Sri lanka Cricket
-
శ్రీలంక క్రికెటర్‌కు భారీ ఊరట.. మూడేళ్ల నిషేధం ఎత్తివేత!
శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్విల్లా( Niroshan Dickwella)కు భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(WADA) అతడికి క్లీన్చిట్ దక్కినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిక్‌విల్లాపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని ఎత్తివేసినట్లు తెలుస్తోంది. శ్రీలంక ప్రీమియర్ లీగ్-2024 సందర్భంగా డిక్‌విల్లాపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి.ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఆట తీరును మెరుగుపరచుకునేందుకు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు శ్రీలంక యాంటీ డోపింగ్ ఏజెన్సీ(SLADA)కు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో నిరోషన్ డిక్విల్లాకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఏ ఫార్మాట్లోనూ క్రికెట్ ఆడకుండా మూడేళ్లపాటు నిషేధం పడింది.ఈ నేపథ్యంలో నిరోషన్ డిక్విల్లా వాడాను ఆశ్రయించగా.. అతడికి ఊరట లభించినట్లు డైలీ మిర్రర్ లంక పేర్కొంది. డిక్విల్లా నిషేధిత ప్రేరకాలు వాడలేదని.. అతడు తీసుకున్న పదార్థాలతో బ్యాటింగ్ ప్రదర్శన మెరుగుపడే అవకాశం లేదని లీగల్ టీమ్ ఆధారాలు సమర్పించినట్లు తెలిపింది. ఫలితంగా నిరోషన్ డిక్‌విల్లాపై నిషేధం ఎత్తివేయాల్సిందిగా వాడా ఆదేశించినట్లు పేర్కొంది.కాగా 31 ఏళ్ల నిరోషన్ డిక్విల్లా 2014లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ వికెట్ కీపర్ ఇప్పటి వరకు 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2757, 1604, 480 పరుగులు సాధించాడు. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడన్న కారణంగా నిషేధం ఎదుర్కోవడం అతడికి అలవాటే.కోవిడ్ సమయంలో 2021లో బయో బబుల్ నిబంధనలు అతిక్రమించినందుకు నిరోషన్ డిక్‌విల్లాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అతడితో పాటు ధనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్ కూడా ఇదే తప్పిదం కారణంగా నిషేధం ఎదుర్కొన్నారు. ఇక గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టు సందర్భంగా నిరోషన్ డిక్విల్లా శ్రీలంక తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌కే అతడు పరిమితమయ్యాడు. -
శ్రీలంక హెడ్‌కోచ్‌గా జయసూర్య.. మరో ఏడాది పాటు!
శ్రీలంక హెడ్‌కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య పదవీకాలాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఏడాది పాటు పొడిగించింది. ఈ ఏడాది జూలైలో భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్‌గా జయసూర్య బాధ్యతలు చేపట్టాడు.అయితే టీమిండియాతో టీ20 సిరీస్ కోల్పోయినప్పటకి వన్డేల్లో మాత్రం లంక అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో లంకేయులు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన శ్రీలంక టీమ్ అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయినప్పటకి.. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో గెలిచి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తమ సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా శ్రీలంక అదరగొడుతుంది. ఇప్పటికే తొలి టెస్టులో కివీస్‌ను చిత్తు చేసిన లంక.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా విజయానికి చేరువైంది. గత మూడు నెలలగా జయసూర్య నేతృత్వంలోని లంక జట్టు తమ పూర్వ వైభవంగా దిశగా అడుగులు వేస్తోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. ఇప్పుడు కివీస్‌తో రెండో టెస్టులో విజయం సాధిస్తే శ్రీలంక స్ధానం మరింత మెరుగుపడే అవకాశముంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడమే లక్ష్యంగా శ్రీలంక ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే జయసూర్య సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించుకుంది.చదవండి: IND vs BAN: 'అతడేం తప్పు చేశాడు.. నిజంగా సిగ్గు చేటు'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్ -
టెస్టు మధ్యలో విశ్రాంతి రోజు?.. 16 ఏళ్ల తర్వాత
గాలే: ఆధునిక క్రికెట్లో రిజర్వ్ డే గురించే అభిమానులకు తెలుసు! ప్రపంచకప్ మెగా ఈవెంట్లకు, మేజర్ టోర్నీల ఫైనల్స్‌కు రిజర్వ్ డేలు ఉండటం సర్వసాధారణం. అయితే విశ్రాంతి రోజు మాత్రం అంతగా తెలీదు. పైగా టెస్టు మ్యాచ్ మధ్యలో ఇచ్చే విశ్రాంతి దినం మూడు దశాబ్దాల క్రితం ఉండేది. కానీ ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదు. ఇలాంటి అరుదైన ఘటనే ప్రస్తుతం శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టులో జరిగింది. గాలేలో 18న మొదలైన తొలి టెస్టులో మూడు రోజుల ఆట ముగిసింది. శనివారం నాలుగో రోజు ఆట ఉండేది. కానీ విశ్రాంతి రోజుగా ప్రకటించడంతో తర్వాతి రెండు రోజుల ఆటను ఆది, సోమవారాల్లో నిర్వహిస్తారు. ఇదేంటి కొత్తగా విశ్రాంతి దినమెందుకు అంటే... శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలే కారణం.రాజపక్స, గొటబాయ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో దివాళా తీసిన శ్రీలంక... తదనంతరం నెలకొన్న రాజకీయ అస్థిరత పరిస్థితుల వల్ల తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడు ఆ సంక్షోభం తర్వాత జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కావడంతో స్వదేశంలోనే ఉన్న శ్రీలంక క్రికెటర్లు, సహాయ సిబ్బంది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు లంక క్రికెట్ బోర్డు రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో విశ్రాంతి రోజును కూడా షెడ్యూలులో చేర్చింది.దీంతో లంక క్రికెటర్లంతా వారి వారి సొంత ఊర్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసి అధ్యక్ష ఎన్నికల్లో భాగం చేసింది. లంక టీమ్‌లో కామెందు మెండిస్ ఒక్కటే గాలేకు చెందినవాడు. అతను స్థానికంగానే తన ఓటు హక్కు వినియోగించుకోనుండగా...మిగతావారంతా స్వస్థలాలకు పయనమయ్యారు. రీ షెడ్యూల్ చేయలేరా! ఇదంతా ఎందుకు తొలిటెస్టును రీ షెడ్యూల్ చేస్తే పోలా... అనే ఉచిత సలహాలెన్నో వస్తాయి. కానీ ఈ ద్వైపాక్షకి సిరీస్‌కు సంబంధించిన షెడ్యూలు చాలా ముందుగా ఖరారైంది. న్యూజిలాండ్ కూడా బిజీ షెడ్యూలుతోనే ఉపఖండం పర్యటనకు వచ్చింది.లంక కంటే ముందు అఫ్ఘానిస్తాన్‌కు సంబంధించి భారత్‌లో ఏకైక టెస్టు కోసం నోయిడాకు వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్ వర్షార్పణమైంది. లంక పర్యటన తర్వాత కివీస్ తిరిగి భారత్‌కు వెళ్లి మూడు టెస్టుల సిరీస్‌లో ఆడాల్సివుంది. ఇలాంటి పరిస్థితుల్లో లంకలో టెస్టును రీషెడ్యూల్ చేయడం అసాధ్యం కాబట్టే మధ్యలో విశ్రాంతి రోజు ఇచ్చారు. క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ మధ్యలో ఇలా రెస్ట్ ఇవ్వడం ఇదే కొత్తకాదు. 1990 కంటే పూర్వం టెస్టుల్లో తరచూ విశ్రాంతి రోజులుండేవి. ఆ తర్వాత చాలా ఏళ్లు తెరమరుగైన ‘రెస్ట్ డే’ 2008లో బంగ్లాదేశ్‌లో తెరమీదికొచ్చింది. బంగ్లాదేశ్‌లోనే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బంగ్లా, శ్రీలంక టెస్టు మ్యాచ్ మధ్యలో విశ్రాంతి ఇచ్చారు. -
శ్రీలంక తరపున అరంగేట్రం.. ఎవరీ మహ్మద్ సిరాజ్?
శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కల ఎట్టకేలకు నేరవేరింది. కొలంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శ్రీలంక తుది జట్టులో సిరాజ్‌కు చోటు దక్కడంతో తన సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.కాగా భారత్‌తో వన్డేలకు తొలుత ప్రకటించిన లంక ప్రధాన జట్టులో సిరాజ్‌కు ఛాన్స్ లభించలేదు. అయితే తొలి వన్డేకు ముందు గాయపడిన యువ పేసర్ మతీషా పతిరాన స్ధానంలో షిరాజ్ లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో షిరాజ్ గరుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ మహ్మద్ సిరాజ్?29 ఏళ్ల షిరాజ్ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. కోల్ట్స్ క్రికెట్ క్లబ్(కొలంబో) తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సిరాజ్.. ప్రస్తుతం కాండీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం కురునెగల జట్టు తరపున షిరాజ్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు 47 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 7.52 సగటుతో 80 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో సిరాజ్ 49 మ్యాచ్‌లలో 125 వికెట్లు సాధించాడు. అతడి ఎకానమీ రేటు కూడా 3.65గా ఉంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండడంతో సెలక్టర్ల దృష్టిలో షిరాజ్ పడ్డాడు. ఈ క్రమంలోనే భారత్‌తో వన్డే సిరీస్‌కు అతడికి లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు. షిరాజ్‌కు బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. -
శ్రీలంక మాజీ కెప్టెన్ దారుణ హత్య
శ్రీలంక మాజీ క్రికెటర్ ధమిక నిరోషన దారుణ హత్యకు గురయ్యాడు. ధమిక నివాసంలోకి చొరబడ్డ ఓ దుండగుడు అతడిని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.అయితే, ధమిక హత్యకు గల కారణాలు మాత్రం వెల్లడికాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు శ్రీలంక మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా అండర్-19 స్థాయిలో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు ధమిక. దేశంలోని ఉత్తమ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరొందిన ధమిక ఏంజెలో మాథ్యూస్, ఉపుల్ తరంగలతో కలిసి క్రికెట్ ఆడాడు.20 ఏళ్ల వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలుఅయితే, అనూహ్యంగా 20 ఏళ్ల వయసులోనే అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కాగా 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేసిన ధమిక నిరోషన.. రెండేళ్లపాటు దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.అండర్-19 స్థాయిలో టెస్టులు, వన్డేలు ఆడాడు. ఇక తన కెరీర్లో 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ధమిక నిరోషన.. 8 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో భాగమయ్యాడు. కుడిచేతి వాటం బ్యాటర్, రైటార్మ్ పేసర్ అయిన ఈ లంక క్రికెటర్ 2001- 2004 మధ్య గాలే క్రికెట్ క్లబ్‌కు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 300కు పైగా పరుగులు చేశాడు.అంతేకాదు 19 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా గుర్తుతెలియని దుండగుడు.. 41 ఏళ్ల ధమిక నిరోషనను అతడి భార్యాపిల్లల ముందే కాల్చి చంపినట్లు తాజా సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే.. జూలై 27న శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానున్న విషయం తెలిసిందే. -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ
మహిళల టీ20 ఆసియా కప్-2024కు శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. జూలై 19న దంబుల్లా వేదికగా యూఏఈ - నేపాల్ మహిళల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది.టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని శ్రీలంక క్రికెట్ నిర్ణయించింది. "మహిళల ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నందకు చాలా సంతోషంగా ఉంది. మహిళల క్రికెట్ ఆదరణ పెంచేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నామని శ్రీలంక క్రికెట్ వైస్ ప్రెసిడెంట్ రవిన్ విక్రమరత్నే తెలిపారు. ఈయనే ఆసియాకప్ టోర్నమెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.ఇక ఆసియా సింహాల పోరులో భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో జూలై 19న దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక క్రికెట్ ఉచిత ప్రవేశం కల్పించడంతో పెద్ద ఎత్తున ఇరు జట్ల ఫ్యాన్స్ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు తరలి రానున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్ ఉండగా.. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్,మలేషియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. ఇక ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఆసియాకప్‌కు భారత మహిళల జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్ -
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.పతిరానా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకునేందుకు స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సీఎస్కే మెనెజ్‌మెంట్ ధ్రువీకరించింది.టీ20 వరల్డ్‌కప్ సమయం దగ్గరపడుతుండడంతో ముందు జాగ్రత్తగా పతిరానాను శ్రీలంక క్రికెట్ స్వదేశానికి రప్పించింది.ఈ సీజన్లో ఇప్పటి వరకు సీఎస్కే తరుపున పతిరానా ఆరు మ్యాచులు ఆడాడు. 7.68 ఎకానమీతో 13 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మన్ సైతం ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు పతిరాన కూడా స్వదేశానికి వెళ్లిపోవడం సీఎస్కేకు నిజంగా బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. -
శ్రీలంక టెస్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్..
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు శ్రీలంక క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ ధనంజయ డి సిల్వాను శ్రీలంక క్రికెట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. టెస్టుల్లో శ్రీలంక జట్టుకు సారథ్యం వహించనున్న 18 ఆటగాడిగా డి సిల్వా నిలిచాడు. దిముత్ కరుణరత్నే స్ధానాన్ని ధనంజయ భర్తీ చేయనున్నాడు. కాగా గతేడాది జాలైలో పాకిస్తాన్ టెస్టు సిరీస్ అనంతరం దిముత్ కరుణరత్నే శ్రీలంక కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను ధనంజయ డి సిల్వాకు శ్రీలంక క్రికెట్ అప్పగించింది. అదే విధంగా అతడికి డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ వ్యవహరించనున్నాడు. కాగా ఈ నెలఖారులో అఫ్గాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక కొత్త కెప్టెన్‌గా ఎంపికైన ధనంజయ డి సిల్వా 51 టెస్టుల్లో 39.77 సగటుతో 3,301 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 10 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా టెస్టుల్లో అతడికి 34 వికెట్లు కూడా ఉన్నాయి. కాగా ఇటీవలే వన్డే, టీ20లకు ఇద్దరూ వేర్వేరు కెప్టెన్లను శ్రీలంక క్రికెట్ నియమించింది. జింబాబ్వేతో వైట్‌బాల్ సిరీస్ నేపథ్యంలో తమ జట్టు టీ20 కెప్టెన్‌గా వనిందు హసరంగా, వన్డే కెప్టెన్‌గా కుశాల్ మెండిస్‌ను ఉపుల్ తరంగా నేతృత్వంలోని లంక సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. చదవండి: IND vs SA 2nd Test: చరిత్ర సృష్టించిన కేప్ టౌన్ టెస్టు.. 134 ఏళ్ల రికార్డు బద్దలు -
శ్రీలంక నూతన కెప్టెన్‌గా హసరంగ..?
శ్రీలంక టీ20 జట్టు నూతన కెప్టెన్‌గా వనిందు హసరంగ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. లంక క్రికెట్ బోర్డు హసరంగ పేరు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఆ దేశ మీడియా వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. మరోవైపు లంక టెస్ట్ జట్టు కెప్టెన్‌గా దిముత్ కరుణరత్నే కొనసాగుతాడని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టీ20 కెప్టెన్‌ను ప్రకటించేందుకు లంక బోర్డు సోమవారం మరో సమావేశంకానున్నట్లు తెలుస్తుంది. ఆ రోజు హసరంగ పేరును ప్రకటించడం లాంఛనమేనని సమాచారం. హసరంగ.. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ లంక బోర్డు అతనిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా గాయపడి, అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో దుమ్మురేపిన హసరంగ.. గాయం కారణంగా ఆ తర్వాత జరిగిన ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లకు దూరంగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో హసరంగను సన్‌రైజర్స్ హైదరాబాద్ 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. అంతకుముందు ఐపీఎల్ సీజన్ వరకు హసరంగ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించగా.. ఇటీవలే ఆ జట్టు ఇతన్ని వేలానికి వదిలిపెట్టింది. శ్రీలంక తమ తదుపరి సిరీస్‌ను వచ్చే ఏడాది 6 నుంచి స్వదేశంలో ఆడనుంది. సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ల కోసం సోమవారం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కాగా, టీ20ల్లో గతకొంతకాలంగా దసున్ షనక లంక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు ఘోర ప్రదర్శన కనబర్చిన నేపథ్యంలోనే ఆ జట్టులో సమూల ప్రక్షాళన జరుగుతుంది. లంక క్రికెట్లో రాజకీయ పరమైన జోక్యం ఎక్కువ కావడంతో ఐసీసీ ఆ జట్టుపై తాత్కాలిక నిషేధం కూడా విధించింది. -
శ్రీలంక క్రికెట్లో కీలక పరిణామం.. సెలక్షన్ కమిటీ ఛైర్మెన్‌గా మాజీ కెప్టెన్
శ్రీలంక క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయ జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలక్షన్ కమిటీని ఆ దేశ క్రీడా వ్యవహారాల మంత్రి హరీన్ ఫెర్నాండో ఏర్పాటు చేశారు. కొత్త కమిటీ నియామకం తక్షణమే అమలు వస్తోందని ఫెర్నాండో బుదవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ సెలక్షన్ కమిటీకి శ్రీలంక మాజీ వన్డే కెప్టెన్ ఉపుల్ తరంగ చైర్మెన్‌గా ఎంపికయ్యాడు. ఈ కమిటీలో తరంగతో పాటు మాజీ ఆటగాళ్లు అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా సభ్యులుగా ఉన్నారు. ఉపుల్ తరంగ నేతృత్వంలోని ఈ సెలక్షన్ కమిటీ రెండేళ్ల పాటు శ్రీలంక జట్టు ఎంపికలో కీలకం కానుంది. జనవరిలో స్వదేశంలో జింబాబ్వేతో జరిగే సిరీస్‌కు జట్టు ఎంపికతో లంక కొత్త సెలక్షన్ కమిటీ ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా శ్రీలంక క్రికెట్లో ఉపుల్ తరంగాకు ప్రత్యేకమైన స్ధానం ఉంది. ఓపెనర్‌గా తన జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఓవరాల్‌గా తరంగ మూడు ఫార్మాట్లలో శ్రీలంక తరపున 9వేలకు పైగా పరుగలు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబరిచింది. దీంతో ఆ దేశ క్రీడల శాఖ మంత్రి లంక క్రికెట్ బోర్డును రద్దు చేశారు. అయితే స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న క్రికెట్ బోర్డు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని ఐసీసీ సస్పెండ్ చేసింది. అనంతరం ఐసీసీ లంక క్రికెట్ పై కొన్ని ఆంక్షలను సడలించడంతో ఆ జట్టు యధావిధిగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు గ్రీన్ సిగ్నిల్ లభించింది. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై? -
భారత జట్టు శ్రీలంక పర్యటన.. ఎప్పుడంటే?
టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. వచ్చే ఏడాది జూలైలో వైట్ బాల్ సిరీస్ కోసం శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. తమ జాతీయ జట్టు వచ్చే ఏడాది ఫ్యూచర్ టూర్ పొగ్రామ్‌ను శ్రీలంక క్రికెట్ బుదవారం ప్రకటించింది. ఇందులో భాగంగానే భారత పర్యటను సంబంధించిన వివరాలను శ్రీలంక క్రికెట్ వెల్లడించింది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో మూడు టీ20లు, వన్డే సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఇక వచ్చే ఏడాదిలో శ్రీలంక మొత్తం 52 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 10 టెస్టులు, 21 వన్డేలు, 21 టీ20లు ఉన్నాయి. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా శ్రీలంక ఆడనుంది. జనవరిలో స్వదేశంలో జింబాబ్వేతో సిరీస్‌తో శ్రీలంక క్రికెట్ జట్టు తమ కొత్త ఏడాదిని మొదలపెట్టనుంది. కాగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ వెస్టిండీస్, అమెరికా వేదికలగా జరగనుంది. Sri Lanka Men’s 2024 Future Tours Program Announced! 📢 The Sri Lanka National Team will commence its 2024 international cricket calendar with a home series against Zimbabwe in January, which will consist of three ODIs and three T20i series. It would be followed by a series… pic.twitter.com/6BRRUCNhCs — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 29, 2023 -
శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని మృతి.. సంతాపం తెలిపిన దిగ్గజ క్రికెటర్లు
శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అందరూ అబేశేఖరను ముద్దుగా "అంకుల్ పెర్సీ" అని పిలుచుకునేవారు. శ్రీలంక జట్టు ఎక్కడ ఆడిన ఆయన స్టేడియంకు వచ్చి సపోర్ట్ చేసేవాడు. 1979 ప్రపంచ కప్ నంచి తన జట్టును ఉత్సాహపరిస్తూ అబేశేఖర వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత స్టేడియాల్లో అంకుల్ పెర్సీ శ్రీలంక జాతీయ జెండాను రెపరెపలాడించేవారు. గతేడాది వరకు జట్టుతోనే కలిసి ప్రయాణం చేసిన అంకుల్ పెర్సీ.. అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమతయ్యారు. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో వైద్య ఖర్చుల కోసం రూ.50 లక్షల చెక్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు అబేశేఖరకు అందించింది. అదే విధంగా ఈ ఏడాది ఆసియాకప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అబేశేఖరను తన నివాసంలో కలిశారు. కాగా ఆయన మృతిపట్ల శ్రీలంక దిగ్గజాలు సనత్ జయసూర్య, రస్సెల్ ఆర్నాల్డ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. చదవండి: World Cup 2023: పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం.. బాబర్ ఆజం ప్రైవేట్ వాట్సాప్ చాట్ లీక్ RIP #unclepercy 😞😞😞 pic.twitter.com/yhXNKoTacD — Russel Arnold (@RusselArnold69) October 30, 2023 -
శ్రీలంక క్రికెటర్‌పై నిషేధం ఎత్తివేత.. జట్టులోకి రీ ఎంట్రీ!
శ్రీలంక స్టార్ క్రికెట్ దనుష్క గుణతిలకపై ఆదేశ క్రికెట్ బోర్డు నిషేధాన్ని ఎత్తివేసింది. అత్యాచార వేధింపుల కేసులో గుణతిలక నిర్దోషిగా తేలడంతో శ్రీలంక క్రికెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆడిన శ్రీలంక జట్టులో గుణతిలక సభ్యునిగా ఉన్నాడు. అయితే ఈ టోర్నీలో గుణతిలక కేవలం నమీబియాతో జరిగిన మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో గుణతిలకపై అత్యాచార వేధింపుల కేసు నమోదు అయింది. తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఓ 29 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అతడని జట్టు నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ జిల్లా కోర్టులో కేసు నడుస్తోంది. అయితే తాజాగా అతడిపై చేసిన ఆరోపణలన్నింటినీ న్యూ సౌత్ వేల్స్ కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక క్రికెట్ అతడిపై బ్యాన్‌ను ఎత్తివేసింది. ఈ మేరకు.. ఆస్ట్రేలియాలో దనుష్క గుణతిలకపై వేసిన నేరారోపణలను దర్యాప్తు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు స్వతంత్ర విచారణ కమిటీ.. గుణతిలకపై విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని సిఫార్సు చేసింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అతడిని నిర్దోషిగా తేల్చింది. దీంతో ఇప్పుడు అతడు మళ్లీ జట్టులోకి తిరిగి రావచ్చు అని శ్రీలంక క్రికెట్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి: Ind Vs Aus T20I: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. వైజాగ్‌లో ఈసారి వేరే లెవల్! -
Muttiah Muralitharan: నా జీవితమే సినిమాలా ఉంటుంది
‘‘నా బయోపిక్‌గా ‘800’ అనుకున్నప్పుడు స్క్రిప్ట్ నాలుగైదుసార్లు చదివా. ఇందులో ఎటువంటి మసాలా ఉండకూడదనే విషయాన్ని దర్శక–నిర్మాతలకు ముందుగానే చెప్పాను. నిజమైన కథ లేకపోతే అది బయోపిక్ కాదు. నా జీవితమే సినిమాలా ఉంటుంది. నా జీవితంలో ఎత్తుపల్లాలు ఎలా అయితే ఉన్నాయో.. ‘800’ విడుదల వెనక అలాగే ఎత్తుపల్లాలు ఉన్నాయి’’ అని శ్రీలంక ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ అన్నారు. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మించింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ముత్తయ్య మురళీధరన్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► మీ బయోపిక్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? నా జీవితాన్ని సినిమాగా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీలంక ప్రజలకు సహాయం చేయడం కోసం 20 ఏళ్ల క్రితం ఓ ఫౌండేషన్ స్థాపించి, ఎంతో మందికి సాయం అందించాం. శ్రీలంకలోని తమిళ ప్రజలకు సాయం చేయడానికి దర్శకుడు వెంకట్ ప్రభు 2008లో వచ్చారు. ఆయనతో పాటు ‘800’ చిత్రదర్శకుడు శ్రీపతి, ఇంకో ఇద్దరు ఉన్నారు. నా వైఫ్ మదిమలర్, వెంకట్ ప్రభు చిన్ననాటి స్నేహితులు కావడంతో మమ్మల్ని కలిశారు. నా ట్రోఫీలు, సాధించిన ఘనతలు చూసి నా బయోపిక్ తీద్దామంటే ముందు వద్దన్నాను.. ఆ తర్వాత సరే అన్నాను. అప్పుడు శ్రీపతిని కథ రాయమని వెంకట్ ప్రభు చెప్పారు. ► బయోపిక్ అంటే ఫిక్షన్ జోడిస్తారు కదా.. నో ఫిక్షన్. ఈ సినిమాలో క్రికెట్ 20 శాతమే ఉంటుంది. మిగతా 80 శాతం నా జీవితం ఉంటుంది. నా జర్నీ, నేను ఇన్ని ఘనతలు సాధించిన క్రమంలో నా కుటుంబం, దేశం ఎదుర్కొన్న పరిస్థితులు ‘800’లో చూపించాం. నా బాల్యం, సెలెక్టర్లు నన్ను ఎందుకు ఎంపిక చేశారు వంటివి ఎవరికీ తెలియవు. ఆ విషయాలు సినిమాలో ఉంటాయి. ► ‘800’ సినిమా రషెస్ చూశారా? మీ పాత్రకు మధుర్ మిట్టల్ ఎంత వరకు న్యాయం చేశారు? రషెస్ కంటే మూవీ చూడాలనుకున్నాను. అందుకే చూడలేదు. నేను పెద్ద సినిమా అభిమానిని. ఇండియన్ సినిమాలను మిస్ కాను. మధుర్ మిట్టల్‌ని రెండుసార్లు కలిశా. ‘800’ టీజర్, ట్రైలర్ చూశాను. నాలాగా, లుక్స్ పరంగా 70 శాతం మ్యాచ్ అయ్యాడు. ► ‘800’ షూటింగ్‌కి వెళ్లలేదా? ఒక్కసారి మాత్రమే వెళ్లాను. సినిమా నిర్మాణం గురించి నాకేమీ తెలియదు. అది కష్టమైన కళ. కొన్నిసార్లు నిర్మాతలను చూస్తే బాధగా ఉంటుంది. నటీనటులతో పాటు అందరికీ డబ్బులు ఇస్తారు. ఒకవేళ సినిమా ఆడకపోతే నిర్మాతల డబ్బులే పోతాయి కదా. ► సినిమా హిట్ కావచ్చు, ఫ్లాప్ అవ్వొచ్చు. అందుకే చాలామంది క్రికెటర్లు తమ బయోపిక్ తీయాలని కోరుకోరు.. సినిమా విజయంలో చాలా అంశాలు ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయితే నా లెగసీ ఏమీ పడిపోదు. నా లెగసీ క్రికెట్. నిజంగా జరిగిన కథను ప్రజలకు చెప్పాలని మేం చేసిన ప్రయత్నం ‘800’. అది కొందరికి నచ్చవచ్చు.. మరికొందరికి నచ్చకపోవచ్చు. ఇదొక మంచి సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ► శ్రీలంకలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. శ్రీలంకన్ సింహళ భాషలోనూ రిలీజ్ చేస్తున్నాం. ► తెలుగు సినిమాలు చూస్తారా? శ్రీలంకలో తమిళ, హిందీ చిత్రాలు రిలీజవుతాయి. ఆ భాషల్లో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తా. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప’ సినిమాలను హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయడంతో చూశా. శ్రీలంకలో బాలీవుడ్ మూవీస్ ఫేమస్. ఇప్పుడు తెలుగు సినిమా టాప్ పొజిషన్‌కు చేరుకుంది. ► మీకు ఇష్టమైన తెలుగు నటుడు ఎవరు? ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో సూపర్ హీరోస్, స్టార్ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారు. నేను నాని సినిమాలు ఎక్కువ చూశా. ‘ఈగ’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు బాగున్నాయి. ► మీ బయోపిక్ విడుదలవుతోంది. టెన్షన్ ఏమైనా? ఎందుకు టెన్షన్ పడాలి? నేను వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంటే టెన్షన్ పడాలి (నవ్వుతూ). ► త్వరలో వరల్డ్ కప్ మొదలవుతోంది. మీ ఫేవరేట్ టీమ్? శ్రీలంక మాత్రమే నా ఫేవరెట్. అయితే ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం. -
దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న సూపర్ సిక్స్‌లో శుక్రవారం రెండో మ్యాచ్‌లో లంక తడబడింది. నెదర్లాండ్స్ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో ధనుంజయ డిసిల్వా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికి వన్డేల్లో కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. అతనికి అండగా వనిందు హసరంగా 20, మహీశ్ తీక్షణ 28 పరుగులు చేశారు. ఓపెనర్ కరుణరత్నే 33 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్, బాస్ డీ లీడేలు చెరో మూడు వికెట్లు తీయగా.. సాబిక్ జుల్పికర్ రెండు, రియాన్ క్లెయిన్, ఆర్యన్ దత్‌లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: రంపం మెషిన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్ స్నూకర్ 'ఇదేం పాడు పని'.. వైరలవుతున్న లబుషేన్ చర్య -
ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేట్ పాపం ఇప్పుడు మాత్రం బస్ కండక్టర్
-
స్టార్ ఆల్‌రౌండర్‌కు ఊహించని షాక్.. ఏడాది పాటు నిషేధం
శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ చమికా కరుణరత్నేపై శ్రీలంక క్రికెట్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బోర్డుకు సంబంధించిన పలు అగ్రిమెంట్లను కరుణరత్నే ఉల్లంఘించాడు. దీనిపై విచారణ జరిపేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది. అయితే కమిటీ విచారణలో నిబంధనలను ఉల్లంఘించినట్లు కరుణరత్నే అంగీకరించాడు. దీంతో ఏడాది పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా అతడిపై లంక క్రికెట్ బోర్డు వేటు వేసింది. అతడిపై నిషేదం విధించడమే కాకుండా 5000 వేల డాలర్ల( భారత కరన్సీ ప్రకారం రూ. 4లక్షలు) జరిమానా కూడా విధించింది. "టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా కరుణరత్నే బోర్డు నిబంధనలను ఉల్లంఘించాడు. అతడి చేసిన తప్పిదాలపై ముగ్గురు సభ్యలతో కూడిన విచారణ కమిటీని వేశాం. కమిటీ విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. అతడు ఇటువంటి తప్పిదాలకు మరోసారి పాల్పడకుండా గట్టిగా హెచ్చరించాలని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. దీంతో అతడిపై ఏడాది పాటు అన్ని రకాల క్రికెట్ ఆడకుండా కమిటీ నిషేదం విధించింది. అదే విధంగా 5000 వేల డాలర్ల ఫైన్ కూడా ఫైన్ కూడా చెల్లించాలంటూ అంటూ" శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసియాకప్-2022ను శ్రీలంక కైవసం చేసుకోవడంలో కరుణరత్నే కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఆఫ్గానిస్తాన్‌తో తొలి వన్డేకు ముందు లంక క్రికెట్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. ఎక్స్‌ప్రెస్ పేసర్ ఎంట్రీ! సంజూ కూడా -
మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్, రక్షణ కూడా లేకుండా అమానుషంగా
టీ20 వరల్డ్‌కప్-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లి, అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టై బెయిల్ కూడా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుణతిలకకు.. సిడ్నీ పోలీసులు కోర్టుకు అందించిన నివేదిక కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడే క్రమంలో గుణతిలక మృగంలా ప్రవర్తించాడని, పలు మార్లు రక్షణ కూడా లేకుండా బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. బాధితురాలు తిరగబడే సరికి సహనం కోల్పోయిన గుణతిలక.. గొంతు నులిమి, ఊపిరి ఆడనీయకుండా చేశాడని, అలాగే తలను గోడకేసి పలు మార్లు గట్టిగా బాదాడని కోర్టుకు వివరించారు. బాధితురాలు అందించిన సమాచారం మేరకే తాము నివేదికను తయారు చేసి కోర్టులో సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుణతిలక దోషిగా తేలితే 14 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశముందని అన్నారు. ఇదిలా ఉంటే, 31 గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఇదివరకే సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా నిషేధం విధించింది. కాగా, టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక సూపర్ 12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
శ్రీలంక క్రికెట్ కీలక నిర్ణయం.. టీ20 లీగ్ వాయిదా..!
శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల దృష్ట్యా ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్‌ని వాయిదా వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. "ఆగస్టు 1 నుంచి 21 వరకు జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ 2022ను తాత్కాలికంగా వాయిదా వేశాం. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది అని" శ్రీలంక క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. శ్రీలంక-పాకిస్తాన్ రెండో టెస్టు వేదిక మార్పు శ్రీలంక-పాకిస్థాన్ రెండో టెస్టు వేదికను శ్రీలంక క్రికెట్ మార్పు చేసింది. కొలంబో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ గాలెలో జరగనుంది. శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తల మధ్య ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పాక్-లంక మధ్య తొలి టెస్టు ప్రస్తుతం గాలే వేదికగానే జరుగుతోంది. కాబట్టి రెండో టెస్టు కూడా అక్కడే నిర్వహించడం సురక్షితమని శ్రీలంక క్రికెట్ భావించినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ కూడా కష్టమే శ్రీలంక వేదికగా ఈ ఏడాది ఆగస్టులో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న ఆర్ధిక, రాజకీయ సంక్షోబాల మధ్య శ్రీలంకలో ఆసియా కప్ జరిగేలా లేదు. ఆసియా కప్‌ను శ్రీలంక నుంచి యూఏఈ కు తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) భావిస్తున్నట్లు సమాచారం. ఇక జూలై 27న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యలు సమావేశం కానున్నారు. అనంతరం టోర్నీ షెడ్యూల్, వేదిక మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. Sri Lanka Cricket (SLC) wishes to announce that the Lanka Premier League 2022, which was scheduled to be held from 1st to 21st August, 2022 will be postponed, with immediate effect. #LPL2022https://t.co/Gb6yg3LK7k — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 17, 2022 చదవండి: Asia Cup 2022: శ్రీలంకలో కష్టమే.. యూఏఈ వేదికగా ఆసియా కప్..! -
లంక క్రికెటర్‌ను చుట్టుముట్టిన కష్టాలు.. రెండురోజుల పాటు
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.తినడానికి సరైన తిండి దొరక్క అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆర్ధిక సంక్షోభానికి.. రాజకీయ సంక్షోభం కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. లంక అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆ దేశ ప్రజలు ప్రెసిడెన్షియల్ భవనాన్ని ముట్టడించారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ముందుగా మాల్దీవులు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్న ఆయన అక్కడి నుంచి తన రాజీనామా పత్రాన్ని ఈమెయిల్ ద్వారా పంపించారు. కాగా తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇదిలా ఉంటే దేశంలో నిత్యవసరాలు సహా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్ కోసం రోజుల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. తాజాగా ఆ ప్రభావం లంక క్రికెటర్లపై కూడా పడింది. దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకక.. ఎందరో ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్నారు.గ్రౌండ్ వరకు వెళ్లాలంటే రవాణావ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి దారుణమైన పరిస్థితిని శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు రెండు రోజుల పాటు క్యూలో నిల్చున్న కరుణరత్నే పెట్రోల్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఏఎన్ఐ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరుణరత్నే మాట్లాడుతూ.. ''దొరికిన పది వేల రూపాయల పెట్రోల్ తో రెండు మూడు రోజుల వరకు ప్రాక్టీస్‌కు వెళ్లాలి. దేశంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే బాధ కలుగుతుంది. దేశానికి అండగా నిలబడుతూనే మా ఆటపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. గొటబాయ రాజపక్స రాజీనామా తర్వాతైనా లంకకు అధ్యక్షుడిగా మంచి వ్యక్తులు వస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే అంతా సర్దుకుంటుందని.. శ్రీలంక ప్రజలకు కచ్చితంగా మంచి జరుగుతుందని'' ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఆసియా కప్ 2022కు శ్రీలంకనే ఆతిధ్యం ఇవ్వనుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను లంక క్రికెటర్లను కలవరపెడుతోంది. ఆసియా కప్ లో రాణించాలంటే కనీస ప్రాక్టీస్ ఎంతో అవసరం. అయితే లంక క్రికెటర్లు చాలా మంది కూడా పెట్రోల్, డీజిల్ కొరతతో గ్రౌండ్ లకు వెళ్లి ప్రాక్టీస్ కూడా చేయలేకపోతున్నారు. మరి ఆసియా కప్ వేదికను ఐసీసీ మారుస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే మ్యాచ్ లు జరిగే సమయంలో ఆటగాళ్లను మైదానాలకు తీసుకెళ్లడం.. హోటల్ కు తీసుకురావడం కోసం ఎంతగానో చమురు అవసరం పడుతుంది. శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ముదిరి పాకానా పడ్డప్పటికి గత నెలలో ఆస్ట్రేలియా జట్టు లంక పర్యటనకు వచ్చింది. కష్టాల్లో ఉన్న లంకతో సిరీస్ ఆడి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొంది. టి20 సిరీస్ ను ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్ ను శ్రీలంక గెలుచుకుంది. రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్‌లో మాత్రం ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి డ్రా చేసుకున్నాయి. ఇక కరుణరత్నే 2019లో అంతర్జాతీయ క్రికెట్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఒక టెస్టు మ్యాచ్ తో పాటు 18 వన్డే, 25 టీట్వంటీ మ్యాచ్ లు ఆడాడు. #WATCH | Sri Lankan cricketer Chamika Karunaratne speaks to ANI; says, "We've to go for practices in Colombo&to different other places as club cricket season is on but I've been standing in queue for fuel for past 2 days. I got it filled for Rs 10,000 which will last 2-3 days..." pic.twitter.com/MkLyPQSNbZ — ANI (@ANI) July 16, 2022 చదవండి: Gotabaya Rajapaksa: అందుకోసం శతవిధాల ప్రయత్నం చేశా: గొటబయ Virat Kohli: సెంచరీ కోసం కోహ్లి కూడా ఇంతలా తపించి ఉండడు.. -
శ్రీలంక ఆటగాడిపై క్రమశిక్షణా చర్యలు.. వెంటనే తిరిగి రావాలని..!
శ్రీలంక యువ ఆటగాడు కమిల్ మిషారాపై ఆ దేశ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టులో మిషారా భాగమై ఉన్నాడు. అయితే రెండు టెస్టులోను అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. కాగా శ్రీలంక జట్టు బస చేస్తున్న హోటల్ మిషారా గదిలో ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నట్లు తెలుస్తుంది. తద్వారా ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించనందకుకు తక్షణమే అతడు స్వదేశానికి తిరిగి రావాలని శ్రీలంక క్రికెట్ ఆదేశించింది. "మేము హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరీశీలించాం. మేము చూసిన వాటిపై మేము అతడిని విచారించాలి అనుకుంటున్నాము" అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 21 ఏళ్ల కమిల్ మిషారా ఇప్పటి వరకు మూడు టీ20లు మాత్రమే ఆడాడు. ఇక బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య తొలి టెస్ట్ డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఛాటోగ్రామ్ వేదికగా జరగుతోన్న నిర్ణయాత్మక రెండు టెస్టులో ఇరు జట్లు తలపడతున్నాయి చదవండి:Shubman Gill: గిల్ గురించి మీరు మాట్లాడేది తప్పు: జర్నలిస్టుకు విక్రమ్ కౌంటర్ -
'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది'
శ్రీలంక సంక్షోభం తారాస్థాయికి చేరి హింసాత్మకంగా మారడంపై ఆ దేశ తాజా, మాజీ క్రికెటర్లు స్పందించారు. దేశం ఇంత దుర్భర స్థితికి చేరుకోవడానికి కారణం ప్రభుత్వమేనంటూ దిగ్గజ క్రికెటర్లు మహేళ జయవర్దనే, కుమార సంగక్కరతో పాటు ప్రముఖ క్రికెటర్లు వనిందు హసరంగా, నిరోషన్ డిక్వెల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక సంక్షోభంపై ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్దనే స్పందింస్తూ.. తమ ప్రాథమిక అవసరాలు, హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న శాంతియుత నిరసనకారులపైకి ప్రభుత్వ మద్దతుతో దుండగులు, గూండాలు దాడి చేయడం చూస్తుంటే అసహ్యమేస్తోందని తెలిపాడు. దీంతోపాటు ఒక వీడియోను ట్వీట్ చేశాడు. అందులో కొంతమంది కలిసి ఓ మహిళపై దాడిచేస్తున్నారు.‘‘పోలీసుల ముందే నిరసన చేస్తున్న మహిళలను ఎలా కొడుతున్నారో చూడండి.. సిగ్గు చేటు’’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై రాజపక్స కుటుంబ సభ్యుల మద్దతుదారులు దాడిచేయడం బాధాకరమని పేర్కొన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్ సంగక్కర మాట్లాడుతూ.. ఈ హింస వెనుక ప్రభుత్వం ఉందని.. ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిగిన హింస అని ఆరోపించాడు లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ కూడా ప్రభుత్వ తీరుపై మండిపడ్డాడు. అమయాక, శాంతియుత నిరసనకారులపై జరిగిన దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించాడు. మన దేశాన్ని ఇలాంటి నాయకత్వం నడిపిస్తోందా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం ఏకమై అందరి పక్షాన ఉంటానని హామీ ఇచ్చాడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అమాయక ప్రజలపై దాడులు జరగడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్వెల్లా పేర్కొన్నాడు. శ్రీలంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చడం.. ఫలితంగా చెలరేగిన రాజకీయ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, 200 మందికిపైగా గాయపడ్డారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. చదవండి: ఉపేక్షించొద్దు.. అలాంటి వాళ్లను కాల్చేయండి: శ్రీలంకలో తీవ్ర హెచ్చరికలు Mumbai Indians: ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్‌ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే! -
శ్రీలంకలో ఎమర్జెన్సీ.. నిరసనకారులకు మద్దతు తెలుపుతున్న క్రికెటర్లు
Top Sri Lanka Cricketers Back Anti Government Protests: ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్లు, ఐపీఎల్ 2022 సీజన్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాళ్లు, హెడ్ కోచ్‌లు గళం విప్పారు. తమ దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడానికి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కడానికి శ్రీలంక ప్రభుత్వ తీరే కారణమని వారు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకుని ఈ దుర్భర పరిస్థితులకు కారణమయ్యారని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. లంకలో ఎమర్జెన్సీ విధించడం.. కఠినమైన కర్ఫ్యూ చట్టాలను అమలుచేయడం చూస్తుంటే చాలా బాధగా ఉందని వాపోయాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం.. వారి బాగోగులను గాలికొదిలేసి, నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమని అన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాడుతున్న న్యాయవాదులు, విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. జయవర్ధనేతో పాటు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర, పంజాబ్ కింగ్స్ ఆటగాడు భానుక రాజపక్సలు నిరసనకారులకు మద్దతు తెలిపారు. తాను భారత్‌లో ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ తన మనసంతా అక్కడే (శ్రీలంక) ఉందని రాజపక్స ఆవేదన వ్యక్తం చేయగా, నా దేశ ప్రజల దుస్థితి చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందంటూ సంగక్కర వాపోయాడు. సోమవారం కొలొంబోలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సంగక్కర భార్య యహేలి కూడా పాల్గొన్నారు. కాగా, శ్రీలంకలో ఆర్థిక ఎమర్జెన్సీకి తోడు ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో బియ్యం రూ. 220, గోధుమలు రూ. 190, చక్కెర రూ. 240, పాల పౌడర్ రూ. 1,900, కోడి గుడ్డు రూ. 30 వరకు పలుకుతుంది. చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్‌కు లక్నో, గుజరాత్..! -
'వరల్డ్‌కప్ ఉంది.. ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూడడం ఆపండి'
కొలంబొ: క్రికెట్లో మిస్టరీ స్పిన్నర్ అనే పదం చాలాసార్లు వింటుంటాం. ఒక స్పిన్ బౌలర్ బంతిని వేర్వేరు తన చేతితో వివిధ యాంగిల్స్‌లో విడుదల చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కన్ఫ్యూజ్ చేయడమే వీరి పని.. అందుకే ఇలాంటి వారిని మిస్టరీ స్పిన్నర్స్ అంటారు. అజంతా మెండిస్, సునీల్ నరైన్, సయీద్ అజ్మల్.. తాజగా వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్లుగా గుర్తింపు పొందారు. అన్‌ఆర్థడాక్స్ బౌలింగ్ వేరియేషన్‌తో క్యారమ్ బాల్, ఆఫ్ బ్రేక్ బంతులను వేస్తూ బ్యాట్స్మన్లను ముప్పతిప్పలు పెడుతుంటారు. మెండిస్(శ్రీలంక), నరైన్(వెస్టిండీస్) లాంటి ఆటగాళ్లు తమ బౌలింగ్‌తో రెండు మూడేళ్ల పాటు వారి జట్టులో కీలకపాత్ర పోషించారు. తాజాగా మెండిస్ తరహాలోనే శ్రీలంకకు మరో మిస్టరీ స్పిన్నర్ పుట్టుకొచ్చాడు. అతనే మహీష్ తీక్షణ. చదవండి: బీసీసీఐదే తప్పు.. ధోనిని మెంటార్ చేయడం నిరాశపరిచింది దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే ద్వారా శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన తీక్షణ తన మిస్టరీ బౌలింగ్‌తో 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మ్యాచ్‌లో ఎక్కువగా క్యారమ్ బాల్స్, ఆఫ్ బ్రేక్ బంతులతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన తీక్షణ ఫలితాన్ని రాబట్టాడు. ఈ నేపథ్యంలో తీక్షణ బౌలింగ్ వేరియేషన్స్‌పై ఇంప్రెస్ అయిన ఒక అభిమాని అతని బౌలింగ్ యాక్షన్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. ''తీక్షణ బౌలింగ్ చూస్తుంటే అతని చేతిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక క్యారమ్ బాల్ వేయడానికి మణికట్టును విభిన్న శైలిలో చూపించాడు. మన కాళ్లను ఎలా షేక్ చేస్తామో.. తీక్షణ తన చేతులను అలా చేస్తున్నాడు. అతని బౌలింగ్‌కు బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడడం ఖాయం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన శ్రీలంక ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ అభిమానికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ''నీ అనాలిసిస్‌కు కృతజ్ఞతలు.. ముందు మాకు వరల్డ్ కప్ ఉంది.. దయచేసి ప్రతీ విషయాన్ని భూతద్ధంలో చూడడం ఆపండి'' అంటూ కామెంట్ చేశాడు. చదవండి: SL Vs SA: త్రో దెబ్బకు రనౌట్.. స్టంప్ మైక్ ఊడి వచ్చింది కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మహీష్ తీక్షణ శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. అయితే లంక మొదట క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 17న నుంచి ఒమన్ వేదికగా జరగనున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో పాల్గొననుంది. -
ఆటకు గుడ్‌బై ప్రకటించిన లంక స్టార్ క్రికెటర్
కొలంబో: శ్రీలంక స్టార్ క్రికెటర్ ఇసురు ఉదాన అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న లంక బోర్డుకు ఉదాన నిర్ణయం షాక్ అనే చెప్పాలి. కాగా ఉదాన ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లాడి ఐదు ఓవర్లు బౌలింగ్ చేసి 39 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతకముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన ఉదానా రెండు ఓవర్లు బౌల్ చేసి 27 పరుగులిచ్చుకున్నాడు. 2009 జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 33 ఏళ్ల ఉదానా 21 వన్డేల్లో 237 పరుగులు.. 18 వికెట్లు, 34 టీ20ల్లో 256 పరుగులతో పాటు 27 వికెట్లు పడగొట్టాడు. 33 ఏళ్ల ఇసురు ఉదాన 2021 టీ20 వరల్డ్‌కప్ జట్టులో కీలకంగా మారతాడని లంక బోర్డు భావించింది. సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన శ్రీలంక జట్టు, గ్రూప్ స్టేజ్‌లో ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఆడనుంది. గ్రూప్ మ్యాచుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. ఇక గత సీజన్లో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన ఇసురు ఉదాన 2020 సీజన్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన ఒకే ఒక్క లంక క్రికెటర్‌గా నిలిచాడు. 2021 మెగా వేలానికి ముందు ఉదానను ఆర్సీబీ రిలీజ్ చేయడం, వేలంలో ఉదానను ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. -
ఆసియా కప్ టి20 టోర్నీ రద్దు
కొలంబో: శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ రద్దయింది. కరోనా నేపథ్యంలో టోర్నీని నిర్వహించే స్థితిలో తాము లేమని శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ యాష్లే డి సిల్వా ప్రకటించారు. వాస్తవానికి ఈ టోర్నీ గత ఏడాది పాకిస్తాన్లో జరగాల్సింది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లో భారత్ పర్యటించే అవకాశం లేకపోవడంతో టోర్నీ వేదికను పాక్ నుంచి శ్రీలంకకు మార్చారు. ఈ టోర్నీలో పాల్గొనాల్సిన అన్ని జట్లు అంతర్జాతీయ క్రికెట్లో రెండేళ్లపాటు బిజీగా ఉండటంతో ఆసియా కప్ 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాత జరిగే అవకాశముంది. ఆసియా కప్‌ను 2016 నుంచి రొటేషన్ పద్ధతిలో వన్డే, టి20 ఫార్మాట్లలో నిర్వహిస్తున్నారు. -
క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. కీలక టోర్నీ రద్దు
కొలంబొ: కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు టోర్నమెంట్లు రద్దయ్యాయి. ఇటీవలే కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో నిర్వహిస్తున్న ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా మరో టోర్నీ చేరింది. శ్రీలంకలో జూన్‌లో జరగాల్సిన ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ రద్దయింది. శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం అసాధ్యమని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యాష్లే డిసిల్వా ప్రకటించారు. రానున్న రెండేళ్లలో చాలా దేశాల క్రికెట్ బోర్డులు షెడ్యూళ్లు సిద్ధం చేసుకున్నందున.. 2023లో వన్డే వరల్డ్ కప్ తర్వాత దీన్ని తదుపరి నిర్వహించాలని డిసిల్వా సూచించారు. వాస్తవానికి ఆసియా కప్ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండేది. కానీ భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు లేకపోవడంతో ఈ టోర్నీని శ్రీలంకకు మార్చారు. అయితే తాజాగా అక్కడ కరోనా కేసులు పెరుగుతుండడంతో 10 రోజుల పాటు అంతర్జాతీయ విమానాలను నిషేధిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: 'పో.. వెళ్లి బౌలింగ్ చేయ్ బ్రో' -
లంక ప్రీమియర్ లీగ్ మళ్లీ వాయిదా
కొలంబో: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) టి20 క్రికెట్ టోర్నీ ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత ఆగస్టు నుంచి నవంబర్ 14కు... అనంతరం 21కు వాయిదా పడ్డ ఎల్పీఎల్... తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆరు రోజులు ఆలస్యంగా నవంబర్ 27న మొదలు కానుంది. ఈ టోర్నీని మూడు వేదికల్లో జరపాలని భావించినా... కరోనా నేపథ్యంలో టోర్నీలో జరిగే మొత్తం 23 మ్యాచ్‌లను ఒకే వేదికలో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఎల్సీ పేర్కొంది. ఇందుకు హంబన్‌తోటను ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది. డిసెంబర్ 17న ఫైనల్ జరగనుంది. ఆటగాళ్లకు విధించే క్వారంటైన్‌ను 14 రోజుల నుంచి 7 రోజులకు కుదించేందుకు శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారులు అంగీకరించారు. అయితే జట్ల సహాయక సిబ్బంది మాత్రం 14 రోజుల క్వారంటైన్‌ను çపూర్తి చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ లీగ్‌లో క్రిస్ గేల్, డు ప్లెసిస్, షాహిద్ అఫ్రిది, కార్లోస్ బ్రాత్‌వైట్ వంటి విదేశీ స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. -
వాళ్లెందుకు అంతగా స్పందిస్తున్నారు?
కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపించిన లంక మాజీ మంత్రి మహిదానంద అలుత్గమగే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ఆరోపణల్లో తాను ఏ క్రికెటర్ గురించీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదని... కుమార సంగక్కర, మహేల జయవర్ధనే ఎందుకు అతిగా స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ‘సర్కస్ మొదలైందని మహేల చెబుతున్నాడు. ఈ విషయంలో వారిద్దరు ఎందుకు ఇంత అతిగా స్పందిస్తున్నారో నాకర్థం కావడం లేదు. పైగా నేను ఏ ఆటగాడి పేరు తీసుకోలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి గతంలోనూ అర్జున రణతుంగ కూడా బహిరంగంగానే మాట్లాడారు. ఇదేమీ మొదటిసారి కాదు’ అని మహిదానంద వ్యాఖ్యానించారు. మరోవైపు తాజా వివాదంపై జయవర్ధనే మళ్లీ స్పందించాడు. ‘ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ మాజీ కెప్టెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణ చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. -
అజంతా మెండిస్ వీడ్కోలు
కొలంబో: పదకొండేళ్ల క్రితం శ్రీలంక గడ్డపై తన తొలి సిరీస్‌లోనే భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను వణికించిన మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్. అతని దెబ్బకు టీమిండియా సిరీస్ కోల్పో యింది. మెండిస్ ‘క్యారమ్’ బంతులు మన బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాయి. ఆరు ఇన్నింగ్స్‌లలో సచిన్, గంగూలీ కనీసం ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేకపోగా, ద్రవిడ్ మాత్రం ఒకే ఒక అర్ధసెంచరీ సాధించాడు! మూడు టెస్టులలో ఏకంగా 26 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. అయితే తర్వాతి రోజుల్లో ఆ మిస్టరీని బ్యాట్స్‌మెన్ ఛేదించిన తర్వాత అతను తేలిపోయాడు. ఒక సాధారణ స్పిన్నర్‌గా మారిపోవడంతో పాటు గాయాల కారణంగా కెరీర్లో వెనుకబడి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. శ్రీలంక తరఫున 2015లో ఆఖరి మ్యాచ్ ఆడిన అజంతా ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. 19 టెస్టుల్లో 34.77 సగటుతో మెండిస్ 70 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 21.86 సగటుతో 152 వికెట్లు తీసిన అతను, 39 టి20 మ్యాచ్‌లలో 66 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మెండిస్ పేరిటే అంతర్జాతీయ టి20ల్లో టాప్–2 బౌలింగ్ ప్రదర్శనలున్నాయి. 2012లో జింబాబ్వేపై 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన అతను... అంతకుముందు ఏడాది ఆసీస్‌పై 16 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. -
ఐపీఎల్లో లసిత్ మలింగ... మనసు మార్చుకున్న లంక బోర్డు
ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే శ్రీలంక పేసర్ లసిత్ మలింగ... దేశవాళీ వన్డే టోర్నీ సూపర్ ప్రొవిన్షియల్ టోర్నీలో ఆడాల్సిందేనంటూ పంతం పట్టిన శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) మనసు మార్చుకుంది. ఐపీఎల్లో ఆడేందుకు మలింగకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తన అధికారిక ట్వీటర్ పేర్కొంది. సూపర్ ప్రొవిన్షియల్ వన్డే టోర్నీలో ఆడటం కన్నా ప్రపంచ అగ్రశ్రేణి క్రికెటర్లు పాల్గొనే ఐపీఎల్లో ఆడితే మలింగకు ఉపకరిస్తుందని బోర్డు ప్రకటించింది. మరోవైపు బీసీసీఐ జోక్యంతోనే శ్రీలంక బోర్డు తన మనసు మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
ఐసీసీ అభియోగాలపై జయసూర్య స్పందన
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య... తాజాగా ఐసీసీ కోడ్ ఉల్లంఘన వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక కోడ్ ఉల్లంఘించాడనే కారణంగా జయసూర్యకు నోటీసులు జారీ చేసింది ఐసీసీ. ఆర్టికల్ 2.4.6 ప్రకారం విచారణకు అందుబాటులో లేకపోవడం, విచారణ అధికారులకు సహకరించకపోవడం, కావల్సిన సమాచారాన్ని, డాక్యుమెంట్లను సమర్పించకపోవడం వంటి ఫిర్యాదులతో పాటు ఆర్టికల్ 2.4.7 ప్రకారం విచారణ ఆలస్యం కావడానికి ప్రత్యేక్షంగా కారణమవ్వడం, ఆధారాలు, సాక్ష్యాలను మాయం చేయడం వంటి రెండు ఆర్టికల్స్ కింద జయసూర్యకు నోటీసులు జారీ చేసింది ఐసీసీ. ఈ ఆరోపణలపై తాజాగా స్పందించాడు జయసూర్య. ‘నా మీద మ్యాచ్ ఫిక్సింగ్, పిచ్ ఫిక్సింగ్ గురించి గానీ లేదా వేరే అవినీతి చేశాననే ఆరోపణలు రాలేదు...కేవలం విచారణకు సహకరించలేదనే ఆరోపణలు మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చిన జయసూర్య.. ‘నా వరకూ నేను ఏ పని చేసిన నియమాల ప్రకారమే నడుచుకున్నాను. కచ్చితంగా ఐసీసీ ప్యానెల్ ముందు సంజాయిషీ చెబుతాను’ అన్నాడు. ‘ఓ సిమ్ కార్డ్ దాచేయడం, మొబైల్ ఫోన్ సమర్పించేందుకు నిరాకరించడం’ వంటి ఆరోపణలు ఈ మాజీ సెలక్టర్‌పై వచ్చాయి. ‘నా ఫోన్లో పర్సనల్ మెసేజీలు, వీడియోలు ఉంటాయి.... అందుకే యాంటీ కరెప్షన్ అధికారులకు మొబైల్ ఇవ్వలేదు...’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు జయసూర్య. ‘ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడకూడదు... ఐసీసీ రూల్స్ ప్రకారం సమాచారం బయటికి చెప్పకూడదు...’ అంటూ సమాధానమిచ్చాడు ఈ మాజీ క్రికెట్ దిగ్గజం. శ్రీలంక దిగ్గజ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సనత్ జయసూర్య... 445 వన్డేలు, 110 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 1996లో లంకజట్టు వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా లంక పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందిస్తున్నాడు. సెలక్టర్స్ ఛైర్మెన్‌గా సేవలందించిన సనత్ జయసూర్య... రెండు వారాల్లోగా తనపై నమోదైన ఆరోపణలకు సమాధానం చెప్పాలని గడువు ఇచ్చిన ఐసీసీ, ఆలోగా అతని దగ్గర్నుంచి సంజాయిషీ రాకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమాల ప్రకారం తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఒకవేళ జయసూర్యపై అభియోగాలు రుజువైతే అతనిపై ఐదేళ్ల పాటు నిషేధం పడే అవకాశం ఉంది. జయసూర్యపై తీవ్ర ఆరోపణలు -
జయసూర్యపై తీవ్ర ఆరోపణలు
దుబాయ్: శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. అవినీతి నిరోధక కోడ్ కింద అతనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండు వేర్వేరు అభియోగాలు నమోదు చేసింది. ఆర్టికల్ 2.4.6 ప్రకారం ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) చేస్తున్న విచారణకు సరిగా సహకరించకపోవడం, కావాల్సిన సమాచారం ఇవ్వకపోవడం ఒకటి కాగా... ఆర్టికల్ 2.4.7 ప్రకారం విచారణను అడ్డుకోవడం లేదా ఆలస్యం చేయడంతో పాటు విచారణకు ఉపయోగపడే సమాచారాన్ని ధ్వంసం చేయడం అనేది రెండో అభియోగం. వీటికి 14 రోజుల్లోగా జయసూర్య సమాధానం ఇవ్వాల్సి ఉంది. లంక స్టార్ క్రికెటర్‌పై ఏ విషయంలో ఇలాంటి అభియోగాలు నమోదు చేయాల్సి వచ్చిందో ఐసీసీ స్పష్టంగా చెప్పలేదు. అయితే గత ఏడాది కాలంగా శ్రీలంక క్రికెట్‌పై ఐసీసీ జరుపుతున్న విచారణను అడ్డుకునే ప్రయత్నం చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. అతని ఫోన్‌ను తమకు అందించాలని కూడా ఏసీయూ కోరగా జయసూర్య దానిపై స్పందించలేదు. 2017 సెప్టెంబర్ వరకు లంక చీఫ్ సెలక్టర్‌గా ఉన్న సమయంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో జయసూర్యకు ఉన్న సంబంధాలపై కూడా విచారణ జరుగుతోంది. 49 ఏళ్ల జయసూర్య ఓపెనర్‌గా పలు రికార్డులు సృష్టించాడు. 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు 1996 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రిటైర్మెంట్ తర్వాత 2010లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు. -
ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరిపై నిషేధం
కొలంబో : ‘ఆల్ జజీరా’ స్టింగ్ ఆపరేషన్‌లో ఫిక్సింగ్ పాల్పడినట్లు ఒప్పుకున్న పిచ్ క్యూరేటర్, గ్రౌండ్స్‌మన్‌పై వేటు వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. నవంబర్‌లో ఇంగ్లండ్‌తో గాలే వేదికగా జరిగే టెస్టు మ్యాచ్ ఫలితం ప్రభావితమయ్యేలా ఫిచ్‌ను సిద్దం చేస్తామని ఈ ఇద్దరు తెలిపినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ఈ ఘటనతో శ్రీలంక క్రికెట్ బోర్డు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. అంతేగాకుండా స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్‌తో ఉలిక్కిపడ్డ అంతర్జాతీయ క్రికెట్ మండలి సైతం దర్యాప్తు చేపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన జర్నలిస్ట్ డేవిడ్ హారిసన్‌తో కొలంబో ఆటగాడు తరిందు మెండీస్, గాలె పిచ్ క్యూరేటర్ తరంగ ఇండికాలు ఫలితాన్ని ప్రభావం చేసేలా పిచ్‌ను సిద్దం చేస్తామని ఒప్పుకున్నారు. గతంలో జరిగిన శ్రీలంక–ఆసీస్, భారత్–లంక టెస్టుల్లో సైతం పిచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు కూడా వెల్లడించారు. ఇక ఈ వివాదంలో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ రాబిన్ మోరిస్ హస్తం ఉన్నప్పటికీ టీమిండియా క్రికెటర్ల పేర్లు మాత్రం లేవు. చదవండి: మూడు టెస్టులు ఫిక్స్! -
దుమ్మురేపిన భారత బౌలర్లు
నాగపూర్: భారత బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్‌మెన్ తోక ముడిచారు. స్వల్ప స్కోరుకే చాప చుట్టేశారు. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 205 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న లంక టీమ్ 20 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. లంక ఆటగాళ్లలో కరుణరత్నె(51), చందిమాల్(57) మాత్రమే రాణించారు. మిగతా ఆటగాళ్లు అందరూ విఫలమవడంతో లంక స్పల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు నేలకూల్చాడు. జడేజా, ఇషాంత్ శర్మ మూడేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 7 పరుగులు చేసి అవుటయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 ఓవర్లు ఆడి 11 పరుగులు చేసింది. విజయ్(2), పుజారా(2) క్రీజ్‌లో ఉన్నారు. -
నడి సంద్రాన...
►దారి తెలియని స్థితిలో శ్రీలంక క్రికెట్ ►వరుస పరాజయాలతో పతనం కెప్టెన్‌కు ఏం చేయాలో తెలియడం లేదు... బౌలర్లకు కనీసం క్రమశిక్షణతో లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం రావడం లేదు... కనీస అవగాహన లేని విధంగా ఫీల్డింగ్ ఏర్పాట్లతో ఆశ్చర్యపోయే వ్యూహాలు... గత ఐదు వారాలుగా భారత్‌తో జరుగుతున్న పోరులో శ్రీలంక క్రికెట్ జట్టు ఆట, పరిస్థితి చూస్తే జాలి కలగక మానదు. సొంతగడ్డపై బెబ్బులిలా ఒకప్పుడు ప్రత్యర్థులను ఆటాడించిన శ్రీలంక ఇప్పుడు బేలగా కనిపిస్తోంది. టెస్టు సిరీస్ 0–3తో పోయింది. వన్డే సిరీస్‌లో ఇప్పటికే 0–4. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత గత రెండు దశాబ్దాల కాలంలో లంక ఇంత ఘోరంగా ఎప్పుడూ ఓడలేదు. అన్నింటికి మించి ఇప్పుడు భవిష్యత్తు కూడా అంతా చీకటిగానే కనిపిస్తోంది. సాక్షి క్రీడా విభాగం : ‘శ్రీలంక క్రికెట్ సంధి దశలో ఉంది అంటూ ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు. సంగక్కర రిటైర్ అయి కూడా రెండేళ్లు దాటింది. హెరాత్ వీల్‌చెయిర్‌లో కూర్చొని మ్యాచ్‌కు 150 ఓవర్లు బౌలింగ్ చేసినా కూడా అలాగే ఆడమని ఇంకా చెబుతారేమో. ఒక్క ఏడాదిలో వన్డేల కోసం 40 మందిని ఎంపిక చేస్తే మంచి జట్టు ఎలా తయారవుతుంది’... శ్రీలంక క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఒక అడ్మినిస్ట్రేటర్ కమ్ అభిమాని ప్రశ్న ఇది. దిగ్గజాలు రిటైర్ అయ్యారు కాబట్టి ఫలితాలు రావడం లేదని, కుర్రాళ్లు తడబడుతున్నారనే వాదనలో నిజంగానే పస లేదు. చాలా జట్లు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొన్నా...ఆ సమస్యను చాలా తొందరగానే అధిగమించాయి. సీనియర్లు ఉన్న సమయంలోనే కొత్త ఆటగాళ్లను సానబెట్టి తగిన మార్గనిర్దేశనం చేశాయి. కానీ శ్రీలంక మాత్రం అందులో విఫలమైంది. దాంతో టెస్టులైనా, వన్డేలైనా ఆ జట్టులో ప్రతీ సిరీస్‌కు కొత్త మొహాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. గురువారం జరిగిన నాలుగో వన్డేలో బరిలోకి దిగిన లంక తుది జట్టులో ముగ్గురిని మినహాయిస్తే మిగిలిన వారిలో ఎవరికీ 37 వన్డేలకు మించి ఆడిన అనుభవం లేదు. సరిగ్గా చెప్పాలంటే ఐదుగురు 10 వన్డేల లోపే ఆడారు. నాసిరకం ప్రదర్శన... భారత్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో శ్రీలంక ఒకే ఒకసారి 300 పరుగులు దాటగలిగింది. కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే చెరో సెంచరీ చేయగలిగితే, కేవలం ఆరు అర్ధ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. భారత బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే ఇది చాలా పేలవమైన ఆట కిందే లెక్క. రెగ్యులర్ బౌలర్లలో ఒక్కరికి కూడా మూడు టెస్టులు ఆడే అవకాశమే రాలేదు. మూడో టెస్టులో హార్దిక్ పాండ్యాౖకైతే సెంచరీని వారు కానుకగా ఇచ్చారు. అతను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక దశలో బౌండరీ వద్ద తొమ్మిది మంది ఫీల్డర్లు ఉండటం ఆ జట్టు పనికిమాలిన వ్యూహాలకు సరైన ఉదాహరణ! వన్డే సిరీస్‌లో కూడా ఆ జట్టు ప్రదర్శన గురించి చెప్పేదేమీ లేదు. రెండో మ్యాచ్‌లో ధనంజయ సంచలన ప్రదర్శన మినహా జట్టును గెలిపించగల సామర్థ్యం ఏ ఒక్కరిలో కనిపించలేదు. దెబ్బ తీస్తున్న రాజకీయాలు... ‘మైదానంలో లంక కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడుతున్నాడు. ఎందుకంటే అతను ఇంకా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడు’... తాజా సిరీస్‌లో లంక క్రికెట్ గురించి ఒక అభిమాని వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య ఇది. ఇందులో వాస్తవం కూడా అంతే స్థాయిలో ఉంది. శ్రీలంక బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తన ఇష్టారాజ్యంగా బయటి నుంచి జట్టును నడిపిస్తున్నారని ఆరోపణ ఉంది. జట్టు ఎంపికలో సుమతిపాలదే ప్రధాన పాత్రగా మారింది. ఆరు జట్లతో పటిష్టంగా ఉండాల్సిన దేశవాళీ క్రికెట్‌ను ఆయన భ్రష్టు పట్టించారు. తమ దేశవాళీ క్రికెట్ బాగుపడితే గానీ పరిస్థితి మారదని ఓపెనర్ కరుణరత్నే బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. గత సంవత్సర కాలంలో శ్రీలంక ఆటగాళ్లు తమ దేశవాళీలో ఐదంటే ఐదు వన్డేలు ఆడారు! అలాంటి ఆటగాళ్లు వచ్చి భారత్‌లాంటి జట్టుపై చెలరేగుతారని భావించడం అత్యాశే అవుతుంది. శ్రీలంక ఆశలు విండీస్ ఆటపై... ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ ఇటీవల చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోవడం ఒక విషాదంలా కనిపించింది. కానీ ఇప్పుడు 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు మరో మాజీ ప్రపంచ చాంపియన్ కూడా క్వాలిఫయింగ్ ఆడాల్సిన పరిస్థితికి చేరువైంది. భారత్‌తో సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే శ్రీలంక నేరుగా తమ స్థానాన్ని ఖాయం చేసుకునేది. అయితే ఇప్పుడు నాలుగో వన్డేలో ఓటమితో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆ జట్టు అవకాశాలు ఇప్పుడు విండీస్‌పై ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ చివరి మ్యాచ్‌లో భారత్‌పై లంక గెలిస్తే... ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో కలిపి ఆరు వన్డేల్లో విండీస్ ఐదు గెలిచిందంటే లంక కథ ముగుస్తుంది. ఆఖరి వన్డేలోనూ లంక ఓడితే... లంకను అధిగమించి అర్హత సాధించేందుకు విండీస్ 4 మ్యాచ్‌లు గెలిచినా సరిపోతుంది. -
మలింగాకు లంక బోర్డు నో పర్మిషన్
కొలంబో: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా ఐపీఎల్లో ఆడే అవకాశాలు లేనట్టే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకుగాను మలింగాకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తిరస్కరించింది. మలింగా ప్రస్తుత ఫిట్నెస్ పరిస్థితిని తెలుసుకోవాల్సిన అవసరముందని, ఆ తర్వాతే ఎన్ఓసీ ఇచ్చే విషయాన్ని నిర్ణయిస్తామని లంక క్రికెట్ బోర్డు చీఫ్ తిలంగ సుమతిపాల చెప్పారు. తమ అనుమతి లేకుండా మలింగా ఐపీఎల్లో ఆడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తిలంగ సుమతిపాలకు, మలింగాకు మధ్య ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నట్టు సమాచారం. టి-20 ప్రపంచ కప్‌నకు ముందు లంక కెప్టెన్ పదవి నుంచి మలింగాను తప్పించారు. ఈ టోర్నీకి మలింగా ఎంపికైనా ఫిట్నెస్ సమస్యలు చూపి జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో ప్రధాన బౌలర్ లేకుండానే లంక ప్రపంచ కప్‌లో బరిలో దిగాల్సివచ్చింది. లంక ఓటమికి ఇది కూడా ఓ కారణం. -
పుజారా ‘షో’
-
బై.. బై... సంగ
శ్రీలంక దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు కొలంబో: పదిహేనేళ్లుగా శ్రీలంక క్రికెట్‌కు అతడు వెన్నెముక.. జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో అతడి పాత్ర మరువలేనిది.. ఇన్నాళ్లుగా తన అసమాన ఆటతీరుతో జట్టును సమున్నతంగా నిలిపి అభిమానులను ఉర్రూతలూగించిన కుమార సంగక్కర.. తన కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్టు తన చివరిదని ఇంతకుముందే ప్రకటించిన ఈ సీనియర్ బ్యాట్స్‌మన్ సోమవారం మ్యాచ్ ముగిసిన అనంతరం ఘనమైన వీడ్కోలు తీసుకున్నాడు. ఇంతకాలం వెన్నంటి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులతో పాటు కోచ్‌లు, ఆటగాళ్లు, బోర్డు, ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ చివరిసారిగా ప్రసంగించాడు. లంక తరఫున క్రికెట్ ఆడడం జీవితంలో అన్నింటికన్నా మధురమైన జ్ఞాపకమని చెప్పాడు. తమ నాయకుడిని ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిప్పారు. 37 ఏళ్ల సంగకు వీడ్కోలు పలికేం దుకు లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘే, మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ, సునీల్ గవాస్కర్ హాజరయ్యారు. అంతకుముందు మ్యాచ్ ముగిసిన అనంతరం భారత క్రికెట్ ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని కెప్టెన్ కోహ్లి.. సంగక్కరకు అందించాడు. సంగక్కర భావోద్వేగ వీడ్కోలు ప్రసంగం అతడి మాటల్లోనే... అందరికీ కృతజ్ఞతలు: నాకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని, కుటుంబసభ్యులకు, భారత, లంక జట్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నా క్రికెట్ కెరీర్ ఆరంభానికి క్యాండీలోని ట్రినిటీ కాలేజి ఎంతగానో చేయూతనందించింది. ఇక నాకు చాలా మంది కోచ్‌లున్నారు. ఎందుకంటే నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు మా నాన్న చాలా మంది దగ్గర శిక్షణ ఇప్పించేవాడు. డ్రెస్సింగ్ రూమ్ కబుర్లు మిస్ అవుతా: నా గత కెప్టెన్లు, తోటి ఆటగాళ్లు నా అభివృద్ధికి తోడ్పడినవారే. డ్రెస్సింగ్ రూమ్‌లో వారి కబుర్లను ఎంతగానో మిస్ అవుతాను. నాది అద్భుతమైన కుటుంబం. 30 ఏళ్లుగా నన్ను అభిమానించిన వారంతా మ్యాచ్ చివరి రోజు హాజరయ్యారు. ఇదే నేను సాధించిన గొప్ప ఘనత. చాలా మంది జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరని అడుగుతుంటారు. నిజానికి దీని కోసం నేనెక్కడా చూసింది లేదు. నా తల్లిదండ్రులే నన్ను విపరీతంగా ప్రభావితం చేశారు. ఈ కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. అభిమానులకు రుణపడి ఉంటా: లంక తరఫున ఇన్నేళ్లుగా ఆడేందుకు నాకు మనోధైర్యాన్నిచ్చిన అభిమానులకు ఎంతగానో రుణపడి ఉంటాను. నా గురించి మాట్లాడిన విరాట్ కోహ్లి, భారత జట్టుకు కూడా అభినందనలు. చాలా ఏళ్లుగా ఆ జట్టు లంకకు పటిష్ట ప్రత్యర్థిగా ఉంది. ఈరోజు మేం ఓడిపోయినందుకు ఏమీ బాధపడడం లేదు. తర్వాతి మ్యాచ్ మేమే గెలుస్తాం. లంక జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా దేశం గర్వించేలా ఆడుతుందని ఆశిస్తున్నాను. జహీర్, స్వాన్ బౌలింగ్‌లో కష్టపడ్డా: ఈ సిరీస్‌లో అశ్విన్ నన్ను ఇబ్బంది పెట్టినా ఓవరాల్‌గా నా కెరీర్లో పేసర్ జహీర్ ఖాన్, ఇంగ్లండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ బౌలింగ్ సవాల్‌గా నిలిచింది. నేను యువకుడిగా ఉన్నప్పుడు వసీం అక్రమ్ బంతులను ఎదుర్కోవడంలోనూ ఇబ్బంది పడ్డా. హైకమిషనర్ పదవిపై ఆలోచిస్తా... కుమార సంగక్కరకు ఇంగ్లండ్‌లో శ్రీలంక హైకమిషనర్ పదవిని అధ్యక్షుడు సిరిసేన ఆఫర్ చేశారు. అయితే దీనిపై ఆలోచించాకే తుది నిర్ణయం తీసుకుంటానని సంగక్కర చెప్పాడు. ‘అధ్యక్షుడి విజ్ఞప్తిని నేను గౌరవిస్తాను. ఈ విషయం గురించి ఆయనతో లోతుగా చర్చించాల్సి ఉంది. ఎందుకంటే అలాంటి అనుభవం నాకు లేదు. ఆ పదవికి ప్రత్యేక పరిజ్ఞానం అవసరం. అందుకే ఆలోచించాకే తుది నిర్ణయం తీసుకుంటాను’ అని సంగ అన్నాడు. లంక దిగ్గజం సంగక్కర ఆడిన శకంలోనే తాను కూడా క్రికెట్ ఆడినందుకు గర్వపడుతున్నానని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విట్టర్లో పేర్కొన్నాడు. ‘ఓ వ్యక్తిగానే కాకుండా క్రికెటర్‌గా నీగురించి చెప్పడానికి మాటలు లేవు. చాలామందికి ప్రేరణగా నిలిచావు. నీ శకంలోనే నేను కూడా ఆడుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అని కోహ్లి చెప్పాడు. మాజీ ఆటగాళ్ల క్లబ్‌కు స్వాగతం: గవాస్కర్ సంగక్కర జీవితంలో రెండో ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలని మాజీ కెప్టెన్ గవాస్కర్ కోరుకున్నారు. ‘క్రికెట్లో సాగించిన ఇన్నింగ్స్‌కంటే రెండో ఇన్నింగ్స్ ఇంకా బాగా సాగాలి. ఇన్నేళ్లుగా లంక ఆశలను సమర్థవంతంగా మోశావు. చివరిగా మాజీ ఆటగాళ్ల క్లబ్‌కు నీకు స్వాగతం పలుకుతున్నాను’ అని గవాస్కర్ అన్నారు. గొప్ప ఆటగాడు: ఐసీసీ గత 15 ఏళ్లుగా సంగక్కర అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ అన్నారు. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, ఆటగాడిగా జట్టుకు అతడు అందించిన సేవలను తక్కువగా చూడలేమని కొనియాడారు. -
విండీస్ జట్టు స్థానంలో భారత్ లో శ్రీలంక పర్యటన!
కొలంబో: భారత పర్యటన నుంచి వెస్టిండీస్ తప్పుకున్న నేపథ్యంలో శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఖారారు చేసింది. భారత్ లో శ్రీలంక పర్యటన ఖారారైందని, అయితే ఇంకా షెడ్యూల్ ఫిక్స్ కాలేదని శ్రీలంక క్రికెట్ సెక్రెటరీ నిశాంత రణతుంగ తెలిపారు. విండీస్ బోర్డుకు, క్రికెటర్లకు మధ్య జీత భత్యాల చెల్లింపుపై విభేదాలు నెలకొనడంతో భారత పర్యటన నుంచి వెస్టిండీస్ జట్టు వైదొలగిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనకు ప్రత్యామ్నాయంగా శ్రీలంక జట్టు పర్యటనను బీసీసీఐ ఖారారు చేసింది.