IPL 2025 RCB vs MI: ఉత్కంఠ‌పోరులో ఆర్సీబీ విజయం | IPL 2025: Royal Challengers Bangalore vs Mumbai Indians Live Updates and Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025 RCB vs MI: ఉత్కంఠ‌పోరులో ఆర్సీబీ విజయం

Published Mon, Apr 7 2025 6:57 PM | Last Updated on Mon, Apr 7 2025 11:28 PM

IPL 2025: Royal Challengers Bangalore vs Mumbai Indians Live Updates and Highlights

Rcb vs MI Live Updates:
ఉత్కంఠ‌పోరులో ఆర్సీబీ విజయం
వాంఖడే వేదిక‌గా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.  222 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 209 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ‌(29 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 56) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 42)క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, దయాల్ తలా రెండు వికెట్లు సాధించారు.
 

హార్దిక్ ఔట్‌..
తిల‌క్ వ‌ర్మ‌(56), హార్దిక్ పాండ్య(35) వికెట్లను ముంబై ఇండియ‌న్స్ వ‌రుస క్ర‌మంలో కోల్పోయింది. ముంబై విజ‌యానికి 11 బంతుల్లో 28 ప‌రుగులు కావాలి.

దూకుడుగా ఆడుతున్న తిల‌క్‌, పాండ్యా
16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది. తిల‌క్ వ‌ర్మ‌(46), హార్దిక్ పాండ్యా(34) దూకుడుగా ఆడుతున్నారు. ముంబై విజ‌యానికి 24 బంతుల్లో 52 ప‌రుగులు కావాలి.

ముంబై నాలుగో వికెట్ డౌన్‌
సూర్య‌కుమార్ యాద‌వ్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 28 ప‌రుగులు చేసిన సూర్య‌కుమార్‌.. య‌శ్‌ద‌యాల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 116 ప‌రుగులు చేసింది. క్రీజులో తిల‌క్ వ‌ర్మ‌(30), హార్దిక్ పాండ్యా(0) ఉన్నారు.
ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్‌..
విల్ జాక్స్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ మూడో వికెట్ కోల్పోయింది. 22 ప‌రుగులు చేసిన విల్ జాక్స్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.

5 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌: 52/2
5 ఓవ‌ర్లు ముగిసే సరికి ముంబై ఇండియ‌న్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 52 ప‌రుగులు చేసింది. క్రీజులో విల్ జాక్స్‌(13), సూర్య‌కుమార్ యాద‌వ్‌(5) ఉన్నారు.

ముంబై రెండో వికెట్ డౌన్‌..
ర్యాన్ రికెల్ట‌న్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన రికెల్ట‌న్‌.. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

తొలి వికెట్ కోల్పోయిన ముంబై..
222 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్‌కు భారీ షాక్ త‌గిలింది. 17 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ‌.. య‌శ్‌ద‌యాల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ వికెట్ న‌ష్టానికి 25  ప‌రుగులు చేసింది.
ముంబై ముందు భారీ టార్గెట్‌
వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ్యాట‌ర్లు ఆకాశమే హ‌ద్దుగా చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 5 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి(67), ర‌జిత్ పాటిదార్‌(64) హాఫ్ సెంచ‌రీలు సాధించ‌గా.. ప‌డిక్క‌ల్‌(37), జితేష్ శ‌ర్మ‌(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌల‌ర్ల‌లో బౌల్ట్‌, హార్దిక్ పాండ్యా త‌లా రెండు వికెట్లు సాధించ‌గా.. విఘ్నేష్ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టారు.

ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్‌..
లివింగ్ స్టోన్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఖాతా తెర‌వ‌కుండానే లివింగ్ స్టోన్ పెవిలియ‌న్‌కు చేరాడు. 15 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆర్సీబీ 4 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది.

ఆర్సీబీ మూడో వికెట్ డౌన్‌.. కోహ్లి ఔట్‌
విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 67 ప‌రుగులు చేసిన విరాట్ కోహ్లి.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 

నిల‌క‌డ‌గా ఆడుతున్న విరాట్‌, పాటిదార్‌
13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ రెండు వికెట్ల న‌ష్టానికి 123 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(60), పాటిదార్‌(19) ఉన్నారు.

ఆర్సీబీ రెండో వికెట్ డౌన్‌..
దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 37 ప‌రుగులు చేసిన ప‌డిక్క‌ల్‌.. విఘ్నేష్ పుత్తార్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ రెండు వికెట్ల న‌ష్టానికి 95 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లి త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. 53 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు.

దూకుడుగా ఆడుతున్న కోహ్లి..
విరాట్ కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు. 25 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్టానికి 43 ప‌రుగులు చేసింది. క్రీజులో కోహ్లితో పాటు ప‌డిక్క‌ల్‌(13) ఉన్నారు.

ఆర్సీబీకి భారీ షాక్‌.. సాల్ట్ ఔట్‌
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. 4 ప‌రుగులు చేసిన ఫిల్ సాల్ట్‌.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్టానికి 17 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ప‌డిక్క‌ల్‌(4) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, రోహిత్ శ‌ర్మ తిరిగి తుది జ‌ట్టులోకి వ‌చ్చారు.

తుది జ‌ట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, జస్ప్రీత్ బుమ్రా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement