొకరు సహాయంగా ఉండండి’’ అని పతిరణ చెన్నై వాసులకు విజ్ఞప్తి చేశాడు. ధోనికి ప్రియమైన బౌలర్ కాగా శ్రీలంకకు చెందిన రైటార్మ్ పేసర్ మతీశ పతిరణ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రియ ఆటగాడిగా 20 ఏళ్ల ఈ ఫాస్ట్‌బౌలర్ పేరు సంపాదించాడు. ఐపీఎల్-2023 సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు. చెన్నై ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే ఎడిషన్‌కు గానూ.. పతిరణను సీఎస్కే రిటైన్ చేసుకుంది. Stay safe, my Chennai! The storm 🌪️ may be fierce, but our resilience is stronger. Better days are just around the corner. Take care, stay indoors, and look out for one another 💛💛💛 #yellove #ChennaiWeather #StaySafe #ChennaiRains #CycloneMichaung https://t.co/ovbsziy7gv — Matheesha Pathirana (@matheesha_9) December 4, 2023 #WATCH | Tamil Nadu: Trees uproot, rainwater enters the residential area as strong winds, accompanied by rainfall, lash parts of Chennai. (Visuals from Thirumullaivoyal-Annanur area) pic.twitter.com/LTGDKJZF4t — ANI (@ANI) December 4, 2023 -
వరల్డ్‌కప్ నుంచి స్టార్ బౌలర్ ఔట్..
వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పతిరానా ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు టోర్నీ మధ్యలో తప్పకున్నాడు. ఇక పతిరానా స్ధానాన్ని సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌తో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. ఇప్పటికే భారత్‌కు చేరుకున్న మాథ్యూస్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ జట్టు సెలక్షన్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మెగా టోర్నీలో ఆక్టోబర్ 26న బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో శ్రీలంక తలపడనుంది. కాగా ఇప్పటికే గాయం కారణంగా లంక కెప్టెన్ దసన్ శనక టోర్నీ మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పతిరానా కూడా దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. చదవండి: నిజంగా సిగ్గు చేటు.. రోజూ 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉన్నారు: పాకిస్తాన్ లెజెండ్ ఫైర్ -
CWC 2023: పాపం మతీష పతిరణ! జూనియర్ మలింగగా పేరొచ్చినా...
శ్రీలంక యువ పేసర్ మతీష పతిరణకు ప్రపంచకప్ 2023 అంతగా అచ్చిరావడం లేదనిపిస్తోంది. ఆడింది రెండు మ్యాచ్‌లే కానీ... సమర్పించుకున్న పరుగులు మాత్రం 180కిపైగానే. పోనీ వికెట్లయినా ఎక్కువ తీశాడా? ఊహూ అదీ లేదు. రెండు మ్యాచ్‌లలోనూ చెరో వికెట్ మాత్రమే దక్కింది. దీంతో టోర్నీలోనే అత్యంత ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్‌గా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మొత్తం పది ఓవర్లలో 95 పరుగులిచ్చి ఒక వికెట్ తీసిన పతిరణ నిన్నటి పాకిస్తాన్ మ్యాచ్‌లోనూ ధారాళంగా పరుగులిచ్చాడు. తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ తీసి 90 పరుగులు సమర్పించుకున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో డికాక్, డస్సెన్, మార్క్రమ్ పతిరణకు బౌలింగ్‌లో పరుగుల వరద పారిస్తే... పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీక్, మొహమ్మద్ రిజ్వాన్ అతని బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. ఈ వరుస దారుణ ప్రదర్శనల నేపథ్యంలో లంక జట్టులో పతిరణ స్థానం ప్రశ్నార్ధకంగా మారింది. ఒక రకంగా అతడి కెరీరే ప్రమాదంలో పడిందని చెప్పాలి. బౌలింగ్ కట్టుదిట్టం చేసుకోకుంటే కేవలం బౌలింగ్ యాక్షన్ ద్వారా జూనియర్ మలింగగా పొందిన పేరు కూడా అతడి కెరీర్‌ను కాపాడలేదని విశ్లేషకులు అంటున్నారు. యువ బౌలర్.... ఇరవై ఏళ్ల పతిరణ కెరీర్లో ఇప్పటివరకూ 12 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు. తన స్వల్ప వన్డే కెరీర్లో 7.28 సగటున పరుగులు సమర్పించుకుని భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఐపీఎల్లో సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నా... తగినన్ని వికెట్లు తీసుకోవడంతో మంచి బౌలర్ అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ... మున్ముందు పతిరణ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పాకిస్తాన్ శ్రీలంకపై చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ప్రపంచకప్‌లో 300కు పైగా లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన తరువాత 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పాక్‌ను మొహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్), అబ్దుల్లా షఫీక్ (113)లు తమ సూపర్ సెంచరీలతో గెలిపించారు. అంతకుముందు కుశాల్ మెండిస్ (122), సమర విక్రమ (108) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. -
WC 2023: 4,4,4,2,6! ఒకే ఓవర్లో 26 రన్స్.. పతిరణ చెత్త రికార్డు! వీడియో వైరల్
ICC Cricket World Cup 2023- South Africa vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు శతకాల మోత మోగించారు. ప్రొటిస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 84 బంతుల్లో 100 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వాన్ డెర్ డసెన్ 110 బంతుల్లో 108 రన్స్ సాధించాడు. వీరిద్దరిని మించేలా.. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకుని వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో సరికొత్త రికార్డు లిఖించాడు ఎయిడెన్ మార్కరమ్. ఫాస్టెస్ట్ సెంచరీతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. సుడిగాలి శతకం.. బలైన పతిరణ మొత్తంగా ఈ మ్యాచ్‌లో 54 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్.. 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మార్కరమ్ పరుగుల దాహానికి బలైన బౌలర్లలో లంక యువ పేసర్ మతీశ పతిరణ ముందు వరుసలో ఉన్నాడు. ప్రపంచకప్ చరిత్రలో చెత్త రికార్డు ప్రొటిస్ ఇన్నింగ్స్ 43వ ఓవర్లో పతిరణకు మార్కరమ్ చుక్కలు చూపించాడు. రెండో బంతి నుంచి మొదలుపెట్టి వరుసగా 4,4,4,2,6 బాదాడు. ఇక ఓవర్ తొలి బంతికి ఒక రన్ రాగా.. పతిరణ ఏకంగా ఐదు వైడ్‌బాల్స్ వేశాడు. దీంతో మొత్తంగా 43వ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పతిరణ 10 ఓవర్ల బౌలింగ్‌లో రికార్డుస్థాయిలో 95 పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్(డికాక్) తీశాడు. ఈ క్రమంలో శ్రీలంక తరఫున వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు. శ్రీలంక తరఫున వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు వీరే అషాంత డి మెల్- 1987- కరాచిలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో.. 91 మతీశ పతిరణ- 2023*- ఢిల్లీలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో.. 95 నువాన్ ప్రదీప్- 2019- ది ఓవల్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో.. 88 తిసార పెరీరా- 2015- సిడ్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో..87. చదవండి: WC 2023: ఆసీస్‌తో టీమిండియా తొలి మ్యాచ్.. మీ తుదిజట్టును ఎంచుకోండి! View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆసియా కప్ 2023 టాప్ పెర్ఫార్మర్స్ వీరే..!
ఆసియా కప్ 2023 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్‌మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసియా కప్ 2023 టాప్ పెర్ఫార్మర్స్ వీరే..! 2023 ఆసియా కప్‌లో టాప్ పెర్ఫార్మెన్స్లపై ఓ లుక్కేస్తే, ఈ జాబితాలో అంతా టీమిండియా ఆటగాళ్లే కనిపిస్తారు. అత్యధిక పరుగులు, అత్యధిక బౌండరీలు, అత్యధిక సిక్సర్లు, అత్యుత్తమ బౌలింగ్ సగటు, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.. ఇలా దాదాపు ప్రతి విభాగంలో భారత ఆటగాళ్లు టాప్‌లో ఉన్నారు. అత్యధిక పరుగులు: శుభ్‌మన్ గిల్ (6 ఇన్నింగ్స్‌ల్లో 302 పరుగులు) అత్యధిక అర్ధసెంచరీలు: రోహిత్ శర్మ, కుశాల్ మెండిస్ (3) అత్యధిక సిక్సర్లు: రోహిత్ శర్మ (11) అత్యధిక బౌండరీలు: శుభ్‌మన్ గిల్ (35) అత్యధిక స్కోర్: బాబర్ ఆజమ్ (151) అత్యధిక సగటు: మహ్మద్ రిజ్వాన్ (4 ఇన్నింగ్స్‌ల్లో 97.5) అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్: మహ్మద్ నబీ (178.95) అత్యధిక వికెట్లు: మతీష పతిరణ (11) అత్యుత్తమ బౌలింగ్ సగటు: హార్ధిక్ పాండ్యా (11.33) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు: మహ్మద్ సిరాజ్ (6/21) టోర్నీ మొత్తంలో 7 సెంచరీలు నమోదు కాగా.. ఇందులో మూడు సెంచరీలు (కోహ్లి, రాహుల్, గిల్) భారత ఆటగాళ్లు చేసినవే కావడం విశేషం. -
Asia Cup 2023: నిప్పులు చెరిగిన పతిరణ.. తిప్పేసిన తీక్షణ
ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (ఆగస్ట్ 31) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు విజృంభించారు. ఫాస్ట్ బౌలర్ మతీష పతిరణ నిప్పులు చెరిగే వేగంతో బంతులు సంధించి 4 వికెట్లు పడగొట్టగా.. తీక్షణ (8-1-19-2) తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వీరికి ధనంజయ డిసిల్వ (10-0-35-1), దునిత్ వెల్లలగే (7-0-30-1), కెప్టెన్ షనక (3-0-16-1) తోడవ్వడంతో బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హొసేన్ షాంటో (122 బంతుల్లో 89; 7 ఫోర్లు) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, తన జట్టు ఓ మోస్తరు స్కోరైనా చేసేందుకు తోడ్పడగా.. తౌహిద్ హ్రిదోయ్ (20), ఓపెనర్ మొహమ్మద్ నైమ్ (16), ముష్ఫికర్ రహీమ్ (13) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. తంజిద్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ డకౌట్లు కాగా.. కెప్టెన్ షకీబ్ 5, మెహిది హసన్ మీరజ్ 5,మెహిది హసన్ 6, షోరిఫుల్ ఇస్లాం 2 పరుగులతో అజేయంగా నిలిచారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభంలోనే వికెట్లు కోల్నోయి ఎదురీదుతోంది. ఆ జట్టు 43 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. పథుమ్ నిస్సంక (14).. షోరీఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీంకు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. కరుణరత్నేను (1) తస్కిన్ అహ్మద్, కుశాల్ మెండిస్‌ను (5) షకీబ్ క్లీన్ బౌల్డ్ చేశారు. 14 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 58/3గా ఉంది. సమరవిక్రమ (25), అసలంక (8) క్రీజ్‌లో ఉన్నారు. -
'చాలా గ్రేట్.. ధోని నుంచి చాలా నేర్చుకున్నా'
శ్రీలంక యువ పేస్ సంచలనం మతీషా పతిరానా ఐపీఎల్-2023లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ తరపున బరిలోకిన దిగిన పతిరానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌ను పోలివున్న 20 ఏళ్ల పతిరానా.. తన స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎంఎస్ ధోని సారథ్యంలో పతిరానా మరింత రాటుదేలాడు. ఐపీఎల్లో దుమ్మురేపిన పతిరానా.. ఇప్పుడు శ్రీలంక జట్టుకు కీలక బౌలర్‌గా మారాడు. అతడు ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో బీజీబీజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఓ స్పోర్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పతిరనా కీలక వాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే సారధి ఎంఎస్ ధోని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా అని అతడు తెలిపాడు. "ఒక యువ ఆటగాడిగా కెరీర్‌ను మొదలపెట్టినప్పుడు ఎవరైన భరోసా కల్పిస్తే అది మనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ధోని లాంటి లెజెండరీ క్రికెటర్ నాకు మద్దతుగా నిలిచాడు. నాపై చాలా నమ్మకం ఉంచాడు. ఆ సమయంలో నేను ఏదైనా చేయగలనని నమ్మాను. నాకే కాదు.. చాలా మంది యువ ఆటగాళ్లకు ధోని సపోర్ట్‌గా నిలిచాడు. మా జట్టులో నలుగురు, ఐదుగురు అగ్రశ్రేణి ఆటగాళ్లు గాయపడిన సమయంలో.. ధోని యువ ఆటగాళ్లపై చాలా నమ్మకం ఉంచాడు. అతడు నిజంగా చాలా గ్రేట్. ధోని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అతడి ప్రశాంతత, వినయం నన్ను ఎంతగానే అకట్టుకున్నాయి. అందుకే అతడు తన కెరీర్లో విజయవంతమయ్యాడు. 42 ఏళ్ల వయస్సులో కూడా ఎంఎస్ చాలా ఫిట్‌గా ఉన్నాడు. ధోని మా లాంటి యువ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తిదాయకం.నేను సీఎస్కేతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు చాలా చిన్నవాడిని. అప్పడు ధోనినే నాకు చాలా విషయాలు నేర్పించాడని పతిరానా పేర్కొన్నాడు. చదవండి: #Rishabh Pant: బ్యాట్ పట్టిన రిషబ్ పంత్.. సిక్సల వర్షం! వీడియో వైరల్