CSK Vs LSG: ‘నన్నెందుకు చూపిస్తున్నావు?’.. ధోని సీరియస్‌.. వీడియో వైరల్‌ | Dhoni Fumes At Cameraman Threatens To Throw Bottle During Gaikwad Dube Stand | Sakshi
Sakshi News home page

MS Dhoni Angry Video: ‘నన్నెందుకు చూపిస్తున్నావు?’.. ధోని సీరియస్‌.. వీడియో వైరల్‌

Published Thu, Apr 25 2024 4:50 PM | Last Updated on Thu, Apr 25 2024 4:50 PM

Dhoni Fumes At Cameraman Threatens To Throw Bottle During Gaikwad Dube Stand - Sakshi

‘మిస్టర్‌ కూల్‌’ మహేంద్ర సింగ్‌ ధోనికి కోపమొచ్చింది. ‘‘కొట్టేస్తా నిన్ను  జాగ్రత్త’’ అన్నట్లుగా ధోని హెచ్చరించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఇంతకీ తలాకు ఎవరిపై కోపమొచ్చింది?

ఐపీఎల్‌-2024లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడింది. సొంతమైదానం చెపాక్‌ వేదికగా టాస్‌ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌ చేసింది.

ఈ క్రమంలో ఓపెనర్‌ అజింక్య రహానే(1) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ శతక్కొట్టాడు. వరుసగా వికెట్లు పడ్డా పట్టుదలగా నిలబడి.. శివం దూబే(66)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

అజేయ శతకం(60 బంతుల్లో 108)తో రాణించి సీఎస్‌కే 210 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ.. మార్కస్‌ స్టొయినిస్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌(63 బంతుల్లో 124*) కారణంగా గైక్వాడ్‌ సెంచరీ వృథాగా పోయింది.

లక్నో చేతిలో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. సీఎస్‌కే మ్యాచ్‌ అంటే అందరి కళ్లు ఎవరి మీద ఉంటాయో తెలిసిందే. ధోని ఒక్కసారి మైదానంలో దిగాడంటే అభిమానులకు పండుగే.

ఇక తలాకు సంబంధించిన ప్రతీ మూమెంట్‌ను తన కన్నుతో బంధించడానికి కెమెరామెన్‌ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా ఇంకాస్త ఎక్కువే ధోనిపై ఫోకస్‌ చేశాడు కెమెరామెన్‌. 

రుతురాజ్‌ గైక్వాడ్‌, శివం దూబే దంచికొడుతున్న తరుణంలో డ్రెసింగ్‌రూం నుంచి చూస్తున్న ధోని.. హెయిర్‌ సెట్‌ చేసుకుంటుండగా క్యాప్చర్‌ చేశాడు. దీంతో ఒకింత అసహనానికి గురైన తలా.. బాటిల్‌ చూపిస్తూ కొట్టేస్తానంటూ కెమెరామెన్‌ను బెదిరించాడు. 

గైక్వాడ్‌- దూబే సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడుతుంటే అక్కడ ఫోకస్‌ చేయకుండా.. నాపై దృష్టి పెడతావేంటి అన్నట్లుగా చిరుకోపం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.  కాగా ఈమ్యాచ్‌లో ధోని ఆరో స్థానంలో వచ్చి ఒకే ఒక్క బంతి ఎదుర్కొని ఫోర్‌ బాది నాటౌట్‌గా నిలిచాడు.

చదవండి: HBD Sachin Tendulkar: పరుగుల వీరుడి గురించి ఈ విషయాలు తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement