
మహేంద్ర సింగ్ ధోని.. ఈ టీమిండియా దిగ్గజ కెప్టెన్ తన అద్బుత ఆట తీరు, నిరాండంబరతతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ తర్వాత కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి.. ‘తలా’గా అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. అయితే, ధోని మైదానంలో దిగుతున్నాడంటే సీఎస్‌కే ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు.. జట్లకు అతీతంగా అందరిలోనూ ఉత్సాహం నిండిపోతుంది.
ఏ జట్టుకు మద్దతు ఇచ్చే వారైనా ధోని బ్యాటింగ్‌కు వచ్చాడంటే .. క్రీజులో ఉన్నంత సేపు అతడికే మద్దతుగా నిలుస్తారు. ఇక మరికొంత మందైతే తలాను నేరుగా కలిసేందుకు దెబ్బలు తినైనా సరే మైదానంలోకి దూసుకువస్తారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.
ధోని బ్యాటింగ్‌కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పి
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగానూ ఓ వ్యక్తి ఇలాగే ఫీల్డ్‌లోకి దూసుకువచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ధోని బ్యాటింగ్‌కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పి లోపలికి ప్రవేశించి.. ధోని పాదాలను చుట్టేశాడు.
ఆ సమయంలో ధోని ఏమాత్రం సహనం కోల్పోకుండా తన అభిమాని సమస్యను అర్థం చేసుకోవడమే గాకుండా.. సర్జరీ చేయిస్తానని మాట ఇచ్చాడట. నాడు ధోనిని కలిసిన సదరు వ్యక్తి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!
‘‘ధోనిని చూడగానే నా చుట్టూ ఏం జరుగుతుందో అంతా మర్చిపోయాను. మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లాను. మహీ భాయ్ అప్పుడు.. ‘సరదా కోసమే ఇక్కడికి వచ్చావు కదా’ అన్నాడు.
మహీ భాయ్‌ను చూశానన్న ఆనందంలో నాకైతే పిచ్చిపట్టినట్లయింది. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయనొక లెజెండ్. నేరుగా ఆయనను చూడగానే నా కళ్లలో నీళ్లు వచ్చాయి.
ఆ సమయంలో నేను భారంగా శ్వాస తీసుకోవడం గమనించి.. ఏమైందని అడిగారు. నా ముక్కు సరిగా పనిచేయదని.. శ్వాస విషయంలో ఇబ్బంది పడుతున్న అని చెప్పాను. వెంటనే ఆయన.. ‘బాధపడకు.. నీ సర్జరీ గురించి నేను చూసుకుంటా. నీకేం కానివ్వను’ అని భరోసా ఇచ్చారు’’ అని సదరు అభిమాని ఫోకస్డ్ ఇండియన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ధోని గ్రేట్
అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ధోని గ్రేట్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. కాగా 42 ఏళ్ల వయసులో సీఎస్‌కే కెప్టెన్‌గా వైదొలిగిన ధోని.. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు.
గైక్వాడ్ సారథ్యంలో వికెట్ కీపర్‌బ్యాటర్‌గా కొనసాగాడు ధోని. అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.
చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
Conversation between @msdhoni and fan 🥹💛
Fan told him he has some breathing issues and there is surgery of it. He wanted to meet him before surgery. Mahi replied "Teri surgery ka mai dekh lunga. Tujhe kuch nahi hoga, tu ghabara mat. Mai tujhe kuch nahi hone dunga" pic.twitter.com/wKz9aZOVGQ— ` (@WorshipDhoni) May 29, 2024
Comments
Please login to add a commentAdd a comment