ICC Cricket World Cup 2023- South Africa vs Sri Lanka: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు శతకాల మోత మోగించారు. ప్రొటిస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 84 బంతుల్లో 100 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వాన్ డెర్ డసెన్ 110 బంతుల్లో 108 రన్స్ సాధించాడు.
వీరిద్దరిని మించేలా.. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకుని వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో సరికొత్త రికార్డు లిఖించాడు ఎయిడెన్ మార్కరమ్. ఫాస్టెస్ట్ సెంచరీతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.
సుడిగాలి శతకం.. బలైన పతిరణ
మొత్తంగా ఈ మ్యాచ్‌లో 54 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్.. 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మార్కరమ్ పరుగుల దాహానికి బలైన బౌలర్లలో లంక యువ పేసర్ మతీశ పతిరణ ముందు వరుసలో ఉన్నాడు.
ప్రపంచకప్ చరిత్రలో చెత్త రికార్డు
ప్రొటిస్ ఇన్నింగ్స్ 43వ ఓవర్లో పతిరణకు మార్కరమ్ చుక్కలు చూపించాడు. రెండో బంతి నుంచి మొదలుపెట్టి వరుసగా 4,4,4,2,6 బాదాడు. ఇక ఓవర్ తొలి బంతికి ఒక రన్ రాగా.. పతిరణ ఏకంగా ఐదు వైడ్‌బాల్స్ వేశాడు. దీంతో మొత్తంగా 43వ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పతిరణ 10 ఓవర్ల బౌలింగ్‌లో రికార్డుస్థాయిలో 95 పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్(డికాక్) తీశాడు. ఈ క్రమంలో శ్రీలంక తరఫున వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు.
శ్రీలంక తరఫున వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు వీరే
అషాంత డి మెల్- 1987- కరాచిలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో.. 91
మతీశ పతిరణ- 2023*- ఢిల్లీలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో.. 95
నువాన్ ప్రదీప్- 2019- ది ఓవల్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో.. 88
తిసార పెరీరా- 2015- సిడ్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో..87.
చదవండి: WC 2023: ఆసీస్‌తో టీమిండియా తొలి మ్యాచ్.. మీ తుదిజట్టును ఎంచుకోండి!
Comments
Please login to add a commentAdd a comment