Viral Video: పతిరణ కళ్లు చెదిరే యార్కర్‌ దెబ్బకు మార్క్రమ్‌ ఫ్యూజులు ఔట్‌ | IPL 2024 CSK VS SRH: Pathirana Unanswerable Yorker Stuns Batter Aiden Markram.. Viral Video | Sakshi
Sakshi News home page

IPL 2024 CSK VS SRH: పతిరణ కళ్లు చెదిరే యార్కర్‌ దెబ్బకు మార్క్రమ్‌ ఫ్యూజులు ఔట్‌

Published Mon, Apr 29 2024 11:34 AM | Last Updated on Mon, Apr 29 2024 11:34 AM

IPL 2024 CSK VS SRH: Pathirana Unanswerable Yorker Stuns Batter Aiden Markram.. Viral Video

సన్‌రైజర్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 28) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే పేసర్‌ మతీశ పతిరణ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఈ సీజన్‌లో అరివీర భయంకర ఫామ్‌లో (6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు) ఉన్న పతిరణ.. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు (మార్క్రమ్‌, క్లాసెన్‌) పడగొట్టాడు. 

ఇందులో మార్క్రమ్‌ను బౌల్డ్‌ చేసిన బంతి మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. పతిరణ సంధించిన స్వింగింగ్‌ యార్కర్‌ దెబ్బకు మిడిల్‌ స్టంప్‌ గాల్లోకి ఎగిరింది. ఇది చూసి బ్యాటర్‌ మార్క్రమ్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. పడిపోయిన వికెట్లను చూస్తూ నిస్సహాయంగా పెవిలియన్‌ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

 

 ఈ మ్యాచ్‌లో పతిరణతో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌ (98), డారిల్‌ మిచెల్‌ (52, 5 క్యాచ్‌లు), తుషార్‌ దేశ్‌పాండే (3-0-27-4) చెలరేగడంతో సీఎస్‌కే 78 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది.  

 

తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే..  నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భువనేశ్వర్‌, నటరాజన్‌, ఉనద్కత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన సన్‌రైజర్స్‌.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. తుషార్‌ దేశ్‌ పాండే, ముస్తాఫిజుర్‌ (2.5-0-19-2), పతిరణ, రవీంద్ర జడేజా (4-0-22-1), శార్దూల్‌ ఠాకూర్‌ (4-0-27-1) సన్‌రైజర్స్‌ పతనాన్ని శాశించారు. 

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన మార్క్రమ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ట్రవిస్‌ హెడ్‌ (13), అభిషేక్‌ శర్మ (15), నితీశ్‌ రెడ్డి (15), క్లాసెన్‌ (20), అబ్దుల్‌ సమద్‌ (19) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో సీఎస్‌కే మూడో స్థానానికి ఎగబాకగా.. ఆ స్థానంలో ఉండిన సన్‌రైజర్స్‌ నాలుగో స్థానానికి పడిపోయింది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement