మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. ‘పారిపోయిన’ ధోని! వైరల్‌ | IPL 2024 Fan Invades Pitch To Touch Dhoni Feet Watch What Happens Next | Sakshi
Sakshi News home page

MS Dhoni: మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. ‘పారిపోయిన’ ధోని! వైరల్‌

Published Sat, May 11 2024 8:36 AM | Last Updated on Sat, May 11 2024 9:03 AM

మహేంద్ర సింగ్‌ ధోని (PC: CSK X)

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మహేంద్ర సింగ్‌ ధోని మరోసారి మిస్టర్‌ కూల్‌ అని నిరూపించుకున్నాడు. మ్యాచ్‌ మధ్యలో మైదానంలోకి దూసుకువచ్చిన అభిమానిని ఆలింగనం చేసుకుని సాదరంగా వీడ్కోలు పలికాడు.

గుజరాత్‌ టైటాన్స్‌- సీఎస్‌కే మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ రేసు ఆశలను సజీవం చేసుకునే క్రమంలో ఇరు జట్లు అహ్మదాబాద్‌ వేదికగా తలపడ్డాయి.

సొంతమైదానంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ ఓపెనర్ల విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.

శతకాల మోత
సాయి సుదర్శన్‌(103)‌, శుబ్‌మన్‌ గిల్‌(104) శతకాల మోతతో నరేంద్ర మోదీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టాపార్డర్‌ కుప్పకూలగా.. మిడిలార్డర్‌ ఆదుకుంది. కానీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది.

నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసిన చెన్నై జట్టు టైటాన్స్‌ ముందు తలవంచింది. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.

అయితే, ఆఖరి ఓవర్లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాది ధోని జోరు మీద ఉండగా... మూడో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేసింది ప్రత్యర్థి జట్టు. కానీ బాల్‌ వికెట్స్‌ మిస్‌ చేసినట్లుగా తేలడంతో ధోని నాటౌట్‌గా నిలిచాడు.

పాదాలకు నమస్కరించగానే
అయితే, ఇదే సమయంలో ఓ యువకుడు మైదానంలోకి దూసుకువచ్చాడు. అతడి రాకను గమనించిన ధోని తొలుత దూరంగా పారిపోతున్నట్లు నటించాడు. అతడు వచ్చి పాదాలకు నమస్కరించగానే భుజం తట్టిలేపి ఆలింగనం చేసుకుని ఇక వెళ్లు అన్నట్లుగా కూల్‌గా డీల్‌ చేశాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తలా క్రేజ్‌, ఫ్యాన్స్‌ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

చదవండి: కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్‌లోనూ అలా! పాపం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement