
కోహ్లి (Photo Courtesy: BCCI/IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది. 2008 తర్వాత తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను చెపాక్‌లో ఓడించింది. ఏకంగా యాభై పరుగుల తేడాతో సీఎస్‌కేను చిత్తు చేసి చిదంబరం స్టేడియంలో గెలుపు జెండా ఎగురవేసింది.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32) ధనాధన్ దంచికొట్టగా.. విరాట్ కోహ్లి (Virat Kohli) మాత్రం ఆచితూచి ఆడాడు. 30 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 31 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. అయితే, తాను సిక్స్ కొట్టిన సందర్భంగా.. కోహ్లి ఇచ్చిన రియాక్షన్ వింటేజ్ కింగ్‌ను గుర్తు చేసింది.
హెల్మెట్‌కు బలంగా తాకిన బంతి
అసలేం జరిగిందంటే.. సీఎస్‌కేతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పదకొండో ఓవర్లో చెన్నై పేసర్ మతీశ పతిరణ బంతితో రంగంలోకి దిగాడు.
అప్పుడు కోహ్లి క్రీజులో ఉండగా.. పతిరణ పదునైన షార్ట్ డెలివరీ సంధించగా.. కోహ్లి హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. ఫలితంగా.. ఒకవేళ కంకషన్ సబ్‌స్టిట్యూట్ అవుతుందేమోనని చెక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
క్లాసీ కౌంటర్.. మాస్ రియాక్షన్
అయితే, తాను బాగానే ఉన్నానని చెప్పిన కోహ్లి.. పతిరణ సంధించిన రెండో బంతికి భారీ షాట్ బాదాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్ సంధించిన షార్ట్ బాల్‌ను ఫైన్ లెగ్ మీదుగా బౌండరీవైపు తరలించి ఆధిపత్యం చాటుకున్నాడు.
ఈ క్రమంలో.. ‘‘ఇదీ నా పవర్’’ అన్నట్లుగా పతిరణ వైపు కింగ్ గుర్రుగా చూసిన విధానం అభిమానులను ఆకర్షించింది. ఇక అదే ఓవర్లో మరుసటి బంతికి కోహ్లి ఫోర్ కూడా బాదడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
1st ball – 😮💨
2nd ball – 6️⃣
That’s what it’s like facing the GEN GOLD! ❤
Classy counter from #ViratKohli! 🙌🏻
Watch LIVE action ➡ https://t.co/MOqwTBm0TB#IPLonJioStar 👉 #CSKvRCB | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 3 & JioHotstar! pic.twitter.com/MzSQTD1zQc— Star Sports (@StarSportsIndia) March 28, 2025
పాటిదార్, పడిక్కల్, డేవిడ్ అదరహో
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సాల్ట్, కోహ్లిలు ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51) దుమ్ములేపారు. మిగతా వాళ్లలో టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఫలితంగా ఆర్సీబీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు, మతీశ పతిరణ రెండు, ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
హాజిల్‌వుడ్ తీన్‌మార్
లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్ల ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (41), రవీంద్ర జడేజా(25), మహేంద్ర సింగ్ ధోని(16 బంతుల్లో 30 నాటౌట్) రాణించారు.
ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్ల(3/21)తో సత్తా చాటగా.. లియామ్ లివింగ్‌స్టోన్, యశ్ దయాళ్ రెండేసి వికెట్లు కూల్చారు. భువనేశ్వర్‌కుమార్‌కు ఒక వికెట్ దక్కింది.
ఐపీఎల్-2025: సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ
👉టాస్: సీఎస్‌కే.. బౌలింగ్
👉ఆర్సీబీ స్కోరు: 196/7 (20)
👉సీఎస్‌కే స్కోరు: 146/8 (20)
👉ఫలితం: యాభై పరుగుల తేడాతో సీఎస్‌కేపై ఆర్సీబీ గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రజత్ పాటిదార్.
చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!