శ్రీలంక హెడ్‌కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య పదవీకాలాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఏడాది పాటు పొడిగించింది. ఈ ఏడాది జూలైలో భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్‌గా జయసూర్య బాధ్యతలు చేపట్టాడు.
అయితే టీమిండియాతో టీ20 సిరీస్ కోల్పోయినప్పటకి వన్డేల్లో మాత్రం లంక అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో లంకేయులు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన శ్రీలంక టీమ్ అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేసింది.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయినప్పటకి.. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో గెలిచి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తమ సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా శ్రీలంక అదరగొడుతుంది. ఇప్పటికే తొలి టెస్టులో కివీస్‌ను చిత్తు చేసిన లంక.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా విజయానికి చేరువైంది.
గత మూడు నెలలగా జయసూర్య నేతృత్వంలోని లంక జట్టు తమ పూర్వ వైభవంగా దిశగా అడుగులు వేస్తోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది.
ఇప్పుడు కివీస్‌తో రెండో టెస్టులో విజయం సాధిస్తే శ్రీలంక స్ధానం మరింత మెరుగుపడే అవకాశముంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడమే లక్ష్యంగా శ్రీలంక ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే జయసూర్య సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించుకుంది.
చదవండి: IND vs BAN: 'అతడేం తప్పు చేశాడు.. నిజంగా సిగ్గు చేటు'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment