
PC: BCCI/IPL.com
IPL 2025 PBKS vs CSK Live Updates:
సీఎస్‌కేపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం..
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లో పడింది. ముల్లాన్‌పూర్ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో డెవాన్ కాన్వే(49 బంతుల్లో 69) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 42), రచిన్ రవీంద్ర(36), ధోని(27) పర్వాలేదన్పించారు. జాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాక్స్‌వెల్,యష్ ఠాకూర్ ఓ వికెట్ సాధించారు.
సీఎస్‌కే మూడో వికెట్ డౌన్..
శివమ్ దూబే రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన దూబే.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. సీఎస్‌కే విజయానికి 18 బంతుల్లో 59 పరుగులు కావాలి. క్రీజులో కాన్వే(67), ధోని(3) ఉన్నారు.
13 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 120/2
13 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులో డెవాన్ కాన్వే(44), శివమ్ దూబే(30) ఉన్నారు.
గైక్వాడ్ ఔట్..
220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర(36) మాక్స్‌వెల్ బౌలింగ్‌లో స్టంపౌట్ కాగా.. రుతురాజ్ గైక్వాడ్(1) లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో పెవిలయన్‌కు చేరాడు. 8 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 69/2
4 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 45/0
4 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో డెవాన్ కాన్వే(15), రచిన్ రవీంద్ర(24) ఉన్నారు.
సీఎస్‌కే ముందు భారీ టార్గెట్..
ముల్లాన్‌పూర్ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103) సెంచరీతో చెలరేగగా.. శశాంక్ సింగ్(52), జాన్సెన్(34) పరుగులతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించగా.. నూర్, ముఖేష్ చెరో వికెట్ సాధించారు.
17 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 182/6
17 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. క్రీజులో శశాంక్ సింగ్(41), జాన్సెన్(11) పరుగులతో ఉన్నారు.
ప్రియాన్ష్ ఆర్య సూపర్ సెంచరీ..
పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీని ఆర్య అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఆర్యది 4వ ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
అశ్విన్ ఆన్ ఫైర్..
పంజాబ్ కింగ్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. నేహల్ వధేరా(9), మాక్స్‌వెల్(0)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. 9 ఓవర్లు మగిసే సరికి పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(53), శశాంక్ సింగ్(4) ఉన్నారు.
పంజాబ్ మూడో వికెట్ డౌన్
మార్కస్ స్టోయినిష్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిష్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు మగిసే సరికి పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(53), వధేరా(7) ఉన్నారు. ఆర్యకు ఇదే తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
పంజాబ్ రెండో వికెట్ డౌన్..
శ్రేయస్ అయ్యర్ రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి స్టోయినిష్ వచ్చాడు.
పంజాబ్ తొలి వికెట్ డౌన్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ప్రభుసిమ్రాన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్ ఆర్య(22), శ్రేయస్ అయ్యర్(1) ఉన్నారు.
ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.
ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరన