Sanath Jayasuriya
-
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడిని కోచ్‌గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో చెత్త ప్రదర్శనతో శ్రీలంక జట్టు విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టి వరల్డ్‌కప్ తర్వాత క్రిస్ సిల్వర్‌వుడ్ తన హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్యను లంక బోర్డు తాత్కాలిక కోచ్‌గా నియమించింది.ఆదిలోనే చేదు అనుభవంటీమిండియాతో సొంతగడ్డపై టీ20 సిరీస్ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన జయసూర్యకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. సూర్యకుమార్ సేన చేతిలో లంక 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. అయితే, ఈ పరాభవాన్ని మర్చిపోయేలా వన్డే సిరీస్‌లో శ్రీలంక చారిత్రాత్మక విజయం సాధించింది.ఆ తర్వాత వరుస విజయాలుదాదాపు ఇరవై ఏడేళ్ల విరామం తర్వాత భారత జట్టుపై వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. జయసూర్య మార్గదర్శనంలో ఈ అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో శ్రీలంక జట్టు ముందుకు దూసుకుపోతోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పదేళ్ల తర్వాత అక్కడ టెస్టు మ్యాచ్ గెలిచిన లంక.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది.ఈ జైత్రయాత్రకు ప్రధాన కారణం జయసూర్య గైడెన్స్ అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే లంక బోర్డు అతడిని పూర్తి స్థాయి హెడ్‌కోచ్‌గా నియమించింది. ‘‘తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న జయసూర్య మార్గదర్శనంలో.. ఇటీవలి కాలంలో టీమిండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై శ్రీలంక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.టీ20 వరల్డ్‌కప్ వరకూ అతడే!ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జయసూర్యను హెడ్‌కోచ్‌గా కొనసాగించాలని నిర్ణయించింది. అక్టోబరు 1, 2024 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మార్చి 31, 2026 వరకు అతడు ఈ పదవిలో కొనసాగుతాడు’’ అని లంక బోర్డు తన ప్రకటనలో తెలిపింది. కాగా జయసూర్య గతంలో చీఫ్ సెలక్టర్‌గానూ పనిచేశాడు. ఇక ఫుల్‌టైమ్ హెడ్‌కోచ్‌గా వెస్టిండీస్‌తో డంబుల్లా వేదికగా మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌తో అతడి ప్రయాణం మొదలుకానుంది.చదవండి: ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్ -
శ్రీలంక హెడ్‌కోచ్‌గా జయసూర్య.. మరో ఏడాది పాటు!
శ్రీలంక హెడ్‌కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య పదవీకాలాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఏడాది పాటు పొడిగించింది. ఈ ఏడాది జూలైలో భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్‌గా జయసూర్య బాధ్యతలు చేపట్టాడు.అయితే టీమిండియాతో టీ20 సిరీస్ కోల్పోయినప్పటకి వన్డేల్లో మాత్రం లంక అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో లంకేయులు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన శ్రీలంక టీమ్ అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయినప్పటకి.. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో గెలిచి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తమ సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా శ్రీలంక అదరగొడుతుంది. ఇప్పటికే తొలి టెస్టులో కివీస్‌ను చిత్తు చేసిన లంక.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా విజయానికి చేరువైంది. గత మూడు నెలలగా జయసూర్య నేతృత్వంలోని లంక జట్టు తమ పూర్వ వైభవంగా దిశగా అడుగులు వేస్తోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. ఇప్పుడు కివీస్‌తో రెండో టెస్టులో విజయం సాధిస్తే శ్రీలంక స్ధానం మరింత మెరుగుపడే అవకాశముంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడమే లక్ష్యంగా శ్రీలంక ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే జయసూర్య సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించుకుంది.చదవండి: IND vs BAN: 'అతడేం తప్పు చేశాడు.. నిజంగా సిగ్గు చేటు'.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్ -
మొన్న టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్..!
హెడ్ కోచ్ సనత్ జయసూర్య ఆథ్వర్యంలో శ్రీలంక క్రికెట్ జట్టు సంచలన విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే భారత్‌కు వన్డే సిరీస్‌లో షాకిచ్చిన (0-2 తేడాతో) శ్రీలంక.. తాజాగా ఇంగ్లండ్‌కు వారి సొంతగడ్డపై ఓటమి రుచి చూపించింది. జయసూర్య హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక శ్రీలంక ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు ప్రతి ఒక్కరూ రాణిస్తున్నారు. జయసూర్య పర్యవేక్షణలో కమిందు మెండిస్, పథుమ్ నిస్సంక, మిలన్ రత్నాయకే లాంటి యువ ఆటగాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ.. యువ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉండింది. మూడో టెస్ట్‌లో నిస్సంకకు అవకాశం ఇచ్చి జయసూర్య పెద్ద సాహసమే చేశాడు. సత్ఫలితం రాబట్టాడు. మూడో టెస్ట్‌లో నిస్సంక తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ.. ఛేదనలో మెరుపు సెంచరీ చేసి శ్రీలంకకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మొత్తంగా జయసూర్య శ్రీలంకకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు.కాగా, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది.నిస్సంక సూపర్ సెంచరీ219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిస్సంక.. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు.పోప్ భారీ శతకంఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిస్సంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. -
కొత్త కోచ్ కోసం వెతుకున్నారు: సనత్ జయసూర్య
దాదాపు 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై స్పిన్ వల పన్ని భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. 2-0తో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లంక తాత్కాలిక హెడ్‌కోచ్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య హర్షం వ్యక్తం చేశాడు.కుర్రాళ్లు అద్భుత ఆటతీరుతో.. ఎంతో కఠిన శ్రమకోర్చి గెలుపు రుచిని చవిచూశారని ప్రశంసించాడు. టీ20 సిరీస్‌లో ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుని.. అనూహ్య విజయాన్ని అందుకున్నారని సనత్ జయసూర్య లంక వన్డే జట్టును కొనియాడాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చేదు అనుభవంఈ టూర్‌తో టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, కొత్త హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టారు. ఆతిథ్య శ్రీలంకను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంతో ఇద్దరి ఖాతాలో భారీ విజయం నమోదైంది. అయితే, వన్డేలో మాత్రం టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 2-0తో సిరీస్‌ను లంకకు సమర్పించుకుంది. తొలి వన్డేను టై చేసుకున్నప్పటికీ... శ్రీలంక స్పిన్నర్లు జెఫ్రె వాండర్సె, దునిత్ వెల్లలగే స్పిన్ మాయాజాలంలో చిక్కి ఆఖరి రెండు వన్డేల్లో ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మాట్లాడుతూ.. ‘‘సుదీర్ఘకాలం పాటు ఇందుకోసం నిరీక్షించాం. 1997లో నేను జట్టులో ఉన్నపుడు టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచాం. మళ్లీ ఇప్పుడు ఇలా విజయం అందుకున్నాం. 27 ఏళ్ల తర్వాత.. ఇలా దక్కిన గెలుపులో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది.ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదుశ్రీలంకలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. వాళ్లు ఏం చేయగలరో ఈ సిరీస్ ద్వారా చేసి చూపించారు. టీ20 సిరీస్ తర్వాత అంతా స్తబ్దుగా మారిపోయింది. మేము తిరిగి పుంజుకుంటామని ఎవరూ ఊహించలేదు. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. అద్భుతంగా ఆడారు.వెల్లలగే, నిసాంక, అవిష్క ఫెర్నాండో, అసలంక.. ఇలా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. హసరంగ గాయం కారణంగా దూరం కాగా.. వాండర్సె అతడి స్థానంలో వచ్చి.. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. వెల్లలగే సైతం అద్బుతంగా రాణించాడు’’ అని సనత్ జయసూర్య తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కొత్త కోచ్ కోసం వెతుకున్నారుటీమిండియా, ఇంగ్లండ్‌లతో సిరీస్‌ల నేపథ్యంలో తాను కోచ్‌గా బాధ్యతలు చేపట్టానని... ఈ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కొత్త కోచ్ వస్తాడని సనత్ జయసూర్య తెలిపాడు. ఇందుకోసం లంక బోర్డు వివిధ ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. అయితే, హై పర్ఫామెన్స్ ఇన్చార్జ్గా తాను శ్రీలంక క్రికెట్‌కు సేవలు అందిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు. -
సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలు
శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఆ దేశ దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఎస్ఎల్సీ జయసూర్యను ఓ సంవత్సరం పాటు పూర్తి స్థాయి క్రికెట్ కన్సల్టెంట్‌గా నియమించింది. జయసూర్య ఎంపిక తక్షణమే అమలుల్లోకి వస్తుందని లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 54 ఏళ్ల జయసూర్య 1991-2011 మధ్యలో లంక క్రికెట్ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు. 19956 వరల్డ్‌కప్ తర్వాత జయసూర్య కెరీర్ ఓ రేంజ్లో సాగింది. జయసూర్య.. సహచరుడు కలువితరణతో కలిసి ప్రపంచ క్రికెట్‌కు విధ్వంసకర బ్యాటింగ్‌ను పరిచయం చేశాడు. కాగా, వన్డే వరల్డ్‌కప్ 2023లో పేలవ ప్రదర్శన అనంతరం లంక క్రికెట్ వివిధ కారణాల చేత వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టుపై ఐసీసీ తాత్కాలిక నిషేధం కూడా విధించింది. తాజాగా ఆ దేశ క్రీడా వ్యవహారాల మంత్రి హరీన్ ఫెర్నాండో ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలక్షన్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి మాజీ కెప్టెన్ ఉపుల్ తరంగ చైర్మెన్‌గా ఎంపిక కాగా.. అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా సభ్యులుగా ఉన్నారు. -
శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని మృతి.. సంతాపం తెలిపిన దిగ్గజ క్రికెటర్లు
శ్రీలంక క్రికెట్ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అందరూ అబేశేఖరను ముద్దుగా "అంకుల్ పెర్సీ" అని పిలుచుకునేవారు. శ్రీలంక జట్టు ఎక్కడ ఆడిన ఆయన స్టేడియంకు వచ్చి సపోర్ట్ చేసేవాడు. 1979 ప్రపంచ కప్ నంచి తన జట్టును ఉత్సాహపరిస్తూ అబేశేఖర వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత స్టేడియాల్లో అంకుల్ పెర్సీ శ్రీలంక జాతీయ జెండాను రెపరెపలాడించేవారు. గతేడాది వరకు జట్టుతోనే కలిసి ప్రయాణం చేసిన అంకుల్ పెర్సీ.. అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమతయ్యారు. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో వైద్య ఖర్చుల కోసం రూ.50 లక్షల చెక్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు అబేశేఖరకు అందించింది. అదే విధంగా ఈ ఏడాది ఆసియాకప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అబేశేఖరను తన నివాసంలో కలిశారు. కాగా ఆయన మృతిపట్ల శ్రీలంక దిగ్గజాలు సనత్ జయసూర్య, రస్సెల్ ఆర్నాల్డ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. చదవండి: World Cup 2023: పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం.. బాబర్ ఆజం ప్రైవేట్ వాట్సాప్ చాట్ లీక్ RIP #unclepercy 😞😞😞 pic.twitter.com/yhXNKoTacD — Russel Arnold (@RusselArnold69) October 30, 2023 -
SL VS ENG: జయసూర్య రికార్డును సమం చేసిన నిస్సంక
ప్రస్తుత ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్ధశతకం సాధించిన నిస్సంక.. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ సాధించి, లంక దిగ్గజాలు సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షన్ల సరసన చేరాడు. జయసూర్య, దిల్షన్లు కూడా ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా నాలుగు అర్ధసెంచరీలు సాధించారు. జయసూర్య 2007లో.. దిల్షన్ 2011లో ఈ ఘనత సాధించారు. గిల్ రికార్డును కూడా సమం చేసిన నిస్సంక.. నిస్సంక.. ఇంగ్లండ్‌పై నిన్న సాధించిన హాఫ్ సెంచరీతో జయసూర్య, తిలకరత్నే దిల్షన్ల రికార్డును సమం చేయడంతో మరో రికార్డును కూడా సాధించాడు. నిస్సంక.. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌తో కలిసి రికార్డును షేర్ చేసుకున్నాడు. గిల్, నిస్సంకలు ఈ ఏడాది వన్డేల్లో 11 హాఫ్ సెంచరీలు సాధించగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 10, టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలు సంయుక్తంగా 9 హాఫ్ సెంచరీలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక.. ఇంగ్లండ్‌ను 156 పరుగులకే కుప్పకూల్చగా.. శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంక 77 పరుగులు, సదీర సమరవిక్రమ 65 పరుగులతో అజేయంగా నిలిచి, లంకను విజయతీరాలకు (25.4 ఓవర్లలో 160/2) చేర్చారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన లహీరు కుమారకు (7-0-35-3) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన కరుణరత్నే
శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే టెస్ట్‌ల్లో 15వ సెంచరీ బాదాడు. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో కరుణరత్నే ఈ ఫీట్‌ను సాధించాడు. 139 బంతులను ఎదుర్కొన్న కరుణరత్నే..12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో అతను లంక దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్య, స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ల రికార్డులను అధిగమించాడు. జయసూర్య, మాథ్యూస్‌లు తమ టెస్ట్ కెరీర్లలో 14 టెస్ట్ సెంచరీలు సాధించగా.. తాజాగా కరుణరత్నే వీరిని ఓవర్టేక్ చేసి లంక తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్ (16), మర్వన్ ఆటపట్టు (16) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచారు. ఇప్పటివరకు కెరీర్లో 85 టెస్ట్‌లు ఆడిన కరుణరత్నే 15 సెంచరీలు, 34 అర్ధసెంచరీల సాయంతో 40.66 సగటున 6344 పరుగులు సాధించాడు. కాగా, కరుణరత్నే (114 నాటౌట్)కు జతగా కుశాల్ మెండిస్ (94 నాటౌట్) కూడా రాణించడంతో టీ సమయానికి శ్రీలంక వికెట్ నష్టానికి 245 పరుగులు చేసింది. శ్రీలంక కోల్పోయిన నిషాన్ మదుష్క (29) వికెట్ కర్టిస్ క్యాంపర్ ఖాతాలోకి వెళ్లింది. ఐర్లాండ్.. ప్రస్తుత లంక పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. -
ODI WC 1996: అప్పుడు కారు.. ఇప్పుడు మీరు! ఈ క్రికెటర్ని గుర్తుపట్టారా?
Sanath Jayasuriya- “Golden memories”: శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య 1996 ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రతిఫలంగా లభించిన కారుతో ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ అపురూప చిత్రానికి.. ‘‘మరుపురాని జ్ఞాపకాలు: 27 ఏళ్ల క్రితం.. 1996 వరల్డ్‌కప్ మ్యాన్ ఆఫ్ సిరీస్ కార్‌తో ఇలా’’ అని తన పాత, ప్రస్తుత ఫొటోను జతచేసి క్యాప్షన్ ఇచ్చాడు. సనత్ జయసూర్య అభిమానులను ఆకర్షిస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అప్పుడు కారు మెరిసింది.. ఇప్పుడు మీరు మెరుస్తున్నారు అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కంగారూ జట్టును చిత్తుచేసి ప్రపంచకప్- 1996 ఫైనల్లో లాహోర్ వేదికగా శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లంక ఆసీస్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టును చిత్తు చేసి జగజ్జేతగా అవతరించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి 221 పరుగులు సాధించడంతో పాటు.. ఏడు వికెట్లు తీసిన లంక ఆల్‌రౌండర్ సనత్ జయసూర్య మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడికి ఆడి కారు బహుమతిగా లభించింది. ఇదిలా ఉంటే.. సనత్ జయసూర్య తన కెరీర్లో 445 వన్డేల్లో 13,430, 110 టెస్టుల్లో 6973 పరుగులు, 31 టీ20 మ్యాచ్‌లలో 629 పరుగులు సాధించాడు. ఇందులో 42 సెంచరీలు, మూడు ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ స్పిన్ ఆల్‌రౌండర్ తన కెరీర్ మొత్తంలో వన్డే, టెస్టులు, టీ20లలో వరుసగా.. 323, 98, 19 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. IPL 2023: ధోనికి సరైన వారసుడు.. అతడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Sanath Jayasuriya (Official) (@sanath_jayasuriya) -
26 బంతుల్లో బౌండరీ, 10 సిక్సర్లతో వీరవిహారం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా పట్నా వారియర్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో చండీఘడ్ ఛాంప్స్ 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాంప్స్.. పునీత్ కుమార్ (26 బంతుల్లో 78 నాటౌట్; ఫోర్, 10 సిక్సర్లు), భాను సేథ్ (21 బంతుల్లో 43; 6 సిక్సర్లు), గౌరవ్ తోమర్ (43 బంతుల్లో 86; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పట్నా వారియర్స్.. ఛాంప్స్ బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఛాంప్స్ బౌలర్లు పర్వీన్ థాపర్ 3, గౌరవ్ తోమర్, రమన్ దత్తా, తిలకరత్నే దిల్షన్ తలో 2 వికెట్లు, ముకేశ్ సైనీ ఓ వికెట్ పడగొట్టారు. వారియర్స్ ఇన్నింగ్స్ 9వ నంబర్ ఆటగాడు ప్రవీణ్ గుప్తా (21) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, మొత్తం 6 జట్టు పాల్గొంటున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో చండీఘడ్ ఛాంప్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఛాంప్స్ తర్వాత ఇండోర్ నైట్స్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు) రెండులో, వైజాగ్ టైటాన్స్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు), గౌహతి అవెంజర్స్ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 2 పాయింట్లు), పట్నా వారియర్స్ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 2 పాయింట్లు), నాగ్‌పూర్ నింజాస్ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు పలువురు దేశ, విదేశీ స్టార్లు కూడా పాల్గొంటున్నారు. రాస్ టేలర్, తిలకరత్నే దిల్షాన్, ఇర్ఫాన్ పఠాన్, మాంటీ పనేసర్, ఉపుల్ తరంగ, సనత్ జయసూర్య, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితర ఇంటర్నేషనల్ స్టార్లు వివిధ టీమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన ఏంజెలో మాథ్యూస్
శ్రీలంక వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఆ దేశ క్రికెట్‌కు సంబంధించి ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో 47 పరుగులు చేసిన మాథ్యూస్.. శ్రీలంక తరఫున టెస్ట్‌ల్లో 7000 పరుగుల మార్కును అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. Angelo Mathews goes past Sanath Jayasuriya and become the 3rd Sri Lankan player to reach 7️⃣0️⃣0️⃣0️⃣ Test runs 🙌 #NZvSL pic.twitter.com/Y56YdYctaj — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 9, 2023 ఈ క్రమంలో అతను ఆ దేశ దిగ్గజం సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు. జయసూర్య 110 టెస్ట్‌ల్లో 6973 పరుగులు చేస్తే.. మాథ్యూస్ 101 టెస్ట్‌ల్లోనే 7000 పరుగుల మార్కును అందుకున్నాడు. లంక తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుమార సంగక్కర (134 టెస్ట్‌ల్లో 12400 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. మహేళ జయవర్ధనే (149 టెస్ట్‌ల్లో 11814 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. A landmark achievement 👏 🇱🇰 Angelo Mathews becomes the third after @KumarSanga2 and @MahelaJay to 7000 Test runs for Sri Lanka pic.twitter.com/LYWnxSceVd — ESPNcricinfo (@ESPNcricinfo) March 9, 2023 లంక తరఫున టెస్ట్‌ల్లో 6000 అంతకంటే ఎక్కువ పరుగులు (ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో) చేసిన ఆటగాళ్లలో మాథ్యూస్ తర్వాత దిముత్ కరుణరత్నే (83 టెస్ట్‌ల్లో 6073) మాత్రమే ఉన్నాడు. ఇదిలా ఉంటే, క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 9) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో తొలుత బ్యాటంగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన ఉండటంతో శ్రీలంక ఈ మ్యాచ్‌ను డూ ఆర్ డై అన్నట్లుగా తీసుకుంది. ఫైనల్ బెర్తల్లో ఓ బెర్త్ ఆస్ట్రేలియా ఇదివరకే ఖరారు చేసుకోగా మరో బెర్త్ కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య ఒకింత లేని పోటీ నెలకొంది. Who will join the Aussies in the World Test Championship 2023 final? 🤔 India🇮🇳 or Sri Lanka 🇱🇰? pic.twitter.com/KqBQQgYWRG — CricTracker (@Cricketracker) March 8, 2023 భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే.. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయి.. మరోపక్క కివీస్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక 2-0 తేడాతో గెలిస్తే, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కు నెట్టి ద్వీప దేశం ఫైనల్‌కు చేరుకుంటుంది. -
53 ఏళ్ల వయసులో అదరగొట్టాడు.. లంక లెజెండ్స్ ఘన విజయం
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్ లెజెండ్స్‌పై శ్రీలంక లెజెండ్స్ ఘన విజయం సాధించింది. 53 ఏళ్ల వయసులోనూ సనత్ జయసూర్య(4-2-3-4) తన స్పిన్ మాయజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. 4 ఓవర్లు వేసిన జయసూర్య రెండు మెయిడెన్లు సహా కేవలం మూడు పరుగుల్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.అతని స్పిన్ ధాటికి ఇంగ్లండ్ లెజెండ్స్ 19 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ లెజెండ్స్ బ్యాటర్స్‌లో ఇయాన్ బెల్ 15 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మస్టర్డ్ 14 పరుగులు చేశాడు. లంక బౌలింగ్‌లో సనత్ జయసూర్య 4 వికెట్లతో చెలరేగగా.. చమర డిసిల్వా, కులశేఖర చెరో రెండు వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా, జీవన్ మెండిస్ తలా ఒక వికెట్ తీశారు. కాగా లంక జట్టులో ఏడుగురు బౌలింగ్ చేయడం విశేషం. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి లంక లెజెండ్స్ 14.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దిల్షాన్ మునవీరా 24, ఉపుల్ తరంగ 23, తిలకరత్నే దిల్షాన్ 15 పరుగులు చేశారు. చివర్లో జీవన్ మెండిస్ 8 పరుగులు నాటౌట్ చేసి జట్టును గెలిపించాడు. కాగా స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు తీసిన జయసూర్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. Sri Lanka Legends continue their good run as they defeat the England Legends by 7 wickets! The bowling attack led by Sanath Jayasuriya was too good for the England Legends as they were bundled out for a paltry 78.#ENGLvsSLL #RoadSafetyWorldSeries #RSWS #YehJungHaiLegendary pic.twitter.com/hmOaFLvfma — Road Safety World Series (@RSWorldSeries) September 13, 2022 -
మరే భారత క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్
IND VS PAK: ఆసియా కప్ 2022లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 28) జరుగనున్న హైఓల్టేజీ పోరుకు (భారత్-పాక్ మ్యాచ్) ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు ఆరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 117 పరుగులు చేస్తే ఆసియా కప్‌లో మరే భారత క్రికెటర్‌కు సాధ్యం కాని 1000 పరుగుల రికార్డును చేరుకుంటాడు. ప్రస్తుతం రోహిత్ 27 మ్యాచ్‌ల్లో 883 పరుగులు సాధించాడు. రోహిత్ 1000 పరుగుల రికార్డును సాధించే క్రమంలో (89 పరుగుల వద్ద) భారత దిగ్గజ ఆటగాడు సచిన్‌ను (23 మ్యాచ్‌ల్లో 971 పరుగులు) అధిగమిస్తాడు. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (25 మ్యాచ్‌ల్లో 1220 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. అదే దేశానికి చెందిన మాజీ వికెట్‌కీపర్ కుమార సంగక్కర (24 మ్యాచ్‌ల్లో 1075 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. ఆతర్వాతి స్థానాల్లో సచిన్, పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్ (21 మ్యాచ్‌ల్లో 907), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (16 మ్యాచ్‌ల్లో 766) వరుసగా ఉన్నారు. ఈ రికార్డుతో పాటు హిట్‌మ్యాన్ మరో అరుదైన రికార్డుకు కూడా ఎసరు పెట్టాడు. ఆసియాకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు మరో 6 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఆసియాకప్‌లో ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (26 మ్యాచ్‌ల్లో 27 సిక్సర్లు) పేరిట ఉంది. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 21 సిక్సర్లు (27 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఈ జాబితాలో శ్రీలంక మాజీ విధ్వంసకర ఆటగాడు జయసూర్య (23 మ్యాచ్‌ల్లో 25) రెండో స్థానంలో ఉండగా.. రోహిత్ మూడులో, సురేశ్ రైనా (18 మ్యాచ్‌ల్లో 18), ధోని (24 మ్యాచ్‌ల్లో 16) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. చదవండి: Asia Cup: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. -
Asia Cup: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం..
Asia Cup 2022: ఆసియా కప్ 15వ ఎడిషన్ రెండు రోజుల్లో ఆరంభం కానుంది. దుబాయ్ వేదికగా ఆగష్టు 27న శ్రీలంక- అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022కు సన్నాహకంగా భావిస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో దుమ్మురేపేందుకు క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో దూకుడైన ఆట తీరుతో పరుగుల దాహం తీర్చుకునేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం, ఫఖర్ జమాన్ వంటి ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి.. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన టాప్-10 బ్యాటర్లు ఎవరో తెలుసా? 1. సనత్ జయసూర్య శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్యకు ఆసియా కప్ టోర్నీలో అద్భుత రికార్డు ఉంది. ఎడమచేతి వాటం గల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఈ ఈవెంట్లో 53.04 సగటుతో 1220 పరుగులు సాధించాడు. 25 మ్యాచ్‌లలో ఈ మేరకు స్కోరు చేశాడు. తద్వారా ఇప్పటి వరకు ఈ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక జయసూర్య 2011లో చివరిసారిగా తన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. 2. కుమార సంగక్కర శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర ఆసియా కప్‌లో 24 మ్యాచ్‌లు ఆడి 1075 పరుగులు చేశాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 3. సచిన్ టెండుల్కర్ ఆసియా కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ది అగ్రస్థానం. ఈ ఈవెంట్లో సచిన్ 21 మ్యాచ్‌లలో 51.10 సగటుతో 971 పరుగులు సాధించాడు. అయితే, టోర్నీలో మొత్తంగా సనత్ జయసూర్య, సంగక్కర తర్వాతి స్థానం(నంబర్ 3)లో నిలిచాడు. 4. షోయబ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు ఈ టోర్నీలో మంచి రికార్డు ఉంది. కుడిచేతి వాటం గల ఈ ఆల్‌రౌండర్ 21 మ్యాచ్‌లలో 64.78 సగటుతో మొత్తంగా 907 పరుగులు సాధించాడు. 5. రోహిత్ శర్మ టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆసియా కప్ టోర్నీలో మెరుగైన రికార్డు ఉంది. ఈ ఈవెంట్లో 27 మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ 883 పరుగులు సాధించాడు. 6. విరాట్ కోహ్లి టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆసియా కప్‌లో ఇప్పటి వరకు 766 పరుగులు సాధించాడు. సగటు 63.83. కేవలం 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సచిన్, రోహిత్ తర్వాతి స్థానం కోహ్లిదే. ఈ టోర్నీలో కోహ్లి మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు సాధించాడు. 7. అర్జున రణతుంగ శ్రీలంక మాజీ ఆటగాడు అర్జున్ రణతుంగ ఆసియా కప్ టోర్నీలో 19 మ్యాచ్‌లలో 741 పరుగులు నమోదు చేశాడు. 8. ముష్ఫికర్ రహీం బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీం ఈ మెగా ఈవెంట్లో 26 మ్యాచ్‌లలో 739 పరుగులు సాధించాడు. తద్వారా ఇప్పటి వరకు టాప్-10లో ఉన్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక బంగ్లా బ్యాటర్‌గా నిలిచాడు. 9. ఎంఎస్ ధోని మిస్టర్ కూల్, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఆసియా కప్ టోర్నీలో మెరుగైన రికార్డు ఉంది. 24 మ్యాచ్‌లు ఆడి 69.00 సగటుతో ఈ జార్ఖండ్ డైనమైట్ 690 పరుగులు చేశాడు. 10. మహేళ జయవర్ధనే శ్రీలంక దిగ్గజ క్రికెటర్ మహేళ జయవర్ధనే 28 మ్యాచ్‌లు ఆడి 29.30 సగటుతో 671 పరుగులు సాధించాడు. ఇక ఈ మెగా టోర్నీ ఆరంభం నుంచి వన్డే ఫార్మాట్లో సాగిందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2016లో తొలిసారిగా టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. అప్పటి నుంచి ఒక దఫా వన్డే.. మరో దఫా పొట్టి ఫార్మాట్లో టోర్నీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈసారి ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో ఈవెంట్ సాగనుంది. కాబట్టి ఈసారి మెరుగ్గా రాణిస్తే రోహిత్ శర్మ, కోహ్లి.. సచిన్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్! భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి.. వీడియో వైరల్! Shubman Gill: గిల్ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్‌కు పయనం కానున్న భారత ఓపెనర్! -
ఇండియా మహరాజాస్‌తో మ్యాచ్.. సనత్ జయసూర్య అవుట్! షేన్ వాట్సన్ ఇన్
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 ఓ ప్రత్యేకమైన మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఓ చారటీ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఇప్పటికే ఇరు జట్లను ఆయా మేనేజ్మెంట్లు ప్రకటించాయి. ఇండియా మహరాజాస్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. అయితే తాజాగా వరల్డ్ జెయింట్స్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హర్షల్ గిబ్స్, శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య దూరమయ్యారు. వీరిద్దరి స్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి, ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ జట్టులో చేరారు. ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ తర్వాత సెప్టెంబరు 17 నుంచి అసలు పోటీ ఆరంభం కానుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్-2లో టైటిల్ కోసం నాలుగు జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్‌లు ఉంటాయి. ఇండియా మహరాజాస్ జట్టు: సౌరవ్ గంగూలీ(కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్,యూసఫ్ పఠాన్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా(వికెట్ కీపర్), అక్షశ్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగీందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి. వరల్డ్ జెయింట్స్ జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లెండిల్ సిమన్స్, డానియల్ వెటోరి, జాక్వస్ కలిస్, షేన్ వాట్సన్, మాట్ ప్రియర్(వికెట్ కీపర్), నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హోమిల్టన్ మసకజ్ద, మష్రాఫ్ మోర్తజా, అస్గర్ అఫ్గన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒ బ్రెయిన్, దినేశ్ రామ్‌దిన్(వికెట్ కీపర్). చదవండి: Hundred Tourney: సిక్సర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన ప్రొటిస్ బ్యాటర్ -
లంక ప్రభుత్వంలో దిగ్గజ క్రికెటర్ జయసూర్యకు కీలక బాధ్యతలు
Sanath Jayasuriya Appointment As Srilanka Tourism Envoy: రాజకీయ అనిశ్చితి, ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక, మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పలాయనం తర్వాత ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుకునే పనిలో పడింది. రణిల్ విక్రమసింఘే నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభమైన పర్యాటక రంగానికి పునరుత్తేజం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఆ దేశ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జయసూర్యను టూరిజం ప్రచారకర్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సనత్ టూరిజం ప్రచారకర్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కొలంబోలోని భారత రాయబారి గోపాల్ బాగ్లేని కలిసి, దేశంలో టూరిజం అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలంకలోని హిందూ ఆలయాలు, ఇతర హిందూ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని, వాటికి ప్రాచుర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రామాయణానికి సంబంధించి దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. శ్రీలంక జీడీపీలో టూరిజం వాటా దాదాపు 12 శాతం ఉంది. చదవండి: త్వరలోనే స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ -
మాకు సాయం చేసిన ఒకే ఒక్క దేశం భారత్: శ్రీలంక మంత్రి
కొలంబో: చరిత్రలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు భారత్ మాత్రమే సాయం అందించిందని చెప్పారు శ్రీలంక మంత్రి కాంచన విజెసేకర. భారత్ ఆహన్నహస్తం గురించి ప్రపంచానికి తెలియజెప్పారు. తీవ్ర ఇంధన కొరతతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న తాము.. సాయం చేయాలని అన్ని దేశాలను అడిగామని చెప్పారు. కానీ భారత్ మాత్రమే రుణ సాయం చేసి ఆదుకుందని శనివారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సాయం కావాలని రష్యాను కూడా అడుగుతున్నట్లు చెప్పారు శ్రీలంక మంత్రి. ఈ విషయంపై రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. తమకు కావాల్సిన సాయం గురించి రష్యాకు వివరించామని, ఆ దేశం ఎలాంటి సాయం అందిస్తుందోనని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. 3.8 బిలియన్ డాలర్ల సాయం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఆహార పదార్థాలు వంటి నిత్యావసర వస్తువుల కొరతతో దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. వీటిని దిగుమతి చేసుకునేందుకు విదేశీ నిల్వలు లేక దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇలాంటి సంక్షోభ సమయంలో భారత్ అండగా నిలిచింది. 3.8 బిలియన్ డాలర్లు విలువ చేసే సాయం అందించి గొప్ప మనసు చాటుకుంది. కరెన్సీ మార్పిడులు, శ్రీలంక చెల్లించాల్సిన రుణాలను వాయిదా వేయడం సహా 1.5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఇంధనం, ఔషధాలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులను పంపింది. భారత్ పెద్దన్న శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య భారత్ చేసిన సాయాన్ని కొనియాడాడు. తాము కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఇండియా పెద్దన్నలా సాయం చేస్తోందని చెప్పాడు. భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రుణపడి ఉంటామన్నాడు. ఈ కష్టాల నుంచి తాము త్వరలోనే బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: ‘కోవిడ్ కూడా ముంచింది’ -
లంక కల్లోలం: రాజపక్స పారిపోతాడని అనుకోలేదు
కొలంబో: తీవ్ర ప్రజాగ్రహం.. అత్యవసర పరిస్థితి కర్ఫ్యూల విధింపుతో శ్రీలంక రణరంగాన్ని తలపిస్తోంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల నేపథ్యంలో.. హెలికాప్టర్ల ద్వారా గస్తీ కాస్తోంది అక్కడి సైన్యం, పోలీసు విభాగాలు. టియర్ గ్యాస్ ప్రయోగంతో ఓ వ్యక్తి మృతి చెందాడన్న వార్తల నడుమ.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ. దీనంతటికి కారణం.. అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవడం. రాజీనామా డెడ్‌లైన్ రోజే ఆయన కనిపించకుండా పోయేసరికి ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. అయితే గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోతారని ఎవరూ ఊహించలేదని లంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య తెలిపారు. శ్రీలంక నిరసనల్లో మొదటి నుంచి పాల్గొంటున్నారు ఆయన. ‘‘ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. రాజీనామా చేసి.. ఇక్కడే ఉంటాడని అనుకున్నాం అంతా. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. ఈ ఉదయమే ఆయన మాల్దీవులకు పారిపోయినట్లు తెలిసింది’’ అని జయసూర్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా ప్రజావసర వస్తువులేవీ దొరకడం లేదు. అదనంగా గ్యాస్, కరెంట్, కనీస ఆరోగ్య అవసరాల కొరతను ఇక్కడి పౌరులు చవిచూస్తున్నారు. వీధుల్లోకి చేరి ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేస్తున్నారు.. అదీ ప్రశాంతంగానే అని పేర్కొన్నారు ఆయన. శ్రీలంకకు అనేక సందర్భాల్లో భారత్ ఎంతో సాయపడిందని, కానీ సాయం చేయాలంటూ భారత్ ను ఎన్నిసార్లు అడగ్గలం? అని వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సొంతంగా ఏదైనా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని జయసూర్య అభిప్రాయపడ్డారు. ఆ ఇద్దరే కారణం.. ఎంతో అందమైన దేశంగా, పర్యాటకుల పాలిట స్వర్గంలా ఒకప్పుడు గుర్తింపు పొందిన శ్రీలంక ఇప్పుడు కల్లోలభరిత దేశంగా నిరసనలతో హోరెత్తుతోంది. తాజాగా జులై 9 తర్వాత దేశంలో చెలరేగిన ఆందోళనలకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమసింఘేలు కారణమని ఆరోపించారు జయసూర్య. పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించి మాట తప్పారని, ఇప్పటికీ పదవులను అంటిపెట్టుకునే ఉన్నారని విమర్శించారు. శ్రీలంక ప్రజలకు వారిద్దరిపై పూర్తిగా నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వస్తున్నా వారు ఖాతరు చేయడంలేదని మండిపడ్డారు. దేశంలో చెలరేగుతున్న ఆందోళనలు నిలిచిపోవాలంటే ఏదైనా మార్గం ఉందంటే అది వారి రాజీనామాలే అని జయసూర్య స్పష్టం చేశారు. పనిలో పనిగా తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్ విక్రమసింఘేను మిస్టర్ బీన్ క్యారెక్టర్‌తో పోలుస్తూ.. ఓ వ్యంగ్యమైన ట్వీట్ చేశారు జయసూర్య. నిరసనలు ఇలాగే కొనసాగాలని ఎవరూ కోరుకోవడంలేదని, పరిస్థితులే ప్రజలను ఆ దిశగా పురిగొల్పుతున్నాయి. దీనికి ఎక్కడో ఓ చోట చరమగీతం పాడాలని, వీలైనంత త్వరగా ప్రశాంత జీవనంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నామని సనత్ జయసూర్య తెలిపారు. Imagine Mr Bean brought into the team despite selectors rejected him because he is an ACTOR & not a cricketer! However, not only does he play when umpire rules him out refuses to leave the crease ! No more games. Last man has no chance to bat alone in cricket. Leave GRACEFULLY https://t.co/4neKZKAbV4 — Sanath Jayasuriya (@Sanath07) July 13, 2022 -
లంకలో ఆందోళన.. నిరసనల్లో మాజీ క్రికెటర్ జయసూర్య
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ హింసాత్మక ఘటనలు చోటుచేసకుంటున్నాయి. తాజాగా లంకేయులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటిని ముట్టడించారు. దీంతో ఆయన ఇంటి నుంచి విదేశీ ఓడలో పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. వేల సంఖ్యలో నిరసనకారులు అధ్యక్ష భవనం వద్దకు వచ్చి.. లంక జాతీయ జెండాలతో నిరసనలు తెలిపారు. కాగా, ఈ నిరసనల్లో లంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య సైతం పాల్గొని నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. చేతిలో లంక జాతీయ జెండా పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జయసూర్య ట్విట్టర్ వేదికగా..‘ముట్టడి పరిసమాప్తమైంది. మీ కోట బురుజులు కుప్పకూలాయి. ఇకనైనా రాజీనామా చేసి గౌరవం నిలుపుకోండి’ అంటూ గొటబాయను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. NOW - Protesters storm the presidential palace in Sri Lanka's capital.pic.twitter.com/Wv6oQ10kBQ — Disclose.tv (@disclosetv) July 9, 2022 మరోవైపు.. నిరసనల్లో జయసూర్య కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులు చక్కబడే వరకు ఈ విప్లవం శాంతియుతంగా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. లంకలో త్వరలోనే విజయోత్సవాలు జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ఆందోళనల్లో భాగంగా జయసూర్యలో ఫొటోలు దిగేందుకు లంకేయులు పోటీపడ్డారు. The siege is over. Your bastion has fallen. Aragalaya and peoples power has won. Please have the dignity to resign now ! #GoHomeGota — Sanath Jayasuriya (@Sanath07) July 9, 2022 Ialways stand with the People of Sri Lanka. And will celebrate victory soon. This should be continue without any violation. #Gohomegota#අරගලයටජය pic.twitter.com/q7AtqLObyn — Sanath Jayasuriya (@Sanath07) July 9, 2022 ఇది కూడా చదవండి: లంక అధ్యక్షుడి ఇంట లంకేయుల రచ్చ.. షాకింగ్ వీడియో -
లంక ఆర్థిక సంక్షోభం.. తరలివస్తున్న మాజీ క్రికెటర్లు
శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక రూపాయి విలువ దారుణంగా పడిపోడవడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజుకు 12 గంటల పాటు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైన ఆ దేశ అధ్యక్షుడు గొటబోయ రాజపక్స గద్దె నుంచి దిగిపోవాలంటూ వారం రోజుల నుంచి ప్రజలు సెక్రటరియట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రజలు చేస్తున్న పోరాటానికి లంక మాజీ దిగ్గజ క్రికెటర్.. రాజకీయ నేత అర్జున రణతుంగ తన మద్దతు ఇచ్చారు. క్రికెట్ రిత్యా వేరే దేశాల్లో ఉన్న లంక క్రికెటర్లు కూడా ఆటను వదిలి వారం పాటు లంకకు వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా రణతుంగ వ్యాఖ్యలు పలువురు మాజీ క్రికెటర్లను కదిలించాయి. సహచర మాజీ క్రికెటర్.. సనత్ జయసూర్య ఇప్పటికే రణతుంగతో కలిసి గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. ''ఈరోజు బయట మా అభిమానులు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇంకా అధికారిక ప్రభుత్వానికి భజన చేస్తూ కూర్చోలేం.. ప్రజలకు మా అవసరం ఉంది.. అందుకే ప్రత్యక్ష పోరాటానికి దిగాం.. క్రీడాకారులైనా సరే.. దేశం కష్టాల్లో ఉందంటే చూస్తూ ఊరుకోరు.'' అంటూ రణతుంగ పేర్కొన్నాడు. కాగా జయసూర్య నినాదాలు చేస్తూనే రాజపక్స ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లు దూకే ప్రయత్నం చేయడం ఆసక్తి కలిగించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో జయసూర్య లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కాగా వీరిద్దరికి తాజాగా మరికొందరు మాజీ క్రికెటర్లు పరోక్షంగా తమ మద్దతు తెలిపారు. రాజకీయపరంగా నిరకుంశ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని.. గొటబయ రాజపక్స గద్దె దిగాలని మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే అభిప్రాయపడ్డాడు. మరో మాజీ క్రికెటర్ కుమార సంగక్కర కూడా ట్విటర్ వేదికగా తన నిరసనను వ్యక్తం చేశాడు. ఇక మాజీ టెస్టు క్రికెటర్.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామా శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గతంలో జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభంతో పోల్చాడు. అప్పుడు రాబర్ట్ ముగాబే.. ఇప్పుడు గొటబయ రాజపక్స ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ''కొన్ని సంవత్సరాల క్రితం నేను జింబాబ్వే వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు రాబర్ట్ ముగాబే ప్రభుత్వంపై త్రీవ నిరసన వ్యక్తం చేశారు. నా కారు డ్రైవర్ డీజిల్ తేవడానికి గంటల పాటు క్యూలైన్లో నిల్చోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి నా దేశంలో రావద్దని కోరుకున్నా. కానీ నా అంచనా తలకిందులైంది. ఒకప్పుడు జింబాబ్వే ఎదుర్కొన్న సంక్షోభాన్ని ఇప్పుడు లంక ప్రజలు అనుభవిస్తున్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Dhammika Prasad: నిరాహారదీక్షకు దిగిన శ్రీలంక మాజీ క్రికెటర్ Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్ ముఖ్యమా.. వదిలి రండి! -
ఐపీఎల్లో కేఎల్ రాహుల్ చెత్త రికార్డు.. తొమ్మిదేళ్ల తర్వాత!
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో తొలి బంతికి రెండు సార్లు ఔటైన మూడో ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి బంతికే రాహుల్ క్లీన్ బౌలడ్డయ్యాడు. అంతకుముందు టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో తొలి బంతికే రాహుల్ ఔటయ్యాడు. ఈ క్రమంలో ఈ చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. కాగా చెత్త రికార్డు సాధించిన జాబితాలో రాహుల్ కంటే ముందు సనత్ జయసూర్య, ఉన్మక్త్ చంద్ ఉన్నారు. 2009 సీ.జన్లలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సనత్ జయసూర్య తొలి బంతికే ఒకే సీజన్లో రెండు సార్లు ఔట్ కాగా.. 2013 సీజన్లో ఉన్మక్త్ చంద్ కూడా ఈదే విధంగా ఔటయ్యాడు. చదవండి: IPL 2022: ‘త్వరలోనే టీమిండియాకు ఆడతాడు’.. అసలు ఎవరీ కుల్దీప్ సేన్?! -
Dimuth Karunaratne: శ్రీలంక కెప్టెన్ అరుదైన ఘనత.. రెండో ఓపెనర్‌గా
SL Vs WI- Dimuth Karunaratne jumps to second spot for most runs by Sri Lankan openers in Tests: వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా శ్రీలంక టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే అరుదైన రికార్డు సాధించాడు. లంక తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా నిలిచాడు. 137 ఇన్నింగ్స్‌లో 5374 పరుగులు సాధించి సనత్ జయసూర్య(5932) తర్వాతి స్థానం దక్కించుకున్నాడు. మరో 558 పరుగులు చేస్తే జయసూర్య రికార్డును కరుణరత్నే అధిగమిస్తాడు. ఇక ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో మర్వన్ ఆటపట్టు (5317), దిల్షాన్(2170), ఆర్ఎస్ మహానామా(2069) ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ క్యాలెండర్(2021) ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సాధించిన ఆటగాళ్ల జాబితాలో కరుణ రత్నే(854) మూడో స్థానంలో ఉన్నాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అత్యధిక స్కోరు 244. ఇక ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(1455), టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(906) టాప్-2లో కొనసాగుతున్నారు. కాగా గాలే స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో కరుణ రత్నే సారథ్యంలోని శ్రీలంక జట్టు వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 187 పరుగుల తేడాతో విండీస్‌పై గెలుపొందింది. కెప్టెన్ కరుణ రత్నే తొలి ఇన్నింగ్స్‌లో 147, రెండో ఇన్నింగ్స్‌లో 83 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Babar Azam- Ban Vs Pak: నేను ప్రతిసారీ పరుగులు సాధించాలని ఎక్కడా రాసిలేదు.. కచ్చితంగా రాణిస్తా -
ఆస్ట్రేలియాలో జయసూర్య కోచింగ్ పాఠాలు!
కొలంబో: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తనపై విధించిన రెండేళ్ల నిషేధాన్ని పూర్తి చేసుకున్న శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య కోచ్‌గా కనిపించనున్నాడు. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చెందిన మల్గ్రేవ్ క్రికెట్ క్లబ్ కోచ్‌గా పనిచేయనున్నాడు. 1996 వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన జట్టులో జయసూర్య సభ్యుడిగా ఉన్నాడుl. ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించాడంటూ 2019 ఫిబ్రవరిలో నిషేధం విధించారు. ఐసీసీ జరిపిన విచారణను అడ్డుకునే ప్రయత్నం చేయడమే అతనిపై నిషేధానికి కారణం. అతని ఫోన్‌ను తమకు అందించాలని కూడా ఏసీయూ కోరగా జయసూర్య దానిపై స్పందించలేదు. 2017 సెప్టెంబర్ వరకు లంక చీఫ్ సెలక్టర్‌గా ఉన్న సమయంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో జయసూర్యకు ఉన్న సంబంధాలపై అతనిపై విచారణ చేయగా అందుకు జయసూర్య సహకరించలేదు. దాంతో అతనిపై నిషేధం విధించక తప్పలేదు. 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు 1996 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రిటైర్మెంట్ తర్వాత 2010లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో జయసూర్య(13430) నాల్గో స్థానంలో ఉన్నాడు. 323 వన్డే వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఇక్కడ చదవండి: ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు -
'ఆ ముగ్గురు క్రికెట్ గతిని మార్చారు'
-
'ఆ ముగ్గురు క్రికెట్ గతిని మార్చారు'
క్రికెట్ ప్రపంచంలో ప్రతీ శకంలో ఒక క్రికెటర్ తన ఆటతీరుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించడం సహజమే. కానీ తన దృష్టిలో మాత్రం ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరి శకంలో వారు తమ స్టైలీష్ ఆటతీరుతో క్రికెట్ గతినే మార్చేశారంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ యూ ట్యూబ్ ఇంటర్యూలో పేర్కొన్నాడు. మరి ఇంజమామ్ చెప్పిన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసా.. సర్ వివి రిచర్డ్స్, సనత్ జయసూర్య, ఎబి డివిలియర్స్.ఇంజమామ్ మాట్లాడుతూ.. 'మొదటి శకంలో వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్‌మెన్ సర్ వివి రిచర్డ్స్ తన ఆటతీరుతో క్రికెట్ అనే పదానికి కొత్త అర్థాన్నిచ్చాడు. అది ఎలా అంటే అరవీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ ఫుట్‌వర్క్ ఆధారం చేసుకొని రిచర్డ్స్ ఆడే షాట్లు ముచ్చట గొలిపేవి. ఫాస్ట్ బౌలర్లు తమ వైవిధ్యమైన బంతులతో భయానికి గురి చేసినా ఫుట్‌వర్క్ టెక్నిక్‌తో షాట్లు ఎలా ఆడాలో నేర్పించాడు. ఇప్పటికి ఆయన ఆడిన షాట్లు ఒక చరిత్రే' అని పేర్కొన్నాడు. (కోహ్లికి ఖాతాలోకి మరో రికార్డు!) ఇక రెండో తరంలో శ్రీలంక స్టార్ ఓపెనర్ సనత్ జయసూర్య మరోసారి క్రికెట్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చాడని ఇంజమామ్ పేర్కొన్నాడు. ' ఓపెనర్ అనే పదానికి సరైన నిర్వచనం సనత్ జయసూర్య అని కొనియాడారు. క్రికెట్ ఫార్మాట్లో ఐసీసీ కొత్త నిబంధనలు తీసుకువచ్చాక మొదటి 15 ఓవర్లలో సనత్ జయసూర్య అటాకింగ్ గేమ్ ఎలా అనేది స్పష్టంగా చూపించాడు . ఓపెనర్‌గా ప్రమోషన్ లభించిన తర్వాత జయసూర్య తన బ్యాటింగ్‌తో మొదటి 15 ఓవర్లు బౌలర్లలపై విరుచుకుపడిన విధానం, బంతిని బాదితే బౌండరీలే అన్న చందంగా జయసూర్య బ్యాటింగ్ తీరు అప్పటి ప్రేక్షకులు అంత తేలిగ్గా మరిచిపోరు. 1996 ప్రపంచకప్ శ్రీలంక గెలవడంలో జయసూర్య ప్రధాన పాత్ర పోషించాడని' తెలిపాడు. ఇక మూడో తరం ఆటగాడిగా దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఎబి డివిలియర్స్ పేరును ఇంజమామ్ పేర్కొన్నాడు. 'పరిమిత ఓవర్లు, టీ20లు వచ్చిన తర్వాత డివిలియర్స్ తన విధ్వంసకర ఆటతీరుతో చెలరేగిపోయేవాడు. ముఖ్యంగా 360 డిగ్రీల కోణంలో డివిలియర్స్ ఆడే షాట్లు అతని విధ్వంసానికి ప్రతీకగా నిలిచింది. రివర్స స్వీప్,పాడల్ స్వీప్ వంటి కొత్త కొత్త షాట్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రపంచకప్ సాధించలేదనే ఒక్క బాధ తప్ప డివిలియర్స్ తన కెరీర్‌ను ఆద్యంతం విధ్వంసకరంగానే కొనసాగించాడని' వెల్లడించాడు. అందుకే తన దృష్టిలో క్రికెట్ గతిని మార్చిన ఆటగాళ్లుగా రిచర్డ్స్, జయసూర్య, డివిలియర్స్ ఎప్పటికి తన మదిలో నిలిచిపోతారని తెలిపాడు. అంతేగాక వీరు ముగ్గురిలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉందని, విఫలమైన ప్రతీసారీ తిరిగి తమ సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చూపించారని ఇంజమామ్ కొనియాడాడు.(వారి భుజాలపై సచిన్.. బెస్ట్ మూమెంట్ అదే) ఇక విండీస్‌కు ప్రాతినిధ్యం వహించిన వివి రిచర్డ్స్ 90.20 స్ట్రైక్ రేట్‌తో 121 టెస్టుల్లో 8540, 187 వన్డేల్లో 6721 పరుగులను సాధించాడు. అలాగే శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన సనత్ జయసూర్య తన అంతర్జాతీయ కెరీర్లో 445 వన్డేల్లో 13430, 110 టెస్టుల్లో 6973 పరుగులు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన ఎబి డివిలియర్స్ 114 టెస్టుల్లో 8765, 228 వన్డేల్లో 9577, 78 టీ20ల్లో 1673 పరుగులు చేశాడు.