ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
పతిరానా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకునేందుకు స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సీఎస్కే మెనెజ్‌మెంట్ ధ్రువీకరించింది.
టీ20 వరల్డ్‌కప్ సమయం దగ్గరపడుతుండడంతో ముందు జాగ్రత్తగా పతిరానాను శ్రీలంక క్రికెట్ స్వదేశానికి రప్పించింది.
ఈ సీజన్లో ఇప్పటి వరకు సీఎస్కే తరుపున పతిరానా ఆరు మ్యాచులు ఆడాడు. 7.68 ఎకానమీతో 13 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మన్ సైతం ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ఇప్పుడు పతిరాన కూడా స్వదేశానికి వెళ్లిపోవడం సీఎస్కేకు నిజంగా బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment