బ్యాడ్‌న్యూస్‌.. మళ్లీ ధోని బ్యాటింగ్‌ చూడలేమా?! | IPL 2024: MS Dhoni Seen Limping After Explosive Knock, Leaves Fans Worried | Sakshi
Sakshi News home page

#MS Dhoni: అయ్యో పాపం ధోని.. ఆందోళనలో ఫ్యాన్స్‌! కారణమిదే

Published Tue, Apr 2 2024 3:42 PM | Last Updated on Wed, Apr 3 2024 12:37 PM

IPL 2024: Dhoni Seen Limping After Explosive Knock Leaves Fans Worried - Sakshi

విశాఖపట్నంలో బ్యాట్‌ ఝులిపించి అభిమానులను ఖుషీ చేశాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వింటేజ్‌ ‘తలా’ను గుర్తు చేస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు.

కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులతో అదరగొట్టాడు. అయితే, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేను మాత్రం గెలిపించలేకపోయాడు ధోని. అయినా.. ఐపీఎల్‌-2024లో తొలిసారి.. అదీ ఈ రేంజ్‌లో ధోని షాట్లు బాదడం చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

వింటేజ్‌ ధోని విధ్వంసాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ వీడియోలు వైరల్‌ చేశారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో మాత్రం తలా ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సూపర్‌ ఇన్నింగ్స్‌ అనంతరం ధోని కుంటుతూ డ్రెసింగ్‌రూంకి వెళ్లాడు.

‘‘ఈ బహుమతి(ఇన్నింగ్స్‌) తన అభిమానుల కోసం అని చెప్పాడు’’ అంటూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ షేర్‌ చేసిన ఈ వీడియోలో ధోని మరోసారి మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది. దీంతో.. ఇప్పట్లో మళ్లీ ధోని బ్యాటింగ్‌ చూడగలమో లేదో అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

కాగా ఐపీఎల్‌-2024లో వరుసగా రెండు విజయాలు సాధించిన చెన్నై.. మూడో మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ చేతిలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో రుతురాజ్‌ సేన తదుపరి సన్‌రైజర్స్‌తో తలపడనుంది. హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం(ఏప్రిల్‌ 5) ఈ మ్యాచ్‌ జరుగనుంది. 

చదవండి: WC 2011: జగజ్జేతగా టీమిండియా.. ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement